Salutations to Vishnu

అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే | సదైకరూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || తాత్పర్యం: ఏ విధములైనటువంటి ఆకార వికారములు లేని వాడు, పరిశుద్ధుడు, యెల్లప్పుడు ఎల్లవేళల యందు వుండెడివాడు, పరమాత్ముడు, అన్నిరూపములందు ఒకే రూపము ధరించినవాడు, అందరిని జయించినవాడు అయిన విష్ణువుకు ఇవే మా వందనములు. వివరణ: గురువు తరువాత మనం ధ్యానించేది దేవుడిని. ఈ శ్లొకం మన ధ్యాన స్థితిని తెలియచేస్తుంది. మొట్టమొదటి శ్లొకంలొ మనం దేవుడిని తెల్లని వస్త్రాలు ధరించినవాడుగా, నాలుగు చేతులవాడుగా ధ్యానించాము. ఇప్పుడు మనం అదే దేవుడిని రూపము లేని వాడు, శుద్ధుడు లాంటి కొంచం కష్టమైన విశేషణలతో పోలుస్తున్నాము. అంటె మనం ధ్యానం రెండో మెట్టులో వున్నామన్నమాట. "సదైక రూప రూపాయ..." అన్నది సనాతన ధర్మం మనకందించే అతి ముఖ్యమైన సందేశాలలో ఒకటి. ప్రాణులు అనేకం కానీ అందులో నివసించే జీవిడు మాత్రం ఒకడే. అతడే పరమాత్ముడు. ఆందుకే సనాతన ధర్మం ప్రకారం మనం ఈ భూమిపై నివసించే ప్రతి ఒక్క జీవిని గౌరవించాలి. సహస్ర నామాల్లోని ప్రత్యేకత ఏమిటంటే పఠించే వారిని మెట్లవారిగా చక్కగా సరైన ధ్యాన స్థితికి తెచ్చి మనసా వాచా కర్మణా చక్కగా అనుసంధానం చేస్తుంది. ఈ విషయ...