Posts

Showing posts with the label Deepavali Significance

దీపావళి ఐదు రోజుల పండుగ అంటారు? వాటి విశేషాలు ఏమిటి? Deepavali Significance

Image
అందరికీ దీపావళి శుభాకాంక్షలు 🙏 దీపావళి ఐదు రోజుల పండుగ అంటారు? వాటి విశేషాలు ఏమిటి? ధన్వంతరీ త్రయోదశి.. వాడుకలో ధన త్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతున్నాం ! కానీ ఆరోజు ‘ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన ‘ధన్వంతరీభగవాన్’ జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండముతో అవతరించాడు. నరక చతుర్దశి.. నరక యాతనల నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు ప్రాక్జ్యోతీషపురం (నేటి అస్సాము)ను పాలించిన ‘నరకుడు’ నర రూప రాక్షసుడు. దేవీ ఉపాసకుడే కానీ దేవిని వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేక అధ్భుత శక్తులను సంపాదించి, దేవతలను కూడా ఓడించాడు. వాడు ప్రతీ అమావాస్య - పౌర్ణమికి నవ యవ్వన రాచ కన్యలను దేవికి బలి ఇచ్చే వాడు. కాముకత్వంతో అనుభవించేవాడు. నరకుని చెరసాలలో వేలాది అందమైన మహిళలు (రాచకన్యలు) బందీలుగా వుండేవారు. ఆది వరాహమూర్తికి – భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు. తామస ప్రవృత్తితో జనించాడు. శ్రీకృష్ణ భగవానుడు – సత్యభామ (భూదే