Posts

Showing posts with the label The Final Chapter of Kaliyuga

KALKI AVATAR: The Final Chapter of Kaliyuga | Hindu Prophecy Revealed | కల్కి జన్మరహస్యం

Image
  ‘కల్కి జన్మరహస్యం’ ప్రతి కలియుగంలోనూ ‘కల్కి భగవానుడు’ అవతరిస్తాడా? సంస్కృతంలో ‘కల్కి’ అంటే దోషాలను హరించేదని అర్థం. దోషాల నుంచి విముక్తి కలిగించే అవతారం కాబట్టే ఆయనకు కల్కి అని నామకరణం జరిగిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. కల్కి అవతారాన్ని పూజించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుందని శాస్త్ర విదితం..  ధర్మపరులనూ, భగవద్బంధువులనూ హింసిస్తూ, ఈ భూమిపై అధర్మం పెచ్చుమీరిన వేళ తాను స్వయంగా అవతరించి అధర్మాన్ని నాశనంగావించి, ధర్మ సంస్థాపన చేస్తానని భగవత్ గీతలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేశాడు. ఈ క్రమంలో మన పురాణాలలో ప్రస్థావించబడిన దశావతారాల గురించీ, వాటిలో మొదటి మూడు యుగాలలో ఆ నారాయణుడు పూనుకున్న తొమ్మిది అవతారాల గురించీ మనం గతంలో చేసిన ‘దశావతారాల’ వీడియోలో చెప్పుకున్నాము. ఇక ప్రస్తుతం నడుస్తున్న కలియుగంలో పాపం పెచ్చుమీరి పోయినప్పుడు, చెడును నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం ఆయన పదవ అవతారమైన కల్కి భగవానుడిగా అవతరించి, కలి ప్రభావం చేత భారంగా తయారైన భూమిని ఉద్ధరిస్తాడన్న విషయం కూడా తెలిసిందే. అలా ఆయన కలియుగాన్ని ముగించి, భూమిపై సత్యయుగాన్ని తిరిగి స్థాపిస్తాడని వివ...