Posts

భౌతికమైన క్షేత్రము, మరియు అలౌకికమైన క్షేత్రజ్ఞుడంటే ఏమిటి? భగవద్గీత Bhagavadgita

Image
  అందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 💐 పరమ పదము! భౌతికమైన క్షేత్రము, మరియు అలౌకికమైన క్షేత్రజ్ఞుడంటే ఏమిటి? 'భగవద్గీత' త్రయోదశాధ్యాయం – క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం (31 – 35 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదమూడవ అధ్యాయం, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములోని 31 నుండి 35 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/ogh8suoqPWc ] ఆత్మ అనేది, శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాకుండా ఎలా ఉండగలదో, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు.. 00:50 - యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి । తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ।। 31 ।। విభిన్న వైవిద్యములతో కూడిన జీవరాశులన్నీ, ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూసినప్పుడూ, మరియు అవన్నీ దానినుండే ఉద్భవించినవని అర్థం చేసుకున్నప్పుడూ, వారు బ్రహ్మజ్ఞానమును పొందుతారు. సముద్రము తానే అలలుగా, నురగగా, సుడులుగా, తరంగములగా మార్చుకుంటుంది. ఎవర

ముస్లిం యువతిని శ్రీనివాసుడు పెళ్లాడాడా? Shocking facts about Bibi Nanchari

Image
ముస్లిం యువతిని శ్రీనివాసుడు పెళ్లాడాడా? శ్రీరంగంలో నిత్యం పూజలందుకుంటున్న ముస్లిం యువతి ఎవరు? కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరునికి భార్యలుగా పద్మావతి.. అలిమేలు మంగలతో పాటు, తిరుమలలో తుళుక్క నాచియార్ పేరుతో పూజలందుకుంటున్న ఒక ముస్లిం యువతి గురించి, చాలా మందికి తెలిసే ఉంటుంది. అసలు ఆమె ఎవరు? ముస్లిం యువతి వేంకటేశ్వరుని భార్య ఎలా అయ్యింది? అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/L-zdTXdLyVs ] శ్రీ వేంకటేశ్వరుడూ, బీబీ నాంచారీల వివాహం మీద, మన దేశంలో పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. నాచియార్‌ అనే త‌మిళ ప‌దం నుంచి, నాంచార‌మ్మ అన్న పేరు వ‌చ్చింద‌ని చెబుతారు. నాచియార్ అంటే, భ‌క్తురాలు అని అర్థం. ఇక బీబీ అంటే భార్య అని అర్థం. బీబీ నాంచార‌మ్మ గాథ ఈనాటిది కాదు. క‌నీసం ఏడు వంద‌ల సంవ‌త్సరాల నుంచి, ఈమె క‌థ జ‌న‌ప‌దంలో నిలిచి ఉంది. అయితే, ఆమెకు సంబంధించి ముఖ్యంగా చెప్పుకునే కథలలో, బీబీ నాంచార‌మ్మ, మాలిక్ కాఫిర్ అనే సేనాని కుమార్తె. ఆమె అస‌లు పేరు సుర‌తాని. స్వత‌హాగా హిందువైన మాలిక్ కాఫిర్, అల్లాఉద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి, తాను కూడ

యధార్ధమైన జ్ఞానం! భగవద్గీత Bhagavadgita

Image
  పని చేసేటప్పుడు ఫలితములు నీ పరిశ్రమ మీదనే ఆధారపడి ఉన్నట్లు పరిశ్రమించాలి! 'భగవద్గీత' త్రయోదశాధ్యాయం – క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం (25 – 30 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదమూడవ అధ్యాయం, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములోని 25 నుండి 30 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/VmldzgSwQps ] కొన్ని ఆధ్యాత్మిక సాధనల గురించి, శ్రీ కృష్ణుడి వివరణ ఇలా సాగుతోంది.. 00:48 - ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా । అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ।। 25 ।। కొందరు ధ్యానము ద్వారా తమ హృదయములో ఉన్న పరమాత్మను దర్శించటానికి ప్రయత్నిస్తారు. ఇతరులు దీనినే, జ్ఞాన సముపార్జన ద్వారా పొందటానికి ప్రయత్నిస్తారు. మరికొందరు, ఈ విజ్ఞానమును కర్మ మార్గము ద్వారా సాధించుటకు పరిశ్రమిస్తుంటారు. వైవిద్యమనేది, భగవంతుని సృష్టి అంతటా ఉన్న లక్షణము. ఒకే చెట్టుకు ఉన్న ఏ రెండు ఆకులూ, ఒక్క లాగే ఉండ

స్వారోచిష మన్వంతరం! హంస నేర్పిన జ్ఞానబోధ! Swarochisha Manu

Image
  స్వారోచిష మన్వంతరం! హంస నేర్పిన జ్ఞానబోధ! వరూధుని కుమారుడైన స్వరోచి, ఆయుర్వేద విద్యా, సమస్త ప్రాణుల స్వరాలను వినే విద్యా, పద్మినీ విద్యలను ఎలా పొందగలిగాడు? స్వరోచిని మనోరమ వివాహం చేసుకోవడానికి పెట్టిన షరతు ఏంటి? ముగ్గురు భార్యలున్న స్వరోచి, వనదేవతను పెళ్ళి చేసుకోవడానికి గల కారణమేంటి? స్వరోచి మోక్షాన్ని పొందడానికి హంస ఏవిధంగా సహయపడింది - వంటి ఆసక్తిని కలిగించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. వరూధుని కుమరుడైన స్వరోచి జననం, స్వరోచి, మనోరమల సమాగమం, ఇందీవరాక్షుడి శాప విమోచనానికి సంబంధించిన వీడియోల లింక్స్ ను, చూడనివారికోసం పొందుపరిచాను. 1. వరూధిని – ప్రవరాఖ్యుడు!: https://youtu.be/YH-TpjvybSA 2. స్వరోచి జన్మ రహస్యం!: https://youtu.be/ytYeyP4Jmr0 3. స్వారోచిష మన్వంతరం!: https://youtu.be/qA48HPtKTuo తనను రాక్షస రూపం నుంచి విముక్తుడిని చేసినందుకు, ఇందీవరాక్షుడు తన కుమార్తె మనోరమను, స్వరోచికి సమర్పించాడు. దాంతో మనోరమ తన తండ్రితో, "తండ్రీ, నాకుకూడా నన్ను రక్షించిన ఈ మహా వీరుడంటే ఇష్టమే. నేను ఇతన్ని మనసార స్వీకరిస్తాను. అయితే, ఇది సందర్భం కాదు. నా ప్రియ చెలులు ఇద్దరూ కుష్ఠు,

త్రిగుణములు! భగవద్గీత Bhagavadgita Chapter 13

Image
త్రిగుణములు! అసంఖ్యాకమైన జన్మల కర్మరాశి, ఆత్మకు ఏ జన్మను కలుగచేస్తుంది? 'భగవద్గీత' త్రయోదశాధ్యాయం – క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం (19 – 24 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదమూడవ అధ్యాయం, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములోని 19 నుండి 24 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/5QM0ofLK-6I ] శరీరములోని అన్ని మార్పులూ, మరియు ప్రకృతి త్రిగుణములూ ఎలా సంభవిస్తున్నాయో, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు.. 00:50 - ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః । మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే ।। 19 ।। ఈ ప్రకారముగా నీకు క్షేత్రము యొక్క స్వభావమునూ, జ్ఞానము యొక్క అర్థమునూ, మరియు జ్ఞాన విషయమునూ, నేను తెలియచేశాను. నా భక్తులు మాత్రమే దీనిని యధార్థముగా అర్థం చేసుకోగలరు. అలా చేసిన పిదప, వారు నా దివ్య స్వభావమునే పొందుతారు. కర్మకాండ, జ్ఞానోపాసన, అష్టాంగమూ మొదలైనవి అభ్యాసం చేసే వారు, వ

స్వరోచి జన్మ రహస్యం! వరూధిని ప్రవరుడిని పొందగలిగిందా? The Origin of Swarochi Manu - Markandeya Purana

Image
స్వరోచి జన్మ రహస్యం! వరూధిని ప్రవరుడిని పొందగలిగిందా? అప్సరసలలో ఒకరైన వరూధిని వృత్తాంతంలో, ఆమె కోరికనూ, ఆమెనూ త్యజించిన ప్రవరుడనే బ్రాహ్మణుడి గురించీ, ఉత్సుకతను కలిగించే వారిద్దరి సమాగమానికి సంబంధించిన ఘటనలనూ, మన గత వీడియోలో తెలుసుకున్నాము.. చూడనివారికోసం ఆ లింక్ ను, క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచాను. తదుపరి భాగమైన ఈ రోజుటి మన వీడియోలో, వరూధిని ప్రవరుడిని మళ్లీ కలుసుకోగలిగిందా? ప్రవరుడి గురించి తెలిసి, వరూధినిని ప్రేమించిన గంధర్వుడు ఏం చేశాడు? వరూధిని మోసపోవడానికి గల కారణమేంటి - వంటి ఆసక్తిని కలిగించే విషయాలను తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ytYeyP4Jmr0 ] ప్రవరుడు తన ఇంటికి చేరి, యధావిధిగా తన నిత్యకృత్యాలు చేసుకోసాగాడు. అక్కడ హిమాలయాలలో వరూధిని, ప్రతిరోజూ ప్రవరుణ్ణి తలుచుకుంటూ, దినమొక యుగంగా భావిస్తూ, ఎప్పటికైనా అతడు తన దరికి చేరకపోతాడా! అని ఎదురుచూస్తూ, భారంగా కాలం గడపసాగింది. తనలో తాను, "అయ్యో, నేనెంత పాపాత్మురాలను. వలచిన వరుణ్ణి పొందలేకపోయాను. ఆ బ్రాహ్మణుడితో సంగమించని ఈ శరీరం నాకెందుకు? ఇప్పటిదాకా ఈ పర్వతం మీద అందంగా కనిపించిన దృశ్యాలన్నీ, న

జీవిత సత్యం - Life Facts

Image
'జీవిత సత్యం'.. తుమ్మెద పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి, అందులో జీవనం కొన సాగిస్తుంది.. చెక్కలకూ, మొద్దులకు కూడా రంధ్రాలుజేసి, అక్కడ సంతానోత్పత్తి చేసుకుంటుంది.. [ గురువై, ఇలలో జ్ఞానమై, మనలో వెలసిన దత్తుడు! ] కానీ, మకరందం కోసం తామర మీద వాలినప్పుడు, ఆ తామర రెక్కలు ముడుచుకుంటాయి.. 'అయ్యో.. నన్ను ఏదో  బంధించేసింది' అని అనుకుని, ఆ తామర రెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది.. అయితే మహా మహా వృక్షాలకు సైతం రంధ్రాలు చేయగలిగిన దాని సామర్థ్యం, సున్నితమైన ఆ తామర రేెకులను తొలచలేదా? ఆ తామర రేకులకు రంధ్రాలు చెయ్యలేదా? గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి.. కానీ, అది దాని సామర్థ్యం మరచి పోవడం, మకరందం గ్రోలే మత్తులోనో, లేక తననేదో బంధించిందన్న భావన దాని శక్తిని బలహీన పరచిందో..! అటువంటి భావనను నమ్మడమే దాని బలహీనత.. ఆ బలహీనత తోనే తన మరణాన్ని కొనితెచ్చుకుంటుంది.. మన జీవితంలోని సమస్యలూ అంతే.. సమస్య ఎప్పుడూ బలమైనది కాదు, మన శక్తిని మనం మరచి పోవడమే దాని బలం.. మన శక్తికంటే దాన్ని బలంగా చూడడం, గుర్తించడం, నమ్మడమే దాని బలం.. "మాయ" అనేది, నీ ఆత్మ శక్తికంటే బలమైనది కాదు.. దాని బలం తామర రేక