Posts

Showing posts with the label ధర్మ ద్వేషులు

‘ధర్మ ద్వేషులు’ ఎటువంటి వారైనా అంతమొందక తప్పదు! Mahabharatam

Image
‘ధర్మ ద్వేషులు’ ఎటువంటి వారైనా అంతమొందక తప్పదు! భీముడి కొడుకు మరణించినప్పుడు శ్రీ కృష్ణుడు ఎందుకు ఆనందించాడు? మహాభారతంలో ఎందరో వీరులూ, యోధానుయోధులూ ఉన్నారు. వారితోపాటు ఈ ఇతిహాసంలో ఎందరో వీర వనితల ప్రస్తావన కూడా మనకు కనిపిస్తుంది. శ్రీ కృష్ణుడి సుదర్శన చక్రాన్ని ఓడించిన ఆ స్త్రీ ఎవరు? శ్రీ కృష్ణుడితో ఆమె యుద్ధం చేయడానికి గల కారణం ఏంటి? భీముడి కొడుకు మరణించినప్పుడు, కృష్ణ భాగవానుడు ఎందుకు నృత్యం చేస్తూ ఆనందించాడు?  శ్రీ కృష్ణుడు ఆ రాక్షస స్త్రీని ఎలా శాంతింపజేశాడు? అనేటటువంటి ఉత్సుకతను రేకెత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Q48XqOWYIr4?si=TFzLUaVcqP-EK4qZ ] లక్క గృహం దహనమైన తరువాత, దాని నుండి బయటపడిన పాండవులందరూ అరణ్యంలో అలసిపోగా, భీముడు ఒక పెద్ద వృక్షం నీడలో అందరినీ విశ్రాంతి తీసుకోమన్నాడు. తాను వెళ్లి నీరు తీసుకుని వచ్చాడు. అందరూ అలిసిపోవటం చేత, ఓ చెట్టుకింద విశ్రమించారు. చీకటి పడింది. భీముడు వారికి కాపలాగా కూర్చున్నాడు. అయితే, పాండవులు విశ్రమించిన ప్రదేశానికి దగ్గరగా, హిడింబుడనే రాక్షసుడున్నాడు. నర వాసన వాడి ముక్కు ప