Posts

'8-4-2024' వ తారీకు సోమవారం రోజున, 'సోమావతీ అమావాస్య'.. Somavathi Amavasya 2024

Image
'8-4-2024' వ తారీకు సోమవారం రోజున, 'సోమావతీ అమావాస్య'..  @mplanetleaf    అమ్మాయికి, లేక అబ్బాయికి పెళ్లి సంబంధం కుదరడం ఆలస్యం అవుతున్న వారికీ, నిరుద్యోగులైన వారికీ శివుడు అందించిన అద్భుత అవకాశం 'సోమావతీ అమావాస్య'. సోమావతీ అమావాస్య రోజున ఈ చిన్ని పరిహారం చేస్తే, శివానుగ్రహంతో సమస్త శుభములనూ సమకూర్చుకో గలరు.. సోమవతీ అమావాస్య రోజున ఏం చేయాలి? శివుడికి సోమవారం అంటే చాలా ప్రీతికరం అన్న విషయం అందరికీ తెలిసిందే. అమావాస్య కలసి వచ్చే సోమవారమే ‘సోమవతీ అమావాస్య’. దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే! తన అల్లుడైన శివుడిని అవమానించేందుకే, దక్షుడు ఆ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకు చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా, శివుడి భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా, దక్షుడు ఆమెను కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి, తనను తాను దహించివేసుకున్నది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడై, తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథ గణాలతో పాటుగా, ఆ వీరభద్రుడు దక్షుడి మీద దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చ

గరుడ పురాణం ప్రకారం ఈ తప్పులకు ఎటువంటి శిక్షలు? Garuda Puranam

Image
సంతప్తక బ్రాహ్మణుడు - పంచ ప్రేతాల గాధ! గరుడ పురాణం ప్రకారం ఈ తప్పులకు ఎటువంటి శిక్షలు? మనిషి జీవన గమనంలో ఇటువంటి తప్పులు చేస్తే, వాటికి శిక్షలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసుకుని, సన్మార్గంలో నడుచుకోవాలనే ఉద్దేశ్యంతో, గరుడుడికి శ్రీ మహావిష్ణువు చెప్పిన అమృత వాకులను, అష్టాదశ పురాణాలలో ఒకటైన ‘గరుడ పురాణం’ పేరిట మనకు అందించారు, కృతికర్త అయిన వ్యాస భగవానుడు. ఇక అందులోని ఏడవ అధ్యాయంలో నిక్షిప్తమైవున్న ‘సంతప్తక బ్రాహ్మణుడు - పంచ ప్రేతాల గాధ’లోకి వెళితే.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/gPM542QYpBA ] విష్ణు మహిమ విస్తారంగా కనిపించే కథను వినాలని వుందని గరుత్మంతుడు వేడుకోగా, ఆతనిని అనుగ్రహించి ఇలా చెప్పసాగాడు శ్రీ మహావిష్ణువు.. “గరుత్మంతా! పూర్వకాలంలో సంతప్తకుడనే తపోధనుడైన బ్రాహ్మణుడొకాయన వుండేవాడు. ఆయన తన తపోబలం వల్ల, పాపరహితుడయ్యాడు. ఈ ‘సంసారం’ పేరులోనే గానీ, తత్త్వంలో సారం లేనిదని తెలుసుకుని, అడవులలోకి పోయి, వైఖానస మునుల వృత్తినే తానూ పాలిస్తూ, అరణ్యంలోనే చరిస్తుండే వాడు. బాహ్య చిత్తవృత్తులను అదుపులో పెట్టుకుని, తద్ద్వారా ఇంద్రియాలపై విజయం సాధించే ఉద్దేశ్యంతో, తీర్థయాత్రలకు బయల

రంగుల కేళి హోళీ విశిష్ఠత! Holi Festival 2024

Image
మిత్రులూ, శ్రేయోభిలాషులందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు 💐 రంగుల కేళి హోళీ విశిష్ఠత! - https://youtu.be/X7RDDA-ApRw

Satyameva Jayate | సత్యమేవ జయతే! - ఒక మంచి కథ..

Image
సత్యమేవ జయతే! - ఒక మంచి కథ.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మరణానికి సిద్ధపడిన నంద ఎవరు? మన పురాణాలు సన్మార్గ బోధకాలు. వీటిలో మనకు ఎన్నెన్నో మంచి కథలు కనిపిస్తాయి. ఒక కథకు మంచి కథ అనిపించుకోవడానికి, కచ్చితమైన లక్షణాలంటూ ఏమీ ఉండవు. ఎందుకంటే, ఏవి మంచి కథకు ఉండకూడని లక్షణాలని అనుకుంటామో, ఆ లక్షణాలతోటే మంచి కథ అనిపించుకునేవీ వస్తూనే ఉంటాయి. అలాగే, మంచి కథ లక్షణాలని మనం అనుకునేవన్నీ పొదుగుకునీ, నిరుత్సాహపరిచే కథలూ ఉంటాయి. మంచి కథ మొదలయ్యాక, ఏదో ఒక క్షణంలో పాఠకుణ్ణి ట్యూన్ చేసుకుని, తనలో లీనం చేసుకుంటుంది. అందుకు పాఠకుడి నేపద్యమూ, అనుభవాలు కూడా, అన్నిసార్లూ కారణం కాకపోవచ్చు. కథను అనుసరించే సమయంలో, మన మానసిక స్థితిగతులే అందుకు కారణం కావచ్చు. చిట్టచివరికి అది పాఠకుడు, లేక వీక్షకుడిపై కలిగించే స్పందనా, ప్రభావమే గీటురాళ్లు. అందరికీ సన్మార్గాన్ని బోధించే వ్యాస విరచిత అష్టాదశపురాణాలలో ఒకటైన ‘పద్మపురాణం’ లోని అటువంటి ఒక కథను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. ఇదే కథను కొంత రూపాంతరంతో, పంచతంత్ర కథలలో కూడా మనం చూడవచ్చు. ఇక కథలోకి వెళితే.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/9omJY5UQwQ4

Dreams and What They Really Mean as per Garuda Purana | గరుడ పురాణం ప్రకారం కలలు!

Image
కలలు! జీవిత సత్యాలు.. ‘గరుడ పురాణం’ ప్రకారం మనకు వచ్చే ఈ కలలకు అర్ధం తెలుసా? సాధారణంగా ఎవరికైనా కలలు రావడం అనేది సహజమే. వాటిలో కొన్ని సంతోషం కలిగించేవిగా ఉంటే, కొన్ని పీడ కలలు కూడా వస్తూంటాయి. కొన్ని మనకు కర్తవ్య బోధ చేసేవిగా ఉంటే, మరికొన్ని ఎక్కడో ఆకాశంలోనుంచి పడిపోతున్నట్లు, విచిత్రంగా కూడా ఉంటాయి. వీటిలో కొన్ని కలలు గుర్తుంటాయి, మరికొన్ని గుర్తుండవు. మన పురాణాలు, శాస్త్రాల ప్రకారం, తెల్లవారు జామున వచ్చే కలలు నిజం అవుతాయంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం కూడా, కలలో వచ్చేవి కొన్ని నిజం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, కలల గురించి గరుడపురాణంలో, శ్రీ మహావిష్ణువు గరుడుడికి తెలియజేసిన సత్యాలేంటి? వాటిపై ప్రేతాల ప్రభావం ఉంటుందా? కలలో కనిపించే కొన్నింటికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వాటికి ప్రాయశ్చిత్తాలేంటి వంటి విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/lqxfEzeB4Uc ] గరుడపురాణంలో శ్రీ మహావిష్ణువు చెప్పిన ప్రకారం, కొన్ని కలలు మన మానసికి స్థితి మీద ఆధారపడి ఉంటే, కొన్ని క

భోజన నియమాలు - Meal Rules

Image
సనాతన సాంప్రదాయంలో తప్పక తెలుసుకోవలసిన భోజన నియమాలు.. 1. భోజనానికి ముందు, తరువాత తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి. 2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది. 3. ఆహార పదార్థాలు (కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) తినే పళ్ళానికి తాకించరాదు. అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి. ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. అది చాలా పెద్ద దోషం. 4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు. 5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు. 6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు, తాకరాదు. 7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు. ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి. 8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు. 9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు. *బఫే పద్దతి* పూర్తిగా మన సనాతన హైందవ ధర్మానికి విరుద్ధం. దయచేసి దీనిని వీలైనంత వరకు పాటించవద్దు. పాదరక్షలు తో పొరపాటున కూడా భోజనం చేయవద్దు. 10. భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి. 11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన

Who are you? What is Karma Siddhanta? | ఎవరు నువ్వు? కర్మ సిద్ధాంతం ఏమిటి?

Image
ఎవరు నువ్వు? కర్మ సిద్ధాంతం ఏమిటి? కోరికలు తీరకపోతే నమ్ముకున్న దైవాన్ని మార్చి, వేరే దైవాన్ని ఆశ్రయిస్తారా? సనాతనధర్మం ప్రకారం కర్మ సృష్టి ధర్మం. ప్రకృతి గుణాల వలన కర్మలు నిర్వహించబడతాయి. మానవుడు స్వతంత్రుడు కాదు.. కర్మబద్ధుడు! కర్మ ఫలితంగానే జన్మ ఆధారపడి ఉంటుంది. ఈ జన్మలో అనుభవించగా మిగిలిన కర్మ ఫలాన్ని, మరు జన్మలో అనుభవించక తప్పదు. జీవుల కష్ట సుఖాలకూ, లాభ నష్టాలకూ ఇతరులు కారణం కాదు. భార్యా బిడ్డలూ, బంధు మిత్ర, సంయోగ వియోగాలూ, పురాకృత కర్మ ఫలితాలే. అసలు నువ్వెవరు? బలీయమైన కర్మ సిద్ధాంతం ఏమిటి? అనే జీవిత సత్యాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/obtCjPk1svs ] 64 లక్షల జీవ కణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే, అందులో ఒకే ఒక్క జీవ కణం మాత్రమే, తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి, శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత, కేవలం 24 గంటలలో, అండాన్ని పట్టుకుని బ్రతకకపోతే, ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే.