999 ఏళ్ళ యుద్ధం! Sahasrakavacha
999 ఏళ్ళు యుద్ధం చేసిన రాక్షసుడికీ దాన వీర శూర కర్ణుడికీ సంబంధం ఏంటి? ఈ లోకంలో బ్రహ్మ చేస్తున్న సృష్టికి సహకరించేందుకు, కొందరు ప్రజాపతులు తోడ్పడ్డారు. వారిలో ఒకరు, ధర్మ ప్రజాపతి. ఆ ధర్మ ప్రజాపతికి నరుడు, నారాయణుడనే కవల పిల్లలు జన్మించారు. నరుడు, నారాయణుడు, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారమేనని, మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీ హరి అవతారాలుగా, పురాణ ప్రాశస్త్యాన్ని పొందిన నరనారాయణులు ఎవరు? వారి ఆవిర్భావం ఎలా జరిగింది? వారి తపో శక్తి ముందు, శివుడు కూడా ఓడిపోయాడా? తపోధనులైన నరనారాయణులు, ఊర్వశిని ఎందుకు సృష్టించారు? మహాభారత సంగ్రామంలో కర్ణుడి మరణానికీ, నరనారాయణులకూ సంబంధం ఏమిటి - అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/tlNzC7ZYgwE ] మన ఇతిహాసాలలో, తపోధనులుగా, దైవాంశ సంభూతులుగా పేరుగడించిన నరనారాయణులు, సనాతన మహర్షులు. శాంత సంయమనాలకు నెలవులు. నిజమైన, నిర్మలమైన ఆచారశీలతకూ, ఆధ్యాత్మిక నీతికీ, ధార్మిక రీతికీ, తపో నియతికీ, మంత్రానుష్టాన అనుభూతికీ, నిలువెత్తు సాక్ష్యాలు. నిజానికి ఒకే ఒక్క వైష్ణవ తేజం, నర నారాయణులు. ఒకప్ప