Posts

సఫల ఏకాదశి - Saphala Ekadashi

Image
'సఫల ఏకాదశి' విశిష్టత.. ధనుర్మాసంలో వచ్చే చివరి పండుగ అయిన సఫల ఏకాదశి గురించి తెలుసుకుందాము..  ఈ సఫల ఏకాదశి మహాత్మ్యాన్ని, పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు చెప్పినట్లు, శాస్త్రాలు చెబతున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే, సఫల ఏకాదశి అని అంటారు. ఈ రోజున నిష్ఠతో ఉవవసించి, జాగరణ చేసి, శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా, పాపాలు నశించిపోతాయి, ముక్తి లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును ఉసిరితోనూ, దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి, సకల సంపదలో చేకూరుతాయి. ఈ రోజున రకరకాల పండ్లను స్వామికి సమర్పించి, ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తే, శుభప్రదం. ఈ సఫల ఏకాదశి రోజున దీప దానం చేస్తే, జీవితంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి. సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి, ఆలయాలలో దీపాలను వెలిగిస్తే, ఐదువేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుంది. దీనికి సమానమైన యజ్ఞం కానీ, తీర్థం కానీ లేదు. సఫల ఏకాదశి పవిత్రను చాటిచెప్పే కథను కూడా, శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు, పురాణాలు చెబతున్నాయి. పూర్వం చంపావతి రాజ్యమును మహిష్మంతుడనే రాజు పాలించేవాడు. అతనికి నలుగురు కుమారులుండేవారు. వారిలో జేష్ఠ పుత్రు

సంపాతి కథ Story of Sampati

Image
యుగాలు నిరీక్షించిన ‘సంపాతి’.. సంపాతికి నిశాకర మహర్షి చూపిన మార్గమేమిటి? కశ్యప ప్రజాపతి, వినత దంపతులకు కలిగిన సంతానమైన అనూరుడు, శ్యేని ద్వారా, సంపాతి, జటాయువులనే కుమారులను పొందాడు. వీరి పాత్ర రామాయణంలోని ముఖ్య ఘట్టాలలో కనిపిస్తుంది. సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించిన సందర్భంలో, జటాయువు ఆమెను కాపాడబోయి, మరణించిన విషయం మనలో చాలామందికి తెలిసిందే. ఇక సంపాతి తన రెక్కలను ఎందుకు కొల్పోయాడు? వానరులను ఎలా కలిశాడు? సంపాతి రెక్కలు తిరిగి రావడానికి నిశాకర మహర్షి ఉపదేశించిన మార్గం ఏమిటి - వంటి ఆసక్తికర అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/fuBE0AZCoNA ] సీతమ్మను వెతకడానికి దక్షిణ దిశకు వెళ్ళిన జాంబవంత, హనుమదాది మహావీరుల బృందానికి, అంగదుడు నాయకుడు. అన్వేషణ దాదాపు విఫలమైందని భావించి, ప్రాయోపవేశానికి సిద్ధమైనపుడు మాత్రమే, నిసృహతో అంగదుడు సుగ్రీవుని విమర్శించడం గమనార్హం. అది తప్పితే, మిగిలిన అన్ని సందర్భాలలోనూ అతని రాజ భక్తీ, రామకార్యం పట్ల నిరతీ, చాలా దృఢంగా ప్రదర్శించాడు. ఇక అసలు విషయానికి వస్తే, ఆ సమయంలో అంగదుడు, "శ్రీ రాముడి కార్యం నె

భూత కోలా అంటే ఏమిటి? Bhoota Kola or Buta Kola of Kantara

Image
భూత కోలా అంటే ఏమిటి? అందులో ఎటువంటి శక్తులను పూజిస్తారో తెలుసా? ఇప్పుడు దేశమంతటా మారుమ్రోగిపోతున్న పేరు 'భూత కోలా'. మొన్నీ మధ్య రిలీజ్ అయిన 'కాంతార' అనే కన్నడ సినిమాలో ఈ భూత కోలా గురించి ఎంతో విశేషంగా చెప్పారు. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో, ఇప్పుడు దేశమంతా 'భూత కోలా' అంటే ఏమిటి? 'పంజర్లీ' అంటే ఏమిటి? 'గుళిగ' అనే దేవత ఎవరు? భూతం అంటే అదో దుష్ట శక్తి కదా, అటువంటి దుష్ట శక్తిని కొలవడం ఏమిటి? ఈ వింత సంస్కృతి గురించి ఇన్నాళ్ళూ మనకు ఎందుకు తెలియలేదు? ఈ సంస్కృతిని ఎవరు? ఎక్కడ ఎక్కువగా పాటిస్తున్నారు? ఎన్ని సంవత్సరాలుగా ఈ సంస్కృతి మనుగడలో ఉంది? వంటి ప్రశ్నలపై, దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందువల్ల, ఈ భూత కోలా గురించి వివరంగా తెలుసుకోవాలంటే, ఈ శీర్షికను పూర్తిగా చదవండి. ఈ ప్రపంచంలో మరెక్కడా చూడని ఎన్నో ఆచార వ్యవహారాలకు ఆలవాలం, మన భారత దేశం. ఎందుకంటే, ఈ భూమిపై మొట్ట మొదటిసారి నాగరికత సాధించిన ఏకైక దేశం మన దేశమే అవ్వడంతో, ఈ అఖండ భారతావనిలో ఎక్కడికి వెళ్ళినా, కొన్ని యుగాల నాటి ఆచార వ్యవహారాలూ, నాటి తాలుకు గుర్తులూ, ఏదో ఒక విధంగా కనిపిస్తూనే ఉంటాయి. అటువంటి

దృష్టికి పెట్టుకునే రాగి యంత్రాలు Drishti Yantras

Image
దృష్టికి పెట్టుకునే రాగి యంత్రాలు పూజ గదిలో పెట్టుకోవచ్చా? అసలు రాగి యంత్రాల వల్ల ప్రయోజనం ఉందా? ఇది చదివితే మీకే అర్ధం అవుతుంది.. మనిషి ఉదయం లేచినప్పటి నుంచి, రాత్రి పడుకునేంత వరకు, ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో, ఇతరులు మనల్ని చూసో, మన ఇంటిని చూసో, ఈర్ష్య చెందుతుంటారు. దాని వల్ల, మనకు తెలియకుండానే దృష్టి ప్రభావం ఇంటిపై పడటం వల్ల, ఆ ఇంట్లోని వారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల, ఆ దృష్టి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి, ఇంటికి బూడిద గుమ్మడికాయను కట్టడం, ఇంటికి దృష్టి తీయయడం వంటి కొన్ని పరిహారాల గురించి, ధర్మ సందేహాలలో స్పష్టంగా చెప్పబడింది. అయితే, మనలో చాలా మంది, దృష్టి పోడానికి కొన్ని రాగి రేకు యంత్రాలను సైతం తెచ్చుకుని, ఇంటి ముందు కట్టుకుంటారు. కానీ మరికొంతమంది, వాటిని దేవుడి గదిలో కూడా పెట్టుకోవడం చూస్తుంటాము. ఆ రాగి రేకులను పూజ గదిలో పెట్టుకోవచ్చా, లేదా? రాగి రేకుల వల్ల దృష్టి నిజంగా పోతుందా? దృష్టిని తొలగించే యంత్రాలను, దేవుడి గదిలో ఎందుకు పెట్టమని చెబుతున్నారు? వంటి సందేహాలు ఎన్నో, మనలో చాలా మందికి కలగకమానవు. అటువంటి సందేహాలకు సమాధానాలు తెలియయాలంటే, ఈ శీర్షికన

లక్ష్మీ కటాక్షం - Avoid doing these things on bed..

Image
  మంచంపై ఈ పనులు చేయకపోతే లక్ష్మీదేవి మీ ఇంటే స్థిరంగా ఉంటుందని మీకు తెలుసా? గత కొన్నేళ్లుగా జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఆధునీకరణ నేపద్యంలో, నగరాలలో నివసించే ప్రజల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దాంతో, ఒకప్పుడు విశాలంగా ఉండే ఇళ్ళు కాస్తా, ఇరుకు గదులుగా తయారవుతున్నాయి. అందువల్ల, నేడు చాలా మంది నేర్చుకుంటున్న కొత్త అలవాటు, మంచాలను ఎక్కవగా వాడటం. అవసరం ఉన్నా లేకపోయినా, మనలో చాలా మంది, మాట్లాడితే మంచంపైనే ఎన్నో పనులు చేస్తున్నారు. అయితే, కొన్ని పనులు మాత్రం, మంచంపైన అస్సలు చేయకూడదనీ, అలా చేస్తే, అష్ట కష్టాలనూ కోరి తెచ్చుకున్నట్లవుతుందనీ, పండితులు చెబుతున్నారు. అసలు మంచంపైన ఏ పనులు చేయవచ్చు? ఏ పనులు చేయకూడదనే విషయంపై, మనలో చాలా మందికి అవగాహన ఉండదు. అందువల్ల, శాస్త్రానుసారం, మంచం పై చేయాల్సిన, చేయకూడని పనుల గురించి, తెలుసుకుందాము. ఈ మధ్య కాలంలో గదులు చిన్నగా ఉండటం వల్లనో, బెడ్ రూమ్ లోనే టీవీ ఉందనో, మంచం మీద బాగా కంఫర్ట్ గా ఉందనో, చాలా మంది, ఉదయం టిఫిన్ నుంచి, రాత్రి భోజనం వరకు, మంచాలపైనే కుర్చుని తింటున్నారు. ఆ విధంగా అస్సలు చేయకూడదని, పండితులు చెబుతున్నారు. మంచంపై కుర్చుని తినడం వల్ల,

సవ్యసాచి - భగవద్గీత | Savyasachi - Bhagavadgita

Image
'సవ్యసాచి'! రెండు చేతులతోనూ సమాన వేగము, ప్రతిభతో బాణములను సంధించగలవాడు! 'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (31 – 35 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 31 నుండి 35 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. శ్రీ కృష్ణుడి విశ్వరూప దర్శనాన్ని చూసి, అర్జునుడు ఈ విధంగా ప్రణమిల్లుతున్నాడు.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/6LckBaTv098 ] 00:47 - ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోఽస్తు తే దేవవర ప్రసీద । విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ ।। 31 ।। ఓ భయంకర రూపము కలవాడా, నీవెవరో తెలియచేయుము. ఓ దేవదేవా, నీ ముందు ప్రణమిల్లుతున్నాను; దయచేసి నాపై కృప చూపుము. సమస్త సృష్టికన్నా ముందే ఉన్న నీ గురించీ, నీవెవరో తెలుసుకోగోరుతున్నాను. ఎందుకంటే, నీ స్వభావము, మరియు వ్యవహారమును నేను అర్థం చేసుకోలేకున్నాను. ఇంతకు క్రితం అర్జునుడు, విశ్వ రూపమును చూడాలని ప్రార్

దీపారాధన ఇలా చేయకపోతే ఇంట్లో దరిద్రం తాండవించడం ఖాయం! Deeparadhana Process

Image
దీపారాధన ఎలా చేయాలి?  Deeparadhana or Lighting Lamps or Diyas Importance in Telugu మన సనాతన హైందవ ధర్మంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం మనకు తెలుసు. అయితే, మనలో చాలా మందికి దీపారాధన ఎలా చేయాలి? ఏ ఏ సమయాల్లో ఇవ్వాలి? దీపపు కుందిలో ఎన్ని ఒత్తులు వేయాలి? దీపాన్ని ఏ దిక్కున వెలిగించాలి? ఎటువంటి కుందులలో దీపారాధన చేయాలి? దీపారాధనకు ఏ నూనెను వాడాలి? దీపం వెలిగించినప్పుడు ఏ మంత్రం చదవాలి - అని ఎన్నో సందేహాలు ఉంటాయి. మరి ఆ సందేహాలన్నింటికీ సమాధానం తెలియాలంటే, ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీపారాధన చేసే ముందు, దేవుడి దగ్గర ఉంచిన దీపారాధన కుందులనూ, ఇతర పాత్రలను కూడా శుభ్రం చేసుకోవాలి. ముందు రోజు దేవుడి దగ్గర పెట్టిన మలినాలన్నీ తీసేయాలి. దేవుడి దగ్గర ఉంచే దీపపు కుందులు, ఇత్తడి తో కానీ, పంచ లోహాలతో కానీ, వెండితో కానీ చేసినవే వాడాలి తప్ప, స్టీలు వంటి మరే ఇతర లోహాలూ వాడకూడదు. ఇవి కొనే స్థోమత లేని వారు, మట్టితో చేసిన దీపపు కుందులను వాడవచ్చు. ఇక దీపారాధనకు వాడే తైలాలలో ముఖ్యంగా, మంచి మేలు రకమైన నువ్వుల నూనెను కానీ, ఆవు నెయ్యినీ, లేదా కల్తీ లేని కొబ్బరి నూనెనూ ఉపయోగించాలి.