Marwadi Go Back Controversy: Who are Marwaris? | శ్రీ రాముడి వంశానికీ మార్వాడీలకూ సంబంధం!
శ్రీ రాముడి వంశానికీ మార్వాడీలకూ మధ్య సంబంధం ఏమిటి?
అసలు మార్వాడీలు ఎవరు? దేశ ఆర్ధికవ్యవస్థకీ వారికీ ఉన్న సంబంధం ఏమిటి?
‘Go Back Marwadi’ అనే నీనాదాన్ని గత కొద్ది రోజులుగా తెలంగాణా ప్రాంతంలో పదేపదే వింటున్నాము. తెలంగాణాలో మార్వాడీలు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు, ఇక్కడ అసలు వాళ్ళు ఉండటానికే వీల్లేదని అంటూ, వారిని అతి పెద్ద క్రిమినల్స్ గా కొంతమంది చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో మనలో చాలా మందికి అసలు మార్వాడీలంటే ఎవరు..? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు..? వారంతా ఎక్కువగా వ్యాపార రంగంలోనే ఎందుకున్నారు..? వైశ్యులు, మార్వాడీలు ఒకటేనా..? వారిపై తెలంగాణాలో ఉన్నట్టుండి ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏమిటి..? వంటి ఎన్నో సందేహాలు మనలో చాలా మందికి కలుగుతాయి. మార్వాడీల చరిత్రతో పాటు, ఇప్పుడు జరుగుతున్న అతిపెద్ద కుట్రకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/P0URjg8F7AY ]
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని ఒక మార్కెట్ ఏరియాలో మొదలైన ఒక చిన్న గొడవ, చిలికి చిలికి గాలివానలా మారింది.. మారింది అనేకంటే మార్చారనుకోవడం భావ్యంగా ఉంటుంది. ఒక మార్వాడీ వ్యక్తి మార్కెట్ లోని ఒక రోడ్డులో తన కారును ఆపాడు. అది ఇరుకు సందు కావడం, అందులోనూ మార్కెట్ ఏరియా కావడంతో, ఆ కారు వెనకే ఆగిన ఒక బైక్ వ్యక్తి గట్టిగా హారన్ మ్రోగిస్తూ, ముందున్న కారులోని వ్యక్తిని దూషించడం మొదలుపెట్టాడు. దాంతో వారిద్దరి మధ్యా వాగ్వాదం మొదలై, అది కొట్టుకునేంత వరకు వెళ్ళింది. కారులో వచ్చిన వ్యక్తి మార్వాడీ అనీ, బైకుపై ఉన్న వ్యక్తి తెలంగాణా స్థానీకుడనీ గుర్తించిన కొంతమంది అవకాశవాదులు, అతిపెద్ద నాటకానికి తెరతీశారు. ఆ నాటకం ఏమిటో..? దాని వెనుకవున్న కుట్ర మేమిటో తెలియాలంటే, ముందుగా అసలు మార్వాడీలు ఎవరో, వారి పుట్టు పూర్వోత్తరాలేమిటో తెలుసుకోవాలి.
మార్వాడీల చరిత్ర తెలుసుకోవాలంటే, ముందుగా రాముడి వంశం గురించి తెలుసుకోవాలి. శ్రీరాముల వారికి లవ కుశులనే కొడుకులున్న విషయం తెలిసిందే. వారి తర్వాత ఆ వంశంలోని వారి గురించి పెద్దగా తెలియదనే చెప్పాలి. ఈ వివరాలతో మనం గతంలో చేసిన వీడియో (రాముని తర్వాత వారి వంశం ఏమైందో తెలుసా? https://youtu.be/q18fhoB8AoA) లింక్ ను చూడని వారి కోసం పొందుపరుస్తున్నాను.
రామావతారం తర్వాత లవుడు, కుశుడు నాటి రామ రాజ్యంలోని వివిధ ప్రాంతాలను పాలించారు. వారిలో ఒకరైన కుశుడి వంశంలో, నాలుగవ తరం వ్యకైన Vallabha Deva మహారాజు కుమారుడు అగ్రసేనుడే, మార్వాడిలను తీర్చిదిద్దిన వ్యక్తిగా చరిత్ర చెబుతోంది. ఆయన నేటి హర్యానా రాష్ట్రంలోని Agroha నగరాన్ని ముఖ్య పట్టణంగా చేసుకుని, మహా సాంరాజ్యాన్ని నెలకొల్పినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. నేటికీ Agroha ప్రాంతంలో వేల ఏళ్లనాటి చారిత్రక ఆధారాలు ఎన్నో, పురావస్తు శాఖవారికి దొరుకుతూనే ఉన్నాయి.
Agrasena మహారాజు కాలంలోనే గోత్రనామాలు ఏర్పడ్డాయని కొంతమంది చరిత్రకారులంటున్నారు. అగ్రసేనుడికి 18 మంది కుమారులు కాగా, వారు 18 యజ్ఞాలు చేయించారు. ఆ యజ్ఞాలు కూడా గర్గ మహర్షి నేతృత్వంలో, 18 మంది మహర్షులు చేశారు. అలా నాడు 18 యజ్ఞాలు చేసిన 18 మంది మహర్షుల పేర్ల మీదనే గోత్రనామాలు ఏర్పడినట్లు, ఉత్తరాది వారు నమ్ముతారు. వారిలో ముఖ్యుడైన గర్గ మహర్షి పేరుమీదే మొదటి గోత్రనామం ఏర్పడిందని అంటారు. రాముడి వంశంలో పుట్టిన వ్యక్తికి ఆయన ఉన్నతమైన ఆలోచనలు కొన్నైనా రాకమానవని అనడానికి, Agrasena మహారాజు ఒక ఉదాహరణ.
రామావతర పరిసమాప్తితోనే త్రేతాయుగం ముగిసి ద్వారపర యుగం మొదలైనట్లు చరిత్ర విదితం. యుగం మారడం అంటే, మానవుల ఆలోచనా విధానంలోనూ, జీవిన విధానంలోనూ మార్పూ, భూవాతారణంలో ఏర్పడేటటువంటి ఎన్నో మార్పులు గోచరిస్తాయి. అలా ఏర్పడే మార్పులకు అనుగుణంగా తన రాజ్యాన్నీ, ప్రజలనూ సమాయత్తం చేసి, ఉన్నత విలువలతో సుభిక్షమైన రాజ్యాన్ని స్థాపించనవాడే, చరిత్రలో గొప్ప రాజుగా కీర్తించబడతాడు. Agrasena మహారాజు కూడా ఆ కోవకు చెందినవాడే. ఆయన కాలం వరకు వివిధ వర్ణాల వారు, వేర్వేరు పనులు చేసుకుంటూ జీవించేవారు. ముఖ్యంగా వ్యవసాయం, పాడి పంటలపైనే ఎక్కువగా ఆధారపడేవారు. కానీ వాటితోపాటు దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాపారం, యుద్ధ కళలు కూడా తెలిసి వుండాలని తలచి ఆచరించిన వ్యక్తే Agrasena మహారాజు.
దాదాపు 108 ఏళ్ల పాటు Agrasena మహారాజు జీవించినట్లు చరిత్రకారుల అంచనా. ఆయన తన రాజ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు, రాజ్యంలోని ప్రతి ఒక్కరికీ వ్యవసాయం, పాడి పంటలు, ఇతర కుల వృత్తులతో పాటు, వ్యాపారం, యుద్ధ విద్యలపై పూర్తి అవగాహన ఇప్పించాడు. అంతేకాకుండా ప్రత్యేకమైన వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసి, దేశ విదేశాలలో వ్యాపారాలు నిర్వహించడంలో ఎన్నో మెళకువలు నేర్పించాడు. అలా ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజ్యంగా Agrasena మహారాజు పాలించిన Agroha రాజ్యం భాసిల్లినట్లు, చరిత్రకారులు చెబుతున్నారు. Agrasena మహారాజు తీసుకువచ్చిన ఆ మార్పుల కారణంగా, కొన్ని యుగాలపాటు Agroha రాజ్యం విదేశీ శక్తుల చేతులలో చిక్కకుండా, అత్యంత పటిష్టంగా ఉన్నట్లు చరిత్రద్వారా తెలుస్తోంది.
ఆ తరువాత శ్రీకృష్ణ జననం, కురుక్షేత్ర యుద్ధంతో ద్వాపర యుగం చివరికి వచ్చింది.. మురళీధరుడి అవతార పరిసమాప్తితో, కలియుగం ప్రారంభమయ్యింది.. మళ్ళీ ఎన్నో మార్పులు చోటుజేసుకున్నాయి.. అలా కొన్ని వేల ఏళ్లు గడిచాయి. ఈ లోపు ప్రపంచంలో కొత్త మతాలు పుట్టుకొచ్చాయి. అకారణంగా ఇతర రాజ్యాలపై దండెత్తడమూ, సంపదల దోపిడీలూ మొదలయ్యాయి. అలా 11వ శతాబ్దం వచ్చేసరికి, ఎడారి మతాలు తూర్పు, దక్షిణ ఆసియా దేశాలపై దండయాత్రలు, దమనకాండలూ మొదలు పెట్టాయి. అలా మన దేశంపై దండెత్తి వచ్చిన అతి క్రూరమైన వ్యక్తి మొహ్మద్ ఘోరీ. అతను మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చినప్పుడు, హర్యానాలోని Agroha రాజ్యం బాగా దెబ్బతిన్నది. దాంతో నాడు అత్యధిక సంఖ్యలో అక్కడి వారు వేరే ప్రాంతాలకు వలసలు వెళ్లారు. అలా వెళ్ళినవారిలో కొంతమంది ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ వంటి ప్రాంతాలకు వెళ్ళగా, అధిక సంఖ్యలో జనం రాజస్థాన్ లోని Marwari ప్రాంతానికి చేరుకున్నారు.
ఆ Marwari ప్రాంతాన్నే పూర్వం Maru Pradesh.. Maruwar అని కూడా పిలిచేవారు. Maru అంటే ప్రాణం లేనిది, పూర్తిగా మరణించినదని అర్ధం. రాజస్థాన్ లో అత్యధిక శాతం ఎడారి ప్రాంతం కావడం చేత, ఆ ప్రాంతానికి Maruwar అన్న పేరు స్థిరపడింది. కాలగమనంలో అది Marwar, Marwari గా రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది. ఇక Ghori కారణంగా అధిక సంఖ్యలో Marwar ప్రాంతానికి తరలివచ్చిన Agroha ప్రజలు, అక్కడ వ్యవసాయం చేయడానికి వీలు లేక పోవడంతో, కుటుంబ పోషణ కోసం వారికి తెలిసిన ఇతర పనులపై ఆధారపడ్డారు. హస్తకళాలు, కులవృత్తులతో పాటు, అవకాశం ఉన్న ప్రతి దానితో వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. చాలా మంది, స్థానిక రాజ్ పుత్ రాజుల సేనలో పనిచేయడం, ముఖ్య సలహదారులుగా కూడా మెలిగేవారు. అలా రాజస్థాన్ లోని నాటి ప్రాంతాలను సుసంపన్నమైన రాజ్యాలుగా మార్చడంలో వారు ముఖ్య భూమికను పోషించారు.
ఇదిలా ఉంటే, 13 వ శతాబ్దంలో నాటి రాజస్థాన్ లోని Mewar రాజ్యంపై అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి చేసి ఆ రాజ్యాన్ని దోచుకోవడంతో, Agroha వాసుల పరిస్థితి మరోసారి అగమ్యగోచరంగా మారింది. పెద్ద సంఖ్యలో రాజస్థాన్ వ్యాప్తంగా ఉన్న వారు, దేశంలోని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళి, అక్కడ కూడా వ్యాపారం, సైన్యంలో చేరడం వంటివి మొదలుపెట్టారు. అలా నాడు Marwari ప్రాంతం నుంచి వచ్చిన వారు కావడంతో, వారిని మార్వాడీలని పిలిచేవారు. Agroha పతనంతో ప్రయాణం మొదలై, ఎడారి ఇసుకలో కూడా బంగారం పండించవచ్చు, వజ్రాలు వెలికి తీయవచ్చని ప్రపంచానికి చాటిన మార్వాడీలు, దేశంలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడుతూ, వ్యాపారాలు చేస్తూ సంపన్నులుగా మారడమే కాకుండా, ఆయా రాజ్యాల ఆర్ధిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు.
వారి వ్యాపార దక్షతకు ముచ్చటపడిన ముస్లిం రాజులు కూడా, తక్కిన హిందూ సముదాయంతో పోలిస్తే, వారికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ముస్లిం రాజులు అలా చేయడం వెనుకవున్న ముఖ్యకరాణాలలో, మార్వాడీలు చేసే వడ్డీ వ్యాపారం ఒకటి. తమ దగ్గరున్న డబ్బును వృద్ధి చేయడానికి వారు, చిన్న చిన్న పనులు చేసుకునే వారి నుంచి, రాజ్యాలనేలే రాజులవరకూ వడ్డీకి డబ్బులిచ్చే వ్యాపారం మొదలుపెట్టారు. అలా ఇచ్చిన అప్పు కట్టని వారి నుంచి దాన్ని రాబట్టుకునే ఎన్నో విధానాలు కూడా కనిపెట్టారు. నేటికీ మన బ్యాంకింగ్ రంగంవారు ఆ విధానాలనే అనుసరిస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు ప్రపంచంలో బ్యాంకింగ్ వ్యవస్థకు ఆజ్యం పోసింది మార్వాడీ కమ్యూనిటీకి చెందిన Jagat Seth అనే వ్యాపారి.
ఆయన ఒక జైన మార్వాడీ. అసలు మార్వాడీ అంటే ఒక కులం కాదు.. మార్వాడీలు అనేక కులాలకూ, మతాలకూ చెందిన ఒక కమ్యూనిటీ. ముందు చెప్పుకున్నట్లు, రాజస్థాన్ లోని Marwari ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ మార్వాడీలనే పిలుస్తారు. కాలగమనంలో వారు జైన, బౌద్ధ మతాలలోకి కూడా వెళ్లారు. అసలు బ్రిటీషర్లు వచ్చిన తర్వాత వాటిని వేరే మతాలుగా పేర్కొన్నారు కానీ, అంతకు పూర్వం హిందూత్వంలోని రెండు సంప్రదాయలుగా మాత్రమే వాటిని చూసేవారు. ఉదాహరణకు శైవ, వైష్ణవ సంప్రదాయాలలాగానే.. అయితే ఈ రెండు సాంప్రదాయాలలో శివకేశవులను కొలిస్తే, జైన, బౌద్ధాలలో గురువులను ఆరాధిస్తారు. సిక్కు కమ్యూనిటీ కూడా జైన, బౌద్ధం లాగానే. అలా జైన సంప్రదాయాన్ని ఆచరించిన వంశంలో పుట్టిన వ్యక్తే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న Jagath Seth.
అసలు Seth అనే పదంలోనే ఆయన కుటుంబ నేపద్యం దాగి ఉంది. Seth అనే పదానికి వ్యాపారి, banker, ఖజానా రక్షకుడు, ఖజానా అధికారి వంటి పలు అర్ధాలున్నాయి. పూర్వం వడ్డీ వ్యాపారం చేసేవారినీ, ఖజానా అధికారులుగా వ్యవహరించే వ్యక్తులనూ Seth లని పిలిచేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే, Seth అంటే ఆ వ్యక్తి చేసే పని. అదే కాలగమనంలో ఇంటిపేరుగా మారింది. పూర్వం ఎక్కువగా మార్వాడీ సముదాయానికి చెందిన వ్యక్తులే ఖజానా బాధ్యతలను చూసుకోవడంతో, ఆ కమ్యూనిటీ వారికే Seth అనే పేరు నిలిచిపోయింది. Jagat Seth వంశం కూడా అలాంటి వారే అవ్వడంతో, ఆయన చిన్నప్పటి నుంచే సిరిసంపదల మధ్య పెరిగాడు. ఆ సంపదలను ఆయన వృద్ధిచేయడంతో పాటు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు. నిజానికి Jagat Seth అసలు పేరు Fateh Chand. ఆయన వ్యాపార దక్షత, బ్యాంకింగ్ నైపుణ్యం చూసి బెంగాల్ నవాబు ఇచ్చిన బిరుదు Jagat Seth. అప్పటి నుంచి ఆయనను అందరూ Jagat Seth గా పిలవడమే కాకుండా, ఆయన వంశానికి Seth అని ఇంటిపేరుగా మార్చేశారు. Jagath Seth అంటే అర్ధం, Banker Of The World అని. పూర్వం నుంచి Jagat Seth కుటుంబం లోని వారు వడ్డీ వ్యాపారం చేయడంతో పాటు, రాజుల కోశాగారాలను చూసుకునే అధికారులుగా వ్యవహరించడంతో, ఆయనకు డబ్బును వృద్ధి చేసే మెళకువలు వెన్నతో పెట్టిన విద్యగా అబ్బాయి.
ఆంగ్లేయుల దగ్గర గన్ పౌడర్ కొని అమ్మడంతో వ్యాపారం మొదలుపెట్టిన Jagat Seth, కొద్ది సంవత్సరాలలోనే రాజులకు సైతం అప్పులు ఇచ్చే వ్యక్తిగా ఎదిగాడు. అంతేకాకుండా, ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజ్యంగా ఉన్న బెంగాల్ రాజ్యాన్ని, అలా సుసంపన్నంగా మార్చిన వ్యక్తే ఈ Jagat Seth. నాడు ఆయన తీసుకొచ్చిన ఎన్నో ఆర్ధిక సంస్కరణలు బెంగాల్ రాజ్యపు GDP పెరగడంలో ఎంతగానో దోహద పడ్డాయి. దాంతో అమితంగా సంతోషించిన నాటి బెంగాల్ మొఘల్ చక్రవర్తి Muhammad Shah, ఆయనకు Jagat Seth అనే బిరుదును ఇచ్చాడు. ఆయన కేవలం తన రాజుకే కాకుండా, మన దేశానికి వ్యాపరం పేరుతో వచ్చి, తమ వ్యాపార సామ్రాజ్యాలను నెలకొల్పిన బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ వారికి కూడా అప్పులు ఇచ్చేవాడంటే, ఆయన దగ్గర ఎంత సంపద ఉండేదో అర్ధంచేసుకోవచ్చు. అసలు బ్యాంకింగ్ లోని మెళకువలను బ్రిటీషర్లు నేర్చుకున్నది కూడా ఆయన దగ్గరే అని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ కాలంలో ఆయన దగ్గరున్నంత డబ్బు, ఇంగ్లాండ్ లోని అన్ని బ్యాంకులలోనూ కలిపినా సరితూగేది కాదని చరిత్రకారులంటున్నారు. ఇక ఎంత సంపన్నుడో, అంతటి దాన గుణం గల వ్యక్తిగా ఆయనను చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఆయన ఎన్నో ఆలయాల పునర్నిర్మాణానికి విరాళాలు ఇచ్చేవాడు. నిత్యం అన్నదానం చేయించేవాడు. అవసరం ఉన్న వ్యక్తులకు డబ్బు దానం కూడా చేసేవాడు. ఇలా దాన ధర్మాలు చేసినా, ఆయన వ్యాపార దక్షత ఆయనను ప్రపంచంలోనే No 1 బ్యాంకర్ ని చేసింది.
సాధారణంగా మార్వాడీలు పిసినారులు, డబ్బు కోసం శత్రువులతో కూడా చేతులు కలుపుతారని ప్రచారం చేస్తూ ఉంటారు కొందరు. అదే నిజమైతే రాజస్థాన్ లో విలాసవంతమైన కోటలు, భవనాలు వెలిసేవే కావు. అదే నిజమైతే మార్వాడీల పెళ్ళిళ్ళు అంగరంగ వైభవంగా జరగవు. అదే నిజమైతే, అసలు స్వాతంత్ర్య ఉద్యమానికి అంతటి శక్తి కూడా ఉండేది కాదని చరిత్ర చెబుతుంది. డబ్బును సంపాదించే వ్యక్తి దాన్ని ఖర్చుపెట్టే విషయంలో కొంత జాగ్రత్తగానే ఉంటాడు. అలాగే మార్వాడీలు కూడా.. డబ్బు సంపాదించడం వారి నరనరాలలో ఇమిడి ఉంది. మరి అలా సంపాదించిన డబ్బును కాపాడుకోవడం కూడా ముఖ్యమేకదా.. అందుకే వారు అడిగిన ప్రతి ఒక్కరికీ డబ్బు ఇవ్వకపోవచ్చు కానీ, అవసరమైన చోట, అవసరమైన సమయంలో ఆ డబ్బును విరివిగా పంచడంలో ఏ మాత్రం సంకోచించరని ఎన్నో సంఘటనలు తెలియజేస్తాయి. ఉదాహరణకు, నాడు స్వాతంత్ర్య ఉద్యమానికి కావలసిన డబ్బును సమకూర్చడంలో బిర్లా కుటుంబీకులదే పై చేయిగా పేరు తెచ్చుకున్నారు.
బ్రిటిషర్లకు వంతపాడి మార్వాడీలు బాగా డబ్బులు పోగేశారని నిందించేవారూ ఉన్నారు. కానీ, ఇదే మార్వాడీలు నాటి బ్రిటిష్ ఇండియా వ్యాపారాన్ని ఛాలెంజ్ చేసి, మన దేశంలో బ్రిటిష్ వారి కంపెనీల ఎదుగుదలకు బ్రేకులు వేశారు. ‘Ghanshyam Das Birla’.. ఈయన GD Birla గా సుపరిచితం. నాడు బ్రిటిష్ కంపెనీలతో పోటీ పడి, కాటన్, షుగర్, జూట్ ఇండస్ట్రీలను తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ‘Ramakrishna Dalmia’.. Cement, Paper, News Paper, Banking, Aviation, Railways వంటి ఎన్నో రంగాలలో బ్రిటిష్ కంపెనీలను వెనుకకు నెట్టి, భారతీయ వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. ఆఖరికి ప్రపంచ ట్రేడింగ్ తమ గుప్పెట్లో ఉందని విర్రవీగిన బ్రిటీషర్లకు, Trading Firm పెట్టి, పెద్ద తలనొప్పిగా మారిన వ్యక్తి, మార్వాడీ కమ్యూనిటీకి చెందిన Bhagoti Ram Poddar. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మార్వాడీలు అత్యంత కఠినమైన సమయాల్లో కూడా సామ దాన దండోపాలను ప్రయోగించి, భారతీయ వ్యాపార సామ్రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచగలిగారు. నాడు వారే లేకపోతే నేడు భారత దేశంలోని సంస్థలన్నీ విదేశీయులవే అయ్యి ఉండేవి.
మరి ఇంత చేసి, ఇంత గొప్ప నేపద్యం ఉన్న మార్వాడీలపై సమాజంలో ఎందుకీ వ్యతిరేకత వచ్చిందనే సందేహం సహజమే. అందుకు సమాధానం ‘కుట్ర’. సాధారణంగా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. అలాగే మార్వాడీ కమ్యూనిటీకి చెందినవారు కూడా కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. అలాగని ఒక్కరు చేసిన తప్పులను మొత్తం కమ్యూనిటీకి ఆపాదించి, వారిపై వ్యతిరేకత పెంచుకోవడం అంటే, మనగొయ్యి మనం తవ్వుకున్నట్లే. పూర్వం నుంచి ఆర్ధికంగా బాగా బలపడిన మార్వాడీ కమ్యూనిటీని దెబ్బతీస్తే, భారత దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసినట్లే. ఈ సూత్రాన్ని ఎప్పుడో బ్రిటిష్ వారు రచించి, నేటికీ మన దేశంలో అమలు అయ్యేలా చూస్తున్నారు. దానికి మన కుహనా మేధావులు వంత పాడుతున్నారు. అందుకు మార్వాడీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు కొంతమంది చేసిన చిన్న చిన్న తప్పులను భూతద్దంలో చూపించి, రాజకీయ స్వలాభాలను పొందుతున్నారు. నేడు తెలంగాణాలో జరుగుతున్న గొడవ కూడా అటువంటిదే.
మార్వాడీలలో ఒక కట్టుబాటు ఉంది. వారి కమ్యూనిటీకి చెందిన వారిని వృద్ధిలోకి తీసుకురావడానికి, తక్కువ వడ్డీతో అప్పులు ఇచ్చి, ఏదో ఒక వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి సహాయం చేస్తారు. అదంతా ఒక అవగాహనతో జరిగే వ్యవహారం. అటువంటి వారిలోనూ విభేదాలు ఉంటాయి. ఒకరి వ్యాపారాన్ని ఒకరు కులదోసుకోవాలని చూస్తారు. మరి వారు కూడా మనుషులే కదా. కానీ అధికశాతం, తోటి మార్వాడీలను ఆర్ధికంగా నిలబెట్టాలనే ప్రయత్నిస్తారు. ఇతర కమ్యూనిటీలలో ఇటువంటి తోడ్పాటు లేక, వ్యాపార పరంగా అంతగా రాణించలేకపోతున్నారు. దాంతో మార్కెట్ లో ఏర్పడిన ఆ గ్యాప్ ని మార్వాడీలు ఫిల్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో వారు చిన్న చిన్న ఊర్లకి కూడా చేరుకున్నారు. ఈ విషయంలోనే అసూయలూ, కోప తాపాలూ పుట్టుకొచ్చాయి. అవి అవకాశవాద రాజకీయాలు చేసేవారికీ, దేశ ఆర్ధిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలనుకునే దుష్టశక్తులకూ తోడ్పడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని, పక్కవాడి ఎదుగుదలను చూసి అసూయ పడకుండా, దేశ విచ్ఛిన్న రాజకీయ ఎత్తుగడలకు లొంగకుండా, స్వీయ అభివృద్ధీకీ, తద్వారా దేశ అభివృద్ధికీ నడుం బిగిద్దాము..
జై భారత్!

Comments
Post a Comment