Posts

Showing posts with the label మార్గశిర మాసం

మార్గశిర మాసం - Significance of Margasira Masam

Image
రేపటి నుండి మార్గశిర మాసం ప్రారంభం - మార్గశిర మాస విశిష్టత! ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుందని అందరికీ తెలిసిన విషయమే. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో 'మాసానాం మార్గశీర్షోహం' అని చెప్పారంటే, హిందువులకు ఈ మాసం ఎంత పవిత్రమైనదో తెలుస్తుంది. మోక్ష గ్రంధమైన భగవద్గీత అవతరించినది కూడా, ఈ మాసంలోనే అని చెబుతారు. హిందువులు నెల రోజుల పాటు తిరుప్పావై చదువుతూ, పరమ భక్తితో చేసుకునే ధనుర్మాస వ్రతం కూడా, ఈ మాసంలోనే మొదలవుతుంది. ఈ మాసంలో విష్ణు ప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా, మంచి ఫలితాన్ని ఇస్తుంది. [ శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మార్గశిరమాస విశిష్టత: https://youtu.be/0IsB-um3hno ] శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం ఇదని అందరూ చెబుతుంటారు.. పెద్ధలు ఈ మాసాన్ని మోక్ష మాసంగా, లేదా మోక్ష సాధనా మాసంగా కూడా చెబుతారు. భక్తితో ఉపవాసం, జాగరణ ఉండి చేసే మోక్షద ఏకాదశి కూడా, ఈ మాసంలోనే వస్తుంది. నిజానికి ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయం గురించి తెలుసుకుందాం.. మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి, ఉత్తరాయణం మొదలవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం.