Posts

క్రతవే నమః Kratave Namaha

Image
'క్రతవే నమః' - ఈ నామ జపంతో ఏం జరుగుతుంది? అది సద్గురువు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు కుంభకోణం విజయం చేసిన సమయం. తంజావూరు జిల్లా మొత్తం కరవు కాటకాలతో బాధ పడుతున్నది. ఒక పుష్కరకాలంగా సకాలంలో వానలు లేక, ప్రజలంతా ఆకలి దప్పులతో కటకటలాడుతున్నారని, స్థానికులు రాఘవేంద్ర స్వామికి విన్నవించుకున్నారు. అప్పుడు తంజావూరును  పాలిస్తున్న చోళ రాజు, రాఘవేంద్రస్వామి మహిమలు విని, రాఘవేంద్ర స్వామి వారిని శరణు వేడాడు. 'స్వామీ, ఒకప్పుడు ఈ చోళనాడు అన్నదాతగా ప్రసిద్ధి గాంచింది. అటువంటి సశ్యశ్యామలమైన ఈ ప్రాంతం, యిప్పుడు కరవుతో కటకటలాడి పోతున్నది. మా ప్రజలను మీరే కాపాడాలి' అని వేడుకున్నాడు. [ సద్గురువులు: https://www.youtube.com/playlist?list=PLNoNQLGbZ7gY5himzO7p9ex-FBKmdn1L- ] ఆనాటి తంజావూరు ప్రజల ప్రవర్తన, నడవడికను గమనించిన రాఘ వేంద్రస్వామి, "రాజా!  భగవంతుని ప్రీత్యర్ధం, ప్రజలు నిత్యమూ ఐదు రకాల యాగాలు నిర్వర్తించాలి. వాటికి పంచ మహా యజ్ఞాలని పేరు. అవి.. 1. బ్రహ్మ యజ్ఞం... నిత్యం వేదాల నుండి ఒక భాగాన్ని పారాయణం చేయాలి. 2. దేవ యజ్ఞం... అగ్నిహోత్రం, ఔపోసన మొదలైన వైదిక కర్మలతో, దేవతలను తృప్తి ప

జన్మ - విముక్తి Birth and Death

Image
ఎందుకీ జన్మ? ఎప్పుడు విముక్తి? జీవితం మీద విరక్తి కలిగినప్పుడు, ‘ఛీ.. ఎందుకీ జన్మ?’ అని మనలో మనం ఆక్రోశించుకుంటూ ఉంటాము. అసలు మనిషి జన్మ ఏమిటి? దీనికి విముక్తి ఎప్పుడనే విషయాలను తెలుసుకోవాలనుకున్న వారు ముందుకు సాగండి.. [ మరణించిన తరువాత కర్ణుడు తిరిగి భూమిపైకి ఎందుకు పంపబడ్డాడు?: https://youtu.be/vfBBesZcTbw?si=FoJjN6HAcHW4cOKK ] నిజంగా మానవ జన్మ అంత నీచ నికృష్టమైనదా? అసలు మనం ఈ భూమిమీద ఎందుకు పుట్టము? ఎందుకు చనిపోతున్నాము? చనిపోయాక ఎక్కడికి పోతాము? ఇలాంటి ప్రశ్నలన్నీ మనిషికి సర్వ సాధారణంగా కలుగుతుంటాయి. మనం అనుకున్నట్లుగా మనిషి జన్మ నీచమైనది కాదు.. ఉత్తమోత్తమమైనది.. ‘పునరపి జననం, పునరపి మరణం’ అన్నారు పెద్దలు. జన్మ అంటే మళ్లీ పుట్టడం. అంటే, చనిపోయిన వారు మళ్ళీ పుట్టడమే జన్మ. కానీ, తిరిగి మానవ జన్మే వస్తుందని మాత్రం చెప్పలేము. ఎందుకంటే, మనం ఎలాంటి జన్మ ఎత్తాలో మనం సంపాదించుకున్న జ్ఞానం మీదా, తద్వారా కర్మల మీదా మాత్రమే ఆధారపడి ఉంటుంది. కర్మ ఫలాలను బట్టే మనిషి జన్మ ఉంటుంది. మనిషి జన్మ అనేది, మనం దేవుడికి చేరువ కావడానికి మనకు దొరికిన ఓ అపురూపమైన అవకాశం. భక్తి మార్గంలో ఉండి, వైరాగ్యం చెంది

Shraadh: An In-Depth Guide to Hindu Ancestral Rituals - The Garuda Purana | 'శ్రాద్ధాలు' - గరుడ పురాణం!

Image
'శ్రాద్ధాలు' - గరుడ పురాణం! మరణించిన వారి పేరు మీద బ్రాహ్మణులకు పెట్టే భోజనం ఎవరికి చేరుతుంది? మన సనాతన ధర్మంలో, పూర్వీకులకు అంకితం చేయబడిన, సంవత్సరంలోని నిర్దిష్ట కాలాన్ని, పితృ పక్షం అంటారు. పితృపక్షం సమయంలో, పూర్వీకులు తమ వారిని కలవటం కోసం, భూమి మీదకు వస్తారని కూడా చెబుతారు. ఈ సమయంలో స్నానం, దానం, తర్పణం, శ్రార్ధ కర్మలు చేసినప్పుడు, పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెంది, సుఖ సంతోషాలతో వర్ధిల్లేటట్లు దీవిస్తారని చెబుతారు. ప్రతి ఏడాదీ, పితృపక్షాలు భాద్రపద మాసంలో, కృష్ణ పక్షంలో వస్తూ ఉంటాయి. అయితే, మనం ఇక్కడ చేసే తద్దినాలూ, శ్రాద్ధాలూ, మరణించిన మన పితరులకు ఏ విధంగా చేరతాయి? బ్రాహ్మణులకు పెట్టే భోజనం, అన్ని వర్ణాల పితృదేవతలకూ సంతృప్తి చేకూరుస్తుందా - వంటి అనేక ప్రశ్నలను, గరుడ పురాణం, ఆచారకాండలో, గరుడుడు శ్రీ మహా విష్ణువును అడిగాడు. పితృకార్యక్రమాలకు సంబంధించి, గరుడుడు అడిగిన ప్రశ్నలకు, శ్రీ మహా విష్ణువు చెప్పిన దివ్య సమాధానాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/enEKiyfwnxs ] సపిండీకరణ, వార్షిక శ్రాద్ధాల తరువాత, మృత వ్యక్తికి తన స్వకర

కర్మ ఫల త్యాగి - భగవద్గీత | Bhagavad Gita - Karma Phala Tyagi

Image
కర్మఫలత్యాగి! శరీరధారులకు పూర్తిగా ఎటువంటి కర్మలూ చేయకుండా ఉండటం సాధ్యమా? 'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (11 – 16 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 11 నుండి 16 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/7ccCqvQVC90 ] నిజమైన త్యాగి వేటిని త్యజించాలో చూద్దాం.. 00:45 - న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః । యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే ।। 11 ।। దేహమును కలిగీ ఉన్న ఏ జీవికి కూడా, కర్మలను పూర్తిగా త్యజించటం శక్యము కాదు. అందుకే తన కర్మ ఫలములను త్యజించినవాడే, నిజమైన త్యాగి అని చెప్పబడును. కర్మ ఫలములను త్యజించటం కన్నా, అసలు కర్మలనే పూర్తిగా త్యజించటమే మేలు కదా! అని కొందరు వాదించవచ్చు. దానితో ఇక ధ్యానమునకూ, మరియు ఆధ్యాత్మిక చింతనకూ ఎలాంటి అవరోధమూ ఉండదని అనుకోవచ్చు. శ్రీ కృష్ణుడు అది ఆచరణకు సాధ్యంకానిదని తిరస్కరిస్తు

Story of a Pious Woman | 'పుణ్యాత్మురాలు' - బేతాళ కథలు!

Image
'పుణ్యాత్మురాలు' - బేతాళ కథలు! భర్తకు ‘మళ్ళీ పెళ్లి’ చేసిన స్త్రీ పుణ్యాత్మురాలెలా అయ్యింది? బేతాళ పంచవింశతి కథల మూలాలు, అత్యంత ప్రాచీనమైనవి. సా.శ.పూ. 1 వ శతాబ్దానికి చెందిన ఈ కథలు, తొలిసారిగా శాతవాహనుల యుగానికి చెందిన గుణాడ్యుని బృహత్కథలో, ఒక భాగంగా చోటుచేసుకున్నాయి. మొట్టమొదట పైశాచి భాషలో రాయబడిన ఈ కథలు, తరువాతి కాలంలో సంస్కృత భాషలోకి అనువదించబడ్డాయి. అయితే, పైశాచి భాషలోని బృహత్కథ మూలగ్రంధం అలభ్యం కావడంతో, సంస్కృత భాషలో అనువదించబడిన కథలే మిగిలాయి. సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీ మాతకు చెప్పినట్టుగా పేర్కొనే ఆ కథలు, మనలను సన్మార్గంలో నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కథ పంచవింశతి కథలలో ఒకటాకాదా అనే విషయాన్ని పక్కనబెట్టి, కథలోని నీతిని గురించి మీరేమనుకుంటున్నారో, కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక కథ విషయానికి వస్తే, ఒక స్త్రీ తన కుంటుంబాన్ని ఎలా తీర్చుదిద్దుకున్నది? తన భర్తకు రెండవ వివాహం ఎందుకు చేసింది? అందరు అత్తలలాగానే కోడలితో కఠినంగా వ్యవహరించినా కూడా, పుణ్యాత్మురాలిగా ఆ స్త్రీమూర్తి బేతాళ కథలలో స్థానం ఎలా సంపాదించుకోగలిగింది? వంటి విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుక

కర్తవ్య కర్మలు! Regulated Action భగవద్గీత Bhagavad Gita

Image
కర్తవ్య కర్మలు! సన్న్యాసమంటే బాహ్యమైన కర్మలను త్యజిస్తే సరిపోతుందా? 'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (06 – 10 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 06 నుండి 10 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. భగవంతుడి ఖచ్చితమైన, మరియు సర్వోత్కృష్ట తీర్పు ఏంటో చూద్దాం.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/qLSH6cHlzmQ ] 00:47 - ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ । కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్ ।। 6 ।। ఓ అర్జునా, ఫలములపై మమకారాసక్తి లేకుండా, మరియు ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కార్యములు చేయబడాలి. ఇదే నా ఖచ్చితమైన మరియు సర్వోత్కృష్ట తీర్పు. యజ్ఞము, దానము, మరియు తపస్సులు, పరమేశ్వరుని పట్ల భక్తియుక్త భావముతో చేయబడాలి. ఆ దృక్పథం ఇంకా రానప్పుడు, వాటిని తప్పకుండా, అవి తన కర్తవ్యమన్న భావనతో, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. ఒక తల్లి తన స్వార్థ సుఖాలను త్యజించి, బిడ్

గరుడ పురాణం ప్రకారం ‘ప్రేతాత్మలు’! Garuda Purana - Ghosts

Image
గరుడ పురాణం ప్రకారం ‘ప్రేతాత్మలు’! ప్రేతాత్మలు మనకు ఏం చెబుతాయి? ఎలా తెలియబరుస్తాయి? మనలో ప్రతి ఒక్కరికీ సంబంధించిన విషయం, ‘ప్రేతాత్మలు’. ఏ కారణం లేకుండా జ్వరం వచ్చి తగ్గలేదంటే, గాలి శోకిందని భావిస్తాము. ఒక కుంటుంబంలో ఎవరైనా చనిపోయిన తరువాత ఆ ఇంట్లో కీడు జరిగిందంటే, ప్రేతాత్మే కారణమని, పరిహారాలు చూసుకుంటాం. ఈ ప్రేత్మాతల గురించి, శ్రీ మహా గరుడ పురాణం, ధర్మకాండలో, గరుడుడు, విష్ణుమూర్తిని అడుగగా, అందుకు భగవానుడే స్వయంగా సమాధానాలిచ్చాడు. ఎలాంటి మరణాలు పొందిన వారు ప్రేతాత్మలవుతారు? ఎటువంటి వారిని ప్రేతాత్మలు ఆవహిస్తాయి? ప్రేతాత్మల వలన మనకు ఎటువంటి కీడు కలిగే అవకాశం ఉంది? ప్రేతం ఆవహించిన వారు ఎటువంటి చర్యలకు పాల్పడతారు? ప్రేతాల బారి నుండి తప్పించుకోవాలంటే ఏం చేయలి? వంటి ముఖ్య విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/dZKCW8TLpHw ] బ్రహ్మాండాధి నాయకుడిని గరుడుడు ఇలా అడుగుతున్నాడు.. ‘అసలు ఈ ప్రేతాల ఉత్పత్తి ఎలా జరుగుతుంది? అవి ఎలా తిరుగుతాయి? వాటి రూపురేఖలు భోజనాదులు ఎలా ఉంటాయి? అవెక్కడుంటాయి? వాటిని ప్రసన్నం చేసుకోవడం ఎలా? ప్రసన్న చిత్తుడ