Posts

సంక్రాంతి పండుగ Sankranti 2024

Image
అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 🙏  [ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకోవాలి?: https://youtu.be/itjUnux5PEE ] ధనుర్మాసం మొదలైన దగ్గర్నుంచే తెలుగు లోగిళ్లలో పండుగ వాతావరణం మొదలవుతుంది. ఇంటిముందు ముగ్గులు, హరిదాసులు, గంగిరెద్దుల వాళ్లతో, గ్రామాలలో పండుగ వాతావరణం వెల్లివిరుస్తుంది. దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా సంక్రాంతి పండుగకు స్వంత ఊరికి వస్తారు. సంక్రాంతి పండుగ గురించి చెప్పాలంటే, పెద్దలనుంచి పిన్నల వరకు ఎన్నెన్నో విశేషాలు ఉంటాయి. పట్టణాల నుంచి వచ్చే బంధువులకు పల్లె జనం స్వాగతం పలుకుతూ, ఆనందోత్సాహాలలో మునిగిపోతారు. చిన్ననాడు స్వగ్రామంలో తిరిగిన తీపి గురుతులను నెమరువేసుకుంటూ, అంతా పండుగను ఎంజాయ్ చేస్తారు. ఇల్లలికి సున్నాలు వేసి, సుందరంగా అలంకరిస్తారు. లేలేత సూర్యకిరణాలు భూమిని తాకే వేళ, ఇంటి ముందు ఆడవారు ముగ్గులు పెట్టేవేళ, రామదాసు కీర్తనలు, హరినామ సంకీర్తన, శ్రీ కృష్ణ లీలామృతాన్ని గానం చేసుకుంటూ కాలికి గజ్జెకట్టి తంబురను మీటుతూ, తలపై అక్షయ పాత్రతో, చేతిలో చిడతలతో, హరిదాసులు చేసే సంకీర్తనలు, సంక్రాంతి పండుగవేళ కనిపించే అతి గొప్ప సాంప్రదాయాల్లో ఒకటిగా చెప్పవచ్చు. హరిదాసులు శ్రీమహావిష్ణువు

భోగి పండుగ 2024

Image
అందరికీ 'భోగి పండుగ' శుభాకాంక్షలు 🙏 [ భోగి రోజు ఇలా చేస్తే ఇంటి నిండా సిరులే: https://youtu.be/jkmkEU3i8yg ] సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈ పండుగలో మొదటి రోజున వచ్చేది 'భోగి' పండుగ. భోగి అంటే 'తొలినాడు' అనే అర్ధం ఉంది. భోగి రోజున ఇంటి ముందు మంట వేస్తే, ఇంట్లో ఉండే దరిద్ర దేవతను తరిమినట్లేనని మన నమ్మకం. ఈ భోగి పండుగ నాడు సంబరమంతా పిల్లలదే. తెల్లవారు జామున భోగి మంటలు వేయటం, సాయంత్రం భోగి పండ్లు పోయించుకోవడంతో, పిల్లలు హుషారుగా ఉంటారు. 'భగ' అనే పదం నుంచి భోగి అన్న మాట పుట్టిందని చెబుతారు. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం. భోగి రోజు సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోస్తూ, చిన్న పిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తారు. రేగి పళ్ళను సంస్కృతంలో బదరీ ఫలం అంటారు. భోగి పళ్ళలో చేమంతి, బంతి పూరేకులు, అక్షింతలు, చిల్లర నాణేలు కలిపి, పిల్లల తలపై పోస్తారు. ‘భుగ్’ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ రోజున శ్రీ

విశ్వరూపం! భగవద్గీత Bhagavad Gita Chapter 18

Image
విశ్వరూపం! యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి ద్వారా పొందబడిన ‘సర్వోన్నత యోగ శాస్త్రము’! 'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (75 – 78 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 75 నుండి 78 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/jh-LR5NbMvk ] పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకోవడానికి మార్గం ఏంటో సంజయుడి మాటలలో విందాము.. 00:50 - వ్యాసప్రసాదాఛ్చ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరమ్ । యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయమ్ ।। 75 ।। వేదవ్యాసుని అనుగ్రహం చేత, నేను ఈ యొక్క సర్వోత్కృష్ట పరమ రహస్యమైన యోగమును, స్వయంగా యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి నుండి తెలుసుకున్నాను. శ్రీ కృష్ణ ద్వైపాయన వ్యాసదేవుడినే మహర్షి వేద వ్యాసుడని కూడా అంటారు; ఆయన సంజయుని యొక్క ఆధ్యాత్మిక గురువు. తన గురువు గారి అనుగ్రహం చేత, సంజయుడు హస్తి

Brahmastra on a crow | కాకి మీద బ్రహ్మాస్త్రం!

Image
కాకి మీద బ్రహ్మాస్త్రం! లంకలో సీతమ్మ హనుమకు చెప్పిన కాకాసుర వృత్తాంతం! రామాయణం గురించి మనలో చాలామందికి తెలుసు. శ్రీ రామ చంద్రమూర్తికి సతి అయిన సీతా దేవిని, మాయావి రావణాసురుడు అపహరించి లంకలో బంధించడం, రామ దూతగా హనుమ వెళ్లి సీతమ్మను కనుగొనడం, తరువాత రాముడు వానర సైన్యంతో వారధిని నిర్మింపజేసి, రావణాసురుడితో యుద్ధం చేసి, సీతమ్మను తిరిగి తీసుకురావడం.. ఇవన్నీ ప్రతి ఒక్కరికీ తెలిసిన రామాయణ ఘట్టాలే. హనుమ సప్త సముద్రాలనూ దాటి, సీతమ్మను చేరుకున్న తరువాత జరిగిన సంభాషణ, రామాయణంలో రసరమ్యభరితం. వాటిలో, సీతా దేవి హనుమకు వివరించిన కాకాసుర వృత్తాంత సంఘటనను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Vgn-qemaUEA ] రాముడి గుణగణాల గురించీ, రాముడి రూపం గురించీ ఎంతో గొప్పగా చెప్పి, రాముడు సీతమ్మకు ఇవ్వమన్న ఉంగరాన్ని, హనుమంతుడు ఆ తల్లికి ఇచ్చాడు. ఆ ఉంగరాన్ని చూడగానే, సీతమ్మ ఎంతో సంతోషపడింది. సాక్షాత్తూ రాముడిని చూసినంత ఆనందం పొందింది. తరువాత హనుమంతుడు సీతమ్మతో, "యజ్ఞములో వేసిన హవిస్సును హవ్యవాహనుడైన అగ్నిదేవుడు ఎంత పవిత్రంగా తీసుకెళతాడో, అలా నిన్ను తీసుకెళ్ళి ర

భౌతిక జ్ఞానం! భగవద్గీత Bhagavad Gita Chapter 18

Image
భౌతిక జ్ఞానం! భగవత్ కృపతో పొందవలసిన ‘ఆధ్యాత్మిక జ్ఞానము’ను కొని, అమ్మగలమా? ' భగవద్గీత ' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (71 – 74 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 71 నుండి 74 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/PfGzGGEorXI ] పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకాలకు చేరుకోవడానికి మార్గం ఏంటో చూద్దాము.. 00:49 - శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః । సోఽపి ముక్తః శుభాల్లోకాన్ ప్ర్రాప్నుయాత్ పుణ్యకర్మణామ్ ।। 71 ।। శ్రద్ధా విశ్వాసముతో, అసూయ లేకుండా, ఈ జ్ఞానాన్ని కేవలం విన్న వారు కూడా పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు. శ్రీ కృష్ణుడికీ, అర్జునుడికీ మధ్య జరిగిన ఈ సంభాషణను అర్థం చేసుకునే వివేక సామర్థ్యము అందరికీ ఉండకపోవచ్చు. అటువంటి వారు కేవలం శ్రద్ధావిశ్వాసముతో దీని

Story of Shanta and Rishyasringa (The Man with Horn) | ఋష్యశృంగుడు!

Image
ఋష్యశృంగుడు! లేడి గర్భంలో జన్మించిన ఋష్యశృంగ మహర్షి ఎవరు? మన పురాణాలలో వివరించబడ్డ గొప్ప మహర్షులలో ఋష్యశృంగుడు ఒకడు. ఆయన అమోఘమైన విద్వత్తు కలిగినవాడు, మహనీయుడు, పూజనీయుడు. ప్రకృతి ప్రకాశకుడు, ఋష్యశృంగుడు. స్వయంగా శివుని అంశగా పురాణాలు వ్యక్తం చేస్తున్నాయి. రాముని అవతరణకు ఇతోధికంగా సహాయపడిన వాడు. ఆయన గురించి తలుచుకోవడం కూడా మన సుకృతమే.  అటువంటి పావన మూర్తి, ఋష్యశృంగుడు. ఈయన కాలు మోపిన ప్రదేశం, సుభిక్షంగా వర్థిల్లుతుంది. యవ్వనం వచ్చినా, ఆడ మగ తేడా తెలియకుండా, తండ్రి సంరక్షణలో పెరిగిన వాడు, ఋష్యశృంగుడు. ఈయన జననం, యాదృచ్ఛికంగా జరిగింది. ఋష్యశృంగుడు, తలపై కొమ్ముతో జన్మించడానికి గల కారణం ఏంటి? ఋష్యశృంగుడి తల్లి పూర్వాశ్రమ వృత్తాంతం ఏంటి? రోమపాద మహారాజు, ఋష్యశృంగ మహర్షిని ఎందుకు వంచన చేయాల్సి వచ్చింది? దశరథుని కుమార్తె, రాముడి సోదరి అయిన శాంతతో, ఋష్యశృంగ మహర్షి వివాహం ఎలా జరిగింది? అనేటటువంటి ఉత్సుకతను కలిగించే విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/s8PJAlHrf48 ] కశ్యప ప్రజాపతి కుమారుడైన విభాండకుడనే మహర్షి పుత్రుడే, ఋష్యశృంగ మహర్షి. వి

2024 - Untold Historical Facts about January 1st

Image
2024 - జనవరి 1 కొత్త సంవత్సరం వెనుక ఉన్న అసలు చరిత్ర తెలుసా?  @mplanetleaf   https://youtu.be/TNSy3HA-kus?si=3wztY7-MyavQn3KU 2024 - 'ఉగాది పండుగ' గొప్పదనం తెలుసుకుందాము.. https://youtu.be/PNwsSBE8SQc?si=uH3MeW1m8LWVO1m5