A Fight, A Boon & A Curse led to MAHABHARATA War

ఒక యుద్ధం, ఒక వరం, ఒక శాపం! ఈ మూడే కురుక్షేత్ర సంగ్రామానికి అసలు కారణాలా? భారతీయ చరిత్రలో ఓ ఉత్కృష్ట ఘట్టం, 5000 ఏళ్ల పూర్వం సంభవించిన ‘కురుక్షేత్రం’. ప్రపంచ మానవాళి గతిని మార్చిన ఘట్టమది. ఈ భూమిపైనున్న రాజ్యాలన్నిటి సేనలనూ ఒక్క చోటికి చేర్చిన ఘట్టం.. మానవ జీవన విధానాన్ని సమూలంగా మార్చేసిన ఘట్టం, కలియుగారంభానికి బాటలు వేసిన ఘట్టం.. ఇలా కురక్షేత్ర సంగ్రామం గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. అంతటి మహోన్నత ఘట్టానికి దారి తీసిన విషయాలు మాత్రం, ఒక యుద్ధం, ఒక వరం, ఒక శాపం అని ఎంతమందికి తెలుసు? ఈ మాటలు వినగానే, అదేంటి? దుర్యోధనుడు శకునితో కలిసి పన్నిన మయోపాయం కారణంగా ధర్మ రాజు జూదంలో ఓటమి పాలై, చివరకు కురుక్షేత్ర యుద్ధానికి దారి తీసిందని మన గ్రంధాలు చెబుతున్నాయి కదా! మరి ఈ యుద్ధం, వరం, శాపం కారణంగా కురుక్షేత్ర యుద్ధానికి బాటలు పడడమేమిటి? అనే సందేహం కలగడం సహజం. అది ఎలాగో తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/GO-ga4EWTfI ] భారత దేశ చరిత్రలో జరిగిన మహోన్నత చారిత్...