The Dark Reign of Aurangzeb | Forgotten Chapters of Indian History of Destruction and Faith | ఔరంగ్ జేబ్
ఔరంగ్ జేబ్ ధ్వంసరచన!
ఔరంగ్ జేబ్ ధ్వంసం చేయించి సమూలంగా దోచుకున్న 9 ప్రాచీన క్షేత్రాలు!
అసలైన చరిత్రను తెలుసుకుని జాగ్రత్త పడడం మనకు అత్యవసరం. ఈ భూతలం పై ఈనాడు మనకు తెలిసిన ఏ నాగరికతా పురుడు పోసుకోక మునుపే, మన భారత దేశంలో నాగరికత తారా పథంలో ఉండేది. ఈ విషయాన్ని మన గత వీడియోలలో చాలాసార్లు చర్చించుకున్నాము. ఆదీ అంతం లేని సనాతనధర్మ ఔన్నత్యానికీ, ఆధునిక Technology తో తలపట్లు పట్టినా అంతుచిక్కని ఎన్నో అద్భుత కట్టడాలకూ మన భారతావని శాశ్వత చిరునామాగా నిలిచింది. యుగ యుగాలుగా ఎన్నో రకాలుగా రాక్షసుల దాడులు జరిగినప్పటికీ, నిరాటంకంగా, దేదీప్యమానంగా వెలుగొందిన చరిత్ర మనది. ఈ కలియుగంలో మాత్రం 11వ శతాబ్దిలో మొదలయి, ఎందరో నరరూప రాక్షసుల వల్ల శతాబ్దాల తరబడీ ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. మధ్య ఆసియా ప్రాంతం నుంచి మన దేశంపై దండెత్తి వచ్చిన తురుష్కులు, మన సంస్కృతికి పట్టుగొమ్మలైన వేలాది పురాతన ఆలయాలను నాశనం చేసి, వెలకట్టలేని సంపదలను దోచుకున్న విషయం, ప్రతి హిందువుకూ తెలిసినదే. అలా హిందూ ఆలయాలను నాశనం చేసి వాటిలోని సంపదలను కొల్లగొట్టడంలో అందెవేసిన రాక్షస హస్తాలు ఎన్నో ఉన్నా, అందులో ఔరంగ్ జేబ్ ది ప్రత్యేక స్థానం. ఇతగాడి ఘనతకు సంబంధించిన కొన్ని వివరాలతో మనం గతంలో చేసిన వీడియో లింక్ ను చూడనివారికోసం పొందుపరుస్తున్నాను. ఇతడు ఎన్ని వేల ఆలయాలను నాశనం చేశాడో కూడా మనం అంచనా వేయలేము. ఔరంగ్ జేబ్ వల్ల ధ్వంసమై, దోచుకోబడిన తొమ్మిది ప్రాచీన ఆలయాల గురించి ఈ రోజు చెప్పుకుందాము. మరి ఆ విషయాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Et2ocJM4izw ]
కొన్ని శతాబ్దాల క్రితం మధ్య ఆసియాలో పుట్టిన ఇస్లాం మతం వారు, తమ పరిధిని పెంచుకునే కుతంత్రంతో ఎన్నో ప్రాంతాలపై దాడులు చేశారు. నాటి మొఘలులు అటు యురోపియన్ దేశాల నుంచి, ఇటు తూర్పు ఆసియా దేశాల వరకు, ఎన్నో దాడులు జరిపారు. ఈ క్రమంలో 11 వ శతాబ్దం నుంచీ మన దేశంపై వారి దండయాత్రలు ఎక్కువగా జరిగాయని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ విధంగా వచ్చిన మొఘలులు మన దేశంలో మెల్ల మెల్లగా అనేక రాజ్యాలను ఆక్రమించుకుని, ఇక్కడ తమ పాలనను కొనసాగించడంతో పాటు, మన దేశ సంస్కృతిని నాశనం చేయడానికీ, హిందువుల మత మార్పిడికీ చేయని దారుణం లేదని, చరిత్ర చెబుతోంది. ఇదే క్రమంలో వారు మన దేశంలోని వేల ఏళ్ల పురాతన ఆలయాలను దోచుకుని, వాటిని పూర్తిగానో, పాక్షికంగానో ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా చాలా ఆలయాలను మసీదులుగా మార్చిన విషయం కూడా తెలిసిందే.
ఆ విధంగా హైందవ జాతినీ, సనాతన సంస్కృతినీ రూపుమాపాలని తమ శాయశక్తులా ప్రయత్నించిన మొఘలులలో ఔరంగ్ జేబ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మన దేశంలోని యుగ యుగాల చరిత్ర కలిగిన అత్యంత పురాతన ఆలయాలను సైతం ధ్వంసం చేయడంలో అతను సఫలీకృతుడయ్యాడు. అటువంటి వాటిలో ప్రధమంగా చెప్పుకోవలసిన ఆలయం, కాశీలోని విశ్వేశ్వరాలయం. సృష్టి ఆదిలో దేవతలే స్వయంగా నిర్మించిన క్షేత్రంగా కాశీకి పేరుంది. ఈ భూమిపై నిర్మించిన తొలి భారీ ఆలయంగా కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని పేర్కొంటారు చరిత్ర కారులు. అనాదిగా ప్రతి హిందువూ తన జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించి తరించాలని పరితపించే ఆలయం, కాశీ విశ్వేశ్వరుడి ఆలయం. అటువంటి ఆలయాన్ని సైతం ఔరంగ్ జేబ్ ధ్వంసం చేసాడు. అంతక ముందు కూడా కాశీ విశ్వేశ్వరుడి ఆలయంపై ఎన్నో సార్లు ముస్లింలు దాడులు చేసి, ఆలయంలోని సంపదను దోచుకోవడం, ఆలయాన్ని పాక్షికంగా దెబ్బతీయడం వంటివి చేశారు. అలా దాడికి గురయిన ప్రతిసారీ, ఆలయాన్ని భక్తులే సరిజేసుకున్నారు. కానీ ఔరంగ్ జేబ్ మాత్రం, కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఆక్రమించుకుని, దానిపై మసీదును నిర్మించాడు. ఆ మసీదునే నేడు జ్ఞాన వాపి మసీదుగా వారు పిలుచుకుంటున్నారు. కొంత కాలం క్రితం పాత కట్టడం పక్కనే నూతనంగా మరో ఆలయం కట్టినా, అసలు ఆలయం మాత్రం నేటికీ ఆ మసీదు కిందనే ఉండిపోయింది.
ఇక ఔరంగ్ జేబ్ వల్ల నాశనం అయిన మరో పురాతన శక్తి వంతమైన ఆలయం, Bhima Devi ఆలయం. ఈ ఆలయం హర్యాణా, పంజాబ్ రాష్ట్రాల రాజధాని అయిన Chandigarh కి అతి సమీపంలోని Pinjore అనే నగరంలో ఉంది. ఆది పరాశక్తి రూపాలలో ఒకటిగా Bhima Devi ని పేర్కొంటారు. Bhima Devi మాతను ఎక్కువగా శక్తి ఆరాధకులు కొలుస్తారు. బౌద్ధులు ఆరాధించే తాంత్రిక దేవతలలో Bhima Devi ఒకరని, చరిత్రకారులు చెబుతారు. అంతటి శక్తివంతమైన Bhima Devi కి కొన్ని యుగాల పూర్వమే, Pinjore పాలకులు ఒక భారీ ఆలయాన్ని నిర్మించారు. 8వ శతాబ్దంలో Bhima Devi ఆలయాన్ని చాలా విస్తారంగా, అత్యంత సుందరమైన శిల్పకళతో తీర్చి దిద్దారు. అందుకే Bhima Devi ఆలయాన్ని ఉత్తర భారత ఖజురహోగా పిలుస్తారు. అంతటి ప్రాశస్త్యంగల భీమా దేవి ఆలయాన్ని ముస్లిం పాలకులు చాలామంది ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు కానీ, 1671 లో ఔరంగ్ జేబ్ ఈ ఆలయాన్ని కూడా ధ్వంసం చేయగలిగాడు. అలా 1974 వరకూ Bhima Devi ఆలయం ఒక శిధిలాలయంగా మిగిలిపోయింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు చొరవదీసుకుని, Bhima Devi ఆలయ శిధిలాలను భద్ర పరచి, అక్కడ ఒక మ్యుజియంని ఏర్పాటు చేశారు. అక్కడికి వెళితే ఇప్పటికీ ఆ పురాతన ఆలయ శిధిలాలు 80 శాతం అక్కడి ఖాళీ స్థలంలో పడి ఉండటం గమనించవచ్చు.
ఇదే విధంగా ఔరంగ్ జేబ్ వల్ల నాశనమై, నేటికీ శిధిల స్థితిలో ఉన్న మరో ఆలయం, Beejamandal ఆలయం. ఈ ఆలయం మధ్య ప్రదేశ్ లోని ప్రఖ్యాత Khajuraho సమీపంలోని Jatkara గ్రామానికి దగ్గరలో ఉంది. Beejamandal ఆలయాన్ని విజయ ఆలయం అని కూడా పిలుస్తారు. 8వ శతాబ్దంలో Beejamandal ఆలయాన్ని నిర్మించినా, 11 వ శతాబ్దంలో Paramara వంశానికి చెందిన Naravarma మహారాజు మరింత అభివృద్ధి చేశాడు. ఈ ఆలయంలో శక్తి రూపాలలో ఒకటైన Charchika మాతను ప్రతిష్టించారు. మధ్యప్రదేశ్, ఒరిస్సా వంటి ప్రాంతాలలో, పూర్వం చాముండి మాతనే, Charchika మాతగా పిలిచేవారు. ఇప్పటికీ ఆ ప్రాంతాలలో ఎన్నో Charchika ఆలయాలున్నాయి. Beejamandal ఆలయంలో ప్రతిష్టించబడిన Charchika మాతను నిష్టగా కొలిచే, Naravarma మహారాజు ఎన్నో విజయాలను సాధించాడనీ, అందుకే ఈ ఆలయాన్ని విజయ ఆలయం అని కూడా పిలుస్తారనీ, చరిత్రకారులు చెబుతారు. అంతటి శక్తివంతమైన ఆలయాన్ని ఔరంగ్ జేబ్, 1682 లో పూర్తిగా ధ్వంసం చేసి, దానిపై Alamgir అని పిలువబడుతున్న మసీదును స్థాపించాడు. ఆ నాటి నుంచి ముస్లింలు ఆ మసీదులో ప్రార్ధనలు చేసుకోవడం మొదలు పెట్టారు. అయితే 1991 వ సంవత్సరంలో కురిసిన భారి వర్షాల వల్ల ఆ మసీదు గోడ ఒకటి కూలిపోయింది. దానితో ఇంచుమించు మూడు వందల సంవత్సారాల తర్వాత అక్కడ ఎన్నో హిందూ దేవుళ్ళ విగ్రహాలు బయటపడ్డాయి. అందువల్లే అక్కడో పురాతన ఆలయం ఉండేదనీ, దానిపై మసీదు నిర్మించబడిందనే వాదనకు సాక్ష్యాలు దొరికాయి. ఈ విషయం అప్పట్లో పెద్ద చర్చకు దారి తియ్యగా, Archaeological Survey of India వారు ఆ ప్రాంతాన్ని తమ అధినంలోకి తీసుకుని investigation మొదలు పెట్టారు. హిందూ, ముస్లిం ల మధ్య ఘర్షణలు చేలరగకుండా, అక్కడ ఎవరూ ప్రార్ధనలు చేయకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అలా ఈనాటికీ Beejamandal ఆలయానికి సంబంధించిన తీర్పు కోర్టులోనే ఉండిపోయింది.
ఇక ఔరంగ్ జేబ్ వల్ల దెబ్బతిన్న మహత్తర ఆలయాలలో, Chausath Yogini ఆలయం మరొకటి. ఇది కూడా మధ్య ప్రదేశ్ లోని Morena జిల్లాలో, Mitaoli గ్రామానికి దగ్గరలో ఉంది. హైందవ సంప్రదాయంలో ఆది పరాశక్తి ప్రతి రూపమైన యోగినీ శక్తిని కొలవడం అనాదిగా వస్తోంది. మొత్తం 64 మంది యోగినిలున్నారు. ఆ 64 మంది యోగినులనూ, అమ్మవారినీ కలిపి ఒకే చోట పూజించే విధంగా, వృత్తాకారంలో 65 గదులతో కట్టిన మహా మందిరమే, ఈ Chausath Yogini ఆలయం. ఈ ఆలయానికి మధ్యలో ఒక మండపం ఉండి, అందులో శివ లింగాన్నీ ప్రతిష్టించి పూజించేవారు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో రాజ్ పుత్ రాజైన Kachchhapaghata వంశానికి చెందిన దేవపాలుడు నిర్మింపజేశాడు. అప్పటి నుంచి ఎన్నో ఏళ్ళపాటు, శక్తి ఆరాధకులకు ఒక ప్రముఖ కేంద్రంగా ఉన్న Chausath Yogini ఆలయం, ముస్లింల రాకతో ఎన్నో సార్లు లూఠీకి గురయ్యింది. అయితే ఔరంగ్ జేబ్ మాత్రం ఈ ఆలయాన్ని లూఠీ చేయడమే కాకుండా, ఇక్కడ మళ్ళీ ఎవరూ పూజలు చేయడానికి వీలు లేకుండా, ఆలయంలో ఉన్న 64 మంది యోగినీ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసేశాడు. అలా నేటికీ ఈ ఆలయం ఒక శిధిలాలయంగా మిగిలిపోయింది.
ఈ కోవలో చెప్పుకోవలసిన మరో గొప్ప పుణ్య క్షేత్రం, సోమనాథ మందిరం. గుజరాత్ రాష్ట్రంలోని ఈ ఆలయం, హిందువులు అత్యంత పవిత్రంగా కొలిచుకునే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చారిత్రక వివరాల ప్రకారం, సోమనాథ ఆలయాన్ని తొలిగా ఎప్పుడు కట్టారో తెలియదు కానీ, సామాన్య శకం ఒకటవ శతాబ్దిలో ఆలయాన్ని బాగా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. హైందవ గ్రంధాల ఆధారంగా సోమనాథ ఆలయాన్ని కూడా కాశీ క్షేత్రంలాగే స్వయంగా దేవతలే నిర్మించారని తెలుస్తోంది. ఈ ఆలయ ప్రస్తావన రామాయణం, మాహభారతం వంటి ఇతిహాసాలలో కూడా వుంది. అంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయంపై ముస్లింలు అనేకసార్లు దాడులు చేశారు. మొదటిసారి 11వ శతాబ్దంలో ఘజిని మహ్మద్ సోమనాథ ఆలయానికి బాగా నష్టం కలిగించినట్లు తెలుస్తోంది. ఎంతో పురాతనమైన జ్యోతిర్లింగాన్ని సైతం ధ్వంసం చేశాడు. ఆ తర్వాత కొన్నేళ్ళకు భక్తులు మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మించుకుంటే పలు మార్లు మళ్ళీ మళ్ళీ దాడులు జరిగాయి. అయితే 1665 లో పరమ హిందూ ద్వేషి అయిన ఔరంగ్ జేబ్, సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, హిందువులు అక్కడ మళ్ళీ పూజలు నిర్వహిస్తే ఆ ఆలయాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేస్తానని హెచ్చరించాడు. దాంతో హిందువులు తమ ఆరాధ్య దైవం అలాగైనా తమ కళ్ళ ఎదుట ఉంటేచాలని అక్కడ ఎటువంటి పూజలూ నిర్వహించలేదు. ఆ విధంగా ఎప్పుడో 17వ శతాబ్దంలో ధ్వంసమయిన సోమనాథ ఆలయం, మనకు బ్రిటిష్ వారి దగ్గర నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి హోం మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతో, కొంతమంది పెద్దల ఆధ్వర్యంలో తిరిగి పునరుద్ధరింపబడింది.
మన దేశంలో ఔరంగ్ జేబ్ వల్ల నాశనమైన మరో ప్రముఖ హిందూ ఆలయం, Govind Dev Ji ఆలయం. ఈ క్షేత్రం రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్ లో ఉంది. ఈ ఆలయం Gaudiya Vaishnavam లేదా Chaitanya Vaishnava ఆచారం ప్రకారం కట్టబడింది. వందల ఏళ్ల క్రితం Chaitanya Mahaprabhu అనే మహర్షి, మన దక్షిణాదిలో బాగా పేరుగాంచిన శ్రీ వైష్ణవం లాగా, Gaudiya Vaishnavam అనే ఆచారాన్ని ఉత్తర భారతంలో బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. Chaitanya Mahaprabhu వల్ల వచ్చిన ఆచారం కాబట్టి, దాన్ని Chaitanya Vaishnavam అని కూడా పిలుస్తారు. అలా 17 వ శతాబ్దంలో Gaudiya Vaishnava ఆచారం ప్రకారం, ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ఆనంద తాండవం చేస్తున్న రాధాకృష్ణుల మూర్తులను పుజిస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడుండే కృష్ణుడి విగ్రహం దాదాపు ఐదు వేల ఏళ్ళనాటిది. ఆ విగ్రహాన్ని స్వయంగా కృష్ణ పరమాత్ముడి ముని మనమడయిన ‘వజ్రనాభుడు’ తన 13 వ ఏట, కృష్ణ పరమాత్ముడు ఎలా ఉండేవాడని తన బామ్మనడిగి తెలుసుకుని రూపొందించాడని అంటారు. వజ్రనాభుడి బామ్మ కృష్ణుడికి కోడలు కూడా కావడం వలన ఆమె ఆయనను నేరుగా చూసి ఉంది. పరమాత్ముడి రూపు రేఖలను ఆమె తన మనమడికి వర్ణించి చెప్పింది. ఆవిడ చెప్పిన వర్ణనల ప్రకారం అతను కృష్ణుడి విగ్రహాన్ని చేయించాడనీ, ఆ విగ్రహమే నేడు Govind Dev Ji ఆలయంలో ఉన్నదనీ చరిత్రకారులంటున్నారు. అయితే స్వయంగా కృష్ణుడి ముని మనుమడు చేయించిన విగ్రహం మథుర నుంచి రాజస్థాన్ చేరుకోవడం వెనుక ఔరంగ్ జేబ్ పాత్ర ఉంది. అదెలాగో ముందు తెలుసుకుందాము. ఇక జైపూర్ ఆక్రమణ సమయంలో Govind Dev Ji ఆలయం ముందున్న సుందర ఏడంతస్థుల భవనాన్ని కూడా ఔరంగ్ జేబ్ నాశనం చేశాడు.
ఇప్పుడు చెప్పుకోబోతున్న ఆలయం కూడా ఔరంగ్ జేబ్ ధ్వంసం చేసిన అతి పురాతన శ్రీ కృష్ణుడి ఆలయమే. అదే, ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో ఉన్న మదన మోహనుడి ఆలయం. ఈ ఆలయాన్ని Radha Madan Mohan ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది మన దేశంలోని పురాతన ఆలయంగానే కాకుండా, మహా భారత ఇతిహాసం మన దేశంలో నిజంగా జరిగిందని తెలియజేసే మరో సజీవ సాక్ష్యంగా కూడా పేర్కొంటారు. ఈ Madan Mohan ఆలయాన్ని ఐదు వేల ఏళ్ల క్రితం స్వయంగా కృష్ణుడి మునిమనవడయిన వజ్రనాభుడే నిర్మింపజేశాడు. ముందు చెప్పుకున్నట్లు, బామ్మ సహాయంతో కృష్ణుడి రూపు రేఖలు తెలుసుకున్న వజ్రనాభుడు స్వామి వారి విగ్రహాన్ని తయారు చేయించగా, దాన్ని తొలుత ఈ Madan Mohan ఆలయంలోనే ప్రతిష్టించారు. కాల గమనంలో వచ్చిన కొన్ని ప్రకృతి వైపరీత్యాలూ, ముస్లిం పాలకుల దండయాత్రల కారణంగా, Madan Mohan ఆలయం బాగా దెబ్బతిన్నది. Gaudiya వైష్ణవాన్ని ఆచరించే Sanatana Goswami అనే మహర్షి, 1580 లలో ఈ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరింపజేశాడు. అయితే అంత పురాతన ఆలయాన్ని తిరిగి నిర్మించిన ఆనందం భక్తులకు ఎక్కువ కాలం మిగలలేదు. 1670లో ఔరంగ్ జేబ్ బృందావనాన్ని ఆక్రమించుకునప్పుడు, Madan Mohan ఆలయాన్ని చాలా వరకు ధ్వంసం చేసేశాడు. కానీ ఔరంగ్ జేబ్ బృందావనం పై దాడి చేయబోతున్నాడనే విషయం తెలుసుకున్న జైపూర్ రాజు జై సింగ్, ముందు రోజు రాత్రే అక్కడి కృష్ణుడి విగ్రహాన్ని మథుర నుంచి జైపూర్ కి అత్యంత రహస్యంగా తరలించి, అక్కడ Govind Dev Ji ఆలయం నిర్మించిన తర్వాత అందులో ప్రతిష్టింపజేశాడు. ఇదిలా ఉంటే, 1819లో Nand Kumar Basu అనే కృష్ణ భక్తుడు, బృందావనంలోని Madan Mohan ఆలయాన్ని పునర్నిర్మించి, Govind Dev Ji ఆలయంలో ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని పోలి ఉన్న మరో విగ్రహాన్ని చేయించి ప్రతిష్టించారు.
ఔరంగ్ జేబ్ కారణంగా ధ్వంసమవ్వడమే కాకుండా, మసీదుగా మారిన మరో ఆలయం, Krishna Janmasthana ఆలయం. ద్వాపర యుగంలో కంసుడి చెరసాలలో బందీగా ఉన్న దేవకీ వసుదేవులకు కృష్ణుడు పుట్టిన ప్రదేశంలోనే, Krishna Janmasthan ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ఉత్తర ప్రదేశ్ లోని మధుర లో ఉంది. ఈ ఆలయాన్ని కూడా కొన్ని వేల ఏళ్ల క్రితమే నిర్మించినట్లు తెలుస్తోంది. ముస్లింల దాడులలో అనేకసార్లు Krishna Janmasthan ఆలయం ధ్వసం అయ్యింది. కానీ 1670లో ఔరంగ్ జేబ్, Krishna Janmasthan ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, అక్కడ Eidgah అనే మసీదును స్థాపించాడు. దాంతో చాలా ఏళ్ల పాటు కృష్ణ భక్తులకు Krishna Janmasthan ఆలయం అందుబాటులో లేకుండా పోయింది. అయితే 20వ శతాబ్దంలో కృష్ణ భక్తులూ, కొన్ని ఆలయ ట్రస్టులూ, Eidgah మసీదు పక్కనే ఉన్న స్థలంలో మరో ఆలయాన్ని నిర్మించారు. దాంతో వేల ఏళ్ల క్రితం నిర్మించబడిన అసలు Krishna Janmasthan ఆలయం Eidgah మసీదు కిందే ఉండిపోయింది.
ఇక మనం చెప్పుకుంటున్న 9 ఆలయాలలో చివరిదీ, ఔరంగ్ జేబ్ ధ్వంసకాండను ఎదురుకొని నిలబడిన ఆలయం, ఎల్లోరా గుహలలో ఉన్న కైలాస ఆలయం. కొన్ని శతాబ్దాల క్రితం పెద్ద కొండను తొలిచి నిర్మించిన అద్భుత గుహలుగా పేరు గాంచాయి ఎల్లోరా గుహలు. అత్యంత కఠినమైన శిలను, అది కూడా ఏక శిలను అమోఘమైన శిల్పాలుగా మలచిన మన పూర్వికుల ప్రతిభను ఎంత పొగడినా తక్కువే అని చెప్పవచ్చు. అటువంటి మహాద్భుత శిల్ప సౌందర్యాన్ని కూడా ఔరంగ్ జేబ్ ధ్వంసం చేద్దామని ప్రయత్నించాడు. అందుకోసం 1682లో వెయ్యి మందితో కూడిన సేనను ఎల్లోరా గుహలకు పంపించాడు. ఆ సేన దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడి, కేవలం కొన్ని విగ్రహాలను మాత్రమే, అది కూడా పాక్షికంగా ధ్వంసం చేయగలిగారు. ఎంత ప్రయత్నించినా ఎల్లోరా గుహలనూ, కైలాస మందిరాన్నీ ఏమీ చేయలేక, మూడేళ్ళ తర్వాత ఔరంగ్ జేబ్ తన సేనలను వెనక్కి పిలిపించుకున్నాడు.
సనాతన ధర్మాన్ని రూపుమాపడమూ, హిందువులను ఇస్లాం మతంలోకి మార్చడమూ, భారత దేశాన్ని పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మార్చడమే, మన దేశంపై దాడి చేసిన ప్రతి ముస్లిం పాలకుని ప్రధాన లక్ష్యమని చరిత్ర స్పష్టం చేస్తోంది. ఫలితంగా కొన్ని లక్షల ఆలయాలు ధ్వంసం అయ్యాయి. ఒక్క ఔరంగ్ జేబ్ మాత్రమే తన జీవిత కాలంలో కొన్ని వేల హిందూ ఆలయాలను ధ్వంసం చేసినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. వాటిలో ఈ తొమ్మిదీ కేవలం మచ్చు తునకలు మాత్రమే. అసలైన చరిత్రను తెలుసుకుని, సరైన నాయకులను జాగ్రత్తగా ఎన్నుకోకపోతే ముందుముందు కూడా జరగబోయేది ఇదే..
🚩 జై భారత్ 🙏

Comments
Post a Comment