The Bengal Files: Uncovering The Darkest Chapter of India's Past | ఎవరు కారకులు?
బెంగాల్ ఫైల్స్.. ఆ నరమేధం గురించి తెలిస్తే చలిజ్వరం రావడం ఖాయం..!
‘Vivek Agnihotri’, ఇప్పుడు ఈ పేరు మరోమారు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు కారణం ఈయన తీసిన కొత్త సినిమా.. Controversial డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న Vivek Agnihotri గతంలో తీసిన సినిమాలలో మూడు సినిమాలు కుహనా రాజకీయ నాయకులను కలచివేయగా, రెండు సినిమాలు మాత్రం యావత్ భారత దేశ దృష్టిని ఆకర్షించేలా చేశాయి. ఆకర్షించడమే కాదు, సామాన్యుల నుంచి రాజకీయనాయకుల వరకూ పెద్ద చర్చలే పెట్టుకున్నారు. అవే కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్. ఇవికాకుండా ఇప్పుడు మరో సినిమా రిలీజ్ అయ్యింది. ఇది మరోసారి దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవలం ట్రైలర్ దెబ్బకే, ఆ సినిమాని తమ రాష్ట్రంలో ఆడనివ్వం అని ప్రకటన కూడా చేసింది. అదే Bengal Files. Vivek Agnihotri బెంగాల్ ఫిల్స్ పేరుతో సినిమా ఎందుకు తీశారు? అసలు బెంగాల్ లో ఆ నాడు ఏం జరిగింది..? మమతా బెనర్జీ ఈ సినిమాని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేసింది? ఈ సినిమా విషయంలో ఆమె ఎందుకు భయపడుతోంది.. వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/KVSDAneFAS4 ]
Background లో తగలబడుతున్న అమ్మవారి బొమ్మను చూపిస్తుండగా.. If Kashmir Files Hurt You.. Bengal Files Will Haunt You.. అనే పదాలు ట్రైలర్ చివర గమనించవచ్చు. నిశితంగా చూస్తే అక్కడ తగలబడేది బొమ్మకాదనీ, చిత్ర హింసలు పెట్టి మాన ప్రాణాలు హరించబడిన ఒక స్త్రీని అలా కాళీ మాత బొమ్మగా తగలబెట్టినట్లు సినిమాలో వివేక్ చూపించబోతున్నారని కొంతమంది సినీ క్రిటిక్స్ అభిప్రాయం. ఈ మాటలు వినగానే, Bengal Files Will Haunt You అనే పదాలు ఎందుకు ట్రైలర్ ఆఖరున చెప్పాడో అర్ధం అయ్యే ఉంటుంది. కాశ్మీరీ పండిట్ లపై జరిగిన దారుణాల గురించీ, 90లలో వాళ్ళపై జరిపిన మారణ హోమం గురించీ వినే ఉంటారు. కేరళ లో ఇతర మతాలు చాలా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా ప్రేమపెళ్లి పేరుతో హిందూ మహిళలను క్రిస్టియానిటీలోకీ, ఇస్లాంలోకీ మారుస్తున్నారు. ఇతరమతాల వారు ధనబలం, మంది బలంతో.. హిందువులపై ఏదో ఒక విధంగా ప్రెజర్ తెచ్చి, వారిని ఆయా మతాలలోకి మారుస్తున్నారు. అందువల్ల పరశురామ నిర్మిత కేరళలో నేడు హిందువులే మైనారిటీలై పోయారనే విషయం తెలిసే ఉంటుంది.
ఇక బెంగాల్ లో జరిగిన ఓ దారుణం గురించి చాలా మందికి తెలియదు. ఇంకా చెప్పాలంటే, నేటి తరం బెంగాల్ యువతలో కూడా చాలా మందికి ఆ దారుణం గురించి తెలిసి ఉండదు. అసలు బెంగాల్ లో జరిగిన మారణ హోమం ఏంటి..? Bengal Files Will Haunt You అని డైరెక్టర్ ఎందుకు అన్నాడో తెలియాలంటే, 70 ఏళ్ల క్రితం అక్కడ జరిగిన కొన్ని అమానవీయ సంఘటనల గురించి తెలుసుకోవాలి. 1947 అని అనగానే, అది భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం అని వెంటనే అంటారు. కానీ మన దేశంలో ఆ నాడు జరిగిన దారుణ మారణ హోమం, రాక్షస శక్తులు చేసిన వికృత విలయతాండవంతో ఉప్పొంగిన రుధిర సంద్రం గురించి, చాలా మందికి తెలియదు.
సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామ రాజు, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆజాద్, ఝాన్సీ లక్ష్మీ భాయి.. ఇలా ఎంతో మంది వీరులు మన దేశాన్ని బ్రిటిష్ భానిస సంకెళ్ల నుంచి విడిపించడానికి, తమ తమ పద్దతులలో ఎన్నో పోరాటాలు చేశారు. ఆ క్రమంలో చాలా మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. వాళ్ళ త్యాగాల ఫలితంగా మాత్రమే, మనకు 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. బ్రిటిష్ పాలకులు మనకు స్వాతంత్ర్యం ప్రకటిద్దామని అనుకున్న మరుక్షణం నుంచి, అతిపెద్ద కుట్రకు తెరతీశారు. అదే ఇండియా పాకిస్తాన్ విభజన. తాము వదిలిపోబోయే దేశాలు ఏదో ఒక రోజు అభివృద్ధిలో తమను దాటి పోతాయని భావించి, ఆయా దేశాలు ఆర్ధికంగా ఎదగకుండా ఉండటానికి ఏదో ఒక తీవ్రమైన సమస్యను సృష్టించేవారు. అదే విధంగా మన అఖండ భారత దేశంపై బ్రిటిష్ పాలకులు చేసిన కుట్ర, భారత్ ని ముక్కలు చేయడం.
ఆ ప్రయత్నంలోనే ముందుగా నేపాల్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్ వంటి దేశాలను వేరు చేశారు. కానీ మన దేశాన్ని ఆర్ధికంగా దెబ్బకొట్టడానికి అది సరిపోదు. అందువల్ల వారు రచించిన కొత్త వ్యూహం, హిందూ, ముస్లింల మధ్య చీలిక తేవడం. ఈ వ్యూహాన్ని అమలు చేయడానికి బ్రిటిష్ పెద్దలు మహ్మద్ అలీ జిన్నాను ఎంచుకున్నారు. పుట్టకతోనే ధనవంతుడు, విద్యావంతుడైన జిన్నా, మిగిలిన స్వాతంత్ర్యోద్యమకారుల లాగానే కాంగ్రెస్ లో చేరి బలం పుంజుకున్నాడు. అతని మనస్సు విషపూరితం కావడంతో, Muslim League అనే కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. అందులో దాదాపు మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ అంతా సభ్యులుగా చేరారు. మరీ ముఖ్యంగా నేటి పాకిస్థాన్, బెంగాల్ లోని ముస్లిమ్స్ చాలా యాక్టివ్ గా ఉండేవారు.
దేశానికి స్వాంతంత్ర్యం వచ్చే రోజులు దగ్గరపడుతున్నకొద్దీ, ముస్లింల కోసం ప్రత్యేకమైన దేశం కావాలనే నినాదం బలపడుతూ వచ్చింది. ఆ క్రమంలో ఎన్నో మత ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా Muslim League పార్టీ కార్యకర్తలు, మన దేశంలో ఎంతమంది హిందువులను చంపితే అంత త్వరగా పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడుతుందనే విషాన్ని విరజిమ్మారు. పర్యవసానం ఎంత దారుణంగా ఉండిందో మాటల్లో చెప్పలేము.
జిన్నా, అతని మద్దతుదారుల ఒత్తిళ్ళూ, దేశంలో జరుగుతున్న నరమేధం, వెరసి పాకిస్తాన్ ఏర్పాటుకు మార్గం సుగుమం చేస్తున్న రోజులవి. ఇదంతా బ్రిటీష్ రాక్షసులు వెనకుండి ఆడించిన వికృత క్రీడ. అయితే, అప్పట్లో బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ లో భాగంగా ఉండేది. దాన్ని East Pakistan అనీ, ఇప్పుడున్న పాకిస్తాన్ ని West Pakistan అనీ పిలిచేవారు. అయితే East Pakistan విభజన జరిగినప్పుడు, బెంగాల్ ని రెండు ముక్కలు చేయాలని నిర్ణయించారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు మరికొన్ని చిన్నా చితకా ప్రాంతాలను కలిపి East Pakistan గా మార్చారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్నే బంగ్లాదేశ్ అంటున్నాం. ఇక బెంగాల్ లో పశ్చిమ భాగం, West Bengal పేరుతో మన దేశంలో ఒక రాష్ట్రంగా మారింది. East Pakistan లో పాడి పంటలతో పాటు వాణిజ్య పంటలైన పత్తి, చెరకు, వెదురు, పొగాకు లాంటి ఎన్నో రకాలైన పంటలు విరివిగా పండేవి. కానీ ఆ పంటలను process చేసి విదేశాలకు అమ్మి, భారీ లాభాలను తెచ్చిపెట్టే కంపెనీలు మాత్రం, కోల్‌కతాలో ఉన్నాయి. ఈ వ్యత్యాసమే చరిత్రలో అత్యంత దారుణమైన, అమానవీయ ఆధునిక రాక్షస చర్యకు దారితీసింది.
సాధారణంగా ఏదైనా కావాలంటే.. అడిగి తెచ్చుకోవడమో, దక్కని పక్షంలో శాంతియుతంగా పోరాటాలో చేసి సాధించుకుంటాము. ఇతర దేశం వారితోనైతే సైనిక చర్యతో బలాబలాలు నిరూపించుకుని తెచ్చుకుంటాము. కానీ Muslim League అనుచరుల ఆలోచన మాత్రం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. తమకు కావలసినవి ఎదుటి మతంలోని వారి మాన ప్రాణాలను ఎంత దారుణంగా హరిస్తే, అంతటి విజయం తమకు దక్కుతుందని వారు ఆలోచిస్తారు. కోల్‌కతా లేని East Bengal వేస్ట్ అని భావించాడు నాటి Muslim League నాయకుడు Huseyn Shaheed Suhrawardy. అతను దేశ విభజనకు ముందున్న బెంగాల్ ముఖ్య మంత్రి. బ్రిటిష్ ఇండియా మన దేశాన్ని పాలించిన సమయంలో, కోల్‌కతా Financial Capital గా ఉండేది. దాంతో ఆ నగరం సర్వ హంగులతో బాగా డెవలప్ అయ్యి ఉండేది. ముఖ్యంగా కోల్‌కతా పరిసర ప్రాంతాలలో నాడు లేని ఫ్యాక్టరీ లేదు. బ్రిటిష్ వారికి ఆ కాలంలో కోల్‌కతా భారీ ధనాన్ని ఆర్జించి పెట్టే బంగారు బాతు లాంటిది. ఆ బాతు తమ దగ్గర ఉంటేనే East Pakistan కి ఆర్ధికంగా ఎటువంటి ఢోకా ఉండదని భావించాడు Suhrawardy. అయితే కోల్‌కతా హిందూ Dominated ప్రాంతం కావడం చేత, అది భారత దేశంలో కలిసిపోయింది. ఆ నగరాన్ని ఎలాగైనా లాక్కోవడానికి Suhrawardy హింస రచన చేశాడు.
ముందుగా ప్లాన్ ప్రకారం, పోలీస్ వ్యవస్థలో మార్పులు చేశాడు. నాడు కోల్‌కతా నగరంలో ఉన్న హిందూ పోలీసులను వేరే దూర ప్రాంతాలకు transfer చేయించాడు. ఆ తర్వాత వాళ్ళ స్థానంలో పోలీసులలో పనిచేస్తున్న ముస్లిమ్స్ ని తీసుకొచ్చాడు. అలా పోలీసుల transfers అయ్యాక ఒక తేదీని నిర్ణయించాడు. అదే August 16.. 1946. అంటే, మనకి స్వాతంత్ర్యం రావడానికి సరిగ్గా సంవత్సరం ముందు. ఆ రోజునే Suhrawardy ఎందుకు నిర్ణయించాడంటే, ఆ సమయంలో ముస్లింల రంజాన్ మాసం నడుస్తోంది. August 16, రంజాన్ మాసంలో 18వ రోజు. ఆ రోజున ముస్లిం మత స్థాపకుడైన Prophet Muhammad తన సైన్యంతో అతి పెద్దదైన Quraysh తెగను యుద్ధంలో ఓడించాడు. దానినే Battle of Badr అని పిలుస్తారు. ఆ విజయం ముస్లింల భవిష్యత్తును మార్చేసింది. ఆ విజయమే భవిష్యత్తులో ముస్లిమ్స్ చేతుల్లోకి మధ్య ఆసియా వెళ్ళేలా చేసింది. అందువల్ల ఆ రోజు హిందువులపై నరమేధం మొదలు పెడితే, కోల్‌కతా నగరం తమదౌతుందని Suhrawardy భావించాడు.
ముందు నుంచే ముస్లిం పెద్దల చేత హిందూవులపై విద్వేషం కక్కే ప్రసంగాలు చేయించడం మొదలు పెట్టాడు. ఆ ప్రసంగాలకు ముస్లింలు విపరీతంగా రెచ్చిపోయారు. కోల్‌కతా నగరంలో గొడవలు మొదలయ్యాయి. ముస్లింలు ఉండే ప్రతి వీధిలో, ప్రతి దర్గాలో ఒకటే నినాదం.. హిందువులను చంపి, కోల్‌కతాను సొంతం చేసుకోవాలి. అందుకు తగ్గ instructions కూడా Suhrawardy నాయకత్వంలోని Muslim League పార్టీ కార్యాలయం నుంచి నేరుగా అందేవి. ఉర్దూ న్యూస్ పేపర్స్ లో కూడా హిందువులను చంపి, కోల్‌కతాను సొంతం చేసుకుని, పాకిస్తాన్ గొప్పతనాన్ని చాటమని వార్తలు వచ్చేవి.
ఇక 16th August 1946 రానే వచ్చింది.. ఆ రోజు శుక్రవారం కూడా కావడంతో పెద్ద ఎత్తున జనాలు మొదటి నమాజ్ చేయడానికి మసీదులకు వెళ్లారు. ముందుగానే Suhrawardy ఆదేశాల ప్రకారం, మసీదులో కల్మా చదవాల్సిన మౌల్వీలు హిందువులను వేటాడే విధంగా ప్రసంగాలు ఇచ్చారు. అప్పటి వరకు జరిగిన ఈవెంట్స్ తో పాటు ఆ రోజు మసీదుల్లో ఇచ్చిన తొలి ప్రసంగం ప్రతి ముస్లిం చేతికి ఒక ఆయుధం తీసుకునేలా చేసింది. ఇనుప రాడ్లు, సుత్తులు, కత్తులు, తుపాకులు.. ఇలా ఒక మనిషిని తీవ్రంగా గాయపరిచి చంపడానికి అనువుగా ఏ వస్తువు దొరికితే అది తీసుకుని నినాదాలు చేస్తూ, హిందువులు ఎక్కువుగా ఉండే ప్రాంతాలకు వెళ్ళడం మొదలు పెట్టారు.
హిందువులను చంపడానికి ముందు నుంచే ప్లాన్ చేసుకున్న Muslim League పార్టీ కార్యకర్తలు.. ముందుగానే హిందువుల ఇళ్లనూ, షాపులనూ మార్క్ చేసుకున్నారు. సాధారణ ముస్లిం ప్రజానీకానికి హిందువులను ఎలా హింసించాలి, ఎలా చంపాలి వంటి విషయాలను వివరించే కరపత్రాలను పంచారు. అందువల్ల August 16వ తేదీన మసీదుల నుంచి కత్తులు, కొడవళ్లతో బయలుదేరిన ముస్లిమ్స్ కి ఆ రోజు ఏం చేయాలో స్పష్టంగా తెలుసు. అలా దాడికి వచ్చే ముస్లిమ్స్ కి హిందువులు అందరూ దొరకాలని ఆ రోజున హాలిడే కూడా ప్రకటించాడు Suhrawardy. అందుకతను చెప్పిన కారణం, కోల్‌కతా ని ఈస్ట్ పాకిస్థాన్ లో కలపాలని భారీ ర్యాలీలు చేస్తారు కాబట్టే హాలిడే ప్రకటించానని. 16వ తేదీకి ముందే ఈ ర్యాలీకి వ్యతిరేకంగా మాట్లాడిన హిందువులపై దాడులు, హిందూ షాపులను దోచుకోవడం వంటివి చేశారు. ఇక ఆ రోజున Suhrawardy, ఇతర అధికారులతో కలిసి, లక్షలాది మంది ముస్లింలను ఉద్దేశిస్తూ, ఒక్క హిందువు కూడా కోల్‌కతాలో ఉండకూడదు, మొత్తం అందరినీ చంపేయమని చెప్పాడు.
Suhrawardy ఏర్పాటు చేసిన సభ నుంచి బయలు దేరిన ముస్లిమ్స్ ముందుగా దగ్గరలోని కత్తుల వంటి మారణాయుధాలు అమ్మే షాప్ కి వెళ్లారు. ఆ షాప్ ఓనర్ ని, అందులో పనిచేస్తున్న వ్యక్తులను కొట్టి, నడి రోడ్డుపై కూర్చోపెట్టి తలలు నరికేశారు. ఆ తర్వాత షాప్ ని దోచుకుని, కోల్‌కతాలో హిందువులు ఉండే ప్రతి ప్రాంతాలకు వెళ్లారు. ఇక అప్పటి నుంచి రెండు రోజులపాటు దొరికిన ప్రతి హిందువుని అత్యంత కిరాతకంగా చంపారు. ఇంట్లోని మగాళ్ల ముందే ఆడవారిని సామూహిక అత్యాచారం చేసి, మర్మాంగాలను కోసి చంపారు. తల్లి తండ్రుల ముందు పసిపిల్లల తలలు నరికి ఆ తలలతో ఆడుకున్నారు. ఇప్పటికీ నాడు జరిగిన దారుణాలు తలుచుకుంటే రక్తం మరిగిపోతుంది. రోజుల తరబడీ నిద్ర కూడా పట్టదు. కోల్‌కతా నగరం మొత్తం శవాల గుట్టలు. ఆ శరీరాలను ఖననం చేసేవారు లేరు. గంగానదిలో ఆ రోజు రక్తం ప్రవహించింది.
1946 August 16, 17 వ తేదీలలో Muslim League నాయకత్వంలోని ముస్లింలు కోల్‌కతా నగరంలో దాదాపు 20 వేల మందిని చంపినట్లు అంచనా. ఇది కేవలం అంచనా మాత్రమే. అసలు లెక్కలు తెలియకుండా నాటి బ్రిటిష్ ప్రభుత్వం కప్పిపెట్టేసిందనే ఆరోపణలున్నాయి. అన్ని వేలమంది చనిపోతే, కేవలం 3500 మందికి మాత్రమే దహన సంస్కారాలు జరిగాయి.
కోల్‌కతా లో ముస్లింలు ఎక్కువుగా ఉండే Lichubagan అనే ప్రాంతంలో బిర్లా గ్రూప్ కి చెందిన Kesoram Cotton Mills ఫ్యాక్టరీ ఉండేది. ఇప్పడు ఆ ప్రాంతాన్ని మినీ పాకిస్తాన్ అని పిలుస్తారు. ఆ ఫ్యాక్టరీలో ఒకప్పుడు స్థానిక ముస్లిమ్స్ తో పాటు, ఒరిస్సా నుంచి వచ్చిన 600 మంది హిందువులు పనిచేసే వారు. ఆ 600 మందిలో ఒక్కరినీ వదలకుండా 16వ తేదీన దారుణంగా చంపేశారు. Syed Abdullah Farooqui ఆ కాటన్ మిల్ వర్కర్స్ కి ప్రెసిడెంట్, స్థానిక కమ్యూనిస్ట్ లీడర్. అతనికి Muslim League తో ఏ సంబంధం లేదు. కానీ ఆ రోజు 600 మంది ఒరిస్సా హిందూ వర్కర్స్ ని అత్యంత దారుణంగా చంపించింది అతడే. అప్పటి వరకు హిందువులతో తిరిగి, హిందువులతో స్నేహం చేసిన దాదాపు ప్రతి ముస్లిం, మారణాయుధం చేతపట్టి, తోటి కార్మికులను చంపాడు.
నాడు Suhrawardy నమ్మకం ఏంటంటే, హిందువులు పిరికివాళ్ళు, వాళ్ళు తిరిగి దాడి చేయరు, కోల్‌కతా వదిలి పారిపోతారని బలంగా నమ్మాడు. అసలు Suhrawardy ప్లాన్ కేవలం కోల్‌కతానే కాదు, పూర్తి బెంగాల్ ని East Pakistan లో కాలపాలని. కానీ నాడు కోల్‌కతాలో తప్ప, బెంగాల్ లోని చాలా ప్రాంతాలలో హిందువుల జనాభా చాలా ఎక్కువగా ఉండేది. హిందువుల ఆధిక్యం ఉన్న చోట నరమేధం సృష్టించడం కష్టం. కోల్‌కతాలో హిందువుల సంఖ్య ఎక్కువుగా ఉన్నా, ముస్లిం ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండేది. Suhrawardy కేవలం కోల్‌కతాని టార్గెట్ చేయడానికి ఇది ఒక కారణమని చరిత్రకారులు చెబుతున్నారు. Suhrawardy అంచనా ప్రకారం 10 వేల మంది హిందువులను చంపితే, మిగిలిన వారంతా కోల్‌కతా వదిలి వెళ్లిపోవాలి. అతననుకున్న విధంగానే హిందువులు ట్రైన్లు, బస్సులు, ఎడ్ల బండ్లు, ఇలా ఏది దొరికితే అది పట్టుకుని పారిపోవడం మొదలు పెట్టారు. Suhrawardy అనుకున్నది నిజం అవుతున్న సమయం అది.
ఆ సమయంలో హిందువుల పాలిట ఆశా దీపంగా, Gopal Chandra Mukherjee అనే వ్యక్తి రంగ ప్రవేశం చేశాడు. అసలు నేటి బెంగాల్ ప్రజలలో చాలా మందికి Gopal Chandra Mukherjee అనే పేరే తెలియదు. కానీ అతనే నాడు హిందువులను రక్షించిన యోధుడు. కోల్‌కతా నేటికీ భారత్ లో ఉండటానికి కారణం ఆ యోధుడే. Gopal Patha అని కూడా పిలుస్తారు. Gopal బెంగాల్ బ్రాహ్మిన్ కుటుంబంలో పుట్టాడు. అందువల్ల శాస్త్రాలన్నీ తెలిసినవాడు. అయితే వారి కుటుంబ వ్యాపారం మాంసం దుకాణాలు నడపడం. అతనికి చిన్నప్పటి నుంచి కుస్తీపై మక్కువ ఉండడంతో కుస్తీ నేర్చుకుని, బెంగాల్ లో నంబర్ 1 పహిల్వాన్ గా పేరు పొందాడు. తన కుటుంబానికి చెందిన మాంసపు దుకాణాలు చూసుకుంటూనే, ఒక వ్యాయామ శాల పెట్టుకుని, అక్కడ సంప్రదాయ వ్యయమాలతో పాటు, ఔత్సాహికులకు కుస్తీ కూడా నేర్పేవాడు. అతని దగ్గర దాదాపు 500 వందల నుంచి 800 మంది కుస్తీ యోధులు ఉండేవారు. సుభాష్ చంద్రబోస్ అంటే Gopal కి ప్రాణం. ఆయన అడుగుజాడల్లో నడిచే మనిషి. ఇతనికి ఎప్పుడు ముస్లిమ్స్ తో ఎలాంటి గొడవలు లేవు. వృత్తిలో భాగంగా Gopal ఎంతోమంది ముస్లింలతో కలిసి వ్యాపారం చేసేవాడు. సహాయం కోసం వచ్చి చేయి చాచిన వారికి లేదనకుండా సహాయం చేసిన దానకర్ణుడని స్నేహితులు కొనియాడే వారు.
16, 17 తేదీల్లో హిందువులపై జరిగిన దారుణాలు చూసిన Gopal హృదయం అగ్నిపర్వతంలా బద్దలైంది. ఎలాగైనా హిందువులను రక్షించాలని నిర్ణయించుకుని, తన దగ్గర ఉన్న కుస్తీ యోధులతో పాటు, అవకాశమున్న ప్రతి హిందూ యువకుడిని పోగేసాడు. ప్రతి ఒక్కరి చేతిలో ఒక కత్తిని పెట్టి, శ్రీ కృష్ణుడు అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించినట్లు, హిందూ జన రక్షణ, ధర్మ రక్షణే తమ బాధ్యత అని బోధించాడు. అందుకోసం ఒక్కో హిందువు కనీసం 10 మంది ముస్లిమ్స్ ని చంపాలని తీర్మానం చేశాడు. స్త్రీలనూ, పిల్లలనూ ఏమీ చెయ్యవద్దని ఆదేశించాడు. అలా ఆ నాడు తనతో ఉన్న ప్రతి హిందువునూ ఒక యోధుడిలా మార్చి, నరమేధం సృష్టిస్తున్న రాక్షసులను చంపడం మొదలు పెట్టారు. Gopal నేతృత్వంలోని హిందూ యువకులు చేస్తున్న పోరాటం, ఒక్క బెంగాల్ లోనే కాకుండా, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో కూడా వ్యాపించింది. ఆ రాష్ట్రాల యువత కూడా మేల్కొని Gopal తో చేయి కలిపారు. ముస్లింల దాడుల్లో ఎక్కువగా మార్వాడీ కమ్యూనిటీ బాగా నష్టపోయారు. దాంతో వారంతా కలిసి Gopal కి కావాల్సిన డబ్బును అందించారు. మన గత వీడియోలో Go back Marwadi నినాదాన్ని గురించి మరోసారి ఆలోచించండి. తమ దూకణాలలో రాత్రింబవళ్ళు కష్టపడి, కావాల్సిన ఆయుధాలను తయారు చేశారు. ఆయుధాలు తయారు చేసే ఇతర హిందువులు కూడా అదే పని చేశారు. ఇలా వారిచ్చిన ఆయుధాలతో పాటు, మార్వాడీల డబ్బుతో తుపాకులు కూడా కొని, తన సేనకి ఇచ్చాడు Gopal. దాంతో కోపంగా ఉన్న బెబ్బులి ఉరిమీద పడితే ఎలా వేటాడుతుందో, అలా నాడు ప్రతి హిందూ యువకుడు Muslim League నాయకులను, వారికి సపోర్ట్ గా తిరిగే ముస్లిం యువకులను, వారికి వెన్నుదన్నుగా నిలిచిన పోలీసులను కూడా వదలకుండా వెంటాడి వేటాడి చంపారు.
16, 17 తేదీల్లో ముస్లింలు కోల్‌కతా నగరంలో విద్వంశం సృష్టించి విజయం తమదే అని మంచి జోష్ లో ఉన్నారు. లక్షల సంఖ్యలో ఉన్న ముస్లింలు, కోల్‌కతా లోని ప్రతి ప్రాంతాన్ని జల్లెడ పట్టడం మొదలు పెట్టారు. కానీ 18 వ తేదీ వారి ఉత్సాహాన్ని పూర్తిగా అణచి వేసింది. Gopal నేతృత్వంలో హిందువులు సన్నద్ధం అవుతున్నారని Muslim League నేతలకు కానీ, వారి సపోర్టర్స్ కి కానీ తెలియదు. దాంతో వారు ఎప్పటిలాగానే 18 వ తేదీ తెల్లవారుజామునే, హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతంలోకి వెళ్ళగానే, Gopal సేన వారిని మట్టుబెట్టారు. ఇలా 18, 19, 20 తేదీల్లో Gopal సేన, హిందువు పై చేయి ఎత్తిన ప్రతి ఒక్కరినీ తుదముట్టించారు. అంతేకాదు, ముస్లింలను రెచ్చగొట్టి హిందువులపై దాడికి వ్యూహ రచన చేసిన ప్రతి Muslim League నేతలను వెతికి మరీ చంపించాడు. ఈ యుద్ధంలో Gopal కి Jugal Chandra Ghosh, Basanth Kaur అనే ఇద్దరు వ్యక్తులు కుడి భుజంలా మారారు. వారు కూడా Gopal తో పాటు కుస్తీ చేసే యోధులే. 20వ తేదీ వచ్చేసరికి చనిపోయిన వారి సంఖ్య హిందువుల కంటే ముస్లింలది పెరిగింది. ముస్లింలకు సపోర్ట్ గా అడ్డు వెళ్ళిన Suhrawardy నియమించిన పోలీసులు ఎవరూ తిరిగి రాలేదు. దాంతో మిగిలిన వారు స్టేషన్లకే పరిమితం అయిపోయారు.
బెంగాల్ చరిత్రకారుడైన Sandip Bandyopadhyay చెప్పిన వివారాల ప్రకారం, Gopal చేసిన ఆ దాడిలో ఒక్క ముస్లిం మహిళకు కానీ, పిల్లవాడికి కానీ హాని జరగలేదు. అతను మతవాది కాదనీ, కేవలం అన్యాయంగా చంపబడుతున్న హిందువులను రక్షించడానికే కత్తి పట్టడనీ తెలుస్తుంది. అంతేకాదు నాడు భర్తలను కోల్పోయిన హిందూ మహిళలను, అనాధలైన పిల్లలను Gopal చెరదీశాడు. వారందరికి వసతి కలిపించి, తిండి బట్టా ఇచ్చి, ముస్లిమ్స్ చేతిలో చంపబడకుండా, మతం మారకుండా రక్షించాడని, Sandip Bandyopadhyay రాసిన పుస్తకాలలో తెలియచేశాడు.
Gopal చేసిన ఆ తిరుగుబాటు, కట్టర్ ముస్లిమ్స్ వెన్నులో వణుకు పుట్టించింది. కేవలం రెచ్చగొడితే రెచ్చిపోయే తక్కిన ముస్లిమ్స్ ఆయుధాలను వదిలి బ్రతుకుజీవుడా అంటూ పరుగు తీశారు. మిగిలిన కొద్దిమంది, Gopal సేన దెబ్బకి 72 హూర్లను కలవడానికి వెళ్లిపోయారు. Suhrawardy ఈ తిరుగుబాటును అస్సలు ఊహించలేదు. దాంతో అతనికి భయంతో పాటు, పూర్తి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. Suhrawardy 16, 17 తేదీల్లో కోల్‌కతాలో నరమేధం సృష్టించి, అక్కడినుంచి హిందువులను తరిమేసి, 18వ తేదీ నుంచి చుట్టూ ప్రక్కల గ్రామాలలోని హిందువులను కూడా చంపేస్తే, పూర్తిగా ఆ నగరం East Pakistan లో కలిసిపోతుందని ఆలోచించాడు. అతను అనుకున్నట్లు జరిగి ఉంటే, నేడు కోల్‌కతా బంగ్లాదేశ్ లో కలిసిపోయి ఉండేది. Gopal దెబ్బకి Suhrawardy ప్లాన్ బెడిసికొట్టింది. ఏం చేయాలో ఎక్కడికి పోవాలో తెలియని స్థితి. తాను నమ్మిన ముస్లిం యువకులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోవడంతో, August 21 వ తేదీన కొట్లాటలను ఆపేయాలని నాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరాడు. ఆ కొట్లాటలు ఆపడానికి తగిన చర్చలు జరపమని, బంగ్లాదేశ్ జాతీపితగా పిలవబడే Sheikh Mujibur Rahman ని కోరాడు. అతను కూడా Muslim Leagueలో ప్రముఖ నేత, Muslim National Guard లో ఒక అధికారి కూడా. అతను స్వయంగా వెళ్ళి గొడవలు ఆపేద్దామని Gopal Paatha ని కోరాడు. దానికి ముస్లింలు ఆయుధాలు వదిలేసి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరిగి వెళ్లిపోతే, అప్పుడు తాము కూడా శాంతిస్తామని Gopal Patha షరతు పెట్టాడు. దానికి వారు కూడా అంగీకరించిన తరువాత బెంగాల్ లో జరుగుతున్న నరమేధం ఆగిపోయింది.
Suhrawardy చేసిన డ్యామేజ్ ని దాచడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక వ్యూహం పన్నింది. దాని ప్రకారం Suhrawardy ని అధికారం నుంచి తొలగించి, అతని ప్రభుత్వాన్ని పూర్తిగా డిస్మిస్ చేసేసింది. August 21వ తేదీన నాటి భారత్ కి Viceroy గా చేస్తున్న Archibald Percival Wavell, బెంగాల్ ని, ముఖ్యంగా కోల్‌కతా ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అక్కడ సెంట్రల్ కమాండ్ ని దించి అల్లర్లు జరగకుండా గస్తీ కాయించాడు.
నాటి Muslim League నాయకులు నరమేధాన్ని కోరుకుంటే, Gopal Chandra Mukherji అనే ఒకే ఒక్క వ్యక్తి, హిందువుల మాన ప్రాణాలను కాపాడాడు. ఆ Gopal Patha అనే వ్యక్తే లేకపోతే, నేడు మనకి కోల్‌కతా నగరం ఉండేది కాదు. ఆ నగరం భారత్ లో లేకపోతే, దేశ ఆర్ధిక వ్యవస్థ ఈ రోజు వేరేలా ఉండేది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, కుహనా మేధావులు, కమ్యూనిస్ట్ నాయకులు, Gopal Patha పేరును చరిత్ర లోంచి చెరిపేయడానికి తమకు తోచిన ప్రయత్నాలన్నీ చేశారు. అసలు బెంగాల్ లో ఎలాంటి నరమేధం జరగలేదన్నట్లు ప్రవర్తించారు. భావి తరాలకు ఆ చరిత్ర తెలియకుండా, చరిత్రకారులను, కవులను, కళాకారులను ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ బెదిరించారు. బెంగాల్ ప్రభత్వం Bengal Files సినిమాను అడ్డుకోడానికి కారణం, ఓట్ల రాజకీయం. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ ని పాలించిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం, నేటి మమతా ప్రభత్వం మరో Suhrawardy లా మారి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను ప్రోత్సహిస్తూ, ముస్లిం జనాభాను పెంచడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. స్వాతంత్ర్యం తర్వాత బెంగాల్ ని పాలించిన నాయకులు, Gopal Patha అనే స్వాతంత్ర్య యోధుడికి గూండా అనే అపవాదు రుద్ది, అతని గొప్పతనాన్నీ, త్యాగాన్నీ కప్పిపెట్టడానికి ప్రయత్నాలు చేశారు. Bengal Files సినిమా గురించి TMC నేతలు ఇప్పటికీ అదే కూత కుస్తున్నారు. కానీ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలు అధికంగా స్థిరపడ్డ ప్రదేశాలలో, హిందువులపై జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడటం లేదు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి, భావి తరాలను ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి సంసిద్ధం చేస్తారని ఆశిస్తున్నాను..
ధర్మో రక్షతి రక్షితః

Comments
Post a Comment