Posts

Showing posts with the label Powerful Ruler of Kashmir

Early Muslim Invasion - Powerful Ruler of Kashmir History | 300 ఏళ్ళు ముస్లింలను భారత దేశంలోకి అడుగుపెట్టనివ్వని కాశ్మీర చక్రవర్తి!

Image
300 ఏళ్ళు ముస్లింలను భారత దేశంలోకి అడుగుపెట్టనివ్వని కాశ్మీర చక్రవర్తి ఎవరు? అరబ్, చైనా చరిత్ర గ్రంథాలలో రాయబడి, మన చరిత్ర పుటలలోనుంచి తొలగించబడటమా? కాశ్మీర్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. మొన్నీ మధ్య కాశ్మీర్ లోని పహల్గామ్ దగ్గర జరిగిన ఉగ్ర దాడితో, ప్రపంచం మొత్తం షాక్ లో మునిగిపోయింది. మతం ఏదని అడిగి, డౌట్ వస్తే మగాళ్ల ప్యాంట్ విప్పి చూసి మరీ చంపడం, ప్రపంచ వ్యాప్త హిందువుల రక్తం మరిగిపోయేలా చేసింది. కల్లోల కాశ్మీరంగా, ఉగ్రవాదుల అడ్డాగా.. కాశ్మీర్ గురించి ఎన్నో ఏళ్లుగా వింటూ ఉన్నాము. అటువంటి కాశ్మీర్ లో పుట్టి, అటు సౌదీ నుంచి, ఇటు టిబెట్ వరకు ఉన్న ప్రాంతాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని, అతి పెద్ద సామ్రాజ్యాన్ని పాలించిన ఒక గొప్ప హైందవ చక్రవర్తి గురించి మనలో ఎంతమందికి తెలుసు..? ముస్లిం పాలకులు ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 300 ఏళ్ల పాటు భరత భూమిపై అడుగుపెట్టడానికి కూడా భయపడేలా చేసిన ఓ మహా యోధుడి గురించి ఎప్పుడైనా విన్నారా? అరబ్, చైనా చారిత్రక గ్రంథాలలో ఎంతో గొప్పగా రాయబడి ఉన్నా, మన చరిత్ర పుటలలో నుంచి మాత్రం తొలగించివేసిన ఒక మహోన్నత రాజు గురించి ఎంతమందికి తెలుసు? రావణ సేనలా...