Posts

దీపావళి ఐదు రోజుల పండుగ అంటారు? వాటి విశేషాలు ఏమిటి? Deepavali Significance

Image
అందరికీ దీపావళి శుభాకాంక్షలు 🙏 దీపావళి ఐదు రోజుల పండుగ అంటారు? వాటి విశేషాలు ఏమిటి? ధన్వంతరీ త్రయోదశి.. వాడుకలో ధన త్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతున్నాం ! కానీ ఆరోజు ‘ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన ‘ధన్వంతరీభగవాన్’ జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండముతో అవతరించాడు. నరక చతుర్దశి.. నరక యాతనల నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు ప్రాక్జ్యోతీషపురం (నేటి అస్సాము)ను పాలించిన ‘నరకుడు’ నర రూప రాక్షసుడు. దేవీ ఉపాసకుడే కానీ దేవిని వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేక అధ్భుత శక్తులను సంపాదించి, దేవతలను కూడా ఓడించాడు. వాడు ప్రతీ అమావాస్య - పౌర్ణమికి నవ యవ్వన రాచ కన్యలను దేవికి బలి ఇచ్చే వాడు. కాముకత్వంతో అనుభవించేవాడు. నరకుని చెరసాలలో వేలాది అందమైన మహిళలు (రాచకన్యలు) బందీలుగా వుండేవారు. ఆది వరాహమూర్తికి – భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు. తామస ప్రవృత్తితో జనించాడు. శ్రీకృష్ణ భగవానుడు – సత్యభామ (భూదే

కులవ్యవస్థ! Casteism భగవద్గీత Bhagavad Gita Chapter 18

Image
కులవ్యవస్థ! బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రుల గురించి శ్రీకృష్ణుడేం చెప్పాడు? 'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (37 – 41 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 37 నుండి 41 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/uyfTaY-i77Q ] సత్వ గుణ ఆనందం, రజో గుణ ఆనందం, తామసిక ఆనందం ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాము.. 00:49 - యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమమ్ । తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమ్ ఆత్మబుద్ధిప్రసాదజమ్ ।। 37 ।। మొదట్లో విషంలా అనిపించినా, చివరికి అమృతంలా ఉండే సుఖమే, సత్త్వ గుణ సుఖము. అది ఆత్మ-జ్ఞానము యందే స్థితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధిచే జనిస్తుంది. ఉసిరికాయ, ఆరోగ్యానికి లాభకారియైన అత్యుత్తమ ఆహారపదార్ధాలలో ఒకటి. దానిలో, 10 నారింజ పళ్ళకన్నా ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. కానీ, అది పుల్లగా ఉంటుంది కాబట్టి, పిల్లలకు అది ఇష్టం

999 ఏళ్ళ యుద్ధం! Sahasrakavacha

Image
999 ఏళ్ళు యుద్ధం చేసిన రాక్షసుడికీ దాన వీర శూర కర్ణుడికీ సంబంధం ఏంటి? ఈ లోకంలో బ్రహ్మ చేస్తున్న సృష్టికి సహకరించేందుకు, కొందరు ప్రజాపతులు తోడ్పడ్డారు. వారిలో ఒకరు, ధర్మ ప్రజాపతి. ఆ ధర్మ ప్రజాపతికి నరుడు, నారాయణుడనే కవల పిల్లలు జన్మించారు. నరుడు, నారాయణుడు, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారమేనని, మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీ హరి అవతారాలుగా, పురాణ ప్రాశస్త్యాన్ని పొందిన నరనారాయణులు ఎవరు? వారి ఆవిర్భావం ఎలా జరిగింది? వారి తపో శక్తి ముందు, శివుడు కూడా ఓడిపోయాడా? తపోధనులైన నరనారాయణులు, ఊర్వశిని ఎందుకు సృష్టించారు? మహాభారత సంగ్రామంలో కర్ణుడి మరణానికీ, నరనారాయణులకూ సంబంధం ఏమిటి - అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/tlNzC7ZYgwE ] మన ఇతిహాసాలలో, తపోధనులుగా, దైవాంశ సంభూతులుగా పేరుగడించిన నరనారాయణులు, సనాతన మహర్షులు. శాంత సంయమనాలకు నెలవులు. నిజమైన, నిర్మలమైన ఆచారశీలతకూ, ఆధ్యాత్మిక నీతికీ, ధార్మిక రీతికీ, తపో నియతికీ, మంత్రానుష్టాన అనుభూతికీ, నిలువెత్తు సాక్ష్యాలు. నిజానికి ఒకే ఒక్క వైష్ణవ తేజం, నర నారాయణులు. ఒకప్ప

ఆనందం! భగవద్గీత Bhagavad Gita Chapter 18

Image
ఆనందం! కర్మల వెనుక ఉన్న అంతిమలక్ష్యం ‘ఆనందం’ కోసం అన్వేషణ అంటే? 'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (32 – 36 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 32 నుండి 36 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/QaT8M3tArJw ] చీకటితో ఆవృత్తమై ఉండే తమోగుణ బుద్ధిని గురించి ఇప్పుడు తెలుసుకుందాము.. 00:47 - అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా । సర్వార్థాన్విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ।। 32 ।। ఓ పార్థా! చీకటితో ఆవృత్తమై ఉండి, అధర్మమునే ధర్మమనుకుంటూ, అసత్యమును సత్యమని భావిస్తూ ఉండే బుద్ధి, తమోగుణ బుద్ధి. తామసిక బుద్ధి అనేది, పవిత్రమైన జ్ఞానముచే ప్రకాశితమై ఉండదు. కాబట్టి, అది అధర్మమునే తప్పుగా, ధర్మమని అనుకుంటుంది. ఉదాహరణకు, ఒక త్రాగుబోతు ఆ మద్యం యొక్క మత్తు పట్ల ఆసక్తితో ఉంటాడు. కాబట్టి, అతని యొక్క అల్పబుద్ధి, అంధకారముచే కప్పివేయబడినదై, తనక

గరుడపురాణం ప్రకారం యమలోకంలోని నగరాలు! 16 cities on the way to Yamaloka - Garuda Puranam

Image
గరుడపురాణం ప్రకారం యమలోకంలోని నగరాలు! పాపాలు చేసినవారు ‘యమలోకానికి’ ఈ నగరాలను దాటి వెళ్ళాలా? మన పురాణ ఇతిహాసాల ప్రకారం, పాపపు కర్మలు చేసి మరణించిన ప్రతీ ఆత్మ, నరకానికి వెళుతుంది. అక్కడున్న వైతరణీ నదిని దాటి, యముడి చేత తీర్పుపొంది, యమలోకంలో శిక్షలు అనుభవిస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలుసు. కానీ, యమలోకంలో అనేక నగరాలున్నాయి. వాటిని దాటుకుంటూ, అక్కడ వివిధ రకాల యాతనలను అనుభవించిన తరువాతే, యమలోకానికి చేరుకుని శిక్షలు పొందడం జరుగుతుంది. గరుడ పురాణంలో, యమలోకంలో దక్షిణ ద్వారం గుండా ఉన్న 16 నగరాల గురించిన వివరణ ఉంది. శ్రీహరి చెప్పిన ఆ 16 నగరాలు ఏంటి? ప్రేతాత్మ ఏ ఏ నగరాలలో ఎటువంటి హింసలను పొంద వలసి ఉంటుంది? అసలు వైతరణీ నది ఎలా ఉంటుంది? దానిని దాటడానికి గల మార్గం ఏంటి – అనేటటువంటి విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/M4qpRO8wrtw ] శరీరం వదిలిన ప్రేతాత్మ యమలోకానికి చేరే క్రమంలో, కొన్ని హింసలను భరించాల్సి ఉంటుంది. కొంతమంది పాపాత్ములను యమభటులు అంకుశాలతో గుచ్చుతూ, వీపు మీద పొడుస్తూ, తాళ్ళుకట్టి ఈడుస్తూ లాక్కు పోతారు.  మరికొంత మందిని ముక్కు చ

మంగళసూత్రం!!! Mangal Sutra

Image
మంగళసూత్రం!!! క్షీర సాగర మధన సందర్భంలో మాంగళ్యవివరణ.. “మ్రింగెడివాడు విభుండని, మ్రింగెడిదియు గరళమ్మనియు, మేలని ప్రజకున్ మ్రింగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబు నెంత మదినమ్మినదో! పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవిగా ఉన్నాడంటే, అది ఆయన గొప్ప కాదట.. అమ్మ పార్వతీ దేవి కంఠాన ఉన్న మాంగల్యాభరణం గొప్పదనమట.. మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా । కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం ।। 'ఓ సుభగా! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి, నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు.. అంటే, పుణ్యస్త్రీగా, ముత్తయిదువగా, సకల సౌభాగ్యాలతో జీవించు' అని స్పష్టముగా తెలుస్తున్నది. పూర్వం భారత దేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు, ఎటువంటి ఆచారాలూ కట్టుబాట్లూ ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి. భారతావనిలో పిండారీలు, థగ్గుల వంటి కిరాత జాతులవారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకుపోయేవారు.  మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు, ఏ హానీ చేయకుండా విడిచి పెట్టేసేవారు. కిరాతకులు కూడా ఈ

మనిషిని దుఃఖపూరితంగా, చికాకు పరిచేలా చేసేవి ఏమిటి? భగవద్గీత Bhagavad Gita Chapter 17

Image
  మనిషిని దుఃఖపూరితంగా, చికాకు పరిచేలా చేసేవి ఏమిటి? 'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (27 – 31 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 27 నుండి 31 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/rHBlo2Ia35g ] ఎటువంటి కర్త రజోగుణములో ఉన్నట్టు పరిగణించబడతాడో చూద్దాము.. 00:46 - రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకోఽశుచిః । హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః ।। 27 ।। కర్మఫలముల పట్ల ఆసక్తితో ఉంటూ, దురాశగలవాడై, హింసా-ప్రవృత్తి కలిగి, అపవిత్రతతో ఉండి, మరియు హర్ష-శోకములచే ప్రభావితమౌతూ ఉండే కర్త, రజోగుణములో ఉన్నట్లు పరిగణించబడతాడు. రాజసిక కర్తలు ఇక్కడ వివరించబడుతున్నారు. సాత్త్విక కర్తలు, ఆధ్యాత్మిక పురోగతిచే ప్రేరణ పొందితే, రాజసిక కర్తలు భౌతిక వస్తు విషయ సంపాదన కొరకు, అత్యంత ఆసక్తితో ఉంటారు. ఇక్కడున్న ప్రతిదీ తాత్కాలికమైనదే అనీ, మరియు