Posts

Showing posts with the label వినాయక చవితి

వినాయక చవితి రోజున గణేశుడిని 21 రకాల పత్రులతో ఎందుకు పూజిస్తారు? Vinayaka Chaviti

Image
మిత్రులందరికీ వినాయకచతుర్థి శుభాకాంక్షలు 🙏   వినాయక చవితి రోజున గణేశుడిని 21 రకాల పత్రులతో ఎందుకు పూజిస్తారు? వినాయక చవితి పూజలో కూడా ఎన్నో వైద్య రహస్యాలున్నాయి. నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొలిపి, అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభాలేమిటో చెప్పడానికై ఏర్పడిందని చెప్పవచ్చు. మరి మతం అంటే మానవత్వాన్ని పెంచేదే కదా! మత విశ్వాసాల పేరున కొన్ని మంచి పనులు చేయవచ్చని చెప్పడమే వినాయక చవితి పూజా విధి విధానం. వినాయకుడి ప్రతిమను రూపొందించడానికి కేవలం 'కొత్త' మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రులతో పూజ చేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇదీ పద్ధతి. 21 రకాల పత్రులనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ మహోత్కృష్టమైన , శక్తివంతమైన ఔషధులు. వాటితో పూజ చేయడం, కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలీ, మనలో ఉండే అనారోగ్యాలను హరించి వేస్తాయి. 9 రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలన్న సందేహానికి శాస్త్రీయ వివరణ.. చెరువులు, బావులు, నదులు, వీటిలో వర్షాల వల్ల నీరు కలుషితం కావడం సర్వ సాధారణం. ఆ పూడిక తీసి, వీటిని శుభ్రం చేయడానికి, 21 పత్రులతో చేసే పూజయే సమాధానం. అందుక