Posts

Showing posts with the label సహవాస దోషం

Effects of bad company | సహవాస దోషం! | MPlanetLeaf

Image
అంతటి మహాభక్తుడిని భోళాశంకరుడు ఎందుకు శపించాడు? గాయత్రీ మంత్ర సహిత “ఔశన స్మృతి” ని ప్రపంచానికి అందించిన వాడు చెడ్డవాడా? తెలివితేటలలో దేవగురువు బృహస్పతి ఎంతటివాడో, శుక్రాచార్యుడు కూడా అంతటి వాడు. దేవతలు బృహస్పతిని గురువుగా ఉండమని అడిగినప్పుడు బృహస్పతి, “నా కన్నా శుక్రాచార్యుడు సమర్ధుడు. ఆయనను అడగండి” అని చెప్పాడు. కానీ, దేవతలు బృహస్పతిని గురువుగా ఎంచుకున్నారు. బృహస్పతి మీదా, దేవతల మీదా కోపంతో శుక్రాచార్యుడు, రాక్షసులకు గురువుగా మారాడు. ఆ నాటి నుంచీ దేవ దానవుల సంగ్రామాలలో, దానవులకు అన్ని విధాలుగా సహకరించి, వారి విజయాలకు తోడ్పడే వాడు శుక్రాచార్యుడు. శుక్రాచార్యునికి తెలియని విద్య లేదు, రాని యుద్ధ తంత్రం లేదు. మహర్షి కుమారుడైన ఉశనసుడు, శుక్రాచార్యుడిగా ఎలా మారాడు? శివుడు ద్వారా ఎన్నో వరాలు పొందిన శుక్రాచార్యుడు, ఆయన చేతనే శాపానికి ఎందుకు గురయ్యాడు? శుక్రాచార్యుడి తల్లిని విష్ణువు మారు వేషంలో ఎందుకు చంపాల్సి వచ్చింది - అనేటటువంటి ఉత్సుకతను రేకెత్తించే విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/bIZXoSWJ_p8 ] శుక్రాచార్యుని తండ్రి, బ్రహ్మ