Posts

Showing posts with the label CURSE OF THE GODDESS

CURSE OF THE GODDESS: A Curse that ruined countless lives

Image
సీతమ్మ కిరీటంలోని నీలమణిని తాకినా వినాశనమేనా? ఇన్ని మరణాలకు కారణం, శాపగ్రస్థమైన ఆ వజ్రమేనా? ‘వరం’ కూటికి గతిలేనివాడిని కూడా, అపరకుబేరుడిని చేస్తుంది. కానీ శాపం, జీవితాలను నాశనం చేస్తుంది, కుటుంబాలను కబళించి వేస్తుంది, ఆఖరికి వంశాలకు వంశాలనే తుడిచివేస్తుంది, వెరసి లెక్కలేనంతమందిని యమపురికి పంపిచేస్తుంది. అందుకే, వరం వల్ల వచ్చే సంతోషం కంటే, శాపం వల్ల కలిగే నష్టం భరించలేదనీ, అందుకే మానవులకు శాపం అంటే చచ్చేంత భయమనీ పెద్దలు చెబుతుంటారు. అయితే, వీటి వెనుక నిజమెంతుందో తెలియదు కానీ, నేటికీ ప్రపంచంలో శాపగ్రస్తమైన వస్తువులు ఉన్నాయని నమ్ముతున్నారు. కేవలం నమ్మడమే కాదు.. వాటి వెనుక జరిగిన చరిత్ర వింటే, నిజంగా అవి శాపగ్రస్త వస్తువులని నమ్మక తప్పదు. అటువంటి వాటిలో, స్వయంగా ఆ శ్రీరాముని భార్య ‘సీతా మాత’ శపించిన ఓ వజ్రం కూడా ఉంది. సీతామాత, ఓ వజ్రాన్ని శపించడమా? నిలువెత్తు శాంత మూర్తిగా పేరుపొందిన సీతాదేవి, అసలు శపించడమేంటి? ఈ కథ రామాయణంలో ఉందా? లేక ఆ తర్వాత ఎప్పుడైనా జరిగిందా? ఇంతకీ ఆ వజ్రం ఇప్పుడు ఎక్కడ ఉంది? దాని వల్ల ఎలాంటి ఘోరాలు సంభవించాయి - వంటి అనేక ప్రశ్నలు, మన మదిలో మెదులుతాయి. వాటన్నిటికీ సరై...