Early Muslim Invasion - Powerful Ruler of Kashmir History | 300 ఏళ్ళు ముస్లింలను భారత దేశంలోకి అడుగుపెట్టనివ్వని కాశ్మీర చక్రవర్తి!


300 ఏళ్ళు ముస్లింలను భారత దేశంలోకి అడుగుపెట్టనివ్వని కాశ్మీర చక్రవర్తి ఎవరు?
అరబ్, చైనా చరిత్ర గ్రంథాలలో రాయబడి, మన చరిత్ర పుటలలోనుంచి తొలగించబడటమా?

కాశ్మీర్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. మొన్నీ మధ్య కాశ్మీర్ లోని పహల్గామ్ దగ్గర జరిగిన ఉగ్ర దాడితో, ప్రపంచం మొత్తం షాక్ లో మునిగిపోయింది. మతం ఏదని అడిగి, డౌట్ వస్తే మగాళ్ల ప్యాంట్ విప్పి చూసి మరీ చంపడం, ప్రపంచ వ్యాప్త హిందువుల రక్తం మరిగిపోయేలా చేసింది. కల్లోల కాశ్మీరంగా, ఉగ్రవాదుల అడ్డాగా.. కాశ్మీర్ గురించి ఎన్నో ఏళ్లుగా వింటూ ఉన్నాము. అటువంటి కాశ్మీర్ లో పుట్టి, అటు సౌదీ నుంచి, ఇటు టిబెట్ వరకు ఉన్న ప్రాంతాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని, అతి పెద్ద సామ్రాజ్యాన్ని పాలించిన ఒక గొప్ప హైందవ చక్రవర్తి గురించి మనలో ఎంతమందికి తెలుసు..? ముస్లిం పాలకులు ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 300 ఏళ్ల పాటు భరత భూమిపై అడుగుపెట్టడానికి కూడా భయపడేలా చేసిన ఓ మహా యోధుడి గురించి ఎప్పుడైనా విన్నారా? అరబ్, చైనా చారిత్రక గ్రంథాలలో ఎంతో గొప్పగా రాయబడి ఉన్నా, మన చరిత్ర పుటలలో నుంచి మాత్రం తొలగించివేసిన ఒక మహోన్నత రాజు గురించి ఎంతమందికి తెలుసు? రావణ సేనలా మధ్య ఆసియాను పూర్తిగా ఆక్రమించి, భారత దేశంపై దండెత్తి వచ్చిన అరబ్బుల ఆశలపై నీళ్ళు చల్లి, 300 ఏళ్లపాటు సమాధి చేసిన ఆ గొప్ప చక్రవర్తి గురించి ఈ రోజు తెలుసుకుందాము. ఒకప్పుడు మన కాశ్మీరం ఎలా ఉండేది..? ఆ గొప్ప చక్రవర్తి ఎవరు..? అరబ్ పాలకులను ఏకంగా 300 ఏళ్ల పాటు భారత దేశం నుంచి దూరంగా ఉంచిన ఆ రాజు ఎవరు..? వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/TfV8OId8vxw ]


మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, కాశ్మీర్ ఒక వివాదాస్పద ప్రాంతంగానే ఉండి పోయింది. 1970 వ దశకం నుంచి, ఉగ్రవాదం అనే పెను భూతం కూడా కాశ్మీర్ లోయలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచీ కాశ్మీర్ లో హిందువుల జనాభా గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, కొన్ని లక్షల మంది హిందువుల మాన ప్రాణాలు ఎవరికీ తెలియని విధంగా ఆ నేలలో సమాధి అయిపోయాయి.

కానీ దాదాపు వెయ్యేళ్ళ క్రితం కాశ్మీర్ అంటే స్వర్గధామం.. కాశ్మీర్ అంటే అపారమైన విజ్ఞానానికి మేరు పర్వతం వంటిది.. కాశ్మీర్ అంటే ఎల్లలులేని హైందవ ధర్మానికి పట్టుకొమ్మ. అలాంటి కాశ్మీర్ ని వశం చేసుకోవాలని చూసిన అరబ్ పాలకులకు పగలే చుక్కలు చూపించడమే కాకుండా, మళ్ళీ భారత భూభాగంపై అడుగుపెట్టాలనే ఆలోచన కూడా రాకుండా భయపెట్టిన ఒకే ఒక్క వ్యక్తి, కర్కోటక వంశపు మహాపురుషుడు, లలితాదిత్య ముక్తాపీడుడు.

లలితాదిత్య చక్రవర్తి చరిత్రను గురించి తెలుసుకునే ముందు, 8వ శతాబ్ది నుంచి జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను ప్రస్థావించుకోవాలి. మధ్య ఆసియాలో పురుడుపోసుకుని, అటు యూరోప్ నుంచి ఆసియా అంచుల వరకూ తమ మతమే ఉండాలనే దురాశతో, అత్యంత పైశాచికంగా వ్యాపించిన మతం ఇస్లాం. Arab ఉమయ్యద్ కాలిఫేట్ రాజులు నేడు మనం చూస్తున్న సౌదీ నుంచి తమ రాజ్యాన్ని విస్తరిస్తూ, ఆక్రమించిన ప్రతి చోట తమ మతం మాత్రమే ఉండాలనే క్రూరమైన ఆశయంతో కొనసాగారు. దానికి వారు ఎంచుకున్న మార్గం హింస.

ఇలా దాదాపు మధ్య ఆసియాను పూర్తిగా ఆక్రమించుకున్న అరబ్ రాజుల క్రూర దృష్టి, సామాన్య శకం 712 నాటికి మన దేశం వైపుకు ప్రసరించింది. అనుకున్నదే తడవుగా అరబ్ జనరల్ ముహమ్మద్ బిన్ ఖాసిమ్ ఆధ్వర్యంలో సింధు రాజ్యంపై దండయాత్ర జరిగింది. చారిత్రక ఆధారాల ప్రకారం, మన దేశంపై జరిగిన మొదటి ముస్లిం దండయాత్ర కూడా అదే. ఆ ప్రాంతమే నేడు పాకిస్తాన్ లో ఉంది. ఆ కాలంలో సింధు ప్రాంతాన్ని బ్రాహ్మణ వంశానికి చెందిన దహిర్ సేనుడనే రాజు పాలించేవాడు. అప్పటి వరకు చాలా సులువుగా మధ్య ఆసియాను సొంతం చేసుకున్న ఉమయ్యద్ కాలిఫేట్ సేనలకు, దహిర్ సేనుడు అనుకోని షాక్ ఇచ్చాడు. మహా సైన్యంతో వచ్చిన అరబ్బులు, వేలల్లో మాత్రమే ఉన్న దహిర్ సేనుడి సేనలను సులువుగా ఓడించవచ్చని అనుకున్నారు. కానీ వారు అనుకున్నది అంత సులువుగా జరగలేదు. సైన్యం తక్కువ ఉన్నప్పటికీ, మన యుద్ధ రీతుల కారణంగా ఉమయ్యద్ కాలిఫేట్ సేనలు పెద్ద ఎత్తున నేల కూలారు. అయితే సంఖ్యా బలం లేని కారణంగా, చివరికి దహిర్ సేనుడు ఓటమిపాలవ్వక తప్పలేదు.

ఇలా చచ్చీచెడీ సింధు రాజ్యాన్ని చేజిక్కించుకున్న అరబ్బు సేనలకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అందుకు కారణం, లలితాదిత్య ముక్తాపీడుడు. ఓడిపోవడం, తిరిగి సేనలను పోగేసుకుని మళ్ళీ దాడి చేయడం, మళ్ళీ ఓడడం, ఇదే నాడు అరబ్బులకు పట్టిన గతి. ఆ సమయంలో లలితాదిత్యుడి ముందు రెండు పెద్ద సవాళ్ళు నిలిచాయని చరిత్ర విదితం. ఒక పక్క అరబ్ సేనలు భారత దేశంపై మళ్ళీమళ్ళీ దండెత్తడానికి సిద్ధంగా ఉంటే, మరో పక్క టిబెట్ సేనలు తమ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇవి చాలవన్నట్లు, మధ్య ఆసియాలో అరాచకత్వానికి మారు పేరుగా భావించబడిన Bactrian సేనలు కూడా, తమ రాజ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఒకప్పుడు ఈ Bactrian రాజ్యంలోనే Saka రాజులు ఉండేవారు. వీరు ఈశ్వర ఆరాధకులు. ఈ విషయాలు మనం గతంలో వివరంగా చెప్పుకున్నాము. అయితే, ఇస్లాం మత వ్యాప్తి కారణంగా, 8వ శతాబ్దం నాటికి Bactria రాజులు ఇస్లాం మతంలోకి మారిపోయారు. ఇక మరో పక్క చైనాలో Tang వంశస్థులు తమ రాజ్యాన్ని అనూహ్యంగా విస్తరించుకోవడం మొదలుపెట్టారు.

సరిగ్గా అదే సమయంలో భారత దేశంలో పెను మార్పులు సంభవించాయి. పుష్యభూతి వంశానికి చెందిన హర్షవర్ధన మహారాజు అకాల మృత్యువు పాలయ్యాడు. ఆ కాలంలో ఉత్తర భారతంలోని అతి పెద్ద రాజ్యం, ఈ పుష్యభూతి వంశానికి చెందిన వారిదే. నేటి ఉత్తర్ ప్రదేశ్ లోని కనోజ్ (Kannauj), వారి రాజధాని. హర్షవర్ధనుడి మరణంతో ఒక్కసారిగా ఉత్తర భారత రాజ్యాలన్నీ బలహీన పడిపోయాయి. ఒకపక్క అరబ్బులూ, ఇంకో పక్క టిబెటాన్ లూ, వీరు చాలరన్నట్లు ఇటు Bactrian లూ, అటు చైనా Tang వంశస్థులూ.. అందరికీ కావలసినది భారత దేశమే. సరైన నాయకత్వాన్ని కోల్పోయి భారత దేశం అయోమయ స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడే తెర పైకి వచ్చిన మహా వీరుడు లలితాదిత్య ముక్తాపీడుడు. లలితాదిత్యుని పాలనాకాలం స్వర్ణయుగంగా పేరొందింది. సా.శ. 12 వ శతాబ్దానికి చెందిన కాశ్మీర కవి కల్హణుడు తన విఖ్యాత చారిత్రక గ్రంథం, ‘రాజ తరంగిణి’ లో లలితాదిత్యుని జైత్రయాత్రలనూ, ఆయన పరిపాలనా విశేషాలనూ హృద్యంగా వర్ణించారు.

లలితాదిత్యుడు కాశ్మీర గద్దెనెక్కిన వెంటనే చేసిన మొదటి పని, భారత దేశంలోని రాచరిక వ్యవస్థను పటిష్ఠ పరచడం. ఈ క్రమంలో ఆయన మొదటగా కనోజ్ (Kannauj) గద్దెపై కూర్చున్న యశోవర్మకు బుద్ధి చెప్పాడు. హర్షవర్ధనుడి మరణంతో ఉత్తర భారతంపై పట్టుకోసం ప్రాకులాడుతున్న రాజులలో, ఈ యశోవర్మ కూడా ఒకడు. ఈయన హర్షవర్ధనుడి తర్వాత కనోజ్ (Kannauj) సింహాసనాన్ని అధిరోహించి, తనకు అడ్డుగా ఉన్న లలితాదిత్యుడిపై రాజకీయం చేయడం మొదలుపెట్టాడు. లలితాదిత్యుడు తన యుద్ధ కౌశలంతో యశోవర్మను ఓడించి, తన సామంత రాజుగా మార్చుకున్నాడు. ఆ గెలుపుతో మెల్లగా ఉత్తర భారతం మొత్తం అతని పాలన క్రిందకు చేరింది.

లలితాదిత్యుడు తుఖారీలపై అంటే, బాక్ట్రియా రాజ్యంపై చారిత్రక విజయాన్ని సాధించి, వారిని వెనక్కి పంపేశాడు. సాధారణంగా కొండలలో చిన్న చిన్న తెగలుగా జీవించే టిబెటాన్ లు, ఒక్కటిగా కలిసి మహాసేనగా మారారు. ఇలా ఒక్కటైన సేన అటు చైనాతో పాటు, ఇటు భారత దేశాన్ని కూడా ఆక్రమించుకోవాలని చూశారు. ఈ ప్రక్రియలో వారికి ముందుగా అడ్డు వచ్చిన రాజ్యం, కాశ్మీరం. ఎత్తయిన హిమాలయ శ్రేణులలో సైతం పోరాటం చేయగల టిబెటాన్ లను, లలితాదిత్యుడి సేనలు ఊచకోత కోసి వెనక్కి తరిమేశాయి. అయితే వెనక్కి వెళ్ళిన టిబెట్ వీరులు మళ్ళీ బలం పుంజుకుని వస్తారని గ్రహించిన లలితాదిత్యుడు, వెంటనే చైనాకు చెందిన Tang వంశంతో మైత్రిని నెలకొల్పాడు. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడనే సూత్రాన్ని ఇక్కడ లలితాదిత్యుడు వాడాడు. టిబెటాన్లు కేవలం భారత దేశానికే కాకుండా, అప్పుడప్పుడే విస్తరిస్తున్న Tang వంశపు రాజులకు కూడా పెద్ద తలనొప్పిగా మారారు. అటువంటి టిబెటాన్ లకు యమపురికి దారి చూపించిన లలితాదిత్యుడి వంటి రాజుతో మిత్రత్వం, అన్ని విధాలా లాభంగా భావించిన Tang రాజులు, ఆయనను ఆప్తమిత్రుడిలా భావించారు. అలా టిబెట్‌ ను జయించి, చైనా లోకి దారి తీస్తున్న 5 మార్గాలను మూసి వేశాడు..

ఇక అదే ఊపులో ఆయన చేసిన మరో పని, అరబ్ సేనలనూ, టర్కిష్ సేనలనూ నాశనం చేయడం. అద్భుతమైన యుద్ధ కౌశలం కలిగిన లలితాదిత్యుడు, ముందుకొస్తున్న అరబ్ సేనలనూ, టర్కిష్ సేనలనూ వెనక్కి తరిమికొట్టడమే కాకుండా, మధ్య ఆసియా వరకూ తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అయితే, తురుష్కులు చేసినట్లు నగరాలను నాశనం చేయడం, ఖజానాలను దోచేయడం, ఆడవాళ్లను బలాత్కరించడం, మతం మార్చడం వంటి పనులు ఆయన చేయలేదు. తాను ఆక్రమించిన ప్రతి చోటా మహా నగరాలను నిర్మించాడు. ఎన్నో విద్యాలయాలనూ, దేవాలయాలనూ నిర్మింపజేశాడు. ఇస్లాం పాలకుల వల్ల నాశనం అయిన హిందూ ఆలయాలను పునరుద్ధరించాడు. అమోఘమైన వాస్తు నిర్మాణాలనూ, ప్రజోపయోగ నిర్మాణ కార్యక్రమాలనూ చేపట్టాడు. ఆయన నిర్మించిన ఆలయాలలో అనంతనాగ్ సమీపంలోని మార్తాండ దేవాలయం అత్యంత ప్రధానమైంది.

లలితాదిత్యుడి యుద్ధ కౌశలం, వీరత్వం చూసిన అరబ్ సేనలు ఎన్నో ఏళ్లపాటు భారత దేశంపై ఆక్రమణ అనే ఆలోచన కూడా రానంతగా భయపడిపోయారు. అటువంటి లలితాదిత్యుడి మహోన్నత చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. ఆయన మరణం గురించిన వాస్తవాలు నేటికీ అంతుచిక్కని మిస్టరీలుగా మిగిలిపోయాయి. ఆయన ఏదైనా యుద్ధంలో చనిపోయాడా! అనారోగ్యంతో చనిపోయాడా! లేదా ఎవరికీ కనిపించకుండా ఎక్కడికైనా వెళ్లిపోయాడా? అనే విషయాలు నేటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ చరిత్ర గ్రంథంలోనూ, ఏ శిలా శాశనంలోనూ, ఆయన మరణం గురించి ఎటువంటి వివరణా లేదు.

అయితే లలితాదిత్య ముక్తాపీడుడనే వ్యక్తి ఒక గొప్ప చక్రవర్తిగా, మిత్రుడిగా, వీరుడిగా చరిత్ర పొగిడింది. అది కూడా మన గ్రంథాలలో కాదు. అరబ్ లు రాసిన చారిత్రక గ్రంథాలలో ప్రస్ఫుటంగా ప్రస్తుతించబడి ఉంది. 11వ శతాబ్దంలో పర్షియన్ చరిత్రకారుడైన Al-Baruni రాసిన చరిత్ర పుస్తకాలలోనూ, చైనాలోని Tang వంశ చరిత్రను తెలిపే ‘Xin Tang shu’ అనే గ్రంథంలోనూ, లలితాదిత్యుడి గురించి ఎంతో గొప్పగా అభివర్ణించబడి ఉంది.

ఇక లలితాదిత్యుడి మరణం ఒక మిస్టరీగా మిగిలిపోయినా, ఆ తరువాత కూడా ఆయన రగిల్చిన స్ఫూర్తి జ్వాలలు, అరబ్బుల నుంచి భారత దేశాన్ని 300 ఏళ్ల పాటు కాపాడాయి. ఒకవేళ లలితాదిత్యుడనే రాజు ఉండివుండకపోతే, భారత దేశంలో ఈనాడు వేరే విధమైన సామాజిక పరిస్థితులుండి ఉండేవని చరిత్రకారులంటున్నారు. ఓటమి ఎరుగని ఇలాంటి మహా చక్రవర్తుల వీర గాథలను నేటి తరం వారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన పాఠ్య పుస్తకాలలో అక్బర్, బాబర్ వంటి చరిత్ర హీనుల గురించి గొప్పగా రాసి, లలితాదిత్యుడి వంటి యోధుల గాథలను మరుగు పరచడం నిజంగా దౌర్భాగ్యమే. భారతీయులనూ, భారతీయతనూ, అఖండ భారతీయ చరిత్రనూ సంస్కృతినీ చూసి ఓర్వలేక చెరిపి వేసి, మన నుండి మన ఘన చరిత్రను మాయం చేస్తూ, భారతీయ చరిత్రకూ, సంస్కృతికీ తీరని ద్రోహం చేసిన, చేస్తున్న బ్రిటిష్ బానిసలు క్షమార్హులు కారు.. ఈ పరిస్థితులలో మార్పు త్వరలో ఆశించవచ్చా?

🚩 ధర్మో రక్షతి రక్షితః 🙏

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess