హరినే పరుగెత్తించిన కరి! - అసలు కారణం ఏంటి? Gajendra Moksham
హరినే పరుగెత్తించిన కరి! - అసలు కారణం ఏంటి? గజేంద్ర మోక్షం – మకరికి ఉన్న శాపం ఏంటి? భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తయితే, గజేంద్ర మోక్షం ఒక ఎత్తు. ఎవరయితే ఈ గజేంద్ర మోక్షం కథను శ్రద్ధగా వింటారో, వారి పాపాలు హరించబడతాయి. దరిద్రం తొలగిపోయి, ఐశ్వర్యం కలసి వస్తుంది. గ్రహ దోషాల వలన కలిగే పీడలు తొలగిపోతాయి. మరి అంతటి అద్భుతమైన గజేంద్ర మోక్షం కథను గురించీ, శ్రీహరి ద్వారా మోక్షాన్ని పొందిన గజేంద్రుడి గత జన్మ రహస్యం, గంధర్వుడు మకరిగా మారి, శ్రీహరి చేతిలో ఎందుకు మరణించాల్సి వచ్చింది? అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. అందరూ ఈ వీడియోను చివరి వరకూ చూసి లబ్ది పొందాలని కోరుకుంటున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Zs59vTFTOdg ] క్షీరసాగరం మధ్యలో, త్రికూటం అనే పర్వతం ఉంది. ఆ పర్వతానికి మూడు శిఖరాలున్నాయి. ఒక శిఖరం బంగారంతో, ఇంకో శిఖరం వెండితో, మరొకటి ఇనుముతో అలరారుతూండేవి. ఆ పర్వతం మీద ఉన్న అడవులలో, అడవి దున్నలూ, ఖడ్గమృగాలూ, ఎలుగు బంట్లూ మెదలైన క్రూర మృగాలతో పాటు, ఏనుగులు కూడా ఉండేవి. ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే, ఆ ప్రదేశంలో అంధ