హిందూత్వం - 2 | Hinduism - History
హిందూత్వం - 2 (Hinduism - History) ఆంగ్లేయులూ, వామపక్షీయులూ కలిసి, మన దేశపు చరిత్రను కలగాపులగం చేసి, ఏలా విప్పాలో తెలియని విధంగా పీట ముడులు వేసి మనపై వదిలారు. ప్రాచీన కాలంలో మన భారతీయ మేధావులు తమ గ్రంథాలలో, కాల నిర్ణయానికి శాలివాహన శకాన్ని ఒక ప్రమాణంగా తీసుకున్నారు. ఈ శకం సా. శ. 79 మార్చి 22 న, చైత్ర మాసారంభమున ప్రారంభించారు. ఈ చైత్ర మాసపు తొలి దినమే, దైవ అహోరాత్ర యుగమునకు ఆది కనుక, యుగాది అనే పేరును ఆపాదించి, దానికి చాలా విశిష్టతను చేకూర్చారు. కానీ ఈ కాలంలో యువత, జనవరి 1 న చూపే ఉత్సాహంలో సగం కూడా ఉగాది నాడు కనిపించదు. ఇప్పుడు ఎటు చూసినా పరాధీనంలో ఉన్న దౌర్భాగ్యమే కనిపిస్తుంది. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/PUzEWDiAhOw ] గౌతమి పుత్ర శాతకర్ణితో ప్రారంభించబడిన నాటినుండి, 1879 సంవత్సరములు గడిచిన తరువాత, 1957 మార్చి 22 నుండి భారత ప్రభుత్వం, ఈ శాలివాహన శకాన్ని అధికారికంగా కాలమానంగా స్వీకరించింది. అంటే, ఇప్పుడున్న గ్రిగేరియన్ క్యాలెండర్ లోని సంవత్సరము నుండి, 79 తీసివేస్తే, శక సంవత్సరం వస్తుంది. ఒక గ్రిగేరియన్ తేదీ