‘భవిష్య మాలిక’ గ్రంథంలో... మన వెన్నులో వణుకు పుట్టించే ఆ మహా రహస్యం ఏమిటి?
పూరీ జగన్నాథుని సన్నిధి నుండి ఆ పరమాత్మ స్వయంగా యుగాంతానికి ఇస్తున్న ఆ 5 సంకేతాలు ఏమిటి?
End of Kaliyuga: Bhavishya Malika Predictions! Is Kalki Avatar Already Born? Puri Jagannath Temple Mysteries Explained
'ప్రపంచం' ఒక అదృశ్యమైన మార్పు వైపు అత్యంత వేగంగా పరుగెడుతోంది. రాబోయే కొద్ది రోజుల్లో మానవాళి ఊహించని ఎన్నో వింతలను, భయంకరమైన విపత్తులను కళ్లారా చూడబోతోంది. ఇది ఏదో నాస్ట్రడామస్ చెప్పిన జోస్యం కాదు... బాబా వంగా చెప్పిన అంచనా అంతకన్నా కాదు. ఇది... వందల ఏళ్ల క్రితమే మన సనాతన ధర్మంలో, సాక్షాత్తూ మహర్షులు రాసిపెట్టిన పచ్చి నిజం!
నేటి ఆధునిక శాస్త్రవేత్తలు సైతం సమాధానం చెప్పలేక చేతులెత్తేస్తున్న ఎన్నో విపత్కర పరిణామాలూ, అకస్మాత్తుగా వస్తున్న వాతావరణ మార్పులూ, అంతుచిక్కని రోగాలూ... ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. ఎలాంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే, మన సిద్ధులు, యోగులు తమ దివ్యదృష్టితో ఈ కాలాన్ని దర్శించి, తాళ పత్రాలపై అక్షర సత్యాలుగా లిఖించారు. వారు ఏయే గ్రహాలు ఎలా మారినప్పుడు వినాశనం మొదలవుతుందో ఖచ్చితమైన లెక్కలతోసహా రాసిపెట్టారు. నేటి సైన్స్ కు అందని ఆ కాలజ్ఞానం ముందు, ఇప్పుడు టెక్నాలజీ తలవంచుకుంటోంది. మనం ఊహించని ఒక మహా ప్రళయానికి రంగం సిద్ధమైంది!
పూరీ జగన్నాథుని సన్నిధి నుండి ఆ పరమాత్మ స్వయంగా ఇస్తున్న 5 సంకేతాలు, కలియుగం అంతం కాబోతోంది అనడానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అంతేకాదు, 16వ శతాబ్దంలో ఒడిశాకు చెందిన 'మహాపురుషులు అచ్యుతానంద దాసు' రచించిన "భవిష్య మాలిక" అనే గ్రంథంలో... మన వెన్నులో వణుకు పుట్టించే ఒక మహా రహస్యం దాగి ఉంది. అదేంటో తెలుసా? "కల్కి భగవానుడు ఇప్పటికే అవతరించాడు"!
ఈరోజు మనం కాలగర్భంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన, మరియు అంతే భయంకరమైన రహస్యాన్ని ఛేదించబోతున్నాం. భవిష్య మాలిక గ్రంథం ఏం చెబుతోంది? పూరీ ఆలయంలో కలుగుతున్న ఆ 5 అపశకునాలు ఏమిటి? శ్రీమద్భాగవతం, విష్ణు పురాణాలతో వీటికి ఉన్న లింక్ ఏమిటి? కల్కి అవతారం ఎక్కడ ఉన్నాడు? వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో పూర్తయ్యే సరికి మీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది.
వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/oWUvk0WjtHw ]
విషయంలోకి వెళ్లే ముందు మనం మన సనాతన ధర్మం ప్రకారం 'కాల చక్రం' ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. మన పురాణాల ప్రకారం కాలం ఒక సరళ రేఖ కాదు, అది ఒక చక్రం. సత్య, త్రేతా, ద్వాపర, మరియు కలియుగాలు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి.
శ్రీమద్భాగవతం 12వ స్కంధం, రెండవ అధ్యాయంలో కలియుగ లక్షణాల గురించి శకపురుషుడు శ్రీ సుకదేవ గోస్వామి, పరీక్షిత్తు మహారాజుకు స్పష్టంగా వివరించాడు.
తతశ్చానుదినం ధర్మః సత్యం శౌచం క్షమా దయా ।
కాలేన బలీనా రాజన్ నంక్ష్యత్యాయుర్బలం స్మృతిః ।।
దీని అర్థం... "కలియుగం పెరిగేకొద్దీ మనుషుల్లో ధర్మం, సత్యం, పరిశుభ్రత, క్షమ, దయ, ఆయుష్షు, మరియు జ్ఞాపకశక్తి దారుణంగా నశించిపోతాయి."
కేవలం డబ్బు ఉన్నవాడికే సమాజంలో గౌరవం ఉంటుంది. న్యాయం అనేది లంచాలకు అమ్ముడుపోతుంది. ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నది అదే కదా?
కేవలం భాగవతం మాత్రమే కాదు. మహాభారతంలోని 'అరణ్య పర్వం'లో మార్కండేయ మహర్షి ధర్మరాజుకు కలియుగ లక్షణాల గురించి ఎంతో వివరంగా చెప్పారు. "కలియుగాంతం దగ్గరపడే కొద్దీ మానవ సంబంధాలు మంటగలుస్తాయి. ఆడపిల్లలు అత్యంత చిన్న వయస్సులోనే తల్లులు అవుతారు. పాలకులు ప్రజలను రక్షించడానికి బదులు, వారే పన్నుల పేరుతో దోపిడీదారులుగా మారతారు. ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో వారే పండితులుగా, గొప్పవారిగా చెలామణి అవుతారు" అని మార్కండేయ మహర్షి వేల ఏళ్ల క్రితమే హెచ్చరించారు. ఈ రోజు మనం వార్తల్లో చూస్తున్న దారుణాలకూ, ఆనాటి మహర్షులు చెప్పిన మాటలకూ ఏమైనా తేడా ఉందా? ఒక్కసారి ఆలోచించండి.
అలాగే 'లింగ పురాణం' (Linga Purana) ప్రకారం, యుగాంతానికి ముందు కేవలం మనుషులే కాదు.. ప్రకృతి కూడా తన సమతుల్యతను పూర్తిగా కోల్పోతుంది. అకాల వర్షాలూ, భయంకరమైన కరవులూ మానవాళిని పట్టి పీడిస్తాయి. గంగ లాంటి పవిత్ర నదులు ఎండిపోతాయి. ప్రజలు తమ తల్లిదండ్రులను, గురువులను గౌరవించడం మానేసి, వారిని భారంగా భావిస్తారు. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నప్పుడే, భూమి తనను తాను శుద్ధి చేసుకోవడానికి, ప్రళయానికి దారులు తెరుచుకుంటాయని పురాణాలు ఘోషిస్తున్నాయి.
విష్ణు పురాణం 4వ అంశం, 24వ అధ్యాయం ప్రకారం, మానవుల ఆయుర్దాయం కేవలం 20 లేదా 30 ఏళ్లకు పడిపోయినప్పుడు, కలియుగం అంతం ప్రారంభమవుతుంది. కానీ, అంతకంటే ముందే కొన్ని ప్రళయాలు భూమిని శుద్ధి చేస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయమే ఇప్పుడు ఆసన్నమైందా?
15వ, 16వ శతాబ్దంలో ఒడిశాలో శ్రీకృష్ణ భక్తి తత్వాన్నీ, మరియు దివ్య జ్ఞానాన్నీ, సామాన్య ప్రజలకు అందించడానికి జన్మించిన ఐదుగురు మహా యోగులూ, కవుల సమూహాన్నే "పంచ సఖులు" (ఐదుగురు మిత్రులు) అని పిలుస్తారు. వారి పేర్లు: శ్రీ బలరామ దాసు, శ్రీ జగన్నాథ దాసు, శ్రీ అచ్యుతానంద దాసు, శ్రీ అనంత దాసు మరియు శ్రీ యశోవంత దాసు. సాక్షాత్తూ పూరీ జగన్నాథుని ఆజ్ఞ మేరకు భూమిపై జన్మించినట్లుగా భావించే ఈ ఐదుగురు సిద్దులు, సంస్కృతంలో ఉన్న క్లిష్టమైన వేద పురాణాలను సామాన్యులకు అర్థమయ్యేలా స్థానిక భాషలోకి అనువదించారు. శ్రీ చైతన్య మహాప్రభువుకు అత్యంత ఆప్తులుగా ఉంటూ, భక్తి ఉద్యమాన్ని నడిపించిన ఈ పంచసఖుల రచనలూ, ఆధ్యాత్మిక బోధనలూ, నేటికీ ఆధ్యాత్మిక లోకంలో అత్యంత పవిత్రమైనవిగా మరియు అక్షర సత్యాలుగా కొలవబడుతున్నాయి. ఈ ఐదుగురు మహా యోగులలో అగ్రగణ్యులు శ్రీ అచ్యుతానంద దాసు. వీరు సాక్షాత్తూ జగన్నాథుని ఆజ్ఞ మేరకు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను దర్శించగలిగే త్రికాలజ్ఞులు. వీరు రాసిన లక్షల కొద్దీ తాళపత్రాల సమూహమే "భవిష్య మాలిక" (Bhavishya Malika).
ఈ భవిష్య మాలికలో రాసిన ఎన్నో విషయాలు ఇప్పటికే అక్షరాలా నిజమయ్యాయి. ఉదాహరణకు:
• భారతదేశం విడిపోయి పాకిస్తాన్ భూభాగం ఏర్పడుతుందని.. ఇవన్నీ బ్రిటీష్ వారి పాలన మొదలు కాక ముందే రాశారు.
• ఆకాశంలో ఇనుప పక్షులు ఎగురుతాయని (విమానాలు).
• ఒక వింత రోగం వచ్చి లక్షలాది మంది ప్రజలు చనిపోతారని (కోవిడ్-19 గురించి).
ఇవన్నీ నిజమయ్యాయి. ఇప్పుడు మనం చూడబోయేది, ఈ భవిష్య మాలికలో రాసిన అత్యంత కీలకమైన ఘట్టం, ‘యుగాంతం’ లేదా ‘యుగ పరివర్తన’. అచ్యుతానంద దాసు తన గ్రంథంలో ఒక స్పష్టమైన హెచ్చరిక చేశారు: "పూరీ జగన్నాథుని ఆలయంలో కొన్ని వింతలు జరిగినప్పుడు, ప్రపంచ వినాశనానికి కౌంట్ డౌన్ మొదలైనట్టే" అని రాశారు. ఆ వింతలు ఇప్పుడు మన కళ్ల ముందే జరుగుతున్నాయి. అవేంటో తెలుసా?
పూరీ జగన్నాథ స్వామి ఆలయం ఒక అద్భుతం. సైన్స్ కి అందని ఎన్నో రహస్యాలు అక్కడ దాగున్నాయి. అయితే భవిష్య మాలికలో అచ్యుతానంద దాసు, కలియుగాంతం దగ్గరపడే కొద్దీ పూరీ ఆలయంలో 5 అపశకునాలు కనిపిస్తాయని రాశారు. దురదృష్ట వశాత్తూ, ఆ ఐదూ ఇటీవలి కాలంలోనే జరిగాయి!
మొదటి సంకేతం: ‘నీలచక్రం పైన గ్రద్దలు వాలడం’.. పూరీ ఆలయం పైన ఉండే నీలచక్రం మీదుగా ఏ పక్షీ ఎగరదు. కానీ భవిష్య మాలిక ప్రకారం "ఎప్పుడైతే ఆ నీలచక్రం పైన రాబందులు లేదా గ్రద్దలు వాలుతాయో, అప్పుడు దేశం మీదకు పెద్ద విపత్తు వస్తుంది." 2019, 2020 మరియు 2023లో అనేకసార్లు నీలచక్రంపై రాబందులు వాలడం, భక్తులు చూసి భయాందోళనలకు గురయ్యారు.
రెండవ సంకేతం: ‘పతితపావన బానా అంటే, పవిత్రమైన జెండా కాలిపోవడం’.. ఆలయం పైన ఎగిరే జెండాను రోజూ మారుస్తారు. ఇది గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. మాలికలో చెప్పినట్లుగా, 2020 మార్చిలో అంటే సరిగ్గా కోవిడ్ లాక్ డౌన్ సమయంలో, గుడి పైనున్న పవిత్ర జెండా అనుకోకుండా నిప్పు అంటుకుని కాలిపోయింది. ఇది ఒక తీవ్రమైన హెచ్చరికగా పండితులు భావించారు.
మూడవ సంకేతం: ‘ఆలయం నుండి రాళ్ళు కింద పడటం’.. "జగన్నాథుని గర్భగుడి లేదా ఆలయ గోపురం నుండి ఎప్పుడైతే రాళ్ళు కిందపడతాయో, అది ప్రళయానికి ప్రారంభం." గత కొన్నేళ్లుగా పూరీ ఆలయంలోని కల్పవృక్షం దగ్గర, మరియు ఇతర ప్రదేశాలలో, పైకప్పు నుండి రాళ్లు ఊడి పడిన సంఘటనలు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.
నాలుగవ సంకేతం: ‘మహా ప్రసాదం పాడైపోవడం’.. పూరీలో రోజూ లక్షలాది మందికి వండే మహా ప్రసాదం, ఎప్పటికీ తక్కువ పడదు, వృథా కాదు. కానీ భవిష్య మాలికలో, "స్వామివారు అన్నప్రసాదాలు స్వీకరించని రోజు వస్తుంది, ఆ రోజు ప్రసాదం కుళ్లిపోతుంది" అని రాశారు. ఇటీవలి కాలంలో కొన్ని అపవిత్ర ఘటనల వల్ల, మహా ప్రసాదాన్ని పారబోయాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
ఐదవ సంకేతం: ‘బడా దండా (Bada Danda) లోకి సముద్రపు నీరు’.. "సముద్రం ఉప్పొంగి, పూరీ రథయాత్ర జరిగే బడా దండా అంటే ప్రధాన రహదారిలోకి నీరు వస్తుంది. జగన్నాథుడు ఆలయం వదిలి కల్కికి తోడుగా వెళ్తాడు." ఇప్పటికే వాతావరణ మార్పుల వల్ల, పూరీ తీరం వేగంగా కోతకు గురవుతోంది. సముద్రం గుడి వైపుగా దూసుకు వస్తోంది.
ఈ ఐదు సంకేతాలు భవిష్య మాలికలో రాసినట్లే అక్షరాలా జరిగాయి! అంటే సమయం ఆసన్నమైందా?
ఇక్కడ మనం ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని జీర్ణించుకోవాలి. పురాణాల ప్రకారం కలియుగం వయస్సు 4,32,000 సంవత్సరాలు. అందులో ఇంకా 4,27,000 ఏళ్ళు మిగిలి ఉందని పండితులు చెబుతుంటారు. కానీ, భవిష్య మాలిక మరియు ఇతర రహస్య గ్రంథాల ప్రకారం... పాపం మితిమీరినప్పుడు, భగవంతుడు యుగం ముగిసేవరకు ఆగాడు! భవిష్య మాలికలో స్పష్టంగా ఒక మాట ఉంది: "కలియుగం వయస్సు తగ్గించబడింది. పాపభారం వల్ల అది తన పూర్తి కాలాన్ని చేరుకోకుండానే అంతమవుతుంది."
భవిష్య మాలిక చెబుతున్న ఈ విషయాన్ని కొట్టిపారేసే ముందు, సాక్షాత్తూ శ్రీమద్భగవద్గీతలో, కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇచ్చిన ఆ గొప్ప వాగ్దానాన్ని మనం ఒకసారి గుర్తుచేసుకోవాలి.
"యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ।।"
"పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ।। "
"ఎప్పుడైతే ధర్మం నశించి, అధర్మం పెచ్చుమీరుతుందో, అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను. సాధువులను రక్షించడానికీ, దుర్మార్గులను శిక్షించడానికీ, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికీ నేను యుగయుగాల్లో అవతరిస్తాను" అన్నాడు భగవానుడు. దేవుడే స్వయంగా ఈ మాట ఇచ్చినప్పుడు, ఈ ఘోర కలియుగంలో పాపం ఇలా కట్టలు తెంచుకుంటుంటే ఆయన రాకుండా ఎలా ఉంటాడు?
అచ్యుతానంద దాసు రాసిన దాని ప్రకారం... విష్ణువు యొక్క ఆ పదవ అవతారమైన కల్కి భగవానుడు ఇప్పటికే భూమి మీద జన్మించాడు! అవును, మీరు విన్నది నిజమే... కల్కి ఇప్పటికే అవతరించాడు.
భవిష్య మాలిక ప్రకారం, కల్కి భారత దేశంలోనే ఒక పవిత్రమైన ప్రదేశంలో జన్మించాడు. కొందరు ఇది ఒడిశా లేదా ఉత్తరప్రదేశ్ అని చెబుతారు. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉంటూ, తన దివ్య శక్తులను సమకూర్చుకుంటూ, భక్తులను ధర్మ మార్గంలో నడిపించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఎప్పుడైతే ప్రపంచం మూడవ ప్రపంచ యుద్ధం (World War 3) అంచున నిలబడుతుందో, ప్రకృతి విపత్తుల వల్ల సగం ప్రపంచ జనాభా అంతరించిపోతుందో... అప్పుడు కల్కి భగవానుడు ప్రపంచానికి దర్శనమిస్తాడు. శ్రీమద్భాగవతం 12వ స్కంధం ప్రకారం: "అశ్వం ఆశుగమారుహ్య దేవదత్తం జగత్పతిః..." అంటే దేవదత్తం అనే తెల్లని గుర్రమెక్కి, కత్తి చేతబట్టి, అధర్మాన్ని నాశనం చేస్తాడు. భవిష్య మాలిక ప్రకారం ఈ సంఘటనలు, రాబోయే అతి కొద్ది సంవత్సరాలలోనే, ఇంచు మించు 2025 - 2032 మధ్య జరగబోతున్నాయని, ఎందరో పరిశోధకులు చెబుతున్నారు. ఇది మనం మన గత వీడియోలో ‘వీరభోగ వసంత రాయల రాక’ గురించి చెప్పుకున్న విషయాలకు చాలా దగ్గరగా ఉండడం కాకతాళీయం కానేకాదు!
కలియుగం అంతం అంటే భూమి నాశనం అవ్వడం కాదు. అధర్మం నాశనం అవ్వడం, ఒక కొత్త "సత్య యుగం" (Satya Yuga) లేదా స్వర్ణ యుగం ప్రారంభం కావడం. ఈ ప్రళయ కాలంలో ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా మారుతుంది. కొన్ని దేశాలు పటంలో లేకుండా సముద్రంలో కలిసిపోతాయి. తీవ్రమైన వ్యాధులూ, యుద్ధాలూ మానవాళిని భయపెడతాయి.
మరి ఈ భయంకరమైన విపత్తుల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? భవిష్య మాలికలో దీనికి ఒకటే పరిష్కారం చెప్పారు. అదే "దైవ నామస్మరణ" మరియు "ధర్మ మార్గం".
ఎవరూ తప్పు చేయకుండా, ఇతరులకు హాని చేయకుండా, నిరంతరం భగవంతుని నామాన్ని ‘ఓం నమో నారాయణాయ లేదా హరే రామ హరే కృష్ణ లేదా ఓం నమః శివాయ’ అని జపిస్తుంటారో... వారిని ఆ భగవంతుడే స్వయంగా రక్షిస్తాడు. కల్కి భగవానుడి అనుగ్రహం పొందాలంటే, గుడికి వెళ్లి లక్షలు దానం చేయాల్సిన పనిలేదు. కేవలం హృదయంలో స్వచ్ఛత, తోటి మనుషుల పట్ల దయ ఉంటే చాలు.
ఈ ప్రకృతి, ఈ విశ్వం ఇస్తున్న సంకేతాలను మనం తక్కువ అంచనా వేయలేము. భవిష్య మాలిక హెచ్చరించిన రోజులు మన కళ్ళముందే కనిపిస్తున్నాయి. సనాతన ధర్మం ఎప్పుడూ భయపెట్టదు. బాధ్యతను మాత్రం ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. మనం ధర్మాన్ని రక్షిస్తే, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది.
ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? కల్కి అవతారం ఇప్పటికే జన్మించారని మీరు నమ్ముతున్నారా? కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేసి వారిని కూడా జాగ్రత్త పడేలా చేయండి. మరిన్ని అద్భుతమైన, నిగూఢ రహస్యాల కోసం మన 'వాయిస్ ఆఫ్ మహీధర్' ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అవకాశం ఉన్నవారు వీడియోను Hype చేస్తారని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్లీ కలుద్దాం.
సర్వేజనాః సుఖినోభవంతు!
