Posts

Showing posts with the label 3 Doors of Hell

3 Doors of Hell - 3 నరక ద్వారములు - Bhagavad Gita భగవద్గీత

Image
  3 నరక ద్వారములు! చీకటి దిశగా ఉన్న ఆ మూడు ద్వారములు ఏవి? శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 'భగవద్గీత' షోడశోధ్యాయం - దైవాసుర సంపద్విభాగ యోగం (21 – 24 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 21 నుండి 24 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/XWs5w3_uIrU ] ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారముల గురించి, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు.. 00:49 - త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః । కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ ।। 21 ।। ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారములు, మూడు ఉన్నాయి - కామము, క్రోధము, మరియు లోభము. కాబట్టి, అందరూ వీటిని విడిచిపెట్టాలి. శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, ఈ ఆసురీ స్వభావము యొక్క మూలకారణములను వివరిస్తున్నాడు. కామము అంటే కోరిక, క్రోధము అంటే కోపము, మరియు లోభము  అంటే దురాశ. ఈ మూడూ దీనికి కారణములని, సూటిగా చెబుతున్నాడ