Posts

Showing posts with the label శఠగోపం

షడగోప్యము (శఠగోపనం) - Shada-Gopyam

Image
  షడగోప్యము (శఠగోపనం) అసలు దేవాలయంలో ఈ షడగోప్యమును తల మీద ఎందుకు పెట్టించుకోవాలి? దాని వలన కలిగే ఫలితం ఏంటి? దేవాలయంలో దర్శనం అయ్యాక తప్పక షడగోప్యము పెట్టించుకుని, తీర్థము తీసుకోవాలి. ఈ రొజుల్లో చాలామంది ఆలయాలకు వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక, వచ్చిన పనైపొయిందని గబగబా వెళ్ళి ఏదో ఒక ప్రదేశం చూసుకుని కూర్చుంటారు. బహుకొద్ధి మంది మాత్రమే ఆగి షడగోప్యం పెట్టించుకుంటారు. అసలు షడగోప్యము అంటే అత్యంత గోప్యము, గోప్యము అంటే, రహస్యము అని అర్థం.. అంటే, దానిని తల మీద పెట్టే పూజారికీ, లేదా అర్చకుడికి కూడా వినిపించని విధంగా కోరికను మనస్సులోనే తలచుకోవాలి. అంటే, మీ కోరికే షడగోప్యము. మానవునికి శత్రువులైన కామమూ,  క్రోధమూ,  లోభమూ, మోహమూ, మద - మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటానని అనుకుంటూ, తలవంచి తీసుకొవటము మరో అర్ధము. పూజారి చేత షడగోప్యము పెట్టించుకోండి. చక్కగా మీ మనస్సులోని కోరికను స్మరించుకోండి. షడగోప్యమును రాగి, కంచు, లేదా వెండితో తయారు చేస్తారు. షడగోప్యము పైన దేవతా పాదములు ఉంటాయి. షడగోప్యమును తల మీద ఉంచినపుడు, మన శరీరంలో ఉన్న విద్యుత్తు, దాని యొక్క సహజత్వం ప్రకారం, శరీరానికి లోహం తగిలినప్ప