Shocking 5000-Year-Old Celtic – Vedic Connection | India to Ireland Mystery | 5000 ఏళ్ళ రహస్యం!

 

ఐరోపాలో హిందూ ధర్మం ఎలా అంతమైంది? | క్రైస్తవం దాచిన నిజాలు!
Shocking 5000-Year-Old Celtic – Vedic Connection | India to Ireland Mystery!

మనం ఈ రోజు ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాము. ఒకసారి ఊహించండి... వేల సంవత్సరాల క్రితం, మన భారతదేశానికి వేల మైళ్ల దూరంలో ఉన్న ఐరోపాలోని దట్టమైన అడవులలో, ఓంకార నాదాలు వినిపించాయంటే? అక్కడ కూడా మన బ్రాహ్మణుల లాంటి పూజారులు యజ్ఞాలు చేశారంటే?

మీరు వింటున్నది నిజమే. ఐరోపాలో ఒకప్పుడు విలసిల్లిన 'కెల్టిక్' (Celtic) నాగరికతకూ, మన సనాతన ధర్మానికీ మధ్య ఉన్న పోలికలు చూసి, చరిత్రకారులే ఆశ్చర్యపోతున్నారు.

ఐర్లాండ్ నుండి భారత్ వరకు... ద్రుయిడ్ల (Druids) నుండి ద్విజుల (Brahmins) వరకు... ఈ సంబంధం ఏమిటి..? ఈ రోజుటి మన వీడియోలో, పురాతన గ్రంథాల ఆధారంగా ఆ రహస్యాన్ని ఛేదిద్దాము. చివరి వరకు చూస్తే, ఈ నిజాలు మనలో ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా, ఆత్మ గౌరవాన్ని పెంచుతాయి.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/BLMkJGqKOHQ ]


ముందుగా భాషతో మొదలుపెడదాము. భాష అనేది సంస్కృతికి ఊపిరి లాంటిది. పశ్చిమ దేశాల భాషలకు మన సంస్కృతమే తల్లి అని చాలా మందికి తెలుసు. అయినా కెల్టిక్ భాషలో ఉన్న పదాలు చూస్తే మీరు షాక్ అవుతారు.

ఉదాహరణకు: మనం రాజుని 'రాజా' (Raja) అంటాము. పాత ఐరిష్ భాషలో రాజుని 'రీ' (Ri) అంటారు. మనం శ్రేష్ఠుడిని 'ఆర్య' (Arya) అంటాము. వారు 'ఐరే' (Aire) అంటారు. మనకు 'మరుత్' (Marut) అంటే గాలి దేవుడు. వారికి 'మ్రవ్' (Marbh) అంటే చనిపోయిన వారి ఆత్మలు గాలిలో కలవడం.

ఇంత దగ్గరి పోలికలు కాకతాళీయంగా ఎలా ఉంటాయి? చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, వేల సంవత్సరాల క్రితం ఒకే పూర్వీకుల నుండి రెండు సమూహాలుగా విడిపోయి, ఒకరు తూర్పున భరతఖండంలో ఉండిపోతే, మరొకరు పడమరన ఐరోపాకు వలస వెళ్లారనీ, అందుకే మన సంస్కృతులలో ఆత్మ ఒక్కటే... ఆచరణలు వేరనీ అంటారు.

కేవలం భాషా పరమైన పోలికలే కాదు, మన వేదాల్లోనే దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఋగ్వేదంలోని 7వ మండలంలో 'దశరాజ్ఞ యుద్ధం' (Battle of Ten Kings) గురించి ఒక వర్ణన ఉంది. ఇది సుదాసుడు అనే రాజుకూ, పది మంది ఇతర రాజుల కూటమికీ మధ్య రావి నది (Parushni River) ఒడ్డున జరిగిన భీకర యుద్ధం. దీనికి సంబంధించి మనం గతంలో చేసిన వీడియో చూస్తే మీకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది.

ఈ పది మంది రాజుల సమూహంలో 'ద్రుహ్యులు' (Druhyus) అనే తెగ వారున్నారు. ఈ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత, ద్రుహ్యులను పశ్చిమ దిశగా (Westwards) తరిమికొట్టారని ఇతిహాసాలు చెబుతున్నాయి. వాయు పురాణం ప్రకారం, ఈ ద్రుహ్యులు గాంధార దేశం అంటే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ను దాటి, ఉత్తరానికి మరియు పడమర దిశగా ప్రయాణించి 'మ్లేచ్ఛ' దేశాల రాజులయ్యారని చెప్పబడింది.

చరిత్రకారుల ప్రకారం, ఆనాడు మన భారతదేశం నుండి వెళ్ళగొట్టబడిన ఈ 'ద్రుహ్యులే', కాలక్రమేణా యూరప్ చేరి, 'ద్రుయిడ్లు' (Druids) లేదా 'కెల్ట్స్' (Celts) గా మారి ఉండవచ్చు. 'ద్రుహ్యు' అనే పదమే మార్పు చెంది 'ద్రుయిడ్' అయ్యిందని ఒక బలమైన వాదన ఉంది.

ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం, 'ద్రుయిడ్లు' (Druids). పురాతన కెల్టిక్ సమాజంలో ద్రుయిడ్లు అంటే అత్యున్నత పూజారులు, న్యాయమూర్తులు మరియు వైద్యులు. మన సమాజంలో బ్రాహ్మణులకు ఎలాంటి స్థానం ఉందో, అక్కడ ద్రుయిడ్లకు అదే స్థానం ఉండేది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... ద్రుయిడ్ అనే పదం సంస్కృత పదం, 'ద్రు-విద్' (Dru-Vid) నుండి వచ్చింది అని పండితుల అభిప్రాయం. 'ద్రు' అంటే చెట్టు లేదా గట్టిది అని, 'విద్' అంటే వేద జ్ఞానం అని అర్థం. అంటే వారు 'గొప్ప జ్ఞానము కలిగిన వారు' అని తెలుస్తోంది.

మన వేద పండితుల లాగానే, ద్రుయిడ్లు కూడా తమ జ్ఞానాన్ని ఎక్కడా రాసేవారు కాదు. వారు తమ శ్లోకాలను, మంత్రాలను వాఙ్మయం ద్వారానే (Oral Tradition) శిష్యులకు నేర్పించేవారు. ఒక్కో ద్రుయిడ్ వేల కొద్దీ పద్యాలను కంఠస్థం చేసేవారు. సరిగ్గా ఎలాగైతే వేదాలను మనవారు శ్రవణం ద్వారా నేర్చుకున్నారో, అక్కడ కూడా అదే పద్ధతిని అవలంభించారు.

వారికీ మనకూ ఉన్న మరొక పోలిక, తెల్లటి వస్త్రాలు ధరించడం మరియు చేతిలో దండం (Staff) పట్టుకోవడం.

ఇక ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. డెన్మార్క్‌లో దొరికిన 'గుండెస్ట్రప్ కాల్డ్రన్' (Gundestrup Cauldron) అనే వెండి పాత్ర మీద ఒక బొమ్మ ఉంటుంది. దాని పేరు 'సెర్నున్నోస్' (Cernunnos).

ఈ బొమ్మను జాగ్రత్తగా చూడండి. అతను పద్మాసనంలో (Yogic Posture) కూర్చుని ఉన్నాడు. అతని చుట్టూ జంతువులూ, తలపై కొమ్ములు, చేతిలో పాము ఉంది.

ఇది మీకు ఎవరిని గుర్తుచేస్తోంది? అవును... మన పశుపతి నాథుడు, శివుడు. సింధు నాగరికతలో దొరికిన పశుపతి సీల్‌కీ, ఈ సెర్నున్నోస్ విగ్రహానికీ 90% పోలికలు ఉన్నాయి. ఐరోపా అడవుల్లో యోగ ముద్రలో కూర్చున్న దేవుడిని పూజించడం అంటే, సనాతన ధర్మం యొక్క ప్రభావం ఎంత వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఇది చాలా మందికి తెలియని రహస్యం. సాక్షాత్తు మన శ్రీరామచంద్రుని ప్రభావం కూడా కెల్టిక్ జాతిపై ఉందని కొన్ని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. 18వ శతాబ్దంలో 'ఏషియాటిక్ రీసెర్చస్' (Asiatic Researches) లో సర్ విలియం జోన్స్ (Sir William Jones) మరియు కర్నల్ విల్ఫోర్డ్ వంటి బ్రిటిష్ అధికారులే ఒక వింత విషయాన్ని నమోదు చేశారు.

పురాతన ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ ప్రాంతాల్లో, ఒకప్పుడు వారు జరుపుకున్న ఉత్సవాల్లో 'రామ-సీత' (Rama-Sita) అనే పేరు వినిపించేదని రాసుకొచ్చారు. అంతేకాదు, కెల్టిక్ భాషలో 'రామ్' (Ram) అంటే 'అత్యున్నతమైన' (High or Noble) అని అర్థం. మన రాముడు 'సూర్యవంశపు' రాజన్న విషయం మనకు తెలిసిందే. అటు కెల్టిక్ ద్రుయిడ్లు కూడా ప్రధానంగా 'సూర్య ఆరాధకులు' (Sun Worshippers).

త్రేతాయుగంలో శ్రీరాముడి కీర్తి సప్త సముద్రాలు దాటి ఐరోపా ఖండం వరకు విస్తరించిందని చెప్పడానికి, ఐరోపా నడిబొడ్డున వినిపించిన ఈ 'రామ' నామమే నిదర్శనం అని కొంతమంది చరిత్రకారుల గట్టి నమ్మకం.

ఇక మన పురాణాలలో 'దను' (Danu) అనే రాక్షస మాత ఉంది. 'దానవులు' ఆమె సంతానం. ఋగ్వేదంలో దను అంటే నీరు లేదా ప్రవాహం అని కూడా అర్థం ఉంది.

ఐరిష్ పురాణాలలో వారి ప్రధాన దేవతలను 'తువా త డె దనన్' (Tuatha Dé Danann) అంటారు. అంటే 'దను మాత యొక్క బిడ్డలు' (Children of Goddess Danu) అని అర్థం.

ఐరోపాలో ప్రవహించే అతి పెద్ద నది 'డాన్యూబ్' (Danube River). ఆ పేరు కూడా ఈ 'దను' దేవత పేరు మీదే వచ్చింది. నీటిని పవిత్రంగా పూజించడం, నదులను దేవతలుగా భావించడం అనేది కెల్టిక్ మరియు వైదిక సంస్కృతులలో సమానంగా కనిపిస్తుంది.

ఈ 'దను' (Danu) దేవత గురించి మన పురాణాల్లో స్పష్టంగా ఉంది. సృష్టికర్తలలో ఒకరైన కశ్యప ప్రజాపతికీ, దక్షుని కుమార్తె అయిన 'దను' (Danu) కు పుట్టిన సంతానమే 'దానవులు'.

మనం సినిమాల్లో చూసినట్లు దానవులు అంటే వికారమైన రాక్షసులు కాదు, వారు గొప్ప మాయావులు మరియు మయుడి వంటి అత్యున్నత సాంకేతిక నిపుణులు (Architects like Mayasura). వామన పురాణం మరియు ఇతర గ్రంథాల ప్రకారం, దేవతలతో జరిగిన యుద్ధాల్లో ఓడిపోయిన దానవులు, సముద్రాన్ని దాటి సుదూర ప్రాంతాలకు వెళ్లిపోయారు.

ఐరిష్ జానపద కథలు (Folklore) ఏం చెబుతున్నాయో తెలుసా? వారి దేవతలైన 'తువా త డె దనన్' (Tuatha Dé Danann) ఆకాశం నుండి మేఘాల మధ్యలో నౌకల్లో (Flying Ships) వచ్చారని..! ఇది మన పురాణాల్లో దానవులకు ఉన్న 'విమాన' సాంకేతికతను గుర్తుచేస్తోంది. వారు కేవలం వలస వెళ్లడమే కాదు, తమతో పాటు వేద సంస్కృతిని, సాంకేతికతను కూడా తీసుకువెళ్లారని దీన్ని బట్టి అర్థమవుతోంది.

కేవలం వారి దేవుళ్లే కాదు, వారి ఫిలాసఫీ (Philosophy) కూడా మనదే. ఆ కాలంలో మిగతా ఐరోపా వాసులు, మనిషి చనిపోతే స్వర్గానికో, నరకానికో వెళ్తారని నమ్మేవారు. కానీ ద్రుయిడ్లు మాత్రం 'పునర్జన్మ' (Reincarnation) ను నమ్మేవారు.

జూలియస్ సీజర్ (Julius Caesar) స్వయంగా ద్రుయిడ్ల గురించి రాస్తూ... 'వీరు ఆత్మకు చావు లేనిదనీ, ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని బోధిస్తారు. అది వారికి యుద్ధంలో భయం లేకుండా చేస్తోంది' అని చెప్పాడు. ఇది మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన - 'వాసాంసి జీర్ణాని యథా విహాయ...' అనే శ్లోకాన్ని గుర్తుచేస్తోంది.

అలాగే వారి క్యాలెండర్, వారి పండుగలు, అన్నీ మన పంచాంగం లాగానే సూర్య చంద్రుల గమనం (Astronomy) ఆధారంగానే ఉండేవి.
మరొక ఆశ్చర్యకరమైన విషయం మహాభారతంలోని 'శాంతి పర్వం'లో కనిపిస్తుంది. నారద మహర్షి నారాయణుడి దర్శనం కోసం మేరు పర్వతానికి ఉత్తర దిశగా, పాల సముదాన్ని దాటి 'శ్వేత ద్వీపం' (White Island) అనే ప్రాంతానికి వెళ్ళాడు.

వ్యాసుడు ఆ ప్రాంతాన్ని వర్ణిస్తూ... 'అక్కడ ప్రజలు చంద్రుని కాంతి వలె తెల్లగా ఉంటారనీ, వారికి ఇంద్రియ చపలత్వం ఉండక, ఏకదేవతారాధన (Monotheism) చేస్తార' నీ రాశారు. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ తన పరిశోధనలో, ఈ 'శ్వేత ద్వీపం' అనేది ఇప్పటి యూరప్ లేదా బ్రిటన్ ప్రాంతం అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అంటే, కురుక్షేత్ర యుద్ధం నాటికే మన ఋషులకు యూరప్ ఖండం గురించీ, అక్కడి ప్రజల గురించీ స్పష్టమైన అవగాహన ఉండేదన్నమాట.

అసలు ఈ చరిత్ర అంతా ఎందుకు మరుగున పడిపోయింది? దానికి సమాధానం వారి సాహిత్యంలోనే దొరుకుతుంది.

పూర్వం కెల్టిక్ ప్రజల దగ్గర 'ఎక్ట్రా' (Echtrae) అనే అద్భుతమైన సాహస గాథలు ఉండేవి. మహావీరులు సముద్రంపై చేసే సాహసోపేతమైన ప్రయాణాల గురించి (Voyages) అందులో గొప్పగా వర్ణించేవారు. ఇవి మన పురాణాల్లోని సముద్ర ప్రయాణాలను పోలి ఉండేవి.

కానీ, 7వ మరియు 8వ శతాబ్దాలలో ఐర్లాండ్‌లో క్రైస్తవ మతం విస్తరించినప్పుడు, ఒక భారీ మార్పు జరిగింది. మత మార్పిడిలో భాగంగా, వారు ఈ పురాతన కథలను ఆక్రమించారు (Usurped). ఆ పాత కథల ఆత్మను చంపేసి, వాటిని వక్రీకరించి, క్రైస్తవ ఇతివృత్తాలుగా (Christian themes) మార్చేశారు. ఈ కొత్త, కల్తీ కథలకే 'ఇమ్రామా' (Immrama) అని పేరు పెట్టారు.

ఈ చారిత్రక వక్రీకరణ (Corruption) వల్లనే... ప్రాచీన భారతదేశంతో కెల్టిక్ జాతికి ఉన్న ఎన్నో బలమైన బంధాలు బయటపడకుండా మట్టిలో కలిసిపోయాయి.

దురదృష్టవశాత్తు, ఈనాడు ఐరిష్ ప్రజలు తమ మూలాలు భారతదేశంలో ఉన్నాయన్న విషయాన్నే పూర్తిగా మర్చిపోయారు. వారి పూర్వీకులను, వారి పద్ధతులను 'పాగన్' (Pagan) పేరుతో రాక్షసీకరించడం వల్ల... ఆ గొప్ప చరిత్ర అంతా ఒక కమ్మిన చీకటిలో (Erasing Darkness) ఉండిపోయింది. ఆ చీకటి పొరను తొలగిస్తే తప్ప, మన బంధం వారి కళ్లకు కనిపించదు.

చరిత్ర పుటల్లో కనుమరుగైన ఈ నిజాలు మనకు ఏం చెబుతున్నాయి? ధర్మం అనేది ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు. 'వసుధైక కుటుంబకం' అని మన పెద్దలు ఊరికే అనలేదు. వేల ఏళ్ల క్రితమే మానవజాతి ఆలోచనా విధానం, దైవ చింతన, ప్రకృతి ఆరాధన ఒకేలా ఉండేది.

కాలక్రమేణా పేర్లు మారాయి, రూపాలు మారాయి. కానీ మూలం (Roots) మాత్రం ఒక్కటే. కెల్టిక్ సంస్కృతి, క్రైస్తవ మత వ్యాప్తితో అంతరించిపోయింది. కానీ, ఇప్పటికీ ఐర్లాండ్ పల్లెల్లో, వారి జానపద కథల్లో ఆ వేద సంస్కృతి తాలూకు ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి.

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మన పూర్వీకుల గొప్పదనాన్ని నలుగురికీ తెలియజేయడానికి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, లోతైన చరిత్రల కోసం 'Voice of Maheedhar' చానెల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.

జై హింద్! జై శ్రీరామ!

Comments

Related articles

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి? Garuda Puranam

అష్టదిగ్బంధనం! Ashta Digbandhanam - Arunachaleswara, Tiruvannamalai

11 భయంకరమైన అస్త్రాలు! మహాభారతం Mahabharatam

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!

గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! Cows and Goloka

37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి? Siva Ratri Puja