The Demon's Lingam That Split into 5 Temples | The Sacred Pancharamas & Pancharangas పంచారామాలు – పంచరంగ క్షేత్రాలు!

పంచారామాలు – పంచరంగ క్షేత్రాలు! శివకేశవులకు ఇష్టమైన కార్తీకమాసంలో ఈ వీడియో చూసినా పుణ్యమే! శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే । శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః ।। యథా శివమయో విష్ణుః ఏవం విష్ణుమయం శివః । యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి ।। విష్ణురూపుడైన శివుడికీ, శివరూపుడైన విష్ణువుకూ నమస్కారం. శివుడి హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు. విష్ణువు శివమయుడైనట్లుగానే, శివుడు కూడా విష్ణుమయుడే. వారిద్దరి మధ్య భేదం చూపనంత వరకు మనకు శుభం, ఆయుష్షు కలుగుతాయన్నది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అందువల్ల శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసం అంటే, శ్రీ మహా విష్ణువుకు కూడా అంతే ప్రీతి అని శాస్త్ర విదితం. శివకేశవులకు భేదం లేదు. శివుణ్ణి పూజిస్తే విష్ణువును పూజించినట్లే, శివుణ్ణి ద్వేషిస్తే శ్రీహరిని ద్వేషించినట్లే. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలోని వారితో పాటు, కార్తీక మాసంలో మన తెలుగు వారు కూడా శివ క్షేత్రాలైన పంచారామ క్షేత్రాలను ఏ విధంగానైతే చూడాలని అనుకుంటారో, అదే విధంగా పంచ రంగనాథ క్షేత్రాలను కూడా దర్శించాలని పరితపిస్తుంటారు. ఈ మాట వినగానే, పంచారామ క్షేత్రాలేమిటి? పంచ రంగనాథ క్షేత్రా...