సఫల ఏకాదశి - Saphala Ekadashi


'సఫల ఏకాదశి' విశిష్టత..

ధనుర్మాసంలో వచ్చే చివరి పండుగ అయిన సఫల ఏకాదశి గురించి తెలుసుకుందాము..  ఈ సఫల ఏకాదశి మహాత్మ్యాన్ని, పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు చెప్పినట్లు, శాస్త్రాలు చెబతున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే, సఫల ఏకాదశి అని అంటారు.

ఈ రోజున నిష్ఠతో ఉవవసించి, జాగరణ చేసి, శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా, పాపాలు నశించిపోతాయి, ముక్తి లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును ఉసిరితోనూ, దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి, సకల సంపదలో చేకూరుతాయి. ఈ రోజున రకరకాల పండ్లను స్వామికి సమర్పించి, ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తే, శుభప్రదం. ఈ సఫల ఏకాదశి రోజున దీప దానం చేస్తే, జీవితంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి.

సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి, ఆలయాలలో దీపాలను వెలిగిస్తే, ఐదువేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుంది. దీనికి సమానమైన యజ్ఞం కానీ, తీర్థం కానీ లేదు.

సఫల ఏకాదశి పవిత్రను చాటిచెప్పే కథను కూడా, శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు, పురాణాలు చెబతున్నాయి. పూర్వం చంపావతి రాజ్యమును మహిష్మంతుడనే రాజు పాలించేవాడు. అతనికి నలుగురు కుమారులుండేవారు. వారిలో జేష్ఠ పుత్రుడు లుంపకుడు.

లుంపకుడు అధర్మ వర్తనుడై జీవిస్తుడడంతో, కుమారుడని వాత్సల్యం చూపక, రాజు వానికి రాజ్య బహిష్కరణ శిక్షను విధించాడు. లుంపకుడు అడవుల పాలై, ఆహారము దొరకక, తన పరిస్థితికి చింతిస్తూ, పశ్చాత్తాప పడుతూ, ఒక అశ్వత్థ వృక్షము వద్ద రాత్రంతా గడిపి, ఆకలి దప్పులకు తాళలేక సృహ తప్పి పడిపోయాడు.

ఆనాడు ఏకాదశి.. ఆహారం లభించక, అప్రయత్నముగా ఉపవాసమును పాటించడంతో, శ్రీహరి కటాక్షముతో రాజ్యాన్ని పొందినట్లు, పురాణాలు చెబతున్నాయి. లుంపకుడు సక్రమమైన పరిపాలన చేసి, మరణాంతరము వైకుంఠానికి చేరుకున్నాడని, బ్రహ్మాండ పురాణ కథనం.

ఈ ఏకాదశి వ్రత మాహాత్మ్యాన్ని, పరమ శివుడు స్వయముగా పార్వతికి చెప్పినట్లు, పద్మ పురాణం చెబుతోంది. అందుకే ఈ రోజున, తెలిసి కానీ, తెలియక కానీ ఉపవాస దీక్షను చేస్తే, పుణ్య లోకాలను పొందుతారు. వైకుంఠ ప్రాప్తీ, ఐశ్వర్యాలూ కలుగుతాయని, శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్లు పురాణ విదితం.

హరినామ స్మరణం సమస్తపాప హరణం.. జై శ్రీమన్నారాయణ!

Saphala Ekadashi

The eleventh day of the lunar phase is known as Ekadashi. Each Ekadashi is considered holy and has a special significance intended for Lord Vishnu worship. The Saphala Ekadashi is observed in the month of “Pausa” during the Krishna Paksha or the waning phase of the Moon. According to the Gregorian calendar, this corresponds to December and January.

Like all other Ekadashi days, Saphala Ekadashi, also referred to as “Pausa Krishna Ekadashi,” is devoted to Lord Vishnu. On this day, worshippers offer intense devotion to Lord Krishna, a manifestation of Lord Vishnu. In comparison to other Ekadashi days, Saphala Ekadashi is considered to be superior. The person is absolved of all of their sins in life. In Hindi, the word “Saphala” denotes success or prosperity.

It is believed that keeping vrat on Saphala Ekadashi day will bring the devotee great happiness and success in life. The Ekadashi days are traditionally considered as days when a person’s spiritual needs come before their physical needs. The day of Saphala Ekadashi is extremely important to Vaishnavism devotees. Special pujas are performed on this day in Lord Krishna temples all over India.

The kingdom of Champavati was ruled by King Mahishmat, who had five sons. Prince Lumpaka was the eldest of all. Prince Lumpaka was unruly, careless, and impolite. He engaged in a lot of sinful activities and was always challenging the authority of Lord Vishnu. Lumpaka was expelled from the kingdom by the king when his crimes reached new heights. However, Lumpaka persisted in his immoral actions and pillaged the riches of the underprivileged villagers. Finally, the king’s men caught him in the act.

However, because he was still a prince, he was freed and absolved of the crime. Lumpaka lived under a banyan tree all day and all night. He would consume raw meat from slaughtered animals. But over time, his conscience began to grow heavier due to his sense of isolation and melancholy. Lumpaka began to reflect and understood how his actions, habits, and behavior had ruined his life.

He felt guilty about his sins and felt remorse. Later, on Saphala Ekadashi, Lumpaka fell ill. As a result, he was unable to eat anything during the day or sleep during the night. Lumpaka thus unwittingly performed the Saphala Ekadashi Vrat. The next day, Lumpaka went into the forest as he felt better and picked some fruits, and then offered them to Lord Vishnu. Lumpaka’s life was completely altered by this incident.

He restarted his life the following day and went back to his kingdom. The king appointed Lumpaka as his successor after learning of his transformation. The vrat that Lumpaka unknowingly observed on the Ekadashi Tithi bore fruit for Lumpaka. Lumpaka then ruled his kingdom for a very long time. After his death, he was granted a place in Vaikuntha (abode of Lord Vishnu).

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History

మనిషి శరీరాన్ని పోలిన మెత్తటి శరీరం గల నరసింహ స్వామి విగ్రహం ఎక్కడుంది? Hemachala Lakshmi Narasimha Swamy Mallur