Posts

Showing posts with the label అవినాశి ఆలయం

మొసలి మింగిన బాలుడు 3 ఏళ్ల తర్వాత ప్రాణాలతో ఎలా తిరిగొచ్చాడు? అవినాశి ఆలయంలోని అద్భుత ఘట్టం! Legend of Sundarar

Image
  మొసలి మింగిన బాలుడు 3 ఏళ్ల తర్వాత ప్రాణాలతో ఎలా తిరిగొచ్చాడు? అవినాశి ఆలయంలోని అద్భుత ఘట్టం! తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ 'అవినాశిలింగేశ్వర ఆలయం' (దీనినే అవినాశి అప్పర్ ఆలయం అని కూడా అంటారు) శైవ భక్తులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద కనిపించే ఒక అద్భుతమైన శిల్పం వెనుక ఉన్న ప్రాచీన పౌరాణిక గాథ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ ఘట్టమే "ముదలై వాయి పిళ్ళై" (అనగా మొసలి నోటిలోని బాలుడు). ఆనందం, విషాదం ఒకేచోట... ఎనిమిదవ శతాబ్దంలో 63 మంది శైవ నాయనార్లలో అగ్రగణ్యుడు, తేవారం కీర్తనల సృష్టి కర్త అయిన సుందరమూర్తి నాయనార్ (సుందరార్) అవినాశి గ్రామం గుండా వెళ్తున్నారు. ఆ సమయంలో ఒకే వీధిలోని రెండు ఇళ్లలో ఉన్న భిన్నమైన వాతావరణాన్ని ఆయన గమనించారు. ఒక ఇంట్లో బాలుడి ఉపనయన వేడుక (ఒడుగు) అత్యంత వైభవంగా జరుగుతుండగా, సరిగ్గా ఎదురింట్లో ఒక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన ఆ విషాదం ఆ తల్లిదండ్రుల బాధకు కారణం అడిగి తెలుసుకున్న సుందరార్ చలించి పోయారు. మూడేళ్ల క్రితం ఆ రెండు ఇళ్లలోని బాలురు స్థానికంగ...