యువక్రీతుడి కథ! Sustainable Attainment 'Story of Yuvakrita'
రోమశ మహర్షి చెప్పిన యువక్రీతుడి కథ! గురుముఖతః నేర్చుకోని విద్య ఎందుకు పనికిరాదు? గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/P1cMnPseiNU ] మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా, ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ, ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుకా గురువు వుంటాడు. గురువు యొక్క విశిష్ఠత మన పురాణ గ్రంథాలలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎంత కఠోర దీక్ష చేసినా, ఎన్ని వరాలను పొందినా, గురుముఖతా నేర్చుకున్న విద్యకు సమానం కాదు. అందుకు ఉపమానంగా, పాండవులు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు, వారి వెంట ఉన్న రోమశ మహర్షి, సంగమ నదీ తీరం వద్ద, యువక్రీతుని గురించి వివరించాడు. యువక్రీతుడు ఎందుకు ఘోర తపస్సుకు పూనుకున్నాడు? ఇంద్రుడిని అడిగిన వరం ఏంటి? ఒక మహర్షి చేతిలో అతని మరణం ఎందుకు సంభవించింది? అనేటటువంటి ఉత్సుకతను రేకేత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసకుందాము.. రైభ్యుడూ, భరద్వాజుడూ అనే మహా ఋషులిరువురూ మిత్రులు. వారిద్దరూ అడవిలో తపస్సులో నిమగ్నమయ్యారు. రైభ్యునిక