Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, February 9, 2026

Ancient Slavic Religion & Hinduism - The Unbelievable Parallels! రష్యా అడవుల్లో భారతీయ దేవతలా?

 

హరిహరుడు: విష్ణువు (హరి) మరియు శివుడు (హర) కలిస్తే హరిహరుడు, ఇది ఇద్దరి దైవికతకు చిహ్నం.

వేల ఏళ్ల నాటి స్లావిక్ మతం మరియు హిందూ ధర్మం మధ్య ఉన్న ఆశ్చర్యకర పోలికలు, ఆధారాలు!
Ancient Slavic Religion & Hinduism - The Unbelievable Parallels!

భారతీయ సంస్కృతి కేవలం ఈ గడ్డకే పరిమితమా? లేక వేల మైళ్ల దూరంలో ఉన్న మంచు ఖండాల్లో కూడా మన వేదాల అడుగుజాడలు ఉన్నాయా? గతంలో మనం 'City of Arkaim' (ఆర్కైమ్ నగరం) గురించి మాట్లాడుకున్నప్పుడు.. రష్యా గడ్డపై ఒక పురాతన స్వస్తిక ఆకారపు నగరం, మన వైదిక యజ్ఞ కుండాల నిర్మాణ శైలిని ఎలా పోలి ఉందో చూసి ఆశ్చర్యపోయాము. ఒకవేళ మీరు ఆ వీడియోను ఇంకా చూడకపోతే, పైన ఐ-కార్డ్స్ (i-cards) లో ఇస్తున్నాను, తప్పకుండా చూడండి.

ఆర్కైమ్ అనేది కేవలం ఒక నగరం మాత్రమే కాదు, అది ఒక గొప్ప సంస్కృతికి పునాది. అయితే ఆ నగరాన్ని నిర్మించిన వారు, అక్కడ నివసించిన ప్రాచీన స్లావిక్ ప్రజలు ఆరాధించిన దేవుళ్లు ఎవరు? వారి మంత్రాలు మన వేద మంత్రాలను ఎందుకు తలపిస్తాయి? రష్యా, పోలాండ్, సెర్బియా.. ఈ దేశాల ప్రాచీన చరిత్రను లోతుగా తవ్వితే మనకు వినిపించే సత్యాలు ఏమిటి? ఈరోజుటి మన వీడియోలో.. వేల ఏళ్ల నాటి స్లావిక్ మతం, మరియు హిందూ ధర్మం మధ్య ఉన్న ఆశ్చర్య పరిచే పోలికలను, ఆధారాలతో సహా విశ్లేషించే ప్రయత్నం చేద్దాము.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/PCbdJN3ZXLA ]


ఏ సంస్కృతినైనా అర్థం చేసుకోవాలంటే ముందు వారి భాషను చూడాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, స్లావిక్ భాషలో వందలాది పదాలు నేటికీ సంస్కృతాన్ని తలపిస్తాయి. ఉదాహరణకు..

• Veda అంటే జ్ఞానం: స్లావిక్ భాషలో 'Veda' అంటే ఇప్పటికీ 'తెలుసుకోవడం' అని అర్థం.
• స్వర్గం: వారి దేవుడు 'Svarog'. ఆయన నివసించేది 'Svaroga'. మన 'స్వర్గ' లోకానికి ఇది ఎంత దగ్గరగా ఉందో చూడండి.
• అగ్ని: స్లావిక్ భాషలో 'Ogon' అంటే నిప్పు.
• మాతృ మరియు పితృ: అక్కడ 'Mat' మరియు 'Otec'. ఇది కేవలం యాదృచ్చికం కాదు. ఇది ఒకే మూలం నుండి వచ్చిన జ్ఞాన ప్రవాహం.

ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాము. స్లావిక్ పురాణాల్లో అత్యున్నత దేవుడు 'Perun' (పెరున్). ఈయన ఎవరో తెలుసా? సరిగ్గా మన 'పర్జన్యుడు' లేదా 'ఇంద్రుడు'.

1. Thunder & Lightning: ఇంద్రుడిలాగే పెరున్ ఉరుములు, మెరుపులకు అధిపతి.
2. The Great Battle: ఇంద్రుడు వృత్రాసురుడిని చంపినట్టు, పెరున్ 'వేలెస్' (Veles) అనే సర్ప రూప అసురుణ్ణి సంహరించాడు.
3. Triglav vs Trimurti: స్లావిక్ సంస్కృతిలో 'త్రిగ్లావ్' (Triglav) అనే మూడు తలల దేవుడు ఉన్నాడు. ఆయన సృష్టి, స్థితి, లయ కారకుడు. మన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి తత్వానికి ఇది ప్రతిరూపం కాదా?

ఇంకొక వింత, వారి 'Mokosh' దేవి. ఈ పేరు వినగానే మనకు 'మోక్షం' గుర్తుకు వస్తుంది. ఆమె భూమాత, సంతానానికీ మరియు విధికీ అధి దేవత.

స్లావిక్ పురాణాల్లో 'పెరున్' దేవుడు 'వేలెస్' అనే సర్పం లాంటి రాక్షసుడిని చంపాడని చెప్పుకున్నాము. ఇది మన ఇంద్రుడు వృతాసురుడిని చంపే ఘట్టాన్ని పోలి ఉంటుంది. దీనికి ఋగ్వేదంలో సాక్ష్యం చూడండి...

శ్లోకం (ఋగ్వేదం 1.32.9):
నీచావయా అభవత్ వృత్రాపుత్రేంద్రో అస్యా అవ వధర్జ్ఘబార |
ఉత్తరా సూరధరః పుత్ర ఆసీత్ దానుః శయే సహవత్సా న ధేనుః ||

ఇక్కడ వేదం 'దాను' (Danu) అనే రాక్షస మాత గురించీ, ఆమె కొడుకు వృతాసురుడి గురించీ చెబుతోంది. ఇంద్రుడు వాళ్ళను ఎలా సంహరించాడో వివరిస్తోంది. ఆశ్చర్యం ఏంటంటే.. స్లావిక్ నదులైన డాన్యూబ్ (Danube), డాన్ (Don) నదుల పేర్లు ఈ 'దాను' పేరు నుంచే వచ్చాయని భాషావేత్తల అభిప్రాయం. అంటే ఒకప్పుడు అక్కడ దానవ జాతి వారు నివసించారా?

ఇక చివరిగా, రష్యా లేదా ఉత్తర ధ్రువ ప్రాంతాన్ని మన వాళ్లు 'శ్వేత ద్వీపం' అని ఎందుకు పిలిచారో మహాభారతంలోని శాంతి పర్వం స్పష్టం చేస్తుంది.

శ్లోకం (మహాభారతం, శాంతి పర్వం):
క్షీరోదధేరుత్తరతః శ్వేతద్వీపో మహాప్రభః |
తత్ర నారాయణ ఆసక్తా నరాః శ్వేతా దీప్తిమంతః ||

క్షీర సాగరానికి ఉత్తరాన, అత్యంత కాంతివంతమైన శ్వేత ద్వీపం ఉంది. అక్కడ మనుషులు శ్వేత వర్ణంలో తెల్లగా, తేజస్సుతో మెరిసిపోతూ, నారాయణుడిని ఆరాధిస్తూ ఉంటారు.

ఆలోచించండి.. మంచుతో కప్పబడిన రష్యా ప్రాంతం, అక్కడి తెల్లని ప్రజలు, వారి ప్రాచీన విష్ణు ఆరాధన (స్లావిక్ దేవుడు 'Svarog' లేదా 'Vishnu' రూపాలు).. ఇవన్నీ ఈ శ్లోకానికి సరిగ్గా సరిపోవడం ఆశ్చర్యమే కదా?

ఈ మధ్య ఒక వెబ్ సైట్ లో ఒక అద్భుతమైన వ్యాసం చదివాను. అందులో పేర్కొన్నట్టుగా, స్లావిక్ ప్రజల 'లోక' (Loka) భావన మన వేదాల్లోని 'భువన కోశం'తో సరిపోలుతుంది. ఋగ్వేదంలో చెప్పబడిన 'ఉత్తర కురు' దేశం, సరిగ్గా ఈ స్లావిక్ ప్రాంతాలనే సూచిస్తుందని కొందరు పరిశోధకుల వాదన.

మన ఇతిహాసమైన మహాభారతంలో మరియు ఐతరేయ బ్రాహ్మణంలో, 'ఉత్తర కురు' (Uttara Kuru) అనే ప్రదేశం గురించి ప్రస్తావన ఉంది. ఇది హిమాలయాలకు ఆవల, మేరు పర్వతానికి ఉత్తరాన ఉందని వర్ణించబడింది. అక్కడ నివసించే ప్రజలు సిద్ధులనీ, వారు దేవతల అంశతో పుట్టారనీ, మన గ్రంథాలు చెబుతున్నాయి. అనేకమంది ఆధునిక పరిశోధకులు, మన స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య తిలక్ గారితో సహా, ఈ ప్రాంతం నేటి రష్యా లేదా ఆర్కిటిక్ ప్రాంతమేనని అభిప్రాయపడ్డారు. స్లావిక్ ప్రజల పూర్వీకులు ఆ ప్రాంతంలో నివసించినవారేనా? మన గ్రంథాలు 'దేవ భూమి'గా పిలిచింది ఆ ప్రాంతాన్నేనా?

ఈ ఉత్తర కురు ప్రాంతం గురించి ఐతరేయ బ్రాహ్మణం (8.14) లో స్పష్టంగా ఇలా రాయబడి ఉంది...

శ్లోకం: పరేణ హిమవంతం జనపదాః ఉత్తరకురవః ఉత్తరమద్రాః ఇతి..

దీని అర్థం – హిమాలయాలకు ఆవల అంటే ఉత్తరాన, ఉత్తర కురు, మరియు ఉత్తర మద్ర అనే దేశాలు ఉన్నాయి. హిమాలయాలకు ఉత్తరాన ఉన్న విశాలమైన భూభాగం రష్యానే కదా? ఆ రోజుల్లోనే మన ఋషులకు ఆ ప్రాంతం గురించీ, అక్కడి దేవతల గురించీ, కచ్చితమైన అవగాహన ఉందని చెప్పడానికి, ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?

మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఋగ్వేదంలో 'దను' (Danu) అనే పదం ఉంది. 'దను' అంటే నీరు లేదా ద్రవం అని అర్థం. అంతేకాదు, దక్షుని కుమార్తె మరియు కశ్యప ప్రజాపతి భార్య పేరు కూడా 'దను'. ఆమె సంతానమే 'దానవులు'. ఇప్పుడు రష్యా మరియు తూర్పు ఐరోపా మ్యాప్ చూడండి. అక్కడ ప్రవహించే అతి పెద్ద నదులైన - డాన్యూబ్ (Danube), డాన్ (Don), నీపర్ (Dnieper), వగైరా పేర్లన్నీ, ఆ సంస్కృత మూల పదం 'దను' నుండే వచ్చాయి. ఈ విషయాలు మన గత వీడియోలో కూడా చెప్పుకున్నాము. అంటే, మన పురాణాల్లోని దానవులు, చరిత్రలో ఒకానొక సమయంలో ఈ నదీ తీరాల్లో నివసించి ఉంటారా? వారే నేటి స్లావిక్ ప్రజలకు పూర్వీకులా? అనేది ఆలోచించాల్సిన విషయమే!

అలాగే, విష్ణు పురాణం మరియు మహాభారతంలోని శాంతి పర్వంలో, 'శ్వేత ద్వీపం' (White Island) ప్రస్తావన ఉంది. నారద మహర్షి నారాయణుడిని దర్శించుకోవడానికి ఈ శ్వేత ద్వీపానికి వెళ్లినట్లు కథనం ఉంది. అక్కడ ప్రజలు అత్యంత తేజస్సుతో, తెల్లని శరీర ఛాయతో, ఏకతేశ్వరోపాసకులుగా (Monotheists) ఉంటారని వర్ణించారు. ఆశ్చర్యకరంగా, స్లావిక్ మతంలో కూడా 'బెలొబోగ్' (Belobog), అంటే, 'తెల్లని దేవుడు' (White God) అనే ఆరాధన ఉంది. కాంతికీ, మంచితనానికీ ప్రతీకగా వారు ఆ దేవుడిని కొలుస్తారు. మన శ్వేత ద్వీప వర్ణనా, వారి బెలొబోగ్ సంప్రదాయం.. ఈ రెండూ ఒకే నాణేనికి బొమ్మబొరుసులా అనిపిస్తున్నాయి కదా?

వారి పండుగలు, ముఖ్యంగా సూర్య ఆరాధన అంటే Zorya, మన సూర్య నమస్కారాలకూ, మరియు సంక్రాంతి సంప్రదాయాలకూ అద్దం పడుతుంటాయి.

భాషలు వేరు కావచ్చు, ఆచారాలు మారవచ్చు. కానీ ఆత్మ భాష (Language of the Soul) మాత్రం ఒక్కటే. ఈ రెండు సంస్కృతులనూ అత్యంత బలంగా కలిపే మరో అద్భుతమైన ప్రతీక.. 'వృక్షం' (The Tree).

స్లావిక్ కాస్మోలజీ (Cosmology) ప్రకారం, ఈ విశ్వం అంతా ఒక భారీ వృక్షంపై ఆధారపడి ఉంది. సాధారణంగా ఇది ఒక భారీ 'ఓక్' (Oak) వృక్షం.

• దీని వేర్లు పాతాళంలోకి చొచ్చుకుపోతాయి.. అక్కడే మనం ఇందాక చెప్పుకున్న పాతాళ దేవుడు 'వేలెస్' (Veles) సర్ప రూపంలో నివసిస్తాడు.
• దీని కాండం (Trunk) మనం నివసించే మనుష్య లోకం.
• దీని శిఖరం (Crown) స్వర్గాన్ని తాకుతుంది.. అక్కడే ఇంద్రుడిని పోలిన 'పెరున్' (Perun) గరుడ పక్షులతో కలిసి విహరిస్తాడు. భూమి, ఆకాశం, పాతాళం.. ఈ మూడింటిని కలుపుతూ నిలబడ్డ ఆ వృక్షమే వారి విశ్వరూపం.

మన సనాతన ధర్మంలో చూస్తే, సరిగ్గా ఇదే భావన మనకు కఠోపనిషత్తులో మరియు భగవద్గీతలో కనిపిస్తుంది. గీత 15వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు, 'ఊర్ధ్వమూల మధః శాఖమ్ అశ్వత్థం ప్రాహురవ్యయమ్' అంటే.. వేర్లు పైన ఉండి, కొమ్మలు కిందకు ఉండే ఒక తలకిందులైన అశ్వత్థ వృక్షంతో, (Sacred Fig Tree) ఈ సంసారాన్ని పోల్చాడు. కనిపించే ఈ భౌతిక ప్రపంచం, కనిపించని ఆ ఆధ్యాత్మిక మూలాల నుండి పుట్టిందని, దీని అర్థం. అర్జునుడి ద్వారా కృష్ణ పరమాత్ముడు, ఈ పరమ రహస్యాన్ని మనందరికీ బోధించాడు.

మనం ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, మనకు తెలియకుండానే ఒక అలౌకిక అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే, చెట్లు కేవలం మొక్కలు మాత్రమే కాదు. అవి 'స్థిత ప్రజ్ఞత'కు చిహ్నాలు. అవి భూమిలో స్థిరంగా ఉంటూనే (Rootedness), ఆకాశం వైపు ఎదుగుతాయి (Aspiring). వేల ఏళ్ల క్రితం.. అటు స్లావిక్ అడవుల్లో అయినా, ఇటు గంగా తీరంలో అయినా.. మన పూర్వీకులు చెట్టును చూసి ఒకే సత్యాన్ని గ్రహించారు. అదే, మనం ఎదగాలంటే, మూలాలను మర్చిపోకూడదు, ఆకాశాన్ని అందుకోవాలనే ప్రయత్నమూ ఆపకూడదు.

మతం అంటే కేవలం దేవుళ్లు మాత్రమే కాదు. అది ఒక జీవన విధానం. ప్రాచీన స్లావిక్ ప్రజలు కూడా భారతీయుల లాగానే, మృతదేహాలను దహనం చేసేవారు. వారు కూడా ఆత్మలు, పునర్జన్మలను నమ్మేవారు.

మనిషి ఎక్కడున్నా, ఏ భాష మాట్లాడినా.. తన మూలాలను మర్చిపోలేడనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మరొకటి ఉండదు. అదే.. 'పితృ దేవతల ఆరాధన' (Ancestor Veneration).

మన సనాతన ధర్మంలో 'పితృ పక్షాలు' లేదా మహాలయ అమావాస్య సమయం ఎంత పవిత్రమో మనందరికీ తెలుసు. ఆ 16 రోజులు మనం మన పితృదేవతలకు ఆహారాన్ని అర్పిస్తాం (Shraddha), తర్పణాలు వదులుతాము. మనకు ఈ జన్మనిచ్చిన వారి ఋణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాము.

అచ్చు ఇలాగే... స్లావిక్ సంప్రదాయంలో కూడా 'జియాడి' (Dziady) అనే పండుగ ఉంది. 'జియాడి' అంటే స్లావిక్ భాషలో 'తాతలు' లేదా 'పూర్వీకులు' అని అర్థం. వారు కూడా చనిపోయిన వారి ఆత్మలను ఆ రోజు తమ ఇళ్లకు ఆహ్వానిస్తారు. వారికోసం ప్రత్యేకంగా వండిన ఆహారాన్ని పక్కన పెడతారు. ఆత్మలు ఆకలితో ఉండకూడదని వారి పేర్లను బిగ్గరగా పిలిచి, వారిని తలచుకుంటారు. మనం అగ్నిని (Hearth) పవిత్రంగా భావించినట్టే, వారు కూడా ఇంటిలోని పొయ్యిని పూర్వీకులకు, మనకు మధ్య వారధిగా భావిస్తారు.

ఈ పోలికలు మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తున్నాయి. మనం ఈ రోజు ఆధునిక జీవితంలో పడిపోయి ఉండవచ్చు. కానీ.. ఇంట్లో పెద్దల ఫోటోల ముందు ఒక చిన్న దీపం వెలిగించినప్పుడూ, లేదా వారి తద్దినం నాడు కాసేపు మౌనంగా వారిని తలచుకున్నప్పుడూ, మనం కేవలం ఒక ఆచారాన్ని మాత్రమే పాటించడం లేదు.

మనం ఒంటరి వాళ్ళం కాదు. తరతరాల పోరాటం, ప్రేమ, ఆశల ప్రతిరూపమే మనం. వేల ఏళ్ల క్రితం మన పూర్వీకులు పడ్డ కష్టం, వారు చూపిన ప్రేమే ఈరోజు మన ఊపిరిగా మారింది. వారు వేసిన పునాది మీదే మన జీవితం నిలబడింది. ఈ సత్యం అటు స్లావిక్ అడవుల్లోనూ, ఇటు భారతీయ నదీ తీరాల్లోనూ ఒకేలా ప్రతిధ్వనిస్తోంది.

వారి జానపద కథల్లో 'గరుడ' పక్షి వంటి అద్భుత జీవుల ప్రస్తావన ఉంది. వారు కూడా తులసి వంటి పవిత్ర మొక్కలనూ, నదులనూ పూజించేవారు. వేల ఏళ్ల క్రితమే ఇంతటి సారూప్యం ఎలా సాధ్యమయ్యింది? మనం అందరం ఒకే 'ఆర్య' అంటే శ్రేష్ట మూలం నుండి విడిపోయామా?

చరిత్ర అంటే మనకు పాఠ్యపుస్తకాల్లో చెప్పేది మాత్రమే కాదు. భూమి పొరలలో, భాషా మూలాలలో, మన రక్తంలో దాగి ఉన్న సత్యమది. స్లావిక్ మరియు హిందూ సంస్కృతుల మధ్య ఉన్న ఈ పోలికలు చూస్తుంటే, ఒకప్పుడు ప్రపంచమంతా ఒకే రకమైన ఆధ్యాత్మిక ధార ప్రవహించిందని స్పష్టమవుతోంది. అదే సనాతన ధర్మం. ఈ వీడియో మీకు నచ్చితే, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ప్రోత్సహించండి. ఇటువంటి మరిన్ని రహస్యాల కోసం మన చానెల్ ను చూస్తూనే ఉండండి..

ధర్మో రక్షతి రక్షితః

Monday, February 2, 2026

Astrology: Science or Superstition?

Lord Shiva

జ్యోతిష్యం అంటే భవిష్యత్తు చెప్పే మ్యాజిక్ అనుకుంటున్నారా? కాదు!
Astrology: Science or Superstition? Dr. Veda Vyasa’s Scientific Analysis of Ancient Vedic Astronomy.

మనం నివసిస్తున్న ఈ విశ్వం ఒక గందరగోళమా? లేక ఒక పద్ధతి ప్రకారం, ఒక లెక్క ప్రకారం నడిచే అద్భుతమైన గణితమా?

కొందరు దీన్ని "సూడో సైన్స్" (Pseudo-science) అని కొట్టిపారేస్తారు. మరికొందరు దీన్ని "దైవ వాక్కు" అని నమ్ముతారు. కానీ... వేల సంవత్సరాల క్రితమే, టెలిస్కోపులు లేని కాలంలోనే, మన ఋషులు గ్రహాల గమనాన్ని, సూర్య గ్రహణాలనూ, చంద్ర గ్రహణాలనూ సెకన్ల తేడాతో ఎలా లెక్క గట్టగలిగారు?

ఆధునిక సైన్స్ కి అంతుచిక్కని ఎన్నో రహస్యాలు మన వేదాల్లో ఉన్నాయా? అసలు జ్యోతిష్యం అంటే భవిష్యత్తు చెప్పే మ్యాజిక్ అనుకుంటున్నారా? కాదు! అది "Time and Space" కి సంబంధించిన ఒక అడ్వాన్స్డ్ సైన్స్ అని ప్రముఖ స్కాలర్, డాక్టర్ వేదవ్యాస్ గారు నిరూపించారు.

ఈ రోజుటి మన వీడియోలో... జ్యోతిష్యం వెనుక ఉన్న అసలైన సైన్స్ ని, డాక్టర్ వేదవ్యాస్ గారి పరిశోధనల ఆధారంగా, ప్రాచీన గ్రంథాల సాక్షిగా విశ్లేషిద్దాము.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/PEggOItISdg ]


ముందుగా ఒక విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకుందాము. మన సనాతన ధర్మంలో జ్యోతిష్యాన్ని "వేదస్య చక్షుః" (Vedasya Chakshu) అన్నారు. అంటే వేదాలకు ఇది "కన్ను" లాంటిది. కళ్లు లేనిదే మనిషి ఎలా సూటిగా నడవలేడో, కాలజ్ఞానం లేనిదే యజ్ఞ యాగాదులు చేయటం సాధ్యపడదు.

డాక్టర్ వేదవ్యాస్ గారి ప్రకారం, జ్యోతిష్యం కేవలం జాతకాలు చెప్పడం మాత్రమే కాదు. ఇది ఖగోళ శాస్త్రం (Astronomy).

న్యూటన్ (Newton) "లా ఆఫ్ గ్రావిటీ" (Law of Gravity) చెప్పడానికి వేల సంవత్సరాల ముందే... భాస్కరాచార్యులు "సిద్ధాంత శిరోమణి"లో భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పారు. వరాహమిహిరుడు "బృహత్ సంహిత"లో గ్రహాల కదలికలు భూమి మీద వాతావరణాన్ని ఎలా మారుస్తాయో స్పష్టంగా వివరించారు.

మరి ఆధునిక ప్రపంచం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతోంది? గ్రహాలు మన మీద ప్రభావం చూపిస్తాయా? అన్నదే అసలైన ప్రశ్న. దీనికి డాక్టర్ వేదవ్యాస్ గారు ఇచ్చిన సైంటిఫిక్ వివరణ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

సైన్స్ ఏం చెబుతోంది? సముద్రంలో అలలు ఎందుకు వస్తాయి? చంద్రుడి ఆకర్షణ శక్తి (Gravitational pull) వల్ల అని మనందరికీ తెలుసు. భూమికి ఎంతో దూరంలో ఉన్న చంద్రుడు, కోట్ల టన్నుల నీటిని పైకి లేపగలిగినప్పుడు... 70 శాతం నీటితో నిండిన మానవ శరీరం మీదా, మెదడులోని ద్రవాల మీదా ఆ ప్రభావం చూపించడా?

డాక్టర్ వేదవ్యాస్ గారు తన పుస్తకాల్లో ఒక అద్భుతమైన పాయింట్ ని రైజ్ చేశారు. ప్రతి గ్రహం (Planet) ఒక మాగ్నెట్. అవి తిరుగుతున్నప్పుడు వాటి నుంచి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ (Electromagnetic Radiation) విడుదల అవుతుంది. శని (Saturn), గురుడు (Jupiter), కుజుడు (Mars)... ఈ గ్రహాల నుంచి వచ్చే కాస్మిక్ కిరణాలు (Cosmic Rays) భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు, ఇక్కడ పుట్టిన జీవరాశుల DNA మీద ప్రభావం చూపిస్తాయి.

దీన్నే మన ఋషులు "గ్రహ దృష్టి" అన్నారు. మోడరన్ సైన్స్ ఇప్పుడు దీన్ని "Helio-Biology" లేదా "Cosmobiology" అని పిలుస్తోంది. రష్యాకి చెందిన సైంటిస్ట్ చిజీవ్ స్కీ (A.L. Chizhevsky), సూర్యుడి మీద మచ్చలు (Sunspots) వచ్చినప్పుడల్లా, భూమి మీద యుద్ధాలు, విప్లవాలు లేదా గుండెపోట్లు పెరుగుతున్నాయని నిరూపించారు.

ఇది మూఢనమ్మకమా? లేక మన ఋషులు దర్శించిన విజ్ఞానమా?

డాక్టర్ వేదవ్యాస్ గారి విశ్లేషణలో మరో ముఖ్యమైన అంశం... "కాంతి" (Light). సూర్య రశ్మిని పట్టకం అంటే Prism ద్వారా చూస్తే 7 రంగులు కనిపిస్తాయి. జ్యోతిష్యంలో ఉన్నది 7 ప్రధాన గ్రహాలు. రాహు కేతువులు ఛాయా గ్రహాలు. ప్రతి గ్రహం ఒక్కో రంగునూ, ఒక్కో ఎనర్జీనీ రిఫ్లెక్ట్ చేస్తుంది.

1. కుజుడు (Mars) - ఎరుపు (Red) - శక్తికి ప్రతీక.
2. శని (Saturn) - నీలం (Blue/Black) – నిదానానికీ, కర్మకీ ప్రతీక.

మనిషి పుట్టిన సమయాన్ని బట్టీ, ఆ సమయంలో విశ్వంలో ఉన్న ప్లానెటరీ పొజిషన్స్ ని బట్టీ (Planetary Positions)... ఆ శిశువు మీద ఏ కాస్మిక్ రంగు ప్రభావం ఎక్కువగా ఉందో చెప్పడమే "జాతక చక్రం".

దీన్ని వేదవ్యాస్ గారు "A snap-shot of the cosmic energy pattern at the time of birth" అని వర్ణించారు. అంటే, మీరు పుట్టినప్పుడు విశ్వం ఎలా ఉందో, ఆ ముద్ర మీ DNA మీద పడుతుంది. దాన్నే మనం "కర్మ" అంటాం. సైన్స్ లో "Action and Reaction" ఎలాగో... వేదాంతంలో "కర్మ సిద్ధాంతం" అలా. ఇది Fatalism అంటే, విధి కాదు... ఇది ప్యూర్ మ్యాథమాటిక్స్!

జ్యోతిష్యం నిజమా కాదా అని అడిగే వారికి... మన తెలుగు నాట పుట్టిన "నోస్ట్రడామస్" (Nostradamus), శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి "కాలజ్ఞానం" ఒక సజీవ సాక్ష్యం.

చాలామంది కాలజ్ఞానాన్ని కేవలం "జోస్యం" అనుకుంటారు. కానీ డాక్టర్ వేదవ్యాస్ గారి "Time and Space" థియరీ ప్రకారం చూస్తే... బ్రహ్మంగారు ఒక "Time Traveler". ఆయన తన యోగ దృష్టితో కాలంలో ప్రయాణించి, భవిష్యత్తులో జరగబోయేదాన్ని "Live" గా చూసి రాశారు.

17వ శతాబ్దంలో... కనీసం కిరోసిన్ దీపాలు కూడా సరిగ్గా లేని రోజుల్లో ఆయన ఏమని రాశారో చూడండి: "నీళ్ళతో దీపాలు వెలుగుతాయి." అంటే Hydroelectricity. "ఎద్దులు లేని బండ్లు నడుస్తాయి." ఇప్పుడు మనకు కనిపించే Automobiles / Trains. "కాశీ పట్నంబులోన కఠిన శబ్దాలు పుడతాయి." ఇది Bomb blasts or machinery sounds.

ఇవి ఊహలు కావు. సైన్స్ ఇంకా కనిపెట్టని టెక్నాలజీని, ఆయన తన "Conscious Mind" తో దర్శించారు. దీన్ని వేదవ్యాస్ గారు "Rishi Pragnya" అంటే Intuitive Intelligence అంటారు. కాంతి వేగం (Speed of Light) కంటే మనస్సు వేగం ఎక్కువ అని మన ఋషులు నిరూపించారు.

ఇది ఒక్క బ్రహ్మంగారితోనే ఆగిపోలేదు. మన ప్రాచీన గ్రంథాలైన "భవిష్య పురాణం" (Bhavishya Purana) మరియు "శ్రీమద్భాగవతం" (Srimad Bhagavatam) లో కలియుగం గురించి రాసిన విషయాలు చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది.

5000 సంవత్సరాల క్రితం, వ్యాసుల వారు భాగవతంలోని 12వ స్కంధంలో కలియుగ లక్షణాలు రాస్తూ... "ప్రజలు పొట్టోళ్లు అవుతారు (Physical stature decreases)," "జ్ఞాపకశక్తి నశిస్తుంది (Memory fades)," "డబ్బున్నవాడే కులపెద్ద అవుతాడు (Wealth equals Virtue)"  అని స్పష్టంగా రాశారు.

ఈ రోజు మనం చూస్తున్నది అదే కదా? కలియుగంలో "వ్యాపారమే న్యాయం" (Justice implies business) అవుతుందని ఆనాడే ఎలా చెప్పగలిగారు? ఇది మూఢనమ్మకం అయితే... ఇంత పర్ఫెక్ట్ గా ఎలా సరిపోలింది?

డాక్టర్ వేదవ్యాస్ గారు చెప్పినట్లు... "The Rishis were not magicians; they were advanced cosmic scientists." వారు గ్రహ గతులను బట్టి, మనిషి DNA మరియు బుద్ధి ఎలా మారుతుందో ముందే లెక్కగట్టారు.

కేవలం మనుషులకే కాదు, దేశాలకు, ప్రకృతికి కూడా జ్యోతిష్యం వర్తిస్తుంది. దీన్నే "మేదని జ్యోతిష్యం" అంటే, Mundane Astrology అంటారు.

బ్రహ్మంగారి కాలజ్ఞానమే కాదు... వరాహమిహిరుడి "బృహత్ సంహిత" తీసుకోండి. అందులో భూగర్భ జలాలు (Underground water) ఎక్కడ ఉంటాయో తెలుసుకోవడానికి, చెట్లనూ, పుట్టలనూ, గ్రహాలనూ ఎలా చూడాలో వివరించారు. ఈ రోజు హైడ్రాలజిస్టులు వాడుతున్న టెక్నిక్స్ కీ, వరాహమిహిరుడు చెప్పిన వాటికీ ఆశ్చర్యకరమైన పోలికలు ఉన్నాయి.

డాక్టర్ వేదవ్యాస్ గారు ఒక సందర్భంలో చెప్పారు... "మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది?" అని డేటింగ్ చేయడానికి కూడా, గ్రహ స్థితులనే ఆధారంగా తీసుకున్నారు. అది కేవలం కథ కాదు. ఖగోళ సంఘటనల రికార్డు.

ప్లూటో (Pluto) ని సైన్స్ 1930లో కనుగొంది. కానీ మన పురాణాలలోనూ, జ్యోతిష గ్రంథాలలోనూ అంతకంటే ఎంతో ముందే, ఇంకా దూరంలో ఉన్న గ్రహాల ప్రస్తావన కూడా ఉంది. ఇది ఎలా సాధ్యపడింది? వారి మనోనేత్రం (Intuitive Eye) అంత పవర్ఫుల్.

దీనికి ఒక బెస్ట్ ఉదాహరణ, ఈ సంవత్సరం (2025/2026) మన కళ్ల ముందే కనిపిస్తోంది. సాధారణంగా మనం సంక్రాంతి, జనవరి 14న వస్తుందని ఫిక్స్ అయిపోయాం. కానీ ఈ మధ్య 15న ఎందుకు వస్తోంది? రాబోయే 69 ఏళ్లు కూడా 15నే ఎందుకు రాబోతోంది?

ఇక్కడే మన పంచాంగ కర్తల మ్యాథమెటిక్స్ దాగుంది. సైన్స్ పరిభాషలో దీన్ని "Precession of Equinoxes" అంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడానికి, ప్రతి ఏటా సుమారు 20 నిమిషాల సమయం మారుతూ ఉంటుంది. ఈ 20 నిమిషాలు కూడి... కూడి... ఒక రోజంతా మారడానికి కచ్చితంగా 72 ఏళ్లు పడుతుంది.

అందుకే చరిత్రను చూస్తే...
• 1761లో మూడవ పానిపట్టు యుద్ధం జరిగినప్పుడు సంక్రాంతి జనవరి 10న వచ్చింది.
• 1863లో స్వామి వివేకానంద పుట్టినప్పుడు సంక్రాంతి జనవరి 12న వచ్చింది.
• ఇప్పుడు జనవరి 15కి మారింది.
• వచ్చే శతాబ్దంలో ఇది జనవరి 16కి మారుతుంది.

మన ఋషులు రాసిన జ్యోతిష్యం ఎంత పక్కా గణితమో (Perfect Mathematics) చెప్పడానికి, ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇది మూఢనమ్మకం కాదు. ఇది ఖగోళ గణితం!

మరి ఇంత గొప్ప సైన్స్, ఈ రోజు "మూఢనమ్మకం"గా ఎందుకు మారింది? దీనికి డాక్టర్ వేదవ్యాస్ గారు చెప్పిన సమాధానం ఒక్కటే: "శాస్త్రం ఎప్పుడూ తప్పు కాదు. దాన్ని చెప్పేవారి అజ్ఞానమే తప్పు." (The science is not wrong, the interpreter is).

ఈ రోజుల్లో చాలా మందికి జ్యోతిష్యం అంటే భయం. "శని దోషం ఉంది, ఈ రాయి పెట్టుకోండి, ఆ పూజ చేయండి" అని వ్యాపారం చేసేవాళ్ళ వల్ల... అసలైన సనాతన సైన్స్ మరుగున పడిపోయింది.

డాక్టర్ వేదవ్యాస్ గారు ఏమంటారంటే... జ్యోతిష్యం అనేది "వాతావరణ శాఖ రిపోర్ట్" (Weather Forecast) లాంటిది. "వర్షం పడుతుంది" అని వాతావరణ శాఖ చెబుతుంది. దానర్థం వర్షాన్ని ఆపే ప్రయత్నం చేయమని కాదు. ముందు జాగ్రత్తగా గొడుగు తీసుకువెళ్ళమని! అలాగే జ్యోతిష్యం కూడా... రాబోయే కష్టాన్ని ముందుగా పసిగట్టి, మానసికంగా, ఆధ్యాత్మికంగా సిద్ధపడమని చెబుతుందే తప్ప... మూఢంగా భయపడమని చెప్పదు.

పరిహారం అంటే రత్నాలు కొనడం కాదు... పరిహారం అంటే మన ప్రవర్తనను మార్చుకోవడం (Transformation of Character).

చివరగా... జ్యోతిష్యం సైన్సా? మూఢనమ్మకమా? దీన్ని గుడ్డిగా నమ్మాల్సిన పనిలేదు. అలాగని గుడ్డిగా కొట్టిపారేసే పరిస్థితీ కాదు.

డాక్టర్ వేదవ్యాస్ గారు చెప్పినట్లు... "Vedas are the recorded laboratories of ancient Rishis." ఆధునిక సైన్స్ ఇంకా ఆ స్థాయికి చేరలేదు కాబట్టి, ఇప్పుడే అవన్నీ అర్థం కాకపోవచ్చు. కానీ క్వాంటం ఫిజిక్స్ (Quantum Physics) డెవలప్ అయ్యే కొద్దీ, మన ఋషులు చెప్పిన "అంతా ఒక్కటే", Unified Field Theory అనే కాన్సెప్ట్ ని ప్రపంచం అంగీకరిస్తోంది.

జ్యోతిష్యం అనేది విశ్వంతో మనిషికి ఉన్న సంబంధాన్ని తెలిపే ఒక వారధి. దాన్ని విజ్ఞానంతో చూద్దాము... విచక్షణతో పాటిద్దాము.

మీకు ఈ విశ్లేషణ నచ్చినట్లయితే, ఈ వీడియోని లైక్ చేయండి. మన ప్రాచీన విజ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం "వాయిస్ ఆఫ్ మహీధర్" ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి.

ధర్మో రక్షతి రక్షితః

Monday, January 26, 2026

4000-Year-Old Secret: Are Iranians Actually Lost Indian Kshatriyas?

 

4000 ఏళ్ళ నాటి రహస్యం... ఇరాన్ వాళ్ళు మన క్షత్రియులేనా? పురాణాలు చెప్పిన షాకింగ్ నిజాలు!
4000-Year-Old Secret: Are Iranians Actually Lost Indian Kshatriyas?

భారతదేశానికి పశ్చిమాన ఉన్నది 'ఇరాన్' (Iran)... ఈ రోజది ఒక ఇస్లామిక్ దేశంగా మనకు తెలుసు. కానీ, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ భూమిని పాలించిన రాజుల పేర్లు, వారు పూజించిన దేవుళ్ళు, వారు మాట్లాడిన భాష... అన్నీ మన సనాతన ధర్మానికి అద్దం పట్టినట్టే ఉంటాయని మీకు తెలుసా?

ఒకప్పుడు ఇరాన్ ని 'ఆర్యానాం వైజ' (Airyanem Vaejah) అని పిలిచేవారు. అంటే 'ఆర్యుల భూమి' అని అర్థం. ఋగ్వేదం లోని మంత్రాలూ, ఇరాన్ వారి పవిత్ర గ్రంథం 'అవెస్తా' (Avesta) లోని శ్లోకాలూ దాదాపుగా ఒకటేనని చరిత్రకారులు ఎందుకు అంటున్నారు?

శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడికి, ఇరాన్ నుండి వచ్చిన పూజారులకు (Maga Brahmins) ఉన్న లింక్ ఏంటి? అసలు దేవాసుర సంగ్రామం అంటే కేవలం ఆకాశంలో జరిగిన యుద్ధమా... లేక భారత్ మరియు ఇరాన్ మధ్య జరిగిన ఒక సిద్ధాంతపరమైన విభజనా? (Ideological Split)?

ఈ రోజు చరిత్ర పుటల్లో కప్పబడిపోయిన ఆ చేదు నిజాన్నీ, మన పూర్వీకుల అడుగుజాడల్ని వెతుకుతూ... 'ప్రాచీన ఇరాన్ మరియు సనాతన ధర్మం' మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన బంధాన్ని వెలికి తీద్దాము.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/xIPUCAQCUQU ]


ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు, ఇది మన కథ!

మనం ఏదైనా విషయాన్ని నిరూపించాలంటే ముందు భాషను చూడాలి. సంస్కృతం మరియు ప్రాచీన పర్షియన్ భాష అవెస్తా (Avestan), కేవలం దగ్గరి పోలికలు కలిగిన భాషలు కాదు... అవి కవల పిల్లల వంటివి.

దీనిని 'స' మరియు 'హ' మార్పు (S to H shift) అంటారు. సింధు నదికి ఆవల ఉన్న వారిని, పర్షియన్ల భాషలో 'స' అనే అక్షరం 'హ' గా మారుతుంది కాబట్టి, 'హిందూ' అని పిలిచారు.

కొన్ని ఉదాహరణలు చూద్దాము:
1. సంస్కృతంలో 'సోమ' (Soma) యజ్ఞం ఉంటే... అవెస్తాలో అది 'హోమ' (Haoma).
2. ఏడు నదుల దేశం మనకు 'సప్త సింధు' అయితే... వారి గ్రంథాల్లో అది 'హప్త హిందు' (Hapta Hendu) గా పేర్కొనబడింది.
3. మనం 'సేన' అంటే... వారు 'హేన' అంటారు.
4. మనకు 'అసుర' (Asura) అంటే రాక్షసుడు... కానీ వారికి 'అహుర' (Ahura) అంటే దేవుడు!

అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఋగ్వేదానికీ, పర్షియన్ల పవిత్ర గ్రంథమైన 'జెండ్ అవెస్తా' (Zend Avesta) కీ చాలా విచిత్రమైన సంబంధం ఉంది. ఒక గ్రంథంలో దేవతలుగా ఉన్నవారు, మరొక గ్రంథంలో రాక్షసులుగా మారారు. అసలు ఇది ఎలా జరిగింది?

కేవలం భాష మాత్రమే కాదు... అసలు 'పర్షియా' (Persia) అనే పేరు వెనుక ఉన్న చరిత్ర తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు.
చాలా మంది 'పర్షియా' అనేది ఒక విదేశీ పదం అనుకుంటారు. కానీ అది మన సంస్కృత పదం నుండి పుట్టిందే! మన ఋగ్వేదం (Rigveda) లో 'పర్శవ' (Parśva) అనే ఒక తెగ ప్రస్తావన ఉంది. వీరు ఆ కాలంలో ఒక బలమైన యుద్ధ నిపుణులైన వంశం (Warrior Clan).

చరిత్రకారుల విశ్లేషణ ప్రకారం, ఈ 'పర్శవ' వంశమే ఏదో ఒక కారణం చేత భారతదేశం నుండి పశ్చిమ దిశగా (Westward Migration) వలస వెళ్ళింది. వారు వెళ్ళి స్థిరపడిన ప్రాంతమే నేటి ఇరాన్.

దీనికి భాషా శాస్త్రం (Linguistics) కూడా తిరుగులేని సాక్ష్యం చెబుతోంది. పదాల మార్పును గమనిస్తే, మన ఋగ్వేదంలోని 'పర్శవ' (Parśva), ప్రాచీన పర్షియన్ భాషలో 'పార్స' (Pārsa) గా మారింది. అదే గ్రీకు వాళ్ళ నోట 'పర్సిస్' (Persis) గా మారి... నేటి 'పర్షియా' (Persia) అయ్యింది.

అంటే, నేటి ఇరానీయులు ఎవరో కాదు... వేల ఏళ్ళ క్రితం ఇక్కడి నుండి వలస వెళ్ళిన మన 'పర్శవ' వంశపు వారసులే. మనం వేరు కాదు. మన రక్తమే అక్కడ ప్రవహిస్తోంది!

వేద కాలంలో, ఆర్యులు రెండు వర్గాలుగా విడిపోయారని చరిత్రకారులు మరియు పాశ్చాత్య పరిశోధకులు (Western Scholars) సైతం భావిస్తారు. ఒక వర్గం 'దేవ' ఆరాధకులు అంటే, మన పూర్వీకులు సనాతన ధర్మాన్ని పాటించేవారు. మరొక వర్గం 'అసుర' ఆరాధకులు అంటే, పర్షియన్లు లేదా ఇరానీయులు.

దీనికి బలమైన సాక్ష్యం ఇంద్రుడు. మన వేదాలలో ఇంద్రుడు (Indra) దేవతలకు రాజు, వర్షాన్ని కురిపించేవాడు, వీరుడు. కానీ ప్రాచీన ఇరాన్ గ్రంథమైన 'అవెస్తా'లో, ఇంద్రుడిని ఒక 'దెయ్యం' (Demon) లేదా దుష్ట శక్తిగా చిత్రించారు.

అలాగే, మన పురాణాలలో 'అసురులు' అంటే రాక్షసులు. కానీ ఇరాన్ వారికి ప్రధాన దైవం 'అహుర మజ్దా' (Ahura Mazda). ఇక్కడ 'అహుర' అంటే మన 'అసుర'. 'మజ్దా' అంటే 'మేధా' (జ్ఞానం) అని సంస్కృత అర్థం. అంటే వారికి దేవుడు, 'జ్ఞాన స్వరూపుడైన అసురుడు'.

దీనిని బట్టి ఏం అర్థమవుతోంది? ఒకప్పుడు ఒకే జాతిగా ఉన్న వారు, ఏదో ఒక సిద్ధాంతపరమైన లేదా రాజకీయపరమైన గొడవ వల్ల విడిపోయి ఉంటారు. అందుకే మన దేవుళ్ళు వారికి రాక్షసులయ్యారు, వారి దేవుళ్ళు మనకు రాక్షసులయ్యారు. ఇదే పురాణాల్లో 'దేవాసుర సంగ్రామం'గా వర్ణించబడిందా? అనిపిస్తోంది కదూ!

ఇవన్నీ కేవలం కథలేనా? దీనికి సాక్ష్యాలు ఉన్నాయా? అని మీరు అడగవచ్చు. సాక్ష్యం ఉంది! అది కూడా మన భారతదేశంలో కాదు... వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టర్కీ మరియు సిరియా (Turkey & Syria) సరిహద్దుల్లో.

సామాన్యశక పూర్వం 1380 (1380 BCE) నాటి 'బోగాజ్‌కోయ్' (Boghazkoy) అనే ప్రదేశంలో ఒక మట్టి పలక (Clay Tablet) దొరికింది. ఇది 'మిటాని' (Mitanni) మరియు 'హిట్టైట్' (Hittite) అనే రెండు రాజ్యాల మధ్య జరిగిన ఒప్పంద పత్రం. ఈ ఒప్పందానికి సాక్షులుగా వారు రాసిన పేర్లు, 'ఇంద్ర', 'మిత్ర', 'వరుణ', 'నాసత్య' అనబడే 'అశ్విని దేవతలు'.

బాగా ఆలోచించండి! క్రీస్తు పుట్టకముందే, ఇస్లాం మరియు క్రైస్తవం రాకముందే... నేటి సిరియా, ఇరాక్, ఇరాన్ ప్రాంతాల్లో మన వేద దేవుళ్ళను పూజించేవారు. 'మిటాని' రాజుల పేర్లు కూడా సంస్కృతంలోనే ఉండేవి. ఉదాహరణకు 'దశరథ' (Tushratta), 'ఆర్తతమ' (Artatama). ఇది మన సనాతన ధర్మం యొక్క విశ్వవ్యాప్తతకు (Global footprint) నిలువెత్తు నిదర్శనం.

ఇప్పుడు మన పురాణాల్లోకి వెళ్దాం. మన 'భవిష్య పురాణం' (Bhavishya Purana) లో ఒక ఆశ్చర్యకరమైన కథ ఉంది. ఇది ఇరాన్ కి, భారత్ కి ఉన్న లింక్ ని తేటతెల్లం చేస్తుంది.

శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు (Samba), ఒక శాపం వల్ల కుష్టు వ్యాధి (Leprosy) బారిన పడ్డాడు. నారద మహర్షి సలహా మేరకు, సూర్య భగవానుడిని ఆరాధించడానికి ఒక ఆలయాన్ని నిర్మించాడు. ద్వాపర యుగంలో నిర్మించబడిన ఆ ఆలయమే, ఈనాటి కోణార్క్ లేదా ముల్తాన్ సూర్య దేవాలయం. కానీ, ఆ ఆలయంలో పూజలు చేయడానికి స్థానిక బ్రాహ్మణులు అంగీకరించలేదు. అప్పుడు సాంబుడు సూర్యుడి ఆజ్ఞ మేరకు 'శాకద్వీపం' (Sakadvipa) నుండి ప్రత్యేక పూజారులను ఆహ్వానించాడు.

వారే 'మగ బ్రాహ్మణులు' (Maga Brahmins). చరిత్రకారులు ఈ 'శాకద్వీపం' అంటే 'సిథియా' (Scythia) లేదా పర్షియా (Iran) అనీ, 'మగ' బ్రాహ్మణులు అంటే ఇరాన్ కి చెందిన పూజారులు 'మజాయ్' (Magi/Magians) అనీ నిర్ధారించారు. ఇరాన్ పూజారులు కూడా సూర్యుడిని, అగ్నిని (Fire Worship) ఆరాధించేవారు. వారు నడుముకు 'అవ్వ్యంగ' (Avyanga) అనే పవిత్ర దారాన్ని కట్టుకునేవారు. ఇది మన ఉపనయనం లో జంధ్యం లాగా!

భవిష్య పురాణం ప్రకారం, వారు వచ్చాకే భారతదేశంలో విగ్రహ రూపంలో సూర్యారాధన (Idol worship of Sun) ప్రాచుర్యంలోకి వచ్చిందని తెలుస్తోంది. ఈనాటికీ ఉత్తర భారతదేశంలో ఉండే 'శాకద్వీపీయ బ్రాహ్మణులు' ఆ ఇరాన్ పూజారుల వారసులే అని చెబుతారు.

కేవలం భవిష్య పురాణమే కాదు, మన ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాల్లో కూడా ఇరాన్ ప్రస్తావన బలంగా ఉంది.

మహాభారత యుద్ధ (Kurukshetra War) సమయంలో, కౌరవుల తరపున పోరాడిన సైన్యంలో, 'పహ్లవులు' (Pahlavas) మరియు 'కాంభోజులు' (Kambojas) ఉన్నారు. చరిత్రకారులు ఈ 'పహ్లవులు' అనేవారే ప్రాచీన పర్షియన్లు (Ancient Persians) అనీ, వారి భాష నుండే 'పహ్లవి' (Pahlavi) అనే పదం వచ్చిందనీ చెబుతారు.

అయితే వీరు ఎవరు? అస్మదీయులా లేక తస్మదీయులా? దీనికి సమాధానం 'మనుస్మృతి' (Manu Smriti) లోని 10వ అధ్యాయం, 43-44 శ్లోకాల్లో ఉంది.

శనకైస్తు క్రియాలోపాదిమాః క్షత్రియజాతయః |
వృషలత్వం గతా లోకే బ్రాహ్మణాత్యదర్శనేన చ ||

దీని అర్థం ఏంటంటే... పౌండ్రకులు, కాంభోజులు, యవనులు, శకులు మరియు పహ్లవులు (Persians)... వీరంతా ఒకప్పుడు గొప్ప క్షత్రియులే (Kshatriyas). కానీ, సరైన వైదిక కర్మలను పాటించకపోవడం వల్లా, బ్రాహ్మణులతో సంబంధాలు తెగిపోవడం వల్లా, వారు క్రమంగా 'మ్లేచ్ఛులు'గా (Foreigners) మారిపోయారని మనువు స్పష్టంగా రాశారు.

అంటే, మన ధర్మశాస్త్రాల ప్రకారం ఇరాన్ ప్రజలు (Persians) మననుండి విడిపోయిన మన సోదర క్షత్రియులే!

ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? మీరు ఎప్పుడైనా గమనించారా... మన హిందూ దేవాలయాల్లో ఏ దేవుడి విగ్రహానికీ కాళ్ళకు చెప్పులు లేదా బూట్లు కనిపించవు. ఒక్క సూర్య భగవానుడి విగ్రహానికి (Sun God) తప్ప!

ప్రాచీన సూర్య విగ్రహాలను నిశితంగా గమనిస్తే, ఆయన మోకాళ్ళ వరకు బూట్లు (Boots) వేసుకుని ఉంటాడు. భారతీయ సంప్రదాయంలో గుడిలో బూట్లు వేసుకోవడం నిషిద్ధం కదా? మరి సూర్యుడికి ఎందుకు పాదరక్షలు ఉంటాయి?

దీనికి సమాధానం వరాహమిహిరుడు రాసిన 'బృహత్సంహిత' (Brihat Samhita) లో దొరుకుతుంది (అధ్యాయం 57). విగ్రహాలను ఎలా చెక్కాలో చెబుతూ, వరాహమిహిరుడు ఇలా పేర్కొన్నాడు: 'సూర్యుడి విగ్రహాన్ని ఉదీచ్య వేషం (Northerner’s Dress) లో చెక్కాలి, ఆయన శరీరం కవర్ చేయబడి ఉండాలి, కాళ్ళకు పాదరక్షలు ఉండాలి.'

ఈ 'ఉదీచ్య వేషం' అంటే ఉత్తర దేశాల వారి దుస్తులు. ఆ కాలంలో ఇరాన్ మరియు మధ్య ఆసియా (Central Asia) లో చలి ఎక్కువగా ఉండేది కాబట్టి, అక్కడి రాజులు కోట్లు (Coats) మరియు బూట్లు ధరించేవారు. సూర్యారాధన అక్కడి (Maga Brahmins) నుండి మనకు తిరిగి వచ్చింది కాబట్టి, ఆ విగ్రహాలకు కూడా అదే పర్షియన్ ఆహార్యాన్ని మన శిల్పులు అప్పట్లో పాటించారు.

ఇది మన సనాతన ధర్మం ఎంత విశాలమైనదో, ఇతర సంస్కృతులతో మన బంధం ఎంత లోతైనదో చెప్పే ఒక అద్భుతమైన సాక్ష్యం.

విష్ణు పురాణం (Vishnu Purana) లోని రెండవ అంశంలో భూమి యొక్క వర్ణన ఉంటుంది. అందులో 'జంబూద్వీపం' (India) పక్కనే 'శాఖద్వీపం' (Shakadvipa) ఉందని చెబుతారు. అక్కడి ప్రజలు నాలుగు వర్ణాలుగా ఉంటారని విష్ణు పురాణం చెబుతుంది:

1. మృగ (Mriga) - అంటే బ్రాహ్మణులు (Maga/Magi).
2. మాగధ (Magadha) - అంటే క్షత్రియులు.
3. మానస (Manasa) - అంటే వైశ్యులు.
4. మందగ (Mandaga) - అంటే శూద్రులు.

ఆశ్చర్యం ఏంటంటే... ఈ పేర్లు ప్రాచీన ఇరాన్ సామాజిక వర్గాలకు (Social Classes of Ancient Iran) అచ్చంగా సరిపోతాయి. మనం ఎవరినైతే 'శకులు' (Sakas/Scythians) అని పిలిచామో, వారిదే ఈ శాఖద్వీపం. అంటే, మన పురాణాలకు భారతదేశం సరిహద్దుల ఆవల ఉన్న ప్రపంచం గురించి, ముఖ్యంగా ఇరాన్ గురించి క్షుణ్ణంగా తెలుసు అనడానికి ఇంతకంటే ఏం ఋజువు కావాలి?

ఆచారాల విషయానికి వస్తే, పోలికలు చూసి మీరు షాక్ అవుతారు. పార్సీలు అంటే Zoroastrians. ఇరాన్ నుండి వచ్చిన శరణార్థులు మరియు హిందువులు... ఇద్దరికీ 'అగ్ని' (Fire) అత్యంత పవిత్రం. మనం హోమం చేస్తాం, వారు 'యస్న' (Yasna) అంటే యజ్ఞం చేస్తారు. మనం ఉపనయనం చేసి పిల్లవాడికి జంధ్యం వేస్తాం. వారు కూడా 'నవజోత్' (Navjote) అనే వేడుక చేసి 'కుస్తీ' (Kusti) అనే పవిత్ర దారాన్ని కడతారు.

వేదాలలో 'రత' (Rita) అంటే సత్యం లేదా విశ్వ ధర్మం. అవెస్తాలో అది 'అషా' (Asha). మనం చనిపోయిన వారిని దహనం చేస్తాము. కానీ పర్షియన్లు పవిత్రమైన అగ్ని మరియు భూమి మైల పడకూడదని 'టవర్ ఆఫ్ సైలెన్స్' (Tower of Silence) పద్ధతిని వాడతారు. కానీ మూల సిద్ధాంతం ఒక్కటే. అదే, ప్రకృతిని పూజించడం.

కాలగమనంలో రాజ్యాలు మారాయి, మతాలు మారాయి. 'ఆర్యానాం వైజ' నేడు ఇరాన్ గా మారింది. ఒకప్పుడు 'అహుర మజ్దా'ను, మిత్రుడిని, వరుణుడిని కొలిచిన ఆ గడ్డపై, నేడు వేరే ప్రార్థనలు వినిపిస్తున్నాయి. కానీ, చరిత్ర ఎప్పుడూ చెరిగిపోదు.

భారత్ మరియు ఇరాన్... ఒకే వేద వృక్షానికి పుట్టిన రెండు కొమ్మలు. ఒకటి తూర్పుకు విస్తరించి 'సనాతన ధర్మం'గా విరాజిల్లితే, మరొకటి పడమర వైపు విస్తరించి కాలక్రమంలో రూపాంతరం చెందింది.

మన పురాణాలు, వారి శాసనాలు, మన ఆచారాలు, వారి సంప్రదాయాలు... ఇవన్నీ మన గత బంధానికి మూగ సాక్ష్యాలు. 'వసుధైక కుటుంబకం' అని మనం ఎందుకు అంటామో ఇలాంటి చరిత్రలే నిరూపిస్తాయి. ప్రపంచం మొత్తం ఒకప్పుడు ఒకే ధారలో ప్రవహించిందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మన చరిత్రను అందరికీ తెలియజేయడానికి షేర్ చేయండి. 'వాయిస్ ఆఫ్ మహీధర్' ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన చరిత్రతో మళ్ళీ కలుద్దాం.

జై హింద్! జై శ్రీరామ!

Monday, January 19, 2026

Shocking 5000-Year-Old Celtic – Vedic Connection | India to Ireland Mystery | 5000 ఏళ్ళ రహస్యం!

 

ఐరోపాలో హిందూ ధర్మం ఎలా అంతమైంది? | క్రైస్తవం దాచిన నిజాలు!
Shocking 5000-Year-Old Celtic – Vedic Connection | India to Ireland Mystery!

మనం ఈ రోజు ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాము. ఒకసారి ఊహించండి... వేల సంవత్సరాల క్రితం, మన భారతదేశానికి వేల మైళ్ల దూరంలో ఉన్న ఐరోపాలోని దట్టమైన అడవులలో, ఓంకార నాదాలు వినిపించాయంటే? అక్కడ కూడా మన బ్రాహ్మణుల లాంటి పూజారులు యజ్ఞాలు చేశారంటే?

మీరు వింటున్నది నిజమే. ఐరోపాలో ఒకప్పుడు విలసిల్లిన 'కెల్టిక్' (Celtic) నాగరికతకూ, మన సనాతన ధర్మానికీ మధ్య ఉన్న పోలికలు చూసి, చరిత్రకారులే ఆశ్చర్యపోతున్నారు.

ఐర్లాండ్ నుండి భారత్ వరకు... ద్రుయిడ్ల (Druids) నుండి ద్విజుల (Brahmins) వరకు... ఈ సంబంధం ఏమిటి..? ఈ రోజుటి మన వీడియోలో, పురాతన గ్రంథాల ఆధారంగా ఆ రహస్యాన్ని ఛేదిద్దాము. చివరి వరకు చూస్తే, ఈ నిజాలు మనలో ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా, ఆత్మ గౌరవాన్ని పెంచుతాయి.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/BLMkJGqKOHQ ]


ముందుగా భాషతో మొదలుపెడదాము. భాష అనేది సంస్కృతికి ఊపిరి లాంటిది. పశ్చిమ దేశాల భాషలకు మన సంస్కృతమే తల్లి అని చాలా మందికి తెలుసు. అయినా కెల్టిక్ భాషలో ఉన్న పదాలు చూస్తే మీరు షాక్ అవుతారు.

ఉదాహరణకు: మనం రాజుని 'రాజా' (Raja) అంటాము. పాత ఐరిష్ భాషలో రాజుని 'రీ' (Ri) అంటారు. మనం శ్రేష్ఠుడిని 'ఆర్య' (Arya) అంటాము. వారు 'ఐరే' (Aire) అంటారు. మనకు 'మరుత్' (Marut) అంటే గాలి దేవుడు. వారికి 'మ్రవ్' (Marbh) అంటే చనిపోయిన వారి ఆత్మలు గాలిలో కలవడం.

ఇంత దగ్గరి పోలికలు కాకతాళీయంగా ఎలా ఉంటాయి? చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, వేల సంవత్సరాల క్రితం ఒకే పూర్వీకుల నుండి రెండు సమూహాలుగా విడిపోయి, ఒకరు తూర్పున భరతఖండంలో ఉండిపోతే, మరొకరు పడమరన ఐరోపాకు వలస వెళ్లారనీ, అందుకే మన సంస్కృతులలో ఆత్మ ఒక్కటే... ఆచరణలు వేరనీ అంటారు.

కేవలం భాషా పరమైన పోలికలే కాదు, మన వేదాల్లోనే దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఋగ్వేదంలోని 7వ మండలంలో 'దశరాజ్ఞ యుద్ధం' (Battle of Ten Kings) గురించి ఒక వర్ణన ఉంది. ఇది సుదాసుడు అనే రాజుకూ, పది మంది ఇతర రాజుల కూటమికీ మధ్య రావి నది (Parushni River) ఒడ్డున జరిగిన భీకర యుద్ధం. దీనికి సంబంధించి మనం గతంలో చేసిన వీడియో చూస్తే మీకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది.

ఈ పది మంది రాజుల సమూహంలో 'ద్రుహ్యులు' (Druhyus) అనే తెగ వారున్నారు. ఈ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత, ద్రుహ్యులను పశ్చిమ దిశగా (Westwards) తరిమికొట్టారని ఇతిహాసాలు చెబుతున్నాయి. వాయు పురాణం ప్రకారం, ఈ ద్రుహ్యులు గాంధార దేశం అంటే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ను దాటి, ఉత్తరానికి మరియు పడమర దిశగా ప్రయాణించి 'మ్లేచ్ఛ' దేశాల రాజులయ్యారని చెప్పబడింది.

చరిత్రకారుల ప్రకారం, ఆనాడు మన భారతదేశం నుండి వెళ్ళగొట్టబడిన ఈ 'ద్రుహ్యులే', కాలక్రమేణా యూరప్ చేరి, 'ద్రుయిడ్లు' (Druids) లేదా 'కెల్ట్స్' (Celts) గా మారి ఉండవచ్చు. 'ద్రుహ్యు' అనే పదమే మార్పు చెంది 'ద్రుయిడ్' అయ్యిందని ఒక బలమైన వాదన ఉంది.

ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం, 'ద్రుయిడ్లు' (Druids). పురాతన కెల్టిక్ సమాజంలో ద్రుయిడ్లు అంటే అత్యున్నత పూజారులు, న్యాయమూర్తులు మరియు వైద్యులు. మన సమాజంలో బ్రాహ్మణులకు ఎలాంటి స్థానం ఉందో, అక్కడ ద్రుయిడ్లకు అదే స్థానం ఉండేది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... ద్రుయిడ్ అనే పదం సంస్కృత పదం, 'ద్రు-విద్' (Dru-Vid) నుండి వచ్చింది అని పండితుల అభిప్రాయం. 'ద్రు' అంటే చెట్టు లేదా గట్టిది అని, 'విద్' అంటే వేద జ్ఞానం అని అర్థం. అంటే వారు 'గొప్ప జ్ఞానము కలిగిన వారు' అని తెలుస్తోంది.

మన వేద పండితుల లాగానే, ద్రుయిడ్లు కూడా తమ జ్ఞానాన్ని ఎక్కడా రాసేవారు కాదు. వారు తమ శ్లోకాలను, మంత్రాలను వాఙ్మయం ద్వారానే (Oral Tradition) శిష్యులకు నేర్పించేవారు. ఒక్కో ద్రుయిడ్ వేల కొద్దీ పద్యాలను కంఠస్థం చేసేవారు. సరిగ్గా ఎలాగైతే వేదాలను మనవారు శ్రవణం ద్వారా నేర్చుకున్నారో, అక్కడ కూడా అదే పద్ధతిని అవలంభించారు.

వారికీ మనకూ ఉన్న మరొక పోలిక, తెల్లటి వస్త్రాలు ధరించడం మరియు చేతిలో దండం (Staff) పట్టుకోవడం.

ఇక ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. డెన్మార్క్‌లో దొరికిన 'గుండెస్ట్రప్ కాల్డ్రన్' (Gundestrup Cauldron) అనే వెండి పాత్ర మీద ఒక బొమ్మ ఉంటుంది. దాని పేరు 'సెర్నున్నోస్' (Cernunnos).

ఈ బొమ్మను జాగ్రత్తగా చూడండి. అతను పద్మాసనంలో (Yogic Posture) కూర్చుని ఉన్నాడు. అతని చుట్టూ జంతువులూ, తలపై కొమ్ములు, చేతిలో పాము ఉంది.

ఇది మీకు ఎవరిని గుర్తుచేస్తోంది? అవును... మన పశుపతి నాథుడు, శివుడు. సింధు నాగరికతలో దొరికిన పశుపతి సీల్‌కీ, ఈ సెర్నున్నోస్ విగ్రహానికీ 90% పోలికలు ఉన్నాయి. ఐరోపా అడవుల్లో యోగ ముద్రలో కూర్చున్న దేవుడిని పూజించడం అంటే, సనాతన ధర్మం యొక్క ప్రభావం ఎంత వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఇది చాలా మందికి తెలియని రహస్యం. సాక్షాత్తు మన శ్రీరామచంద్రుని ప్రభావం కూడా కెల్టిక్ జాతిపై ఉందని కొన్ని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. 18వ శతాబ్దంలో 'ఏషియాటిక్ రీసెర్చస్' (Asiatic Researches) లో సర్ విలియం జోన్స్ (Sir William Jones) మరియు కర్నల్ విల్ఫోర్డ్ వంటి బ్రిటిష్ అధికారులే ఒక వింత విషయాన్ని నమోదు చేశారు.

పురాతన ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ ప్రాంతాల్లో, ఒకప్పుడు వారు జరుపుకున్న ఉత్సవాల్లో 'రామ-సీత' (Rama-Sita) అనే పేరు వినిపించేదని రాసుకొచ్చారు. అంతేకాదు, కెల్టిక్ భాషలో 'రామ్' (Ram) అంటే 'అత్యున్నతమైన' (High or Noble) అని అర్థం. మన రాముడు 'సూర్యవంశపు' రాజన్న విషయం మనకు తెలిసిందే. అటు కెల్టిక్ ద్రుయిడ్లు కూడా ప్రధానంగా 'సూర్య ఆరాధకులు' (Sun Worshippers).

త్రేతాయుగంలో శ్రీరాముడి కీర్తి సప్త సముద్రాలు దాటి ఐరోపా ఖండం వరకు విస్తరించిందని చెప్పడానికి, ఐరోపా నడిబొడ్డున వినిపించిన ఈ 'రామ' నామమే నిదర్శనం అని కొంతమంది చరిత్రకారుల గట్టి నమ్మకం.

ఇక మన పురాణాలలో 'దను' (Danu) అనే రాక్షస మాత ఉంది. 'దానవులు' ఆమె సంతానం. ఋగ్వేదంలో దను అంటే నీరు లేదా ప్రవాహం అని కూడా అర్థం ఉంది.

ఐరిష్ పురాణాలలో వారి ప్రధాన దేవతలను 'తువా త డె దనన్' (Tuatha Dé Danann) అంటారు. అంటే 'దను మాత యొక్క బిడ్డలు' (Children of Goddess Danu) అని అర్థం.

ఐరోపాలో ప్రవహించే అతి పెద్ద నది 'డాన్యూబ్' (Danube River). ఆ పేరు కూడా ఈ 'దను' దేవత పేరు మీదే వచ్చింది. నీటిని పవిత్రంగా పూజించడం, నదులను దేవతలుగా భావించడం అనేది కెల్టిక్ మరియు వైదిక సంస్కృతులలో సమానంగా కనిపిస్తుంది.

ఈ 'దను' (Danu) దేవత గురించి మన పురాణాల్లో స్పష్టంగా ఉంది. సృష్టికర్తలలో ఒకరైన కశ్యప ప్రజాపతికీ, దక్షుని కుమార్తె అయిన 'దను' (Danu) కు పుట్టిన సంతానమే 'దానవులు'.

మనం సినిమాల్లో చూసినట్లు దానవులు అంటే వికారమైన రాక్షసులు కాదు, వారు గొప్ప మాయావులు మరియు మయుడి వంటి అత్యున్నత సాంకేతిక నిపుణులు (Architects like Mayasura). వామన పురాణం మరియు ఇతర గ్రంథాల ప్రకారం, దేవతలతో జరిగిన యుద్ధాల్లో ఓడిపోయిన దానవులు, సముద్రాన్ని దాటి సుదూర ప్రాంతాలకు వెళ్లిపోయారు.

ఐరిష్ జానపద కథలు (Folklore) ఏం చెబుతున్నాయో తెలుసా? వారి దేవతలైన 'తువా త డె దనన్' (Tuatha Dé Danann) ఆకాశం నుండి మేఘాల మధ్యలో నౌకల్లో (Flying Ships) వచ్చారని..! ఇది మన పురాణాల్లో దానవులకు ఉన్న 'విమాన' సాంకేతికతను గుర్తుచేస్తోంది. వారు కేవలం వలస వెళ్లడమే కాదు, తమతో పాటు వేద సంస్కృతిని, సాంకేతికతను కూడా తీసుకువెళ్లారని దీన్ని బట్టి అర్థమవుతోంది.

కేవలం వారి దేవుళ్లే కాదు, వారి ఫిలాసఫీ (Philosophy) కూడా మనదే. ఆ కాలంలో మిగతా ఐరోపా వాసులు, మనిషి చనిపోతే స్వర్గానికో, నరకానికో వెళ్తారని నమ్మేవారు. కానీ ద్రుయిడ్లు మాత్రం 'పునర్జన్మ' (Reincarnation) ను నమ్మేవారు.

జూలియస్ సీజర్ (Julius Caesar) స్వయంగా ద్రుయిడ్ల గురించి రాస్తూ... 'వీరు ఆత్మకు చావు లేనిదనీ, ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని బోధిస్తారు. అది వారికి యుద్ధంలో భయం లేకుండా చేస్తోంది' అని చెప్పాడు. ఇది మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన - 'వాసాంసి జీర్ణాని యథా విహాయ...' అనే శ్లోకాన్ని గుర్తుచేస్తోంది.

అలాగే వారి క్యాలెండర్, వారి పండుగలు, అన్నీ మన పంచాంగం లాగానే సూర్య చంద్రుల గమనం (Astronomy) ఆధారంగానే ఉండేవి.
మరొక ఆశ్చర్యకరమైన విషయం మహాభారతంలోని 'శాంతి పర్వం'లో కనిపిస్తుంది. నారద మహర్షి నారాయణుడి దర్శనం కోసం మేరు పర్వతానికి ఉత్తర దిశగా, పాల సముదాన్ని దాటి 'శ్వేత ద్వీపం' (White Island) అనే ప్రాంతానికి వెళ్ళాడు.

వ్యాసుడు ఆ ప్రాంతాన్ని వర్ణిస్తూ... 'అక్కడ ప్రజలు చంద్రుని కాంతి వలె తెల్లగా ఉంటారనీ, వారికి ఇంద్రియ చపలత్వం ఉండక, ఏకదేవతారాధన (Monotheism) చేస్తార' నీ రాశారు. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ తన పరిశోధనలో, ఈ 'శ్వేత ద్వీపం' అనేది ఇప్పటి యూరప్ లేదా బ్రిటన్ ప్రాంతం అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అంటే, కురుక్షేత్ర యుద్ధం నాటికే మన ఋషులకు యూరప్ ఖండం గురించీ, అక్కడి ప్రజల గురించీ స్పష్టమైన అవగాహన ఉండేదన్నమాట.

అసలు ఈ చరిత్ర అంతా ఎందుకు మరుగున పడిపోయింది? దానికి సమాధానం వారి సాహిత్యంలోనే దొరుకుతుంది.

పూర్వం కెల్టిక్ ప్రజల దగ్గర 'ఎక్ట్రా' (Echtrae) అనే అద్భుతమైన సాహస గాథలు ఉండేవి. మహావీరులు సముద్రంపై చేసే సాహసోపేతమైన ప్రయాణాల గురించి (Voyages) అందులో గొప్పగా వర్ణించేవారు. ఇవి మన పురాణాల్లోని సముద్ర ప్రయాణాలను పోలి ఉండేవి.

కానీ, 7వ మరియు 8వ శతాబ్దాలలో ఐర్లాండ్‌లో క్రైస్తవ మతం విస్తరించినప్పుడు, ఒక భారీ మార్పు జరిగింది. మత మార్పిడిలో భాగంగా, వారు ఈ పురాతన కథలను ఆక్రమించారు (Usurped). ఆ పాత కథల ఆత్మను చంపేసి, వాటిని వక్రీకరించి, క్రైస్తవ ఇతివృత్తాలుగా (Christian themes) మార్చేశారు. ఈ కొత్త, కల్తీ కథలకే 'ఇమ్రామా' (Immrama) అని పేరు పెట్టారు.

ఈ చారిత్రక వక్రీకరణ (Corruption) వల్లనే... ప్రాచీన భారతదేశంతో కెల్టిక్ జాతికి ఉన్న ఎన్నో బలమైన బంధాలు బయటపడకుండా మట్టిలో కలిసిపోయాయి.

దురదృష్టవశాత్తు, ఈనాడు ఐరిష్ ప్రజలు తమ మూలాలు భారతదేశంలో ఉన్నాయన్న విషయాన్నే పూర్తిగా మర్చిపోయారు. వారి పూర్వీకులను, వారి పద్ధతులను 'పాగన్' (Pagan) పేరుతో రాక్షసీకరించడం వల్ల... ఆ గొప్ప చరిత్ర అంతా ఒక కమ్మిన చీకటిలో (Erasing Darkness) ఉండిపోయింది. ఆ చీకటి పొరను తొలగిస్తే తప్ప, మన బంధం వారి కళ్లకు కనిపించదు.

చరిత్ర పుటల్లో కనుమరుగైన ఈ నిజాలు మనకు ఏం చెబుతున్నాయి? ధర్మం అనేది ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు. 'వసుధైక కుటుంబకం' అని మన పెద్దలు ఊరికే అనలేదు. వేల ఏళ్ల క్రితమే మానవజాతి ఆలోచనా విధానం, దైవ చింతన, ప్రకృతి ఆరాధన ఒకేలా ఉండేది.

కాలక్రమేణా పేర్లు మారాయి, రూపాలు మారాయి. కానీ మూలం (Roots) మాత్రం ఒక్కటే. కెల్టిక్ సంస్కృతి, క్రైస్తవ మత వ్యాప్తితో అంతరించిపోయింది. కానీ, ఇప్పటికీ ఐర్లాండ్ పల్లెల్లో, వారి జానపద కథల్లో ఆ వేద సంస్కృతి తాలూకు ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి.

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మన పూర్వీకుల గొప్పదనాన్ని నలుగురికీ తెలియజేయడానికి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, లోతైన చరిత్రల కోసం 'Voice of Maheedhar' చానెల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.

జై హింద్! జై శ్రీరామ!

Monday, January 12, 2026

The Lost Etruscan Empire & Sanatana Dharma Connection

 

ఇటలీలో 3000 ఏళ్ల నాటి సనాతన ధర్మ ఆనవాళ్లు! చరిత్ర పుటల్లో దాగిన ఎట్రస్కన్ నాగరికత!
3000-Year-Old Vedic Links Found in Italy? The Lost Etruscan Empire & Sanatana Dharma Connection

మనం రోమన్ సామ్రాజ్యం గురించి విన్నాం. గ్రీకు వీరుల గురించి చదివాం. కానీ... రోమ్ నగరానికి పునాది పడకముందే... ఇటలీ గడ్డపై ఒక గొప్ప నాగరికత వెలిసింది. వాళ్లే ఎట్రస్కన్లు (Etruscans).

ఎవరు వాళ్లు? ఎక్కడి నుంచి వచ్చారు? అనేది చరిత్రకారులకు ఇప్పటికీ ఒక అంతుచిక్కని ప్రశ్న. కానీ... కొన్ని పురాతన గ్రంథాలు, వాస్తు శాస్త్రాలు, మరియు వారి ఆచారాలను నిశితంగా గమనిస్తే... ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడుతుంది.

ఇటలీ నడిబొడ్డున... మన సనాతన ధర్మం తాలూకు ఆనవాళ్లు ఉన్నాయా? వాళ్లు పూజించే దేవుళ్లకూ, మన వేద కాలపు దేవతలకూ సంబంధం ఉందా? అగ్ని ఆరాధన, శకున శాస్త్రం, అంత్యక్రియల పద్ధతులు... ఇవన్నీ మన భారతీయ సంప్రదాయాలను ఎందుకు పోలి ఉన్నాయి?

ఈ రోజుటి మన ఎపిసోడ్ లో... చరిత్ర పుటలలో కనుమరుగైన ఒక గొప్ప నాగరికత... "ఎట్రస్కన్ సివిలైజేషన్" గురించీ, దానికీ మన సనాతన ధర్మానికీ ఉన్న సంబంధాల గురించీ, మన ప్రాచీన గ్రంథాల ఆధారంగా తెలుసుకుందాం. ఈ నిజాలు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/NZMdlwNE4Lc ]


సామాన్యశక పూర్వం 8వ శతాబ్ది కాలంలో, ఇప్పటి టస్కనీ (Tuscany) ప్రాంతంలో ఈ ఎట్రస్కన్ నాగరికత ఉచ్చ స్థితిలో ఉండేది. రోమన్లు ఇంకా చిన్న గ్రామాలకే పరిమితమైన కాలం అది. కానీ ఎట్రస్కన్లు అప్పటికే డ్రైనేజీ సిస్టమ్స్, భారీ ఆలయాలు, మరియు అద్భుతమైన బంగారు ఆభరణాలు తయారు చేయడంలో దిట్టలు.

వారిని రోమన్లు "టస్సీ" (Tusci) అని పిలిచేవారు. అందుకే ఆ ప్రాంతానికి "టస్కనీ" అని పేరొచ్చింది. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... వాళ్ళని వాళ్ళు "రస్న" (Rasna) అని పిలుచుకునేవారు.

ఈ "రస్న" అనే పదం... మన సంస్కృత పదం "రస" (Rasa) లేదా "రస్మి" అంటే కాంతి నుంచి వచ్చిందా అనే సందేహం చాలా మంది భాషావేత్తలకు ఉంది. వారు వాడిన భాష చుట్టుపక్కల ఉన్న లాటిన్ లేదా గ్రీకు భాషలకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉండేది. అది ఒక ఐసోలేటెడ్ లాంగ్వేజ్. మరి వారు ఇటలీకి ఎలా వచ్చారు?

దీని గురించి పురాతన గ్రీకు చరిత్రకారుడు హెరొడోటస్ (Herodotus) ఏం చెప్పాడంటే... ఎట్రస్కన్లు ఇటలీకి చెందిన వారు కాదు. వారు "లిడియా" (Lydia) అనే ప్రాంతం నుండి వలస వచ్చారు. ఈ లిడియా అనేది ఇప్పుడున్న టర్కీ (Turkey) ప్రాంతంలో ఉంది.

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది! పురాతన టర్కీ లేదా అనటోలియా ప్రాంతం... ఒకప్పుడు మిటాని (Mitanni) మరియు హిట్టైట్ (Hittite) రాజ్యాలకు నిలయం. ఈ మిటాని రాజులు వైదిక దేవుళ్ళను పూజించేవారు. వాళ్ళ ఒప్పంద పత్రాల్లో ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, నాసత్యుల పేర్లు స్పష్టంగా ఉన్నాయి.

కాబట్టి, హెరొడోటస్ చెప్పినట్లు ఎట్రస్కన్లు గనక ఆ ప్రాంతం నుండి వచ్చి ఉంటే... వారు తమతో పాటు ఆ వైదిక సంస్కృతిని కూడా ఇటలీకి తీసుకెళ్లారా? ఆధునిక DNA పరీక్షలు కొంత గందరగోళంగా ఉన్నా, సాంస్కృతిక ఆధారాలు మాత్రం బలంగా "తూర్పు" (Eastern) వైపే చూపిస్తున్నాయి.

కేవలం పురావస్తు శాఖ తవ్వకాలే కాదు... మన భారతీయ ప్రాచీన సాహిత్యం (Ancient Indian Literature) వైపు ఒకసారి దృష్టి సారిస్తే... ఈ లింక్స్ ఇంకా బలంగా కనిపిస్తాయి.

ముఖ్యంగా మనుస్మృతి (Manu Smriti) లోని ఒక శ్లోకం మనల్ని ఆలోచింపజేస్తుంది. మనుస్మృతి, 10వ అధ్యాయం, 43 మరియు 44వ శ్లోకాలను (Verses 43-44) గమనిస్తే... అందులో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది.

శనకైస్తు క్రియాలోపాత్ ఇమాః క్షత్రియజాతయః | 
వృషలత్వం గతా లోకే బ్రాహ్మణదర్శనేన చ ||

దీని అర్థం... పౌండ్రకులు, ద్రవిడులు, కాంభోజులు, యవనులు, శకులు, పారదుల వంటి కొన్ని క్షత్రియ జాతులు, కాలక్రమేణా వైదిక కర్మలను విస్మరించడం వల్ల, సరైన మార్గదర్శకత్వం లేక... తమ మూలాలను కోల్పోయి "మ్లేచ్చులు"గా (Foreigners/Outcasts) మారిపోయారు.

ఇక్కడ మనం గమనించాల్సింది "యవనులు" (Yavanas) గురించి. యవనులు అంటే గ్రీకులు (Greeks). గ్రీస్ దేశానికి సరిహద్దులోనే ఇటలీ ఉంది. మనుస్మృతి చెప్పినట్లుగా... భారతదేశం నుండి పడమర వైపు వలస వెళ్ళిన ఈ క్షత్రియ సమూహాలే... అక్కడ ఎట్రస్కన్లుగా స్థిరపడి ఉంటారా? అందుకేనా... వాళ్లు తమ మూలాలను మర్చిపోయినా, అగ్ని హోమాలు (Fire Rituals), పితృ కార్యాలు (Ancestor Worship) వంటి కొన్ని అలవాట్లను మాత్రం వదలకుండా పాటించారు? ఇది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం!

మరొక ఆశ్చర్యకరమైన విషయం, భాషా శాస్త్రం (Linguistics). ఎట్రస్కన్లు నివసించిన ప్రాంతాన్ని "ఎట్రూరియా" (Etruria) అంటారు. కొంతమంది చరిత్రకారుల వాదన ప్రకారం... ఈ పదం మన సప్తర్షులలో ఒకరైన "అత్రి" (Atri) మహర్షి పేరు నుండి ఉద్భవించి ఉండవచ్చు.

అదెలాగంటే... సంస్కృతంలో "అత్రి-రాయ" (Atri-Raya) లేదా "అత్రి-ఋషి-య" అనే పదాలే కాలక్రమేణా మారి "ఎట్రూరియా" గా పిలవబడి ఉండవచ్చు. ఎందుకంటే... ఎట్రస్కన్ల సమాజంలో పూజారులకు అత్యంత గౌరవం ఉండేది. వారు కూడా గోత్రాల పద్ధతిని పోలిన వంశ వృక్షాలను పాటించేవారు.

ఇక అన్నింటికంటే ఆసక్తికరమైన, కాస్త లోతుగా పరిశీలించాల్సిన విషయం మరొకటి ఉంది. అదే రామాయణ కాలంతో సంబంధం!

మనందరికీ తెలుసు, మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు వంశం, అంటే సూర్య వంశానికి (Surya Vamsa) చెందినవాడు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు... ఎట్రస్కన్లకు కూడా సూర్యారాధన (God Usil) అత్యంత ప్రధానమైనది.

కొంతమంది ప్రత్యామ్నాయ చరిత్రకారుల (Alternative Historians) బలమైన వాదన ప్రకారం... అసలు ఇటలీ రాజధాని "రోమ్" (Rome) నగరానికి ఆ పేరు, మన "రామ" నామం నుండే వచ్చి ఉండవచ్చని. ఎందుకంటే, రోమ్ నగరానికి పునాదులు పడింది ఎట్రస్కన్ల భూమి మీదే. వారి సంస్కృతి నుండే రోమ్ పుట్టింది.

బహుశా... భరతభూమి నుండి పడమర దిశగా వలస వెళ్ళిన ఆ క్షత్రియ సమూహాలు, తమతో పాటు తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముని నామాన్ని ఒక స్మృతిగా తీసుకువెళ్లారేమో! కాలక్రమంలో ఉచ్చారణ మారి, అదే ఆ మహానగరానికి పేరుగా స్థిరపడిందేమో! ఇది నిజంగా ఒళ్ళు గగుర్పొడిచే ఊహే కదా?

ఈ వాదనకు బలం చేకూర్చేలా... ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం వారి సమాధుల్లో (Tombs) కనిపిస్తుంది. ఎట్రస్కన్ నెక్రోపోలిస్ గోడల మీద కొన్ని పురాతన పెయింటింగ్స్ (Frescoes) ఉన్నాయి.

వాటిలో ధనుర్బాణాలు ధరించిన వీరులు రథాల మీద యుద్ధం చేస్తున్న దృశ్యాలను సునిశితంగా గమనిస్తే... మనకు తెలియకుండానే మన పురాణ ఇతిహాసాలైన రామాయణ, మహాభారత ఘట్టాలు కళ్ల ముందు మెదులుతాయి. అవి అచ్చం మన రామాయణ కాలపు వీరుల చిత్రాలనే పోలి ఉండటం... కేవలం కాకతాళీయం అంటే ఎవరైనా నమ్ముతారా?

అంతేకాదు... రోమ్ స్థాపనకు ముందు, ఇటలీలో ప్రవహించిన నదుల పేర్లూ, కొన్ని ప్రాంతాల పేర్లూ, సంస్కృత ధాతువులకు (Sanskrit Roots) దగ్గరగా ఉండటం యాదృచ్చికం అని కొట్టిపారేయలేం. ఉదాహరణకు ఎట్రస్కన్ల ఆరాధ్య దైవం "ఐసార్" (Aisar). సంస్కృతంలో "ఈశ్వర్" (Ishwar). ఈ రెండింటికీ ఉన్న దగ్గరి పోలిక చూస్తే మీకు ఏమనిపిస్తోంది?

మన సనాతన ధర్మంలో... కాలం (Time) అనేది సరళ రేఖలా (Linear) వెళ్ళదు. అది ఒక చక్రంలా (Cyclic) తిరుగుతుంది. కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. సరిగ్గా ఇదే కాన్సెప్ట్ ఎట్రస్కన్ల నమ్మకాలలో కూడా ఉంది!

వారు కాలాన్ని "సేక్యులా" (Saecula) అనే యుగాలుగా విభజించారు. వారి గ్రంథాల ప్రకారం... ప్రతి జాతికి లేదా నాగరికత ఉనికికీ, దేవుడు నిర్ణయించిన కొంత సమయం (Time Span) మాత్రమే ఉంటుంది. ఆ సమయం తీరగానే ఆ నాగరికత అంతరించి, కొత్తది పుడుతుంది.

వారి ప్రవక్తలు చెప్పిన ప్రకారం, "ఎట్రస్కన్ జాతికి 10 సేక్యులాలు అంటే యుగాలు మాత్రమే ఆయుష్షు ఉంది." పదవ యుగం రాగానే తమ జాతి అంతరించిపోతుందని వారికి ముందే తెలుసు. అందుకే రోమన్లు దాడి చేసినప్పుడు... వారు పెద్దగా ప్రతిఘటించలేదు. "ఇది దైవ నిర్ణయం, మా కాలం ముగిసింది" అని వారు తమ విధిని స్వీకరించారు.

భవిష్యత్ పురాణంలో కలియుగ లక్షణాల గురించి ఎలా చెప్పారో... ఎట్రస్కన్ల పవిత్ర గ్రంథాల్లో కూడా తమ అంతం గురించి ముందే రాసి పెట్టి ఉంది. ఈ "కాల చక్రం" ఫిలాసఫీ... కచ్చితంగా భారతీయ తత్వశాస్త్రం (Indian Philosophy) నుండి వెళ్ళినదే అని అనడంలో సందేహం లేదు!

ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్దాం. ఎట్రస్కన్ల మతం మన ధర్మానికి ఎంత దగ్గరగా ఉందో చూద్దాం.

1. బహుదేవతారాధన (Polytheism): రోమన్లు, గ్రీకుల లాగానే ఎట్రస్కన్లు కూడా ప్రకృతి శక్తులను దేవుళ్లుగా పూజించేవారు. కానీ వారి ప్రధాన దైవం "టినియా" (Tinia). టినియా అంటే ఆకాశానికి అధిపతి, పిడుగులకు ప్రభువు. ఇది అచ్చం మన ఇంద్రుడిని (Indra) పోలి ఉంటుంది!

2. సూర్య ఆరాధన: వీరికి "ఉసిల్" (Usil) అనే సూర్య దేవుడు ఉన్నాడు. ఉసిల్ చేతిలో ఒక అగ్ని గోళం ఉంటుంది. సంస్కృతంలో సూర్యోదయానికి సంబంధించిన పదజాలంతో ఇది లింక్ అవుతుంది.

3. అగ్ని సాక్షిగా: ఎట్రస్కన్లకు హోమాలు చేసే అలవాటు ఉంది. వారు ఏ శుభకార్యం చేసినా అగ్నిని వెలిగించి, అందులో నెయ్యి లేదా ద్రవాలను పోసి దేవతలకు అర్పిస్తారు. ఇది మన యజ్ఞ యాగాదులను గుర్తుచేస్తోంది.

వారి ఆలయాలు కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో, వాస్తు శాస్త్రం ప్రకారం (Templum) తూర్పు లేదా దక్షిణ దిశగా నిర్మించేవారు. విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీని ఆలయంలోకి ఆహ్వానించే పద్ధతి వారి దగ్గర ఉంది.

ఎట్రస్కన్ నాగరికతలో అత్యంత ప్రసిద్ధమైనది, వారి "ఎట్రస్కా డిసిప్లీనా" (Etrusca Disciplina). అంటే దైవ నియమాలు. ఇందులో ప్రధానమైనది భవిష్యవాణి (Divination).

మన దగ్గర "శకున శాస్త్రం" ఎలా ఉందో... వారి దగ్గర కూడా పక్షుల కదలికలను బట్టి భవిష్యత్తు చెప్పే విద్య ఉంది. ఆకాశంలో మెరుపు ఏ దిశ నుండి వచ్చి, ఏ దిశకు వెళ్ళిందనే దాన్ని బట్టి, వారు దేవుడి సందేశాన్ని చదివేవారు.

అలాగే జంతువుల కాలేయాన్ని (Liver) పరిశీలించి భవిష్యత్తు చెప్పే పద్ధతి వారిది. దీనికి సంబంధించి "లివర్ ఆఫ్ పియాచెన్జా" (Liver of Piacenza) అనే ఒక కంచు నమూనా దొరికింది. దాని మీద రకరకాల గీతలు, దేవుళ్ళ పేర్లు ఉన్నాయి. ఇది మన జ్యోతిష్య శాస్త్రంలోని గ్రహ స్థితులకు, శరీర అవయవాలకు ఉన్న లింక్ లాంటిదే. బాబిలోనియన్లకు, మనకు, ఎట్రస్కన్లకు ఈ విద్యలో కామన్ లింక్ ఉంది.

చనిపోయిన వారి విషయంలో ఎట్రస్కన్ల పద్ధతి, అప్పటి యూరప్ వాళ్ల కంటే భిన్నంగా ఉండేది. గ్రీకులు ఎక్కువగా శవాలను పాతిపెడితే... ఎట్రస్కన్లు దహన సంస్కారాలు (Cremation) చేసేవారు.

శవాన్ని దహనం చేసి, ఆ బూడిదను ఒక కుండలో (Urn) భద్రపరిచేవారు. విచిత్రం ఏమిటంటే... ఈ కుండలు చిన్న చిన్న ఇళ్ల (Huts) ఆకారంలో ఉండేవి. అంటే... "ఆత్మకు శరీరం పోయినా, ఉండటానికి ఒక ఇల్లు కావాలి" అనే నమ్మకం.

వారి సమాధుల లోపల చూస్తే భయం వేయదు... ఆనందం కలుగుతుంది. అవును! సమాధుల గోడల మీద నాట్యం చేస్తున్న బొమ్మలు, విందులు (Feasts) చేసుకుంటున్న దృశ్యాలు ఉంటాయి. మరణం అనేది అంతం కాదు, అది మరో లోకానికి ప్రయాణం అని వారు నమ్మేవారు. మన గరుడ పురాణంలో ఆత్మ ప్రయాణం గురించి చెప్పబడినట్లుగానే... వీరికి కూడా ఆత్మ ప్రయాణంపై గట్టి నమ్మకం ఉండేది.

సామాన్యశక పూర్వం 1వ శతాబ్దం నాటికి రోమన్ సామ్రాజ్యం బలపడి, ఎట్రస్కన్లను జయించింది. రోమన్లు ఎట్రస్కన్ల భూమిని తీసుకున్నారు, వారి విద్యలను నేర్చుకున్నారు, వారి దేవుళ్లను అంటే జూపిటర్, మార్స్ వగైరాలను తమ దేవుళ్లుగా మార్చుకున్నారు. కానీ... ఎట్రస్కన్ల చరిత్రను మాత్రం మరుగున పడేశారు.

చరిత్రలో "గెలిచిన వాడే చరిత్ర రాస్తాడు" అని అంటారు. అందుకే రోమన్లు హైలైట్ అయ్యారు, ఎట్రస్కన్లు మాయమయ్యారు.

కానీ, ఈ రోజు మనం చూసిన ఆధారాలైన అగ్ని ఆరాధన, సూర్య పూజ, శకున శాస్త్రం, దహన సంస్కారాలు... ఇవన్నీ చూస్తుంటే ఒక విషయం అర్థమవుతోంది. ప్రాచీన ప్రపంచం మనం అనుకున్న దానికంటే చాలా దగ్గరగా అనుసంధానించబడి ఉంది. "వసుధైక కుటుంబకం" అంటే, వసుధ ఏక కుటుంబం అనే మన మాట... బహుశా వేల ఏళ్ల క్రితమే నిజమై ఉండవచ్చు.

ఈ ఎట్రస్కన్ నాగరికతలో మీకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, అంతుచిక్కని రహస్యాల కోసం Voice of Maheedhar ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.

జై హింద్! లోకా సమస్తా సుఖినో భవంతు..

Monday, January 5, 2026

The Lost Vedic Temple Found in Turkey? | 12,000 Year Old Mystery Explained in Telugu గోబెక్లీ టెపే

 

The Lost Vedic Temple Found in Turkey? | 12,000 Year Old Mystery Explained in Telugu

12000 ఏళ్ల నాటి రహస్యం: గోబెక్లీ టెపే మరియు వేదాల మధ్య ఉన్న సంబంధం!
చరిత్ర గతిని మార్చిన గోబెక్లీ టెపే: వైదిక సంస్కృతికి మూలాలు అక్కడే ఉన్నాయా?
The Lost Vedic Temple Found in Turkey? | 12,000 Year Old Mystery Explained in Telugu

మనం చిన్నప్పటి నుంచి చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నది, మానవ నాగరికత సుమారు 5,000 లేదా 6,000 ఏళ్ల క్రితం మెసొపొటేమియాలోనో, ఈజిప్టులోనో మొదలైందనీ, మనుషులు అంతకుముందు కేవలం వేటగాళ్లుగా అడవుల్లో తిరిగేవారని మనకు నూరిపోశారు.

కానీ... ఆ చరిత్ర అంతా తప్పు అని చెబితే?

టర్కీలోని అనటోలియా ప్రాంతంలో దొరికిన కొన్ని రాతి కట్టడాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. అదే 'గోబెక్లీ టెపే' (Göbekli Tepe). ఇది ఈజిప్ట్ పిరమిడ్ల కంటే 7,000 ఏళ్లు పురాతనమైనది. స్టోన్‌హెంజ్ కంటే 6,000 ఏళ్లు పాతది.

అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఈ గోబెక్లీ టెపే నిర్మాణ శైలికీ, అక్కడ దొరికిన చిహ్నాలకూ, మన భారతీయ వైదిక సంస్కృతికీ (Vedic Culture) మధ్య ఆశ్చర్యకరమైన పోలికలు ఉన్నాయి.

ఈరోజుటి మన వీడియోలో, సుమారు 12,000 ఏళ్ల క్రితం నాటి ఈ అద్భుతమైన కట్టడం వెనుక మన సనాతన ధర్మం లేదా వైదిక సంస్కృతి ఆనవాళ్లు ఉన్నాయా? చరిత్రకారులు దాస్తున్న ఆ సంబంధం ఏంటి? వంటి విషయాలను డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాము.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/lcSxPp7vV4Q ]


ముందుగా అసలు గోబెక్లీ టెపే అంటే ఏంటో తెలుసుకుందాము. 1994లో క్లాస్ స్కిమ్మిడ్ట్ అనే జర్మన్ ఆర్కియాలజిస్ట్ బృందం, టర్కీలోని ఒక కొండపై త్రవ్వకాలు జరిపారు. అప్పుడక్కడ బయటపడిన దృశ్యం చూసి ప్రపంచం నివ్వెరబోయింది.

వందల కొద్దీ భారీ రాతి స్తంభాలు (Pillars) ఉన్నాయక్కడ. ఒక్కోటి 20 అడుగుల ఎత్తు, దాదాపు 10 టన్నుల బరువు. ఇవన్నీ ఒక వృత్తాకారంలో (Circle) అమర్చబడి ఉన్నాయి. కార్బన్ డేటింగ్ చేస్తే తేలింది, అవి సామాన్యశక పూర్వం 9600 సంవత్సరాల నాటివని! అంటే ఇప్పటికి సుమారు 11,600 ఏళ్లు గడచినట్లు.

ఆధునిక సైన్స్ పరంగా ఆ కాలంలో మనిషికి వ్యవసాయం తెలియదు, లోహాలు (Metals) తెలియవు, చక్రం (Wheel) కూడా కనుగొనబడలేదు. మరి సుత్తి, ఉలి లేకుండా ఇంత భారీ రాళ్లను ఎలా చెక్కారు? అసలు ఎందుకు కట్టారు? స్కిమ్మిడ్ట్ దీనిని 'The World's First Temple' అంటే, ‘ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం’ అని పేర్కొన్నారు.

కానీ ఈ దేవాలయంలో ఉన్న బొమ్మలు... రాబందులు (Vultures), పాములు (Snakes), ఎద్దులు (Bulls)... ఇవే ఇప్పుడు మన టాపిక్‌కి ప్రధాన ఆధారం.

ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. గోబెక్లీ టెపేకీ, వైదిక సంస్కృతికీ లింక్ ఎక్కడ ఉంది? నేను చెప్పే ఈ 3 పాయింట్స్ నీ గమనించండి.

Point 1: T-Shaped Pillars & Yupa Stambha

గోబెక్లీ టెపేలో ఉన్నవన్నీ 'T' ఆకారపు రాతి స్తంభాలు. ఇవి చేతులు, బెల్టులు చెక్కి ఉన్నాయి కాబట్టి, మనుషులకు ప్రతీకలు అని ఆర్కియాలజిస్టులు నమ్ముతున్నారు. మన వేదాల్లో 'యజ్ఞం' చేసేటప్పుడు 'యూప స్తంభం' (Yupa Stambha) అని ఒక స్తంభాన్ని పాతుతారు. అది కూడా దేవతలను ఆహ్వానించడానికి వాడే ఒక స్తంభం. గోబెక్లీ టెపే డిజైన్, ప్రాచీన వైదిక యజ్ఞశాలల డిజైన్‌ను పోలి ఉందని కొంతమంది పరిశోధకుల వాదన.

Point 2: The Animals (Vahana Concept)

అక్కడ పిల్లర్స్ మీద రకరకాల జంతువుల బొమ్మలు ఉన్నాయి. ముఖ్యంగా రాబందు (Vulture), పాము (Snake), ఎద్దు (Bull).

• రాబందు: మన పురాణాల్లో గరుత్మంతుడిని (Garuda) పోల్చుతున్నారు.
• పాము: దేవతా సర్పం (Nagas) లేదా కుండలిని శక్తి.
• ఎద్దు: నంది లేదా వృషభం. ఇవి కేవలం జంతువులు కాదు, నక్షత్ర మండలానికి అంటే, Constellations కి సంకేతాలని ఒక థియరీ ఉంది. భారతీయ జ్యోతిష శాస్త్రంలో కూడా జంతువులను రాశులుగా, నక్షత్రాలుగా పోల్చడం మనకు తెలిసిందే..

Point 3: The 'Saptarishi' Connection

గోబెక్లీ టెపేలో 7 ప్రధానమైన పిల్లర్స్ లేదా ఎన్‌క్లోజర్స్ ఉన్నాయనీ, ఇవి సప్తర్షుల (Seven Sages) కాన్సెప్ట్‌కి దగ్గరగా ఉన్నాయనీ, ఆల్టర్నేటివ్ హిస్టరీ పరిశోధకులు అంటున్నారు. మంచు యుగం (Ice Age) చివరలో, అంటే సైన్స్ పరంగా సా.శ.పూ 10,000 సంవత్సరాల సమయంలో, సప్తర్షులు జ్ఞానాన్ని పంచారని మన పురాణాలు చెబుతున్న విషయాన్ని పేర్కొంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఈ టెంపుల్ కట్టబడింది. ఇది కాకతాళీయమా?

ఇప్పటిదాకా మనం రాళ్లను చూసాము. కానీ గోబెక్లీ టెపే రహస్యం భూమి మీద లేదు... అది మన తలల పైన, ఆకాశంలో ఉంది!

దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం Pillar 43 దగ్గరకు వెళ్లాలి. దీన్నే ఆర్కియాలజిస్టులు 'The Vulture Stone' అని పిలుస్తారు. దీని మీద ఒక వింతైన చిత్రం ఉంది. ఒక రాబందు (Vulture), ఒక తేలు (Scorpion), ఒక బాతు, మరియు తల లేని ఒక మనిషి బొమ్మ.

సాధారణ చరిత్రకారులు ఇవి కేవలం వేట దృశ్యాలు అనుకున్నారు. కానీ, ఎప్పుడైతే మార్టిన్ స్వెట్‌మన్ (Martin Sweatman) అనే ఇంజనీర్ దీన్ని ఆస్ట్రానమీ సాఫ్ట్‌వేర్‌తో డీకోడ్ చేశారో... మైండ్ బ్లోయింగ్ నిజం బయటపడింది.

ఈ పిల్లర్ మీద ఉన్న ప్రతి జంతువు... ఒక నక్షత్ర రాశికి (Constellation) సంకేతం!

ఇక్కడ ఉన్న తేలు (Scorpion)... మన వృశ్చిక రాశిని (Scorpio Constellation) పోలి ఉంది. ఇక్కడ ఉన్న రాబందు... సిగ్నస్ (Cygnus) లేదా లైరా (Lyra) నక్షత్ర మండలం. మధ్యలో ఉన్న ఆ గుండ్రటి చక్రం... సూర్యుడు!

కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే... ఈ నక్షత్రాలన్నీ ఈ పొజిషన్‌లో ఎప్పుడు ఉన్నాయి? అని కంప్యూటర్‌లో రివర్స్ చేసి చూస్తే... అది కచ్చితంగా సామాన్యశక పూర్వం 10,950 నాటి ఆకాశం! అంటే, సరిగ్గా 'యంగర్ డ్రైయాస్' (Younger Dryas) అనే మంచు యుగం మొదలైన రోజు అది. ఒక భారీ తోకచుక్క (Comet) భూమిని ఢీకొట్టిన సమయం అది.

మరి దీనికీ మన వేదాలకూ సంబంధం ఏంటి? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.

స్వాతంత్ర్య సమరయోధులు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, గొప్ప ఖగోళ శాస్త్రవేత్త (Astronomer) కూడా. ఆయన రాసిన 'The Orion' అనే పుస్తకంలో ఒక సంచలనాత్మక విషయం చెప్పారు.

ఋగ్వేదంలోని అనేక శ్లోకాలు, ఆ నాటి గ్రహ స్థితులను (Planetary Positions) వర్ణిస్తాయి. తిలక్ గారి ప్రకారం, వేదాల్లోని కొన్ని సంఘటనలు జరగాలంటే, వసంత ఋతువు అంటే Vernal Equinox అనేది మృగశిర నక్షత్రం అంటే, Orion లో జరిగి ఉండాలి. అంటే, సుమారు సా.శ.పూ 4,500 నుండి 6,000 సంవత్సరాల మధ్య కాలం.

కానీ గోబెక్లీ టెపే అంతకంటే పాతది. అయితే, ఇక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ లింక్, 'ప్రజాపతి' (Prajapati).

ఐతరేయ బ్రాహ్మణం (Aitareya Brahmana) లో ఒక కథ ఉంది. ప్రజాపతి అంటే సృష్టికర్త ఒక ఆడ జింక రూపంలో ఉన్న తన కూతురిని మోహించినప్పుడు, దేవతలు కోపించి రుద్రుడిని సృష్టించారు. రుద్రుడు బాణం ఎక్కుపెట్టి ప్రజాపతిని వెంబడించాడు.

ఇది పురాణ కథలా అనిపించొచ్చు. కానీ ఆస్ట్రానమీ ప్రకారం చూస్తే... ప్రజాపతి అంటే ఓరియన్ లేక మృగశిర (Orion/Mrigasira), రుద్రుడు అంటే సిరియస్ లేక ఆరుద్రా (Sirius/Ardra) నక్షత్రం.

ఆకాశంలో సిరియస్ నక్షత్రం ఎప్పుడూ ఓరియన్‌ ను తరుముతున్నట్టే ఉంటుంది. గోబెక్లీ టెపేలో ఉన్న ప్రధానమైన పిల్లర్స్ అన్నీ కూడా దక్షిణం వైపు, అంటే ఈ ఓరియన్ మరియు సిరియస్ నక్షత్రాలు ఉదయించే దిశగానే కట్టబడ్డాయి!

దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతోంది? టర్కీలో ఉన్న ఈ పురాతన మానవులు, మన వేద ఋషులను పోలి ఉన్నారు. ఇద్దరూ ఒకే ఆకాశాన్ని, ఒకే నక్షత్రాలను, ఒకే కథతో ఆరాధించారా? గోబెక్లీ టెపే ప్రజలు ఆరాధించిన ఆ 'ఆకాశ దేవుడు' మరెవరో కాదు, వైదిక రుద్రుడా?

ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గోబెక్లీ టెపేలో పిల్లర్స్ మీద, చేతులు పొట్ట మీద పెట్టుకున్నట్లు ఉంటాయి. సరిగ్గా ఇదే భంగిమలో మనకు హరప్పా, మొహంజదారోలో దొరికిన 'పశుపతి' (Pashupati) విగ్రహం ఉంటుంది. అంతెందుకు, వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవారి విగ్రహంలో ఎడమ చేయి కూడా ఇదే పొజిషన్‌లో కనిపిస్తుంది.

ఇది కేవలం యాదృచ్ఛికమా? లేక, 12,000 ఏళ్ల క్రితం ఒక గొప్ప ప్రళయం వచ్చినప్పుడు, ఆ విజ్ఞానాన్ని రాబోయే తరాలకు అందించడానికి, మన ఋషులు ఈ రాతి కట్టడాలను లైబ్రరీలాగా మార్చారా?

గోబెక్లీ టెపే పిల్లర్ 43 అనేది... మనిషి రాసిన మొట్టమొదటి 'హచ్చరిక లేఖ' (Warning Letter). 'ఆకాశం వైపు చూడండి, ప్రమాదం అక్కడి నుంచే వస్తుంది' అని వాళ్లు చెప్పకనే చెప్పారు. మన వేదాల్లో ఇంద్రుడు 'వజ్రాయుధంతో' పర్వతాలను పగులగొట్టాడని ఉంటుంది. ఆ వజ్రాయుధం భూమిని ఢీకొట్టిన ఆ తోకచుక్కేనా?"

అందుకేనేమో... గోబెక్లీ టెపేని ఎవరో దాడి చేసి పడగొట్టలేదు. ఆ ప్రజలే స్వయంగా, చాలా జాగ్రత్తగా, టన్నుల కొద్దీ మట్టిని తెచ్చి ఆ గుడిని కప్పేశారు. భవిష్యత్తులో ఎప్పుడైనా మనిషి మళ్ళీ జ్ఞానాన్ని పొందినప్పుడు, దీన్ని తవ్వి అసలు నిజాన్ని తెలుసుకుంటాడని వాళ్ళ ఆశ కావచ్చు. ఆ నిజం ఇప్పుడు మన కళ్ల ముందు ఉంది.

బాల గంగాధర్ తిలక్ గారు రాసిన 'The Arctic Home in the Vedas' పుస్తకంలో, రుగ్వేదంలోని శ్లోకాలను బట్టి, ఆర్యులు లేదా వైదిక ప్రజలు ఒకప్పుడు ధృవ ప్రాంతాలకు దగ్గరగా ఉండేవారని ఆయన ప్రతిపాదించారు.

గోబెక్లీ టెపేలో ఉన్న 'Vulture Stone' (Pillar 43) మీద ఉన్న చిత్తరువులు, ఆనాటి నక్షత్రాల స్థితిగతులను (Star map) చూపిస్తున్నాయని సైంటిస్టులు ఈ మధ్యే కనుగొన్నారు. అది కచ్చితంగా సా.శ.పూ 10,950 ఏళ్ల నాటి ఆకాశం. మన వేదాల్లో 'ప్రజాపతి'ని (Creator) మృగశిర నక్షత్రం లేదా ఓరియన్ (Orion) రూపంలో ఆరాధిస్తారు. గోబెక్లీ టెపే ఓరియన్ బెల్ట్‌కి అనుగుణంగా కట్టబడిందని ఒక బలమైన వాదన ఉంది. అంటే, ఆనాటి ప్రజలు, మన వేదాల్లో చెప్పబడిన ఖగోళ శాస్త్రాన్నే (Astronomy) ఫాలో అయ్యారా?

చివరగా, దీని అర్థం గోబెక్లీ టెపేని కట్టింది భారతీయులేనా? అని మీరు అడగవచ్చు. దానికి కచ్చితమైన ఆధారం లేదు. కానీ... చరిత్ర మనం అనుకున్నంత సరళమైనది కాదు. వేదాలు కేవలం మత గ్రంథాలు కాదు. అవి అంతకు ముందు ఉండి, అంతరించిపోయిన ఒక గొప్ప నాగరికత (Lost Civilization) తాలూకు విజ్ఞాన సర్వస్వం అని అర్ధమవుతోంది. వేదాలు సృష్టి ఆది నుంచీ ఉన్నాయని మనకు తెలిసినా, ఇలా చెప్పుకోవడం, సైన్స్ పరమైన చర్చ మాత్రమే అని సహృదయులు గమనించాలి.

అయితే, అసలు భారతదేశంలోని వైదిక సంస్కృతి టర్కీ దాకా ఎలా వెళ్ళింది? దీనికి సమాధానం మన శ్రీమద్భాగవత పురాణంలోనే దొరుకుతుంది.

భాగవతం ప్రకారం, ఎప్పుడైతే క్షత్రియులు ధర్మం తప్పి ప్రవర్తించడం మొదలుపెట్టారో, అప్పుడు శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా అవతరించాడు. ఆయన ఇరవై ఒక్క సార్లు భూమండలంపై దండయాత్ర చేసి, దుర్మార్గులైన రాజులను శిక్షించాడు.

ఆ సమయంలో... పరశురాముడి గొడ్డలి దెబ్బకు భయపడి, భరతవర్షం (India) నుండి అనేకమంది క్షత్రియ రాజులు ప్రాణభయంతో విదేశాలకు పారిపోయారు. మన పురాణాలు వీరినే 'మ్లేచ్ఛులు' (Mlechas) లేదా 'యవనులు' (Yavanas) అని పేర్కొన్నాయి.

సైన్స్ ప్రకారం చూసినా, చరిత్ర ప్రకారం చూసినా... బహుశా గోబెక్లీ టెపే నిర్మించింది ఆ పారిపోయిన రాజులే కావచ్చు కదా? వారు తమతో పాటు వైదిక సంస్కృతిని, యజ్ఞయాగాదుల పద్ధతులను అక్కడికి తీసుకెళ్లారు. కానీ కాలక్రమేణా, ఆ సంప్రదాయాలు మార్పులకు లోనై, ఇలా రాతి కట్టడాలుగా మిగిలిపోయి ఉండవచ్చు.

అంటే, సనాతన ధర్మం ఒకప్పుడు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు, అది ప్రపంచమంతటా విస్తరించి ఉండేది అని తెలుస్తోంది. కాల గర్భంలో కప్పబడిపోయిన ఆ గొప్ప చరిత్రకు గోబెక్లీ టెపే ఒక మౌన సాక్ష్యం మాత్రమే! సింధు నాగరికత (Indus Valley) కంటే వేల ఏళ్ల ముందే, ఒక గొప్ప జ్ఞానం ప్రపంచమంతా ఉందని మరోసారి నిరూపితమవుతోంది.

దీనిపై మీ అభిప్రాయం ఏంటి? గోబెక్లీ టెపే, వైదిక సంస్కృతికి ప్రతిరూపమా? కామెంట్స్‌లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ హిస్టరీ మిస్టరీల కోసం మన ఛానెల్‌ని సబ్స్‌క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి.

జై హింద్! లోకా సమస్తా సుఖినో భవంతు..

Monday, December 29, 2025

4000-Year-Old Aryan City Found in Russia? 5 Shocking Secrets of Arkaim: Did Aryans Migrate from Russia? (Tilak's Theory)

 

రష్యాలో బయటపడ్డ 4000 ఏళ్ళ నాటి 'హిందూ' నగరం!
స్వస్తిక్ ఆకారంలో ఉన్న ఆ నగరం ఎవరిది? - ఆర్యుల జన్మస్థానం పై సంచలన నిజాలు!
4000-year-old Aryan city discovered in Russia

చరిత్ర అనేది పుస్తకాలలో దాగి ఉన్న పాఠాలు మాత్రమే కాదు... త్రవ్వేకొద్దీ బయటపడే అనంతమైన సత్యమది. సనాతన ధర్మం, లేదా హిందూ సంస్కృతి, కేవలం భారత ఉపఖండానికి మాత్రమే పరిమితం అని అనుకోవడం, మన పూర్వీకులు కాశీ నుండి కన్యాకుమారి వరకు మాత్రమే నడిచారని అనుకోవడం మూర్ఖత్వమే..

భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో... మంచుతో కప్పబడిన రష్యా దేశంలో... దాదాపు 4000 సంవత్సరాల క్రితం, ఒక నగరం ఉండేది. ఆ నగరం సామాన్యమైనది కాదు. ఆకాశం నుండి చూస్తే అది ఒక బ్రహ్మాండమైన చక్రంలా, లేదా ఒక యంత్రంలా కనిపిస్తుంది.
అక్కడ త్రవ్వకాలు జరిపిన శాస్త్రవేత్తలకు ఏం దొరికాయో తెలుసా? భారీ శివలింగాలా? కాదు. విగ్రహాలా? కాదు. అక్కడ దొరికింది... అగ్ని హోమ గుండాలు! అవును, మనం పెళ్లిళ్లలో, యాగాలలో వాడే అగ్ని గుండాలు. అక్కడ దొరికిన కుండల మీద 'స్వస్తిక్' గుర్తులు ఉన్నాయి. వాళ్ళు చనిపోయిన వారిని ఖననం చేసే పద్ధతి మన ఋగ్వేదంలో చెప్పబడిన పద్ధతిని పోలి ఉంది.

అదే... అర్కైమ్ (Arkaim). రష్యాలోని 'స్టోన్‌హెంజ్' అని పిలవబడే ఈ నగరం, మన ఆర్యుల చరిత్రకూ, మన వేదాలకూ సజీవ సాక్ష్యమా? అసలు ఆర్యులు రష్యా నుండి భారత్‌కు వచ్చారా? లేక భారత్ నుండే అక్కడికి వెళ్లారా? వంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ రోజు మనం టైమ్ ట్రావెల్ చేయాల్సిందే, 4000 ఏళ్ళు వెనక్కి వెళ్ళాల్సిందే!"

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Y4aEThKOukg ]


ఈ కథ మొదలైంది 1987లో. అప్పటి సోవియట్ యూనియన్ (USSR) ప్రభుత్వం, దక్షిణ ఉరల్ పర్వతాల దగ్గర ఒక పెద్ద డ్యామ్ కట్టాలని నిర్ణయించింది. ఆ ప్రాజెక్ట్ కోసం ఆ ప్రాంతం మొత్తాన్ని నీటిలో ముంచేయాలి. కానీ నియమాల ప్రకారం, డ్యామ్ కట్టే ముందు పురావస్తు శాఖ వారు అక్కడ ఏమైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయేమో చూడాలి.

అలా వెళ్ళిన పురావస్తు శాస్త్రవేత్తలకు అక్కడ కనిపించింది రాళ్ళు రప్పలు కాదు. ఒక అద్భుతమైన వృత్తాకారపు నిర్మాణం (Circular Structure). మొదట వాళ్ళు అదేదో చిన్న కోట అని అనుకున్నారు. కానీ త్రవ్వేకొద్దీ వారి కళ్ళు బైర్లు కమ్మాయి. అక్కడ బయటపడింది ఒక ప్రణాళికాబద్ధమైన నగరం. డ్యామ్ కడితే ఆ చరిత్ర మొత్తం నీటి పాలవుతుందని అర్థమై, శాస్త్రవేత్తలు ప్రభుత్వాన్ని ఎదిరించి, ఆ ప్రదేశాన్ని కాపాడారు. అదే అర్కైమ్.

కార్బన్ డేటింగ్ చేస్తే... అది సామాన్య శక పూర్వం 2000 ఏళ్ల నాటిదని తేలింది. అంటే ఇప్పటికి సుమారు 4000 ఏళ్ళ పై మాటే. అది సింధు నాగరికత (Indus Valley Civilization) చివరి దశలో ఉన్న సమయం.

ఆ నగర నిర్మాణం చూసి మోడ్రన్ ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోయారు. మన ఊళ్ళలాగా చదరంగా లేదు. గుండ్రంగా ఉండి, రెండు పెద్ద రక్షణ గోడలు (Defensive Walls) ఉన్నాయి. బయట ఒక గోడ, లోపల మరో గోడ. మధ్యలో ఖాళీ స్థలం. ఇళ్ళు ఆ గోడలకు ఆనుకుని, కేంద్రం వైపు చూస్తున్నట్లు ఉంటాయి.

పై నుండి చూస్తే అది సరిగ్గా ఒక 'మండలం' (Mandala) లాగా ఉంటుంది. కొంతమంది దానిని 'స్వస్తిక్ సిటీ' అని కూడా పిలుస్తారు. కారణం, దాని ముఖద్వారాలూ, వీధులూ, స్వస్తిక్ ఆకారంలో డిజైన్ చేయబడ్డాయి. సంస్కృతంలో 'స్వస్తిక్' అంటే 'శుభం' లేదా 'మంచి జరగడం' అని అర్థం.

ఈ నిర్మాణం కేవలం నివాసం కోసం కాదు.. ఇది ఒక ఖగోళ వేధశాల (Astronomical Observatory) లాగా కూడా పనిచేసింది. సూర్య చంద్రుల కదలికలను బట్టి వారు కాలమానాన్ని లెక్కించేవారు. ఇది మన ప్రాచీన భారతీయ జ్యోతిషశాస్త్రానికి దగ్గరగా ఉండటం యాదృచ్ఛికమా?

ఇక అర్కైమ్ ప్రజలు ఎవరిని పూజించేవారు? అక్కడ గుడులు లేవు, విగ్రహాలు లేవు. కానీ ప్రతి ఇంట్లోనూ ఒక బావి (Well) మరియు ఒక అగ్ని గుండం (Fire Altar) ఉంది.

ఇక్కడ మనం గమనించాల్సింది, ప్రపంచంలో అగ్నిని దైవంగా భావించి పూజించే సంస్కృతులు చాలా తక్కువ. అందులో ప్రధానమైనది మన వైదిక సంస్కృతి. ఋగ్వేదంలో మొదటి మంత్రమే 'అగ్నిమీళే పురోహితం...' అని మొదలవుతుంది. అర్కైమ్ ప్రజలు కూడా అగ్నినే తమ ప్రధాన దైవంగా కొలిచేవారు.

పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ జంతువుల ఎముకలనూ, బూడిదనూ కనుగొన్నారు. ఇది మన అశ్వమేధ యాగం లేదా ఇతర క్రతువులను పోలి ఉంది. అంటే, 4000 ఏళ్ళ క్రితం రష్యా గడ్డపై 'స్వాహా' అనే మంత్రాలు ప్రతిధ్వనించి ఉంటాయా? అక్కడ దొరికిన కుండల మీద ఉన్న డిజైన్లకీ, మన వేద కాలం నాటి పాత్రలకీ చాలా దగ్గర పోలికలున్నాయి.

ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా యుద్ధ రథాలను (Chariots with spoked wheels) వాడింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం అర్కైమ్ పరిసర ప్రాంతాలలో దొరికింది. అక్కడ సమాధుల్లో గుర్రాలతో పాటు, రథాలను కూడా పూడ్చిపెట్టారు.

మహాభారత యుద్ధంలో రథాల ప్రాముఖ్యత మనకు తెలుసు. కృష్ణుడు అర్జునుడికి రథసారధిగా ఉన్నాడు. ఆ రథాల టెక్నాలజీ, ఆ జీవనశైలి, ఆ యుద్ధ తంత్రాలు... ఇవన్నీ అర్కైమ్ ప్రజలకు తెలుసు. అందుకే చరిత్రకారులు వీరిని 'సింతాష్టా సంస్కృతి' (Sintashta Culture) అని పిలుస్తారు. ఇది ఇండో-ఇరానియన్ లేదా ఆర్యన్ జాతికి చెందినదని నమ్ముతారు.

అర్కైమ్ గురించి, అక్కడ దొరికిన అగ్ని గుండాల గురించి విన్నాక... మనకు ఒక సందేహం కలగవచ్చు. 'అసలు మన ఋషులు, మన పూర్వీకులు, ఆ మంచు ప్రాంతాల్లో ఎందుకున్నారు? మనం ఉండేది ఉష్ణ మండలంలో కదా?' అని.

ఈ ప్రశ్నకు సమాధానం మన దేశ స్వాతంత్ర్య సమరయోధులూ, గొప్ప మేధావీ అయిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు, వంద సంవత్సరాల క్రితమే ఇచ్చారు. ఆయన రాసిన సంచలనాత్మక పుస్తకం... 'The Arctic Home in the Vedas'.

తిలక్ గారు జైలులో ఉన్నప్పుడు ఋగ్వేదాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో వర్ణించిన కొన్ని ఖగోళ సంఘటనలు (Astronomical Events) చూసి, ఆయన ఆశ్చర్యపోయారు. వేదాలలో... సూర్యుడు ఉదయించడానికి ముందు ఉండే 'ఉషోదయం' (Dawn) చాలా సేపు, అంటే కొన్ని రోజుల పాటు కొనసాగుతుందని వర్ణించి ఉంది. అలాగే 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి ఉండే ప్రదేశాల గురించి ప్రస్తావన ఉంది.

భారతదేశంలో ఎక్కడా 6 నెలలు పగలు ఉండదు. సూర్యోదయం గంటల తరబడి సాగదు. ఇలాంటివి కేవలం ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండే ఆర్కిటిక్ లేదా సైబీరియా, రష్యా ప్రాంతాలలోనే సాధ్యం. దీన్ని బట్టి, ఆర్యుల అసలు నివాసం ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండే ప్రాంతమనీ, అక్కడి నుండే వారు వాతావరణ మార్పుల వల్ల క్రిందకు అంటే, దక్షిణ దిశగా వలస వచ్చారనీ సిద్ధాంతీకరించారు, తిలక్ గారు. రష్యాలో బయటపడ్డ ఈ అర్కైమ్ నగరం... తిలక్ గారి వాదనకు ఒక బలమైన సాక్ష్యంగా నిలుస్తోంది."

ఇక పురావస్తు శాస్త్రం (Archaeology) విషయానికి వస్తే... ఈ అర్కైమ్ నగరం ఒక్కటే కాదు. దీని వెనుక 'సింతాష్టా సంస్కృతి' (Sintashta Culture) అనే ఒక భారీ నాగరికత ఉంది. సామాన్య శక పూర్వం 2100 నుండి 1800 మధ్య కాలంలో... అంటే నేటికి సుమారుగా 4000 ఏళ్ళ క్రితం, దక్షిణ రష్యా మరియు ఉత్తర కజకిస్తాన్ ప్రాంతాల్లో ఈ సంస్కృతి వెల్లివిరిసింది.

సింతాష్టా ఎందుకు అంత ప్రత్యేకం? ఎందుకంటే, ప్రపంచానికి 'యుద్ధ రథాన్ని' (War Chariot) పరిచయం చేసింది వీరే!

అప్పటివరకు బండి చక్రాలు దిమ్మల్లాగా (Solid Wheels) ఉండేవి. కానీ, మొట్టమొదటిసారిగా చక్రానికి పుల్లలు (Spokes) పెట్టి, వేగంగా కదిలే రథాలను తయారు చేసింది సింతాష్టా ప్రజలే. ఆ రథాల మీద ఎక్కి వారు యుద్ధాలు చేసేవారు. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో వాడిన రథాల టెక్నాలజీకి మూలం ఇక్కడే ఉందంటే మీరు నమ్మగలరా?

అంతేకాదు, సింతాష్టా త్రవ్వకాలలో దొరికిన సమాధుల్లో... మనిషితో పాటు గుర్రాలను, రథాలను, ఆయుధాలను పాతిపెట్టేవారు. ఇది మన వైదిక సంస్కృతిలో రాజులు చేసే 'అశ్వమేధ యాగం' తాలూకు ఆచారాలను గుర్తుచేస్తోంది. గుర్రాన్ని బలి ఇవ్వడం లేదా పూజించడం అనేది వీరి సంస్కృతిలో ప్రధాన భాగం.

సింతాష్టా ప్రజలు లోహ విద్యలో (Metallurgy) ఆరితేరినవారు. రాగి (Copper) మరియు కంచు (Bronze) ఆయుధాలు తయారు చేయడంలో వీరు దిట్ట. మన పురాణాల్లో 'విశ్వకర్మ' లాంటి వారు ఆయుధాలు తయారు చేసినట్లు, వీరు ఆ కాలంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలను తయారు చేసేవారు.

భాషాపరంగా చూస్తే... వీరు మాట్లాడిన భాష 'ప్రోటో-ఇండో-ఇరానియన్' అనేది, సంస్కృతానికి దగ్గరి భాష. అందుకే అర్కైమ్ మరియు సింతాష్టా ప్రాంతాల్లో దొరికిన ఆధారాలు, నేరుగా సనాతన ధర్మానికీ, వేదాలకూ ముడిపడుతున్నాయి.

ఇక మిలియన్ డాలర్ ప్రశ్న, వీరు ఎవరు? అనేది. దీనికి రెండు వాదనలున్నాయి.

మొదటిది ఆర్యన్ ఇన్వేషన్ థియరీ (Aryan Invasion Theory): మధ్య ఆసియా అంటే రష్యా నుండి ఆర్యులు గుర్రాలపై వచ్చి భారత్‌లో స్థిరపడ్డారు, వారి వెంటే వేదాలు తెచ్చారనేది ఒక వాదన. అర్కైమ్ దానికి సాక్ష్యం అని పాశ్చాత్యులు అంటారు.

రెండవది, ఔట్ ఆఫ్ ఇండియా థియరీ (Out of India Theory): భారత్ నుండే ఒక సమూహం పశ్చిమ దిశగా వలస వెళ్ళింది. వారు తమతో పాటు వైదిక సంస్కృతినీ, అగ్ని ఆరాధననూ రష్యా, ఇరాన్, యూరప్ వరకు తీసుకెళ్ళారనేది, మరో బలమైన వాదన.

ఏది ఏమైనా, ఒకటి మాత్రం నిజం. నేటి భౌగోళిక సరిహద్దులు మన పూర్వీకులకు లేవు. సనాతన ధర్మం అనేది ఏదో ఒక చిన్న ప్రాంతానికి పరిమితమైనది కాదు. అది విశ్వజనీనం. అర్కైమ్ నగరం, బహుశా మన పూర్వీకులు వేసిన ఒక అడుగు జాడ కావచ్చు. ఆ అగ్ని గుండాల్లో వెలిగిన నిప్పు, మన వంట్లో ప్రవహించే రక్తంలో ఇంకా ఉష్ణాన్ని నింపుతూనే ఉంది.

కాలం గడిచేకొద్దీ నగరాలకు నగరాలు మట్టిలో కలిసిపోవచ్చు. గోడలు కూలిపోవచ్చు. కానీ సంస్కృతి అంత సులభంగా చెరిగిపోదు. రష్యాలోని ఆ మంచు పొరల కింద దాగి ఉన్న అర్కైమ్... మనకు ఒకటే చెబుతోంది. మన మూలాలు మనం అనుకున్నదానికంటే చాలా లోతైనవి. ఆదీ అంతం లేనిదే సనాతన ధర్మం..

ఈ వీడియో మీకు నచ్చితే, మన చరిత్రను, మన ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం 'Voice of Maheedhar' చానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.

జై హింద్! లోకా సమస్తా సుఖినో భవంతు..

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...