శివం అంటే శుభం అని అర్థం. శివుడు అంటే శుభాన్ని కలిగించేవాడు. శం అంటే సుఖం. శంకరుడు అంటే సుఖాన్ని కలిగించేవాడు. పాలసముద్రం నుంచి హాలాహలం ఆవిర్భవించినప్పుడు, లోకాలన్నీ భయకంపితాలై, హాహాకారాలు చేస్తుంటే, శివుడు ఆ ఘోర విషాన్ని అరచేతిలోకి తీసుకుని, ఆనందంగా తాగాడు. తనకు వెలుపల ఉన్న లోకాలకూ, తనకు లోపల ఉన్న లోకాలకూ ఇబ్బంది కలగకుండా, దానిని తన కంఠ ప్రదేశంలో నిలుపుకున్నాడు. ఇక్కడ గుర్తుంచుకోవలసినది, ఇతరుల ఇబ్బందిని తొలగించడం మన పనయినట్లయితే, మనం ఆ పని చేసి తీరవలసిందే. వారికి వచ్చిన ఇబ్బందిని తీర్చవలసిందే. ఇదే శివతత్వం!
Audi9 – Telugu Mythology & Temple History Stories | Voice of Maheedhar (Planet Leaf), Shadow Madhu Babu Audiobooks, Facts Hive Youtube Channels. Here I bring you Bhagavad Gita in Telugu, Stories of Mahabharata, Ramayana, Science behind Sanatana Dharma, Hinduism, Interesting and Unknown Facts and Mysteries in Telugu, and Writer Madhu babu's Shadow, Folklore, Fantasy Fiction Novels as Audiobooks / Podcasts. Watch interesting videos Every Day in the original Voice of Maheedhar and Sudha..
Search This Blog
Featured Post
The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!
వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...
Monday, March 4, 2024
I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!
శివం అంటే శుభం అని అర్థం. శివుడు అంటే శుభాన్ని కలిగించేవాడు. శం అంటే సుఖం. శంకరుడు అంటే సుఖాన్ని కలిగించేవాడు. పాలసముద్రం నుంచి హాలాహలం ఆవిర్భవించినప్పుడు, లోకాలన్నీ భయకంపితాలై, హాహాకారాలు చేస్తుంటే, శివుడు ఆ ఘోర విషాన్ని అరచేతిలోకి తీసుకుని, ఆనందంగా తాగాడు. తనకు వెలుపల ఉన్న లోకాలకూ, తనకు లోపల ఉన్న లోకాలకూ ఇబ్బంది కలగకుండా, దానిని తన కంఠ ప్రదేశంలో నిలుపుకున్నాడు. ఇక్కడ గుర్తుంచుకోవలసినది, ఇతరుల ఇబ్బందిని తొలగించడం మన పనయినట్లయితే, మనం ఆ పని చేసి తీరవలసిందే. వారికి వచ్చిన ఇబ్బందిని తీర్చవలసిందే. ఇదే శివతత్వం!
Sunday, March 3, 2024
I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!
I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని! - ‘నేను శివుడిని, నేనే శివుడిని’ – అసలు శివతత్వమేమిటి? | TELUGU VOICE
https://youtu.be/UafRztjHW04?si=7AeN4Z9brur793Ek
Monday, February 26, 2024
Kathopanishad Death Indic | మరణం నుండి మరుజన్మ దాకా! ..వాస్తవాలు
ఈ భూమి మీది కాలగణనను అనుసరించి, 24 గంటలను ఒక రోజుగా పరిగణించే విషయం తెలిసిందే. చనిపోయిన వారు, అంటే పితరులు నివసించేది, పితృలోకం. వీరికి శుక్ల పక్షం అంటే, 15 రోజుల కాలం ఒక పగలు కాగా, కృష్ణ పక్షం అంటే, మరో 15 రోజులు ఒక రాత్రి. వెరసి మనుషులు గడిపే ఒక మాసం, పితరులకు ఒక రోజుతో సమానం. పుట్టిన ప్రతి ప్రాణీ, ముందుగా ఈ పితరుల లోకాన్ని చేరి, అక్కడ తమ వారసులు తమకు జరిపే కర్మకాండలనూ, వాటి ఫలితాలనూ అనుభవిస్తుంది. ఇక అటుపైన ఉండేది, దేవలోకం. భూమి మీద మనుష్యుల లెక్కన ఆరునెలలకు ఉత్తరాయణం, మరో ఆరునెలలకు దక్షిణాయనంగా చెప్పబడుతుంది. మనం గడిపే ఈ పన్నెండు నెలలు, దేవలోకంలో ఉండేవారికి ఒక రోజుతో సమానం. అంటే, ఒక పగలు, ఒక రాత్రి అన్నమాట. పుణ్య కర్మలు చేసిన వారికి మరణానంతరం, దేవలోకం దక్కుతుంది. వారు చేసుకున్న కర్మ ఫలితానుసారం, అక్కడ స్వేచ్ఛగా, సుఖ సంతోషాలతో, ఆట పాటలతో, విందు భోజనాలతో, విలాసవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. జీవించి ఉండగా వారు సంపాదించుకున్న కర్మఫలాలు పరిపక్వం చెందగానే, అంటే, మన లెక్కలో, ఖర్చులకు మనం తెచ్చుకున్న పుణ్యఫలం అనే డబ్బు అయిపోగానే, తిరిగి భూలోకంలో మంచి స్థితిమంతులూ, ఆచారవంతుల ఇళ్ళలో పుట్టిస్తాడు, కర్మ, కాలంగా చెప్పుకునే విధాత. తిరిగి ఈ జన్మలో కూడా పుణ్య కార్యాలనూ, నిత్య దైవ నామ స్మరణనూ ఆచరిస్తే, దివ్యదేహధారులై, దివ్యలోకాలకు చేరుతాయి జీవాత్మలు. ప్రతి మనిషీ ప్రయత్నించవలసినది ఈ గమ్యం చెరడానికే..
Thursday, February 22, 2024
ఖర్చులేని స్వర్గం!? Inexpensive Heaven
అప్పుడు గురువు.. "జూదం ఆడటానికీ, చెడు వ్యసనాలైన వ్యభిచారం, మత్తు పానీయాల సేవనం, ధూమ పానం, ఇలా పాపాలతో ప్రయాణించడానికి ఎంతో డబ్బు అవసరం.. కానీ, ప్రేమను పంచడానికీ, దైవ ప్రార్ధనకీ, సేవ చేయడానికీ డబ్బుతో పని లేదు.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అప్పుడప్పుడు ఉపవాసం ఉండడానికి డబ్బు అవసరం లేదు.. ఎదుటి వారిని క్షమించమని అడగడం కూడా ఖర్చులేని పనే.. కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి సంపదలు అవసరంలేదు.. దేవుడిపై నమ్మకం ఉండాలి.. మనపై మనకు, తోటి ప్రాణులపై ప్రేమ, విశ్వాసం ఉండాలి.." అని అన్నాడు.
Monday, February 19, 2024
లలాట లిఖితం! ..మంచి కథ If Death Occurs in 7 days - Real Incident of Sant Eknath
మహారాష్ట్ర ప్రాంతంలో జీవించిన మహాత్ముడూ, భక్తాగ్రగణ్యులలో ఒకరు, సంత్ ఏక్నాథ్ గా ప్రసిద్ధి చెందిన ఏకనాథుడు. ఆయన ఘనతను గురించి ఆ నోటా ఈ నోటా విన్న ఒక వ్యక్తి, ఒక రోజు ఆయనను దర్శించుకోవడానికి వచ్చాడు. ఏకనాథుడు గడుపుతున్న నిరాడంబర జీవితాన్ని చూసి, అతడు ఆశ్చర్య చకితుడయ్యాడు. ఏకనాథుడి ముఖారవిందాన ద్యోతకమవుతున్న దివ్యత్వం, తేజస్సునూ గమనించి, ఆయన పట్ల అమితంగా ఆకర్షితుడయిన అతను ఆయనతో, “స్వామీ! మీ జీవితంలో ఎంతో ప్రశాంతతను చూస్తున్నాను. ఎటువంటి ఆరాటమూ, ఆందోళనా లేకుండా, నిర్మలమైన నీటిప్రవాహంలా మీరు ఎలా మనగలుగుతున్నారో అర్ధం కావడం లేదు! నిరాడంబరతకూ, పావనతకూ మీ జీవితం అద్దంపడుతోంది. కానీ, ప్రాపంచికులమైన మేము, జీవితంలో సదా అనేక సమస్యలతో తల్లడిల్లిపోతున్నాము. ప్రశాంతత మూర్తీభవించిన మీ జీవితం ఎక్కడ? సదా అల్లకల్లోలాలతో నిండిన మా జీవితం ఎక్కడ? మన జీవన విధానాలలో హస్తిమశకాంతర వ్యత్యాసం ఉంది. సమస్యలతో మీ మనస్సు ఎన్నడూ గురయినట్లు తెలియడం లేదు. కానీ, మమ్మల్ని గందరగోళంలో ముంచెత్తే పగ, విసుగు, అహంకారం వంటి దుర్గుణాలు, సదా పట్టి పీడిస్తున్నాయి. మీలాంటి ప్రశాంతమయమైన జీవితం మాకు లభించడం సాధ్యమా? నేనూ మీలా జీవించాలని అభిలషిస్తున్నాను. అందుకు ఏమైనా తరుణోపాయం ఉంటే సెలవివ్వండి స్వామీ!” అని విన్నవించుకున్నాడు.
Friday, February 16, 2024
అందరికీ 'రథ సప్తమి 2025' శుభాకాంక్షలు 🙏 Ratha Sapthami
రథ సప్తమి రోజున స్నానం చేసే సమయంలో పఠించవల్సిన శ్లోకాలు:
Wednesday, February 14, 2024
వసంత పంచమి 2026
-
సృష్టి వినాశనం చేయగలిగే 11 భయంకరమైన అస్త్రాలు! మహాభారతంలో వాడిన ఆ ఆయుధాలు అణ్వాయుధాలా? చరిత్రలోనే అత్యంత భయాంకరమైన యుద్ధం, పాండవులకూ, కౌరవ...
-
అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన అద్భుత నీతి కథ! మహాభారతంలో నేటి జీవన శైలికి ఉపయోగపడే ఎన్నో నీతి కథలున్నాయి. ధర్మరాజు సందేహాల నివృ...
-
శ్రీ కృష్ణ లీలలు! TELUGU VOICE అది మండు వేసవి. మధ్యాహ్నం ఒంటి గంట దాటింది. పండు ముదుసలి, రామ భక్తురాలు అయిన ఒక అవ్వ, తలపై బరువైన పళ్ళ బుట్ట...
-
హరిహర 108 నామాలు.. యమధర్మరాజ కృతం.. TELUGU VOICE హరిహర అష్టోత్తర శతనామ స్తోత్రమ్ - Harihara Ashtottara Shatanama Stotram 108 శివకేశవుల నామా...
-
పాండ్యుల వీరవనిత ‘తడైతగై’ శక్తిగా ఎలా ఉద్భవించింది? భార్య భర్తల మధ్య అన్యోన్యత కోసం ఈ అమ్మవారిని పూజించాలి! మన భారత ఇతిహాసాల ప్రకారం, శక్తి ...
-
దేవుడి పటాల వెనుక బల్లి తిరుగుతుంటే ఏం జరుగుతుంది? భగవంతుడు ఈ భూమిపై తిరిగే ప్రతి జీవికీ ఓ శక్తిని ఇచ్చాడని, శాస్త్రాలు చెబుతున్నాయి. అందు...
-
‘గరుడ పురాణం’ - ఇటువంటి వారిని దూరం పెడితే నరకాన్ని తప్పించుకున్నట్లే! గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి? ‘మరణం’ మారని సత్యం. దాని...
-
మొసలి మింగిన బాలుడు 3 ఏళ్ల తర్వాత ప్రాణాలతో ఎలా తిరిగొచ్చాడు? అవినాశి ఆలయంలోని అద్భుత ఘట్టం! తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఉన్న ప్రసిద్...
-
అష్టదిగ్బంధనం! అష్టదిక్పాలకుల బంధనంలో అరుణాచలం! TELUGU VOICE తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుడు అష్టలింగాలతో దిగ్బంధనం చేయబడ్డాడా? సనాతన సాంప్రదా...
-
పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? వారికి రోజూ నైవేద్యం పెట్టాలా? పుట్టిన వాడు మరణించక తప్పదు, మరణించినవాడు మరల జన్మించిక తప్పదని, భగవద...





