Science & Spirituality of Kundalini కుండలినీ జాగరణ వెనుక ఉన్న సైన్స్!
కుండలినీ జాగరణ వెనుక ఉన్న సైన్స్!
నిద్రావస్థలో ఉన్న మెదడును, మనలో దాగి ఉన్న అనంతమైన శక్తిని మేల్కొల్పే రహస్యం తెలుసా?
Science & Spirituality of Kundalini
మనిషి మెదడు కేవలం 10 శాతం మాత్రమే పనిచేస్తుందనీ, మిగతా 90 శాతం నిద్రావస్థలో ఉంటుందనీ సైన్స్ చెబుతోంది. కానీ, ఆ నిద్రావస్థలో ఉన్న మెదడునూ, మనలో దాగి ఉన్న అనంతమైన శక్తినీ మేల్కొల్పే ఒక రహస్య స్విచ్ మన శరీరంలోనే ఉందని మీకు తెలుసా?
అవును! వేల సంవత్సరాల క్రితం మన ఋషులు ఈ రహస్యాన్ని కనుక్కున్నారు. అదే... 'కుండలిని'. ఒక పాములా మూడున్నర చుట్లు చుట్టుకుని, మన వెన్నెముక కింది భాగంలో నిద్రపోతున్న ఈ అదృశ్య శక్తి ఒకవేళ మేల్కొంటే ఏం జరుగుతుంది? సాధారణ మనిషికి అతీంద్రియ శక్తులు వస్తాయా? లేక పిచ్చివాడిగా మారిపోతాడా?
ఈరోజు మనం ఏ పురాణ కథల గురించో కాదు... ప్రాచీన గ్రంథాలలో చెప్పబడిన 'కుండలిని జాగరణ' అనే మహాద్భుత ఘట్టం గురించీ, దానికీ మరియు మోడ్రన్ మెడికల్ సైన్స్‌కీ ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధం గురించీ, అత్యంత లోతుగా విశ్లేషించబోతున్నాము. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకండి.. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే విషయాలు మీ ఆలోచనా విధానాన్నే మార్చేస్తాయి.
వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/nu4PjaKyLOI ]
కుండలిని అనే పదం ఈనాటిది కాదు. ఉపనిషత్తులు, పతంజలి యోగ సూత్రాలు, 'శివ సంహిత', మరియు 'హఠయోగ ప్రదీపిక' లాంటి ఎన్నో ప్రాచీన గ్రంథాలలో దీని గురించి స్పష్టంగా రాసి ఉంది. 'కుండల' అంటే సంస్కృతంలో 'చుట్టుకుని ఉండటం' అని అర్థం.
యోగ శాస్త్రం ప్రకారం, మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. ప్రాణశక్తి ఈ నాడుల ద్వారానే ప్రవహిస్తుంది. వీటిలో మూడు నాడులు అత్యంత ముఖ్యమైనవి. అవే ఇడా, పింగళ, సుషుమ్న:
1. ఇడా నాడి (Ida Nadi): ఎడమ వైపు ఉంటుంది. ఇది చంద్ర నాడి. చల్లదనాన్ని ఇస్తుంది.
2. పింగళ నాడి (Pingala Nadi): కుడి వైపు ఉంటుంది. ఇది సూర్య నాడి. వేడిని ఇస్తుంది.
3. సుషుమ్న నాడి (Sushumna Nadi): ఇది మధ్యలో ఉండే అతి ముఖ్యమైన నాడి.
సాధారణ మనుషులలో ఈ సుషుమ్న నాడి మూసుకుపోయి ఉంటుంది. ప్రాణశక్తి కేవలం ఇడా, పింగళ నాడుల ద్వారానే ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఒక యోగి, ధ్యానం ద్వారా, ప్రాణాయామం ద్వారా తన శ్వాసను నియంత్రించినప్పుడు... మూలాధార చక్రంలో నిద్రపోతున్న కుండలినీ శక్తి ఉల్లాసం పొంది, సుషుమ్న నాడి గుండా పైకి ప్రయాణించడం మొదలుపెడుతుంది. ఇదే అసలైన మ్యాజిక్!
ఈ కుండలినీ శక్తి పైకి ప్రయాణించే దారిలో 7 ప్రధాన చక్రాలు (Energy Centers) ఉంటాయి. ఇవి భౌతికంగా మనకు కనిపించవు కానీ, మన అస్తిత్వాన్ని నడిపించే స్విచ్ బోర్డులు ఇవే.
1. మూలాధార చక్రం (Root Chakra): వెన్నెముక చివర ఉంటుంది. భయం, మనుగడ (Survival) దీని లక్షణాలు. ఇక్కడే కుండలిని నిద్రపోతూ ఉంటుంది.
2. స్వాధిష్ఠాన చక్రం (Sacral Chakra): బొడ్డుకు కొంచెం కింద ఉంటుంది. సృజనాత్మకత, కోరికలకు స్థానం.
3. మణిపూరక చక్రం (Solar Plexus): బొడ్డు దగ్గర ఉంటుంది. ఆత్మవిశ్వాసం, శక్తికి కేంద్రం.
4. అనాహత చక్రం (Heart Chakra): ఇది గుండె దగ్గర ఉంటుంది. ప్రేమ, దయ ఇక్కడి నుంచే ఉద్భవిస్తాయి.
5. విశుద్ధి చక్రం (Throat Chakra): ఇది గొంతు దగ్గర. కమ్యూనికేషన్, సత్యం మాట్లాడటం దీని లక్షణం.
6. ఆజ్ఞా చక్రం (Third Eye Chakra): ఇది రెండు కనుబొమల మధ్య ఉంటుంది. జ్ఞానం, అతీంద్రియ శక్తులు (Intuition) ఇక్కడే ఉంటాయి. ఇక చివరగా..
7. సహస్రార చక్రం (Crown Chakra): ఇది తల పైభాగంలో ఉంటుంది. వేయి రేకుల పద్మం లాంటిది.
ఈ సప్త చక్రాలకు సంబంధించి మనం గతంలో చేసిన వీడియోలు తప్పకుండా చూడండి..
ఎప్పుడైతే కుండలినీ శక్తి ఈ ఆరు చక్రాలను ఛేదించుకుని వెళ్లి, సహస్రారంలో ఉన్న 'శివునితో' కలుస్తుందో... అప్పుడు జరిగేదే శివ-శక్తి కలయిక. ఆ స్థితిలో మనిషికి ఈ సృష్టి రహస్యాలన్నీ అవగతం అవుతాయని, మన గ్రంథాలు చెబుతున్నాయి.
ఇంతవరకు పురాణాలు, యోగ శాస్త్రం ఏం చెప్పాయో విన్నాం. కానీ మోడ్రన్ మెడికల్ సైన్స్ దీన్ని ఎలా చూస్తోంది? ఇది నిజంగానే ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ఆ?
కచ్చితంగా! దీన్ని వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది.
యోగ శాస్త్రంలో చెప్పిన 'ఇడా', 'పింగళ' నాడులు మన సైన్స్ లోని Autonomic Nervous System లోని రెండు భాగాలకు సరిగ్గా సరిపోతాయి. ఇడా నాడి అనేది Parasympathetic Nervous System. ఇది మనల్ని రిలాక్స్ చేస్తుంది. పింగళ నాడి అనేది Sympathetic Nervous System. ఇది మనల్ని యాక్టివ్ గా ఉంచుతుంది. ఇక సుషుమ్న నాడి అనేది మన Central Nervous System. అంటే మన వెన్నుపాము. దీనినే మనం Spinal Cord అంటాము.
సైంటిస్టుల ప్రకారం, ఈ 7 చక్రాలు ఏవో ఊహాజనితమైనవి కావు. మన శరీరంలో హార్మోన్లను రిలీజ్ చేసే Endocrine Glands అనబడే అంతఃస్రావ గ్రంథులు, మరియు నాడులు కలుసుకునే Nerve Plexuses కు ప్రతిరూపాలే ఈ చక్రాలు.
• మూలాధార చక్రం - Adrenal Glands
• స్వాధిష్ఠాన - Reproductive Glands
• మణిపూరక - Pancreas
• అనాహత - Thymus Gland
• విశుద్ధి - Thyroid Gland
• ఆజ్ఞా చక్రం - Pineal Gland (పీనియల్ గ్లాండ్)
ముఖ్యంగా ఈ పీనియల్ గ్లాండ్ అనేది మన మెదడు మధ్యలో ఒక చిన్న పైన్ నట్ ఆకారంలో ఉంటుంది. ఆధునిక సైన్స్ దీన్ని 'Seat of the Soul' అని పిలుస్తుంది. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో, వెన్నుపాములోని Cerebrospinal Fluid పైకి ప్రవహించి, ఈ పీనియల్ గ్లాండ్ ను యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు DMT అనే ఒక పవర్‌ఫుల్ కెమికల్ రిలీజ్ అవుతుంది. దాన్నే స్పిరిట్ మాలిక్యూల్ అంటారు. ఇదే కుండలిని జాగరణకు సైంటిఫిక్ వివరణ!
మరి ఇంత అద్భుతమైన శక్తిని ప్రతి ఒక్కరూ ఎందుకు మేల్కొల్పకూడదు? ఎందుకంటే, కుండలిని అనేది ఒక విద్యుత్ ప్రవాహం లాంటిది. మన శరీరానికి 110 వోల్టులు తీసుకునే కెపాసిటీ మాత్రమే ఉన్నప్పుడు, అందులోకి 10,000 వోల్టుల కరెంట్ పంపితే ఏమవుతుంది? సర్క్యూట్ కాలిపోతుంది. కుండలిని కూడా అంతే!
దీని గురించి సరైన అవగాహన, యోగ గురువు మార్గదర్శకత్వం లేకుండా, బలవంతంగా కుండలినిని లేపాలని చూస్తే, 'కుండలిని సిండ్రోమ్ (Kundalini Syndrome)' బారిన పడతారు. కాశ్మీర్‌కు చెందిన 'పండిట్ గోపీ కృష్ణ' అనే యోగి, తన పుస్తకంలో ఒక భయంకరమైన అనుభవాన్ని రాశారు. ఆయన సరైన గైడెన్స్ లేకుండా కుండలిని జాగరణ చేసినప్పుడు, కొన్ని నెలల పాటు విపరీతమైన భ్రాంతులు, నరకయాతన అనుభవించారట. శరీరం కాలిపోతున్నట్లు అనిపించేదట. ఆధునిక సైకాలజీ దీన్ని కొన్నిసార్లు 'సైకోసిస్' అని కూడా పొరబడుతుంది.
కాబట్టి యమ, నియమాలు (Ethical living), సరైన ఆహారం, స్వచ్ఛమైన ఆలోచనలు ఉన్నప్పుడే ఈ శక్తిని మేల్కొల్పాలి.
అయితే, సరైన అవగాహన లేకుండా చేస్తే కుండలిని ఎంత ప్రమాదకరమో... ఒక సద్గురువు పర్యవేక్షణలో (Guru's guidance) దాన్ని మేల్కొల్పితే అది మనిషిని అంతటి అద్భుతమైన దైవ స్వరూపంగా మారుస్తుంది. ఇలా కుండలినీ శక్తిని సంపూర్ణంగా మేల్కొల్పి, ప్రకృతి శక్తులపై ఆధిపత్యం సాధించిన వారినే మనం 'సిద్ధ పురుషులు' లేదా 'మహాయోగులు' అని పిలుస్తాము.
వీరికి సంబంధించిన చారిత్రక ఆధారాలూ, ఉదాహరణలూ మన కళ్ళ ముందే ఉన్నాయి. సాక్షాత్తూ 'శ్రీ రామకృష్ణ పరమహంస' తన శిష్యులతో తన కుండలినీ అనుభవాలను పంచుకుంటూ... 'ప్రాణశక్తి సుషుమ్న నాడి గుండా పైకి లేచేటప్పుడు ఒక చీమలా, చేపలా, పాములా, పక్షిలా, లేదా కోతిలా ఐదు విధాలుగా ప్రయాణిస్తుందని' చాలా స్పష్టంగా చెప్పారు.
అలాగే, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చదివిన 'ఒక యోగి ఆత్మకథ', Autobiography of a Yogi పుస్తకంలో, పరమహంస యోగానంద, 'క్రియా యోగం' (Kriya Yoga) గురించి వివరించారు. ఈ క్రియా యోగం అనేది ప్రత్యక్షంగా కుండలినీ శక్తిని శాస్త్రీయంగా, సురక్షితంగా పైకి తీసుకెళ్లే ఒక అత్యున్నత ప్రక్రియ. మహావతార్ బాబాజీ, లాహిరి మహాశయుల లాంటి వారు ఈ యోగం ద్వారానే మృత్యువును జయించారు.
ఇక ప్రాచీన భారతదేశంలో నాథ సంప్రదాయాన్ని స్థాపించిన మత్స్యేంద్రనాథుడు, గోరక్షనాథుడి లాంటి వారూ, అలాగే దక్షిణాదికి చెందిన అగస్త్యుడు, భోగర్, తిరుమూలర్ లాంటి అష్టాదశ సిద్ధులు సాధించిన అణిమ, మహిమ, గరిమ లాంటి 'అష్ట సిద్ధులు', ఈ కుండలినీ యోగ ఫలితమే! ఒకేసారి అనేక ప్రదేశాల్లో కనిపించడం, గాలిలో తేలడం (Levitation), ఇతరుల మనసు చదవడం లాంటివి మ్యాజిక్ ట్రిక్స్ కావు... కుండలినీ శక్తి సహస్రార చక్రాన్ని చేరుకున్నప్పుడు, ఆ సిద్ధ పురుషులకు లభించిన అతీంద్రియ శక్తులు (Supernatural abilities). ఈ విషయాలను సాక్షాత్తూ 'హఠయోగ ప్రదీపిక', మరియు తిరుమూలర్ రాసిన 'తిరుమంత్రం' (Tirumandiram) లాంటి ప్రామాణిక గ్రంథాలు ఘోషిస్తున్నాయి.
కుండలిని అనేది కేవలం మ్యాజిక్ శక్తుల కోసం కాదు. అది మానవ పరిణామ క్రమంలో (Human Evolution) మనం చేరుకోవాల్సిన ఒక ఉన్నత స్థితి. మనలో ఉన్న కామం, క్రోధం, భయం లాంటి జంతు లక్షణాలను వదిలిపెట్టి, దైవత్వం పొందే ఒక ప్రయాణం. ఆధునిక సైన్స్ ఇంకా దీన్ని అర్థం చేసుకునే పనిలోనే ఉంది. కానీ మన ఋషులు వేల ఏళ్ల క్రితమే దీన్ని సాధించి మనకు అందించారు.
కుండలిని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇది సైన్సా లేక ఆధ్యాత్మికతా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్‌లో కచ్చితంగా తెలియజేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన మరియు రహస్యమైన విషయాల కోసం మన ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటివరకు, కీప్ స్మైలింగ్.. థాంక్యూ...
జై హింద్!

Comments
Post a Comment