నేను దేవాలయానికి ఇక రాను!!!
నేను దేవాలయానికి ఇక రాను!!! 11 సంవత్సరాల ఒక పాప తన తండ్రితో కలిసి దేవాలయానికి వెళ్లింది. భగవంతుడికి నమస్కరించి వచ్చి ఓ ప్రక్కన కూర్చున్న సమయంలో, తన తండ్రితో ఆమె ఇలా అన్నది. "నాకు ఇకపై ఆలయానికి రావాలని లేదు నాన్నా".. అని. తండ్రి ఎందుకని ఆడగగా ఆమె ఇలా అన్నది.. "భగవంతుడికి సేవ చేయడం మరియు భజనలో సమయం గడపటం కోసం మనం ఇక్కడకు వస్తున్నాము. కానీ, ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే కనిపిస్తున్నారు. దేవాలయానికి వచ్చిన తరువాత కూడా వారు తమ మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి మనసు, దృష్టి మొత్తం సెల్ ఫోన్ మీదనే నిమగ్నమై ఉంటోంది. చెడు మాటలు వినిపిస్తున్నాయి. వీరు కేవలం కపటులు మాత్రమే. వీరందరినీ చూసి చూసి నేను కూడా అలానే అవుతానేమో అనే భయం కలుగుతున్నది. అందుకే నేను ఇకపై ఆలయానికి రాదలచుకోవడం లేదు" అని చెప్పింది కుమార్తె. [ ప్రార్థించే మనస్సెలా ఉండాలి?: https://youtu.be/HYR6GJyUWUc ] తండ్రి నిశ్శబ్దంగా విన్న తరువాత.. "సరే.. నాకోసం ఒక పని చేసి పెట్టు తల్లీ" అని అన్నాడు తండ్రి. ఆమె అలాగే అన్నది.. "ఒక గాజు గ్లాసు నిండా నీరు తీసుకుని ఆలయం చుట్టూ 2 సార్లు తిరిగి రా. ముఖ్యంగా వీ