CURSE OF THE GODDESS: A Curse that ruined countless lives
సీతమ్మ కిరీటంలోని నీలమణిని తాకినా వినాశనమేనా?
ఇన్ని మరణాలకు కారణం, శాపగ్రస్థమైన ఆ వజ్రమేనా?
‘వరం’ కూటికి గతిలేనివాడిని కూడా, అపరకుబేరుడిని చేస్తుంది. కానీ శాపం, జీవితాలను నాశనం చేస్తుంది, కుటుంబాలను కబళించి వేస్తుంది, ఆఖరికి వంశాలకు వంశాలనే తుడిచివేస్తుంది, వెరసి లెక్కలేనంతమందిని యమపురికి పంపిచేస్తుంది. అందుకే, వరం వల్ల వచ్చే సంతోషం కంటే, శాపం వల్ల కలిగే నష్టం భరించలేదనీ, అందుకే మానవులకు శాపం అంటే చచ్చేంత భయమనీ పెద్దలు చెబుతుంటారు. అయితే, వీటి వెనుక నిజమెంతుందో తెలియదు కానీ, నేటికీ ప్రపంచంలో శాపగ్రస్తమైన వస్తువులు ఉన్నాయని నమ్ముతున్నారు. కేవలం నమ్మడమే కాదు.. వాటి వెనుక జరిగిన చరిత్ర వింటే, నిజంగా అవి శాపగ్రస్త వస్తువులని నమ్మక తప్పదు. అటువంటి వాటిలో, స్వయంగా ఆ శ్రీరాముని భార్య ‘సీతా మాత’ శపించిన ఓ వజ్రం కూడా ఉంది. సీతామాత, ఓ వజ్రాన్ని శపించడమా? నిలువెత్తు శాంత మూర్తిగా పేరుపొందిన సీతాదేవి, అసలు శపించడమేంటి? ఈ కథ రామాయణంలో ఉందా? లేక ఆ తర్వాత ఎప్పుడైనా జరిగిందా? ఇంతకీ ఆ వజ్రం ఇప్పుడు ఎక్కడ ఉంది? దాని వల్ల ఎలాంటి ఘోరాలు సంభవించాయి - వంటి అనేక ప్రశ్నలు, మన మదిలో మెదులుతాయి. వాటన్నిటికీ సరైనా సమధానం తెలియాలంటే, ఈ వీడియోని పూర్తిగా చూడండి..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/1_ynAKC2sog ]
ఒకప్పుడు ఋషులూ, గంధర్వులూ, దేవతలూ... వరాలూ, శాపాల వంటి వాటిని ఇచ్చేవారని, పురాణాలలో చెప్పడింది. వాటి వెనుక ఉన్న నిజానిజాలను పక్కన పెడితే, ఏదైనా వస్తువుని కొన్నప్పుడుగానీ, కనీసం వాటిని ముట్టుకున్నప్పుడు కానీ, ఎవరికైనా తీవ్రమైన కీడు జరిగితే, వాటిని Cursed Objects అని, నేటికాలంలో పిలవడం జరుగుతోంది. ఒకప్పుడు మన దేశంలోనే దొరికి, ప్రపంచాన్ని మొత్తం తనవైపు తిప్పుకున్న కోహినూర్ వజ్రం వెనుక కూడా, ఎంతో విషాదగాధ దాగివుందని చెప్పడంలో, ఎటువంటి సందేహం లేదు. మన ఆంధ్రప్రదేశ్ లో, కొల్లూరు వజ్రాల గనులలో దొరికిన ఆ కోహినూర్ వజ్రాన్ని ధరించిన రాజులందరూ, సర్వనాశం అయినట్లు చరిత్ర చెబుతోంది. అయితే, ఈ కోహినూర్, రాణులను మాత్రం ఏమీ చేయలేదనీ, అందుకే అది ధరించిన లండన్ రాణులు, ఇంకా తమ రాజ్యాలను ఏలుతున్నారనీ, చరిత్రకారులు చెబుతున్నారు.
కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే వజ్రం మాత్రం, ఆలాంటిలాంటిది కాదు! ఈ వజ్రాన్ని ఆభరణంగా చేసుకుని ధరించిన వారే కాదు, దాన్ని చేతితో తాకిన వాళ్ళని కూడా, ఆడ, మగ అనే తారతమ్యం లేకుండా, యమపురికి పంపింది. దానినే, నేడు Hope Diamond గా పిలవడం జరుగుతోంది. ఇది నేడు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద Blue Diamonds లో ఒకటిగా, పేరుగాంచింది. అయితే, ఆంగ్లేయుల పేరుతో ఉన్న నీల వజ్రానికీ, సీతా దేవి శాపానికీ ఉన్న లింక్ ఏంటో తెలియాలంటే, ఒక్కసారి దాని పూర్తి చరిత్ర తెలుసుకోవలసిందే. దాదాపు, 17వ శతాబ్దం మధ్యలో, ఫ్రాన్స్ కి చెందిన Jean-Baptiste Tavernier అనే వజ్రాల వ్యాపారి, మేలైన వజ్రాల కోసం, ప్రపంచం మొత్తం తిరుగుతూ, భారత దేశానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక ఆలయంలో ఉన్న సీతాదేవి కిరీటానికి అలంకరించి ఉన్న అతిపెద్ద నీలి వజ్రాన్ని చూసి, ఆకర్షితుడై, మొదట దాన్ని కొనడానికి ప్రయత్నిచాడు. అయితే, ఆ వజ్రం అమ్మవారి ఆభరణం అవ్వడం వల్ల, అతని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దాంతో, Tavernier దొంగచాటుగా, అమ్మవారి విగ్రహం నుంచి ఆ వజ్రాన్ని పెకలించి, వెంటనే స్వదేశానికి పారిపోయాడు.
ఆ విధంగా, ఫ్యాన్స్ కి చేరుకున్న Tavernier, ఇతర చిన్నా పెద్దా వజ్రాలతో పాటు, దాదాపు 112 క్యారెట్ల బరువున్న ఈ Uncut నీలి వజ్రాన్ని కూడా, నాటి ఫ్రాన్స్ రాజుకి అమ్మడం జరిగింది. ఆ తర్వాత, Tavernier రష్యాకు పయనమవగా, మార్గమధ్యలో అతడ్ని అడవి కుక్కలు ముక్కలు ముక్కలుగా చీల్చి, చంపేశాయట. అలా, సీతమ్మవారి నీలి వజ్రాన్ని దొంగలించిన వ్యాపారికి ఘోరమైన గతిపట్టడమే కాదు, ఈ వజ్రానికి సంబంధించి జరిగిన మరణాలలో, అతిభయంకరమైన మొదటి మరణంగా, చరిత్రలో నిలిచిపోయిందని, చరిత్రకారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఆ వజ్రాన్ని కొన్న ఫ్రాన్స్ రాజు Louis XIV, దానిని తన కిరీటంలో పొందుపరచమని ఆజ్ఞాపించాడు. దాంతో, మొదటిసారి అంతపెద్ద Uncut నీలి వజ్రానికి మెరుగులు పట్టడంతో, దాని బరువు తగ్గిపోయింది.
ఇదిలా ఉండగా, ఫ్రాన్స్ రాజు ఆ వజ్రాన్ని సొంతం చేసుకున్న తర్వాత నుంచీ, రాచరికానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యామాలు, జోరందుకున్నాయి. అంతేకాదు, ఆ వజ్రం వచ్చిన కొన్నేళ్ళకే, అతడు మంచం పట్టడం.. దాంతో, Louis XIV మనవడు Louis XV, వెంటనే రాజ్య పరిపాలన స్వీకరించడం జరిగిందని, చరిత్ర కారులు చెబుతున్నారు. అయితే, Louis XV కూడా, కొన్నేళ్ళకే అర్ధాంతరంగా చనిపోవడంతో, అతడి కొడుకు Louis XVI పై, రాజ్య భారం పడింది. కొత్తగా పీఠమెక్కిన రాజు భార్యకు, బంగారు ఆభరణాలపై మోజు ఎక్కువ ఉండటం, అందులోనూ, అత్యంత అమూల్యమైన నీలి వజ్రం అంటే మరింత ఇష్టం ఉండటంతో, Louis XIV హయాంలో మెరుగుపెట్టిన ఆ వజ్రానికి మరింత సానపట్టించి, మేడలో వేసుకునే అభరణంగా చేయించి, తన భార్యకు బహుకరించాడు, Louis XVI. ఇది జరిగిన అతికొద్ది కాలానికే, French revolution కారణంగా, Louis XVI, మరియూ అతడి భార్య Marie Antoinette ని, public గా తల నరికి చంపారు. ఆ సమయంలో జరిగిన దొంగతనాలలో, ఈ నీలి వజ్రం, దొంగతనానికి గురైందని, చరిత్ర చెబుతోంది.
ఆ విధంగా, ఫ్రాన్స్ రాచరిక వ్యవస్థే, ఈ వజ్రం కారణంగా మట్టిలో కలిసిపోయినట్లు, ప్రజలలో ఓ నమ్మకం నేటికీ ఉంది. అయితే, నాడు దొంగలించబడ్డ నీలి వజ్రం, ఆ తర్వాత తెలియని ఎంతో మంది చేతులు మారి, 20వ శతాబ్దం మొదట్లో, టర్కీ సుల్తాన్ అబ్దుల్ హమీద్ చేతికి చేరింది. ఆ నీలి వజ్రాన్ని పొందిన కొన్నేళ్ళకే, హమీద్ రాజ్య బ్రష్టుడవ్వడం, అతడి భార్య అత్యంత దారుణంగా చనిపోవడం, జరిగింది. ఆ తర్వాత ఈ నీలి వజ్రం, Simon Montharides అనే గ్రీకు వజ్రాల వ్యాపారి చేతుల్లోకి వెళ్లగా, దాన్ని పొందిన అతికొద్ది రోజుల్లోనే, Simon తో పాటు, అతని భార్యా, కొడుకూ కూడా, ఓ లోయలో పడి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత నీలి వజ్రాన్ని, London లో ఉండే అత్యంత ధనవంతుడైన Henry Thomas Hope, దక్కించుకున్నాడు. అప్పటి నుంచే, దానికి Hope Diamond అనే పేరు వచ్చినట్లు, చరిత్రకారులు చెబుతున్నారు. అయితే, ఈ నీలి వజ్రం ఎప్పుడైతే వారి ఇంట చేరిందో, Hope కుటుంబం, ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడటంతో పాటు, Hope మనవడు, అత్యంత దారిద్ర్యాన్ని అనుభవించి, చనిపోయాడు. ఆ తర్వాత ఈ Hope Diamond ని, రష్యాకు చెందిన Mademoiselle Ledue అనే actress కొనడం జరిగింది. అయితే, ఆ Hope Diamond ని కొన్న కొన్ని రోజులకే, దాన్ని ధరించి, ఓ stage performance ఇవ్వడానికి stage పైకి ఎక్కగానే, Mademoiselle ని, తుపాకీతో కాల్చి చంపడం జరిగిందని, చరిత్రకారులు చెబుతున్నారు.
ఆ తర్వాత, Hope Diamond, మరికొన్ని చేతులు మారి, 1950 లలో, Harry Winston అనే ధనికుడి చేతికి వెళ్లగా, అతడు దానివెనుక ఉన్న దారుణమైన కథ తెలుసుకుని, 1958 లో, అమెరికాలోని National Museum of Natural History కి, దానం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి, Hope Diamond, అదే Museum లో, ప్రజల సందర్శనార్ధం ఉంచేశారు. భారత దేశంలో, వజ్రాల వ్యాపారి Tavernier దొంగలించిన 112 క్యారెట్ల నీలి వజ్రం, అనేక మంది చేతులు మారి, వివిధ ఆకారాలు సంతరించుకుని, చివరికి National Museum కి చేరే సమయానికి, ఆ Hope Diamond బరువు, 45 క్యారెట్లయ్యిందని, నిపుణులు చెబుతున్నారు. అయినా, నేడు ప్రపంచంలోనే, అత్యంత విలువైన, అత్యంత బరువైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలవడమే కాకుండా, Most Dangerous and Cursed Diamond గా కూడా, ఈ Hope Diamond పేరు తెచ్చుకుంది.
🚩 జై శ్రీరామ 🙏
Comments
Post a Comment