Posts

Showing posts with the label ప్రకృతి గర్భము వంటిది ఆత్మలు రేతస్సు వంటివి

ప్రకృతి గర్భము వంటిది, ఆత్మలు రేతస్సు వంటివి! భగవద్గీత Bhagavadgita

Image
  జీవాత్మ - దేహము! ప్రకృతి గర్భము వంటిది, ఆత్మలు రేతస్సు వంటివి! 'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (01 – 04 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 01 నుండి 04 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/VswiutHKUvg ] ఈ అధ్యాయము, దేహము మరియు దాని మూలకముల యొక్క మూలశక్తి అయిన భౌతిక శక్తి యొక్క స్వభావమును వివరిస్తుంది. 00:50 - శ్రీ భగవానువాచ । పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ । యద్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ।। 1 ।। శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క సర్వశ్రేష్టమైన విద్యనూ, అన్నింటికన్నా ఉత్తమమైన జ్ఞానమునూ నీకు వివరిస్తాను; ఇది తెలుసుకున్న గొప్ప సాధువులందరూ, అత్యున్నత పరిపూర్ణతను సాధించారు. గతంలో శ్రీ కృష్ణుడు, ఆత్మ మరియు భౌతిక పదార్ధ మేళనముతోనే, సమస్త జీవ భూతములూ తయారైనాయని చెప్పి ఉన