37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి? Siva Ratri Puja
37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి? సకల లోక రక్షకుడూ శిక్షకుడూ ఆ పరమేశ్వరుడొక్కడే అని, వేదాలు సుస్పష్టంగా చెబుతాయి. కంటికి కనపడని సూక్ష్మ జీవుల నుంచి, సృష్టిని నడిపించే శక్తుల వరకూ, అన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయి. అందుకే యుగ యుగాలుగా ఆ స్వామిని ప్రసన్నం చేసుకోడానికీ, ఆయన కరుణకు పాత్రులవ్వడానికీ, సమస్త ప్రాణి కోటీ ఎంతగానో పరితపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన శివ రాత్రి పర్వదినం నాడు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్త కోటి మొత్తం ఆయనను విశేషంగా పూజిస్తారు. అందులోనూ, ఈ సారి శివరాత్రి పర్వదినంతో పాటు, శనిత్రయోదశి కూడా వచ్చింది. అందుకే ఈ 2023 మహాశివరాత్రి చాలా విశేషమయినది, అరుదైనది. ఇటువంటి కలయిక, ఇంతకు మునుపు 26-2-1881, 23-2-1952, 8-3-1986 తేదీలలో, ఇప్పుడు 18-2-2023 న, తరువాత ఈ శతాబ్దిలో మళ్ళీ 34 ఏళ్లకు, అంటే 3-3-2057 న, ఆ తరువాత 37 ఏళ్ళకు అంటే, 13-2-2094 న ఏర్పడుతుంది. ఇదొక అద్భుత యోగం, మరియు అత్యంత పుణ్యకాలం. ఇది మన తరానికి రావటం మన అదృష్టం. దినదిన గండంగా జీవనం సాగిస్తున్న ఈ కాలంలో, మరో 34 ఏళ్ల నిరీక్షణ అందరికీ సాధ్యపడకపోవచ్చు. కావున, ఈ అవకాశాన్ని అందరూ సద్విన