Audi9 – Telugu Mythology & Temple History Stories | Voice of Maheedhar (Planet Leaf), Shadow Madhu Babu Audiobooks, Facts Hive Youtube Channels. Here I bring you Bhagavad Gita in Telugu, Stories of Mahabharata, Ramayana, Science behind Sanatana Dharma, Hinduism, Interesting and Unknown Facts and Mysteries in Telugu, and Writer Madhu babu's Shadow, Folklore, Fantasy Fiction Novels as Audiobooks / Podcasts. Watch interesting videos Every Day in the original Voice of Maheedhar and Sudha..
‘గోత్రం’ ఆత్మకు పాస్ వర్డ్! ఒకే గోత్రం వాళ్ళ మధ్య పెళ్లి ఎందుకు జరగకూడదు? లక్షల సంవత్సరాల అద్భుతమైన శాస్త్రీయ వ్యవస్థ, కేవలం 100 ఏళ్లలో ఒక బూతు పదంగా ఎలా మారిపోయింది? Did you know your Gotra is not your caste, but your ancient genetic and spiritual DNA?
"మీ గోత్రం ఏమిటి?" అని పూజలో కూర్చున్నప్పుడు, పంతులు గారు అడుగుతారు.... చాలాసార్లు మనం పక్కన ఉన్న పెద్దల ముఖాల వైపు చూస్తాం. గోత్రం అంటే ఏంటో తెలియదు. కానీ పెద్దలందించిన ఏదో ఒక పేరు చెబుతాం. కానీ, గోత్రం అనేది కేవలం ఒక ఆచారం కాదు, మీ ఇంటి పేరు కాదు, మూఢనమ్మకం అంతకంటే కాదు. ఇది వేల సంవత్సరాల క్రితం నాటి భారతీయ జన్యు విజ్ఞాన శాస్త్రం... మీ ఆత్మిక DNA!
మనం ఆధునిక యుగంలో బతుకుతున్నాం. గ్లోబల్ సిటిజన్స్ గా ప్రపంచాన్ని చుట్టేస్తున్నాం. మన స్మార్ట్ ఫోన్లకు, బ్యాంకు ఖాతాలకు, కనీసం కాఫీ షాప్ లో ఉండే Wi-Fi కి కూడా పాస్వర్డ్లు వందల సంఖ్యలో గుర్తుపెట్టుకుంటాం. కానీ, మన ఆత్మకు సంబంధించిన పాస్వర్డ్, మన మూలాలకు సంబంధించిన జీవనాడి అయిన 'గోత్రం' దగ్గరికి వచ్చేసరికి మాత్రం తడబడుతుంటాం. పండితుడు చెప్పే మంత్రంలో అది కేవలం ఒక పదం అని భ్రమ పడతాం. అసలు ఒకే గోత్రం వాళ్ళ మధ్య పెళ్లి ఎందుకు జరగకూడదు? ఈ నియమం వెనుక దాగి ఉన్న వేల ఏళ్ల నాటి ప్రాచీన జన్యు విజ్ఞాన రహస్యం ఏమిటి?
అలాగే, నేడు సనాతన ధర్మంపై అత్యధికంగా, అత్యంత పదునుగా దాడి జరిగే మరో ప్రధాన అంశం... వర్ణ వ్యవస్థ! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేవి హెచ్చుతగ్గులను చూపే కులాలు కావనీ, అది సమాజాన్ని విడదీసే వ్యవస్థ కానే కాదనీ నేను స్పష్టంగా చెబితే మీరు నమ్ముతారా? అవును, ధర్మం యొక్క సారాంశం, సమ్మేళనం, విచ్ఛేదనం కాదు. కానీ, బ్రిటిష్ పాలకులు మన విద్యా వ్యవస్థను నాశనం చేసినప్పుడు, మన గ్రంథాలలోని లోతైన అర్థాన్ని గ్రహించలేకపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ దానిని ఎగతాళి చేసింది. కుహనా మేధావులు దాన్ని వక్రీకరించి మన యువత మెదళ్లలో కుల విద్వేషం అనే అబద్ధాన్ని నిజంలా నాటారు. లక్షల సంవత్సరాల అద్భుతమైన శాస్త్రీయ వ్యవస్థ, కేవలం 100 ఏళ్లలో ఒక బూతు పదంగా ఎలా మారిపోయింది?
ఈ రోజు మనం ఒక మహాద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. చరిత్ర పుటల్లో కప్పబడిపోయిన మహా సత్యాలను, ఆధునిక సైన్స్ (Genetics), మరియు మన ప్రాచీన వేదాల ఆధారంగా మీ ముందుకు తీసుకువస్తున్నాను. మన గోత్ర వ్యవస్థ వెనుక ఉన్న సైన్స్ ఏమిటి? విరాట్ పురుషుని నిర్మాణం ద్వారా సనాతన ధర్మం చెప్పిన నిజమైన ఐక్యత ఏమిటి? ఈ వీడియో కేవలం ఒక వాదన కాదు... ఇది మీ అసలైన గుర్తింపును మీకు తిరిగి ఇచ్చే ఒక ఆత్మ ప్రయాణం. రండి.. నాతో ప్రయాణించండి.. వీడియో పూర్తయ్యే సరికి మీ గతం పట్ల, మీ ఉనికి పట్ల, మన సనాతన ధర్మం పట్ల మీకు ఉన్న అవగాహన శాశ్వతంగా మారిపోతుంది!
వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
గోత్ర వ్యవస్థ కులాలకు ముందే పుట్టింది. ఒక ఋషి యొక్క జ్ఞానానికీ, మానసిక ఫ్రీక్వెన్సీకీ సంబంధించిన గుర్తింపు ఇది. ప్రతి గోత్రం వెనుక ఒక మహాఋషి ఉన్నాడు. మీరు వశిష్ఠ గోత్రం వారైతే రాముని గురువైన వశిష్ఠుని వారసత్వం మీలో ఉన్నట్టు. భరద్వాజ గోత్రం అయితే, వేదాలు, యుద్ధ విద్యలలో ఆరితేరిన ఋషి శక్తి మీలో ఉన్నట్టు. కానీ ఇక్కడ అసలైన సైన్స్ దాగి ఉంది. ఆధునిక జన్యుశాస్త్రం (Genetics) ప్రకారం, మనుషుల్లో X మరియు Y క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆడవారిలో XX, మగవారిలో XY ఉంటాయి. తండ్రి నుండి కొడుకుకి మాత్రమే Y-క్రోమోజోమ్ ఎటువంటి మార్పు లేకుండా వస్తుంది. వందల తరాలు మారినా, పురుషుడి Y-క్రోమోజోమ్ తన మూల పురుషుడి (Ancestor) క్రోమోజోమ్ తో సరిపోలుతుంది. మన ప్రాచీన ఋషులు ఈ జన్యు రహస్యాన్ని వేల ఏళ్ల క్రితమే కనిపెట్టారు. ఆ మూల పురుషుడే మీ గోత్ర ఋషి!
అందుకే ఒకే గోత్రం ఉన్న వారు వివాహం చేసుకోకూడదని మన ధర్మం శాసించింది. ఇద్దరు ఒకే గోత్రానికి చెందిన వారైతే, వారిద్దరికీ ఒకే మూల పురుషుడు ఉంటాడు. అంటే వారు జన్యుపరంగా అన్నాచెల్లెళ్లు అవుతారు. దగ్గరి బంధువుల మధ్య పెళ్లి జరిగితే పిల్లల్లో శారీరక, మానసిక లోపాలు అంటే, Recessive genetic disorders వస్తాయని, ఆధునిక సైన్స్ ఈరోజు చెబుతోంది. కానీ సనాతన ధర్మం ఏనాడో గోత్ర వ్యవస్థ ద్వారా దీనికి పరిష్కారం చూపింది. ఇది మూఢనమ్మకం ఎలా అవుతుంది? ఇది అచ్చమైన విజ్ఞాన శాస్త్రం! స్త్రీలు వివాహం తర్వాత గోత్రం ఎందుకు మార్చుకోరో తెలుసా? ఎందుకంటే గోత్రం అనేది Y-క్రోమోజోమ్ ద్వారా వస్తుంది కాబట్టి, స్త్రీలలో శాశ్వతంగా వాళ్ళ తండ్రి గోత్రమే ఉంటుంది.
మన మనశ్శక్తి, కర్మ, జ్ఞానం, గోత్రంతో అనుసంధానమై ఉంటాయి. మన స్మార్ట్ ఫోన్ కి Wi-Fi పాస్ వర్డ్ ఎలాగో, మన ఆత్మకు గోత్రం అలాంటిది. ప్రాచీన భారతదేశంలో, ఒక విద్యార్థి గురుకులానికి వెళ్ళినప్పుడు, గురువు అడిగే మొదటి ప్రశ్న... "నాయనా, నీ గోత్రం ఏమిటి?" అని. ఇది కులాన్ని అడగడం కాదు. ఆ విద్యార్థి యొక్క మానసిక స్థితినీ, అతని సహజ నైపుణ్యాలనూ (Learning style) అర్థం చేసుకోవడానికి చేసిన ఒక సైకలాజికల్ ప్రొఫైలింగ్! ఉదాహరణకు, అత్రి గోత్రం వారు సహజంగానే ధ్యానం, మంత్ర సాధనల్లో శ్రేష్ఠత కనబరిచేవారు. అదే కశ్యప గోత్రం వారైతే, ఔషధ విజ్ఞానంలో (ఆయుర్వేదంలో) మక్కువ చూపేవారు. ఇది శక్తికి సంబంధించిన గుర్తింపు కాదు. అదొక జ్ఞాన గుర్తింపు! ప్రాచీన 'ఛాందోగ్య ఉపనిషత్తు'లో, సత్యకామ జాబాలి కథే దీనికి నిదర్శనం. ఈ కథను తెలుసుకోవాలనుకుంటే, గతంలో మనం చేసిన వీడియోను చూడండి. ఒక వ్యక్తి పుట్టుకను బట్టి కాకుండా, అతని సత్య నిష్ఠనూ, సత్ప్రవర్తననూ బట్టి, గౌతమ మహర్షి అతనికి విద్యను బోధించాడు. పురాతన కాలంలో స్త్రీల రక్షణకు కూడా గోత్రం ఒక కవచంలా పనిచేసేది. ఏ ఆపద వచ్చినా, గోత్రం ఆధారంగా స్త్రీలను వారి మూల వంశానికి భద్రంగా చేర్చే అద్భుతమైన నెట్వర్క్ అది.
పూజ ప్రారంభంలో సంకల్పం చెప్పేటప్పుడు, మన గోత్రం ఎందుకు చెబుతాం? ఎందుకంటే అది ఈ విశ్వంలో మీకంటూ ఉన్న ఒక ప్రత్యేకమైన అడ్రస్. ఆ ఋషి శక్తిని మీ పూజలో ఆవాహన చేయడానికి అదొక శక్తివంతమైన కాల్. రాముడు వశిష్ఠ గోత్రం, సీతమ్మ కశ్యప గోత్రం. దేవతలు కూడా పాటించిన ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని బ్రిటిష్ వారు ఎగతాళి చేస్తే, మన సినిమాల్లో కామెడీ చేసి వదిలేశాం. ఇప్పటికైనా మీ గోత్రం ఏంటో, మీ పెద్దలను అడిగి తెలుసుకోండి. మీ పిల్లలకు గర్వంగా చెప్పండి. అది మీ గతం కాదు. భవిష్యత్తుకు మార్గం చూపే GPS.
కొంతమంది పిల్లలు చిన్ననాటి నుంచే ప్రత్యేకమైన అలవాట్లు, అసాధారణమైన ప్రతిభ కలిగి ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? మీ గోత్ర ఋషి యొక్క మానసిక ఫ్రీక్వెన్సీ, వారి కర్మ బీజాలు (Prarabdha Karma) ఇంకా మీలో పనిచేస్తూనే ఉంటాయి. ఆ ఋషి యోధుడైతే, మీలో సహజమైన ధైర్యం ఉంటుంది. తత్త్వవేత్త అయితే, ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ ఉంటుంది. ప్రాచీన కాలంలో ప్రతి గోత్రానికీ విశ్వంలో ఒక ప్రత్యేక పాత్ర ఉండేది - కొందరు నక్షత్రాలను పరిశోధించేవారు, కొందరు ధర్మాన్ని స్థాపించేవారు, కొందరు న్యాయాన్ని నిర్మించేవారు.
అంతేకాదు, ప్రతి గోత్రానికి ప్రత్యేకమైన మంత్రాలు, దైవాలు ఉంటాయి. మీ గోత్రానికి సరిపోయే మంత్రాన్ని జపిస్తే, మీ గోత్ర శక్తి తోడై, అది 10 రెట్లు (10x) ఎక్కువ శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తుంది. మీరు ఎప్పుడైనా దారి తప్పినట్లూ, గందరగోళంలో ఉన్నట్లూ అనిపిస్తే... మీ గోత్ర ఋషిని స్మరించుకోండి. ఆ ఆత్మదీపం మీకు దారి చూపుతుంది. ప్రాచీన భారతదేశంలో చంద్రగుప్త మౌర్యుని నుండి, నిన్నటి ఛత్రపతి శివాజీ మహారాజ్ వరకు, గొప్ప గొప్ప రాజులు, తమ రాచకార్యాలలో గోత్ర జ్ఞానం ఆధారంగానే, కీలక నిర్ణయాలు తీసుకునేవారు. గోత్రం లేని పాలన, వెన్నెముక లేని శరీరం లాంటిదని వారు నమ్మారు.
ఇక సనాతన ధర్మంపై ఎక్కువగా జరిగే దాడి వర్ణ వ్యవస్థ గురించి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటే హెచ్చు తగ్గులు అనీ, ఇది ఒక కుల వ్యవస్థ అనీ మన మెదళ్లలో విషం నింపారు. కానీ నిజం ఏమిటి? ఇది పుట్టుకతో వచ్చినది కాదు. సమాజ నిర్వహణ కోసం ఏర్పడిన ఒక అద్భుతమైన అమరిక. ఋగ్వేదంలోని పురుష సూక్తం, సమాజాన్ని ఒక విరాట్ పురుషుడిగా వర్ణించింది.
బ్రాహ్మణుడు ఆ విరాట్ పురుషుని ముఖం. అంటే సమాజానికి అవసరమైన జ్ఞానాన్నీ, విద్యాబుద్ధులనూ అందించే మెదడు. క్షత్రియుడు ఆ భగవంతుని భుజాలు. సమాజాన్ని రక్షించే ధైర్యం, బలం. వైశ్యుడు ఆ స్వామి ఉదరం. సమాజం ఆకలి తీర్చేది, సంపద సృష్టించే వ్యవసాయం, వ్యాపారం. శూద్రుడు ఆ దేవుని పాదాలు. ఈ మొత్తం సమాజ భారాన్ని మోస్తూ, సేవ ద్వారా అందరినీ నడిపించే ఆధార స్తంభం.
ఆలోచించండి... తల లేకుండా మనిషి బతకగలడా? చేతులు లేకుండా రక్షణ ఉంటుందా? కడుపు నిండకుండా ప్రాణం నిలుస్తుందా? పాదాలు లేకుండా ముందుకు నడవగలమా? లేదు కదా! ఈ నాలుగు వర్ణాలు, సమాజం అనే రథానికి నాలుగు చక్రాల లాంటివి. ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా, సమాజం ముందుకు వెళ్ళదు. సనాతన ధర్మం సమన్వయాన్ని నేర్పింది. విచ్ఛిన్నతను కాదు!
ధర్మాన్ని నిందించేవారు ఎప్పుడూ చెప్పని కొన్ని సత్యాలు ఉన్నాయి. "చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః" - ఇది భగవద్గీత (4వ అధ్యాయం, 13వ శ్లోకం) లో సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పిన మాట. దీని అర్థం, "సమాజంలోని ఈ నాలుగు వర్ణాలనూ, నేను వారి గుణాలను (లక్షణాలను), కర్మలను (చేసే పనిని) బట్టి సృష్టించాను" అని చెప్పాడుకానీ ఎక్కడా పుట్టుకను బట్టి అని చెప్పలేదు.
మన ప్రాచీన 'వజ్రసూచిక ఉపనిషత్తు' ఒక అద్భుతమైన ప్రశ్న వేస్తుంది - "బ్రాహ్మణుడు అంటే ఎవరు? దేహం బ్రాహ్మణుడా? కులం బ్రాహ్మణుడా? జ్ఞానం బ్రాహ్మణుడా?" అని తర్కించి, చివరికి "ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని కలిగి, కామక్రోధాలను జయించి, సకల ప్రాణుల పట్ల దయ కలిగి ఉంటాడో... వాడే నిజమైన బ్రాహ్మణుడు" అని వజ్రఘాతంగా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. వర్ణ వ్యవస్థ అనేది పుట్టుకతో వచ్చేది కాదని మన ఇతిహాసాల్లో కోకొల్లలుగా సాక్ష్యాలు ఉన్నాయి.
క్షత్రియ కులంలో పుట్టిన విశ్వామిత్రుడు తన అపారమైన తపస్సుతో, జ్ఞానంతో బ్రహ్మర్షి అయ్యాడు. బోయవాడిగా పుట్టిన రత్నాకరుడు, తన సాధనతో వాల్మీకి మహర్షిగా మారి, ఆది కావ్యం రామాయణాన్ని లోకానికి అందించాడు. పుట్టుకతో వర్ణం నిర్ణయించబడితే, ఇది ఎలా సాధ్యమైంది? మహాభారతంలో అత్యంత జ్ఞాని అయిన విదురుడు, శూద్ర స్త్రీకి జన్మించినవాడు. కానీ ఆయన ధర్మ ప్రబోధాలకు, ధృతరాష్ట్రుడే తలవంచాడు.
శ్రీరాముడు ఒక గిరిజన మహిళ అయిన శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను అత్యంత ప్రేమతో ఆరగించాడు. కులం అడ్డువస్తే భగవంతుడు అంతటి ఆప్యాయత ఎందుకు చూపుతాడు? శ్రీకృష్ణుడు దుర్యోధనుని రాజభోగాలను తిరస్కరించి, విదురుని ఇంట్లో గంజి తాగాడు. మరాఠా సామ్రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ సైన్యంలో బ్రాహ్మణులు, శూద్రులు, ముస్లింలు అందరికీ సమాన స్థానం ఉంది. సనాతన ధర్మం దృష్టిలో జ్ఞానం, భక్తి, కర్మ మాత్రమే గీటురాళ్లు. సంత్ రవిదాస్ గారు శూద్రుడు, మీరాబాయి రాజపుత్రురాలు, తులసీదాస్ బ్రాహ్మణుడు... కానీ భక్తి సామ్రాజ్యంలో అందరూ మహా చక్రవర్తులే. వీళ్ళను కులాలు ఎప్పుడూ విడదీయలేదు!
"వసుధైవ కుటుంబకం" - ఈ ప్రపంచమే నా కుటుంబం అని చాటిన ఏకైక ధర్మం మనది. "సర్వే జనా సుఖినో భవంతు" - ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించిన ధర్మం మనది. కాలక్రమంలో మనుషుల స్వార్థం వల్ల కొన్ని దురాచారాలు ప్రవేశించి ఉండవచ్చు కానీ, అది ధర్మం తప్పు కాదు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు సామాజిక న్యాయం కోసం పోరాడారు. ఆయన భగవద్గీతను, రామాయణాన్ని ఎంతో లోతుగా అధ్యయనం చేశారు. ఆ మహానుభావుడు ధర్మాన్ని సంస్కరించాలని కోరుకున్నాడు కానీ సమాజాన్ని విడదీయాలని కాదు.
ఈ రోజుల్లో రాజకీయాల కోసం, స్వార్థం కోసం, ధర్మాన్ని ముక్కలు చేయాలని కొందరు చూస్తున్నారు. వాళ్ళ వలల్లో పడకండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేది విభజన రేఖలు కావు. అవి ఐక్యతా బంధాలు. మన ధర్మంలో ప్రతి ఒక్కరికీ ఉన్నతమైన స్థానం ఉంది. మీ పేరు ఆధునికం కావచ్చు, మీ జీవనశైలి వెస్ట్రన్ కావచ్చు, కానీ మీలో ప్రవహిస్తున్న రక్తం, మీ ఆత్మిక DNA అయిన మీ గోత్రం ఎప్పటికీ సనాతనమే. మన మూలాలను మర్చిపోతే, ఏ తీరానికీ చేరని నావలా మిగిలిపోతాం. మన ధర్మాన్ని తెలుసుకుందాం, ఐక్యంగా ఉందాం. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయండి. మరో అద్భుతమైన విషయంతో మళ్లీ కలుద్దాం.
‘కేదార్‌నాథ్’ శివలింగం నుండి వచ్చే నీలి కాంతి రహస్యం! కలియుగంలో ధర్మం తగ్గినప్పుడు, ఈ శక్తి కేంద్రం మానవతను కాపాడుతుందా? The 400-Year-Old Diary & Mahabharata Secret! The Holy Water (Tritium) & Cold Fusion!
శ్రీ కేదారనాథ్ దర్శనం కోసం ఇప్పుడు భక్తులు ఎందుకు అంతగా ఆరాటపడుతున్నారని చాలా మంది అనుకుంటుంటారు! కేవలం అది ఒక పుణ్యక్షేత్రం కాబట్టేనా? లేక మంచు కొండల మధ్య ఉన్న ప్రకృతి అందాల కోసమా? అంటే, కాదు... దీని వెనుక ఒక ఊహించలేని రహస్యం దాగి ఉంది.
హిమాలయాలు కేవలం మంచు కొండలు కావు. వేలాది సంవత్సరాలుగా మనిషి ఊహకు అందని ఎన్నో రహస్యాలను తమ గర్భంలో దాచుకున్న అద్భుత నిలయాలు. మన ఋషులు, సిద్ధులు కేవలం ధ్యాన ముద్రలో గ్రహించిన విశ్వ రహస్యాలను, నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం కోట్ల రూపాయల యంత్రాలతో ఇప్పుడు దొరకబుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఆలోచించండి... ఆధునిక సైన్స్ కు సంబంధించిన ఒక 'గైగర్ కౌంటర్' (Geiger counter) మెషీన్, వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన ఒక శివలింగం ముందు అదుపుతప్పి ప్రవర్తిస్తే? ఆధ్యాత్మికతకూ, అడ్వాన్స్డ్ క్వాంటం ఫిజిక్స్ కూ మధ్య ఉన్న ఆ సన్నని గీత చెరిగిపోతే ఎలా ఉంటుంది?
ప్రపంచంలోని అగ్రశ్రేణి అంతరిక్ష పరిశోధనా సంస్థలు నాసా (NASA), ఇస్రో (ISRO) లాంటివి సైతం, ఈ కేదార్‌నాథ్ ఆలయం చుట్టూ జరుగుతున్న పరిణామాలను ఎందుకు అంత రహస్యంగా గమనిస్తున్నాయి? 2013 లో వచ్చిన ఆ మహా ప్రళయం కేవలం ఒక ప్రకృతి విపత్తు మాత్రమే కాదా..? అది ఆ శివలింగంలో దాగి ఉన్న ఒక అనంతమైన శక్తిని మేల్కొల్పేందుకు జరిగిన ఒక కాస్మిక్ ట్రిగ్గర్ (Cosmic Trigger) అని కొందరు శాస్త్రవేత్తలు ఎందుకు అనుమానిస్తున్నారు? ప్రభుత్వం దాచిపెట్టిన ఆ రేడియేషన్ రిపోర్టులలో, అసలు నిజంగా ఏముంది?
ఒక వైపు DRDO రిసర్చ్, మరోవైపు రాత్రి పూట శివలింగం నుండి వెలువడే ఒక మిస్టీరియస్ నీలి కాంతి...! ఈ రోజు మన చానెల్ లో మీరు వినబోయే నిజాలు, మీ ఆలోచనా విధానాన్ని మార్చేస్తాయి. మీ సీట్ బెల్ట్స్ బిగించుకోండి... ఎందుకంటే, ఈ వీడియో ముగిసే సమయానికి, భగవంతుడంటే కేవలం నమ్మకం కాదు, మన ఊహకు అందని ఒక 'అల్టిమేట్ సైన్స్' (Ultimate Science) అనే సత్యం మీకు అర్థమవుతుంది. శివలింగం కేవలం ఒక రాయి కాదు, అదొక పురాతన శక్తి కేంద్రం (Ancient Powerhouse) అని నిరూపించే ఆ ఆధారాలేంటో ఈ వీడియోను చివరి వరకూ చూసి తెలుసుకోండి!
వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
అది జూన్ 16, 2013. కేదార్‌నాథ్‌లో మేఘ విస్ఫోటనం (Cloudburst) జరిగి, మందాకినీ నదిలో సునామీ సృష్టించబడింది. దాదాపు 10,000 మందికి పైగా జల సమాధి అయ్యారు. మొత్తం కేదార్‌నాథ్ నగరం రాళ్లు, బురదతో కొట్టుకుపోయింది.
కానీ, అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది. గంటకు 400 కి.మీ వేగంతో వచ్చిన రాళ్ల వరద, ఆ 5000 సంవత్సరాల పాత కేదార్‌నాథ్ ఆలయానికి కనీసం గీత కూడా పడేలా చేయలేక పోయింది. ఎందుకు? ఎందుకంటే 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పున్న ఒక భారీ శిల కొట్టుకొచ్చి, కచ్చితంగా ఆలయం వెనుక ఇరుక్కుంది. అది ఆలయాన్ని ఒక ఢాలు (Shield) లాగా కాపాడింది.
శాస్త్రవేత్తలు దీన్ని కేవలం "యాదృచ్ఛికం అంటే, Coincidence" అన్నారు. కానీ భక్తులు మాత్రం దాన్ని "భీమ శిల" అనీ, మహాదేవుడు స్వయంగా పంపిన రక్షక కవచం అనీ అన్నారు. అయితే అసలు రహస్యం, ఆపద జరిగిన 10 సంవత్సరాల తర్వాత, 2023లో బయటపడింది.
2013లో అంత పెద్ద ప్రళయం వచ్చినా ఆలయం చెక్కుచెదరకపోవడానికి భీమ శిల ఒక కారణం అయితే... ఆ ఆలయాన్ని నిర్మించిన విధానం మరొక కారణం. ఆలయం పునాదుల్లో దాగి ఉన్న రహస్యం, నేటి సివిల్ ఇంజనీర్లకే ఒక పెద్ద పజిల్!
'స్కంద పురాణం'లోని 'కేదార ఖండం' మరియు మహాభారతంలోని స్వర్గారోహణ పర్వం, కేదార్‌నాథ్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని వివరిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత, బంధువులను చంపిన పాప పరిహారార్థం పాండవులు శివుని దర్శనం కోసం హిమాలయాలకు వచ్చారు. కానీ మహాదేవుడు వారికి కనిపించకుండా, ఒక వృషభ రూపంలో మంచు కొండల్లో తిరుగుతున్నాడు. భీముడు ఆ ఎద్దును గుర్తించి, దాని తోక పట్టుకోబోగా, ఆ వృషభం భూమిలోకి కుంగిపోవడం మొదలుపెట్టింది. అప్పుడు భీముడు తన బాహువులలో ఇరికించుకుని ఆపిన ఆ ఎద్దు యొక్క మూపుర భాగం (Hump), కేదార్‌నాథ్‌లో శిలగా మిగిలిపోయింది. అందుకే కేదార్‌నాథ్ శివలింగం సాధారణ లింగాకృతిలో కాకుండా, ఒక త్రిభుజాకారపు (Pyramidal) రాతి రూపంలో ఉంటుంది! ఆ వృషభం యొక్క మిగిలిన భాగాలు హిమాలయాల్లోని మరో నాలుగు చోట్ల వెలిశాయి. వీటినే మనం 'పంచ కేదారాలు' అంటాము.
అయితే ఇక్కడ సైన్స్ ను ఆశ్చర్యపరిచే విషయం మరొకటి ఉంది. సముద్ర మట్టానికి 11,755 అడుగుల ఎత్తులో... మంచు తప్ప ఏమీ లేని ఆ ప్రదేశంలో, ఈ ఆలయాన్ని ఎలా కట్టారు?
ఆలయ గోడలు ఏకంగా 12 అడుగుల మందం ఉంటాయి! వీటిని కట్టడానికి ఎక్కడా సిమెంట్ గానీ, ఇనుము గానీ వాడలేదు. బదులుగా 'Interlocking Architecture' అంటే, ఆష్లార్ రాతి కట్టడం అనే టెక్నిక్ ని వాడారు. అంటే, ఒక భారీ శిలను మరో శిలకి పజిల్ ముక్కల్లా లాక్ చేశారు. అందుకే 400 కిలోమీటర్ల వేగంతో వరద నీరు, బండరాళ్లు వచ్చి గుద్దుకున్నా, ఆ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ వల్ల, ఆలయం కంపించేదే కానీ, విడిపోలేదు. ఒకవేళ సిమెంట్ వాడి ఉంటే, ఆ వరదకి ఆలయం ఎప్పుడో కొట్టుకు పోయేది.
ఇంతటి కచ్చితమైన నిర్మాణాన్ని సుమారు 5000 ఏళ్ల క్రితం పాండవులు నిర్మిస్తే, సామాన్య శకం 8వ శతాబ్దంలో, ఆది శంకరాచార్యులు దీనిని పునరుద్ధరించారు. ఆయన తన 32వ ఏట కేదార్‌నాథ్ లోనే మహాసమాధి పొందారని చరిత్ర చెబుతోంది. మీరు ప్రపంచ పటాన్ని (World Map) తీసి చూస్తే, మీకు ఇంకో మైండ్ బ్లోయింగ్ నిజం తెలుస్తుంది.
కేదార్‌నాథ్ ఆలయం సరిగ్గా 79.73 డిగ్రీల తూర్పు రేఖాంశం (Longitude) పై ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... తెలంగాణలోని కాళేశ్వరం, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి, తమిళనాడులోని కాంచీపురం, అరుణాచలం, చిదంబరం మరియు రామేశ్వరం... ఇవన్నీ దాదాపు ఇదే 79 డిగ్రీల భౌగోళిక రేఖాంశం పై, ఒకే సరళ రేఖలో (Straight Line) నిర్మించబడ్డాయి! దీనినే 'Shiva Axis', లేదా శివ రేఖ అంటారు.
ఉపగ్రహాలు (Satellites), GPS లేని ఆ పురాతన కాలంలో, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాలను భౌగోళికంగా ఒకే లైన్ పై కచ్చితంగా ఎలా అలైన్ (Align) చేశారు? సనాతన ధర్మంలో ప్రతిదీ ఒక కాస్మిక్ ఎనర్జీతో ముడిపడి ఉందనడానికి, ఇంతకంటే పెద్ద ఉదాహరణ కావాలా? ఈ ఆలయాలన్నీ కలసి, ఒక భారీ ఎనర్జీ గ్రిడ్‌లా (Energy Grid) పనిచేస్తాయి. ఆ గ్రిడ్‌కి మెయిన్ పవర్‌హౌస్... ఈ కేదార్‌నాథ్ ఆలయం!
ఈ భౌగోళిక రహస్యం తెలిసిన తర్వాతనే... బహుశా 2023లో DRDO మరియు ISRO బృందాలు, ఆ కేదార్‌నాథ్ గర్భగుడిలో ఒక రహస్య పరిశోధన ప్రారంభించాయి. ఆ రిసర్చ్‌లో బయటపడ్డ నిజాలు ఏమిటో తెలిస్తే మీరు అవాక్కవుతారు...
2023, మే నెలలో, చార్‌ధామ్ యాత్ర మొదలైంది. DRDO మరియు ISRO కి చెందిన ఒక రహస్య బృందం కేదార్‌నాథ్‌లో "హిమాలయన్ ఎనర్జీ స్టడీ" చేస్తోంది. రేడియేషన్ ను కొలవడానికి వారు ఆలయం లోపలికి 'Geiger Counter' ను తీసుకెళ్లారు.
గర్భగుడిలో అడుగు పెట్టగానే, ఆ మెషీన్ ‘బీప్’ సౌండ్లతో, అదుపు తప్పిపోవటం మొదలయ్యింది.. సాధారణ రేడియేషన్ గంటకు 0.1 మైక్రోసీవర్ట్ కాగా, శివలింగం దగ్గర గంటకు 7.8 మైక్రోసీవర్ట్ నమోదయ్యింది. అంటే, 78 రెట్లు ఎక్కువ!
అంతేకాదు, రాత్రి 12 నుండి 3 గంటల మధ్య రేడియేషన్, 15 మైక్రోసీవర్ట్ కి చేరుకునేది. అదే సమయంలో శివలింగం నుండి సన్నని నీలి-బంగారు కిరణాలు వెలువడేవి. శివలింగం ఊపిరి పీలుస్తున్నట్లుగా కంటికి కనిపించేది కానీ, కెమెరా సెన్సార్లకు తెలిసేది కాదు!
ఈ రిపోర్ట్‌ను దాచిపెట్టాలని చూసినా, 'అనన్య శర్మ' అనే జూనియర్ సైంటిస్ట్, ఆ శివలింగంపై పోసిన నీటిని సాంపిల్‌గా తీసుకుని ల్యాబ్‌కి పంపింది.
ఢిల్లీ IIT ల్యాబ్‌లో ఆ నీటిని టెస్ట్ చేసిన రేపోర్ట్స్ చూసి అనన్య షాక్ అయ్యింది. ఆ నీటిలో ఉన్నవి..
1.ట్రిటియం (Tritium H-3): ఇది రేడియోయాక్టివ్ హైడ్రోజన్. న్యూక్లియర్ ఫ్యూజన్ ఇంధనం! 1 లీటర్ ట్రిటియం = 80 లక్షల లీటర్ల పెట్రోల్‌తో సమానమైన శక్తి.
2.మోనో అటామిక్ గోల్డ్: రూమ్ టెంపరేచర్ వద్ద సూపర్ కండక్టర్‌గా పనిచేసే బంగారం. ఇది ఈజిప్ట్ పిరమిడ్‌లలో కూడా దొరికింది.
3.ORMUS ఎలిమెంట్: (Orbitally Rearranged Monoatomic Elements) DNA రిపేర్ చేయగల శక్తి దీనికి ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతారు.
ఇది చూసిన అనన్యకు ఒక విషయం అర్థమైంది. కేదార్‌నాథ్ శివలింగం సాధారణ రాయి కాదు. అదొక పురాతన న్యూక్లియర్ రియాక్టర్ (Ancient Nuclear Reactor)!
అక్కడ జరిగేది కోల్డ్ ఫ్యూజన్ (Cold Fusion). సంక్లిష్టమైన సైన్స్ ప్రకారం ఫ్యూజన్ సమీకరణం, స్క్రీన్ పైన చూపెట్టిన విధంగా ఉంటుంది..
ఆ రాత్రి పూట కనిపించే నీలి కాంతి, రియాక్టర్ కోర్‌లో కనిపించే 'చరెంకోవ్ రేడియేషన్ (Cherenkov Radiation)'. మరి ఇంచుమించు 12,000 అడుగుల ఎత్తులో, ఈ టెక్నాలజీని ఎవరు స్థాపించారు? సమాధానం, ఆలయ ప్రధాన పూజారి సంరక్షణలో ఉన్న 400 ఏళ్ల నాటి ఒక డైరీలో దొరికింది.
అనన్య తిరిగి కేదార్‌నాథ్ వెళ్లి, ఆలయ ప్రధాన పూజారి రావల్ భీమాశంకర్ లింగ్‌ను కలిసింది. ఆయన ఒక 400 ఏళ్ల నాటి రాగి పత్రాల డైరీని చూపించారు. అందులో ఉన్న విషయాలు, కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తాయి.
సనాతన ధర్మంలో శివ పురాణం మరియు స్కంద పురాణంలోని కేదార ఖండం ప్రకారం, పాండవులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాప పరిహారార్థం శివుడి కోసం వెతికారు. శివుడు వృషభ రూపంలో కేదార్‌నాథ్‌లో దర్శనమిచ్చాడు. ఆ డైరీలో ఉన్న ప్రకారం, "ఈ శివలింగం స్వయంభూ కాదు. పాండవులు స్థాపించారు. అర్జునుడు తన గాండీవంతో, వజ్ర-శిలను కోశాడు. భీముడు నాగలోకం నుండి పాదరసం (Mercury) తెచ్చాడు. నకుల-సహదేవులు సోమరసం పోశారు." అని రాసి ఉంది.
కలియుగంలో 5000 సంవత్సరాల తర్వాత ధర్మం తగ్గినప్పుడు, ఈ శివలింగం మేల్కొంటుంది. ఆ నీలి కాంతి, మహాదేవుడి మూడో కన్ను నుండి వచ్చే శక్తి! భక్తులు చూస్తే అమరులవుతారు, పాపాత్ములు చూస్తే భస్మమైపోతారు.
ఆరోజు ఆగస్టు 15, 2023. శ్రావణ అమావాస్య. గర్భగుడిలో రాత్రి 12 గంటలకు మహాదేవుని శృంగారం జరుగుతుంది. ఎవరూ చూడకూడదు. కానీ శాస్త్రవేత్త అనన్య CCTV ద్వారా చూసింది.
సమయం 12:00 గంటలు. శివలింగం వణకడం మొదలైంది. 12:01 కి అభిషేక నీరు వచ్చే జలహరి నుండి ప్రకాశవంతమైన లేజర్ లాంటి నీలి కాంతి వచ్చింది. "ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్..." అని గర్భగుడి గోడలపై హోలోగ్రామ్ (Hologram) లాగా సంస్కృత మంత్రాలు ఉద్భవించాయి.
కాంతి మధ్యలో 15 అడుగుల జటాధారి, సాక్షాత్తు మహాదేవుడు శివలింగం చుట్టూ తాండవం చేయడం కనిపించింది! ముక్కులోంచి రక్తం కారి అనన్య స్పృహ తప్పింది. ఉదయం లేచి చూసేసరికి... 32 ఏళ్ల అనన్య, 22 ఏళ్ల యువతిలా మారిపోయింది. ఆమె DNA లోని టెలోమియర్స్ (Telomeres) 10 ఏళ్లు వెనక్కి వెళ్లాయి. ఆమెకు మహామృత్యుంజయ దీక్ష లభించిందని ఆలయ ప్రధాన పూజారికి అర్ధమయ్యింది!
నాసా (NASA) రికార్డుల ప్రకారం ఆ భీమ శిల సాధారణ గ్రానైట్ కాదు. అది ఏరోజెల్ మరియు టైటానియం మిశ్రమం. దాని వైబ్రేషన్ 7.83 Hz. దీనినే సైన్స్‌లో 'Schumann Resonance' అంటారు. అంటే, భూమి గుండె చప్పుడు. దీనినిబట్టి, ఆ శిల సజీవంగా ఉంది!
కేదార్‌నాథ్ ఒక పవర్ ప్లాంట్. భీమ శిల, దాని కూలింగ్ టవర్. ద్వాదశ జ్యోతిర్లింగాలు (12 Jyotirlingas) భారతదేశం మొత్తాన్ని కవర్ చేసే ఒక ప్రాచీన ఎనర్జీ గ్రిడ్! మన పూర్వీకులకు న్యూక్లియర్ ఫిజిక్స్ తెలుసు. కానీ దురాశపరులు దుర్వినియోగం చేయకూడదని దానిని 'ధర్మం' తో ముడిపెట్టారు.
ఈ రోజుకీ శివలింగం పై జలాభిషేకం చేసినప్పుడు,
•పాదరసం (Superconductor) + నీరు (H2O) = H-3 (ట్రిటియం) + శక్తి ఉద్భవిస్తుంది.
•మనం సమర్పించే బిల్వపత్రాలలో (Bilva Leaves) ఉండే 'ఏగెలిన్', (Aegeline) రేడియేషన్‌ను పీల్చుకుంటుంది.
•మనం పలికే 'ఓం' ధ్వని (432 Hz) నీటి అణువులను అలైన్ చేస్తుంది.
కానీ గుర్తుంచుకోండి... రావల్ జీ చెప్పినట్లు, అహంకారంతో కేదార్‌నాథ్ వెళ్తే, కెమెరాలో కాదు కదా, కంటికి కూడా ఏమీ కనిపించదు. అదే కన్నీళ్లతో "హే భోలేనాథ్, నేను ఓడిపోయాను" అని శరణు వేడితే... ఆ ఒక్క చుక్క తీర్థం మీ జీవితాన్ని మారుస్తుంది.
శివలింగం కేవలం రాయి కాదు. అది యంత్రం, అది విజ్ఞానం. కేదారం జ్యోతిర్లింగం ॥ హర హర మహాదేవ ॥
మీకు ఈ వీడియో నచ్చితే, ఈ అద్భుతమైన సనాతన విజ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. లైక్ చేయండి మరియు మన ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన రహస్యంతో మళ్ళీ కలుద్దాం.
‘భవిష్య మాలిక’ గ్రంథంలో... మన వెన్నులో వణుకు పుట్టించే ఆ మహా రహస్యం ఏమిటి? పూరీ జగన్నాథుని సన్నిధి నుండి ఆ పరమాత్మ స్వయంగా యుగాంతానికి ఇస్తున్న ఆ 5 సంకేతాలు ఏమిటి? End of Kaliyuga: Bhavishya Malika Predictions! Is Kalki Avatar Already Born? Puri Jagannath Temple Mysteries Explained
'ప్రపంచం' ఒక అదృశ్యమైన మార్పు వైపు అత్యంత వేగంగా పరుగెడుతోంది. రాబోయే కొద్ది రోజుల్లో మానవాళి ఊహించని ఎన్నో వింతలను, భయంకరమైన విపత్తులను కళ్లారా చూడబోతోంది. ఇది ఏదో నాస్ట్రడామస్ చెప్పిన జోస్యం కాదు... బాబా వంగా చెప్పిన అంచనా అంతకన్నా కాదు. ఇది... వందల ఏళ్ల క్రితమే మన సనాతన ధర్మంలో, సాక్షాత్తూ మహర్షులు రాసిపెట్టిన పచ్చి నిజం!
నేటి ఆధునిక శాస్త్రవేత్తలు సైతం సమాధానం చెప్పలేక చేతులెత్తేస్తున్న ఎన్నో విపత్కర పరిణామాలూ, అకస్మాత్తుగా వస్తున్న వాతావరణ మార్పులూ, అంతుచిక్కని రోగాలూ... ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. ఎలాంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే, మన సిద్ధులు, యోగులు తమ దివ్యదృష్టితో ఈ కాలాన్ని దర్శించి, తాళ పత్రాలపై అక్షర సత్యాలుగా లిఖించారు. వారు ఏయే గ్రహాలు ఎలా మారినప్పుడు వినాశనం మొదలవుతుందో ఖచ్చితమైన లెక్కలతోసహా రాసిపెట్టారు. నేటి సైన్స్ కు అందని ఆ కాలజ్ఞానం ముందు, ఇప్పుడు టెక్నాలజీ తలవంచుకుంటోంది. మనం ఊహించని ఒక మహా ప్రళయానికి రంగం సిద్ధమైంది!
పూరీ జగన్నాథుని సన్నిధి నుండి ఆ పరమాత్మ స్వయంగా ఇస్తున్న 5 సంకేతాలు, కలియుగం అంతం కాబోతోంది అనడానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అంతేకాదు, 16వ శతాబ్దంలో ఒడిశాకు చెందిన 'మహాపురుషులు అచ్యుతానంద దాసు' రచించిన "భవిష్య మాలిక" అనే గ్రంథంలో... మన వెన్నులో వణుకు పుట్టించే ఒక మహా రహస్యం దాగి ఉంది. అదేంటో తెలుసా? "కల్కి భగవానుడు ఇప్పటికే అవతరించాడు"!
ఈరోజు మనం కాలగర్భంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన, మరియు అంతే భయంకరమైన రహస్యాన్ని ఛేదించబోతున్నాం. భవిష్య మాలిక గ్రంథం ఏం చెబుతోంది? పూరీ ఆలయంలో కలుగుతున్న ఆ 5 అపశకునాలు ఏమిటి? శ్రీమద్భాగవతం, విష్ణు పురాణాలతో వీటికి ఉన్న లింక్ ఏమిటి? కల్కి అవతారం ఎక్కడ ఉన్నాడు? వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో పూర్తయ్యే సరికి మీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది.
వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
విషయంలోకి వెళ్లే ముందు మనం మన సనాతన ధర్మం ప్రకారం 'కాల చక్రం' ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. మన పురాణాల ప్రకారం కాలం ఒక సరళ రేఖ కాదు, అది ఒక చక్రం. సత్య, త్రేతా, ద్వాపర, మరియు కలియుగాలు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి.
శ్రీమద్భాగవతం 12వ స్కంధం, రెండవ అధ్యాయంలో కలియుగ లక్షణాల గురించి శకపురుషుడు శ్రీ సుకదేవ గోస్వామి, పరీక్షిత్తు మహారాజుకు స్పష్టంగా వివరించాడు.
తతశ్చానుదినం ధర్మః సత్యం శౌచం క్షమా దయా ।
కాలేన బలీనా రాజన్ నంక్ష్యత్యాయుర్బలం స్మృతిః ।।
దీని అర్థం... "కలియుగం పెరిగేకొద్దీ మనుషుల్లో ధర్మం, సత్యం, పరిశుభ్రత, క్షమ, దయ, ఆయుష్షు, మరియు జ్ఞాపకశక్తి దారుణంగా నశించిపోతాయి."
కేవలం డబ్బు ఉన్నవాడికే సమాజంలో గౌరవం ఉంటుంది. న్యాయం అనేది లంచాలకు అమ్ముడుపోతుంది. ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నది అదే కదా?
కేవలం భాగవతం మాత్రమే కాదు. మహాభారతంలోని 'అరణ్య పర్వం'లో మార్కండేయ మహర్షి ధర్మరాజుకు కలియుగ లక్షణాల గురించి ఎంతో వివరంగా చెప్పారు. "కలియుగాంతం దగ్గరపడే కొద్దీ మానవ సంబంధాలు మంటగలుస్తాయి. ఆడపిల్లలు అత్యంత చిన్న వయస్సులోనే తల్లులు అవుతారు. పాలకులు ప్రజలను రక్షించడానికి బదులు, వారే పన్నుల పేరుతో దోపిడీదారులుగా మారతారు. ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో వారే పండితులుగా, గొప్పవారిగా చెలామణి అవుతారు" అని మార్కండేయ మహర్షి వేల ఏళ్ల క్రితమే హెచ్చరించారు. ఈ రోజు మనం వార్తల్లో చూస్తున్న దారుణాలకూ, ఆనాటి మహర్షులు చెప్పిన మాటలకూ ఏమైనా తేడా ఉందా? ఒక్కసారి ఆలోచించండి.
అలాగే 'లింగ పురాణం' (Linga Purana) ప్రకారం, యుగాంతానికి ముందు కేవలం మనుషులే కాదు.. ప్రకృతి కూడా తన సమతుల్యతను పూర్తిగా కోల్పోతుంది. అకాల వర్షాలూ, భయంకరమైన కరవులూ మానవాళిని పట్టి పీడిస్తాయి. గంగ లాంటి పవిత్ర నదులు ఎండిపోతాయి. ప్రజలు తమ తల్లిదండ్రులను, గురువులను గౌరవించడం మానేసి, వారిని భారంగా భావిస్తారు. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నప్పుడే, భూమి తనను తాను శుద్ధి చేసుకోవడానికి, ప్రళయానికి దారులు తెరుచుకుంటాయని పురాణాలు ఘోషిస్తున్నాయి.
విష్ణు పురాణం 4వ అంశం, 24వ అధ్యాయం ప్రకారం, మానవుల ఆయుర్దాయం కేవలం 20 లేదా 30 ఏళ్లకు పడిపోయినప్పుడు, కలియుగం అంతం ప్రారంభమవుతుంది. కానీ, అంతకంటే ముందే కొన్ని ప్రళయాలు భూమిని శుద్ధి చేస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయమే ఇప్పుడు ఆసన్నమైందా?
15వ, 16వ శతాబ్దంలో ఒడిశాలో శ్రీకృష్ణ భక్తి తత్వాన్నీ, మరియు దివ్య జ్ఞానాన్నీ, సామాన్య ప్రజలకు అందించడానికి జన్మించిన ఐదుగురు మహా యోగులూ, కవుల సమూహాన్నే "పంచ సఖులు" (ఐదుగురు మిత్రులు) అని పిలుస్తారు. వారి పేర్లు: శ్రీ బలరామ దాసు, శ్రీ జగన్నాథ దాసు, శ్రీ అచ్యుతానంద దాసు, శ్రీ అనంత దాసు మరియు శ్రీ యశోవంత దాసు. సాక్షాత్తూ పూరీ జగన్నాథుని ఆజ్ఞ మేరకు భూమిపై జన్మించినట్లుగా భావించే ఈ ఐదుగురు సిద్దులు, సంస్కృతంలో ఉన్న క్లిష్టమైన వేద పురాణాలను సామాన్యులకు అర్థమయ్యేలా స్థానిక భాషలోకి అనువదించారు. శ్రీ చైతన్య మహాప్రభువుకు అత్యంత ఆప్తులుగా ఉంటూ, భక్తి ఉద్యమాన్ని నడిపించిన ఈ పంచసఖుల రచనలూ, ఆధ్యాత్మిక బోధనలూ, నేటికీ ఆధ్యాత్మిక లోకంలో అత్యంత పవిత్రమైనవిగా మరియు అక్షర సత్యాలుగా కొలవబడుతున్నాయి. ఈ ఐదుగురు మహా యోగులలో అగ్రగణ్యులు శ్రీ అచ్యుతానంద దాసు. వీరు సాక్షాత్తూ జగన్నాథుని ఆజ్ఞ మేరకు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను దర్శించగలిగే త్రికాలజ్ఞులు. వీరు రాసిన లక్షల కొద్దీ తాళపత్రాల సమూహమే "భవిష్య మాలిక" (Bhavishya Malika).
ఈ భవిష్య మాలికలో రాసిన ఎన్నో విషయాలు ఇప్పటికే అక్షరాలా నిజమయ్యాయి. ఉదాహరణకు:
•భారతదేశం విడిపోయి పాకిస్తాన్ భూభాగం ఏర్పడుతుందని.. ఇవన్నీ బ్రిటీష్ వారి పాలన మొదలు కాక ముందే రాశారు.
•ఆకాశంలో ఇనుప పక్షులు ఎగురుతాయని (విమానాలు).
•ఒక వింత రోగం వచ్చి లక్షలాది మంది ప్రజలు చనిపోతారని (కోవిడ్-19 గురించి).
ఇవన్నీ నిజమయ్యాయి. ఇప్పుడు మనం చూడబోయేది, ఈ భవిష్య మాలికలో రాసిన అత్యంత కీలకమైన ఘట్టం, ‘యుగాంతం’ లేదా ‘యుగ పరివర్తన’. అచ్యుతానంద దాసు తన గ్రంథంలో ఒక స్పష్టమైన హెచ్చరిక చేశారు: "పూరీ జగన్నాథుని ఆలయంలో కొన్ని వింతలు జరిగినప్పుడు, ప్రపంచ వినాశనానికి కౌంట్ డౌన్ మొదలైనట్టే" అని రాశారు. ఆ వింతలు ఇప్పుడు మన కళ్ల ముందే జరుగుతున్నాయి. అవేంటో తెలుసా?
పూరీ జగన్నాథ స్వామి ఆలయం ఒక అద్భుతం. సైన్స్ కి అందని ఎన్నో రహస్యాలు అక్కడ దాగున్నాయి. అయితే భవిష్య మాలికలో అచ్యుతానంద దాసు, కలియుగాంతం దగ్గరపడే కొద్దీ పూరీ ఆలయంలో 5 అపశకునాలు కనిపిస్తాయని రాశారు. దురదృష్ట వశాత్తూ, ఆ ఐదూ ఇటీవలి కాలంలోనే జరిగాయి!
మొదటి సంకేతం: ‘నీలచక్రం పైన గ్రద్దలు వాలడం’.. పూరీ ఆలయం పైన ఉండే నీలచక్రం మీదుగా ఏ పక్షీ ఎగరదు. కానీ భవిష్య మాలిక ప్రకారం "ఎప్పుడైతే ఆ నీలచక్రం పైన రాబందులు లేదా గ్రద్దలు వాలుతాయో, అప్పుడు దేశం మీదకు పెద్ద విపత్తు వస్తుంది." 2019, 2020 మరియు 2023లో అనేకసార్లు నీలచక్రంపై రాబందులు వాలడం, భక్తులు చూసి భయాందోళనలకు గురయ్యారు.
రెండవ సంకేతం: ‘పతితపావన బానా అంటే, పవిత్రమైన జెండా కాలిపోవడం’.. ఆలయం పైన ఎగిరే జెండాను రోజూ మారుస్తారు. ఇది గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. మాలికలో చెప్పినట్లుగా, 2020 మార్చిలో అంటే సరిగ్గా కోవిడ్ లాక్ డౌన్ సమయంలో, గుడి పైనున్న పవిత్ర జెండా అనుకోకుండా నిప్పు అంటుకుని కాలిపోయింది. ఇది ఒక తీవ్రమైన హెచ్చరికగా పండితులు భావించారు.
మూడవ సంకేతం: ‘ఆలయం నుండి రాళ్ళు కింద పడటం’.. "జగన్నాథుని గర్భగుడి లేదా ఆలయ గోపురం నుండి ఎప్పుడైతే రాళ్ళు కిందపడతాయో, అది ప్రళయానికి ప్రారంభం." గత కొన్నేళ్లుగా పూరీ ఆలయంలోని కల్పవృక్షం దగ్గర, మరియు ఇతర ప్రదేశాలలో, పైకప్పు నుండి రాళ్లు ఊడి పడిన సంఘటనలు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.
నాలుగవ సంకేతం: ‘మహా ప్రసాదం పాడైపోవడం’.. పూరీలో రోజూ లక్షలాది మందికి వండే మహా ప్రసాదం, ఎప్పటికీ తక్కువ పడదు, వృథా కాదు. కానీ భవిష్య మాలికలో, "స్వామివారు అన్నప్రసాదాలు స్వీకరించని రోజు వస్తుంది, ఆ రోజు ప్రసాదం కుళ్లిపోతుంది" అని రాశారు. ఇటీవలి కాలంలో కొన్ని అపవిత్ర ఘటనల వల్ల, మహా ప్రసాదాన్ని పారబోయాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
ఐదవ సంకేతం: ‘బడా దండా (Bada Danda) లోకి సముద్రపు నీరు’.. "సముద్రం ఉప్పొంగి, పూరీ రథయాత్ర జరిగే బడా దండా అంటే ప్రధాన రహదారిలోకి నీరు వస్తుంది. జగన్నాథుడు ఆలయం వదిలి కల్కికి తోడుగా వెళ్తాడు." ఇప్పటికే వాతావరణ మార్పుల వల్ల, పూరీ తీరం వేగంగా కోతకు గురవుతోంది. సముద్రం గుడి వైపుగా దూసుకు వస్తోంది.
ఈ ఐదు సంకేతాలు భవిష్య మాలికలో రాసినట్లే అక్షరాలా జరిగాయి! అంటే సమయం ఆసన్నమైందా?
ఇక్కడ మనం ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని జీర్ణించుకోవాలి. పురాణాల ప్రకారం కలియుగం వయస్సు 4,32,000 సంవత్సరాలు. అందులో ఇంకా 4,27,000 ఏళ్ళు మిగిలి ఉందని పండితులు చెబుతుంటారు. కానీ, భవిష్య మాలిక మరియు ఇతర రహస్య గ్రంథాల ప్రకారం... పాపం మితిమీరినప్పుడు, భగవంతుడు యుగం ముగిసేవరకు ఆగాడు! భవిష్య మాలికలో స్పష్టంగా ఒక మాట ఉంది: "కలియుగం వయస్సు తగ్గించబడింది. పాపభారం వల్ల అది తన పూర్తి కాలాన్ని చేరుకోకుండానే అంతమవుతుంది."
భవిష్య మాలిక చెబుతున్న ఈ విషయాన్ని కొట్టిపారేసే ముందు, సాక్షాత్తూ శ్రీమద్భగవద్గీతలో, కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇచ్చిన ఆ గొప్ప వాగ్దానాన్ని మనం ఒకసారి గుర్తుచేసుకోవాలి.
"యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ।।"
"పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ।। "
"ఎప్పుడైతే ధర్మం నశించి, అధర్మం పెచ్చుమీరుతుందో, అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను. సాధువులను రక్షించడానికీ, దుర్మార్గులను శిక్షించడానికీ, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికీ నేను యుగయుగాల్లో అవతరిస్తాను" అన్నాడు భగవానుడు. దేవుడే స్వయంగా ఈ మాట ఇచ్చినప్పుడు, ఈ ఘోర కలియుగంలో పాపం ఇలా కట్టలు తెంచుకుంటుంటే ఆయన రాకుండా ఎలా ఉంటాడు?
అచ్యుతానంద దాసు రాసిన దాని ప్రకారం... విష్ణువు యొక్క ఆ పదవ అవతారమైన కల్కి భగవానుడు ఇప్పటికే భూమి మీద జన్మించాడు! అవును, మీరు విన్నది నిజమే... కల్కి ఇప్పటికే అవతరించాడు.
భవిష్య మాలిక ప్రకారం, కల్కి భారత దేశంలోనే ఒక పవిత్రమైన ప్రదేశంలో జన్మించాడు. కొందరు ఇది ఒడిశా లేదా ఉత్తరప్రదేశ్ అని చెబుతారు. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉంటూ, తన దివ్య శక్తులను సమకూర్చుకుంటూ, భక్తులను ధర్మ మార్గంలో నడిపించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఎప్పుడైతే ప్రపంచం మూడవ ప్రపంచ యుద్ధం (World War 3) అంచున నిలబడుతుందో, ప్రకృతి విపత్తుల వల్ల సగం ప్రపంచ జనాభా అంతరించిపోతుందో... అప్పుడు కల్కి భగవానుడు ప్రపంచానికి దర్శనమిస్తాడు. శ్రీమద్భాగవతం 12వ స్కంధం ప్రకారం: "అశ్వం ఆశుగమారుహ్య దేవదత్తం జగత్పతిః..." అంటే దేవదత్తం అనే తెల్లని గుర్రమెక్కి, కత్తి చేతబట్టి, అధర్మాన్ని నాశనం చేస్తాడు. భవిష్య మాలిక ప్రకారం ఈ సంఘటనలు, రాబోయే అతి కొద్ది సంవత్సరాలలోనే, ఇంచు మించు 2025 - 2032 మధ్య జరగబోతున్నాయని, ఎందరో పరిశోధకులు చెబుతున్నారు. ఇది మనం మన గత వీడియోలో ‘వీరభోగ వసంత రాయల రాక’ గురించి చెప్పుకున్న విషయాలకు చాలా దగ్గరగా ఉండడం కాకతాళీయం కానేకాదు!
కలియుగం అంతం అంటే భూమి నాశనం అవ్వడం కాదు. అధర్మం నాశనం అవ్వడం, ఒక కొత్త "సత్య యుగం" (Satya Yuga) లేదా స్వర్ణ యుగం ప్రారంభం కావడం. ఈ ప్రళయ కాలంలో ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా మారుతుంది. కొన్ని దేశాలు పటంలో లేకుండా సముద్రంలో కలిసిపోతాయి. తీవ్రమైన వ్యాధులూ, యుద్ధాలూ మానవాళిని భయపెడతాయి.
మరి ఈ భయంకరమైన విపత్తుల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? భవిష్య మాలికలో దీనికి ఒకటే పరిష్కారం చెప్పారు. అదే "దైవ నామస్మరణ" మరియు "ధర్మ మార్గం".
ఎవరూ తప్పు చేయకుండా, ఇతరులకు హాని చేయకుండా, నిరంతరం భగవంతుని నామాన్ని ‘ఓం నమో నారాయణాయ లేదా హరే రామ హరే కృష్ణ లేదా ఓం నమః శివాయ’ అని జపిస్తుంటారో... వారిని ఆ భగవంతుడే స్వయంగా రక్షిస్తాడు. కల్కి భగవానుడి అనుగ్రహం పొందాలంటే, గుడికి వెళ్లి లక్షలు దానం చేయాల్సిన పనిలేదు. కేవలం హృదయంలో స్వచ్ఛత, తోటి మనుషుల పట్ల దయ ఉంటే చాలు.
ఈ ప్రకృతి, ఈ విశ్వం ఇస్తున్న సంకేతాలను మనం తక్కువ అంచనా వేయలేము. భవిష్య మాలిక హెచ్చరించిన రోజులు మన కళ్ళముందే కనిపిస్తున్నాయి. సనాతన ధర్మం ఎప్పుడూ భయపెట్టదు. బాధ్యతను మాత్రం ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. మనం ధర్మాన్ని రక్షిస్తే, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది.
ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? కల్కి అవతారం ఇప్పటికే జన్మించారని మీరు నమ్ముతున్నారా? కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేసి వారిని కూడా జాగ్రత్త పడేలా చేయండి. మరిన్ని అద్భుతమైన, నిగూఢ రహస్యాల కోసం మన 'వాయిస్ ఆఫ్ మహీధర్' ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అవకాశం ఉన్నవారు వీడియోను Hype చేస్తారని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్లీ కలుద్దాం.
మొసలి మింగిన బాలుడు 3 ఏళ్ల తర్వాత ప్రాణాలతో ఎలా తిరిగొచ్చాడు? అవినాశి ఆలయంలోని అద్భుత ఘట్టం!
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ 'అవినాశిలింగేశ్వర ఆలయం' (దీనినే అవినాశి అప్పర్ ఆలయం అని కూడా అంటారు) శైవ భక్తులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద కనిపించే ఒక అద్భుతమైన శిల్పం వెనుక ఉన్న ప్రాచీన పౌరాణిక గాథ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ ఘట్టమే "ముదలై వాయి పిళ్ళై" (అనగా మొసలి నోటిలోని బాలుడు).
ఆనందం, విషాదం ఒకేచోట...
ఎనిమిదవ శతాబ్దంలో 63 మంది శైవ నాయనార్లలో అగ్రగణ్యుడు, తేవారం కీర్తనల సృష్టి కర్త అయిన సుందరమూర్తి నాయనార్ (సుందరార్) అవినాశి గ్రామం గుండా వెళ్తున్నారు. ఆ సమయంలో ఒకే వీధిలోని రెండు ఇళ్లలో ఉన్న భిన్నమైన వాతావరణాన్ని ఆయన గమనించారు. ఒక ఇంట్లో బాలుడి ఉపనయన వేడుక (ఒడుగు) అత్యంత వైభవంగా జరుగుతుండగా, సరిగ్గా ఎదురింట్లో ఒక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మూడేళ్ల క్రితం జరిగిన ఆ విషాదం
ఆ తల్లిదండ్రుల బాధకు కారణం అడిగి తెలుసుకున్న సుందరార్ చలించి పోయారు. మూడేళ్ల క్రితం ఆ రెండు ఇళ్లలోని బాలురు స్థానికంగా ఉన్న 'తామరై కుళం' (తామర చెరువు)లో స్నానానికి వెళ్లగా, ఒక బాలుడిని పెద్ద మొసలి మింగేసింది. ప్రాణాలతో ఉన్న బాలుడికి ఉపనయనం జరుగుతుండటం చూసి, "అదే మా బాబు బతికి ఉంటే, వాడికి కూడా ఈపాటికి ఎనిమిదేళ్లు వచ్చేవని, ఇలాగే ఉపనయనం చేసుకునేవాళ్లం" అని ఆ తల్లిదండ్రులు కుమిలి పోతున్నారు.
భక్తి పారవశ్యం - శివుని అపార కరుణ
వారి అపారమైన శోకాన్ని చూసి సుందరార్ హృదయం ద్రవించింది. వెంటనే ఆయన ఎండిపోయిన ఆ చెరువు ఒడ్డుకు చేరుకుని, అవినాశి లింగేశ్వరుడిని (పరమశివుడిని) సంపూర్ణ భక్తితో ధ్యానించారు. పది పవిత్ర తమిళ శ్లోకాలతో కూడిన "ఎట్రానై మరక్కేనే" అనే ప్రసిద్ధ దేవార పదిగమ్ ను ఆర్తిగా ఆలపించారు. శివుడిని మెప్పించి భక్తితో అద్భుతాలు సాధించడం నాయనార్ల చరిత్రలో ఉన్న విశిష్టత.
కళ్లెదుటే జరిగిన మహాద్భుతం!
సుందరార్ ప్రార్థన పూర్తి కాగానే ఎవరూ ఊహించని అద్భుతం జరిగింది:
చెరువు నిండటం: ఎండి పోయిన ఆ తామర చెరువు అమాంతంగా నీటితో నిండి పోయింది.
మొసలి రాక: నీటి అడుగు నుంచి ఒక పెద్ద మొసలి పైకి తేలింది.
యమధర్మరాజు జోక్యం: సాక్షాత్తూ యమధర్మరాజు స్వయంగా ఆ బాలుడి ఆత్మను తిరిగి ప్రవేశ పెట్టగా, మొసలి తన నోటి నుండి ఆ బాలుడిని సురక్షితంగా బయటకు విడిచి పెట్టింది.
వయసు పెరిగిన బాలుడు: అందరినీ విస్మయానికి గురిచేస్తూ, ఆ బాలుడు చనిపోయినప్పటి 5 ఏళ్ల వయసులో కాకుండా, సరిగ్గా ఉపనయనానికి తగిన 8 ఏళ్ల వయసుతో, ఎలాంటి గాయాలు లేకుండా, శివుడికి నమస్కరిస్తూ బయటకు రావడం అందరినీ ఆశ్చర్యపరచింది!
సాహిత్య, చారిత్రక ఆధారాలు
శైవ సిద్ధాంతంలో భగవంతుని అపరిమితమైన కరుణకు, భక్తికీ ఉన్న శక్తికి, ఈ సంఘటన ఒక నిదర్శనం.
పెరియ పురాణం: నాయనార్ల జీవిత చరిత్రలను వర్ణించే ప్రామాణిక తమిళ శైవ కావ్యం 'పెరియ పురాణం'లో ఈ కథ ప్రస్తావించబడింది.
సజీవ శిల్పం: ఈ భక్తిరస పూరిత అద్భుత దృశ్యాన్ని నాటి శిల్పులు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద అత్యంత నైపుణ్యంతో చెక్కారు.
వార్షికోత్సవం: నేటికీ ప్రతి సంవత్సరం 'పంగుణి' మాసంలో అశ్వినీ నక్షత్రం రోజున, ఈ "ముదలై వాయి పిళ్ళై" అద్భుతాన్ని పురస్కరించుకుని, అవినాశి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాన్ని, అశేష జన వాహిని మధ్య, ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.
శైవ భక్తి గొప్పదనాన్ని చాటి చెప్పే ఇలాంటి పురాతన ఆలయాలను మీరు ఎప్పుడైనా సందర్శించి, అక్కడి శిల్పాల వెనుక ఉన్న స్థల పురాణాలను తెలుసుకున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.. మహీధర్ 🚩 ॐ నమః శివాయ 🙏
మరణించిన వారి నోటిలో బంగారం ఎందుకు పెడతారు? గరుడ పురాణం చెబుతున్న అద్భుత రహస్యం!
హిందూ సంప్రదాయంలో జననం నుంచి మరణం వరకు ప్రతి ఆచారానికి ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. ముఖ్యంగా మరణానంతరం అంత్యక్రియల సమయంలో మృతదేహం నోటిలో కొద్దిగా బంగారం, తులసి దళం, గంగాజలం ఉంచడం మనం చూస్తూనే ఉంటాం. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దీని వెనుక గరుడ పురాణంలో పేర్కొన్న ఒక గొప్ప శాస్త్రం దాగి ఉంది.
శరీరాన్ని విడిచిపెట్టి అదృశ్య లోకాల వైపు పయనిస్తున్న ఆత్మకు ఈ పవిత్ర వస్తువులు ఏ విధంగా రక్షణ కల్పిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆత్మకు మార్గనిర్దేశం చేసే 3 దైవిక సాధనాలు:
బంగారం (ఆధ్యాత్మిక శుద్ధి): బంగారాన్ని సాక్షాత్తూ అగ్ని దేవుని స్వరూపంగా, అత్యంత పవిత్రమైన లోహంగా భావిస్తారు. మరణించిన వారి నోటిలో బంగారాన్ని ఉంచడం ద్వారా ఆత్మకు ఆధ్యాత్మిక శుద్ధి కలుగుతుందని నమ్మకం. పరలోక ప్రయాణంలో ఇది ఆత్మకు దారి చూపే మార్గదర్శిగా, ఒక దైవిక కవచంలా పనిచేస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
గంగాజలం (పాప విక్షాళన): భువిపై ప్రవహించే అమృతంగా గంగానదికి హిందూ ధర్మంలో అత్యున్నత స్థానం ఉంది. మరణానంతరం నోటిలో గంగాజలం పడటం వల్ల, జీవించి ఉన్నప్పుడు తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోతాయని విశ్వాసం. దీనివల్ల ఆత్మ దేహాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా సులభంగా విడిచిపెడుతుంది.
తులసి దళం (వైకుంఠ ప్రాప్తి): తులసి సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి స్వరూపం మరియు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. నోటిలో తులసి ఆకు ఉంచడం వల్ల ఆత్మ యమధర్మరాజు పాశం నుంచి విముక్తి పొందుతుందని గరుడ పురాణం స్పష్టం చేస్తోంది. దీని స్పర్శతో ఆత్మకు నేరుగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పెద్దల ప్రగాఢ విశ్వాసం.
ఆధ్యాత్మికతతో పాటు మానసిక సాంత్వన:
ఈ ఆచారాలు పద్ధతి ప్రకారం నిర్వహించడం వల్ల, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక రకమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. తమ ఆత్మీయులకు చివరి మజిలీలో తాము చేయగలిగిన అత్యుత్తమ వీడ్కోలు మరియు పవిత్ర సేవ ఇదేనన్న భావన వారికి ఊరటనిస్తుంది.
వేల ఏళ్లుగా వస్తున్న ఈ సంప్రదాయాలు కేవలం మూఢనమ్మకాలు కావు. మరణాన్ని కూడా గౌరవించే మన సనాతన ధర్మ సంస్కృతికి, వారసత్వ సంపదకు ఇవి సజీవ సాక్ష్యాలు!
వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century?
'కాలం'... ఎవరి కోసమూ ఆగదు. నిన్నటి నిజం నేటి చరిత్ర. కానీ రేపు జరగబోయేది ముందే తెలిస్తే? వందలు, వేల సంవత్సరాల భవిష్యత్తును తన జ్ఞాన నేత్రంతో చూసి, రాబోయే యుగాంతాన్ని, మానవాళి మనుగడను ఒక తాళపత్ర గ్రంథంలో లిఖించిన మహా దార్శనికుడూ, భారతదేశపు నాస్ట్రడామస్, సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు అంశగా భక్తులు కొలిచే 'శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి'.
ఈరోజు మనం ఒక అద్భుతమైన, భయంకరమైన, మరియు ఆలోచింపజేసే సత్యాన్వేషణలోకి వెళ్లబోతున్నాం.
అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అత్యంత కీలకమైన, ఒళ్ళు గగుర్పొడిచే విషయం మరొకటి ఉంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం కేవలం ఆయన ఊహించి చెప్పిన కవిత్వం కాదు, లేదా కాకతాళీయంగా నిజమైన భవిష్యవాణి అంతకంటే కాదు. నేటి ఆధునిక సైన్స్ ఇంకా ప్రయోగాలు చేస్తున్న 'టైమ్ ట్రావెల్' (Time Travel) అనగా 'కాల ప్రయాణం' ఆయన ఆనాడే చేశారా? అన్న అనుమానం కలగక మానదు. ఎందుకంటే, సామాన్య శకం 17వ శతాబ్దానికి చెందిన ఒక వ్యక్తి... గాల్లో ఎగిరే విమానాలు, పట్టాలపై పరుగెత్తే రైళ్లు, కరెంటు బల్బులు, టెలిఫోన్లు మరియు ప్రపంచాన్ని గడగడలాడించే భయంకరమైన వైరస్ ల గురించి అక్షరం పొల్లుపోకుండా అంత కచ్చితంగా ఎలా వర్ణించగలిగారు? కేవలం మేధస్సుతోనో, ఊహతోనో ఇవన్నీ చెప్పడం అసాధ్యం. బహుశా ఆయన తన అపారమైన యోగ శక్తితో, తపోబలంతో 'సూక్ష్మ శరీర యానం' (Astral Projection) ద్వారా భవిష్యత్తులోకి ప్రయాణించి ఉండవచ్చు! భవిష్యత్తులో మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ ఆధునిక యుగంలో ఆయన స్వయంగా అడుగుపెట్టి, ఇక్కడి వింతలను, విపత్తులను తన కళ్లారా చూసి, తిరిగి తన కాలానికి వెళ్లి తాళపత్రాలపై వాటిని నమోదు చేసి ఉండవచ్చు. ఆ కోణంలో ఆలోచిస్తే, ఈ కాలజ్ఞానం కేవలం ఒక భవిష్యవాణి కాదు... ఒక 'టైమ్ ట్రావెలర్' రాసిన కచ్చితమైన డైరీ!
అసలు వందల ఏళ్ల క్రితం బ్రహ్మంగారు రాసిన ఆ డైరీలో ఏముంది? అందులో నేటి సమాజానికి సంబంధించిన ఎలాంటి వాస్తవాలు దాగి ఉన్నాయి? నిజంగానే యుగాంతం రాబోతోందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో ఉన్న సత్యాలు మీ కళ్లు తెరిపిస్తాయి.
వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
అది సామాన్య శకం 1610వ సంవత్సరం. కడప జిల్లాలోని పాపాగ్ని నదీ తీరాన ఉన్న బ్రహ్మంగారి మఠంలో, ఈ అద్భుత ప్రస్థానం మొదలైంది. ఆయన పుట్టుకే ఒక రహస్యం! సామాన్య శకం 17వ శతాబ్దంలో జీవించిన ఆయన, తన కాలజ్ఞానాన్ని కందిమల్లాయపల్లె అంటే, నేటి బ్రహ్మంగారి మఠం వేదికగా, లోకానికి అందించారు. బ్రహ్మంగారు కేవలం భవిష్యత్తును ఊహించి చెప్పిన వ్యక్తి కారు. ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త. కుల మత భేదాలను ఖండించి, మానవత్వమే పరమావధిగా చాటిన మహానుభావులు. సిద్ధయ్య లాంటి ముస్లిం భక్తుడిని తన ప్రధాన శిష్యుడిగా స్వీకరించి, సకల ప్రాణులూ సమానమే అని నిరూపించిన రోజులు అవి.
కానీ ఆయన అసలు ఉద్దేశం వేరు. కలియుగం రాను రాను ఎలా మారబోతోంది? ధర్మం నాలుగు పాదాల నుండి ఒంటి పాదం పైకి ఎలా పడిపోతుంది? అన్న విషయాల గురించి, భవిష్యత్ తరాలను హెచ్చరించడానికే ఆయన ఆ తాళపత్ర గ్రంథాలను రచించారు. ఆయన తన శిష్యుడైన అన్నజయ్యకు భవిష్యత్తు గురించి చెబుతూ రాసిన పద్యాలూ, వచనాలూ, ఈనాటికీ మనకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచాయి.
ఆయన రాసిన కాలజ్ఞానంలో దాదాపు 90 శాతానికి పైగా అక్షరసత్యాలయ్యాయి. ఇది విని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఆధారాలతో సహా ప్రాచీన గ్రంథాలు ఏం చెబుతున్నాయో విందాం.
1. రవాణా వ్యవస్థలో మార్పులు (Transportation): 'ఎద్దులు, గుర్రాలు లేని బండ్లు ప్రపంచమంతా సంచరిస్తాయి.' ఆ కాలంలో ప్రయాణం అంటే ఎడ్ల బండి లేదా గుర్రపు బగ్గీ. కానీ ఎటువంటి ప్రాణి సహాయం లేకుండా బండ్లు నడుస్తాయి అని, ఆయన సామాన్య శకం 17వ శతాబ్దంలోనే చెప్పారు. నేడు మనం వాడుతున్న కార్లు, రైళ్లు దానికి సజీవ సాక్ష్యం. ఆకాశంలో ఇనుప పక్షులు ఎగురుతాయి అన్నారు... అవి నేటి విమానాలు.
2. విద్యుత్ మరియు కమ్యూనికేషన్ (Electricity and Communication): 'నూనె లేని దీపాలు వెలుగుతాయి... ఆమడ దూరంలో ఉన్న వారితో ఇంట్లో ఉండే మాట్లాడవచ్చు.' థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టక ముందే, అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టక వందల ఏళ్ల ముందే, బ్రహ్మంగారు నూనె లేని దీపాలు అంటే విద్యుత్ తో వెలిగే బల్బులు, దూరంగా ఉన్న వారితో మాట్లాడే యంత్రాలు అంటే, మొబైల్ ఫోన్స్ వస్తాయని స్పష్టంగా తన కవిత్వంలో లిఖించారు.
3. నీటి వ్యాపారం (Commercialization of Water): 'నీళ్లు బజారులో అమ్ముకుంటారు... అడవి మృగాలు ఊళ్ల మీద పడతాయి.' పంచభూతాల్లో ఒకటైన నీటిని, కొనుక్కుని తాగే దౌర్భాగ్యం వస్తుందని ఆయన ఏనాడో హెచ్చరించారు. ఈరోజు మనం చూస్తున్న మినరల్ వాటర్ బాటిల్స్ వ్యాపారం దీనికి నిదర్శనం. అలాగే అడవులు నరికివేయడం వలన, క్రూరమృగాలు జనావాసాల్లోకి రావడం మనం ప్రతిరోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం.
4. సామాజిక మార్పులు (Social Changes): 'కులమతాలు నశిస్తాయి, రాజుల పాలన అంతరించి ప్రజల పాలన వస్తుంది.' సామాన్య శకం 1600-1700ల కాలంలో రాజుల ఏలుబడి ఉండేది. కానీ భవిష్యత్తులో రాజులు ఉండరు, ప్రజలే పాలకులవుతారు (ప్రజాస్వామ్యం/Democracy) అని ఆయన ఆనాడే కచ్చితంగా చెప్పారు.
వీటితో పాటు ప్రకృతిలో రాబోయే భయంకరమైన మార్పులను బ్రహ్మంగారు తన 'గోవింద వాక్యాలు' మరియు 'జీవైక్య బోధ' వంటి పవిత్ర గ్రంథాలలో ప్రస్తావించారు. 'ఆకాశంలో వింతలు జరుగుతాయి, రెండు సూర్యులు కనిపించే కాలం వస్తుంది. పందులకు కొమ్ములు వస్తాయి, ఆరు కాళ్ల జంతువులు పుడతాయి.' ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా, నేటి జన్యుపరమైన మార్పులు (Genetic Mutations) మరియు వాతావరణ కాలుష్యం వల్ల జంతువుల్లో వస్తున్న వింత రూపాలను మనం గమనించవచ్చు.
అంతేకాదు, 'మగవారు ఆడవారిలా, ఆడవారు మగవారిలా ప్రవర్తిస్తారు. కట్టుబాట్లు, బంధాలు తెగిపోతాయి.' అని చెప్పారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో నేటి సమాజంలో వస్తున్న విపరీతమైన మార్పులూ, పెళ్లి వ్యవస్థపై మారుతున్న అభిప్రాయాలూ, ఆయన ముందుగానే పసిగట్టారు.
సామాన్య శకం 1693వ సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి రోజున బ్రహ్మంగారు కందిమల్లాయపల్లెలో జీవసమాధి అయ్యారు. కానీ ఆయన సమాధి అయ్యే ముందు తన శిష్యులకు ఒక మాట చెప్పారు. 'నేను మళ్లీ వస్తాను... వీరభోగ వసంతరాయలుగా అవతరించి, ఈ ధర్మ గ్లానిని అంతం చేస్తాను' అని శపథం చేశారు.
ఇప్పటివరకు మనం చూసినవి జరిగినవి మాత్రమే. కానీ జరగబోయేవి ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి. భవిష్యత్తులో రాబోయే మహా రోగాలు ఎలాంటివి? ప్రపంచాన్ని వణికించే యుగాంతం ఎప్పుడు రాబోతోంది? వీరభోగ వసంతరాయలు ఎవరు? ఆయన ఎక్కడ పుట్టబోతున్నాడు? వంటి నిగూఢ సత్యాలను ఇప్పుడు వెలికితీద్దాం.
బ్రహ్మంగారి కాలజ్ఞానంలో నేటి పరిస్థితులకు అత్యంత దగ్గరగా సరిపోలే అంశం... 'మహమ్మారులు'. ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ ఒక విపత్కర పరిస్థితి గురించి వర్ణించారు. 'ఊళ్లలో జనం పిట్టల్లా రాలిపోతారు. వైద్యులకు కూడా అంతుచిక్కని రోగాలు వస్తాయి. మందులు పనిచేయవు. ఊర్లకు ఊర్లే వల్లకాడులా మారుతాయి.'
2020లో ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19, కరోనా వైరస్ మహమ్మారి ఈ వర్ణనకు ఎంత దగ్గరగా ఉందో గమనించండి. కంటికి కనిపించని ఒక సూక్ష్మక్రిమి, ప్రపంచం మొత్తాన్ని గదుల్లో బంధించింది. వైద్యం లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రహ్మంగారు చెప్పింది కేవలం ఒక రోగం గురించి కాదు. భవిష్యత్తులో బయోలాజికల్ వార్‌ఫేర్ అంటే, జీవాయుధాల దాడి వల్లా, ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరించడం వల్లా, కొత్త రోగాలు పుట్టుకొస్తాయని ఆయన ముందే దర్శించారు. 'రక్తపు వాంతులతో జనాలు చనిపోతారు... విషవాయువులు గాలిలో కలుస్తాయి' అని ఆయన రాసిన పంక్తులు, నేటి కాలుష్యానికి, మరియు ఫ్యాక్టరీల నుండి వెలువడే విషవాయువుల వల్ల వస్తున్న క్యాన్సర్ల వంటి రోగాలకూ, ప్రత్యక్ష ఉదాహరణ.
ఇక పుణ్యక్షేత్రాల గురించి ఆయన చెప్పిన కాలజ్ఞానం వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం:
2.'కంచి కామాక్షి అమ్మవారి విగ్రహం కన్నీరు కారుస్తుంది.'
3.'శ్రీశైల మల్లికార్జునుని ఆలయంలోకి క్రూరమృగాలు ప్రవేశిస్తాయి. అక్కడ ఒక వింత పువ్వు పూస్తుంది.'
4.'తిరుమల ఏడుకొండల వాడి ఆలయం కొన్ని రోజుల పాటు మూతపడుతుంది.' ఇది కరోనా సమయంలో 80 రోజుల పాటు భక్తులకు స్వామి వారి దర్శనం నిలిపివేసిన ఘటనను గుర్తుచేస్తుంది. భక్తులకు దర్శనాలు లేకపోయినా, ఆగమ శాస్త్రం ప్రకారం గర్భాలయంలో స్వామివారికి జరిగే నిత్య పూజలు, కైంకర్యాలను, అర్చకులు ఏకాంతంగా, యథావిధిగా నిర్వహించారు.
'అడవులు నశిస్తాయి, కొండలు పగులుతాయి, నదులు ఎండిపోయి ఎడారులుగా మారుతాయి... సముద్రాలు ఉప్పొంగి తీర ప్రాంతాలను మింగేస్తాయి.' నేడు మనం వింటున్న గ్లోబల్ వార్మింగ్ (Global Warming), సముద్ర మట్టాలు పెరగడం, సునామీలూ, అన్నీ ఇందులో భాగమే. వాతావరణ సమతుల్యత దెబ్బతిని, వర్షాలు పడాల్సిన సమయంలో ఎండలు, ఎండలు కాయాల్సిన సమయంలో వరదలు వస్తాయని, ఆయన ఎప్పుడో చెప్పారు. సామాన్య శకం 21వ శతాబ్దంలో మనం చూస్తున్న ప్రకృతి వైపరీత్యాలు దీనికి సజీవ సాక్ష్యాలు.
ఎప్పుడైతే ధర్మం పూర్తిగా నశించిపోతుందో, మనిషిలోని రాక్షసత్వం శిఖరాగ్రానికి చేరుతుందో... అప్పుడు వస్తాడు వీరభోగ వసంతరాయలు!
బ్రహ్మంగారు తన గ్రంథాల్లో అత్యంత వివరంగా వర్ణించిన ఘట్టం ఇదే. 'కలియుగంలో పాపం పెరిగిపోయి, న్యాయం, ధర్మం అనేవి పుస్తకాలకే పరిమితమైనప్పుడు, నేను వీరభోగ వసంతరాయలుగా మళ్ళీ జన్మిస్తాను' అని ఆయన స్వయంగా ప్రకటించారు. వీరభోగ వసంతరాయలు ఎప్పుడు వస్తారు? దాని సంకేతాలు ఏమిటి?.. 'ఆకాశంలో 13 రోజులు పగలు, 13 రోజులు రాత్రి ఉండే సమయం వస్తుంది. నక్షత్రాలు రాలిపడతాయి (ఉల్కాపాతాలు). గ్రహాల గతుల్లో భారీ మార్పులు వస్తాయి.' ఈ ఖగోళ మార్పులు జరిగినప్పుడు, శ్రీ మహావిష్ణువు పదవ అవతారమైన కల్కి అవతారానికి ప్రతీకగా, వసంతరాయలు ఉద్భవిస్తారు.
ఎప్పుడైతే ధర్మం పూర్తిగా నశించిపోతుందో, మనిషిలోని రాక్షసత్వం శిఖరాగ్రానికి చేరుతుందో... అప్పుడు వస్తాడు ఆ వీరభోగ వసంతరాయలు! బ్రహ్మంగారు తన గ్రంథాల్లో అత్యంత వివరంగా వర్ణించిన ఘట్టం ఇదే. 'కలియుగంలో పాపం పెరిగిపోయి, న్యాయం ధర్మం అనేవి పుస్తకాలకే పరిమితమైనప్పుడు, నేను వీరభోగ వసంతరాయలుగా మళ్ళీ జన్మిస్తాను' అని ఆయన స్వయంగా ప్రకటించారు.
కానీ ప్రాచీన గ్రంథాల ప్రకారం ఆయన రాక (Arrival) ఒక సాధారణ సంఘటన కాదు. అది ఒక విశ్వ ప్రణాళిక. ఆ మహాపురుషుని ఆగమన సమయంలో పంచభూతాలు అల్లకల్లోలం అవుతాయి. ఆకాశంలో 13 రోజులు పగలు, 13 రోజులు రాత్రి ఉండే వింత సమయం వస్తుంది. దిక్కులు తప్పుతాయి, నక్షత్రాలు రాలిపడతాయి. అప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన 'ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే' అన్న మాటకు అక్షర రూపంగా, సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు పదవ అవతారమైన కల్కికి ప్రతీకగా, శ్వేత అశ్వంపై చేతిలో ఖడ్గంతో వీరభోగ వసంతరాయలు ఉద్భవిస్తారు.
ఆయన వచ్చి ఏం చేస్తారు? ఆయన రాకతో ఈ భూమిపై ఉన్న పాపులందరూ ఆ ఖడ్గానికి బలవుతారు. డబ్బు, అధికారం, అహంకారం ఉన్నవాళ్ళెవరూ మిగలరు. ఆస్తులన్నీ మట్టిలో కలిసిపోతాయి. కేవలం సత్యం, ధర్మం, మరియు భగవంతునిపై అచంచలమైన విశ్వాసం ఉన్న సాధు సజ్జనులు మాత్రమే ఆ ప్రళయం నుండి రక్షించబడతారు.
ఆ మహా ప్రక్షాళన తర్వాత మొదలయ్యేదే వసంతరాయల ధర్మ పాలన!
బ్రహ్మంగారి కాలజ్ఞానం మరియు ప్రాచీన తాళపత్రాల ప్రకారం, వసంతరాయల పాలనలో భూమిపై సరికొత్త శకం, అనగా స్వర్ణయుగం మళ్లీ ప్రారంభమవుతుంది. ఆయన ఏకచ్ఛత్రాధిపత్యంగా దాదాపు 108 సంవత్సరాల పాటు ఈ భూమండలాన్ని పాలిస్తారని గ్రంథాలు చెబుతున్నాయి. ఆయన పాలనలో ప్రపంచ రాజధానిగా శ్రీశైలం లేదా కందిమల్లాయపల్లె మారుతుందనీ, అక్కడి నుండే ధర్మ చక్రం తిరుగుతుందనీ ఒక విశ్వాసం.
ఈ నూతన యుగంలో ధర్మస్థాపన ఎలా జరగబోతోందో వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. వసంతరాయల పాలనలో కుల, మత, వర్గ, వర్ణ భేదాలు ఏవీ ఉండవు. మానవులంతా ఒకే జాతిగా, ఒకే కుటుంబంగా జీవిస్తారు. పాలకుడు, పాలితుడు అనే తారతమ్యం లేకుండా, అంతా దైవభక్తితో మెలుగుతారు. మనుషుల మధ్య మోసం, కుట్రలు, ఈర్ష్య, ద్వేషాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి.
అంతేకాదు, ప్రకృతి కన్నతల్లిలా మనుషులను పోషిస్తుంది. మానవుడు భూమిని క్రూరంగా తవ్వి దున్నాల్సిన అవసరం లేకుండానే, కాలకాలానికి వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పండుతాయి. వృక్షాలు ఎల్లప్పుడూ ఫలాలను ఇస్తాయి. రోగాలు, వ్యాధులు అన్నవి ఉండవు. వసంతరాయల రాజ్యంలో 'ఆవు, పులి ఒకే రేవులో నీరు తాగుతాయి' అని బ్రహ్మంగారు వర్ణించారు. అంటే సమాజంలో క్రూరత్వం అన్నది నశించి, బలవంతుడు బలహీనుడిని పీడించే వ్యవస్థ పోయి, సకల ప్రాణుల మధ్య పరమ శాంతి వెల్లివిరుస్తుందని దీని అర్థం. వేదాలు, ఉపనిషత్తులు మళ్లీ ప్రాణం పోసుకుంటాయి. భూమి మీద నడిచే ప్రతి అడుగూ సత్యం వైపే ఉంటుంది, పలికే ప్రతి మాటా ధర్మమే అవుతుంది.
ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదిలే అతి పెద్ద ప్రశ్న... అసలు ఆ వీరభోగ వసంతరాయలు ఏ సంవత్సరంలో వస్తాడు? ఆయన రాకకు కచ్చితమైన తేదీ ఏమైనా ఉందా?
బ్రహ్మంగారు తన తాళపత్రాల్లో ఆయన ఆగమన సమయాన్ని కచ్చితంగా లిఖించారు. కానీ... ఆయన నేటి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి, ఫిబ్రవరి అని కాకుండా, మన సనాతన తెలుగు సంవత్సరాలు మరియు గ్రహాల గతుల ఆధారంగా ఆ కాలాన్ని లెక్కించారు. గ్రంథాలను లోతుగా పరిశీలిస్తే తెలిసిన ముఖ్యంశాలు ఏంటో చూద్దాము..
మొదటి ఆధారం: 'కలియుగం ఐదు వేల సంవత్సరాలు గడిచిన తరువాత ధర్మ గ్లాని పతాక స్థాయికి చేరుకుంటుంది.' కలియుగం ప్రారంభమైంది సామాన్య శక పూర్వం (BCE) 3102లో. దీని ప్రకారం సామాన్య శకం 1899 నాటికి ఆ ఐదు వేల ఏళ్లు పూర్తయ్యాయి. అంటే, వసంతరాయల ఆగమనానికి సంబంధించిన కౌంట్ డౌన్ (Countdown) ఎప్పుడో మొదలైపోయింది. ఈ లెక్కన మనం ఇప్పుడు ఆ మహాయుగాంతపు ఆఖరి అంకంలో ఉన్నామా!?
రెండవ ఆధారం - గ్రహ గతులు: ఆయన వచ్చే సమయానికి ఆకాశంలో వింతలు జరుగుతాయని కాలజ్ఞానం చెబుతోంది. ఒకే నెలలో అనగా పదిహేను రోజుల వ్యవధిలోనే సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం రెండు సంభవిస్తాయి. అలాగే, ఒకే రాశిలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు చేరుతాయి (అష్ట గ్రహ కూటమి). ఇవన్నీ ప్రళయానికీ, వసంతరాయల రాకకూ ముందస్తు హెచ్చరికలు.
మరి ఆ రాబోయే సంవత్సరం ఏది? కాలజ్ఞాన గ్రంథాల్లో 'క్రోధన', 'విశ్వావసు', 'పరాభవ', 'ప్లవంగ', 'పింగళ' మరియు 'ఆనంద' నామ సంవత్సరాల ప్రస్తావనలు బలంగా ఉన్నాయి. ఈ సంవత్సరాలలో ప్రకృతి ప్రకోపిస్తుంది, మూడవ ప్రపంచ యుద్ధ వాతావరణం నెలకొంటుంది అని స్పష్టంగా ఉంది.
ఆధునిక పరిశోధకులు మరియు ప్రాచీన గ్రంథాలను విశ్లేషించే పండితుల అంచనా ప్రకారం... సామాన్య శకం 2025 నుండి సామాన్య శకం 2050 మధ్య కాలంలో ఈ యుగాంతపు ఛాయలు మరియు వసంతరాయల ఆగమన సంకేతాలు శిఖరాగ్రానికి చేరుకుంటాయి. ముఖ్యంగా రాబోయే 'పింగళ' నామ సంవత్సరం మరియు 'కాలయుక్తి' నామ సంవత్సరాలలో ప్రపంచం ఊహించని, సైన్స్ కూడా సమాధానం చెప్పలేని విపత్కర పరిణామాలను చూస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.
దీని అర్థం ఏమిటి? ఆయన ఆగమనం ఒకే రోజులో జరిగే మ్యాజిక్ కాదు. అదొక ప్రక్రియ. బహుశా ఆయన రాక ఇప్పటికే ప్రారంభమై ఉండవచ్చు! ఈ భూమి మీద ఎక్కడో ఒక చోట, సత్యయుగ స్థాపన కోసం తన కర్తవ్యాన్ని ప్రారంభించడానికి ఆ కల్కి అవతారం సమాయత్తం అవుతూ ఉండవచ్చు. కాలం పరిపక్వమైనప్పుడూ, తారలు అనుకూలించినప్పుడూ, ఒక మహా దివ్య తేజస్సుతో... ప్రపంచానికి తన ఉనికిని చాటుతాడు, ఆ వీరభోగ వసంతరాయలు!
చివరగా, ఇక్కడ మనం మరో ముఖ్యమైన సత్యాన్ని అర్థం చేసుకోవాలి. కల్కి అనేది దేశవ్యాప్తంగా ఉన్న ప్రాచీన హిందూ పురాణాలలో చెప్పబడిన శ్రీమహావిష్ణువు దశమ అవతారం కాగా, వీర భోగ వసంత రాయలు అనేది మన తెలుగు నేలపై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం ద్వారా ప్రాచుర్యం పొందిన దైవిక పురుషుని నామం.
అయితే ఇద్దరి ఉద్దేశ్యం, లక్ష్యం ఒక్కటే... అదే లోకకళ్యాణం మరియు ధర్మసంస్థాపన! అందుకే, చాలా మంది భక్తులు, ఆధ్యాత్మిక పండితులు ఈ ఇద్దరూ ఒక్కరే అని, భవిష్యత్తులో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం రాబోయే ఆ ఒకే మహాశక్తికి ఉన్న వేర్వేరు పేర్లు ఇవని, ప్రగాఢంగా విశ్వసిస్తారు. పేరు ఏదైనా, రూపం ఏదైనా... రాబోయే ఆ దైవశక్తి భూమిపై తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తుందన్నది మాత్రం అక్షర సత్యం.
మిత్రులారా... కాలజ్ఞానం అంటే మనల్ని భయపెట్టడానికి రాసిన పుస్తకం కాదు. మనిషి తన తప్పులను తెలుసుకుని, ధర్మ మార్గంలో నడవాలని చేసిన ఒక గొప్ప హెచ్చరిక. సామాన్య శకం 17వ శతాబ్దంలో జీవించిన ఒక మహాయోగి, నేటి సామాజిక, భౌతిక, వాతావరణ పరిస్థితులను అక్షరం పొల్లుపోకుండా ఎలా దర్శించగలిగారు అనేది సైన్స్‌కు కూడా అంతుచిక్కని ఒక అద్భుతం.
మనం గమనించాల్సింది, ప్రళయం వస్తుందని భయపడటం కాదు. ప్రకృతిని కాపాడుకుంటూ, తోటి మనుషులతో ప్రేమగా ఉంటూ, ధర్మబద్ధమైన జీవితం గడపడం. బ్రహ్మంగారి బోధనల సారాంశం అదే!
బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించీ, అందులోని అద్భుత సత్యాల గురించీ మీరేమనుకుంటున్నారో, కింద కామెంట్స్ లో పంచుకోండి. ఈ వీడియో మీకు జ్ఞానోదయం కలిగించిందని భావిస్తే... వెంటనే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన చారిత్రక, ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అవకాశం ఉన్నవారు వీడియోను Hype చేస్తారని ఆశిస్తున్నాను.
మరణ రహస్యం - ప్రాచీన గ్రంథాల ఆంతర్యం! మార్కండేయుడు మృత్యువును ఎలా జయించాడు? 🔱 శివుడు యముడిని ఎందుకు ఆపాడు? The Secret of Death: You Won't Believe How This 16-Year-Old Conquered Death!
ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి తప్పనిసరిగా ఎదురయ్యే ఒకే ఒక్క కఠోర సత్యం, ‘మరణం’. మరి మరణం అంటే నిజంగా ముగింపేనా..? ప్రాచీన భారతీయ గ్రంథాలు మరణాన్ని ముగింపుగా కాకుండా, కేవలం ఒక 'స్థితి మార్పు' గా మాత్రమే వర్ణించాయి. ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలలో మరణం గురించి అత్యంత లోతైన విశ్లేషణ కనిపిస్తుంది.
ఈరోజు మనం మన ఛానెల్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని చర్చించబోతున్నాం. ప్రాచీన ఋషులు మరణాన్ని ఎలా జయించారు, మరణ భయాన్ని ఎలా అధిగమించారు? ఈరోజు మనం చారిత్రక ఆధారాలు, మరియు అద్భుతమైన మన ప్రాచీన గ్రంథాల ఆధారంగా ఈ నిగూఢ సత్యాలను ఛేదించబోతున్నాం.
ప్రపంచ సాహిత్యమంతటినీ ఒకసారి నిశితంగా గమనిస్తే, ప్రాచీన భారతీయ వాఙ్మయంలో జరిగినంతగా మృత్యువు గురించిన శోధన మరెక్కడా జరగలేదని మనకు అర్థమవుతుంది. మన ఉపనిషత్తులు, భగవద్గీత మరియు భాగవత పురాణం వంటి ఉత్కృష్టమైన గ్రంథాలు, మరణం అంటే భయపడాల్సిన ముగింపు కాదనీ, అదొక సహజమైన స్థితి మార్పు మాత్రమేననీ, అత్యంత స్పష్టంగా ఆవిష్కరించాయి.
ఈ జనన మరణాల చక్రాన్ని ఛేదించి, మృత్యువు వెనుక ఉన్న అసలైన రహస్యాన్ని తెలుసుకోవడానికి మన పురాణాలు ప్రధానంగా మూడు అద్భుతమైన గాథలను మనకు అందించాయి. అవే కఠోపనిషత్తులో వివరించబడిన యమ-నచికేతుల వృత్తాంతం, సావిత్రీదేవి ప్రాతివ్రత్య మహిమను చాటే సతీసావిత్రి ఉపాఖ్యానం మరియు అకాల మృత్యువును జయించిన మార్కండేయుని చరిత్ర. ఈ రోజు మనం ఇందులో అత్యంత కీలకమైన, మనందరికీ ఎంతో ఆవశ్యకమైన మార్కండేయుని ప్రయాణాన్నీ, అందులో ఆ శివానుగ్రహం వెనుక ఉన్న అసలైన మర్మాన్నీ తెలుసుకోబోతున్నాం.
వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
అసలు మనిషికి మరణం ఎందుకు వస్తుంది? మన ప్రాచీన వేదాంతం ప్రకారం, 'నేను' అనే అహంకారం (Ego) నశించినవాడికి మరణం లేదు. మట్టితో చేసిన కుండ పగిలిపోవచ్చు. కానీ మట్టి శాశ్వతం.. అలాగే సముద్రపు అలలు శాశ్వతం కాదు. సముద్రం శాశ్వతం. మనం భౌతిక శరీరాన్నే 'నేను' అని భ్రమించడం వల్లనే, మరణ భయం ఏర్పడుతుంది. కులము, మతము, పేరు, ఇవన్నీ మనం కృత్రిమంగా ఏర్పరచుకున్నవే కానీ, మనలోని ఈశ్వరాంశ శాశ్వతమైనది అని గ్రంథాలు వివరిస్తున్నాయి.
భృగు మహర్షి వంశంలో జన్మించిన ధాత కుమారుడే మృకండు మహర్షి. మృకండు మహర్షికీ, ఆయన భార్య మనస్వినికీ సంతానం కలగకపోవడంతో, వారు ఏకకాలంలో హరిహరులను (శివ-కేశవులను) ఆరాధిస్తూ తీవ్ర తపస్సు చేశారు.
మృకండు మహర్షి చేసిన ఈ తపస్సులో మనం గమనించాల్సిన ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఆయన కేవలం శివుడిని లేదా విష్ణువును విడివిడిగా ఆరాధించలేదు. శివుని హృదయంలో విష్ణువును, విష్ణువు హృదయంలో శివుడిని ఏకకాలంలో దర్శిస్తూ తపస్సు చేశారు. ప్రాచీన గ్రంథాల ప్రకారం 'హరి' అనగా మాయతో కూడి సృష్టిలోనికి దిగివచ్చిన దైవం అని, 'హర' అనగా ఆ మాయకు అతీతమైన తత్త్వం అని అర్థం. ఒకే పరమాత్మ సృష్టిలో వ్యవహరించడానికి దిగివస్తే హరి అవుతాడు, దిగిరాకపోతే హరుడు అవుతాడు. హరిహరుల మధ్య ఎలాంటి భేదమూ లేదనే ఈ విశాలమైన అద్వైత భావనతో తపస్సు చేయడం వల్లనే, మృకండు మహర్షికి దైవ సాక్షాత్కారం సులభంగా జరిగింది.
అలా వారు శివుని హృదయంలో విష్ణువునూ, విష్ణువు హృదయంలో శివుడిని దర్శిస్తూ తపస్సు చేసినప్పుడు, వారి భక్తికి మెచ్చి శివుడు వరం ఇవ్వడానికి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శివుడు వారికి సకల సుగుణాలూ కలిగిన ఒక కుమారుడిని ప్రసాదించాడు. అయితే, అత్యంత గుణవంతుడైన ఆ బాలుడికి కేవలం 16 సంవత్సరాల ఆయుష్షు మాత్రమే ఉంటుందనీ, అతడే మార్కండేయుడనీ దైవ నిర్ణయం జరుగింది.
16 ఏళ్ల వయస్సు దగ్గర పడుతున్న కొద్దీ, తల్లిదండ్రులు తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. అప్పుడు మార్కండేయుడు ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన సత్యాన్ని ప్రకటించాడు. తాను బ్రతికి ఉండాలని అనుకోవడం స్వార్థం కోసం కాదనీ, తన కోసం ఎన్నో కష్టాలు పడిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో సేవించుకోవడానికీ, మరియు లోక శ్రేయస్సు కోసమే తను జీవించాలనీ భావించాడు.
అసలు మన జీవితం కేవలం మనది మాత్రమే కాదు.. మన ప్రవర్తన మన పూర్వీకులనూ, మరియు రాబోయే తరాలను కూడా ప్రభావితం చేస్తుందని, ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. శ్రీరాముడు రామాయణంలో చెప్పినట్లుగా, ప్రతి మనిషి జీవితం, మొత్తం ఏడు తరాల కథ. మనకు ముందున్న మూడు తరాలు, మన తర్వాత రాబోయే మూడు తరాలు, వాటికి మధ్యలో ఉన్న మన ప్రస్తుత తరం కలుపుకుంటే, మొత్తం ఏడు తరాలు అవుతాయి. దీనిని గ్రంథంలో అద్భుతంగా ఒక వీణతో పోల్చారు. ఏడు తీగలు ఉన్న వీణలో, మధ్యలో ఉన్న తీగను సరిగ్గా శృతి చేస్తేనే, ఆ వీణ నుండి అద్భుతమైన సంగీతం వెలువడుతుంది. అదే విధంగా, మధ్యలో ఉన్న మనం ధర్మబద్ధంగా, యజ్ఞార్థంగా జీవిస్తేనే, అటు మన పూర్వీకులకు, ఇటు రాబోయే తరాలకు కూడా పుణ్యం లభిస్తుంది. మార్కండేయుడు సరిగ్గా ఇదే సత్యాన్ని గ్రహించి, తన తల్లిదండ్రుల సద్గతుల కోసం, ముందు తరాలకు హాని జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే, మృత్యుంజయ తపస్సుకు పూనుకున్నాడు.
•తమ కోసం తాము తపస్సు చేసి భస్మాసురుడు, హిరణ్యకశిపుడి వంటి వారు మరణాన్ని జయించలేకపోయారు.
•కానీ, మార్కండేయుడి తపస్సు తన కోసం కాదు. ఇతరుల శ్రేయస్సు కోసం సాగింది.
•జీవితంలో ఎప్పుడైతే ఒక దివ్యమైన ప్రయోజనం కోసం మనిషి బ్రతుకుతాడో, అప్పుడు ప్రకృతి కూడా అతనికి సహకరిస్తుంది.
సమయం ఆసన్నమైనప్పుడు సాక్షాత్తూ యమధర్మరాజు మార్కండేయుని ప్రాణాలు తీయడానికి వచ్చాడు. కానీ అప్పటికే మార్కండేయుడు శివతత్త్వంతో మమేకమై ఉన్నాడు. తాను బయట చూసినా, లోపల చూసినా అంతటా శివుడినే దర్శించాడు. చివరకు అతనికి యముడు కూడా శివుడిలాగానే దర్శనమిచ్చాడు. ఆ తన్మయత్వ స్థితిలో యముని పాశం మార్కండేయుడిని ఏమీ చేయలేక పోయింది.
ఇక్కడ మనం పౌరాణికంగా అర్థం చేసుకోవాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం మరొకటి ఉంది. యమధర్మరాజు అనగానే మనకు ఒక భయంకరమైన రూపం గుర్తుకొస్తుంది. కానీ, యముడు అంటే సృష్టిలో ప్రతి జీవికీ ఒక పరిధినీ, (Limits) మరియు నియమాన్నీ నిర్దేశించేవాడు మాత్రమే. నియమబద్ధమైన, మరియు ధర్మబద్ధమైన జీవితం గడిపే వాడికి, యముడు భయంకరుడు కాదు.. ఆయనొక మిత్రుడు.
మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి యముడు పాశం విసరగనే జరిగిన అద్భుతం, లోపల, బయట, సమస్త ప్రకృతిలో శివుడినే చూస్తున్న మార్కండేయుడికి, యముడు కూడా ఒక శివ స్వరూపంగానే కనిపించడం. అలాగే, అంతటి తన్మయత్వ స్థితిలో ఉన్న మార్కండేయుని చూసిన యముడికీ, ఆ బాలుని స్థానంలో సాక్షాత్తూ పరమశివుడే దర్శనమిచ్చాడు. దీనినే ప్రాచీన ఋషులు 'దర్శన జ్ఞానం' అన్నారు. మనసుతో గ్రంథాలు చదివితే కేవలం అక్షరాలు మాత్రమే తెలుస్తాయి. కానీ యోగ దృష్టితో ఆరాధిస్తే, కళ్ళెదురుగా ఉన్న ప్రతి మనిషిలోనూ, ప్రతి వస్తువులోనూ, ఆ పరమాత్మ దర్శనం కలుగుతుంది! ఆ అనన్యమైన భక్తికి తలవంచి, సాక్షాత్తూ యమధర్మరాజే వెనుదిరిగి వెళ్ళిపోయాడు.
ఈ సందర్భంగా వెలువడినదే ప్రసిద్ధ మృత్యుంజయ మంత్రం. ఈ మంత్రంలోని ఒక వాక్యం ప్రాముఖ్యత ఎంత అద్భుతంగా ఉందో చూడండి..
"ఉర్వారుక మివబంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్"
దీని అర్థం: బాగా పండిన దోసపండు, దాని తీగ నుండి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎంత సహజంగా, సులభంగా రాలిపోతుందో... మన జీవిత కాలం ముగిసిన తర్వాత, భౌతిక శరీరం నుండి మన సూక్ష్మ శరీరం కూడా ఎలాంటి బంధనం లేకుండా అంతే స్వచ్ఛందంగా విడిపోవాలి.
మరణాన్ని దాటిన మార్కండేయుని కథ అక్కడితో ఆగిపోలేదు. శివానుగ్రహంతో మరణాన్ని జయించి, చిరంజీవిగా మారిన తరువాత కూడా, అతనికి అప్పుడప్పుడూ 'మాయ' కమ్ముతున్నట్లనిపించింది. అప్పుడు ఈ మాయా స్వరూపం ఏమిటో తెలుసుకోవాలని, ఆయన శ్రీహరిని గూర్చి మరొక సుదీర్ఘమైన తపస్సు ప్రారంభించాడు.
నిజానికి ఎంతటి మహా జ్ఞానులైనా, త్రిమూర్తులైనా సరే, మాయలో పడక తప్పదు. ఉదాహరణకు, ద్వాపర యుగంలో సాక్షాత్తూ సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ కూడా మాయకు గురై, శ్రీకృష్ణుడి లీలలను పరీక్షించడానికి, గోవులనూ మరియు పిల్లలనూ ఒక గుహలో దాచి పెట్టాడు. సృష్టి కర్తకే మాయ తప్పనప్పుడు, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? మాయను ఎవరూ తమంతట తాముగా దాటలేరు. ఆ మాయకు ఆధారమైన పరతత్త్వాన్ని, లేదా దైవాన్ని ఆరాధిస్తేనే, ఆ దైవమే మన చేతులు పట్టుకుని, మనల్ని మాయ నుండీ, మరియు మరణ భయం నుండీ బయట పడేస్తాడన్నదే, మార్కండేయుని చరిత్ర మనకు చెబుతున్న అంతిమ సత్యం.
మరణాన్ని జయించడం అంటే భౌతిక శరీరంతో శాశ్వతంగా ఉండి పోవడం కాదు. దేహంపై, ప్రాపంచిక విషయాలపై ఉన్న 'బంధాన్ని' జయించడమే, అసలైన మృత్యుంజయం. ఏ పనైనా ఫలాపేక్ష లేకుండా, లోక శ్రేయస్సు కోసం నిర్వర్తించినప్పుడు, మనిషి చిరంజీవి అవుతాడు.
ఈ వీడియోలోని విషయాలు మీకు కొత్త దృక్కోణాన్ని ఇచ్చాయని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో చారిత్రక, ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వీలున్నవారు వీడియోను Hype చేస్తారని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోండి.
ఆత్మల పునర్జన్మ - పితృ లోకం నుండి మాతృ గర్భం దాకా...! సృష్టి రహస్యం: పితృలోకం నుండి మాతృగర్భం దాకా...! గరుడ పురాణం x క్వాంటం జీవశాస్త్రం! How Souls Navigate Pitru Loka to Enter New Wombs (Garuda Purana x Quantum Biology)
మరణం... ప్రతి మనిషి భయపడే పచ్చి నిజం. ఊపిరి ఆగిపోగానే అంతా అయిపోయిందని అనుకుంటాం. కానీ, మన సనాతన ధర్మంలో గరుడ పురాణం చెబుతున్నది వేరు. మరణం అనేది ముగింపు కాదు... అదొక అద్భుతమైన ప్రయాణానికి ఆరంభం మాత్రమే!
ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ ఆలోచనా విధానాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. ఒక జీవి చనిపోయిన తర్వాత, ఆత్మ పితృ లోకానికి వెళుతుందని మనకు తెలుసు. కానీ, ఆ ఆత్మ మళ్లీ భూమి మీదకు రావడానికి, ఒక నిర్దిష్టమైన తల్లి గర్భాన్ని ఎలా ఎంచుకుంటుంది? కొన్ని కోట్ల మంది తల్లులు ఉండగా, సరిగ్గా ఆ గర్భంలోనే ఎందుకు ప్రవేశిస్తుంది?
మన ప్రాచీన గ్రంథాలలో కనిపించే ఖగోళ శాస్త్రం మరియు గణిత శాస్త్రం ఎంత ఖచ్చితమైనవో మనకు తెలుసు. అదే విధమైన ఖచ్చితత్వం, ఒక ఆత్మ కొత్త దేహాన్ని ఎంచుకునే ప్రక్రియలో కూడా ఉందంటే మీరు నమ్ముతారా? అవును, ఆకాశంలోని గ్రహాల కదలికలను లెక్కించినంత పక్కాగా, పితృ లోకం నుండి వచ్చే ఆత్మలు తమ తదుపరి జన్మను ఒక మ్యాథమెటికల్ ప్రిసిషన్ (Mathematical precision) తో డిజైన్ చేసుకుంటాయి. ఇది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు... అదొక అత్యంత సంక్లిష్టమైన 'కాస్మిక్ అల్గారిథం' (Cosmic Algorithm).
ఇది కేవలం ఒక పురాణ కథ కాదు... ఇందులో దాగి ఉన్న 'క్వాంటం బయోలాజికల్ ఫ్రేమ్‌వర్క్' (Quantum Biological Framework) మరియు 'ఎపిజెనెటిక్స్' (Epigenetics) గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కర్మ అనేది ఒక అదృశ్య శక్తి కాదు... అదొక జెనెటిక్ బార్‌కోడ్ (Genetic Barcode)! ఈ రోజు మన చానెల్ లో ఈ అంతుచిక్కని రహస్యాన్ని డీకోడ్ చేద్దాం.
వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
భౌతిక శరీరం పంచభూతాల్లో కలిసిపోయిన తర్వాత మిగిలేది 'సూక్ష్మ శరీరం' (Subtle Body). గరుడ పురాణం దీనిని 'లింగ శరీరం' అని పిలుస్తుంది. మోడరన్ క్వాంటం ఫిజిక్స్ దీనిని 'క్వాంటం ఇన్ఫర్మేషన్' (Quantum Information) అంటోంది.
సైన్స్ ప్రకారం ఎనర్జీని సృష్టించలేము, నాశనం చేయలేము (Energy can neither be created nor destroyed). మీ ఆలోచనలు, మీ కోరికలు, మీరు చేసిన పాప పుణ్యాలు అన్నీ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ (Electromagnetic frequency) రూపంలో ఈ సూక్ష్మ శరీరంలో స్టోర్ అయి ఉంటాయి.
ఒక కంప్యూటర్ లో హార్డ్ వేర్ పాడైపోయినా, అందులో ఉన్న డేటా క్లౌడ్ (Cloud) లో ఎలా సేవ్ అవుతుందో... భౌతిక శరీరం చనిపోగానే, మన కర్మల డేటా అంతా ఈ సూక్ష్మ శరీరంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ సూక్ష్మ శరీరమే పితృ లోకానికి ప్రయాణిస్తుంది.
మనం పితృ లోకం అనగానే ఆకాశంలో ఎక్కడో ఉన్న ఒక ప్రదేశం అని అనుకుంటాం. కానీ అడ్వాన్స్‌డ్ ఆస్ట్రోఫిజిక్స్, మరియు వేదాల ప్రకారం... పితృ లోకం అనేది ఒక డైమెన్షన్ (Dimension), ఒక ఫ్రీక్వెన్సీ డొమైన్.
గరుడ పురాణం ప్రకారం, ఆత్మ తన కర్మలను బట్టి ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతుంది. దీన్నే మనం 'కర్మ ఫ్రీక్వెన్సీ' అందాం. పితృ లోకంలో ఆత్మ విశ్రాంతి తీసుకుంటుంది. అంటే, తన గత జన్మల డేటాను ప్రాసెస్ చేసుకుంటుంది.
ఎప్పుడైతే భూమి మీద ఒక జంట (తల్లిదండ్రులు) కలయిక జరుగుతుందో, వారి DNA మరియు వారి మానసిక స్థితి ఒక ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. పితృ లోకంలో ఉన్న ఏ ఆత్మ యొక్క కర్మ ఫ్రీక్వెన్సీ, ఈ భూమి మీద ఉన్న జంట ఫ్రీక్వెన్సీతో 'రెజొనేట్' (Resonate) అవుతుందో... ఆ ఆత్మ ఆ గర్భం వైపు ఆకర్షించబడుతుంది. దీనినే సైన్స్ లో 'క్వాంటం ఎంటాంగిల్‌మెంట్' (Quantum Entanglement) అంటారు!
ఇప్పుడు మీకొక పెద్ద సందేహం రావచ్చు. పితృ లోకం నుండి భూమి మీదకు వచ్చేటప్పుడు, ఆత్మకు దారి చూపేది ఏమిటి? ఆకాశంలో అదృశ్యంగా ఉన్న ఆత్మకు, కరెక్ట్ గా ఆ తల్లిదండ్రులే ఎక్కడ ఉన్నారో ఎలా తెలుస్తుంది? ఇక్కడే గరుడ పురాణం మరియు ఉపనిషత్తులు 'ఋణానుబంధం' (Rinanubandha) అనే అద్భుతమైన కాన్సెప్ట్ గురించి చెబుతున్నాయి.
క్వాంటం ఫిజిక్స్ పరిభాషలో చెప్పాలంటే, ఋణానుబంధం అనేది ఒక 'క్వాంటం మాగ్నెటిక్ పుల్', (Quantum Magnetic Pull) లేదా కాస్మిక్ GPS లాంటిది. గత జన్మలలో మనం ఎవరికైతే రుణపడి ఉన్నామో, ఎవరితో అయితే మన కర్మ అకౌంట్స్ బ్యాలెన్స్ చేసుకోవాలో... ఆ వ్యక్తుల యొక్క బయో-మాగ్నెటిక్ ఫీల్డ్ (Bio-magnetic field), పితృ లోకంలో ఉన్న ఆత్మను ఒక పవర్‌ఫుల్ సూదంటురాయిలా తన వైపుకు లాగుతుంది. దానికి దూరంతో సంబంధం లేదు.
అయితే, ఆత్మ నేరుగా వచ్చి తల్లి గర్భంలో పడిపోదు. ఛాందోగ్య ఉపనిషత్తు ఈ ఆస్ట్రల్ ట్రావెల్ (Astral Travel) రూట్ ను చాలా స్పష్టంగా వివరించింది. పితృ లోకం నుండి ఆత్మ తొలుత మేఘాల ద్వారా వర్షపు బిందువుగా భూమిని చేరుతుంది. ఆ వర్షం ద్వారా పండిన ధాన్యం లేదా మొక్కల్లోకి ఆ ఆత్మ యొక్క క్వాంటం ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రతి బియ్యపు గింజపై దానిని తినేవాడి పేరు రాసిపెట్టి ఉంటుందని మనవారు ఊరికే అనలేదు..
దీన్ని మోడరన్ క్వాంటం బయోలాజికల్ ఫ్రేమ్‌వర్క్ తో పోల్చి చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది! ఒక మనిషి తినే ఆహారంలోని అణువులు (Atoms), కేవలం భౌతికమైనవి కావు. అవి ఇన్ఫర్మేషన్ క్యారియర్స్ (Information Carriers). ఆ ఆహారాన్ని తండ్రి స్వీకరించినప్పుడు, అందులో ఉన్న ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీ అతని DNA లోకి ఎంటర్ అయ్యి, అక్కడి నుండి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అంటే ఒక ఆత్మ, వర్షం మరియు ఆహారం అనే భౌతిక మాధ్యమాల ద్వారా ఇన్ఫర్మేషన్‌గా మారి ట్రావెల్ చేస్తుంది. ఎంత అద్భుతమైన సైన్స్ కదా ఇది!
ఇక్కడే అసలైన సైన్స్ దాగి ఉంది. 'ఎపిజెనెటిక్స్' (Epigenetics) అనే మోడరన్ జెనెటిక్ సైన్స్ ఏం చెబుతోందంటే... మన DNA అనేది కేవలం ఒక హార్డ్ వేర్ మాత్రమే. దానిని కంట్రోల్ చేసే సాఫ్ట్ వేర్ మన ఎమోషన్స్ మరియు మన పూర్వీకుల మెమొరీస్.
గరుడ పురాణంలో చెప్పినట్లుగా, జీవుడు తల్లి గర్భంలో పడగానే తన కర్మలను బట్టి తన శరీరాన్ని డిజైన్ చేసుకుంటాడు. అంటే, తల్లిదండ్రుల ద్వారా వచ్చే DNA ను బేస్ చేసుకుని, ఆత్మ తన గత జన్మల కర్మల (Karmic Barcodes) ద్వారా ఎపిజెనెటిక్ మార్కర్లను యాక్టివేట్ చేస్తుంది.
అందుకే ఒకే తల్లిదండ్రులకు పుట్టిన ఇద్దరు పిల్లలు పూర్తిగా భిన్నమైన లక్షణాలతో, వేరు వేరు రాతలతో ఉంటారు. ఎందుకంటే, వాళ్ళిద్దరికీ వచ్చింది ఒకే DNA అయినా... ఆ DNA ను ఆపరేట్ చేస్తున్న ఆత్మల కర్మ ఫ్రీక్వెన్సీ వేరు! ఇదంతా ఒక ప్రిసైస్ సైంటిఫిక్ రీకాలిబ్రేషన్ (Precise scientific recalibration).
గరుడ పురాణం సర్గ ఖండం లో, గర్భ ప్రవేశం గురించి ఒక అద్భుతమైన ప్రాసెస్ వివరించబడింది. తండ్రి యొక్క 'శుక్రం', తల్లి యొక్క 'శోణితం' కలిసినప్పుడు... ఆణువుల కలయిక జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో, కర్మ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిన ఆత్మ, ఆ పిండంలోకి ప్రవేశిస్తుంది.
ఏడో నెల వచ్చేసరికి, ఆ శిశువుకి పూర్తి స్పృహ (Consciousness) వస్తుంది. ఆ సమయంలో ఆ జీవుడికి తన గత జన్మలన్నీ గుర్తుకు వస్తాయి. తాను ఎందుకు ఈ జన్మ తీసుకుంటున్నాడో, ఈ గర్భాన్ని ఎందుకు ఎంచుకున్నాడో అర్థమవుతుంది. అప్పుడు ఆ జీవుడు, 'నన్ను ఈ మాయలో పడనీయకు తండ్రీ' అని భగవంతుడిని ప్రార్థిస్తాడు. కానీ బయటకు రాగానే, ఈ భూమి యొక్క మాయా శక్తి (Illusion) వల్ల అదంతా మరచి పోతాడు.
ఈ మొత్తం ప్రాసెస్ ను మనం సైంటిఫిక్ గా చూస్తే... ఒక కాస్మిక్ ఎనర్జీ, ఒక బయోలాజికల్ ఫ్రేమ్ వర్క్ లోకి ఎలా డౌన్లోడ్ అవుతుందో అర్థం అవుతుంది.
సో ఫ్రెండ్స్... పునర్జన్మ అనేది ఏదో కల్పిత కథ కాదు. అదొక లాజికల్, సైంటిఫిక్ అండ్ క్వాంటం ప్రాసెస్. మీరు ఎవరికడుపున పుట్టారో అది కాకతాళీయంగా జరిగింది కాదు. మీ కర్మలు, మీ ఫ్రీక్వెన్సీ... మీ తల్లిదండ్రుల ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయినందుకే మీరు అక్కడ జన్మించారు.
మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఒక ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీ మన DNA ని మారుస్తుంది. అదే మన తర్వాతి జన్మను డిసైడ్ చేస్తుంది. అందుకే సనాతన ధర్మం, కర్మను సరి చేసుకోమని చెబుతుంది.
ఈ అద్భుతమైన సైన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి, మరియు మన సనాతన ధర్మం యొక్క ఈ నిజమైన సైన్స్ అందరికీ తెలిసేలా షేర్ చేయండి. అవకాశమున్న వారు వీడియోని హైప్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ అండ్ సైంటిఫిక్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన టాపిక్ తో మళ్లీ కలుద్దాం...
సైన్స్‌కు అందని 'చిదంబర' రహస్యం! అది విగ్రహం కాదు.. కాస్మిక్ యాంటెన్నా!? నటరాజు పాదాల క్రింద గెలాక్సీ రహస్యం! THE COSMIC ANTENNA: CHIDAMBARAM'S GALACTIC ALIGNMENT
అంతుచిక్కని రహస్యాల నిలయం, ఈ విశాల విశ్వం... ఆధునిక సైన్స్, క్వాంటం ఫిజిక్స్ ద్వారా ఈ సృష్టి రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నిస్తుంటే, వేల సంవత్సరాల క్రితమే మన సనాతన ధర్మం, ఈ విశ్వం యొక్క 'ఆపరేటింగ్ మాన్యువల్' ను ఒకే ఒక లోహపు విగ్రహంలో నిక్షిప్తం చేసింది. అదే... చిదంబరం నటరాజ స్వామి కాంస్య (Bronze) విగ్రహం.
మన సనాతన ధర్మంలో ప్రకృతిలోని ఐదు మూలకాలకు ప్రతీకగా, ఐదు అద్భుతమైన శివాలయాలను నిర్మించారు. అవే 'పంచభూత లింగాలు'. కాంచీపురంలో పృథ్వి (భూమి), జంబుకేశ్వరంలో జలం (నీరు), అరుణాచలంలో అగ్ని, శ్రీకాళహస్తిలో వాయు (గాలి) తత్వాలను పూజిస్తే... ఈ భౌతిక మూలకాలకు అతీతమైన, అనంతమైన 'ఆకాశ తత్వానికి' (Space or Cosmic Void) సజీవ సాక్ష్యం ఈ చిదంబరం. ఆకాశం అంటే కేవలం శూన్యం కాదు, ఈ విశ్వమంతటా నిండి ఉన్న అదృశ్యమైన శక్తి క్షేత్రం (Quantum Field). సరిగ్గా ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. ఈ ఆకాశ తత్వానికి ప్రాతినిధ్యం వహించే చిదంబర క్షేత్ర నిర్మాణానికీ, మన పాలపుంత (Milky Way) గెలాక్సీ కేంద్రానికీ ఉన్న సంబంధం ఏమిటి? ఆ అనంత శూన్యంలో నిరంతరం జరిగే విశ్వ ప్రకంపనలను ఒక లోహపు విగ్రహం ఎలా గ్రహిస్తుంది?
ఈరోజు మనం ఒక మామూలు చరిత్రను మాట్లాడుకోబోవడం లేదు. నటరాజ స్వామి విగ్రహం కేవలం ఒక శిల్పం కాదా? అది విశ్వ శక్తిని గ్రహించే ఒక 'కాస్మిక్ యాంటెన్నా' (Cosmic Antenna) లాగా ఎలా పనిచేస్తుంది? వేద కాలం నాటి లోహకూర్పు (Vedic Metallurgy), ఆస్ట్రోఫిజిక్స్ ను ఎలా సమన్వయం చేస్తుందో... ఈ ప్రయాణంలో ఆధారాలతో సహా డీకోడ్ చేద్దాం!
వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
పంచభూత లింగాలలో చిదంబరం 'ఆకాశ తత్వానికి' ప్రతీక. ఆకాశం అంటే కేవలం శూన్యం కాదు, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న 'క్వాంటం ఫీల్డ్' (Quantum Field). భూమి యొక్క అయస్కాంత క్షేత్రం (Magnetic field) అత్యంత సమతుల్యంగా ఉండే భౌగోళిక ప్రదేశంలో, ఈ ఆలయాన్ని నిర్మించారు. సరిగ్గా (11°59' N) 11 డిగ్రీల 59 నిమిషాల ఉత్తర అక్షాంశం (Latitude) వద్ద ఈ ఆలయం ఉంది.
ఆలయంలోని 'పొన్నంబళం' అంటే, బంగారు పైకప్పు గల గర్భగుడి నిర్మాణం, ఒక మనిషి శరీర నిర్మాణానికీ, విశ్వ నిర్మాణానికీ అద్దం పడుతుంది. ఇక్కడున్న 21,600 బంగారు పలకలు, ఒక మనిషి రోజుకు పీల్చే శ్వాసల సంఖ్యను సూచిస్తే, వాటిని బిగించిన 72,000 మేకులు మన శరీరంలోని నాడులను సూచిస్తాయి. కేవలం పైకప్పు మాత్రమే కాదు, ఈ ఆలయ వాస్తుశిల్పం మొత్తం ఒక జీవశాస్త్ర, ఆధ్యాత్మిక ఎన్సైక్లోపీడియా! ఈ మహా దేవాలయానికి ఏకంగా 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఇవి మానవ శరీరంలో ఉండే నవ రంధ్రాలకు ప్రతీకలు. లోపల ఉన్న ‘‘కనక సభ’’ను నిలబెట్టిన 4 స్తంభాలు నాలుగు వేదాలను సూచిస్తే, పొన్నంబళంలో ఉన్న 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు అద్దం పడతాయి. పక్కనే ఉన్న మంటపంలోని 18 స్తంభాలు అష్టాదశ (18) పురాణాలనూ, పైకప్పుపై ఉన్న 9 కలశాలు తొమ్మిది రకాల శక్తులను అంటే నవదుర్గలను సూచిస్తాయి. ఇదంతా ఒక ఎత్తైతే... అసలు రహస్యం ఆ గర్భగుడి మధ్యలో ఉంది.
ఇదంతా కేవలం అంధ విశ్వాసం, పుక్కిటి పురాణాలు అనుకునేవారికి ఆధునిక సైన్స్ ఒక దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఏకంగా ఎనిమిదేళ్లకు పైగా పరిశోధనలు చేసి నిర్ధారించిన ఒక పచ్చి నిజం ఏమిటో తెలుసా? భూమి యొక్క అయస్కాంత క్షేత్రం (Earth's Magnetic Equator) యొక్క ఖచ్చితమైన మధ్య బిందువు (Center point)... సరిగ్గా ఆ గర్భగుడిలో, ఆనంద తాండవం చేస్తున్న నటరాజ స్వామి కాలి బొటనవేలు (Big Toe) కింద ఉంది! అవును, మీరు విన్నది అక్షరాలా నిజం.
ఆ నృత్య భంగిమను పాశ్చాత్య శాస్త్రవేత్తలు సైతం 'ది కాస్మిక్ డ్యాన్స్' (The Cosmic Dance) అని కీర్తించారు. ఈ ఒక్క నిజాన్ని సైన్స్ ఒప్పుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పడితే, తిరుమూలర్ లాంటి మన సిద్ధులు, వేల ఏళ్ల క్రితమే ఎలాంటి శాటిలైట్లు, GPS లు లేకుండా భూమికి కచ్చితమైన అయస్కాంత కేంద్రాన్ని ఎలా లెక్కగట్టారు? ఇక్కడే మొదలవుతుంది చిదంబర రహస్యం.
తిరుమూలర్ రచించిన 'తిరుమంత్రం' ప్రకారం, "అండంలో అంటే విశ్వంలో ఏది ఉందో, పిండంలో అంటే మానవ శరీరంలో కూడా అదే ఉంది." చిదంబరం కేవలం భూమికి కేంద్రం కాదు, గెలాక్టిక్ కోర్ (Galactic Core - Sagittarius A*) నుండి వచ్చే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీలకు అంటే, కంపన పౌనఃపున్యాలకు ఇది భూమిపై ఉన్న ఒక రిసీవర్.
ఈ ఆలయ నిర్మాణంలో దాగి ఉన్న సైన్స్‌ను అర్థం చేసుకోవాలంటే, మనం ముందుగా శివపురాణం మరియు 'చిదంబర మాహాత్మ్యం' చెబుతున్న గతాన్ని వెలికితీయాలి. వేల సంవత్సరాల క్రితం, ఈ ప్రాంతాన్ని 'తిల్లై వనం' (Tillai Vanam) అని పిలిచేవారు. అంటే దట్టమైన మడ అడవి.
పురాణాల ప్రకారం, దారుకావనంలో (Daruka Vanam) ఉన్న కొంతమంది ఋషులు కర్మ సిద్ధాంతమే గొప్పదనీ, దేవుడు లేడనీ అహంకారంతో ఉండేవారు. వారి అహంకారాన్ని అణచడానికి, పరమశివుడు 'భిక్షాటన మూర్తి'గా అక్కడికి వెళ్ళాడు. ఆగ్రహించిన ఆ ఋషులు మంత్రశక్తితో ఒక క్రూరమైన పులినీ, భయంకరమైన పాములనూ, చివరగా అజ్ఞానానికి ప్రతీక అయిన 'ముయలకుడు' (Muyalaka) అనే అపస్మారక పురుషుడినీ, శివుడిపై ప్రయోగించారు. కానీ, శివుడు ఆ పులి చర్మాన్ని ధరించి, పాములను ఆభరణాలుగా వేసుకుని, ఆ అపస్మారక పురుషుడిని తన కుడి పాదంతో అణగదొక్కి... ఒక మహా అద్భుతమైన నాట్యం చేశాడు. అదే సృష్టి, స్థితి, లయాలకు మూలమైన 'ఆనంద తాండవం' (Ananda Tandava).
కానీ, ఈ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ విశ్వరూప నాట్యాన్ని చూడాలని యోగ సూత్రాలను రచించిన పతంజలి మహర్షి (సాక్షాత్తూ ఆదిశేషుని అవతారం), మరియు వ్యాఘ్రపాద మహర్షి... భూమిపై ఒక నిర్దిష్టమైన బిందువు వద్ద ఘోర తపస్సు చేశారు. వారు తపస్సు చేసిన ఆ ప్రదేశం మరెక్కడో కాదు... భూమి యొక్క అయస్కాంత క్షేత్రం (Magnetic Equator), విశ్వ కేంద్రంతో అనుసంధానమయ్యే కచ్చితమైన కో-ఆర్డినేట్ (Coordinate). అదే ఈనాటి చిదంబరం గర్భగుడి ఉన్న ప్రదేశం!
అంటే పతంజలి మహర్షి లాంటి గొప్ప సైంటిస్ట్ మరియు యోగి, గెలాక్సీ కేంద్రం నుండి వస్తున్న ఆ 'ఫ్రీక్వెన్సీ'ని దర్శించారు. వారు చూసిన ఆ విశ్వ ప్రకంపనల స్వరూపమే ఆనంద తాండవం చేస్తున్న శివుడు. శతాబ్దాల తర్వాత, మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన చోళ రాజులు, ఆగమ శాస్త్రాల ఆధారంగా... ఆ మహర్షులు దర్శించిన ఆ ఫ్రీక్వెన్సీకి ఒక భౌతిక రూపాన్ని ఇచ్చారు. అలా విశ్వం యొక్క నిష్పత్తులను (Cosmic proportions) ఒకే ఒక విగ్రహంలో నిక్షిప్తం చేసే అద్భుతమైన ప్రక్రియ మొదలైంది.
ఆ ప్రక్రియే 'వేదిక్ మెటలర్జీ' (Vedic Metallurgy). అసలు ఆ పంచలోహాలను ఎలా పోతపోశారు? అది వైబ్రేషన్స్ ను ఎలా క్యాప్చర్ చేస్తుంది?
నటరాజ స్వామి విగ్రహాన్ని సాధారణ లోహంతో చేయలేదు. ఆగమ శాస్త్రాలు, శిల్ప శాస్త్రాలలో (Shilpa Shastras) పేర్కొనబడిన 'మధుచ్ఛిష్ట విధానం' (Lost-Wax casting process) ద్వారా, 'పంచలోహాలతో' (Panchaloha) దీనిని తయారు చేశారు.
ఈ పంచలోహాలుగా పేర్కొనబడే బంగారం, వెండి, రాగి, జింక్, ఇనుము/సీసం, ఐదు గ్రహాలకు, ఐదు మూలకాలకు ప్రతీకలు. ఆధునిక మెటలర్జీ (Metallurgy) ప్రకారం, ఈ ఐదు లోహాలను ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద కరిగించి, ఒకే ఆకృతిలోకి తెచ్చినప్పుడు, వాటి అణు నిర్మాణం (Molecular structure) ఒక ప్రత్యేకమైన క్వాంటం రెసొనెన్స్ (Quantum Resonance) ను ఉత్పత్తి చేస్తుంది.
అంటే, నటరాజ విగ్రహం ఒక 'పారాబోలిక్ యాంటెన్నా' తరహాలో పని చేస్తుంది. గెలాక్సీ కేంద్రం నుండి వెలువడే సూక్ష్మమైన విద్యుదయస్కాంత తరంగాలనూ, (Electromagnetic waves) మరియు కాస్మిక్ ఎనర్జీనీ, ఈ పంచలోహ విగ్రహం గ్రహించి, ఆలయం చుట్టూ ఒక శక్తి వలయాన్ని ఏర్పరుస్తుంది. ‘కంచు’ (Bronze) శబ్ద తరంగాలను ఎంత అద్భుతంగా ప్రసారం చేస్తుందో మనకు తెలుసు. అందుకే ఆలయాలలో గంటలు కంచుతో చేస్తారు. మరి సాక్షాత్తూ ఆ నటరాజు ఆకృతిలోనే ఆ ఫ్రీక్వెన్సీని లాక్ చేస్తే? అదే ప్రాచీన భారతీయ లోహకూర్పు శాస్త్రం సాధించిన విజయం!
ఇప్పుడు ఆనంద తాండవం చేస్తున్న నటరాజు ఆకృతిని (Mechanics of the idol) ఆస్ట్రోఫిజిక్స్ తో డీకోడ్ చేద్దాం.
1.తిరువాసి (The Cosmic Arch): విగ్రహం చుట్టూ ఉన్న అగ్ని వలయం, నిరంతరం విస్తరిస్తున్న విశ్వానికి (Expanding Universe) ప్రతీక.
2.ఢమరుకం (The Drum): కుడి చేతిలో ఉన్న ఢమరుకం, సృష్టికి మూలమైన శబ్దాన్ని సూచిస్తుంది. ఆధునిక భౌతిక శాస్త్రం చెబుతున్న Cosmic Microwave Background Radiation అంటే, బిగ్ బ్యాంగ్ తర్వాత మిగిలిన శబ్దం, ఈ ఢమరుక నాదమే.
3.అగ్ని (The Fire): ఎడమ చేతిలో ఉన్న అగ్ని, విశ్వం యొక్క లయానికి అంటే Destruction and Transformation కి సంకేతం. తర్మోడైనమిక్స్ (Thermodynamics) సిద్ధాంతాలు కూడా ఇదే చెబుతున్నాయి.
ఈ విగ్రహం నిష్పత్తులు (Proportions) కచ్చితమైన 'గోల్డెన్ రేషియో' (1.618) లో ఉంటాయి. నక్షత్ర రాశులు (Galaxies) ఎలాగైతే స్పైరల్ గా తిరుగుతాయో, నటరాజు నృత్య భంగిమ కూడా అదే జ్యామితిని సూచిస్తుంది. అపస్మారక పురుషుడిపై (ముయలక) నిలబడిన శివుడి కుడి పాదం గ్రావిటీకి (Gravity) ప్రతీక అయితే, గాలిలో ఉన్న ఎడమ పాదం, క్వాంటం లెవిటేషన్ లేదా మోక్షానికి (Anti-gravity/Release) ప్రతీక.
ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఫ్రిట్జాఫ్ కాప్రా తన పుస్తకం 'The Tao of Physics' లో ఏమన్నారో తెలుసా? "శివుడి నృత్యం, సబ్-అటామిక్ పార్టికల్స్ అంటే అణువుల నృత్యం, రెండు ఒకటే." The Dance of Shiva is the dancing universe; the ceaseless flow of energy going through an infinite variety of patterns, that melt into one another.
గెలాక్టిక్ కోర్ (Galactic Core) అపారమైన బ్లాక్ హోల్స్ మరియు పల్సార్ల కలయిక. అక్కడినుండి వెలువడే ఎనర్జీ పల్స్ అంటే శక్తి స్పందనలు, నటరాజు ఢమరుక నాదం యొక్క రిథమ్ కు ఖచ్చితంగా సరిపోలుతుంది. ఈ నిరంతర సృష్టి, లయాల ప్రక్రియ, (Creation and Destruction) సెకనులో లక్షవ వంతు సమయంలో, అణువుల మధ్య జరుగుతూనే ఉంటుంది. అదే ఆనంద తాండవం.
ప్రాచీన ఋషులు టెలిస్కోపులు లేకుండానే గెలాక్సీల కదలికలనూ, క్వాంటం మెకానిక్స్ నూ అర్థం చేసుకున్నారు. ఆ జ్ఞానాన్ని కాగితాలపై రాస్తే కాలగర్భంలో కలిసిపోతుందని, ఎన్నటికీ చెరగని చిదంబరంలోని 'పంచలోహ' నటరాజ విగ్రహంలో నిక్షిప్తం చేశారు!
చిదంబరం నటరాజ విగ్రహం కేవలం ఒక దేవుడి ప్రతిమ కాదు. అది సనాతన ధర్మం సృష్టించిన ఒక మహాద్భుతమైన టెక్నాలజీ (Technology). విశ్వ కేంద్రం (Galactic core) తో భూమిని అనుసంధానించే ఒక ఖగోళ యాంటెన్నా. శిల్ప శాస్త్ర నియమాలూ, పంచలోహాల క్వాంటం ప్రతిధ్వనీ, భౌగోళిక అయస్కాంత క్షేత్రం... ఇవన్నీ కలిస్తేనే 'చిదంబర రహస్యం'.
మీరు తదుపరిసారి నటరాజు విగ్రహాన్ని చూసినప్పుడు, కేవలం ఒక కళా ఖండాన్ని మాత్రమే చూడకండి. ఆ ఆకృతిలో విశ్వం పుట్టుక, నక్షత్రాల గమనం, క్వాంటం ఫిజిక్స్, అంతా దాగి ఉందని గుర్తుంచుకోండి.
ఈ వీడియో మీకు ఒక కొత్త దృక్కోణాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో లోతైన, నిగూఢమైన సనాతన ధర్మ రహస్యాల కోసం, మన 'వాయిస్ ఆఫ్ మహీధర్' (Voice of Maheedhar) ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ లో "ఓం నమః శివాయ" అని రాయడం మర్చిపోకండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్లీ కలుద్దాం.
భారతీయ సనాతన ధర్మంలో భగవంతునికంటే ముందుగా పూజింపబడే అత్యున్నత స్థానం 'గురువు'ది. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమిని మనం 'గురు పౌర్ణమి' లేదా 'వ్యాస పూర్ణిమ'గా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాం. అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగు వైపు నడిపించే గురు పరంపరకు ఆద్యుడైన వేదవ్యాస మహర్షి జన్మదినమే ఈ పుణ్యదినం. ప్రాచీన గ్రంథాలు, ఉపనిషత్తులు గురు తత్వాన్ని మరియు వ్యాస భగవానుని విశిష్టతను ఎలా వర్ణించాయో ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకుందాం.
ప్రాచీన సాహిత్యంలో 'గురు' శబ్ద పరమార్థం
సాధారణంగా మనం ఉపాధ్యాయులను లేదా విద్యను నేర్పే వారిని గురువులు అంటాం. కానీ ప్రాచీన భారతీయ వేదాంతంలో 'గురు' అనే పదానికి అత్యంత లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. అద్వయతారక ఉపనిషత్తు ప్రకారం:
"గుకారస్త్వంధకారశ్చ రుకారస్తన్నిరోధకః ।
అంధకార నిరోధాత్ గురురిత్యభిదీయతే ॥"
అర్థం: 'గు' అంటే అజ్ఞానమనే అంధకారం (చీకటి), 'రు' అంటే ఆ చీకటిని పారదోలేది లేదా నిరోధించేది. మానవుని మనస్సులోని అహంకారం, అజ్ఞానం అనే చీకట్లను సంపూర్ణంగా తొలగించి, ఆత్మజ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదించే మహనీయుడే నిజమైన 'గురువు'.
స్కంద పురాణంలోని గురు గీత గురువును త్రిమూర్తి స్వరూపంగా ఇలా కీర్తిస్తుంది:
సృష్టికర్త అయిన బ్రహ్మలా కొత్త ఆలోచనలను పుట్టిస్తూ, విష్ణువులా మనలోని జ్ఞానాన్ని కాపాడుతూ, శివునిలా మనలోని చెడును లయం చేసే పరబ్రహ్మ స్వరూపమే గురువు అని దీని సారాంశం.
వ్యాస పూర్ణిమ: వేదవ్యాసుని అమరత్త్వం
ఆషాఢ పౌర్ణమినాడే పరాశర మహర్షి మరియు సత్యవతీ దేవిల పుత్రుడైన వ్యాసుడు యమునా నదీ తీరంలోని ఒక ద్వీపంలో జన్మించాడు. నల్లని మేనిఛాయతో ద్వీపంలో జన్మించడం వల్ల ఆయనకు 'కృష్ణ ద్వైపాయనుడు' అనే నామధేయం కలిగింది. ఆయనను సనాతన ధర్మానికి మూలస్తంభంగా భావించడానికి ప్రధాన కారణాలు:
వేద విభజన: మానవుల అల్ప ఆయుష్షును, తగ్గుతున్న గ్రహణ శక్తిని ముందుగానే గ్రహించిన వ్యాసుడు, ఏకరాశిగా ఉన్న అనంతమైన వేద విజ్ఞానాన్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని నాలుగు భాగాలుగా విభజించారు. ఈ గొప్ప కార్యానికి గాను ఆయనకు 'వేదవ్యాసుడు' అనే సార్థక నామం స్థిరపడింది.
పంచమ వేద నిర్మాణం (మహాభారతం): వేదాలలోని క్లిష్టమైన వేదాంత రహస్యాలను సామాన్య ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యేలా కథలు, నీతి సూత్రాల రూపంలో 'మహాభారతం' అనే అద్భుత ఇతిహాసాన్ని అందించారు.
అష్టాదశ పురాణాలు & బ్రహ్మసూత్రాలు: 18 మహాపురాణాలను, ఉపనిషత్తుల సారసర్వస్వమైన 'బ్రహ్మసూత్రాలను' రచించి హిందూ ధర్మ పునాదులను శాశ్వతంగా పదిలపరిచారు.
అందుకే ప్రాచీన స్తోత్ర సాహిత్యం వ్యాసుని సాక్షాత్తు శ్రీమహావిష్ణువుగా కీర్తించింది:
"వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే ।
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ॥"
నేటి సమాజంలో గురు పౌర్ణమి ఆవశ్యకత
ఆధునిక యుగంలో సమాచారం (Information) అంతర్జాలంలో విరివిగా లభిస్తోంది, కానీ విజ్ఞానం (Wisdom) మరియు సంస్కారం (Character) కేవలం ఒక ఉత్తమ గురువు ద్వారా మాత్రమే లభిస్తాయి. గూగుల్ మనకు సమాధానాలు ఇవ్వగలదు, కానీ ఏ ప్రశ్న అడగాలో, జీవితాన్ని ఎలా నడుపుకోవాలో నేర్పేది గురువు మాత్రమే.
ఈ గురు పౌర్ణమి రోజున మనకు అక్షరాలు నేర్పిన ఉపాధ్యాయుల నుండి, జీవిత సత్యాలు నేర్పిన ఆధ్యాత్మిక గురువుల వరకు అందరినీ స్మరించుకుందాం. వారు చూపిన సత్ప్రవర్తన మార్గంలో నడవడమే మనం వారికిచ్చే నిజమైన గురుదక్షిణ.