Posts

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!

Image
శివోహం - నేను శివుడిని! ‘నేను శివుడిని, నేనే శివుడిని’ – అసలు శివతత్వమేమిటి? పరమ జిజ్ఞాసువు, కారణజన్ముడైన ఒక విద్యార్థిని, ఒక ఆధ్యాత్మిక గురువు, ‘నీ వెవరివి?’ అని ప్రశ్నించాడు. ఆ విద్యార్థి సవినయంగా నమస్కరించి, ‘చిదానందరూపః శివోహం శివోహం’ అని సమాధానం ఇచ్చాడు. ఇక్కడ శివుడు అన్న పదానికి పరబ్రహ్మం అని అర్థం. మనం పరమేశ్వరుడు, శివుడు అని అర్థం చెప్పుకుంటే, సందర్భోచితంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ‘నేను శివుడిని, నేనే శివుడిని’ అని మనస్సులో అనుకున్నా, పైకి అన్నా, బాగానే ఉంటుంది. శివతత్వాన్ని అర్థం చేసుకుని, శివుడిలాగా ప్రవర్తిస్తే ఇంకా బాగుంటుంది. మరి ఆ శివతత్వమేమిటో ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/UafRztjHW04 ] శివం అంటే శుభం అని అర్థం. శివుడు అంటే శుభాన్ని కలిగించేవాడు. శం అంటే సుఖం. శంకరుడు అంటే సుఖాన్ని కలిగించేవాడు. పాలసముద్రం నుంచి హాలాహలం ఆవిర్భవించినప్పుడు, లోకాలన్నీ భయకంపితాలై, హాహాకారాలు చేస్తుంటే, శివుడు ఆ ఘోర విషాన్ని అరచేతిలోకి తీసుకుని, ఆనందంగా తాగాడు. తనకు వెలుపల ఉన్న లోకాలకూ, తనకు లోపల ఉన్న లోకాలకూ ఇబ్బంది కలగకుండా, దానిని

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!

Image
I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని! - ‘నేను శివుడిని, నేనే శివుడిని’ – అసలు శివతత్వమేమిటి? | @maheedhar https://youtu.be/UafRztjHW04?si=7AeN4Z9brur793Ek maheedhar planet leaf, m planet leaf, Telugu Videos, mpl, interesting facts in telugu, telugu facts, amazing facts in telugu, shivoham shivoham, voice of maheedhar, facts in telugu, శివోహం, I am Shiva, Aham Shivam Ayam Shivam, నేను శివుడిని, nirvana, nirvana shatakam, ultimate reality, manchi matalu, garuda purana, kathopanishad, shiva gita, shivoham full video, shivoham adipurush, ps2 shivoham, shivoham ps2, shivoham video, shivoham promo, chidananda roopah shivoham, sivoham

Kathopanishad Death Indic | మరణం నుండి మరుజన్మ దాకా! ..వాస్తవాలు

Image
మరణం నుండి మరుజన్మ దాకా! ..వాస్తవాలు మనం పుట్టింది ఎందుకు? చేస్తున్నదేమిటి? అసలు చేయాల్సిందేమిటి? పుట్టిన ప్రతి జీవీ ఏదో ఒక రోజు మరణించక తప్పదు. భగవంతుడు నిర్ణయించిన జనన మరణ చక్రంలో, ఆత్మ నిరంతర ప్రయాణం అనివార్యం. ఇది ఎవ్వరూ విస్మరించకూడని సత్యం. మన పురాణాల ప్రకారం, మరణించిన వ్యక్తి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో, తన శరీరాన్నీ, కుటుంబ సభ్యులనూ చూసి విచారిస్తుంది. ఆ తరువాత ఇహలోక బంధాలను వీడి, తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరణించిన తర్వాత ఆత్మలు మళ్ళీ మరో జన్మ తీసుకునే దాకా, ఒక్కోసారి ఈ క్రమంలో, కొన్ని వందల సంవత్సరాల తరువాత మళ్ళీ జన్మనెత్తుతాయి. మరి అటువంటి ఆత్మలు ఆ సమయంలో ఏం చేస్తాయి, ఎక్కడ ఉంటాయి? అనేది, చాలా మందికి కలిగే సందేహం! ఇటువంటి విషయాలు కొంత భయాన్ని కలిగించడం సహజమే.. కానీ, ఇటువంటి విషయాలే, మన జీవితాలను స్వార్ధపూరితం కాకుండా కాపాడి, సన్మార్గంలో నడిపించడానికి దోహద పడతాయి. ఈ మధ్య కొంతమంది టైటిల్ ను మాత్రమే చూసి కామెంట్ చేయడం, చిన్న చిన్న పొరపట్లను ఎత్తి చూపడం గమనించాను. దీని వలన అందరూ సన్మార్గ జీవనాన్ని అవలంభించాలనే సదుద్దేశం మరుగునపడి, నా ప్రయాస వ్యర్ధమైపోతుంది. అందరికీ మనస

ఖర్చులేని స్వర్గం!? Inexpensive Heaven

Image
ఖర్చులేని స్వర్గం!?                 ఒక గురువు శిష్యుడితో ఇలా అన్నాడు.. “స్వర్గానికి ప్రవేశం ఉచితం.. నరకానికి వెళ్లడానికి మాత్రం బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి”.. శిష్యుడు ఆశ్చర్యపోయి, 'అదెలా?' అని అడిగాడు. [ అంత్యకాల చింతనలే మరుజన్మను నిర్ణయిస్తాయా?: https://youtu.be/y6vublgZiQ0 ] అప్పుడు గురువు.. "జూదం ఆడటానికీ, చెడు వ్యసనాలైన వ్యభిచారం, మత్తు పానీయాల సేవనం, ధూమ పానం, ఇలా పాపాలతో ప్రయాణించడానికి ఎంతో డబ్బు అవసరం.. కానీ, ప్రేమను పంచడానికీ, దైవ ప్రార్ధనకీ, సేవ చేయడానికీ డబ్బుతో పని లేదు.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అప్పుడప్పుడు ఉపవాసం ఉండడానికి డబ్బు అవసరం లేదు.. ఎదుటి వారిని క్షమించమని అడగడం కూడా ఖర్చులేని పనే.. కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి సంపదలు అవసరంలేదు.. దేవుడిపై నమ్మకం ఉండాలి.. మనపై మనకు, తోటి ప్రాణులపై ప్రేమ, విశ్వాసం ఉండాలి.." అని అన్నాడు.  మరి గురువు చెప్పిన ప్రకారం, "డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా? ఉచితంగా లభించే స్వర్గ ప్రాప్తిని ఇష్టపడతారా?" ఇది ఎవరికీ వారు నిర్ణయించుకోవలసిన విషయం.. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహ

లలాట లిఖితం! ..మంచి కథ If Death Occurs in 7 days - Real Incident of Sant Eknath

Image
లలాట లిఖితం! ..మంచి కథ ఇంకో వారంలో చనిపోతాడని తెలిసిన ఆ మనిషి ఏం చేశాడు? ..జీవిత సత్యాలు! మన హిందూ పురాణాలలోనూ, చరిత్ర పుటలలోనూ మంచి కథలు అసంఖ్యాకం. వాటిలో కొన్ని మనోల్లాసానికీ, ఇంకొన్ని మనో వికాసానికీ ఉద్దేశింపబడినవయితే, మరికొన్ని సన్మార్గ జీవనానికి తోడ్పడతాయి. కారుణ్యం, దయ, పరోపకారం, త్యాగం, సత్యనిష్ఠ, నిస్వార్థత వంటి సద్గుణాలు, మానవుణ్ణి ధర్మపథం వైపుకు నడిపించి, అంతిమంగా భగవంతునికి చేరువ చేస్తాయి. అటువంటి సద్గుణాలను పెంపొందించే స్ఫూర్తిదాయక కథలలో ఒకదానిని, ఈ రోజుటి మన వీడియోలో చెప్పుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/C-3v8R8fZQQ ] మహారాష్ట్ర ప్రాంతంలో జీవించిన మహాత్ముడూ, భక్తాగ్రగణ్యులలో ఒకరు, సంత్ ఏక్‌నాథ్‌ గా ప్రసిద్ధి చెందిన ఏకనాథుడు. ఆయన ఘనతను గురించి ఆ నోటా ఈ నోటా విన్న ఒక వ్యక్తి, ఒక రోజు ఆయనను దర్శించుకోవడానికి వచ్చాడు. ఏకనాథుడు గడుపుతున్న నిరాడంబర జీవితాన్ని చూసి, అతడు ఆశ్చర్య చకితుడయ్యాడు. ఏకనాథుడి ముఖారవిందాన ద్యోతకమవుతున్న దివ్యత్వం, తేజస్సునూ గమనించి, ఆయన పట్ల అమితంగా ఆకర్షితుడయిన అతను ఆయనతో, “స్వామీ! మీ జీవితంలో ఎంతో ప్రశాంతతను చూస్తున్నాను. ఎట

అందరికీ 'రథ సప్తమి 2024' శుభాకాంక్షలు 🙏 Ratha Sapthami

Image
అందరికీ 'రథ సప్తమి 2024' శుభాకాంక్షలు 🙏 [ రథ సప్తమి చరిత్ర: https://youtu.be/RcSzefZE3ow ] రథ సప్తమి రోజున స్నానం చేసే సమయంలో పఠించవల్సిన శ్లోకాలు:  నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః। అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే।। యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు। తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ।। ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్। మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః।। ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే। సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ।।

వసంత పంచమి 2024

Image
  అందరికీ 'వసంత పంచమి' శుభాకాంక్షలు 🙏 చదవుల తల్లి సరస్వతీ దేవి పుట్టిన రోజు కాబట్టి వసంత పంచమిని సరస్వతీ పంచమి అని అంటారు. ఫిబ్రవరి 14వ తేదీ 2024, మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి (Vasant Panchami), శ్రీ పంచమి, మదన పంచమి అనే పేర్లు కూడా ఉన్నాయి. జ్ఞానము మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము, విద్య, చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావించి, స్మరించి, పూజించే రోజే వసంత పంచమి. ఆ తల్లి కటాక్షం కోసం అందరూ పూజలు జరిపే పర్వదినమే వసంతపంచమి. ఈ రోజునే క్షీరసాగర మథన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమి అని కూడా పేర్కొంటారు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ । విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ।। యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా । యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా ।। యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా । సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ।। సరస్వతీ కటాక్షం: * బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి, ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆర