Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, April 6, 2026

The Dark Mystery of Konark Temple: How a 12-Year-Old Boy Defied 1200 Master Architects!

The Dark Mystery of Konark Temple: How a 12-Year-Old Boy Defied 1200 Master Architects!

కోణార్క్ సూర్య దేవాలయం: ఆ 12 ఏళ్ల పసివాడు ఏం చేశాడు?
రాత్రికి రాత్రి ఆలయ నిర్మాణం పూర్తిచేసి, ఆ పసివాడు ఎందుకు ఆత్మ త్యాగం చేసుకున్నాడు?
The Dark Mystery of Konark Temple: How a 12-Year-Old Boy Defied 1200 Master Architects!

భారతదేశ చరిత్ర అనగానే మనకు రాజుల పరాక్రమాలు, వారు నిర్మించిన ఎన్నో అద్భుతమైన కట్టడాలూ గుర్తొస్తాయి. కానీ, కాలగర్భంలో కలిసిపోయిన కొన్ని కన్నీటి గాథలు, మనకు చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా కనిపించవు.

మిత్రులారా... ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక రాతి కట్టడం గురించి కాదు... ఆ రాళ్ల మధ్య సమాధి అయిన ఒక 12 ఏళ్ల బాలుడి ఆత్మబలిదానం గురించి.

1200 మంది మహా శిల్పులు... 12 సంవత్సరాల పాటు అహోరాత్రులూ శ్రమించినా సాధించలేని ఒక అసాధ్యమైన పనిని... కేవలం 12 ఏళ్ల పసి ప్రాయంలో ఉన్న ఒక బాలుడు ఎలా సాధించాడు? అసలు కోణార్క్ సూర్య దేవాలయం పైభాగంలో ఉన్న ఆ భారీ అయస్కాంతం (Magnetic stone) వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? ఆ బాలుడు ఆ ఆలయం పైనుండి దూకి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?

ఈ రోజుటి మన వీడియోలో... ఒడిశా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన, మన కంట తడి పెట్టించే 'ధర్మపదుడి' (Dharmapada) అజరామర గాథను, ప్రాచీన శిల్ప శాస్త్రాల ఆధారంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి.. ఎందుకంటే ఈ కథ మీ గుండెల్ని బరువెక్కిస్తుంది.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Jq3jKHOJKVw ]


అది సామాన్య శకం 1243వ సంవత్సరం. కళింగ రాజ్యాన్ని, అంటే ప్రస్తుత ఒడిశాను, తూర్పు గంగ వంశానికి చెందిన మొదటి నరసింహదేవ మహారాజు పాలిస్తున్న కాలమది. ఆయనను 'లాంగుల నరసింహదేవ' అని కూడా పిలుస్తారు. ఆయన సూర్య భగవానుడికి పరమ భక్తుడు. తన రాజ్యంలోని చంద్రభాగా నదీ తీరంలో, సూర్యుడికి ఒక అద్భుతమైన రథం లాంటి దేవాలయాన్ని నిర్మించాలని ఆయన కలలు కన్నాడు.

అది సామాన్యమైన దేవాలయం కాదు. 24 చక్రాలతో, 7 గుర్రాలు లాగుతున్నట్లుగా ఉండే ఒక బ్రహ్మాండమైన సూర్య రథాన్ని పోలిన ఆలయం. ఈ సూర్య దేవాలయం కేవలం రాతితో కట్టిన గుడి మాత్రమే కాదు... ఆధునిక సైన్స్ కు కూడా అంతుచిక్కని ఒక అద్భుతమైన ఖగోళ యంత్రం (Astronomical marvel). ఈ రథానికి ఉన్న 24 చక్రాలు, రోజులోని 24 గంటలకు ప్రతీకలు. ఆ చక్రాలలోని 8 ఆకులు (Spokes), ఒక్కో ప్రహరం 3 గంటలచొప్పున, రోజులోని 8 ప్రహరాలను సూచిస్తాయి.

మీకు తెలుసా? ఈ రోజుకీ ఆ చక్రంపై పడే సూర్య కిరణాల నీడను బట్టి... కచ్చితమైన సమయాన్ని, నిమిషాలతో సహా చెప్పవచ్చు! 13వ శతాబ్దంలో, ఎలాంటి ఆధునిక యంత్రాలు లేని ఆ కాలంలో... ఇంతటి కచ్చితమైన గణిత, ఖగోళ శాస్త్రాలను ఆ శిల్పులు ఎలా ఉపయోగించారనేది, ఈనాటికీ ఒక పెద్ద మిస్టరీ! ఇటువంటి అద్భుతమైన జ్ఞానమే, ఆ 12 ఏళ్ల ధర్మపదుడి రక్తంలోనూ ప్రవహిస్తోంది.

దీని కోసం రాజు తన రాజ్యంలోని 12 సంవత్సరాల ఆదాయాన్ని మొత్తం ఖర్చు చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ మహా నిర్మాణ బాధ్యతను, ఆ కాలంలో అత్యంత ప్రతిభావంతుడిగా పేరూపొందిన ప్రధాన శిల్పి, "బిషు మహారాణా" (Bisu Maharana) కు అప్పగించాడు.

అందుకుగాను రాజు పెట్టిన షరతు ఒక్కటే - "సరిగ్గా 12 సంవత్సరాలలో ఆలయ నిర్మాణం పూర్తి కావాలి. 1200 మంది అత్యుత్తమ శిల్పులు ఇందులో పాల్గొనాలి."

బిషు మహారాణా గర్భిణిగా ఉన్న తన భార్యను వదిలి, సూర్య దేవాలయ నిర్మాణానికి బయలుదేరాడు. అలా వెళ్ళిన అతనికి, తాను తిరిగి ఇంటికి వచ్చే సరికి తన జీవితం ఊహించని మలుపు తిరుగుతుందని ఆనాడు తెలియదు..

అలా బిషు మహారాణా కోణార్క్ వెళ్లిపోయిన కొద్ది నెలలకే, అతని భార్య కరుణామయి ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డడే "ధర్మపదుడు". ఊరివాళ్లంతా అతన్ని ముద్దుగా 'ధర్మా' అని పిలిచుకునేవారు.

ధర్మపదుడు పెరుగుతున్నాడు. ఇతర పిల్లల్లా ఆడుకునే వయసులో, అతను తన తండ్రి ఇంట్లో వదిలివెళ్లిన ప్రాచీన శిల్ప శాస్త్రాలనూ, తాళపత్ర గ్రంథాలనూ చదవడం మొదలుపెట్టాడు. పుట్టుకతోనే అతను ఒక చైల్డ్ ప్రాడిజీ (Child Prodigy). ఎంతో సంక్లిష్టమైన ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ సూత్రాలను ఆ చిన్న వయసులోనే అతను అవపోసన పట్టాడు.

"అమ్మా... నాన్న ఎక్కడ?" అని ధర్మపదుడు అడిగినప్పుడల్లా, "నీ తండ్రి సూర్య భగవానుడికి గుడి కడుతున్నాడు నాయనా" అని చెప్పేది తల్లి. తండ్రిని చూడాలన్న ఆరాటం ఒకవైపు... శిల్పకళపై ఉన్న అంతులేని ఆసక్తి మరోవైపు... ధర్మపదుడిని ముందుకు నడిపించాయి.

12 సంవత్సరాలు గడిచిపోయాయి. కోణార్క్ సూర్య దేవాలయం దాదాపు పూర్తయింది. దాని శిల్పకళ చూసి దేవతలు కూడా అసూయపడేంత అద్భుతంగా తీర్చిదిద్దారు 1200 మంది శిల్పులు కలిసి.

ఇక కోణార్క్ గుడి పైకప్పుపై అమర్చాల్సిన ఆ 52 టన్నుల అయస్కాంత శిల (Loadstone) చుట్టూ అల్లుకున్న మిస్టరీ, సామాన్యమైనది కాదు. ప్రాచీన గ్రంథాల ప్రకారం... ఆలయం అడుగున, గోడల్లో, మరియు పైకప్పు మీద అత్యంత శక్తివంతమైన అయస్కాంతాలను ఒక నిర్దిష్ట కోణంలో (Specific angle) అమర్చాలి. అలా అమర్చినప్పుడు ఏర్పడే మాగ్నెటిక్ ఫీల్డ్ (Magnetic field) వల్ల... గర్భగుడిలోని సూర్య భగవానుడి విగ్రహం ఎవరి సపోర్ట్ లేకుండా గాలిలో అలా తేలుతూ (Floating idol) ఉండాలి!

అంతేకాదు... ఆ అయస్కాంత శక్తి ఎంత బలంగా ఉండేదంటే, బంగాళాఖాతంలో ప్రయాణించే విదేశీ నౌకల దిక్సూచీలు (Compasses) కూడా దారితప్పేవి. కొన్ని నౌకలు నేరుగా వచ్చి సముద్ర తీరంలోని రాళ్లను గుద్దుకుని ధ్వంసమయ్యేవి. ఆ అయస్కాంత శక్తిని తట్టుకుని, ఆ బ్రహ్మాండమైన శిలను పైకప్పుపై సమతుల్యంగా (Balance) నిలపడమే, ఆ 1200 మంది శిల్పులకు సవాలుగా మారింది. ఏ చిన్న లెక్క తప్పినా... మొత్తం గుడి కుప్పకూలిపోతుంది!

తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడన్నట్లు... అక్కడే ఒక ఊహించని ఆటంకం ఎదురైంది.

ఆలయం పైకప్పు నిర్మాణం 'దధినౌటి' అంటే ‘కలశం, లేదా ఆలయ కిరీటం’ నిలబడటం లేదు. ప్రాచీన గ్రంథాల ప్రకారం కోణార్క్ దేవాలయం పైభాగంలో, 52 టన్నుల బరువైన ఒక భారీ లోడ్ స్టోన్ అంటే అయస్కాంతం అమర్చాలి. దాని ఆకర్షణ శక్తి వల్లే గుడిలోని సూర్య భగవానుడి విగ్రహం గాలిలో తేలుతూ ఉండాలి.

కానీ ఆ భారీ అయస్కాంత శిలను పైకప్పు మీద అమర్చడంలో, 1200 మంది శిల్పులూ విఫలమయ్యారు. వారు ప్రయత్నించిన ప్రతిసారీ అది కూలిపోతోంది. ప్రధాన శిల్పి బిషు మహారాణాకు ఏం చేయాలో పాలుపోలేదు.

సరిగ్గా అప్పుడే నరసింహదేవ రాజు ఆకస్మిక తనిఖీకి వచ్చాడు. కలశం ఇంకా పూర్తి కాకపోవడం చూసి అతని ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

"బిషు మహారాణా! నా సహనానికి పరీక్ష పెట్టొద్దు. రేపు ఉదయం సూర్యోదయం లోపు ఈ దేవాలయ కలశం పూర్తి కావాలి. లేదంటే... ఈ 1200 మంది శిల్పుల తలలు తీయించేస్తాను!" అని భయంకరమైన శాసనం చేశాడు రాజు.

1200 మంది శిల్పుల కుటుంబాల్లో మరణ మృదంగం మోగింది. ఆ రాత్రి బహుశా వారి జీవితాలలో చివరి రాత్రి కావచ్చు.

సరిగ్గా అదే రోజు... తన తండ్రిని చూడటానికి 12 ఏళ్ల ధర్మపదుడు కోణార్క్ కు చేరుకున్నాడు. 12 సంవత్సరాల తర్వాత తండ్రీకొడుకుల కలయిక... కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. తండ్రి కళ్ళలో కన్నీళ్లు చూసిన ధర్మపదుడు, కారణం అడిగాడు. 1200 మంది ప్రాణాలు గాలిలో దీపంలా తయారయ్యాయని తెలుసుకున్నాడు.

"నాన్నా... బాధపడకు. నేను ఒకసారి ఆ ఆలయ నిర్మాణ పత్రాలు చూడొచ్చా?" అని అడిగాడు ధర్మపదుడు.

పసివాడి మాటలకు బిషు మహారాణా ఆశ్చర్యపోయినా, కొడుకు పట్టుబట్టడంతో ప్లాన్స్ చూపించాడు. ఆ 12 ఏళ్ల బాలుడు క్షణాల్లో అందులోని ఇంజనీరింగ్ లోపాన్ని పసిగట్టాడు. బేస్ మెంట్ లెక్కల్లో జరిగిన చిన్న పొరపాటు వల్ల పైకప్పు నిలబడటం లేదని గ్రహించాడు.

అర్ధరాత్రి వేళ... ఎవరికీ తెలియకుండా ఆ బాలుడు వందల అడుగుల ఎత్తున్న ఆ కోణార్క్ శిఖరం పైకి ఎక్కాడు. తన తండ్రి నేర్పకపోయినా, తను స్వయంగా నేర్చుకున్న ప్రాచీన శిల్ప శాస్త్ర గణితాన్ని ఉపయోగించి... ఆ భారీ అయస్కాంతంతో కూడుకున్న అసాధ్యమైన కలశాన్ని, సరైన కోణంలో అమర్చాడు. దధినౌటి పరిపూర్ణంగా, సుస్థిరంగా నిలబడింది!

1200 మంది మహా శిల్పులు 12 ఏళ్లుగా చేయలేని పనిని, ఒక 12 ఏళ్ల బాలుడు ఒక్క రాత్రిలో పూర్తి చేశాడు!

ఉదయం సూర్య కిరణాలు కోణార్క్ ఆలయం పై పడ్డాయి. కలశం పూర్తయింది. శిల్పులంతా ఆనందంతో గంతులు వేశారు. కానీ ఆ ఆనందం క్షణకాలమే.

వారిలో మానవ సహజమైన స్వార్థం తలెత్తింది. "మన 1200 మంది వల్ల కాని పనిని, నిన్నగాక మొన్న వచ్చిన ఒక పిల్లాడు చేశాడని రాజుకు తెలిస్తే... మన పరువు ఏమవుతుంది? మనం అసమర్థులమని రాజు మనందరి తలలు నరికిస్తాడు. ఈ పిల్లాడు బతికి ఉంటే మనందరికీ ప్రమాదమే" అని గుసగుసలు మొదలయ్యాయి.

ఆ రాత్రి... 1200 మంది శిల్పుల మధ్య జరిగిన ఆంతరంగిక సంఘర్షణ, బహుశా మానవ నైజానికి అద్దం పడుతుంది. "బిషు మహారాణా... నీ కొడుకు దేవుడిలా వచ్చి మనందరి ప్రాణాలు కాపాడాడు. కానీ ఆలోచించు... రేపు ఉదయం రాజుగారు వచ్చి, ఈ మహా కార్యాన్ని ఒక పసివాడు చేశాడని తెలిస్తే... మనల్ని బతకనిస్తాడా? మన 1200 మంది తలలు తీసేయడా? ఒక పిల్లాడి ప్రాణం ముఖ్యమా? 1200 కుటుంబాల ప్రాణాలు ముఖ్యమా?"

ఆ మాటలు విన్న బిషు మహారాణా గుండె పగిలిపోయింది. కన్నకొడుకును రక్షించుకోవాలా... తనని నమ్ముకున్న 1200 మంది తోటి శిల్పులను కాపాడుకోవాలా? ఆ తండ్రి పడుతున్న నరకప్రాయమైన వేదన వర్ణనాతీతం. తండ్రి కళ్లలో కురుస్తున్న ఆ నెత్తుటి కన్నీరే... ధర్మపదుడిని ఓ కఠోరమైన నిర్ణయం తీసుకునేలా చేసింది. తన వల్ల తన తండ్రి, మరో 1200 మంది శిల్పులూ ప్రాణాలు కోల్పోవడం, ఆ పసి మనసుకు ఇష్ట పడ లేదు.

ధర్మపదుడు నిర్ణయించుకున్నాడు. 1200 మంది ప్రాణాలు కాపాడటం కోసం, తన ప్రాణాన్ని బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. గుడి అత్యున్నత శిఖరం పైకి చేరుకున్నాడు పసివాడు. చివరిసారిగా, ఉదయిస్తున్న సూర్య భగవానుడికి నమస్కరించాడు.

"నాన్నా... నా జన్మ ధన్యమైంది. 1200 మంది ప్రాణాల ముందు నా చిన్ని ప్రాణం ఎంత?" అంటూ... కన్నీరు కారుస్తున్న తండ్రిని కడసారి చూసుకుని, ఆలయం పైనుండి కింద ప్రవహిస్తున్న చంద్రభాగా నదిలోకి దూకేశాడు.

ఆకాశం మూగబోయింది. సముద్రం స్తంభించిపోయింది. కోణార్క్ ఆలయం కోసం ఒక మహా శిల్పి తన నెత్తురును ధారపోశాడు. చంద్రభాగా నది అలలలో, ఆ 12 ఏళ్ల పసివాడు శాశ్వతంగా కనుమరుగయ్యాడు.

ధర్మపదుడి ఆత్మబలిదానం తర్వాత... ఆ చంద్రభాగా నది ఎరుపెక్కింది. అప్పటివరకు ఉత్సాహంగా సాగిన నిర్మాణ పనులు ఒక్కసారిగా మూగబోయాయి. ఒక పసివాడి రక్తం చిందిన చోట దేవుడు ఎలా కొలువై ఉంటాడు? ఆ ప్రదేశం అపవిత్రమైందని పండితులు నిర్ధారించారు.

ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన సూర్య దేవాలయం అది. కానీ, విచిత్రం ఏమిటంటే... ఆ గుడిలో ఒక్కరోజు కూడా, ఒక్కటంటే ఒక్క పూజ కూడా జరగలేదు! ఆ గాలిలో తేలే సూర్య విగ్రహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూరీ జగన్నాథుని ఆలయంలోని ఒక రహస్య గదిలోకి తరలించారని చరిత్రకారులు చెబుతారు. 12 ఏళ్లు, 1200 మంది శ్రమ, రాజు ఆశయం... అన్నీ ఆ 12 ఏళ్ల బాలుడి రక్తపు మడుగులో కొట్టుకుపోయాయి. దేవుడి కోసం కట్టిన గుడి... చివరికి ఒక పసివాడి సమాధిగా మిగిలిపోయింది. కాలక్రమంలో ఆ అయస్కాంత శిల తొలగించబడింది. ఆలయం కొంతమేర శిధిలమైంది.

కానీ ఈ రోజుకీ, ఒడిశాలో ఏ తల్లిని అడిగినా, ధర్మపదుడి కథను కన్నీళ్లతో వివరిస్తుంది. నేటికీ భువనేశ్వర్ లోని 'మధుసూదన్ దాస్ పార్క్' లో ధర్మపదుడి విగ్రహం మనకు కనిపిస్తుంది. అతను కేవలం ఒక శిల్పి కాదు... త్యాగానికీ, బాధ్యతకూ, నిస్వార్థ ప్రేమకూ నిలువెత్తు రూపం.

చరిత్ర పుటల్లో పేర్లు లేకుండా పోయిన ఇలాంటి ఎంతోమంది గొప్ప వ్యక్తుల త్యాగాల పునాదుల మీదే, మన భారతదేశ సంస్కృతి నిలబడి ఉంది.

ఈ వీడియో మీకు నచ్చితే, ఆ చిన్నారి ధర్మపదుడి త్యాగానికి గుర్తింపుగా ఒక లైక్ చేయండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి. మన చరిత్రను, అందులోని నిగూఢ సత్యాలను తెలుసుకోవడానికి 'వాయిస్ ఆఫ్ మహీధర్' ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.

మరో అద్భుతమైన మిస్టరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను...

జై హింద్! వందే మాతరం!

Monday, March 30, 2026

Speed of Light in Rigveda: The Ancient Indian Science That Shocked NASA ఋగ్వేదంలో కాంతి వేగం: మోడ్రన్ సైంటిస్టులకే మైండ్ బ్లాక్!

 

ఋగ్వేదంలో కాంతి వేగం: మోడ్రన్ సైంటిస్టులకే మైండ్ బ్లాక్!
పాశ్చాత్య శాస్త్రవేత్తల మైండ్ బ్లాక్ చేసిన ఋగ్వేదంలోని ఆ శ్లోకం ఏంటి?
Speed of Light in Rigveda: The Ancient Indian Science That Shocked NASA

సృష్టిలో అత్యంత వేగంగా ప్రయాణించేది ఏది? అనే ప్రశ్నకు సమాధానం, కాంతి... (Light). ఈ విశ్వం పుట్టుక నుండి, చీకటిని చీల్చుకుంటూ ప్రయాణిస్తున్న ఈ కాంతి వేగం ఎంత? అంటే, సెకనుకు దాదాపు మూడు లక్షల కిలోమీటర్లు. ఈ నిజాన్ని ప్రపంచానికి ఎవరు చెప్పారు? దీనికి మనకు తెలిసిన సమాధానం, ఆధునిక శాస్త్రవేత్తలు! అవునా?

మీరు ఏ టెక్స్ట్ బుక్ తెరిచి చూసినా... 1676 వ సంవత్సరంలో 'ఓలే రోమర్' (Ole Roemer) అనే డానిష్ ఆస్ట్రనామర్, గురు గ్రహం (Jupiter), ఉపగ్రహాల కదలికల ద్వారా కాంతి వేగాన్ని మొదటిసారి లెక్కగట్టాడని చదువుతాం. ఆ తర్వాత ఐన్‌స్టీన్ లాంటి వాళ్ళు దాని మీద ఎన్నో సిద్ధాంతాలు రాశారు.

కానీ... ఈ మోడ్రన్ సైన్స్ పుట్టక ముందు వేల లేదా లక్షల ఏళ్ల క్రితమే, ఎలాంటి టెలిస్కోపులు, అడ్వాన్స్డ్ కంప్యూటర్లు, అటామిక్ క్లాక్ లూ లేని కాలంలోనే... మన భారతీయ ఋషులు కాంతి వేగాన్ని పాయింట్లతో సహా పక్కాగా లెక్కగట్టారని నేను మీకు చెబితే మీరు నమ్ముతారా? అవును, మీరు నమ్మక తప్పని అక్షర సత్యం ఇది!

ఈరోజు మనం మన సనాతన ధర్మం, మన వేదాల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన సైన్స్ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. పాశ్చాత్య శాస్త్రవేత్తల మైండ్ బ్లాక్ చేసిన ఋగ్వేదంలోని ఆ శ్లోకం ఏంటి? అందులో కాంతి వేగాన్ని ఎలా లెక్కించారు? నాసా (NASA) చెప్పిన లెక్కకూ, మన మునులు వేసిన లెక్కకూ పొంతన ఏంటి? ఈ వీడియోను చివరి దాకా చూస్తే, మీరే ఆశ్చర్యపోతారు!

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/MnINBBkjfK8 ]


ముందుగా మనం ఆధునిక చరిత్ర ఏం చెబుతోందో చూద్దాం. 17వ శతాబ్దం వరకు పాశ్చాత్య ప్రపంచానికి (Western World) కాంతికి ఒక వేగం ఉంటుందని కూడా తెలియదు. కాంతి తక్షణమే (Instantaneous) ప్రయాణిస్తుందని ప్రఖ్యాత తత్వవేత్త అరిస్టాటిల్ నమ్మాడు.

ఆ తర్వాత గెలీలియో గెలీలీ (Galileo), రెండు కొండల మధ్య లాంతర్లు పట్టుకుని నిలబడి, కాంతి వేగాన్ని కొలవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత, 1676 లో ఓలే రోమర్ కాంతి వేగాన్ని సెకనుకు సుమారు 2,20,000 కిలోమీటర్లు అని అంచనా వేశాడు. తర్వాత 20వ శతాబ్దంలో, ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేసి, చివరకు 1975 లో, ఆధునిక సైన్స్ కాంతి వేగాన్ని అధికారికంగా సెకనుకు 2,99,792 కిలోమీటర్లు, అంటే సుమారు 1,86,282 మైళ్ళు అని నిర్ధారించింది.

ఇదే కదా మనం గొప్పగా చదువుకుంటున్న చరిత్ర! కానీ ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. 1890 వ దశకంలో, యూరప్ కు చెందిన కొంతమంది ఇండాలజిస్టులూ, మరియు శాస్త్రవేత్తలూ, మన ప్రాచీన సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు వారి కంటపడిన ఒక శ్లోకం, వారి అహంకారాన్నీ, మోడ్రన్ సైన్స్ పునాదులనూ కదిలించేసింది.

మనకు నాలుగు వేదాలు ఉన్నాయి. అందులో మొదటిదీ, అతి ప్రాచీనమైనదీ 'ఋగ్వేదం'. ఋగ్వేదంలోని ఒకటవ మండలం, 50వ సూక్తం, 4వ మంత్రం, సూర్య భగవానుడిని స్తుతిస్తూ రాయబడింది.

14వ శతాబ్దంలో, విజయనగర సామ్రాజ్యంలో విద్యారణ్య స్వామి వారి సోదరుడైన 'సాయణాచార్యులు' (Sayana Acharya), ఋగ్వేదానికి భాష్యం (Commentary) రాశారు. ఆ భాష్యంలో సూర్య కిరణాలు ప్రయాణించే వేగాన్ని వివరిస్తూ ఆయన రాసిన ఒక శ్లోకం చూడండి:

తథా చ స్మర్యతే యోజనానాం సహస్రే ద్వే ద్వే శతే ద్వే చ యోజనే ।
ఏకేన నిమిషార్ధేన క్రమమాణ నమోస్తుతే ॥

దీని అర్థం ఏంటంటే: 'ఓ సూర్య భగవానుడా! కేవలం సగం నిమిషం అంటే, నిమిషార్ధ కాలంలో, 2,202 యోజనాల దూరం ప్రయాణించే నీ కాంతి కిరణాలకు నా నమస్కారం.'

ఈ శ్లోకం చూడటానికి కేవలం సూర్యుడికి చేస్తున్న నమస్కారంలా కనిపిస్తుంది. కానీ, ఇందులో ఒక భయంకరమైన మ్యాథమెటికల్ ఈక్వేషన్ దాగి ఉంది. అదేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం.

ఈ శ్లోకంలో మన మునులు చెప్పిన రెండు ముఖ్యమైన కొలతలు ఉన్నాయి. ఒకటి దూరం (Distance), రెండు సమయం (Time). దూరం: 2,202 యోజనాలు. సమయం: నిమిషార్ధం అంటే, అర నిమిషం.

ముందుగా సమయం గురించి చూద్దాం. మన ప్రాచీన కాలమానం ప్రకారం, 'నిమిషం' అంటే ఇప్పుడు మనం వాడుతున్న నిమిషం (Minute) కాదు. కన్ను ఒక్కసారి మూసి తెరిచే సమయాన్ని 'నిమిషం' అంటారు. శ్రీమద్భాగవతం, మోక్ష ధర్మ పర్వం, సూర్య సిద్ధాంతం ప్రకారం, ఒక సెకను కాలాన్ని మన మునులు ఎలా విభజించారో చూస్తే ఎవరికయినా మైండ్ బ్లాక్ అవుతుంది:

• 15 నిమిషాలు = 1 కాష్ఠ (Kastha)
• 30 కాష్ఠలు = 1 కళ (Kala)
• 30 కళలు = 1 ముహూర్తం (Muhurta - 48 నిమిషాలు)
• 30 ముహూర్తాలు = 1 అహోరాత్రం (24 గంటలు).

ఈ లెక్కన వెనక్కి వెళ్తే... 1 నిమిషం అనేది 16/75 సెకన్లకు సమానం. అంటే 0.211 సెకన్లు. శ్లోకంలో 'నిమిషార్ధం' అన్నారు. అంటే సగం నిమిషం. అప్పుడు (16/75) / 2 = 8/75 సెకన్లు (లేదా 0.106 సెకన్లు). ఇది సమయం (Time = 8/75 seconds).

ఇప్పుడు దూరం (Distance) గురించి చూద్దాము. శ్లోకంలో 'రెండు వేల రెండు వందల రెండు యోజనాలు' (2,202 Yojanas) అని ఉంది. విష్ణు పురాణం ప్రకారం 1 యోజనం అనేది, సుమారు 9.06 మైళ్లకు (Miles) సమానం. అంటే మొత్తం దూరం = 2,202 x 9.06 = 19,950 మైళ్లు.

ఇప్పుడు సైన్స్ ఫార్ములా వేద్దాం. వేగం (Speed) = దూరం (Distance) / సమయం (Time) Speed = 19,950 మైళ్లు / (8/75 సెకన్లు). దీన్ని గుణిస్తే వచ్చే జవాబు ఎంతో తెలుసా? అక్షరాలా సెకనుకి... 1,87,031 మైళ్ళు (1,87,031 Miles per second).

ఈ లెక్క వచ్చిన తర్వాత పాశ్చాత్య శాస్త్రవేత్తలకు మాటలు రాలేదు. ఎందుకంటే, ఆధునిక సైన్స్ ఎన్నో వందల ఏళ్లు, ఎన్నో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఎంతో టెక్నాలజీ వాడి కనిపెట్టిన కాంతి వేగం ఎంతో తెలుసా? సెకనుకి 1,86,282 మైళ్ళు.

మన సాయణాచార్యులు, ఋగ్వేదం ఆధారంగా 14వ శతాబ్దంలో చెప్పిన వేగం: సెకనుకి 1,87,031 మైళ్ళు.

తేడా ఎంత? కేవలం 0.4 శాతం! (Less than 1% margin of error). వందల ఏళ్ల క్రితం, ఎలాంటి ఆధునిక పరికరాలు లేని కాలంలో, కేవలం గణిత శాస్త్రం, తపోశక్తి, ఖగోళ పరిజ్ఞానంతో మన ప్రాచీన మహర్షులు కాంతి వేగాన్ని ఇంత కచ్చితంగా ఎలా కొలిచారు? నాసా సైంటిస్టులకు ఇప్పటికీ ఇది ఒక అంతుచిక్కని రహస్యం.

ఆధునిక ప్రపంచం మొత్తం చీకటిలో మగ్గుతున్న రోజుల్లో, వాళ్లకు కనీసం భూమి గుండ్రంగా ఉందన్న విషయం కూడా తెలియని రోజుల్లో... మన దేశంలో సూర్యుని కాంతి వేగాన్ని, సెకనులో పదో వంతు భాగాన్ని కూడా లెక్కగట్టగలిగే అత్యున్నతమైన సాంకేతికత, జ్ఞానం మన వద్ద ఉండేవి. ఇదే 'భారతీయ విజ్ఞానం'.

మన చరిత్ర పుస్తకాల్లో ఎప్పుడూ 'ఫలానా పాశ్చాత్యుడు ఇది కనిపెట్టాడు, ఫలానా వెస్ట్రన్ సైంటిస్ట్ అది కనిపెట్టాడు' అని మాత్రమే నేర్పిస్తారు. కానీ మన వేదాల్లో, పురాణాల్లో, ఉపనిషత్తులలో దాగి ఉన్న ఈ అపారమైన సైన్స్ గురించి ఎవరూ మాట్లాడరు.

సనాతన ధర్మం అనేది కేవలం గుడికి వెళ్లి పూజలు చేయడం మాత్రమే కాదు. అదొక జీవన విధానం, అదొక అడ్వాన్స్డ్ సైన్స్! పాశ్చాత్యులు తమవిగా చెప్పుకుంటున్న ఎన్నో ఆవిష్కరణలకు అసలైన నామకరణం చేసింది మన మహర్షులే.

భాస్కరాచార్యులు (12వ శతాబ్దం - 1114 CE): ఆపిల్ పండు కిందపడగానే ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని (Gravity) కనిపెట్టాడని మనం చదువుకున్నాము. కానీ న్యూటన్ పుట్టడానికి 500 ఏళ్ల ముందే, 12వ శతాబ్దానికి చెందిన గొప్ప గణిత, ఖగోళ శాస్త్రవేత్త భాస్కరాచార్యులు తాను రాసిన 'సిద్ధాంత శిరోమణి' అనే గ్రంథంలో గురుత్వాకర్షణ గురించి స్పష్టంగా రాశారు. భూమికి ఆకర్షించే గుణం ఉందనీ, అందుకే ఆకాశంలోకి విసిరిన ఏ వస్తువైనా తిరిగి భూమిని చేరుతుందనీ ఆయన ఎప్పుడో నిరూపించారు.

కణాద మహర్షి (సామాన్యశక పూర్వం 6వ శతాబ్దం): ఇక జాన్ డాల్టన్ అటామిక్ థియరీ (Atomic Theory) చెప్పడానికి సుమారు 2500 ఏళ్ల ముందే, ఈ విశ్వంలోని ప్రతి పదార్థం కంటికి కనిపించని, విడగొట్టడానికి వీలుకాని అతి సూక్ష్మమైన కణాలతో తయారైందని, కణాద మహర్షి చెప్పారు. సామాన్యశక పూర్వం 6వ శతాబ్దంలో ఆయన రాసిన 'వైశేషిక సూత్రాల'లో ఈ కణాలనే ఆయన 'పరమాణువు' (Atom) అని పిలిచారు. మోడ్రన్ ఫిజిక్స్ కి అసలైన పునాది వేసింది మన కణాదుడే!

బోధాయన మహర్షి (సామాన్యశక పూర్వం 8వ శతాబ్దం): మ్యాథ్స్ లో మనం నేర్చుకునే 'పైథాగరస్ సిద్ధాంతం' (Pythagoras Theorem) అందరికీ తెలిసే ఉంటుంది. కానీ గ్రీకు తత్వవేత్త పైథాగరస్ కంటే వందల ఏళ్ల ముందే, సామాన్యశక పూర్వం 8వ శతాబ్దంలో, బోధాయన మహర్షి తన 'శుల్బ సూత్రాల'లో ఈ జ్యామితి అంటే, Geometry సూత్రాలను స్పష్టంగా వివరించారు. అంతేకాదు, వృత్తం యొక్క చుట్టుకొలతకు సంబంధించిన 'పై' అంటే, Value of Pi విలువను కూడా ఆయన అత్యంత ఖచ్చితంగా లెక్కగట్టారు.

భరద్వాజ మహర్షి (ప్రాచీన వేద కాలం): గాల్లో ఎగిరే విమానాన్ని, 1903 లో రైట్ బ్రదర్స్ కనిపెట్టారని, పాశ్చాత్య ప్రపంచం అంటుంది. కానీ వేల ఏళ్ల క్రితమే 'యంత్ర సర్వస్వం' లేదా వైమానిక శాస్త్రం ద్వారా భరద్వాజ మహర్షి, విమానాల తయారీ గురించి అద్భుతమైన గ్రంథాన్ని అందించారు. అందులో కేవలం ఒక విమానం కాదు.. మంత్రరిక, తాంత్రిక, కృతక అని వివిధ రకాల యంత్రాలు, ఎగిరే విమానాల నిర్మాణం, శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఎలా ప్రయాణించాలి అనే రహస్యాలను సవివరంగా అందించారు.

ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆధునిక సైన్స్ కి అందనంత ఎత్తులో మన సనాతన ధర్మం నిలుస్తుందనడానికి రుజువులు ఎన్నో.. ఎన్నెన్నో!

కేవలం గణితం, భౌతిక శాస్త్రం మాత్రమే కాదు, ఈరోజు మోడ్రన్ ప్రపంచం గర్వంగా చెప్పుకుంటున్న ఎన్నో అత్యాధునిక సైన్స్ కాన్సెప్ట్స్, మన ప్రాచీన గ్రంథాలలో ఎప్పుడో లిఖించబడ్డాయి. మనం వాటిని కేవలం దేవుడి కథలుగా చూశాం, కానీ పాశ్చాత్యులు అందులోని సైన్స్‌ను పట్టుకున్నారు.

టైమ్ డైలేషన్ మరియు ఐన్‌స్టీన్ రిలేటివిటీ (శ్రీమద్భాగవతం): హాలీవుడ్ లో వచ్చిన 'ఇంటర్‌స్టెల్లార్' (Interstellar) సినిమా చూశారా? అందులో హీరో వేరే గ్రహం మీదకు వెళ్లి కొన్ని గంటలు గడిపి భూమి మీదకు వచ్చేసరికి, ఇక్కడ దశాబ్దాల కాలం గడిచిపోతుంది. దీనినే ఆధునిక సైన్స్ లో ఐన్‌స్టీన్ 'థియరీ ఆఫ్ రిలేటివిటీ' లేదా 'టైమ్ డైలేషన్' (Time Dilation) అంటుంది. కానీ, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పుట్టుక కంటే వేల ఏళ్ల క్రితమే వేదవ్యాసుడు రాసిన 'శ్రీమద్భాగవతం' (9వ స్కంధం) లో ఈ కాన్సెప్ట్ ఉంది! కకుద్మి మహారాజు తన కుమార్తె రేవతికి తగిన వరుడిని వెతకమని అడగడానికి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఒక పాట వింటుంటాడు. ఆ పాట పూర్తయ్యాక రాజు తన సందేహం అడగ్గా, బ్రహ్మ నవ్వి... 'నువ్వు ఇక్కడికి వచ్చి కొద్ది నిమిషాలే అయినా, భూమి మీద అప్పుడే 27 మహాయుగాలు గడిచిపోయాయి. నీ బంధుమిత్రులు ఎవరూ ఇప్పుడు లేరు. భూమిపై కాలం మారిపోయింది' అని చెప్పాడు. వేరే డైమెన్షన్ లోకి వెళ్లినప్పుడు కాలం నెమ్మదిస్తుంది అనే క్వాంటం ఫిజిక్స్, మన భాగవతంలో స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం గతంలో చేసిన వీడియో కూడా చూడండి..

బిగ్ బ్యాంగ్ థియరీ - విశ్వం పుట్టుక (ఋగ్వేదం - నాసదీయ సూక్తం): ఈ విశ్వం ఎలా పుట్టింది? 13.8 బిలియన్ ఏళ్ల క్రితం ఒక మహా విస్ఫోటనం (Big Bang) ద్వారా శూన్యం నుండి ఈ సృష్టి ఉద్భవించిందని మోడ్రన్ సైన్స్ చెబుతుంది. కానీ అత్యంత ప్రాచీనమైన ఋగ్వేదంలోని 10వ మండలం 'నాసదీయ సూక్తం' (Nasadiya Sukta) లో, విశ్వం పుట్టుక గురించి మైండ్ బ్లాక్ అయ్యే వివరణ ఉంది. 'సృష్టికి పూర్వం సత్యం లేదు, అసత్యం లేదు. అంతరిక్షం లేదు, ఆకాశం లేదు. కేవలం గాఢమైన చీకటి (Dark Matter) మరియు అనంతమైన జలం మాత్రమే ఉన్నాయి. ఆ శూన్యం నుండే ఒక ఉష్ణం (హీట్ ఎనర్జీ) ఉద్భవించి, ఆ తర్వాత కోరిక (కామ) పుట్టి సృష్టి విస్తరించింది' అని నాసదీయ సూక్తం చెబుతోంది. ప్రముఖ అమెరికన్ ఆస్ట్రో-ఫిజిసిస్ట్ 'కార్ల్ సాగన్' (Carl Sagan) సైతం, హిందూ కాస్మాలజీని చూసి ఆశ్చర్యపోయి, మోడ్రన్ సైన్స్‌తో సరిపోలే ఏకైక ప్రాచీన మతం సనాతన ధర్మం మాత్రమే అని కితాబిచ్చాడు.

వైద్యం మరియు ప్లాస్టిక్ సర్జరీ (సుశ్రుత సంహిత): ఈరోజు మనం చూస్తున్న ఆధునిక వైద్యం, ఆపరేషన్లకు మూలం ఏంటో తెలుసా? సామాన్యశక పూర్వం 6వ శతాబ్దానికి చెందిన మన మహర్షి 'సుశ్రుతుడు'. ఆయన రాసిన 'సుశ్రుత సంహిత' లో ఏకంగా 1,120 రకాల వ్యాధులు, 120కి పైగా సర్జికల్ ఆయుధాల (Surgical Instruments) గురించి వివరంగా ఉంది. అంతేకాదు, యుద్ధాల్లో ముక్కు తెగిపోయిన సైనికులకు, వారి శరీరంలోని వేరే భాగం నుండి చర్మాన్ని తీసి ముక్కును తిరిగి అతికించేవారు. ఈరోజు మోడ్రన్ ప్రపంచం వాడుతున్న ప్లాస్టిక్ సర్జరీ (Rhinoplasty) కి ఆద్యుడు మన సుశ్రుతుడే. ఆయన్ని ప్రపంచం మొత్తం గర్వంగా ఫాదర్ ఆఫ్ సర్జరీ (Father of Surgery) అని పిలుస్తుంది. సుశ్రుతుడికి సంబంధించి కూడా మనం గతంలో చేసిన వీడియోను తప్పక చూడండి..

గర్భం మరియు పిండ శాస్త్రం (గర్భోపనిషత్తు): తల్లి కడుపులో బిడ్డ ఎలా ఎదుగుతుంది అనేది, ఆధునిక కాలంలో స్కానింగ్ (Sonography) వస్తే కానీ సైంటిస్టులకు తెలియలేదు. కానీ పిప్పలాద మహర్షి రాసిన 'గర్భోపనిషత్తు' (Garbha Upanishad) లో, మరియు మహాభారతంలోని శాంతి పర్వంలో... మొదటి నెలలో పిండం నీటి బుడగలా ఎలా మారుతుంది, మూడవ నెలలో అవయవాలు ఎలా ఏర్పడతాయి, ఏడవ నెలలో జీవం ఎలా పోసుకుంటుంది అనే మైక్రో-బయాలజీ (Microbiology) మరియు ఎంబ్రియోలజీ (Embryology) గురించి, అక్షర సహితంగా పక్కాగా రాయబడి ఉంది.

ఇది కదా మన సనాతన ధర్మం యొక్క అసలైన బలం. సెకూలర్ లు ప్రచారం చేస్తున్నట్టు మనది గుడ్డి నమ్మకాల సంస్కృతి కాదు, ప్రశ్నించి తెలుసుకునే సైంటిఫిక్ సంస్కృతి.

ఈ రోజు నేను మీకు చెప్పిన ఈ విషయాలు, ఆధునిక సైన్స్ కంటే సనాతన ధర్మం ఎంతో గొప్పదని నిరూపించే చిన్న ఉదాహరణలు మాత్రమే. మన వేదాల్లో ప్రతి అక్షరానికి ఒక అర్థం, పరమార్థం మరియు ఒక శాస్త్రీయ ఆధారమూ ఉన్నాయి. ఈ వాస్తవాలను మన రాబోయే తరాలకూ, మన పిల్లలకూ తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? మోడ్రన్ సైన్స్ గొప్పదా? లేక మన ప్రాచీన సనాతన ధర్మంలో ఉన్న విజ్ఞానం గొప్పదా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో కచ్చితంగా పంచుకోండి. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికీ చేరేలా ఈ వీడియోను షేర్ చేసి, నన్ను మరింతగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, అద్భుతమైన విషయాల కోసం 'వాయిస్ ఆఫ్ మహీధర్' (Voice of Maheedhar) ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.

జై సనాతన ధర్మం! జై హింద్!

Monday, March 23, 2026

10,000 Years Underwater! Ancient Science or Shiva's Magic? | Prachetas Mystery in Telugu

 

10,000 Years Underwater! Ancient Science or Shiva's Magic? | Prachetas Mystery in Telugu

నారదుడు ప్రాచీనబర్హి మహారాజును హెచ్చరించిన ఆ "ఇనుప కొమ్ముల నరకం" ఏంటి?
10,000 Years Underwater! Ancient Science or Shiva's Magic? | Prachetas Mystery in Telugu

ఒక మనిషి నీటిలో, ఆక్సిజన్ లేకుండా ఎంతసేపు బ్రతకగలడు? మహా అయితే ఒక నిమిషం... లేదా రెండు నిమిషాలు. ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన డైవర్స్ కూడా 24 నిమిషాలకు మించి నీటి అడుగున గాలి పీల్చుకోకుండా ఉండలేరు. ఆ తర్వాత... బ్రెయిన్ డెడ్. ఇది సైన్స్ చెబుతున్న పచ్చి నిజం.

కానీ... సముద్రం అడుగున, చీకటిలో, ఎలాంటి ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా ఏకంగా 10,000 సంవత్సరాలు బ్రతికిన మనుషులు ఉన్నారంటే మీరు నమ్ముతారా? వాళ్లే శ్రీమద్భాగవతంలో చెప్పబడిన 'ప్రచేతసులు'.

ఇది కథ కాదు... భాగవతం 4వ స్కంధంలో దాగి ఉన్న ఒక మిస్టరీ. అసలు ఏళ్ల తరబడీ నీటి అడుగున జీవక్రియలను (Metabolism) ఆపేసి బ్రతకడం సాధ్యమేనా? ఆధునిక సైన్స్ చెబుతున్న 'Suspended Animation' అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆనాడే ఉందా? లేక ఇదంతా పరమశివుడి మాయా? అసలు నారద ముని చెప్పిన ఆ 'ఇనుప కొమ్ముల నరకం' రహస్యం ఏంటి? ఈరోజుటి మన వీడియోలో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలుసుకుందాము.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/h2C6D2wCALg ]


మనం మాట్లాడుకుంటున్న ఈ సంఘటన సత్యయుగానికి చెందినది. ప్రాచీనబర్హి అనే మహారాజుకి 10 మంది కొడుకులు. వారినే 'ప్రచేతసులు' అని పిలుస్తారు. సత్యయుగంలో మనుషుల ఎత్తూ, వారి ఆయుష్షూ, ఇప్పటిలా 70-80 ఏళ్లు కాదు. వేల సంవత్సరాలు ఉండేది. ఆధునిక సైన్స్ ప్రకారం చూసుకుంటే, ఆనాటి వాతావరణంలో ఆక్సిజన్ శాతం చాలా ఎక్కువగా ఉండటం వల్ల, జీవుల పరిమాణం (Giant size) భారీగా ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతారు.

తండ్రి ఆదేశం మేరకు, ఈ భూమి మీద మంచి సంతానాన్ని అభివృద్ధి చేయడం కోసం, ప్రచేతసులు తపస్సు చేయడానికి పశ్చిమ దిశగా బయలుదేరారు. వారలా ప్రయాణించి ఒక మహా సముద్రం లాంటి సరస్సు వద్దకు చేరుకున్నారు. ఆ సరస్సు ఎంత స్వచ్ఛంగా ఉందంటే, లోపల ఉన్న జీవరాశులు బయటకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, అక్కడే వారికి ఒక ఊహించని దర్శనం ఎదురైంది.

ఆ ప్రశాంతమైన నీటిలో నుండి అకస్మాత్తుగా ఒక దివ్యమైన కాంతి, ఆ కాంతి మధ్యలో సాక్షాత్తూ పరమశివుడు దర్శనమిచ్చాడు. ఆ పది మంది అన్నదమ్ములకు శివుడు ఒక రహస్యమైన మంత్రాన్ని ఉపదేశించాడు. అదే "రుద్రగీత".

ఇక్కడే మనం సైన్స్‌ని అప్లై చేయాలి. శివుడు చెప్పిన ఈ రుద్రగీత కేవలం ఒక పాట కాదు. అదొక పవర్ ఫుల్ 'Frequency'. మోడ్రన్ క్వాంటం ఫిజిక్స్ మరియు Cymatics (సిమాటిక్స్) ప్రకారం, కొన్ని నిర్దిష్టమైన శబ్ద తరంగాలు (Sound frequencies) మనిషిలోని DNA నీ, జీవకణాలలోని నీటి నిర్మాణాన్నీ మార్చగలవు. శివుడు వారికి ఆ ఫ్రీక్వెన్సీని బోధించి, దానిని జపిస్తూ నీటి అడుగున తపస్సు చేయమని చెప్పి అదృశ్యమయ్యాడు.

శివుడు నేర్పించిన 'రుద్రగీత' కేవలం పదాడంబరంతో కూడిన ఒక ప్రార్థన కాదు. ఆధునిక క్వాంటం ఫిజిక్స్ (Quantum Physics) మరియు స్ట్రింగ్ థియరీ (String Theory) చెబుతున్నట్లుగా, ఈ విశ్వం అంతా తరంగాల (Vibrations) మయం. ఇక్కడ మనం జపాన్ సైంటిస్ట్ డాక్టర్ మసారు ఎమోటో (Dr. Masaru Emoto) చేసిన Water Memory ప్రయోగాలను కచ్చితంగా మాట్లాడుకోవాలి.

నీటికి జ్ఞాపకశక్తి ఉంటుంది. అది చుట్టూ ఉన్న శబ్దాలను గ్రహిస్తుంది. మనం మాట్లాడే మాటలు, చేసే శబ్దాలలోని ఫ్రీక్వెన్సీ (Frequency) నీటి అణువుల (Molecules) నిర్మాణాన్ని పూర్తిగా మార్చేస్తుందని, మోడ్రన్ సైన్స్ నిరూపించింది. ప్రచేతసులు సముద్రం అడుగున 10,000 ఏళ్ల పాటు ఉండి, 'రుద్రగీత' అనే అత్యంత శక్తివంతమైన ఫ్రీక్వెన్సీని నిరంతరం జపించినప్పుడు, వారి చుట్టూ ఉన్న నీరు ఒక ప్రొటెక్టివ్ Quantum Shield లాగా మారిపోయింది.

ఆ రుద్రగీత మంత్రం యొక్క వైబ్రేషన్స్ నేరుగా వారి DNA ని తాకి, ఆక్సిజన్ అవసరం లేకుండానే కణాలు తమకు కావలసిన జీవశక్తిని విశ్వం నుండి నేరుగా తీసుకునేలా, కణాలను Re-program చేశాయేమో! మంత్రం అనే మాటకు "మననాత్ త్రాయతే ఇతి మంత్రః" అని అర్థం. అంటే, మననం చేయడం వల్ల రక్షించేదని భావం. సనాతన ధర్మంలోని ఈ మంత్ర శాస్త్రం వెనుక ఇంతటి అడ్వాన్స్డ్ Quantum Biology దాగి ఉందన్న నిజం తెలిస్తే, ఎవరికైనా గూస్‌బంప్స్ రావడం ఖాయం.

అలా శివుడి ఆజ్ఞ మేరకు వారు నీటి అడుగుకు చేరారు. ఒక సంవత్సరం కాదు, పదేళ్లు కాదు... ఏకంగా 10,000 సంవత్సరాలు నీటి అడుగునే ఉండిపోయారు! ఇది ఎలా సాధ్యం? సైన్సా? మ్యాజిక్కా?

దీనికి సమాధానం, మోడ్రన్ సైన్స్‌లో దాగి ఉంది. నాసా (NASA) మరియు ఇతర స్పేస్ ఏజెన్సీలు ఇప్పుడు డీప్ స్పేస్ ట్రావెల్ కోసం ఒక టెక్నాలజీపై ప్రయోగాలు చేస్తున్నాయి. దాని పేరే "Suspended Animation" లేదా "Torpor". అంటే శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, గుండె చప్పుడు, శ్వాసక్రియను దాదాపు జీరోకి తీసుకురావడం. ప్రకృతిలో 'Tardigrades' లేదా వాటర్ బేర్స్ అనే సూక్ష్మ జీవులు, ప్రాణాంతకమైన రేడియేషన్, నీరు లేని పరిస్థితుల్లోనూ, తమ జీవక్రియను దశాబ్దాల పాటు ఆపేసి, తిరిగి బ్రతకగలవు. దీనినే శాస్త్రవేత్తలు "Cryptobiosis" అంటారు.

మన ప్రాచీన యోగులు అభ్యసించిన 'ఖేచరీ ముద్ర' ద్వారా, ప్రాణవాయువును బ్రెయిన్‌ లో లాక్ చేసి, ఆక్సిజన్ అవసరం లేకుండా సమాధి స్థితిలోకి వెళ్లేవారు. బహుశా శివుడు ఉపదేశించిన రుద్రగీత ఫ్రీక్వెన్సీ వల్ల, ప్రచేతసుల శరీరాలు ఈ కంప్లీట్ సస్పెండెడ్ యానిమేషన్ స్థితిలోకి వెళ్లిపోయాయేమో! వారి శరీర కణాలు Cryptobiosis స్టేజ్‌కి చేరుకున్నాయేమో! లాజికల్ గా ఆలోచిస్తే అదే నిర్ధారితమవుతుంది.

నీటి అడుగున తన కొడుకులు 10,000 ఏళ్లుగా తపస్సు చేస్తుంటే, భూమి మీద తండ్రి ప్రాచీనబర్హి రాజు మాత్రం, కర్మకాండల పేరుతో వేలాది జంతువులను బలి ఇస్తూ ఉన్నాడు. అప్పుడక్కడికి వచ్చిన నారద ముని ఆ జంతు బలులను చూసి, రాజుకు హితవు చెప్పాడు.

"రాజా! ఆకాశం వైపు చూడు... నువ్వు చంపిన వేలాది జంతువుల ఆత్మలు నీకోసం అక్కడ ఎదురుచూస్తున్నాయి. వాటి తలలకు 'ఇనుప కొమ్ములు' (Iron horns) ఉన్నాయి. నువ్వు చనిపోయి నరకానికి వెళ్ళగానే, ఆ ఇనుప కొమ్ములతో నిన్ను పొడిచి చంపడానికి అవి కాచుకుని ఉన్నాయి" అని హెచ్చరించాడు.

ఇది కేవలం భయపెట్టే కథ కాదు... న్యూటన్ మూడవ నియమం Action and Reaction, మరియు క్వాంటం కర్మ అంటే Law of Cause and Effect ప్రకారం, నువ్వు ప్రకృతికి ఏ ఎనర్జీని ఇస్తావో, అదే ఎనర్జీ మల్టిప్లై అయ్యి నిన్ను చేరుతుందని చెప్పడానికి, ఇదొక అద్భుతమైన ఉదాహరణ. నారదుడి వార్నింగ్‌ తో భయపడిన రాజు, అడవులకు వెళ్లిపోయాడు.

నారద ముని ప్రాచీనబర్హి మహారాజును హెచ్చరించిన ఆ "ఇనుప కొమ్ముల నరకం" కాన్సెప్ట్ వెనుక ఉన్నది, పాప-పుణ్యాల గురించి భయపెట్టే కథ కాదు. అదొక పర్ఫెక్ట్ Universal Law of Energy. మోడ్రన్ క్వాంటం ఫిజిక్స్ లో 'క్వాంటం ఎంటాంగిల్‌మెంట్' (Quantum Entanglement) అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. దీని ప్రకారం, ఈ విశ్వంలోని ప్రతి అణువు మరొక అణువుతో కనెక్ట్ అయి ఉంటుంది. మనం చేసే ప్రతి పనీ ఈ విశ్వంలో ఎక్కడో ఒక చోట రికార్డ్ అవుతుంది.

మహారాజు యజ్ఞాల పేరుతో వేలాది మూగ జీవాలను వధించినప్పుడు, ఆ జీవుల భయం, ప్రాణాలు వదిలేటప్పుడు అవి పడిన తీవ్రమైన బాధ, ఒక భారీ నెగెటివ్ ఎనర్జీ (Negative Energy) గా మారి, ఈ క్వాంటం ఫీల్డ్‌లో ఉండిపోయింది. న్యూటన్ మూడవ నియమం, Every action has an equal and opposite reaction, కేవలం భౌతిక ప్రపంచానికే కాదు, కర్మ సిద్ధాంతానికి కూడా వర్తిస్తుంది.

ఆ మూగ జీవుల నుండి విడుదలైన ఆ నెగెటివ్ ఎనర్జీయే 'ఇనుప కొమ్ములు' అనే ఒక మెటాఫర్‌గా (Metaphor) రూపాంతరం చెందింది. రాజు చనిపోగానే, ఆ ఎనర్జీ తిరిగి ఆ రాజుకే అదే స్థాయి బాధను (Reaction) ఇవ్వడానికి, పగతో ఎదురుచూస్తోందని నారదుడు సైంటిఫిక్ గా, లాజికల్ గా, కర్మ సిద్ధాంతాన్ని వివరించాడు. కర్మ అనేది దేవుడు వేసే శిక్ష కాదు. అదొక Boomerang లాంటి Energy balancing system. ప్రకృతికి మనం ఏది ఇస్తామో, కచ్చితంగా అదే మనకు రెట్టింపై తిరిగి వస్తుంది!

ఇక 10,000 సంవత్సరాలు పూర్తయ్యాక, ప్రచేతసుల తపస్సు ముగిసింది. సస్పెండెడ్ యానిమేషన్ నుండి వారు మేల్కొని బయటకు వచ్చారు. కానీ బయట ప్రపంచం మొత్తం మారిపోయివుంది. భూమి మొత్తం దట్టమైన వృక్షాలు, చెట్లతో కప్పబడిపోయింది. మనుషులు నడవడానికి కూడా ఖాళీ లేదు. వ్యవసాయం చేయడానికి స్థలం లేదు.

ఇదంతా చూసిన ప్రచేతసులకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంలో వారి నోటి నుండి నిప్పు, భయంకరమైన గాలి పుట్టుకొచ్చాయి. ఆ మంటలకు అడవులన్నీ బూడిద కావడం మొదలయ్యాయి.

అసలు మనిషి నోటి నుండి నిప్పు రావడం ఏంటి? ఇది కల్పనా? సైన్సా? 10,000 ఏళ్ల పాటు ఒకే దగ్గర కదలకుండా యోగ స్థితిలో ఉన్నప్పుడు, శరీరంలో పేరుకుపోయిన అనంతమైన Bio-electricity, Plasma రూపంలో బయటకు వచ్చిందా? లేక వారు ఏదైనా ఆధునిక Directed Energy Weapon (DEW) లాంటిది వాడారా? ఏది ఏమైనా ఆ మంటల ధాటికి ప్రకృతి నాశనం అవుతుంటే, వృక్షాలకు రాజైన చంద్ర దేవుడు (Soma) స్వయంగా అక్కడికి వచ్చాడు. ఆయన ప్రచేతసులతో ఇలా అన్నాడు... "మీరు 10,000 ఏళ్లు తపస్సు చేసింది, భూమి మీద జీవరాశినీ, సృష్టినీ పెంపొందించడానికి. కానీ ఆ తపో శక్తితో మీరే ఇలా ప్రకృతిని నాశనం చేస్తే ఎలా? కోపాన్ని అదుపుచేయండి."

చంద్రుని మాటలకు వారు శాంతించగానే, చంద్రుడు వారికి ఒక అద్భుతమైన స్త్రీ మూర్తిని బహుమతిగా ఇచ్చాడు. ఆమె పేరు 'మారిష'. ఆమె పుట్టుక ఒక పెద్ద మిస్టరీ. కండు మహర్షికీ, ప్రమ్లోచ అనే అప్సరసకీ పుట్టిన బిడ్డను వారు వదిలేస్తే, వృక్షాలన్నీ కలిసి తమ సారాన్ని (Plant Essence / Life Force) ఆమెకు ఇచ్చి పెంచాయి. బహుశా ప్రకృతి మొత్తం కలిసి రాబోయే మానవ జాతి కోసం ఒక 'పర్ఫెక్ట్ హ్యూమన్ DNA' ని డిజైన్ చేసిందేమో!

చంద్రుని సూచన మేరకు, పది మంది ప్రచేతసులూ మారిషను వివాహం చేసుకున్నారు. ఇది మహాభారతంలో ద్రౌపది వివాహానికి ఎన్నో లక్షల ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. వీరికి పుట్టిన వాడే 'దక్ష ప్రజాపతి' (Daksha). అవును... గతంలో శివుడిని అవమానించి, వీరభద్రుడి చేతిలో శిరస్సును కోల్పోయిన ఆ దక్షుడే, మళ్లీ ప్రచేతసుల కడుపున జన్మించాడు. ఆ దక్షుడే తన జన్యువుల (Genetics) ద్వారా ఈ భూమి మీద సకల జీవరాశులనూ, మనుషులనూ అత్యంత వేగంగా అభివృద్ధి చేశాడు.

మరి ఇంత చేసిన ప్రచేతసులు అనంతరం ఏమయ్యారు? ఈ లోకాన్ని పాలించి, దక్షుడి లాంటి కొడుకును కని సృష్టిని పెంచిన తర్వాత... వారికిక జీవితం మీద ఎలాంటి వ్యామోహం మిగలలేదు. సృష్టి చేయాలన్న తమ తండ్రి కోరికను నెరవేర్చారు. ఆ తర్వాత భార్యను, రాజ్యాన్ని కొడుకైన దక్షుడికి అప్పగించి, పశ్చిమ దిశగా సముద్ర తీరానికి వెళ్లిపోయారు. నారద ముని చెప్పిన బ్రహ్మజ్ఞానాన్నీ, నీటి అడుగున శివుడు చెప్పిన రుద్రగీతనూ స్మరిస్తూ... తమ ప్రాణాలను విశ్వ శక్తిలో (Cosmic Energy) విలీనం చేసి, జనన మరణ చక్రం (Cycle of Birth and Death) నుండి శాశ్వతమైన మోక్షాన్ని పొందారు.

చూశారుగా... మన పురాణాల్లోని ప్రతీ కథలోనూ సైన్స్ దాగి ఉంది. ఈరోజు మనం చెప్పుకున్న 10,000 ఏళ్ల క్రయోజెనిక్ స్లీప్, మల్టీ-వర్స్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్, జెనెటిక్ రీ-ప్రోగ్రామింగ్ వంటి ఎన్నో విషయాలు భాగవతంలో లిఖించబడ్డాయి. ప్రచేతసుల కథ కేవలం ఒక మైథాలజీ కాదు... మనిషి తలచుకుంటే తన శరీరాన్నీ, ప్రకృతినీ ఎలా శాసించగలడో చెప్పే ఒక అద్భుతమైన 'బయో-లాజికల్ మిస్టరీ'.

మీరేమంటారు? ప్రచేతసులు నీటి అడుగున బ్రతకడం వెనుక ఉన్నది అడ్వాన్స్డ్ సైన్స్ అంటారా? లేక పరమశివుడి మాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో కచ్చితంగా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని మిస్టరీస్ కోసం Voice of Maheedhar ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్లీ కలుద్దాం...

జై హింద్!

Monday, March 16, 2026

28000-Year-Old Ancient Indian Statue in Area 51 Bunkers!

 

Voice of Maheedhar

28,000 ఏళ్ల నాటి భారతీయ విగ్రహం ఇప్పుడు ఎక్కడుంది?
28000-Year-Old Ancient Indian Statue in Area 51 Bunkers!

మీరెప్పుడైనా ఆలోచించారా? మన పురాణాలు కేవలం కథలేనా అని? రామాయణ, భారత కాలంలో వాడిన అస్త్రశస్త్రాలు కేవలం కవుల ఊహలేనా? ఒకవేళ... మన పూర్వీకులు మనకంటే కొన్ని వేల రెట్లు అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడారంటే మీరు నమ్ముతారా?

ఈరోజు మనం చెప్పుకోబోయేది కథ కాదు. ఇది చరిత్రను తిరగరాసిన ఒక నిజం. అమెరికా అగ్రరాజ్యం అని మనం అనుకుంటాం. కానీ ఆ అగ్రరాజ్యం కూడా చూసి భయపడిన, ఇప్పటికీ ప్రపంచానికి తెలియకుండా దాస్తున్న ఒక భారతీయ రహస్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/8su4Q1c-Qjw ]


అది 1960 వ సంవత్సరం. ప్రచ్ఛన్న యుద్ధం (Cold War) తారస్థాయిలో ఉన్న సమయమది. అమెరికా గూఢచార సంస్థ CIA (Central Intelligence Agency) చేతికి ఒక వింతైన వస్తువు చిక్కింది. అది టిబెట్ సరిహద్దుల్లోని హిమాలయ గుహల్లో దొరికిన ఒక చిన్న పెట్టె.

ఆ పెట్టెను తెరిచి చూసిన అమెరికన్ సైంటిస్టులకు దిమ్మతిరిగిపోయింది. అందులో ఉన్నది ఒక విగ్రహం. కానీ అది మామూలు విగ్రహం కాదు. దాని చుట్టూ ఒక తెలియని ఎనర్జీ వైబ్రేట్ అవుతోంది.

అత్యంత ఆధునికమైన కార్బన్ డేటింగ్ టెక్నాలజీతో, వారు దాని వయసును పరీక్షించారు. రిజల్ట్ చూసి లాబ్ లోని కంప్యూటర్లే షాక్ అయ్యాయి. దాని వయసు అక్షరాలా... 28,450 సంవత్సరాలు!

అవును.. మీరు విన్నది నిజమే. 28 వేల సంవత్సరాల క్రితం, అంటే, మనం చరిత్రలో చదువుకున్న రాతి యుగానికి (Stone Age) కూడా చాలా కాలం ముందు, ఇంతటి అద్భుతమైన లోహపు విగ్రహాన్ని ఎవరు తయారు చేశారు? దానికి అంతటి శక్తి ఎక్కడి నుండి వచ్చింది?

ఆ విగ్రహం పేరు... "కల్ప విగ్రహ" (Kalpavigraha). దాని రూపం... సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపంగా చెప్పబడుతున్న "సుద్యుమ్నేశ్వరుడు" (Sudyumneshwara).

ఈరోజు ఆ విగ్రహం ఎక్కడుంది? ఏరియా 51 (Area 51) రహస్య బంకర్లలో మన దేవుడిని బందీగా ఉంచారా? అమెరికన్ ఆఫీసర్లను ఆ విగ్రహం ఎలా హిప్నటైజ్ చేసింది? నీటిని అమృతంగా మార్చే టెక్నాలజీ మన ఋషులకు నిజంగానే తెలుసా?

ఈ వీడియో పూర్తయ్యేసరికి, సనాతన ధర్మం గురించి మీకు తెలిసిన ప్రతి విషయమూ మారిపోతుంది. ఇది ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన నిజం. ప్రపంచం మొత్తం తెలియాల్సిన రహస్యం. రండి, ఆ రహస్యపు లోతుల్లోకి వెళ్దాం.

CIA ఏజెంట్ డైరీ - ది డిస్కవరీ (The Agent's Diary)

ఈ కథ బయటికి రావడానికి కారణం ఒక CIA ఏజెంట్. అతని పేరు కెన్నెత్ ఆర్ వైట్ (Kenneth R. White). 1959-60 ప్రాంతంలో, చైనా, టిబెట్ సరిహద్దులలో కమ్యూనిస్ట్ కదలికలను గమనించడానికి, అమెరికా పంపిన గూఢచారి అతను.

అతను చనిపోవడానికి ముందు రాసిన ఒక రహస్య డైరీ లీక్ అవ్వడంతో, ఈ "కల్పవిగ్రహం" విషయం ప్రపంచానికి తెలిసింది. ఆ డైరీలో ఏముందో తెలుసా?

కెన్నెత్ వైట్ ఇలా రాసుకున్నారు.. "మేము ఆ గుహలోకి ప్రవేశించినప్పుడు, అక్కడ ఏదో తెలియని శక్తి ఉన్నట్లు అనిపించింది. ఓ సాధువు మాకు ఒక పెట్టెను ఇచ్చాడు. అది చాలా బరువుగా ఉంది. దాని మీద మాకు అర్థం కాని లిపిలో ఏదో రాసి ఉంది. బహుశా బ్రాహ్మీ లిపి లేదా సంస్కృతం అయ్యుండవచ్చు. ఆ పెట్టెను ముట్టుకోగానే నా శరీరంలో విద్యుత్ ప్రవహించినట్లు అయ్యింది."

తరువాత కెన్నెత్ ఆ పెట్టెను అమెరికాకు తీసుకువచ్చాడు. దాన్ని CIA హెడ్ క్వార్టర్స్ లోని అత్యంత రహస్యమైన లాబొరేటరీకి తరలించారు. ఆ పెట్టెను తెరిచినప్పుడు, లోపల ఒక చిన్న లోహపు విగ్రహం ఉంది. అది తుప్పు పట్టలేదు, దాని మెరుపు తగ్గలేదు. దాని చేతిలో కమండలం లాంటి ఒక చిన్న గిన్నె ఉంది.

ఆ విగ్రహాన్ని చూసిన మొదటి క్షణం నుండే, అక్కడ ఉన్న సైంటిస్టులకు వింత అనుభవాలు ఎదురయ్యాయి.

ది సైంటిఫిక్ మిస్టరీ & మైండ్ కంట్రోల్ (The Scientific Impossibility & Hypnotism)

ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆ విగ్రహం ఏ లోహంతో తయారైందో తెలుసుకోవడానికి, అనేక పరీక్షలు చేశారు. కానీ అది భూమి మీద ఉన్న ఏ లోహంతోనూ పూర్తిగా మ్యాచ్ అవ్వలేదు. అది ఒక మిశ్రమ లోహం (Alloy). అంత పర్ఫెక్ట్ రేషియోలో లోహాలను కలపడం, ఈనాటి టెక్నాలజీకి కూడా సాధ్యం కాదు.

అన్నింటికంటే భయంకరమైన విషయం మరొకటి ఉంది. కెన్నెత్ వైట్ తన డైరీలో ఇలా రాశాడు: "ఆ విగ్రహాన్ని గంటల తరబడి పరీక్షించిన మా టీమ్ లీడర్, అకస్మాత్తుగా పిచ్చివాడిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతనికి తెలియని సంస్కృత భాషలో శ్లోకాలు పఠించడం మొదలుపెట్టాడు. ఆ విగ్రహం కళ్ళలోకి చూసిన ఎవరైనా సరే, తమ ఆధీనాన్ని కోల్పోతున్నారు. అది మమ్మల్ని హిప్నటైజ్ చేస్తోంది."

ఆలోచించండి.. ఒక నిర్జీవమైన విగ్రహం మనుషులను కంట్రోల్ చేయడం ఏంటి? ఇదేనా మన పూర్వీకులు చెప్పిన "ప్రాణ ప్రతిష్ఠ"? విగ్రహాలలో మంత్ర శక్తులను ఆవాహన చేయడం అంటే ఇదేనా? ఇది మూఢనమ్మకం కాదు. ఇది ఒక అడ్వాన్స్డ్ సైన్స్. శబ్దాన్నీ, ఎనర్జీనీ ఒక రూపంలో బంధించే టెక్నాలజీ ఇది.

Heavy Water - అమృతం (D2O - Deuterium Oxide)

ఇక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం... "నీరు". ఆ విగ్రహం చేతిలో ఉన్న చిన్న పాత్రలో శాస్త్రవేత్తలు సాధారణ నీటిని పోశారు. 24 గంటల తర్వాత ఆ నీటిని పరీక్షిస్తే... అది సాధారణ నీరు కాదు. "హెవీ వాటర్" అంటే, D2O - Deuterium Oxide గా మారిపోయింది!

హెవీ వాటర్ అనేది ఈరోజు న్యూక్లియర్ రియాక్టర్లలో వాడతారు. దాన్ని తయారు చేయడం చాలా కష్టం, పైగా ఖర్చుతో కూడుకున్న పని. కానీ, 28 వేల ఏళ్ళ క్రితం నాటి ఒక విగ్రహం, సాధారణ నీటిని అత్యంత శక్తివంతమైన జలంగా మారుస్తోంది.

మన పురాణాల్లో "అమృతం" గురించి విన్నాం. దేవాలయాల్లో ఇచ్చే "తీర్థం" గురించి మనకు తెలుసు. ఆ తీర్థానికి రోగాలను తగ్గించే శక్తి ఉంటుందని నమ్ముతాం. బహుశా మన ఋషులకు నీటి యొక్క పరమాణు నిర్మాణాన్ని (Molecular Structure) మార్చి, దాన్ని శక్తివంతంగా తయారుజేసే టెక్నాలజీ తెలుసేమో! ఆ టెక్నాలజీకి ప్రతిరూపమే ఈ "కల్పవిగ్రహ"మేమో?

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ విగ్రహం ఎవరిది? "సుద్యుమ్నేశ్వరుడు" ఎవరు?

మన సనాతన ధర్మంలో కాలం (Time) అనేది చక్రం లాంటిది. కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. 28,000 సంవత్సరాల క్రితం అంటే, అది ఇప్పటి చరిత్రకారులు చెప్పే లెక్కలకు అందదు. కానీ మన పురాణాల ప్రకారం అది ద్వాపర యుగానికి ముందు సమయం కావచ్చు.

"కల్ప విగ్రహం" అంటే కాలాన్ని నియంత్రించే విగ్రహం అని అర్థం. "కల్పం" అంటే బ్రహ్మదేవుని ఒక రోజు.

ఇక "సుద్యుమ్నేశ్వరుడు" అనే పేరు విషయానికి వస్తే, పురాణాల్లో సుద్యుమ్నుడు అనే రాజు ప్రస్తావన ఉంది. అతను ఇలావృత వర్షంలో శివుని శాపం వల్ల స్త్రీగా మారి, బుధుని అనుగ్రహంతో పురూరవుడికి తల్లి అయ్యాడు. కానీ ఇక్కడ ఈ విగ్రహం విష్ణు స్వరూపంగా చెప్పబడుతోంది. "ఈశ్వరుడు" అనే పదం ఉన్నప్పటికీ, ఇది శ్రీమన్నారాయణుడి ఒక అరుదైన, అత్యంత శక్తివంతమైన రూపం అని కొందరి నమ్మకం.

మన శిల్ప శాస్త్రాలు, ఆగమ శాస్త్రాలు కేవలం రాతిని చెక్కడం గురించి మాత్రమే చెప్పలేదు. ఏ రాయిలో ఎలాంటి శక్తి ఉంటుంది? పంచలోహాలలాగా ఏ లోహాలు కలిపితే విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీని ఆకర్షించవచ్చు! అనే అద్భుతమైన విజ్ఞానాన్ని అందించాయి.

మన ఋగ్వేదంలోని పురాతన మంత్రాలను ఒకసారి లోతుగా గమనిస్తే, అందులో దాగి ఉన్న Cosmic Energy రహస్యాలు మనకు అర్థమవుతాయి. అలాగే అథర్వణ వేదంలో యంత్ర, తంత్ర శాస్త్రాల గురించి ఎంతో స్పష్టంగా చెప్పారు. ఒక యంత్రాన్ని లేదా విగ్రహాన్ని నిర్దిష్ట కొలతలతో, ప్రత్యేకమైన లోహాలతో తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు, అది విశ్వంలోని శక్తులను ఎలా ఆకర్షిస్తుందో అందులో వివరంగా ఉంది. ఈ కల్పవిగ్రహం కూడా అలాంటి అత్యున్నతమైన తంత్ర విజ్ఞానానికి ప్రతీక!

మన ఉపనిషత్తులు ఒక గొప్ప మాట చెబుతాయి... "యథా పిండే తథా బ్రహ్మాండే!" అంటే, ఈ అనంతమైన బ్రహ్మాండంలో ఏముందో, ఒక చిన్న పిండంలో అంటే శరీరంలో లేదా ఒక చిన్న వస్తువులో కూడా అదే ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే, అమెరికా చేతికి చిక్కిన ఈ విగ్రహం కేవలం ఒక లోహపు బొమ్మ కాదు... ఈ విగ్రహం ఒక చిన్న బ్రహ్మాండం! అనంతమైన విశ్వ శక్తులను, కాలాన్ని తనలో ఇముడ్చుకున్న ఒక అద్భుతమైన యంత్రం ఇది.

ఈ కల్పవిగ్రహం మన పూర్వీకుల ఆ అద్భుత మేధస్సుకు సజీవ సాక్ష్యం. ఈరోజు పాశ్చాత్య దేశాలు గొప్పగా చెప్పుకుంటున్న క్వాంటం ఫిజిక్స్, ఎనర్జీ థియరీలు మన వేదాల్లో ఎప్పుడో చెప్పబడ్డాయనడానికి, ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి?

ఇంతటి అద్భుతమైన విగ్రహం గురించి ప్రపంచానికి ఎందుకు తెలియదు? 1960 తర్వాత ఆ విగ్రహం ఏమైంది?

కెన్నెత్ వైట్ డైరీ ప్రకారం, ఆ విగ్రహం నుండి వెలువడే శక్తిని తట్టుకోలేక, లేదా దాని రహస్యం బయటపడితే పాశ్చాత్య మతాల పునాదులు కదిలిపోతాయని భయపడి, అమెరికా దాన్ని దాచిపెట్టింది.

అనేక కాన్స్పిరసీ థియరీల ప్రకారం, ఆ కల్పవిగ్రహం ఇప్పుడు నెవాడాలోని అత్యంత రహస్యమైన "ఏరియా 51" బంకర్ లో ఉంది. అక్కడ దానిపై ఇంకా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.

ఇది కేవలం ఒక విగ్రహం కథ కాదు. ఇది మన అస్తిత్వం. మన పూర్వీకులు మనకు అందించిన జ్ఞాన సంపద. విదేశీయులు మన జ్ఞానాన్ని దొంగిలించి, దానిపై పరిశోధనలు చేసి అగ్రరాజ్యాలుగా ఎదుగుతుంటే, మనం మాత్రం మన పురాణాలను కట్టుకథలని కొట్టిపారేస్తున్నాము.

ఇప్పటికైనా మేల్కొందాము. మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాము. సైన్స్ కు అందని ఎన్నో రహస్యాలు మన వేదాలలో దాగి ఉన్నాయి. వాటిని వెలికి తీయాల్సిన బాధ్యత మనదే.

ఈ "కల్పవిగ్రహం" నిజంగానే అమెరికా దగ్గర ఉంటే, అది తిరిగి మన దేశానికి రావాలి. మన దేవుడు మన గడ్డ మీదే ఉండాలి.

ఈ వీడియోలో చెప్పిన విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరిస్తే, మీలో ఆలోచన రేకెత్తిస్తే, ఈ నిజాన్ని అందరికీ షేర్ చేయండి. ప్రపంచం మొత్తం మన సనాతన ధర్మం గొప్పతనాన్ని చూసి తల వంచేలా చేద్దాం.

జై హింద్! జై శ్రీరామ!

Monday, March 9, 2026

864 కోట్ల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే భూమిపైకి వచ్చే ఆ కృష్ణుడు ఎవరు?

 

864 కోట్ల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే భూమిపైకి వచ్చే ఆ కృష్ణుడు ఎవరు?
Goloka & Krishna Mystery - Difference between Goloka Krishna & Dwaraka Krishna

మనం ఇప్పటివరకు ఎన్నో రహస్యాలనూ, చరిత్రలనూ ఛేదించాము. కానీ ఈ రోజు... మనం ఈ భౌతిక విశ్వాన్ని దాటి, సమయానికి (Time) కూడా అందనంత దూరంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశానికి ప్రయాణించబోతున్నాము.

చాలామందికి 'స్వర్గం' తెలుసు, 'వైకుంఠం' తెలుసు. కానీ వీటన్నింటికంటే పైన... సృష్టి మొత్తానికీ మూలమైన ఒక రహస్య సామ్రాజ్యం ఉందని మీకు తెలుసా? అదే 'గోలోకం'.

మనం మహాభారతంలో కృష్ణుడిని చూశాము... యుద్ధనీతిని చెప్పేవాడిగా, అర్జునుడికి రథసారధిగా, కంసుడిని చంపిన వీరుడిగా, ఇలా ఎన్నో.. కానీ మీకు తెలుసా? ఆ కృష్ణుడు వేరు... మనకు తెలియని, శాస్త్రాలలో మాత్రమే దాగి ఉన్న 'గోలోక కృష్ణుడు' వేరు!

ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నారా? కృష్ణుడు ఒక్కడే కదా, ఇద్దరు ఎలా ఉంటారని?

పురాణాలు, ముఖ్యంగా లఘు భాగవతామృతం మరియు బ్రహ్మ సంహిత, ఒక విస్మయపరిచే రహస్యాన్ని చెబుతున్నాయి. కురుక్షేత్రంలో గీత చెప్పిన కృష్ణుడూ, గోలోకంలో రాధతో ఆడుకునే కృష్ణుడూ ఒక్కరే అయినా... వారి 'తత్వం' వేరు, వారి 'మూడ్' (Mood) వేరు, వారి 'లీల' వేరు.

అసలు గోలోకం ఎక్కడ ఉంది? అది వైకుంఠం కంటే ఎందుకు గొప్పది? భూమిపై పుట్టిన కృష్ణుడికీ, ఆ గోలోకంలో ఉండే కృష్ణుడికీ మధ్య ఉన్న ఆ 'సీక్రెట్ లింక్' ఏంటి?

ఈ రోజుటి మన వీడియోలో మనం ఒక లాంగ్ జర్నీ చేయబోతున్నాము. ఈ భౌతిక విశ్వాన్ని దాటి, టైమ్ అండ్ స్పేస్ (Time and Space) కి అందనంత దూరంలో ఉన్న గోలోక సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకుందాము. ఈ నిజాలు మీ ఆధ్యాత్మిక దృక్పథాన్నే మార్చేయవచ్చు. ఇక ఆనంద నిలయమైన గోలోక దివ్యధామంలోకి అడుగుపెడదాము.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/NZMGx5JMaEM ]


ముందుగా మనం గోలోకం ఎక్కడుందో తెలుసుకుందాము..

మన వేద కాస్మాలజీ (Cosmology) ప్రకారం... మనం ఉన్నది భూలోకం. దీని పైన భువర్లోకం, సువర్లోకం ఇలా 14 లోకాలు ఉన్నాయి. ఈ భౌతిక విశ్వాన్ని దాటాక 'విరజా నది' ఉంటుంది. దానిని దాటాక, 'బ్రహ్మజ్యోతి'. ఆ కాంతి సముద్రంలో ఎన్నో వైకుంఠ గ్రహాలు తేలియాడుతుంటాయి.

అయితే, బ్రహ్మ సంహిత (5.2) ప్రకారం... ఈ వైకుంఠ లోకాలన్నింటికీ పైన, ఒక గొడుగు లాంటి ఆకారంలో (Umbrella Shape) గోలోకం ఉంటుంది.

దీని ఆకారం సాధారణ గ్రహం లాగా గుండ్రంగా ఉండదు. ఇది ఒక 'సహస్ర దళ పద్మం' (Thousand-Petaled Lotus).

• మధ్య భాగం (The Whorl): దీనిని 'గోకుల' అంటారు. ఇక్కడే శ్రీకృష్ణుడు నివసిస్తాడు.
• రేకులు (Petals): ఆ తామర పువ్వు రేకులపై గోపికలు, మరియు కృష్ణుడి అంశావతారాలు నివసిస్తాయి.

గర్గ సంహిత ప్రకారం, ఈ గోలోకానికి రక్షణగా నాలుగు దిక్కులలో, నాలుగు భారీ పర్వతాలు ఉంటాయి:

1. శతశృంగ పర్వతం
2. సహస్రశృంగ పర్వతం
3. గోవర్ధన పర్వతం
4. నందీశ్వర పర్వతం.

ఇందులోని గోవర్ధన పర్వతం యొక్క చిన్న రూపమే, భూమిపై ఉన్న గోవర్ధన గిరి..

గోలోకంలో నేల మట్టితో ఉండదు. 'చింతామణి' రాళ్లతో ఉంటుంది. అక్కడ నీరు సాధారణ నీరు కాదు, అమృతం. అక్కడ నడిచే ప్రతి అడుగు ఒక నాట్యం, పలికే ప్రతి మాట ఒక పాట. ఇదీ గోలోక వైభవం!

మరి ఈ గోలోకం ఎప్పటినుంచి ఉందనే ప్రశ్నకు మన శాస్త్రాలు ఇచ్చే ఏకైక సమాధానం, అది 'అనాది' (Beginningless) మరియు 'సనాతనం'. మన భౌతిక విశ్వానికి (Material Universe) పుట్టుక, మరణం ఉంటాయి కానీ, గోలోకం 'అప్రకృత ధామం' (Spiritual World). కాబట్టి దానికి సృష్టి గానీ, లయం గానీ ఉండవు. మహాప్రళయంలో బ్రహ్మలోకంతో సహా ఈ 14 లోకాలు నాశనమైపోయినా, గోలోకం మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంటుంది. అక్కడ 'కాలం' (Time) అనేదే ఉండదు కాబట్టి, దానికి 'ఆరంభ తేదీ' అంటూ ఏదీ లేదు. సృష్టికర్త అయిన బ్రహ్మ పుట్టకముందూ, అసలు 'కాలం' అనే చక్రం తిరగకముందు నుంచే గోలోకం స్వయం ప్రకాశితంగా, నిత్యనూతనంగా వెలుగొందుతూనే ఉంది.

ఇప్పుడు మనం ఈ వీడియోలో అతి ముఖ్యమైన ఘట్టానికి వచ్చాము. చాలామందికి తెలియని రహస్యం ఇది.

గోలోకంలో ఉండే కృష్ణుడికీ, ద్వాపర యుగంలో ఈ భూమిపై నడయాడి, కంసుడిని చంపి, యుద్ధం చేసిన కృష్ణుడికీ తేడా ఉందా? అంటే, ఉందనే చెప్పాలి. అది సూక్ష్మమైన తేడా.

దానిని అర్థం చేసుకోవడానికి 'రూప గోస్వామి' రాసిన లఘు భాగవతామృతం చూడాలి.

1. ద్విభుజాలు – చతుర్భుజాలు (Two Arms vs Four Arms):

• గోలోకంలో కృష్ణుడు ఎప్పుడూ రెండు చేతులతోనే ఉంటాడు. చేతిలో ఎప్పుడూ వేణువు (Flute) ఉంటుంది. ఆయన ఆయుధాలు పట్టుకోడు, యుద్ధాలు చేయడు. కేవలం ప్రేమను పంచుతాడు, ఆనందాన్ని ఆస్వాదిస్తాడు (Rasa Lila). ఆయనను 'స్వయం భగవాన్' అంటారు.
• ద్వాపర యుగ కృష్ణుడు భూమిపై అవతరించినప్పుడు, అవసరాన్ని బట్టి ఆయన నాలుగు చేతులతో విష్ణు స్వరూపంలో కనిపిస్తాడు, చక్రం ధరిస్తాడు.

2. క్షేత్ర సన్యాసం (Leaving the Abode): శాస్త్రం ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇస్తుంది: 'వృందావనం పరిత్యజ్య పాదమేకం న గచ్ఛతి' అంటే... 'కృష్ణుడు వృందావనాన్ని అంటే గోలోకాన్ని వదిలి ఒక్క అడుగు కూడా బయటకు వేయడు'.

మరి మధురకు వెళ్లి కంసుడిని చంపిందెవరు? కురుక్షేత్రంలో ఉన్నది ఎవరు? ఇక్కడే 'విష్ణు తత్వం' యొక్క మాయ ఉంది.

ది మిస్టరీ రివీల్డ్ (The Mystery Revealed): భూమిపై శ్రీకృష్ణుడు బృందావనం నుండి అక్రూరుడి రథంపై మధురకు బయలుదేరినప్పుడు, కృష్ణుడి నుండి ఆయనలోని 'వాసుదేవ అంశ' అంటే విష్ణు తత్వం వేరుపడి మధురకు వెళ్ళింది. కానీ, ఆ స్వచ్ఛమైన, అమాయకమైన, ప్రేమికుడైన 'గోలోక కృష్ణుడు' అదృశ్య రూపంలో బృందావనంలోనే ఉండిపోయాడు. ఆయన గోపికల ప్రేమను వదిలి వెళ్లలేదు.

• కంసుడిని చంపింది: వాసుదేవ కృష్ణుడు (క్షత్రియుడు).
• రాధతో నాట్యం చేసింది: గోలోక కృష్ణుడు (రసరాజు).
• మహాభారత యుద్ధం నడిపింది: పార్థసారథి (విష్ణు అంశ).

గోలోక కృష్ణుడు కేవలం 'మాధుర్య రసాన్ని' (Sweetness) మాత్రమే ఆస్వాదిస్తాడు. అక్కడ రాక్షస వధ ఉండదు, రాజకీయాలు ఉండవు. కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది. భూమిపైకి వచ్చినప్పుడు మాత్రమే ధర్మస్థాపన కోసం ఆయన తనలోని 'ఐశ్వర్య శక్తిని' (Power) బయటకు తీస్తాడు.

ఇదంతా నమ్మశక్యంగా లేదా? అయితే చరిత్ర ఏం చెబుతుందో చూద్దాం...

చాలామంది కృష్ణుడిని కేవలం ఒక పురాణ పురుషుడిగా (Mythological Figure) మాత్రమే చూస్తారు. కానీ నిజంగా కృష్ణుడు చరిత్రలో జీవించాడా? దీనికి ఏవైనా సాక్ష్యాలు ఉన్నాయా?

'డీకోడ్ హిందూ మైథాలజీ' (Decode Hindu Mythology) దృష్టితో చూస్తే, సమాధానం గట్టిగా 'అవును' అని వినిపిస్తుంది. కృష్ణుడు కేవలం భక్తుల హృదయాల్లోనే కాదు, చరిత్ర పుటల్లో కూడా ఉన్నాడు.

1. సముద్ర గర్భంలో ద్వారక (The Sunken City): మహాభారతంలో గాంధారి శాపం వల్ల ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయిందని ఉంది. శతాబ్దాల పాటు ఇది ఒక కథగానే మిగిలిపోయింది. కానీ ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్.ఆర్. రావు (Dr. S.R. Rao), గుజరాత్ తీరంలో సముద్ర గర్భంలో జరిపిన తవ్వకాల్లో ఒక భారీ నగరం బయటపడింది. అక్కడ దొరికిన గోడలు, రాతి లంగరులు (Stone Anchors), మరియు నాణేలు, సామాన్యశక పూర్వం నాటివని 'కార్బన్ డేటింగ్'లో తేలింది. మహాభారతంలో వర్ణించబడిన ద్వారక నగర నిర్మాణానికీ, నీటి అడుగున దొరికిన నగరానికీ అద్భుతమైన పోలికలు ఉన్నాయి.

2. గ్రీకు రాయబారుల సాక్ష్యం (Greek Evidence): అలెగ్జాండర్ భారతదేశానికి రాకముందే, గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్ (Megasthenes) తన 'ఇండికా' గ్రంథంలో ఒక ఆసక్తికరమైన విషయం రాశాడు. 'శౌరసేన' (Sourasenoi) అనే తెగ వారు 'హెరాకిల్స్' (Herakles) అనే దేవుడిని పూజిస్తారనీ, వారి నగరాలు 'మెథొరా' అంటే Mathura, 'క్లైసోబోరా' అంటే Krishnapura అని రాశాడు. చరిత్రకారులు ఆ 'హెరాకిల్స్' మరెవరో కాదు, మన శ్రీకృష్ణుడే అని నిర్ధారించారు. అంటే సామాన్యశక పూర్వమే కృష్ణ ఆరాధన బలంగా ఉందనడానికి ఇది ఒక తిరుగులేని సాక్ష్యం.

3. శాసనాలు మరియు నాణేలు (Inscriptions & Coins): మధ్యప్రదేశ్ లోని విదిశలో ఉన్న 'హెలియోడోరస్ స్తంభం' (Heliodorus Pillar) సామాన్యశక పూర్వం 113 ఏళ్ల నాటిది. దీనిని ఒక గ్రీకు రాయబారి కట్టించాడు. ఆ స్తంభంపై స్పష్టంగా 'దేవదేవ వాసుదేవ' (God of Gods Vasudeva) అని బ్రాహ్మీ లిపిలో రాసి ఉంది. ఒక విదేశీయుడు వచ్చి కృష్ణుడిని 'దేవదేవుడిగా' కొలిచాడంటే, ఆ కాలంలో మనుష్యులపై కృష్ణుడి ప్రభావం ఎంతలా ఉండేదో ఊహించుకోవచ్చు.

కాబట్టి, కృష్ణుడు కేవలం ఒక భావన కాదు. ఆయన ఈ భరతభూమిపై నడయాడిన ఒక చారిత్రక సత్యం. ఆయన భగవద్గీత ద్వారా ఇచ్చిన జ్ఞానం మానవజాతి చరిత్రలోనే ఒక మలుపు.

ఇప్పుడు మనం ఒక మైండ్ బెండింగ్ (Mind-bending) కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే 'టైమ్ ట్రావెల్' (Time Travel) మరియు కృష్ణుడి వయస్సు.

ద్వాపర యుగంలో కృష్ణుడు భూమిపై ఎంత కాలం ఉన్నాడు? పురాణాల లెక్కల ప్రకారం సుమారు 125 సంవత్సరాలు. ఆయన చిన్న పిల్లాడిగా పుట్టాడు, పెరిగాడు, కురుక్షేత్ర యుద్ధం చేశాడు, చివరికి వృద్ధాప్యం రాకముందే అవతారం చాలించాడు. అంటే భూమిపై ఆయన వయస్సు పెరగడం వాస్తవం.

కానీ... గోలోకంలో కృష్ణుడి వయస్సు ఎంత? దీనికి శాస్త్రాలు ఒక ఖచ్చితమైన సమాధానం ఇచ్చాయి.

1. ది ఎటర్నల్ టీనేజర్ (The Eternal Teenager): బ్రహ్మ సంహిత మరియు భక్తి రసామృత సింధు ప్రకారం, గోలోకంలో కృష్ణుడు ఎప్పుడూ ఒకే వయస్సులో ఉంటాడు. ఆయన ఎప్పుడూ పుట్టడు, ఎప్పుడూ చనిపోడు, మరియు ఎప్పుడూ ముసలివాడు కాడు. ఆయన వయస్సు ఎప్పుడూ 'కైశోర ప్రాయం' లోనే ఉంటుంది. అంటే మన లెక్కల ప్రకారం సుమారు 15 సంవత్సరాల, 9 నెలల, 7 రోజుల వయస్సు. ఎన్ని యుగాలు గడిచినా, ఆయన వయస్సు ఒక్క రోజు కూడా పెరగదు. దీనినే 'నిత్య నవ యవ్వనం' అంటారు.

2. బ్రహ్మ ఆయుష్షు vs కృష్ణుడి రాక (The Rare Visit): ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. గోలోక కృష్ణుడు భూమిపైకి ఎప్పుడు పడితే అప్పుడు రాడు. దానికి ఒక కాస్మిక్ టైమ్ టేబుల్ (Cosmic Timetable) ఉంది.

• బ్రహ్మ దేవుడికి పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు.
• బ్రహ్మ యొక్క ఒక్క పగటి కాలం (12 గంటలు) = 1000 మహా యుగాలు (అంటే 432 కోట్ల సంవత్సరాలు).
• ఈ 1000 మహా యుగాలలో, కేవలం ఒక్కసారి మాత్రమే... అంటే 28వ మహాయుగంలోని ద్వాపర యుగంలో మాత్రమే, గోలోక కృష్ణుడు స్వయంగా భూమిపైకి దిగి వస్తాడు.

మిగిలిన యుగాల్లో వచ్చేది కృష్ణుడి అంశావతారాలు (Vishnu Avatars) మాత్రమే. కానీ స్వయం భగవానుడు వచ్చేది బ్రహ్మ యొక్క ఒక్క రోజులో ఒక్కసారి మాత్రమే! అంటే సుమారు 864 కోట్ల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుతం అది. మనం ఎంత అదృష్టవంతులమో ఆలోచించండి, అలాంటి కృష్ణుడి చరిత్రను మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం!

3. నిత్య వర్తమానం (Eternal Present): భూమిపై 'గతం, వర్తమానం, భవిష్యత్తు' ఉంటాయి. కానీ గోలోకంలో 'సూర్యోదయం, సూర్యాస్తమయం' ఉండవు కాబట్టి, అక్కడ కాలం గడవదు. అక్కడ అంతా 'నిత్య వర్తమానం' (Eternal Present) మాత్రమే. అక్కడ కృష్ణుడు ఎప్పుడూ ఆడుకుంటూనే ఉంటాడు, గోపికలు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఆ ఆట ఎప్పటికీ ఆగదు.

సో, ద్వాపర యుగ కృష్ణుడికి వయస్సు 125 సంవత్సరాలయితే... గోలోక కృష్ణుడికి వయస్సు అనేదే లేదు. ఆయన కాలానికి అతీతుడు (Timeless).

సరే, కృష్ణుడు దేవుడు అని అందరూ అంటారు. కానీ ఆయన ఎందుకు 'పరమాత్ముడు' (Supreme)? ఎందుకని ఆయన 'సర్వలోకాలకు ప్రభువు'..? దీనికి కూడా మన ఋషులు లెక్కలు (Calculation) వేశారు.

భక్తి రసామృత సింధువులో 64 రకాల దివ్య గుణాల గురించి చెప్పారు.

1. జీవులు (మనం): మనలో గరిష్టంగా 50 గుణాలు పాక్షికంగా ఉంటాయి.
2. దేవతలు (శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు): వీరిలో 55 గుణాలు ఉంటాయి.
3. శ్రీమన్నారాయణుడు (వైకుంఠ విష్ణువు): ఈయనలో 60 గుణాలు ఉంటాయి.
4. శ్రీకృష్ణుడు (గోలోక వాసి): ఈయనలో మాత్రమే 64 గుణాలు పరిపూర్ణంగా ఉంటాయి.

విష్ణువులో కూడా లేని ఆ 4 ప్రత్యేక గుణాలు (The Super 4) ఏంటి? ఇవి కేవలం గోలోక కృష్ణుడిలోనే ఉంటాయి:

1. లీలా మాధుర్యం: అద్భుతమైన లీలలు చేయడం (ఉదా: దామోదర లీల, గోవర్ధన లీల). వైకుంఠంలో విష్ణువు ఇలాంటి పనులు చేయడు, అక్కడ అంతా గంభీరమైన వాతావరణం ఉంటుంది.
2. ప్రేమ మాధుర్యం: భక్తులు ఆయన భుజంపై ఎక్కి ఆడుకునేంత చనువు ఇవ్వడం. నారాయణుడి భుజం ఎక్కలేం.. కానీ కృష్ణుడి భుజం ఎక్కవచ్చు.
3. వేణు మాధుర్యం: ఆ వేణు గానానికి మూడు లోకాలు స్తంభించిపోతాయి. బ్రహ్మ కూడా తన సృష్టిని మర్చిపోతాడు.
4. రూప మాధుర్యం: ఆయన అందం ఎంత గొప్పదంటే... తన ప్రతిబింబాన్ని చూసి తానే ఆకర్షితుడయ్యేంత (Krishna attracts Himself).

అసలు గోలోకంలో జీవన శైలి (Lifestyle) ఎలా ఉంటుంది?

అక్కడ సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు వంటి అవసరాలు ఉండవు. కృష్ణుడి శరీరం నుండి వచ్చే కాంతి అంటే ‘బ్రహ్మజ్యోతి’, ఆ లోకం మొత్తాన్ని వెలిగిస్తుంది.

• సురభి ఆవులు: భూమిపై ఆవులు గడ్డి తిని పాలు ఇస్తాయి. గోలోకంలో 'సురభి' ఆవులు ఉంటాయి. ఇవి అక్కడివారు కోరుకున్నప్పుడు పాల సముద్రాలనే ప్రవహింపజేస్తాయి.
• కల్ప వృక్షాలు: అక్కడి చెట్లు కేవలం పండ్లు మాత్రమే ఇవ్వవు. కోరుకున్నవారికి కోరుకున్నవన్నీ సమకూరుస్తాయి. అందుకే వాటిని కల్ప వృక్షాలు అన్నారు.

అక్కడ కాలం (Time) గడవదు. అక్కడ గడియారాలు ఉండవు. 'భూత భవిష్యత్తు' అనేవి ఉండవు. ఉన్నదంతా 'నిత్య వర్తమానం' (Eternal Present). ఎప్పుడూ ఆనందమే. అసలక్కడ ముసలితనమే ఉండదు.

ఇంత అద్భుతమైన లోకానికి వెళ్లాలని ఎవరికి ఉండదు? కానీ అక్కడికి వెళ్లడానికి అర్హతలు ఏంటి? అంటే..

జ్ఞాన యోగం ద్వారా బ్రహ్మజ్యోతి వరకు వెళ్లగలరు. కర్మ యోగం ద్వారా స్వర్గానికి వెళ్లగలరు. భక్తి యోగం ద్వారా వైకుంఠానికి వెళ్లగలరు. కానీ... గోలోకానికి వెళ్లాలంటే 'రాగనుగ భక్తి' కావాలి.

అంటే దేవుడిని భయంతో కాకుండా... ప్రేమతో కొలవాలి. యశోద లాగా వాత్సల్యంతో, లేదా గోపికల లాగా మాధుర్యంతో, లేదా అర్జునుడి లాగా సాఖ్యంతో (Friendship) ప్రేమించాలి.

కలియుగంలో దీనికి ఏకైక మార్గం 'హరే కృష్ణ మహామంత్రం'. ఎవరు నిరంతరం కృష్ణుడి నామాన్ని జపిస్తూ, తమ జీవితాన్ని ఇతరులకు హాని చేయకుండా గడుపుతారో... వారు శరీరం వదిలాక నేరుగా ఆ గోలోక ధామానికి చేరుకుంటారని, పద్మ పురాణం చెబుతోంది.

గోలోకం అనేది కేవలం ఒక పురాణం (Mythology) కాదు. అది మన ఆత్మ యొక్క శాశ్వత చిరునామా (Permanent Address). మనం ఈ భూమిపైకి పర్యాటకులలాగా వచ్చాం, ఇక్కడ కష్టసుఖాలు అనుభవిస్తున్నాం. కానీ మన ప్రయాణం ఎక్కడ ముగియాలో తెలుసుకోవడమే మానవ జన్మ సార్థకత.

మీరు గనుక ఆ శ్రీకృష్ణుడి భక్తులైతే, కామెంట్ బాక్స్ లో 'జై శ్రీకృష్ణ' అని టైప్ చేయండి. మరొక అద్భుతమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం.

🚩జై శ్రీ కృష్ణ 🙏

Monday, March 2, 2026

The Indian Temple That Baffled NASA కసార్ దేవి: నాసా, వాన్ అలెన్ రహస్యం!


కసార్ దేవి: నాసా, వాన్ అలెన్ రహస్యం!
సనాతన ధర్మం, భూ అయస్కాంత శక్తులు మరియు విశ్వ రహస్యాల పరిశోధన!
NASA, Aliens: The Indian Temple That Baffled NASA

ప్రాచీన భారతీయ జ్ఞానం, సనాతన ధర్మం మరియు ఆలయాల వెనుక ఉన్న అత్యున్నత వైజ్ఞానిక రహస్యాలను విశ్లేషించే మన ఛానెల్‌లో, ఈ రోజు ఒక అద్భుతమైన, నమ్మలేని నిజం గురించి తెలుసుకోబోతున్నాము. సైన్సా? సనాతన ధర్మమా? ఏది ప్రామాణికం అని అడిగే వారికి ఈ వీడియో ఒక కనువిప్పు.

ఈ విశాల ప్రపంచంలో, అత్యంత విపరీతమైన అయస్కాంత శక్తీ, మరియు అంతుచిక్కని కాస్మిక్ ఎనర్జీ ఉన్న ప్రదేశాలు మూడే మూడని, ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతారు. ఒకటి దక్షిణ అమెరికా పెరూ దేశంలోని 'మాచు పిచ్చు', రెండవది ఇంగ్లాండ్‌ లోని 'స్టోన్‌ హెంజ్', ఇక మూడవది... మన భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం, అల్మోరా జిల్లాలోని 'కసార్ దేవి' (Kasar Devi) గ్రామం, మరియు అక్కడి పురాతన ఆలయం విశేషమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి. అసలు నాసా (NASA) శాస్త్రవేత్తలను సైతం ఆకర్షించి, వాళ్లు పరిశోధనలు చేసేలా చేసిన ఆ అదృశ్య శక్తి, కసార్ దేవి ఆలయం దగ్గర ఎందుకు ఉంది? అక్కడికి వెళ్లగానే ఎలక్ట్రానిక్ పరికరాలు, జీపీఎస్ (GPS) ఎందుకు పనిచేయవు? స్వామి వివేకానందుడికి అక్కడ ఎదురైన అద్భుత అనుభవం ఎటువంటిది? మన స్కంద పురాణం ఆ కొండ గురించి ఏం చెబుతోంది? ఇవన్నీ ఈ వీడియోలో మనం లోతుగా తెలుసుకుందాము.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/OcjEXzgeHbA ]


ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం, భూమి చుట్టూ ఒక పెద్ద అయస్కాంత రక్షణ కవచం ఉంటుంది. అంతరిక్షం నుండీ, సూర్యుని నుండీ వచ్చే ప్రమాదకరమైన రేడియేషన్ భూమి మీద పడకుండా, ఇది అడ్డుకుంటుంది. దీనినే 1958లో, జేమ్స్ వాన్ అలెన్ కనుగొన్నారు కాబట్టి, దీనికి 'వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్' (Van Allen Radiation Belt) అని పేరు పెట్టారు. నాసా (NASA) పరిశోధనల ఆధారంగా చెప్పబడే ఒక ప్రసిద్ధ వాదన ఏమిటంటే, ఈ వాన్ అలెన్ బెల్ట్ ప్రభావం, ప్రపంచంలో కేవలం మూడు చోట్ల మాత్రమే, నేరుగా భూమి మీద కేంద్రీకృతమై ఉంటుంది. అందులో ప్రధానమైనది మన కసార్ దేవి.

అమెరికన్ సైంటిస్టులు ఈ కసార్ దేవి ప్రాంతంలో ఉన్న గ్రావిటీ పాయింట్‌ నూ, (Gravity Point) మరియు అయస్కాంత క్షేత్రాన్నీ అధ్యయనం చేయడానికి, ఇక్కడ 8 జీపీఎస్ (GPS) మార్కర్లను సైతం ఏర్పాటు చేసినట్లు, రికార్డులు చెబుతున్నాయి. ఇక్కడ భూమి లోపల ఉన్న టెక్టోనిక్ ఫలకాల (Tectonic plates) వల్ల ఉత్పత్తి అయ్యే, అల్ట్రా-లో ఫ్రీక్వెన్సీ (ULF) విద్యుదయస్కాంత తరంగాలు ఎంత బలంగా ఉంటాయంటే... పర్యాటకులు ఈ అడవుల్లోకి వెళ్లగానే, మొబైల్ సిగ్నల్స్ కోల్పోవడం, జీపీఎస్ (GPS) దారి తప్పడం లాంటివి జరుగుతుంటాయి. అందుకే టెలి కమ్యూనికేషన్ లేని ఆ ప్రశాంతతే, బాహ్య ప్రపంచం నుండి మనల్ని డికనెక్ట్ చేసి, అంతర్గత ప్రపంచంతో అనుసంధానం కావడానికి సహాయ పడుతుంది.

సెగ్మెంట్ 2: సనాతన ధర్మం - స్కంద పురాణంలో కౌషికీ దేవి మరియు రాక్షస సంహారం

ఆధునిక శాస్త్రవేత్తలు కేవలం అరవై ఏళ్ల క్రితం కనుగొన్న ఈ అదృశ్య శక్తి గురించి, మన సనాతన ధర్మంలో వేల సంవత్సరాల క్రితమే, మన ఋషులు స్పష్టంగా చెప్పారు. 81,000 కు పైగా శ్లోకాలతో ఉన్న అతిపెద్ద పురాణమైన 'స్కంద పురాణం' (Skanda Purana) లో, కుమావోన్ హిమాలయాల గురించి 'మానస ఖండం' (Manaskhanda) లో, అద్భుతంగా వర్ణించబడింది. పురాణాల ప్రకారం ఈ కసార్ దేవి ప్రాంతాన్ని కశ్యప మహర్షి పేరు మీద, 'కశ్యప పర్వతం' అని పిలిచేవారు.

దేవీ భాగవతం మరియు పురాణాల ప్రకారం, ఒకప్పుడు దేవతలను ముప్పు తిప్పలు పెడుతున్న శుంభ, నిశుంభులనే ఇద్దరు భయంకరమైన రాక్షసులను అంతం చేయడానికి, పార్వతీ దేవి తన దేహం నుండి నల్లటి కణాలను (sheath/Kosha) విడిచి పెట్టింది. ఆ కణాల నుండి ఆవిర్భవించిన అత్యంత ఉగ్ర స్వరూపిణియే, 'కౌషికీ దేవి' (Kaushiki Devi). దుర్గామాత ఎనిమిదవ రూపమైన కాత్యాయనీ దేవిగా చెప్పబడే కౌషికీ దేవి, ఈ కసార్ దేవి కొండల పైనే ఆ రాక్షసులతో మహా సంగ్రామం చేసి వాళ్లను వధించింది.

అందుకే ఈ గుడి వెనుక ఉన్న అతిపెద్ద రాతి మీద, అమ్మవారి వాహనమైన సింహం యొక్క పాదముద్రలు నేటికీ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఆలయం లోపల ఒక సహజ సిద్ధమైన గుహ ఉంది. అందులో శతాబ్దాలుగా, ఎప్పుడూ ఆరిపోకుండా వెలిగే 'అఖండ జ్యోతి' (Akhand Jyoti), మరియు 24 గంటలు నిరంతరం మండుతూ ఉండే ధుని (Dhuni/Havan Kund) ఉన్నాయి. ఆ ధునిలోని భస్మానికి అపారమైన వైద్య శక్తి ఉందనీ, ముఖ్యంగా తీవ్రమైన మానసిక రోగాలను (Mental illnesses) సైతం, ఆ భస్మం నయం చేస్తుందనీ, స్థానికులు బలంగా విశ్వసిస్తారు. ఇది 108 సిద్ధ శక్తి పీఠాలలో ఒకటిగా కూడా కొలవబడుతోంది.

సెగ్మెంట్ 3: మెదడులోని ఆల్ఫా వేవ్స్ (Alpha Brain Waves) - న్యూరోసైన్స్ ఏం చెబుతోంది?

ఈ కొండ పైకి వెళ్లగానే సమయం ఆగిపోయినట్లు ఎందుకు అనిపిస్తుంది? ఇదంతా కేవలం నమ్మకమేనా? కాదు, దీని వెనుక పక్కా సైన్స్ ఉంది. ఆధునిక న్యూరోసైన్స్ (Neuroscience) ప్రకారం, కసార్ దేవి వద్ద ఉన్న శక్తివంతమైన కాస్మిక్ ఎనర్జీ, మరియు అయస్కాంత క్షేత్రం, మనిషి మెదడులో ఉండే 'ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్' (Alpha Brain Waves) ను విపరీతంగా ఉత్తేజ పరుస్తుంది.

సాధారణంగా మనం టెన్షన్ లో లేదా కోపంలో ఉన్నప్పుడు, బీటా (Beta) వేవ్స్ ఉంటాయి. కానీ ఇక్కడి వాతావరణం వల్ల మెదడు ఫ్రీక్వెన్సీ మారిపోయి, మెదడులోని భయానికి సంబంధించిన 'అమిగ్డాలా' (Amygdala) కుచించుకుపోతుంది. దాంతో ఆలోచనలు ఆగిపోయి, అనిర్వచనీయమైన ప్రశాంతత, అపారమైన సృజనాత్మకత (Creativity) ఏర్పడతాయి. ఏళ్ల తరబడి ధ్యానం చేస్తే వచ్చే సమాధి స్థితి, ఇక్కడ కేవలం కొద్ది నిమిషాలు కూర్చుంటే చాలు, ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది. ఇదే ఇక్కడి అసలైన మ్యాజిక్.

సెగ్మెంట్ 4: స్వామి వివేకానంద అద్భుత ఆధ్యాత్మిక అనుభవం (Microcosm - Macrocosm)

ఈ ప్రదేశం గొప్పతనం పాశ్చాత్య దేశాలకు తెలియడానికి అతిపెద్ద కారణం, మన భారతీయ ఆధ్యాత్మిక సింహం స్వామి వివేకానంద. 1890వ దశకంలో, వివేకానందుడు కాలి నడకన హిమాలయాలకు వస్తున్నప్పుడు, అల్మోరా సమీపంలోని 'కక్రి ఘాట్' (Kakri ghat) వద్ద ఒక రావి చెట్టు (Peepal Tree) కింద ధ్యానంలో కూర్చున్నారు. ఆ ధ్యానంలో ఆయనకు ఒక ఉత్కృష్టమైన విశ్వ రహస్యం అవగతమైంది. దాన్నే ఆయన తన డైరీలో 'పిండాండం మరియు బ్రహ్మాండం' (Microcosm and Macrocosm) అని రాసుకున్నారు. అంటే, ఈ అనంతమైన విశ్వం ఎలా అయితే నిర్మించబడిందో, అతి సూక్ష్మమైన మానవ దేహం కూడా కచ్చితంగా అదే ప్రణాళికతో నిర్మించబడిందని, ఆయన సాక్షాత్కారం పొందారు.

ఆ తర్వాత ఆయన అల్మోరాలోని లాలా బద్రీ షా (Lala Badri Shah) ఇంట్లో బస చేసి, నేరుగా కసార్ దేవి గుహకు చేరుకున్నారు. ఆ గుహలోని అత్యంత శక్తివంతమైన అయస్కాంత వలయంలో కఠోరమైన ధ్యానం చేసి, బ్రహ్మానంద స్థితిని పొందారు. ఆ తర్వాతే ఆయన చికాగో మత సమ్మేళనానికి వెళ్లి, మన సనాతన ధర్మ కీర్తిని ప్రపంచానికి చాటారు.

సెగ్మెంట్ 5: క్రాంక్స్ రిడ్జ్ (Crank's Ridge) - వెస్ట్రన్ మిస్టిక్స్ మరియు హిప్పీ సంస్కృతికి కేంద్రం

వివేకానందుడి అడుగుజాడల్లో, 20వ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తత్వవేత్తలు, కసార్ దేవి వైపు పరుగులు తీశారు. 1930లలో, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ (Rabindranath Tagore) ఆహ్వానం మేరకు, డెన్మార్క్ దేశానికి చెందిన ఆల్ఫ్రెడ్ సోరెన్సెన్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి, 'శూన్యతా బాబా' (Sunyata Baba) గా మారి, మూడు దశాబ్దాల పాటు కేవలం మౌన సాధన చేశారు.

ఆలయానికి కొద్దిగా ముందు ఉండే పైన్ అడవుల ప్రాంతాన్ని, 'క్రాంక్స్ రిడ్జ్' (Crank's Ridge), లేదా 'హిప్పీ హిల్' అంటారు. 1960లలో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, సైకాలజిస్ట్, తిమోతీ లియారీ (Timothy Leary) ఇక్కడికి వచ్చి, తన ప్రసిద్ధ 'సైకెడెలిక్ ప్రార్థనలు' (Psychedelic Prayers) రచించారు. అంతేకాదు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాప్ సింగర్స్ బాబ్ డైలాన్ (Bob Dylan), జార్జ్ హారిసన్ (George Harrison), మరియు హాలీవుడ్ ప్రముఖ నటి ఉమా థుర్మాన్ (Uma Thurman) లాంటి వారు ఇక్కడికి వచ్చి, తమ అంతర్గత శాంతిని వెతుక్కున్నారు. వాళ్లే స్వయంగా, ఇక్కడి అదృశ్య శక్తి తమ జీవితాల్లో సృజనాత్మకతను అనంతం చేసిందని అంగీకరించారు.

సెగ్మెంట్ 6: ఏలియన్స్ కు ల్యాండింగ్ స్పాట్? గ్రహాంతరవాసుల రహస్యం

ఈ వీడియోలో చివరగా, ఒక అత్యంత వివాదాస్పదమైన, మరియు కుతూహలం కలిగించే అంశం. హిమాలయాలు మరియు కసార్ దేవి చుట్టుపక్కల ప్రాంతాలు, 'అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్' (UFOs), లేదా గ్రహాంతరవాసుల (Aliens) కదలికలకు కేంద్రాలుగా వార్తల్లో నిలుస్తుంటాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా, ఇక్కడి దట్టమైన పైన్ అడవుల్లో ఆకాశంలో వింతైన, నిశ్శబ్దంగా ప్రయాణించే ప్రకాశవంతమైన గోళాలు కనిపించాయని, స్థానికులు చెబుతుంటారు.

యూఫోలాజిస్ట్‌ల (Ufologists) సిద్ధాంతాల ప్రకారం, కసార్ దేవి లాంటి భూ అయస్కాంత క్షేత్రాలు బలంగా ఉన్న ఈ ఎనర్జీ వోర్టెక్స్ (Energy Vortex) ప్రాంతాలు, గ్రహాంతర నౌకలకు తమ వాహనాలను రీఛార్జ్ చేసుకునే ల్యాండింగ్ స్పాట్స్ గా, లేదా ఇంటర్-డైమెన్షనల్ పోర్టల్స్ గా ఉపయోగ పడతాయి. రామాయణ, మహాభారతాల్లో చెప్పిన జటాయువు, పుష్పక విమానం మరియు దేవతలు కేవలం కల్పనలు కావనీ, అవి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన గ్రహాంతర వాసుల వాహనాలనీ, ఏన్షియంట్ ఏలియన్ థియరీస్ నమ్ముతున్నాయి.

ఈ సుదీర్ఘ అన్వేషణ, మరియు భౌతిక, ఖగోళ, ఆధ్యాత్మిక విశ్లేషణల ద్వారా వ్యక్తమవుతున్న నిత్య సత్యం ఏమిటంటే, కసార్ దేవి కేవలం రాళ్లతో కట్టిన ఒక పురాతన కట్టడం కాదు. అది భూమి మరియు అంతరిక్షం మధ్య జరిగే ఒక నిరంతర విద్యుదయస్కాంత శక్తి మార్పిడి కేంద్రం. ఇక్కడ ఉన్న అద్భుతమైన అయస్కాంత క్షేత్రం, నాసా (NASA) గుర్తించినట్లుగా, వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్ వల్ల ప్రభావితమయ్యే అణు కణాల వల్ల కావచ్చు, లేదా భూ భౌగోళిక శాస్త్రవేత్తలు కనుగొన్న నార్త్ అల్మోరా త్రస్ట్ (North Almora Thrust) లాంటి టెక్టోనిక్ ఫలకాల ఘర్షణ వల్ల పుట్టిన, ULF శక్తి (ULF Energy) వల్ల కావచ్చు. కారణం ఏదైనా, అది మానవ మెదడులోని ఆల్ఫా తరంగాలను (Alpha waves) ఉత్తేజపరిచి, సమాధి స్థితికి సులభంగా తీసుకెళ్లగలదని, ఆధునిక న్యూరోసైన్స్ ద్వారా నిరూపితమైంది.

ఆధునిక శాస్త్రవేత్తలు కేవలం కొన్ని దశాబ్దాల క్రితం మాత్రమే, అధునాతన యంత్రాలు, ఎక్స్‌ప్లోరర్ శాటిలైట్ల ద్వారా నిరూపించిన ఈ శక్తి వలయాలను, వేల సంవత్సరాల క్రితమే ఎటువంటి సాంకేతిక పరికరాలు లేని కాలంలోనే, మన భారతీయ ఋషులు ఎలా గుర్తించ గలిగారు? గర్భగుడిని నిర్మించే ఖచ్చితమైన ప్రదేశం, అక్కడ ప్రతిష్టించే యంత్రాలు, లీ లైన్స్ (Ley Lines) మరియు వాస్తు పురుష మండల అనేవి, నేటి క్వాంటం ఫిజిక్స్ (Quantum Physics) మరియు మ్యాగ్నెటిక్ థియరీస్ (Magnetic Theories) కంటే ఎంతో ముందున్నాయని స్పష్టమవుతోంది. అణువులోని నిర్మాణమే బ్రహ్మాండం మొత్తం వ్యాపించి ఉందని (Macrocosm and Microcosm) స్వామి వివేకానంద చెప్పిన సత్యం, నేటి ఆధునిక 'స్ట్రింగ్ థియరీ' (String Theory) సిద్ధాంతాలకు నిలువుటద్దం లాంటిది.

స్వామి వివేకానందుడి నుండి బాబ్ డైలాన్ వరకు, ప్రాచీన మునుల నుండి నాసా శాస్త్రవేత్తల వరకు, అందరూ ఈ అదృశ్య శక్తి ముందు తలవంచిన వారే. అహంకారాన్ని పక్కనపెట్టి, అంతర్గత ప్రపంచాన్ని శోధించాలనుకునే ప్రతి ఒక్కరికీ, కసార్ దేవి పర్వత శ్రేణులు ఒక ఆధ్యాత్మిక ప్రయోగశాల లాంటివి. భౌతిక శాస్త్రం కొలమానాలతో ప్రకృతిని విశ్లేషిస్తే, సనాతన ధర్మం ఆ ప్రకృతిని అనుభూతి చెందడం ఎలాగో నేర్పిస్తుంది. ఈ రెండింటి అద్భుతమైన కలయికే అల్మోరా కొండల్లో దాగిన కసార్ దేవి దేదీప్యమానమైన ఆకర్షణకు అసలైన రహస్యం. ప్రాచీన భారతీయ ఆలయాలు మూఢనమ్మకాలు కావనీ, అవి అనంత విశ్వశక్తిని ఆకర్షించి, భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేయగల అత్యున్నత వైజ్ఞానిక నిర్మాణాలనీ, ఈ క్షేత్రం నిస్సందేహంగా రుజువు చేస్తోంది.

మన వీడియోలలో ఇలాంటి ఎన్నో పురాతన ఆలయాల వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యాలను మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన ఐతిహాసిక రహస్యంతో మీ ముందుకు వస్తాను.. అంతవరకు సెలవు. 

జై హింద్!

Monday, February 23, 2026

The Lost Pages of History: Did Greek and Hindu Gods Originate from the Same Source? గ్రీకు vs హిందూ పురాణాలు

 

గ్రీకు vs హిందూ పురాణాలు: ఒకే నాణేనికి రెండు ముఖాలా?
The Lost Pages of History: Did Greek and Hindu Gods Originate from the Same Source?

మన చరిత్ర, పురాణాలు ఒక అద్భుతమైన సాలెగూడు లాంటివి. వాటిలో ఎంత లోతుగా వెళ్తే, అంత ఆశ్చర్యకరమైన నిజాలు బయట పడతుంటాయి. ప్రపంచ పటంలో గ్రీస్ దేశం ఎక్కడో ఉంటే, మన భారతదేశం ఇంకెక్కడో ఉంది. కానీ, ఆశ్చర్యకరంగా ఈ రెండు నాగరికతల పురాణ గాథలను పక్క పక్కన పెట్టి చూస్తే... అవి వేరు వేరు కాదు. బహుశా ఒకే మూలం నుండి పుట్టిన రెండు వేరు వేరు కథలేమో అనిపిస్తుంది.

చరిత్ర మరియు పురాణాలు ఎంతో అందంగా ముడిపడి ఉంటాయి. గ్రీకు పురాణాలు మరియు హిందూ పురాణాలను నిశితంగా గమనిస్తే, ఆ పోలికలు ఎంత స్పష్టంగా ఉంటాయంటే, ఇవి ఒకే పూర్వీకుల నుండి వచ్చి, వేర్వేరు సంస్కృతులలో, వేర్వేరుగా విస్తరించాయా అనే సందేహం కలుగుతుంది.

ఈ రోజుటి మన వీడియోలో, అటువంటి ఆశ్చర్యపరిచే పోలికలనూ, మన ప్రాచీన గ్రంథాలు తెలియ చెప్పిన సత్యాలనూ, గ్రీకు కథలలోని రహస్యాలనూ ఛేదించబోతున్నాము.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/a4lCEUJ0CxM ]


ప్రపంచీకరణ అంటే, Globalisation అనేది ఆధునిక కాలంలో వాణిజ్య మార్గాల ఆవిష్కరణతో మొదలైందని మనం అనుకుంటుంటాము. కానీ మనం చరిత్రలోకి లోతుగా వెళ్తే, దాని మూలాలు టైరియన్ లేదా ఫోనీషియన్ (Phoenician) నాగరికతలలో కనిపిస్తాయి. ప్రసిద్ధమైన ఊదా రంగు (purple dye) వ్యాపారం, మరియు ఫోనీషియన్ అక్షరాల ఆవిష్కరణ, వారి విజయానికి కారణాలు.

గ్రీకు పురాణాల ప్రకారం, లెవంట్ అంటే ప్రస్తుత లెబనాన్ ప్రాంతంలో, కాడ్మస్ (Cadmus) మరియు ఇతర సోదరులు తమ సోదరి 'యూరోపా' (Europa) కోసం వెతకడం మొదలు పెట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ యూరోపాను సాక్షాత్తు గ్రీకు దేవుడైన జ్యూస్ (Zeus), ఒక తెల్లటి ఎద్దు రూపంలో వచ్చి అపహరించాడు.

ఇది కేవలం కథేనా? లేక ఒకప్పుడు మానవ జాతి అంతా ఒకే చోట ఉండి, కాలక్రమేణా వేరుపడిందా? ఈ ఆలోచనే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. మన హిందూ ధర్మంలో "త్రిమూర్తులు" అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. సరిగ్గా ఇలాంటి భావనే గ్రీకు పురాణాలలో కూడా ఉంది. అక్కడ ముగ్గురు సుప్రీం గాడ్స్ (Supreme Gods) ఉన్నారు:

1. జ్యూస్ (Zeus): దేవతలకు రాజు.
2. పోసిడాన్ (Poseidon): సముద్రాల దేవుడు.
3. హేడిస్ (Hades): పాతాళ లోకానికి లేదా నరకానికి అధిపతి.

ఈ జ్యూస్ పాత్రను మన పురాణాలతో పోల్చి చూస్తే, ఆయన అచ్చం మన దేవేంద్రుడిని (Indra) పోలి ఉంటాడు. ఎందుకలా?

• జ్యూస్ (Zeus), ఇంద్రుడి లాగానే అనేక సంబంధాలు మరియు భార్యలను కలిగి ఉంటాడు.
• తనకు కావాల్సిన దాని కోసం రూపాలు మార్చుకోవడం ఇద్దరికీ వెన్నతో పెట్టిన విద్య.
• అంతేకాదు, జ్యూస్ (Zeus) యొక్క ప్రధాన ఆయుధం "వజ్రాయుధం" (Thunderbolt). సైక్లోప్స్ అనే రాక్షసులను  టార్టరస్ (Tartarus) అనే అగాధం నుండి విడిపించినందుకు గాను, వారు జ్యూస్ (Zeus) కు ఈ ఆయుధాన్ని బహుమతిగా ఇచ్చారు.
• మన పురాణాల్లో కూడా, ఇంద్రుడు కోపగించినప్పుడల్లా వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. అలాగే ఆయనకు ఆకాశం, వర్షంతో దగ్గరి సంబంధం ఉంటుంది.

ఇక హిందూ పురాణాల్లో ఇంద్రుడి ప్రస్తావన చూస్తే, ఆయన ఆకాశానికి మరియు వర్షానికి అధిపతిగా వర్ణించబడ్డాడు. ఆయన కోపగించినప్పుడల్లా వజ్రాయుధాన్ని (Thunderbolts) ప్రయోగిస్తాడని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. సరిగ్గా ఇదే వర్ణన గ్రీకు దేవుడు జ్యూస్ (Zeus) విషయంలోనూ కనిపిస్తుంది. ఆయనకు కూడా ఇంద్రుడి లాగానే అనేక సంబంధాలు ఉండటం, అవసరమైనప్పుడు రూపాలు మార్చుకోవడం వంటి లక్షణాలు ఉన్నట్లు గ్రీకు కథలు చెబుతున్నాయి.

నివాసాల విషయానికి వస్తే, మన దేవుళ్ళు 'కైలాస పర్వతం' పై నివసిస్తే, గ్రీకు దేవుళ్ళు 'మౌంట్ ఒలింపస్' (Mount Olympus) ను తమ నివాసంగా చేసుకుని, అక్కడి నుండే తమ పరిపాలనను సాగిస్తుంటారు.

కథలలో కూడా ఎంతటి సారూప్యత ఉందో చూడండి. ఒక ప్రవచనం (Prophecy) కారణంగా తండ్రి లేదా తండ్రి లాంటి వ్యక్తి నుండి బిడ్డ ప్రాణానికి ముప్పు ఉండటం, ఆ బిడ్డను రహస్యంగా పెంచడం... ఈ అంశం రెండు చోట్లా కనిపిస్తుంది.

ఇది మనకు వెంటనే భాగవతంలో కంసుడి నుండి తప్పించుకోవడానికి చిన్ని కృష్ణుడిని రహస్యంగా పెంచిన ఘట్టాన్ని గుర్తుచేస్తుంది కదా? గ్రీకు పురాణాల్లో జ్యూస్ (Zeus) కథ కూడా ఇలాగే ఉంటుంది.

మరి మరణం తరువాత ఏంటి? స్వర్గం మరియు నరకం అనే భావనలు రెండు చోట్లా చాలా దగ్గరగా ఉంటాయి. మనిషి తన జీవితంలో చేసిన కర్మల ఆధారంగానే అతనికి నరకంలో స్థానం లభిస్తుంది. పాతాళ లోకపు న్యాయమూర్తులు, (Judges of the Underworld) ఒక వ్యక్తి తన జీవితంలో వీరోచితమైన, సాధారణమైన, లేదా దుర్మార్గపు జీవితాన్ని గడిపాడో నిర్ణయిస్తారు.

• ఎవరైతే పుణ్యాత్ములో, వీరులో, వారిని "ఎలిసియన్ ఫీల్డ్స్" (Elysian Fields) కు పంపిస్తారు.
• అక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఎవరైతే మూడు సార్లు పునర్జన్మ ఎత్తి, ఆ మూడు సార్లూ ధర్మబద్ధంగా జీవిస్తారో, వారు ఎలిసియం నుండి "ఐల్స్ ఆఫ్ ది బ్లెస్డ్" (Isles of the Blessed) కు వెళ్తారు. ఇది మన "మోక్షం" అనే భావనను పోలి ఉంటుంది.

గ్రీకులో "థానటోస్" (Thanatos) అంటే మరణాన్ని గమనిస్తే, మనకు మృత్యు దేవత లాగానే. అలాగే మరణానికి దేవుడైన యమధర్మరాజు పాత్రను అక్కడ "హేడిస్" (Hades) పోషిస్తాడు.

మనిషి పుట్టుక గురించి గ్రీకులు ఏమనుకుంటారు? జ్యూస్ (Zeus) తన వినోదం కోసం మరియు దేవుళ్లను పూజించడానికి ఎవరైనా కావాలని, ప్రోమిథియస్ (Prometheus) ను మనుషులను సృష్టించమని కోరతాడు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మన సృష్టికర్త బ్రహ్మలాగే, ప్రోమిథియస్ కు కూడా పూజలు అందుకోవడం పట్ల ఆసక్తి లేదు. అతను మానవ సమాజాలకు దగ్గరగా ఉంటూ, వారికి విద్యను బోధించడానికే ఇష్టపడ్డాడు.

అందుకేనేమో, త్రిమూర్తులలో ఒకరైనప్పటికీ, బ్రహ్మకు మన దేశంలో దేవాలయాలు చాలా తక్కువ..

ఇంకా లోతుగా చూస్తే:
• మన పురాణాలలోని మన్మధుడు (కామదేవుడు), అక్కడ "ఎరోస్" (Eros).
• సముద్ర మధనంలో లక్ష్మీదేవి ఉద్భవించినట్టే, అక్కడ "ఆఫ్రోడైట్" (Aphrodite) పుట్టుక ఉంది.
• చదువుల తల్లి సరస్వతీ దేవికీ, గ్రీకులో "ఎథీనా" (Athena) కూ చాలా దగ్గరి పోలికలున్నాయి.
• మనకు అక్షయపాత్ర ఎలాగో, అక్కడ జ్యూస్ (Zeus) ఆశీర్వదించిన "ఆంఫోరా" (Amphora) ఎప్పుడూ ఖాళీ కాదు.
• మన అమృతం లాగే, అక్కడ "ఆంబ్రోసియా" (Ambrosia) లేదా "నెక్టార్" (Nectar) అనేది దేవతల పానీయం.

గ్రీకులకు కూడా మన కులదేవత లేదా గ్రామదేవత లాగా, "గార్డియన్ డీటీస్" (Guardian Deities) ఉంటారు. అయితే ఒక చిన్న తేడా ఉంది. మన దైవారాధన, భక్తి మరియు గౌరవంతో కూడుకున్నది. అది అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది. కానీ గ్రీకు పురాణాల్లో దేవుళ్ళు కోపగించుకోకూడదనే భయం ఎక్కువగా కనిపిస్తుంది.

సృష్టి రహస్యం విషయంలో మాత్రం గ్రీకులకూ, మనకూ ఒక పెద్ద తేడా ఉంది. గ్రీకుల నమ్మకం ప్రకారం, మొదట "కేయోస్" (Chaos) అంటే గందరగోళం ఉండేది. ప్రపంచం ఈ గందరగోళం నుండి క్రమబద్ధత వైపు ప్రయాణిస్తుంది. చీకటి నుండి వెలుగు పుట్టింది, సరళత నుండి సంక్లిష్టత వైపు జీవం సాగింది.

అలాగే, సనాతన ధర్మానికి చెందిన పురాణాలు, కాలం (Time) గురించి ఒక అద్భుతమైన తాత్విక కోణాన్ని ఆవిష్కరిస్తాయి. గ్రీకులు ప్రపంచం అనేది గందరగోళం (Chaos) నుండి క్రమబద్ధత (Order) వైపు, అంటే చీకటి నుండి వెలుగు వైపు ప్రయాణిస్తుందని నమ్ముతారు. కానీ మన పురాణాల ప్రకారం, ఈ రెండూ శాశ్వతం కాదు. సృష్టి మరియు ప్రళయం ఒకదాని తర్వాత ఒకటి చక్రంలా (Cyclical regularity) వస్తుంటాయి. ఒకానొక సమయంలో మళ్లీ గందరగోళం ఏర్పడి, మళ్లీ సృష్టి జరుగుతుంది. సృష్టి, స్థితి, లయం... మళ్లీ సృష్టి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఏదీ స్థిరంగా ఉండదనే గొప్ప సత్యాన్ని మన గ్రంథాలు తెలియజేస్తాయి.

కొన్ని సున్నితమైన విషయాలు, అంటే టాబూస్ (Taboos) గురించి కూడా మాట్లాడుకోవాలి. గ్రీకు పురాణాల్లో "ఇన్సెస్ట్" అంటే రక్త సంబంధీకుల మధ్య సంబంధం, సర్వసాధారణం. ఉదాహరణకు, ఆకాశ దేవుడైన "ఔరానోస్" (Ouranos), భూదేవత "గైయా" (Gaia) కు కుమారుడు మరియు భర్త కూడా. ఇలాంటి రక్త సంబంధాల మధ్య వివాహాలను సృష్టి ఆరంభంలో చాలా సాధారణంగా, ఎటువంటి సంకోచం లేకుండా వర్ణించారు. మన ప్రాచీన సాహిత్యమైన యజుర్వేదంలోని శతపథ బ్రాహ్మణం (Shatapatha Brahmana) గురించి ప్రస్తావించుకుందాం. ఇందులో సృష్టికర్త అయిన బ్రహ్మ, తన సృష్టి అయిన సరస్వతీ దేవి పట్ల ఆకర్షితుడైనట్లు ఒక కథనం ఉంది. కానీ మన హిందూ ధర్మంలో మాత్రం ఇలాంటి చర్యలకు తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయని మన గ్రంథాలు స్పష్టం చేశాయి. గ్రీకుల్లాగా దీనిని తేలికగా తీసుకోలేదు. మన పురాణాలు కథ చెప్పడమే కాకుండా, నైతికతకు ఎంత ప్రాధాన్యత ఇస్తాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

అలాగే, లింగ మార్పిడి (Gender fluidity) మరియు స్వలింగ సంపర్కం వంటి అంశాలు గ్రీకు పురాణాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. మన దగ్గర ఇవి లేవని కాదు, కానీ తక్కువగా చర్చించబడ్డాయి.

• శిఖండి గురించి మనందరికీ తెలుసు.
• కానీ నారద మునిని విష్ణువు స్త్రీగా మార్చి, తనను తాను మరిచిపోయేలా చేసి, సంసార సాగరంలో ముంచెత్తిన కథ, మాయను గురించి చెప్పడానికి.
• అలాగే శివుడు మరియు విష్ణువు, మోహినీ రూపంలో కలయిక నుండి అయ్యప్ప స్వామి జననం.
• ప్రతి మనిషిలో స్త్రీ మరియు పురుష లక్షణాలు ఉంటాయనే అర్ధనారీశ్వర తత్వం మన దగ్గర ఉంది.

చివరగా, హిందూత్వంలోని అనేక అంశాలు శాస్త్రీయంగా ఎంతో ఖచ్చితమైనవి. కానీ పాశ్చాత్య ప్రపంచంలో సైన్స్ అభివృద్ధి చెందేటప్పుడు, లాటిన్ (Latin) భాష ప్రాబల్యం వల్ల, గ్రహాలకు, ఎలిమెంట్స్ కు గ్రీకు / లాటిన్ పేర్లు స్థిరపడిపోయాయి.

ఈ సారూప్యతలు కేవలం గ్రీకు, హిందూ పురాణాలకే పరిమితం కాదు. నార్స్, బాబిలోనియన్, మాయన్, పర్షియన్ మరియు ఈజిప్షియన్ పురాణాల్లో కూడా ఇవే పోలికలు కనిపిస్తాయి.

ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఎవరో పేర్లు మార్చి, పేజీలు తారుమారు చేశారా? లేక కొన్ని వాస్తవాల ఆధారంగా మనిషి తన ఊహాశక్తితో అల్లిన కథలా ఇవి? ఏది ఏమైనా, ఇవి మనకు అద్భుతమైన కథలను, జీవిత పాఠాలను అందించాయి.

పురాణాల మాయాజాలం అలాంటిది. అవి ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాయి!

ఇది ఈనాటి మన విశ్లేషణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు చారిత్రక విషయాల కోసం, మన చానెల్ ను రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.

శుభం భూయాత్!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...