Posts

ఆకర్షణ! భగవద్గీత Bhagavadgita Chapter 14

Image
ఆకర్షణ! స్త్రీ-పురుషుల మధ్య ఆకర్షణ పెంచేది ఏది? 'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (09 – 13 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 09 నుండి 13 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/MBDgoVEZ_08 ] సత్త్వ, తమః, రజో గుణముల లక్షణాలను, ఈ విధంగా తెలియజేస్తున్నాడు భగవానుడు.. 00:48 - సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత । జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ।। 9 ।। సత్త్వము వ్యక్తిని భౌతిక సుఖాలకు కట్టివేస్తుంది; రజో గుణము, జీవాత్మకు కర్మల పట్ల ఆసక్తిని కలిగిస్తుంది; తమో గుణము, జ్ఞానమును కప్పివేసి, వ్యక్తిని మోహభ్రాంతికి బంధించివేస్తుంది. సత్త్వ గుణములో భౌతిక జీవన క్లేశములు తగ్గుతాయి, మరియు ప్రాపంచిక కోరికలు తగ్గుముఖం పడతాయి. ఇది వ్యక్తి యొక్క స్థితిలో, ఒకలాంటి సంతుష్టిని కలుగచేస్తుంది. ఇది మంచిదే.. కానీ, దీనితో ఒక ఇబ్బంది కూడా ఉంద

ఏది శాకాహారం – ఏది మాంసాహారం? Story of Dharmavyadha and his curse - Varaha Purana

Image
ఏది శాకాహారం – ఏది మాంసాహారం? అత్తా-కోడళ్ల మధ్య సఖ్యత లోపించడానికి ఆ శాపమే కారణమా? అత్తాకోడళ్ల సమస్యలు ఇనాటి కావు. తరతరాలుగా, నిజం చెప్పాలంటే, యుగయుగాలుగా వస్తూ ఉన్నవే. అసలు అత్తాకోడళ్ల మధ్య అన్యోన్యత లోపించడానికి కారణమేంటో తెలుసా? బ్రహ్మ జ్ఞానాన్నెరిగిన కిరాతుడిచ్చిన శాపం ఏంటి? వేటను వృత్తిగా చేసుకుని జీవించే వ్యక్తి, తన కూతురిని ముని శ్రేష్ఠుడికిచ్చి వివాహం జరిపించి, ఆ విధంగా ఎందుకు శపించాడు? వరాహ పురాణంలో వివరించబడిన ధర్మవ్యాధుడనే కిరాతుడి వృత్తాంతంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/aton1Ucj7gY ] వేల సంవత్సరాల క్రితం, వేటను జీవన వృత్తిగా చేసుకుని జీవించేవాడు, వ్యాధుడనే కిరాతుడు. తన కుటుంబం కోసం, రోజుకొక అడవి పందిని చంపి, తన సేవకులనూ, బంధువులనూ, అతిథులనూ, అగ్నినీ సంతృప్తి పరచేవాడు. అతడు కిరాతుడైనప్పటికీ, ప్రతిరోజూ అగ్నిని పూజిస్తూ, నిత్య కర్మలను ఆచరిస్తూ, సత్యాన్నే పలుకుతూ, తన జీవన యాత్రను కొనసాగించాడు. ఏనాడూ అతడు సాధు జంతువులను చంపలేదు. ధర్మ మార్గాన్ని అనుసరించడం వలన వ్యాధుడికి, ధర్మవ్యాధుడనే పేరు స్

హనుమద్విజయోత్సవం Hanumath Vijayotsavam

Image
అందరికీ హనుమద్విజయోత్సవ శుభాకాంక్షలు 💐 ఆంజనేయ స్వామి అద్భుత చరిత్ర!: https://youtu.be/6wOkEw-wpsw హనుమంతుడు భీముడికి చెప్పిన యుగ ధర్మాలు!: https://youtu.be/5Qbjiqk3f9I ఆవేశంలో ఉన్న హనుమకు సీతమ్మ చెప్పిన కథ!: https://youtu.be/YK8QjVW2kc0 అర్జునుడి రథంపై హనుమంతుడు ఉండడానికి గల కారణం!: https://youtu.be/F3pdXaWX7ps మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం ।  వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి ।। చైత్రపౌర్ణమి హనుమాన్ జయంతి కాదు విజయోత్సవమే.. హనుమంతుని సహాయంతో సీత జాడను వెతకడం, రావణుడిపై యుద్ధానికి రామసేతు వారధిని నిర్మించడం, లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు పర్వతంతోసహా సంజీవిని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించడం, ఇలా రాముడు ఎదురైన క్షణం నుంచీ, తిరిగి అయోధ్య చేరుకునే వరకూ, శ్రీరామ విజయం వెనుక అడుగడుగునా హనుమంతుడు ఉన్నాడు. అయోధ్యకు చేరుకుని, పట్టాభిషేక ఘట్టం ముగిసిన తర్వాత, రాముడు ఇలా అనుకున్నాడు.. "హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీతాదేవి తిరిగి వచ్చింది.. తిరిగి అయోధ్యా నగరంలో పట్టాభిషిక్తుడిని అయ్యాను.. ఈ రోజు ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారంటే, ఈ విజయం, ఆనందం,

నిర్లక్ష్యమూ, సోమరితనమూ, మరియు నిద్రచే భ్రమకు గురి చేసేది ఏది? భగవద్గీత Bhagavadgita

Image
నిర్లక్ష్యమూ, సోమరితనమూ, మరియు నిద్రచే భ్రమకు గురి చేసేది ఏది? 'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (05 – 08 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 05 నుండి 08 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/wK2c-rdTcMI ] నాశములేని నిత్య జీవాత్మను, నశ్వర దేహమునకు బంధించేవి ఏంటో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు.. 00:49 - సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః । నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ।। 5 ।। ఓ మహా బాహువులుగల అర్జునా.. భౌతిక ప్రాకృతిక శక్తి అనేది, సత్త్వ గుణము, రజో గుణము, మరియు తమో గుణమను త్రిగుణములను కలిగి ఉంటుంది. ఈ గుణములే, నాశములేని నిత్య జీవాత్మను, నశ్వర దేహమునకు బంధించును. పురుషుడు, మరియు ప్రకృతి చేతనే, సమస్త జీవ రాశులూ ఉద్భవించాయని చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు ప్రకృతి జీవాత్మను ఎలా బంధించివేస్తుందో, వివరించబోతున్నాడ

ఈ రోజు '31-03-2023' ధర్మరాజ దశమి! Dharmaraja Dasami

Image
  ఈ రోజు '31-03-2023' ధర్మరాజ దశమి! ఈ పుణ్య దినాన్ని 'ధర్మరాజ దశమి' లేదా 'యమ ధర్మరాజ దశమి' అంటారు. ఈ రోజు, మరణానికి దేవుడయిన యమ భగవానుడికి అంకితం చేయబడింది. యమధర్మరాజు అని కూడా పిలువబడే ధర్మరాజుకు అంకితం చేసిన పూజ ఈ రోజు జరుగుతుంది. ఈ వ్రతాన్ని 10వ రోజు చైత్ర మాసం శుక్ల పక్షంలో పాటిస్తారు. ప్రాథమికంగా ఈ రోజున చేసే పూజలు, భక్తుడి నుండి మరణ భయాన్ని తొలగించే దిశగా ఉంటాయి. మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవడానికి యమ నివాసానికి వెళ్ళిన కథ, ఉపనిషత్తులోని యువ నచికేతుల కథ, వినడం ఆనందంగా ఉంటుంది. ఉపనిషత్తులకు వేదాంతాలు అని పేరు. ఆధ్మాత్మిక జ్ఞానంలోని లోతును 'వేదాంతం' అని పిలుచుకునేంతగా ఉపనిషత్తులు భారతీయ తాత్విక చింతనను ప్రకటిస్తున్నాయి. ఉపనిషత్తులో అక్కడక్కడా కొన్ని కథలు కనిపించినా, వాటిలో సత్యకామజాబాలి, నచికేతుడి కథలకి చాలా ప్రాముఖ్యత ఉంది. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని లక్షణం అని సత్యకామజాబాలి చెబితే, అన్న మాటకు కట్టుబడాలి అని నచికేతుని కథ ప్రస్ఫుటం చేస్తుంది.. [ పిచ్చుకల రూపంలో ధర్మదేవతలు జాబాలికి నేర్పిన గుణపాఠం: https://youtu.be/L4UeG2rUorU ] ఇక న

ప్రకృతి గర్భము వంటిది, ఆత్మలు రేతస్సు వంటివి! భగవద్గీత Bhagavadgita

Image
  జీవాత్మ - దేహము! ప్రకృతి గర్భము వంటిది, ఆత్మలు రేతస్సు వంటివి! 'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (01 – 04 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 01 నుండి 04 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/VswiutHKUvg ] ఈ అధ్యాయము, దేహము మరియు దాని మూలకముల యొక్క మూలశక్తి అయిన భౌతిక శక్తి యొక్క స్వభావమును వివరిస్తుంది. 00:50 - శ్రీ భగవానువాచ । పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ । యద్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ।। 1 ।। శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క సర్వశ్రేష్టమైన విద్యనూ, అన్నింటికన్నా ఉత్తమమైన జ్ఞానమునూ నీకు వివరిస్తాను; ఇది తెలుసుకున్న గొప్ప సాధువులందరూ, అత్యున్నత పరిపూర్ణతను సాధించారు. గతంలో శ్రీ కృష్ణుడు, ఆత్మ మరియు భౌతిక పదార్ధ మేళనముతోనే, సమస్త జీవ భూతములూ తయారైనాయని చెప్పి ఉన

ఆనాడు రాముడు చేసినపని ధర్మబద్ధమేనా? Killing Vali: Rama's Confession

Image
ఆనాడు రాముడు చేసినపని ధర్మబద్ధమేనా? రాముడు చేసిన తప్పు ద్వాపర యుగంలో శాపంగా మారిందా? మన పురాణాలనుంచి మనం నేర్చుకోవలసిన ధర్మసూక్ష్మాలు కోకొల్లలు. రామాయణంలో ఎన్నో గొప్ప పాత్రలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన వారు, ఇంద్ర, సూర్య తనయులైన వాలి, సుగ్రీవుల గురించి. వానర జాతిలో మహా బలవంతులూ, పరాక్రమవంతులుగా పేరుగడించిన ఆ సోదరులు, చివరకు శత్రువులయ్యారు. ప్రతిదినమూ బ్రహ్మ ముహుర్తంలోనే నిద్దురలేచి, నాలుగు సముద్రములకు వెళ్లి, సంధ్యోపాసన గావించేవాడు వాలి. పర్వతాల పైకెక్కి, వాటి శిఖరములను కూల్చి, వాటితో బంతాట ఆడుకునేవాడు. పది తలల రావణుడిని మూడు మార్లు ఓడించిన వీరుడు. అంతటి బలవంతుడైన వాలిని, రాముడు చెట్టు చాటు నుండి అంతమొందించడానికి అసలు కారణం, అతని బలమా, గుణమా? రాముడు వాలిని చంపడం ధర్మబద్ధంగానే జరిగిందా - వంటి ధర్మాధర్మ వితార్కానికి గురిజేసే ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/9LXSsYA2RbE ] వాలి, సుగ్రీవుల యుద్ధంలో, కొన ప్రాణాలతో వున్న వాలిని సమీపించారు రామలక్ష్మణులు. వారిని చూడగానే, పరుష పదములతో నిందించాడు వాలి. ‘‘నీతోయుద్