Audi9 – Telugu Mythology & Temple History Stories | Voice of Maheedhar (Planet Leaf), Shadow Madhu Babu Audiobooks, Facts Hive Youtube Channels. Here I bring you Bhagavad Gita in Telugu, Stories of Mahabharata, Ramayana, Science behind Sanatana Dharma, Hinduism, Interesting and Unknown Facts and Mysteries in Telugu, and Writer Madhu babu's Shadow, Folklore, Fantasy Fiction Novels as Audiobooks / Podcasts. Watch interesting videos Every Day in the original Voice of Maheedhar and Sudha..
కురుక్షేత్ర సంగ్రామం తరువాత భూమిపై మగవాళ్ల జనాభా తుడిచిపెట్టుకుపోయిందా?
‘D N A’ అంటే డియోక్సిరైబో న్యూక్లియిక్ ఆసిడ్ కణాలు.. ఒక మనిషి ఆరోగ్య స్థితిని తెలిపేది ఈ DNA.. ఏదైనా వింత రోగంతో బాధపడుతున్న వారి ఆ స్థితికి కారణం తెలియచేసేది DNA.. రక్త సంబంధాలనూ, వంశ మూలాలనూ తెలియచేసేది DNA.. కానీ ఇప్పుడు అదే DNA ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది. అదే DNA, ఒక చరిత్రను బయటపెట్టి, చరిత్ర పుస్తకాలను తిరగరాసేలా చేసింది. ఈ మాటలు వింటుంటే, మనిషి ఆరోగ్య స్థితిని అంచనా వేయడానికి మెడికల్ ఫీల్డ్ లో వాడే DNA, కనుమరుగయిన చరిత్రను తిరిగి మనుగడలోకి ఎలా తీసుకువచ్చింది..? DNA వల్ల బయటపడ్డ ఆ నిజాలు ఏమిటి..? అసలు ఈ పరీక్షలు ఎప్పుడు జరిగాయి..? వంటి ఎన్నో సందేహాలు కలగడం సహజం. అటువంటి సందేహాలన్నీటికీ సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
ఈ ప్రపంచంలో ప్రతి రోజు ఏదో ఒక ప్రయోగమో, పరిశోధనో జరుగుతూ ఉంటుందనే విషయం తెలిసిందే. ఇలాంటి ప్రయోగాల వల్లే ఆధునిక యుగానికి బాటలు పడ్డాయి. ఎన్నో ఆధునిక పరికరాలను కనుగొన్నాము. అంతు బట్టని ఎన్నో భయంకర వ్యాధులను సైతం జయించగలిగాము. అటువంటి ప్రయోగాలలో ఒకటే DNA. ఎంతో కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు మనిషి మనుగడకు మూలమైన DNAపై ఎన్నో పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. సాధారణంగా మనిషిలో వచ్చే జబ్బుల నుంచి, వంశ పారంపర్య రోగాలూ, అసాధారణ, వింత జబ్బుల వంటి వాటిని కూడా, DNA పరిశోధనలతో కనుగొన్నారు.
ఈ క్రమంలో కొంతమంది శాస్త్రవేత్తలు, DNA ఆధారంగా అసలు భూమిపై మనిషి పుట్టుక మొదట ఎక్కడ జరిగింది, అతను వేరు వేరు ప్రదేశాలకు ఎలా వెళ్ళాడు, ఇప్పుడు ప్రపంచంలో వివిధ దేశాలలో ఉన్న మనుషుల మూలాలు ఆ దేశంలోనే మొదలయ్యాయా? లేక పూర్వ కాలంలో వేరే ప్రాంతాల నుంచో వేరే ఖండాల నుంచో అక్కడికి వచ్చారా అనే విషయాలు తెలుసుకోడానికి, DNA పై చాలా ఏళ్లుగా ప్రయోగాలు చేస్తూన్నారు. ఈ క్రమంలో వారికి ఓ వింత సంఘటన ఎదురైంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం మనిషి చరిత్రను తవ్వి తీసే పనిలో, ఒక్కసారిగా వారికి లింక్ కట్ అయ్యింది.
2015 లో, DNA పై పరిశోధన చేసే ఓ శాస్త్రవేత్తల బృందం, ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఆ పరిశోధన ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మగాళ్ల బ్లడ్ లైన్ లో ఒక బ్రేక్ ఉందనీ, కొన్ని వేల ఏళ్ల క్రితం భూమిపై నుంచి దాదాపుగా మగవాళ్ల జనాభా తుడిచిపెట్టుకుపోయిందనీ గుర్తించారు. అదెలా అంటే, వైద్య పరి భాషలో X, Y chromosomes అనే పదాలు వినే ఉంటారు. గర్భంలో ఉన్న పిండం మగ బిడ్డగా మారబోతుందా, ఆడ బిడ్డగా రూపు దిద్దుకోబోతుందా అనే విషయాలు తెలియచేసేది, ఈ X, Y chromosomes. నేటి శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, ప్రతి మహిళలో రెండు X chromosomes ఉంటే, మగాళ్ల DNA లో ఒక X, ఒక Y chromosomes ఉంటాయి. స్త్రీ పురుషుల సంపర్కం జరిగినప్పుడు, మగవారిలో ఉండే Y chromosome వచ్చి మహిళ పిండలో చెరినప్పుడు, ఆమెలో ఉన్న X chromosome తో కలిసి, మగ బిడ్డ పుట్టుకకు కారణం అవుతుంది. అదే మగవాళ్ళలో ఉన్న X chromosome స్త్రీలోని X chromosome తో కలిస్తే, ఆడ బిడ్డగా రూపుదిద్దుకుటుంది.
ఈ theory ఆధారంగా, DNA పై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు, కొన్ని వేల ఏళ్ల క్రితం ఒక్కసారిగా భూమిపై నుంచి Y chromosome దాదాపుగా అంతమైపోయిందని తెలిసింది. అంటే, మగవాళ్ల blood line అంతరించి పోయి, కేవలం ఆడవాళ్ళ X chromosome మాత్రమే కొనసాగుతూ వచ్చిందని గుర్తించారు. దీనినే శాస్త్రవేత్తలు Neolithic Y chromosome Bottleneck అని పిలుస్తారు. ఎంత దారుణంగా అంటే, ప్రతి 17 మంది మగవాళ్లలో కేవలం 1 మగాడు మాత్రమే బ్రతికినట్లు ఈ పరిశోధన తెలియజేస్తోంది. ఈ షాకింగ్ discovery తో, ఉన్నట్లుండి మగాళ్ల జనాభా భూమిపై నుంచి తుడిచిపెట్టుకుపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? అని అన్వేషణ మొదలు పెట్టారు. ఒకప్పుడు భూమిపై సంభవించిన ప్రకృతి ప్రళయాలూ, ఉన్నట్లుండి విరుచుకుపడే pandamic ల వంటి ఎన్నో విషయాల చుట్టూ వారి అన్వేషణ తిరిగి, వారి వెతుకులాట ఒక చోట ఆగింది. అదే మహాభారతం.
నేటి ప్రపంచం చూడని మహోన్నత చరిత్ర.. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే ఇతిహాసం.. మహాభారతం. ద్వాపర యుగంలో జరిగిన ఈ గాథ ప్రతి హిందువుకూ సూపరిచితమే. ధర్మ రక్షణ కోసం జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొంటే, అందులో పాండవుల వైపు 7 అక్షౌహిణుల సైన్యం ఉండగా, కౌరవుల వైపు 11 అక్షౌహిణుల సైన్యం నిలిచిందని చరిత్ర చెబుతోంది. ఇందులో ఒక్కో అక్షౌహిణి, 21,870 రథాలూ, మరో 21,870 ఏనుగులూ, 65,610 గుర్రాలూ, 1,09,350 పదాతి దళ సైనికులతో కూడి ఉంటుంది. ఈ లెక్కన 18 అక్షౌహిణుల సైన్యం లెక్క ఎన్ని లక్షల్లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇంతమంది సైన్యం 18 రోజుల పాటు పోరాడగా, చివరకు మిగిలింది కేవలం రెండు పదులు కూడా లేరని తెలుస్తోంది. ఇలా మిగిలిన వారిలో ముఖ్యంగా శ్రీ కృష్ణ భగవానుడు, పంచ పాండవులు, కృత వర్మ, అశ్వత్థామ పేర్లు మాత్రమే మనకు తెలుసు.
శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ప్రకారం, దాదాపు 5 నుంచి 7 వేల ఏళ్ల క్రితం మగవారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా అంతమైందనీ, ఆ కాలంలో ఇంచుమించు 4 నుంచి 5 మిలియన్ల మగవారు ఉన్నట్లుండి చనిపోయారనీ తెలుసుకున్నారు. అంతమంది మగవారు ఒక్కసారిగా చనిపోయారంటే, అది కేవలం యుద్ధంలో పాల్గొనడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ప్రపంచ యుద్ధ చరిత్రలో ఇన్ని లక్షల మంది చనిపోయేంత యుద్దం ఏదని అన్వేషించిన శాస్త్రవేత్తలకు, కురుక్షేత్ర మహాసంగ్రామం ఒక్కటే కనిపించింది. ఇంతకాలం ఇది హిందువులు మాత్రమే చెప్పుకునే ఒక కాల్పనిక కథగా భావించిన పాశ్చాత్య శాస్త్రవేత్తలకు, కురుక్షేత్ర సంగ్రామం నిజంగా జరిగిందనే విషయం మింగుడు పడలేదు. అయినా వేరే దారి లేక, మగవాళ్ల బ్లడ్ లైన్ మాయం అవ్వడానికీ, కూరుక్షేత్రానికీ ఉన్న లింకులు వెతకడం మొదలు పెట్టారు. అప్పుడే వారికి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి.
కురుక్షేత్ర యుద్ధంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో రాజ్యాల రాజులూ, వారి సేనలూ, కురు పాండవుల ఇరు పక్షాలలో ఏదో ఒక పక్షాన ఉండి యుద్ధంలో పాల్గొన్నాయని, మహాభారతంలో పేర్కొన బడి ఉంది. ఈ వివరణ చూసి చాలా మంది చరిత్రకారులు, వారంతా అఖండ భారతావనిలోని రాజ్యాల నుంచి వచ్చి ఉంటారనీ, మహా అయితే ఆసియాలోని చైనా, మధ్య ఆసియా, తూర్పు ఆసియా వంటి ప్రదేశాలలోని ఇంకొన్ని రాజ్యాల రాజులు పాల్గొని ఉండవచ్చనీ అనుకున్నారు. కానీ చరిత్రను మరింత క్షుణ్ణంగా పరిశీలిచిన శాస్త్రవేత్తల ప్రకారం, కూరుక్షేత్రంలో పాల్గొన్నది కేవలం, భారతీయులు, ఆసియా వాసులు మాత్రమే కాదనీ, మధ్య ఆసియా, యూరోప్, అమెరికా ఖండాల నుంచి కూడా రాజులు వారి సేనలతో కూడి యుద్ధంలో పాల్గొన్నారనీ తెలుస్తోంది.
కొన్ని విషయాలు మనకు ఆశ్చర్యం కలిగించక మానవు.. నాటి మన భారతీయ రాజులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ రాజ్యాలతో వర్తక వ్యాపార సంబంధాలే కాకుండా, వివాహ సంబంధాలు కూడా ఏర్పరచుకునేవారని వాస్తవ చరిత్ర చెబుతోంది. అందుకు ఉదాహరణగా, నాడు మనవారు వాడిన పదాలనూ, కొన్ని గుర్తులనూ చూపిస్తున్నారు. నేడు ఆసియా వ్యాప్తంగా లభిస్తున్న హైందవ ఆనవాళ్ళూ, భారతీయులతో ఆయా ప్రాంతాలలోని రాజ్యాలకున్న సంబంధాల గురించీ, చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే మన పురాణాలలో చెప్పబడిన పాతాళ లోకం, అక్కడికి వెళ్ళినప్పుడు కనిపించే గుర్తులను బట్టి, నేటి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలలో అది నేటి దక్షిణ అమెరికా ప్రాంతం అని తెలుస్తోంది. పాతాళం అంటే సంస్కృతంలో మనకి కింద ఉన్నది అని అర్ధం. మన దేశం నుంచి ఒక గీత సరిగ్గా క్రింది వైపుకు గీసినప్పుడు, అది దక్షిణ అమెరికా దగ్గర ఆగుతుంది. దానిని బట్టి మన దేశానికి క్రింద ఉన్న ప్రాంతాన్ని నాడు పాతాళ లోకంగా అభివర్ణించేవారని అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని మనం గతంలో వివరంగా చెప్పుకున్నాము.
ఇక యూరోపియన్ దేశాలను మ్లేచ్ఛ లోకాలుగా, అక్కడున్నవారిని మ్లేచ్ఛులుగా పిలిచేవారు. మ్లేచ్ఛులు అంటే వావి వరసలు మరచి శృంగారం చేసేవారు, అన్నీ రకాల జీవులనూ భక్షించేవారు, నీతి, నియమం, ధర్మం వంటి వాటిని పాటించని వారనే అర్ధం వస్తుందని, భాషా పండితులు చెబుతున్నారు. నాటి యూరోప్ చరిత్రను పరిశీలిస్తే, వారు ఎక్కువగా విశృంఖల శృంగారానికి మక్కువ చూపేవారు. ఆవు, పంది అనే తేడా లేకుండా, కనిపించిన ప్రతి జంతువునూ భక్షించేవారు. నేటికీ, హిందువులు ఆవు మాంసాన్నీ, ముస్లింలు పంది మాంసాన్నీ ముట్టరు. కానీ ఆ రెండింటిని తినేది కేవలం యూరప్ వాసులు. అలా చూసుకుంటే, యూరప్ నుంచి వలస వెళ్ళి, స్థానికులను నిర్దయగా ఊచకోత కోసి, తమ దేశాలుగా చెప్పుకుంటున్నది, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలలోని వారు మాత్రమే అని చెప్పవచ్చు.
మహాభారతంలో అత్యంత బలశాలిగా, ఓటమి ఎరుగని వీరుడిగా, అఖండ కురు సామ్రాజ్య స్థాపనకు కృషిచేసిన వ్యక్తిగా, పాండవుల తండ్రి అయిన పాండు రాజుకు పేరు. ఆయనకు ఇద్దరు భార్యలు కాగా, రెండవ భార్య మాద్రి. నేడు చరిత్రకారులు కనిపెట్టిన వివరాలు ప్రకారం, మాద్రి కూడా ఒక మ్లేచ్ఛ జాతికి చెందిన రాజకుమారి. ఆమె మద్ర దేశానికి చెందిన రాజకుమారి. ఆమె సోదారుడు శల్యుడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. కొన్ని పరిశోధనల ప్రకారం ఈ మద్ర రాజ్యమే నేడు Spain లో ఉన్న Madrid గా కనుగొన్నారు. ఇక కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కర్ణుడికి శల్యుడు సారథిగా చేసిన ‘శల్య సారధ్యం’ గురించి తెలిసిందే. ఆ సమయంలో కర్ణుడిని శల్యుడు నానా విధాలా నిందిస్తున్నప్పుడు, ‘వావి వరుసలు మరచి తిరిగే ప్రాంతం నుంచి వచ్చినవాడివీ, గో మాంసాన్ని భుజించే మ్లేచ్ఛుడివీ, నువ్వా నాకు నీతులు చెప్పేది’ అని కర్ణుడు దూషించడం కూడా మహాభారతంలో ఉంది. దాని ఆధారంగా కూడా వారు మాద్రి, ఆమె సోదరుడు శల్యుడు, యూరోప్ ఖండానికి చెందిన వ్యక్తులుగా పేర్కొంటున్నారు. ఆ విధంగా నాడు యూరోప్ నుంచి కూడా అనేక మంది రాజులూ, వారి సేనలూ కూరుక్షేత్రంలో పాల్గొన్నట్లు చరిత్రకారులు నిర్ధారించారు.
ఇన్ని నిర్ధారణలు జరుగుతున్నా, చాలా మంది పాశ్చాత్య శాస్త్రవేత్తలకు ఇంకా మహాభారతంపై అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిని పటాపంచలు చేస్తూ Nilesh Nilkanth Oak అనే పరిశోధకుడూ, రచయిత, మహా భారతం జరిగిందని నిరూపించడానికి మరికొన్ని ఆధారాలను బయటపెట్టారు. ప్రపంచంలోని ఏ చరిత్ర చూసినా, రాజులూ, వారి వంశాల చుట్టూ మాత్రమే అల్లబడి ఉంటుంది. కానీ, మన దేశంలో మాత్రమే, రాజులకూ, వారి వంశాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఆ కాలంలో జరిగిన ముఖ్య సంఘటనల సమయంలో సంభవించిన astronomical events కూడా పొందు పరచబడి ఉంటాయి. రామాయణ, మహాభారత గ్రంథాలలో ఇలాంటి ఎన్నో astronomical events, ఆ సమయంలో భూమిపై సంభవించిన పరిణామాల గురించీ స్పష్టంగా పేర్కొనబడి ఉండటం గమనించవచ్చు.
మహాభారత కాలంలో జరిగిన 215 astronomical events ని గుర్తించారు Nilesh Nilkanth Oak. అలాంటి ఖగోళ వింతలు, ఘటనలు పూర్వం ఎప్పుడు జరిగాయనే విషయాన్ని, నేడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పరిశీలించిన Oak, అవన్నీ దాదాపు 10 వేల ఏళ్ల క్రితం సంభవించినట్లు నిర్ధారించారు. అంటే, మాహాభారత ఘట్టం జరిగి ఇంచుమించు 10 వేల సంవత్సరాలవుతున్నట్లు ఒక అంచనాకి వచ్చారు. ఆ పరిశోధనలను నాసా శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. ఉదాహరణకు, కుజ గ్రహం రాత్రి సమయంలో అది వెళ్తున్న కక్ష్యలో కాస్త వెనక్కి వచ్చి, మళ్ళీ ముందుకెళ్లినట్లు మహా భారతంలో చెప్పబడి ఉంది. వృశ్చిక రాశి నక్షత్ర మండలిలో ఉన్న జ్యేష్ఠా నక్షత్రం దగ్గర ఈ పరిణామం సంభవించిందనీ, అప్పుడే కురుక్షేత్ర యుద్ధం మొదలైందనీ చరిత్రకారులు చెబుతున్నారు. అలాంటి వింత పరిణామం అంతరిక్షంలో నిజంగా సంభవించిందా అని పరిశోధించగా, సరిగ్గా సామాన్య శక పూర్వం 5591 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 7 నుంచి 8 వేల ఏళ్ల క్రితం అంతరీక్షంలో ఇలాంటి ఘటన సంభవించినట్లు, శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలాంటి astronomical events ని బట్టి, మహా భారత యుద్ధం వాస్తవంగా జరిగిందని Nilesh Nilkanth Oak ఘంటాపథంగా చెబుతున్నారు. వారి వాదననకు, 2015 వ సంవత్సరంలో బయటపడిన Neolithic Y chromosome Bottleneck కూడా మ్యాచ్ అవ్వడంతో, మరోసారి మహాభారత కావ్యం కల్పితం కాదనీ, కేవలం కుతంత్రంతో దాచబడుతున్న భారతీయ ఘన చరిత్ర అనీ, ప్రపంచానికి తెలిసింది.
300 ఏళ్ళు ముస్లింలను భారత దేశంలోకి అడుగుపెట్టనివ్వని కాశ్మీర చక్రవర్తి ఎవరు?
అరబ్, చైనా చరిత్ర గ్రంథాలలో రాయబడి, మన చరిత్ర పుటలలోనుంచి తొలగించబడటమా?
కాశ్మీర్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. మొన్నీ మధ్య కాశ్మీర్ లోని పహల్గామ్ దగ్గర జరిగిన ఉగ్ర దాడితో, ప్రపంచం మొత్తం షాక్ లో మునిగిపోయింది. మతం ఏదని అడిగి, డౌట్ వస్తే మగాళ్ల ప్యాంట్ విప్పి చూసి మరీ చంపడం, ప్రపంచ వ్యాప్త హిందువుల రక్తం మరిగిపోయేలా చేసింది. కల్లోల కాశ్మీరంగా, ఉగ్రవాదుల అడ్డాగా.. కాశ్మీర్ గురించి ఎన్నో ఏళ్లుగా వింటూ ఉన్నాము. అటువంటి కాశ్మీర్ లో పుట్టి, అటు సౌదీ నుంచి, ఇటు టిబెట్ వరకు ఉన్న ప్రాంతాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని, అతి పెద్ద సామ్రాజ్యాన్ని పాలించిన ఒక గొప్ప హైందవ చక్రవర్తి గురించి మనలో ఎంతమందికి తెలుసు..? ముస్లిం పాలకులు ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 300 ఏళ్ల పాటు భరత భూమిపై అడుగుపెట్టడానికి కూడా భయపడేలా చేసిన ఓ మహా యోధుడి గురించి ఎప్పుడైనా విన్నారా? అరబ్, చైనా చారిత్రక గ్రంథాలలో ఎంతో గొప్పగా రాయబడి ఉన్నా, మన చరిత్ర పుటలలో నుంచి మాత్రం తొలగించివేసిన ఒక మహోన్నత రాజు గురించి ఎంతమందికి తెలుసు? రావణ సేనలా మధ్య ఆసియాను పూర్తిగా ఆక్రమించి, భారత దేశంపై దండెత్తి వచ్చిన అరబ్బుల ఆశలపై నీళ్ళు చల్లి, 300 ఏళ్లపాటు సమాధి చేసిన ఆ గొప్ప చక్రవర్తి గురించి ఈ రోజు తెలుసుకుందాము. ఒకప్పుడు మన కాశ్మీరం ఎలా ఉండేది..? ఆ గొప్ప చక్రవర్తి ఎవరు..? అరబ్ పాలకులను ఏకంగా 300 ఏళ్ల పాటు భారత దేశం నుంచి దూరంగా ఉంచిన ఆ రాజు ఎవరు..? వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, కాశ్మీర్ ఒక వివాదాస్పద ప్రాంతంగానే ఉండి పోయింది. 1970 వ దశకం నుంచి, ఉగ్రవాదం అనే పెను భూతం కూడా కాశ్మీర్ లోయలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచీ కాశ్మీర్ లో హిందువుల జనాభా గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, కొన్ని లక్షల మంది హిందువుల మాన ప్రాణాలు ఎవరికీ తెలియని విధంగా ఆ నేలలో సమాధి అయిపోయాయి.
కానీ దాదాపు వెయ్యేళ్ళ క్రితం కాశ్మీర్ అంటే స్వర్గధామం.. కాశ్మీర్ అంటే అపారమైన విజ్ఞానానికి మేరు పర్వతం వంటిది.. కాశ్మీర్ అంటే ఎల్లలులేని హైందవ ధర్మానికి పట్టుకొమ్మ. అలాంటి కాశ్మీర్ ని వశం చేసుకోవాలని చూసిన అరబ్ పాలకులకు పగలే చుక్కలు చూపించడమే కాకుండా, మళ్ళీ భారత భూభాగంపై అడుగుపెట్టాలనే ఆలోచన కూడా రాకుండా భయపెట్టిన ఒకే ఒక్క వ్యక్తి, కర్కోటక వంశపు మహాపురుషుడు, లలితాదిత్య ముక్తాపీడుడు.
లలితాదిత్య చక్రవర్తి చరిత్రను గురించి తెలుసుకునే ముందు, 8వ శతాబ్ది నుంచి జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను ప్రస్థావించుకోవాలి. మధ్య ఆసియాలో పురుడుపోసుకుని, అటు యూరోప్ నుంచి ఆసియా అంచుల వరకూ తమ మతమే ఉండాలనే దురాశతో, అత్యంత పైశాచికంగా వ్యాపించిన మతం ఇస్లాం. Arab ఉమయ్యద్ కాలిఫేట్ రాజులు నేడు మనం చూస్తున్న సౌదీ నుంచి తమ రాజ్యాన్ని విస్తరిస్తూ, ఆక్రమించిన ప్రతి చోట తమ మతం మాత్రమే ఉండాలనే క్రూరమైన ఆశయంతో కొనసాగారు. దానికి వారు ఎంచుకున్న మార్గం హింస.
ఇలా దాదాపు మధ్య ఆసియాను పూర్తిగా ఆక్రమించుకున్న అరబ్ రాజుల క్రూర దృష్టి, సామాన్య శకం 712 నాటికి మన దేశం వైపుకు ప్రసరించింది. అనుకున్నదే తడవుగా అరబ్ జనరల్ ముహమ్మద్ బిన్ ఖాసిమ్ ఆధ్వర్యంలో సింధు రాజ్యంపై దండయాత్ర జరిగింది. చారిత్రక ఆధారాల ప్రకారం, మన దేశంపై జరిగిన మొదటి ముస్లిం దండయాత్ర కూడా అదే. ఆ ప్రాంతమే నేడు పాకిస్తాన్ లో ఉంది. ఆ కాలంలో సింధు ప్రాంతాన్ని బ్రాహ్మణ వంశానికి చెందిన దహిర్ సేనుడనే రాజు పాలించేవాడు. అప్పటి వరకు చాలా సులువుగా మధ్య ఆసియాను సొంతం చేసుకున్న ఉమయ్యద్ కాలిఫేట్ సేనలకు, దహిర్ సేనుడు అనుకోని షాక్ ఇచ్చాడు. మహా సైన్యంతో వచ్చిన అరబ్బులు, వేలల్లో మాత్రమే ఉన్న దహిర్ సేనుడి సేనలను సులువుగా ఓడించవచ్చని అనుకున్నారు. కానీ వారు అనుకున్నది అంత సులువుగా జరగలేదు. సైన్యం తక్కువ ఉన్నప్పటికీ, మన యుద్ధ రీతుల కారణంగా ఉమయ్యద్ కాలిఫేట్ సేనలు పెద్ద ఎత్తున నేల కూలారు. అయితే సంఖ్యా బలం లేని కారణంగా, చివరికి దహిర్ సేనుడు ఓటమిపాలవ్వక తప్పలేదు.
ఇలా చచ్చీచెడీ సింధు రాజ్యాన్ని చేజిక్కించుకున్న అరబ్బు సేనలకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అందుకు కారణం, లలితాదిత్య ముక్తాపీడుడు. ఓడిపోవడం, తిరిగి సేనలను పోగేసుకుని మళ్ళీ దాడి చేయడం, మళ్ళీ ఓడడం, ఇదే నాడు అరబ్బులకు పట్టిన గతి. ఆ సమయంలో లలితాదిత్యుడి ముందు రెండు పెద్ద సవాళ్ళు నిలిచాయని చరిత్ర విదితం. ఒక పక్క అరబ్ సేనలు భారత దేశంపై మళ్ళీమళ్ళీ దండెత్తడానికి సిద్ధంగా ఉంటే, మరో పక్క టిబెట్ సేనలు తమ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇవి చాలవన్నట్లు, మధ్య ఆసియాలో అరాచకత్వానికి మారు పేరుగా భావించబడిన Bactrian సేనలు కూడా, తమ రాజ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఒకప్పుడు ఈ Bactrian రాజ్యంలోనే Saka రాజులు ఉండేవారు. వీరు ఈశ్వర ఆరాధకులు. ఈ విషయాలు మనం గతంలో వివరంగా చెప్పుకున్నాము. అయితే, ఇస్లాం మత వ్యాప్తి కారణంగా, 8వ శతాబ్దం నాటికి Bactria రాజులు ఇస్లాం మతంలోకి మారిపోయారు. ఇక మరో పక్క చైనాలో Tang వంశస్థులు తమ రాజ్యాన్ని అనూహ్యంగా విస్తరించుకోవడం మొదలుపెట్టారు.
సరిగ్గా అదే సమయంలో భారత దేశంలో పెను మార్పులు సంభవించాయి. పుష్యభూతి వంశానికి చెందిన హర్షవర్ధన మహారాజు అకాల మృత్యువు పాలయ్యాడు. ఆ కాలంలో ఉత్తర భారతంలోని అతి పెద్ద రాజ్యం, ఈ పుష్యభూతి వంశానికి చెందిన వారిదే. నేటి ఉత్తర్ ప్రదేశ్ లోని కనోజ్ (Kannauj), వారి రాజధాని. హర్షవర్ధనుడి మరణంతో ఒక్కసారిగా ఉత్తర భారత రాజ్యాలన్నీ బలహీన పడిపోయాయి. ఒకపక్క అరబ్బులూ, ఇంకో పక్క టిబెటాన్ లూ, వీరు చాలరన్నట్లు ఇటు Bactrian లూ, అటు చైనా Tang వంశస్థులూ.. అందరికీ కావలసినది భారత దేశమే. సరైన నాయకత్వాన్ని కోల్పోయి భారత దేశం అయోమయ స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడే తెర పైకి వచ్చిన మహా వీరుడు లలితాదిత్య ముక్తాపీడుడు. లలితాదిత్యుని పాలనాకాలం స్వర్ణయుగంగా పేరొందింది. సా.శ. 12 వ శతాబ్దానికి చెందిన కాశ్మీర కవి కల్హణుడు తన విఖ్యాత చారిత్రక గ్రంథం, ‘రాజ తరంగిణి’ లో లలితాదిత్యుని జైత్రయాత్రలనూ, ఆయన పరిపాలనా విశేషాలనూ హృద్యంగా వర్ణించారు.
లలితాదిత్యుడు కాశ్మీర గద్దెనెక్కిన వెంటనే చేసిన మొదటి పని, భారత దేశంలోని రాచరిక వ్యవస్థను పటిష్ఠ పరచడం. ఈ క్రమంలో ఆయన మొదటగా కనోజ్ (Kannauj) గద్దెపై కూర్చున్న యశోవర్మకు బుద్ధి చెప్పాడు. హర్షవర్ధనుడి మరణంతో ఉత్తర భారతంపై పట్టుకోసం ప్రాకులాడుతున్న రాజులలో, ఈ యశోవర్మ కూడా ఒకడు. ఈయన హర్షవర్ధనుడి తర్వాత కనోజ్ (Kannauj) సింహాసనాన్ని అధిరోహించి, తనకు అడ్డుగా ఉన్న లలితాదిత్యుడిపై రాజకీయం చేయడం మొదలుపెట్టాడు. లలితాదిత్యుడు తన యుద్ధ కౌశలంతో యశోవర్మను ఓడించి, తన సామంత రాజుగా మార్చుకున్నాడు. ఆ గెలుపుతో మెల్లగా ఉత్తర భారతం మొత్తం అతని పాలన క్రిందకు చేరింది.
లలితాదిత్యుడు తుఖారీలపై అంటే, బాక్ట్రియా రాజ్యంపై చారిత్రక విజయాన్ని సాధించి, వారిని వెనక్కి పంపేశాడు. సాధారణంగా కొండలలో చిన్న చిన్న తెగలుగా జీవించే టిబెటాన్ లు, ఒక్కటిగా కలిసి మహాసేనగా మారారు. ఇలా ఒక్కటైన సేన అటు చైనాతో పాటు, ఇటు భారత దేశాన్ని కూడా ఆక్రమించుకోవాలని చూశారు. ఈ ప్రక్రియలో వారికి ముందుగా అడ్డు వచ్చిన రాజ్యం, కాశ్మీరం. ఎత్తయిన హిమాలయ శ్రేణులలో సైతం పోరాటం చేయగల టిబెటాన్ లను, లలితాదిత్యుడి సేనలు ఊచకోత కోసి వెనక్కి తరిమేశాయి. అయితే వెనక్కి వెళ్ళిన టిబెట్ వీరులు మళ్ళీ బలం పుంజుకుని వస్తారని గ్రహించిన లలితాదిత్యుడు, వెంటనే చైనాకు చెందిన Tang వంశంతో మైత్రిని నెలకొల్పాడు. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడనే సూత్రాన్ని ఇక్కడ లలితాదిత్యుడు వాడాడు. టిబెటాన్లు కేవలం భారత దేశానికే కాకుండా, అప్పుడప్పుడే విస్తరిస్తున్న Tang వంశపు రాజులకు కూడా పెద్ద తలనొప్పిగా మారారు. అటువంటి టిబెటాన్ లకు యమపురికి దారి చూపించిన లలితాదిత్యుడి వంటి రాజుతో మిత్రత్వం, అన్ని విధాలా లాభంగా భావించిన Tang రాజులు, ఆయనను ఆప్తమిత్రుడిలా భావించారు. అలా టిబెట్ ను జయించి, చైనా లోకి దారి తీస్తున్న 5 మార్గాలను మూసి వేశాడు..
ఇక అదే ఊపులో ఆయన చేసిన మరో పని, అరబ్ సేనలనూ, టర్కిష్ సేనలనూ నాశనం చేయడం. అద్భుతమైన యుద్ధ కౌశలం కలిగిన లలితాదిత్యుడు, ముందుకొస్తున్న అరబ్ సేనలనూ, టర్కిష్ సేనలనూ వెనక్కి తరిమికొట్టడమే కాకుండా, మధ్య ఆసియా వరకూ తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అయితే, తురుష్కులు చేసినట్లు నగరాలను నాశనం చేయడం, ఖజానాలను దోచేయడం, ఆడవాళ్లను బలాత్కరించడం, మతం మార్చడం వంటి పనులు ఆయన చేయలేదు. తాను ఆక్రమించిన ప్రతి చోటా మహా నగరాలను నిర్మించాడు. ఎన్నో విద్యాలయాలనూ, దేవాలయాలనూ నిర్మింపజేశాడు. ఇస్లాం పాలకుల వల్ల నాశనం అయిన హిందూ ఆలయాలను పునరుద్ధరించాడు. అమోఘమైన వాస్తు నిర్మాణాలనూ, ప్రజోపయోగ నిర్మాణ కార్యక్రమాలనూ చేపట్టాడు. ఆయన నిర్మించిన ఆలయాలలో అనంతనాగ్ సమీపంలోని మార్తాండ దేవాలయం అత్యంత ప్రధానమైంది.
లలితాదిత్యుడి యుద్ధ కౌశలం, వీరత్వం చూసిన అరబ్ సేనలు ఎన్నో ఏళ్లపాటు భారత దేశంపై ఆక్రమణ అనే ఆలోచన కూడా రానంతగా భయపడిపోయారు. అటువంటి లలితాదిత్యుడి మహోన్నత చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. ఆయన మరణం గురించిన వాస్తవాలు నేటికీ అంతుచిక్కని మిస్టరీలుగా మిగిలిపోయాయి. ఆయన ఏదైనా యుద్ధంలో చనిపోయాడా! అనారోగ్యంతో చనిపోయాడా! లేదా ఎవరికీ కనిపించకుండా ఎక్కడికైనా వెళ్లిపోయాడా? అనే విషయాలు నేటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ చరిత్ర గ్రంథంలోనూ, ఏ శిలా శాశనంలోనూ, ఆయన మరణం గురించి ఎటువంటి వివరణా లేదు.
అయితే లలితాదిత్య ముక్తాపీడుడనే వ్యక్తి ఒక గొప్ప చక్రవర్తిగా, మిత్రుడిగా, వీరుడిగా చరిత్ర పొగిడింది. అది కూడా మన గ్రంథాలలో కాదు. అరబ్ లు రాసిన చారిత్రక గ్రంథాలలో ప్రస్ఫుటంగా ప్రస్తుతించబడి ఉంది. 11వ శతాబ్దంలో పర్షియన్ చరిత్రకారుడైన Al-Baruni రాసిన చరిత్ర పుస్తకాలలోనూ, చైనాలోని Tang వంశ చరిత్రను తెలిపే ‘Xin Tang shu’ అనే గ్రంథంలోనూ, లలితాదిత్యుడి గురించి ఎంతో గొప్పగా అభివర్ణించబడి ఉంది.
ఇక లలితాదిత్యుడి మరణం ఒక మిస్టరీగా మిగిలిపోయినా, ఆ తరువాత కూడా ఆయన రగిల్చిన స్ఫూర్తి జ్వాలలు, అరబ్బుల నుంచి భారత దేశాన్ని 300 ఏళ్ల పాటు కాపాడాయి. ఒకవేళ లలితాదిత్యుడనే రాజు ఉండివుండకపోతే, భారత దేశంలో ఈనాడు వేరే విధమైన సామాజిక పరిస్థితులుండి ఉండేవని చరిత్రకారులంటున్నారు. ఓటమి ఎరుగని ఇలాంటి మహా చక్రవర్తుల వీర గాథలను నేటి తరం వారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన పాఠ్య పుస్తకాలలో అక్బర్, బాబర్ వంటి చరిత్ర హీనుల గురించి గొప్పగా రాసి, లలితాదిత్యుడి వంటి యోధుల గాథలను మరుగు పరచడం నిజంగా దౌర్భాగ్యమే. భారతీయులనూ, భారతీయతనూ, అఖండ భారతీయ చరిత్రనూ సంస్కృతినీ చూసి ఓర్వలేక చెరిపి వేసి, మన నుండి మన ఘన చరిత్రను మాయం చేస్తూ, భారతీయ చరిత్రకూ, సంస్కృతికీ తీరని ద్రోహం చేసిన, చేస్తున్న బ్రిటిష్ బానిసలు క్షమార్హులు కారు.. ఈ పరిస్థితులలో మార్పు త్వరలో ఆశించవచ్చా?
అనంత పద్మనాభుడి గుప్త నిధులలో రోమన్ నాణాలు ఏం నిరూపిస్తున్నాయి?
రోమ్ పతనానికి మన భారత దేశమే కారణమా?
ప్రపంచంలోనే అతిగొప్ప నాగరికత కలిగిన ప్రదేశంగా ‘రోమ్’ని అభివర్ణిస్తారు, పాశ్చాత్య చరిత్రకారులు. వారి నిర్మాణ శైలి, పాలనా విధానం, వారికున్న విజ్ఞానం మరెక్కడా లేదన్నట్లు చెప్పుకొస్తారు. ఇక ఆ రోమన్ జాతిలో పుట్టిన అలెగ్జాండర్ ని ఈనాటికీ విశ్వవిజేతగా అభివర్ణిస్తారు. ఈ విషయంపై మనం గతంలో చేసిన వీడియో లింక్ description లోనూ, icards లోనూ పొందుపరుస్తున్నాను. చూడనివారు తప్పక చూడండి. ఇక మన దేశం విషయానికొస్తే, ఆ పాశ్చాత్య చారిత్రకారులలో చాలా మంది, నేటికీ భారత దేశానికీ ఆఫ్రికా ఖండంలోని ఆటవిక రాజ్యాలకూ తేడా లేదనీ, రెండు ప్రాంతాలవారూ అడవులలో జీవించే వారిగానూ, పెద్దగా నాగరికత తెలియని మనుష్యులుగానూ భావిస్తుంటారు. వారి అహంకారాన్నీ, అంచనాలనూ తల్లక్రిందులు చేసే ఆధారాలు నేడు వెలుగులోకి వచ్చాయి. ఎంతో గొప్ప నాగరికతకు చిహ్నంగా భావిస్తున్న రోమ్ పతనం, మన భారత దేశం వల్లనే జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకున్న వీడియో ప్రకారం, వారి గొప్ప రాజైన అలెగ్జాండర్ కూడా మన దేశంలో ఘోర పరాజయం ఎలా ఉంటుందో రుచి చూశాడు. అలెగ్జాండర్ విషయం తెలుసిందే కానీ, రోమ్ పతనానికి భారత దేశం ఎలా కారణం అయ్యింది..? మన రాజులు రోమ్ పై దండ యాత్ర చేశారా, లేక మరేదైనా కారణాలున్నాయా..? అంత గొప్ప నాగరికత గల రోమ్ రాజ్యం, భారత దేశం వల్ల ఎలా నాశనమైంది..? వంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
ఈ ప్రపంచంలోని అనేక నాగరికతలలో రోమన్ నాగరికతకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వారి ఆమోఘమైన కట్టడాలూ, ఆవిష్కరణలూ, భారీ సైన్యాలూ, యుద్ధాల గురించీ చరిత్రకారులు విశేషంగా చెబుతారు. ఆ కాలంలోనే యూరోప్ లో గల ఇటలీ, ఫ్రాన్స్ వంటి ఎన్నో ప్రాంతాలతో పాటు, ఈజిప్ట్ వరకు రోమ్ చక్రవర్తులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు చరిత్రద్వారా తెలుస్తోంది. అయితే, అంత గొప్ప సామ్రాజ్యం భారత దేశం వల్ల ఎలా నాశనం అయ్యిందనే సందేహానికి సమాధానం తెలియాలంటే, ఈ నాడు మన పాఠ్య పుస్తకాలలో ఉన్న చరిత్ర కాకుండా, మన భారత దేశానికి సంబంధించిన అసలైన చరిత్రను తెలుసుకోవాలి.
మన దేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది పోర్చుగీస్ కి చెందిన Vasco da Gama అనీ, అప్పటి వరకు భారతీయులు సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి సముద్రాన్ని వాడేవారు కాదనీ, అసలు మనకు నౌకాయానం పై పెద్దగా అవగాహన లేదనీ చెబుతూ వచ్చారు. కానీ అవన్నీ మన దేశ అసలు చరిత్రను దాచడానికి అల్లిన కట్టుకథలని నేడు బయటపడుతున్న చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి.
అసలు మన దేశానికీ, రోమ్ సామ్రాజ్యానికీ ఉన్న సంబంధం గురించి, నేటి భారతావనికి తెలిసేలా చేసింది, కేరళలోని అనంత పద్మనాభ స్వామి అని చెప్పుకోవచ్చు. కొన్నేళ్ళ క్రితం ఆ ఆలయంలోని నేలమాళిగలో దాగి ఉన్న బంగారాన్ని తీసి లెక్కలు కడుతున్న సమయంలో, కొన్ని నాణాలు అక్కడున్న అధికారుల దృష్టిని ఆకర్షించాయి. వాటిని బాగా పరీక్షించిన మీదట, అవి సామాన్య శకం కంటే ముందు మొదటి శతాబ్దంలో రోమన్స్ విరివిగా వాడిన Aureus అనే బంగారు నాణేలని తేలింది. దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం, ఎక్కడో ఉన్న రోమ్ లో అత్యంత విలువగల ఆ నాణాలు, వందల సంఖ్యలో మన దేశంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళిగలోకి ఎలా వచ్చాయనే సందేహం తలెత్తింది. ఆ ప్రశ్నే, కొన్ని వందల ఏళ్లుగా అణచబడి, కొన్ని దశబ్దాలుగా కుహనా మేధావుల చేత దాచబడిన అసలు చరిత్రను వెలికితీసేలా చేసింది.
ఈ క్రమంలో కొన్ని దశబ్దాల క్రితం, కేరళలో జరుగుతున్న పురావస్తు త్రవ్వకాలలో దొరికిన ఒక పురాతన డాక్యుమెంట్ వైపుకు, అందరి దృష్టీ మళ్ళింది. Muziris Papyrus గా పిలవబడే ఆ డాక్యుమెంట్, ప్రసూతం Vienna నగరంలో గల Austrian National Library లో ఉంది. ఆ డాక్యుమెంట్ ని ఎంతో జాగ్రత్తగా పరీక్షించిన చరిత్రకారులకు, తల తిరిగిపోయే నిజం తెలిసింది. Muziris Papyrus అనే డాక్యుమెంట్ నిజానికి ఒక shipping invoice అని తేలింది. అంటే ఒక ఓడ సరుకుతో ఒక చోట నుంచి మరో చోటుకి వెళ్తున్నప్పుడు, ఆ ఓడలో ఎలాంటి సరుకుంది? అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతోంది? ఏఏ దేశాలలో ఆ సరుకును దించబోతోందనే విషయాలన్నీ, ఆ shipping invoice లో ఉంటాయి. Muziris Papyrus ని పరిశీలించినప్పుడు, అది Hermapollon అనే అతి భారీ ship కి సంబంధించిన Invoice అనీ, ఆ ఓడలో దాదాపు రెండు టన్నుల బరువు ఉండే ఏనుగు దంతాలతో చేసిన ఆభరణాలూ, వివిధ రకాల వస్తువులూ, రోమన్స్ నల్ల బంగారంగా పిలుచుకునే నల్ల మిరియాలూ, పట్టు, సుగంధ ద్రవ్యాలలో ఉపయోగించే Nard అని పిలవబడే గడ్డి వంటి వస్తువులన్నీటినీ టన్నుల కొద్దీ తీసుకుని, కేరళ నుంచి ఈజిప్ట్ లోని Alexandria కి export చేస్తున్నట్లు లిఖించబడివుంది.
Muziris Papyrus లో ఉన్న విషయాలు చూసి ఖంగుదతిన్న పాశ్చాత్య చరిత్రకారులు, రోమ్ కీ భారత దేశానికీ ఉన్న సంబంధం గురించి మరింత లోతుగా పరిశీలించగా, మతి భ్రమించే ఎన్నో విషయాలు బయట పడ్డాయి. కొన్ని వేల ఏళ్ల క్రితమే భారత దేశానికి చెందిన వర్తకులు, రోమ్ లో భారీ ఎత్తున వర్తక వ్యాపారాలు చేసేవారు. ప్రతి సంవత్సరం కొన్ని వందల భారీ ఓడలు భారత దేశం నుంచి సుగంధ ద్రవ్యాలూ, పట్టు, కలప వంటి ఎన్నో వస్తువులు రోమ్ కి ఎగుమతి చేయబడేవని తెలిసింది.
ఆ కాలంలో నల్ల మిరియాలు, Nard అనే గడ్డి, భారత దేశంలో దొరికే పట్టు, పసుపు, అనేక సుగంధ ద్రవ్యాలు, ఆఖరికి అక్కడి శ్రీమంతులు, రాజులు, సైన్యాధికారులు వాడే విలువైన కత్తులు కూడా మన దేశం నుంచే వెళ్లేవి. ఇవన్నీ చాలా ఖరీదైన వస్తువులుగా రోమ్ లో పేరు పొందాయి. అంతేకాదు, ఆ కాలంలో భారత దేశం నుంచి వచ్చిన వస్తువులంటే రోమన్ లలో చాలా క్రేజ్ ఉండేదని తెలుస్తోంది. అవి ఎంతో ఖరీదైన వస్తువులు కావడంతో, కేవలం అక్కడి ధనికుల ఇళ్ళల్లో మాత్రమే ఉండేవి. ఆ వ్యామోహమే మన దేశ రాజులను మరింత ధనవంతులను చేస్తే, రోమ్ సామ్రాజ్య పతనానికి కారణమయ్యింది కూడా.
భారత దేశంలో దొరికే వస్తువులకు అక్కడ బాగా ప్రజాదరణ ఉండటంతో, రోమ్ వాసులు భారీ ఎత్తున మన వస్తువులను దిగుమతి చేసుకునేవారు. ఆ కాలంలో వస్తుమార్పిడి పద్ధతి బాగా అమలులో ఉండేది. మన దేశంలోని వస్తువు ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు, రోమ్ వాసులు వారి వస్తువులను ఇచ్చి తీసుకోవలసిన పరిస్థితి. అయితే రోమన్లు తయారు చేసిన వస్తువులలో కేవలం కొన్ని రకాల పరికరాలు, ఇళ్ళల్లో అలంకరణకు వాడే వస్తువులు తప్పితే మన వారికి అవి ఏవీ పెద్దగా నచ్చేవి కావు. పైగా అవి మన సరుకు విలువకు సరితూగేవి కావు. దానితో రొమాన్లు వాటి విలువకు సరిపడే బంగారు నాణాలూ, ఆభరణాలూ, బంగారపు విగ్రహాలనూ ఇచ్చి, మన దగ్గరనుంచి వస్తువులను కొనుక్కునే వారు.
ఇంత గొప్ప చరిత్ర నేటి తరాలకు ఎందుకు తెలియదనే ప్రశ్న కలగవచ్చు. అందుకు సమాధానం, గత కొన్ని శతాబ్దాలుగా అన్ని విధాలుగా మనపై జరిగిన దాడులని చెప్పవచ్చు. ముస్లిం రాజుల పాలన మన దేశంలో మొదలైన తర్వాత, మన వారు తమ మాన ప్రాణాలనూ, ధర్మాన్నీ రక్షించుకోడానికే ఎక్కువ సమయాన్ని వెచ్చించారు. ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ పాలకులు, ఇక్కడ లభించిన సంపదను మొత్తం తమ దేశానికి తరలించి, మన వారిని కటిక దారిద్ర్యంలోకి నేట్టివేశారు. ఫలితంగా జీవన పోరాటంలో రోజులు ఎలా నెట్టుకు రావాలనే అయోమయంలో పడిపోయారు. ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చినా, ప్రభుత్వ పెద్దలూ, అధికారులూ, పాశ్చాత్యులకు తొత్తులుగా వ్యవహరించి, వారి కనుసన్నలలో ఇక్కడ పాలనా విధానాలను కొనసాగించారు. దానికి తోడుగా కుహనా మేధావులు మన పాఠ్య పుస్తకాలను సిద్ధం చేయడం, అసలు చరిత్రను దాచేయడం, ఏమిటని ప్రశ్నించిన వారిని అన్ని విధాలుగా అణచివేయడం, మరీ ఎదురు తిరిగితే ప్రాణాలను హరించివేయడం వంటివి చేసినట్లు ఆధారాలు బయటపడుతున్నాయి.
అసలు బ్రిటీషర్ల పాలనాకాలంలో కూడా మన దేశానికీ రొమన్స్ కీ వ్యాపార సంబంధాలు బాగుండెవని తెల్లతోళ్ళకి బాగా తెలుసు. వారు ఇక్కడి సంపదలను దోచుకు వెళ్ళే సమయంలో, రోమన్స్ కాలం నాటి బంగారు, వెండి నాణాలు, విలువైన Artefacts చాలా కనిపించాయి. వాటిని బ్రిటిష్ తొత్తులు సగటు భారతీయులకు తెలియకుండా దాచి ఉంచారు. 1842 లో, బ్రిటిష్ అధికారి అయిన Walter Elliot ఆధ్వర్యంలోని బృందం, తమిళనాడులోని కోయంబత్తూర్ లో కొన్ని చారిత్రక ప్రదేశాలలో త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు, వారికొక పెద్ద మందసం నిండా రోమన్ కాలం నాటి బంగారు నాణాలు దొరికాయి. ఎవ్వరికీ తెలియకుండా వారు ఆ నాణాలను బ్రిటన్ కి తరిలించేశారు. 1940 లలో Sir Mortimer Wheeler అనే అధికారి పాండిచ్చేరి లోని Arikamedu దగ్గరి పురాతన పోర్ట్ ప్రాంతంలో త్రవ్వకాలు జరిపించగా, అక్కడ ఎన్నో రోమన్ Artefacts, నగలు, ముత్యాల హారాల వంటివి బయటపడ్డాయి. వాటిపై పరిశోధన చేయగా, అవన్నీ దాదాపు మొదటి, రెండవ శతాబ్ద కాలానికి చెందినవని తేలింది. Arikamedu లో దిరికిన ఈ ఆధారాలు, భారత దేశానికీ రోమ్ సామ్రాజ్యానికీ మధ్య ఉన్న సంబంధాలపై మరింత లోతుగా అన్వేషణ జరిగేలా చరిత్రకారులను ప్రేరేపించింది.
ఈ క్రమంలో Periplus of the Erythraean Sea అనే పుస్తకం, పరిశోధకులకు దొరికింది. Koine Greek భాషలో రాయబడిన ఆ పుస్తకంలో, రోమన్ సామ్రాజ్యానికీ భారత దేశానికీ మధ్య జరిగిన ట్రేడ్ గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అంతేకాదు, సామాన్యశక పూర్వం 27 వ సంవత్సరంలో రోమ్ సామ్రాజ్యాన్ని పాలించిన King Augustus కాలంలో కూడా, వారికి భారత దేశంతో వ్యాపార లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగినట్లు చరిత్రకారులు గుర్తించారు. ఏనుగు దంతాలూ, వాటితో చేసిన వివిధ ఆభరణాలూ, వస్తువులూ, నల్ల మిరియాలూ, యాలకులూ, దాల్చిన చెక్క, పసుపు, Nard, చందనం, ఎర్ర చందనం, అల్లం వంటి వాటితో పాటు, నాడు మన దేశంలో మాత్రమే దొరికే వజ్రాలు, రంగు రాళ్ళు, ముత్యాలు, పట్టు వస్త్రాలు, మరియూ పట్టు దారాలు కూడా ఎగుమతి చేసేవారు. నాడు రోమ్ పాలకులూ, ధనవంతులూ ధరించిన వస్త్రాలన్నీ, భారత దేశం, అలాగే చైనా నుంచి దిగమతి చేసుకున్న పట్టు దారాలతో నేసినవే అని, చరిత్రకారులు చెబుతున్నారు. ఇక అక్కడి మహిళలు భారత దేశంలో దొరికే ముత్యాలంటే బాగా ఇష్టపడేవారు. వారి అభారణాలన్నీ మన దేశం నుంచి దిగుమతి చేసుకున్న వజ్రాలు, విలువైన పచ్చలు, కెంపులు, నీలాలు వంటి రంగు రాళ్ళతో తయారు చేయించుకునేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే, రోమన్స్ మన దగ్గర నుంచి కొనుక్కున్న వస్తువుల చిట్టా చాలా పెద్దదే.
అప్పట్లో ఈ వ్యాపారం మొత్తం రెండు విధాలుగా జరిగేది. ఒకటి రోడ్డు మార్గంలో సిల్క్ రోడ్డు ద్వారా ఉత్తర భారత దేశంలోకి వచ్చి, అక్కడి నుంచి వారికి కావాల్సిన వస్తువులు పట్టుకు వెళ్ళేవారు, లేదా ఈజిప్ట్ లోని Alexandria నగరం నుంచి దక్షిణ భారత దేశంలోని అనేక పోర్ట్ సిటీస్ కి, మన దేశ వర్తకులూ, రోమన్ వర్తకులూ ఓడల ద్వారా వర్తకం చేసేవారు. Alexander ఈజిప్ట్ ని మొత్తం తన గుప్పెట పెట్టుకుని, Alexandria నగరాన్ని స్థాపించక ముందు, Egyptian వర్తకులూ, భారతీయ వర్తకులూ ఈ వ్యాపారం చేసేవారు. ఇలా ఈజిప్ట్ వరకు వెళ్ళిన వస్తువులు, వివిధ మార్గాల ద్వారా రోమన్ ప్రజలకు చేరేవి. అయితే, Alexander తరువాత నేరుగా రోమన్ వర్తకులే భారత దేశంతో వర్తకం అభివృద్ధి చేసుకున్నారు.
మరి ఇంత గొప్పగా వ్యాపారం జరుగుతున్నప్పుడు, రోమ్ మన వల్ల ఎలా నాశనం అయ్యిందనే సందేహం కలుగుతుంది. దానికి సమాధానం కూడా ఈ వర్తకంలోనే ఉంది. ఆ కాలంలో రొమాన్స్ కి భారతీయ వస్తువులపై విపరీతమైన క్రేజ్ ఉండేది. దాంతో వారు పెద్ద ఎత్తున మన దగ్గర నుంచి వస్తువులు తీసుకు వెళ్ళేవారు. కానీ మనం ముందుగా చెప్పుకున్నట్టు, మన దేశంలో రోమన్ గూడ్స్ కి పెద్దగా ఆకర్షణ లేకపోవడంతో, వాళ్ళు మన దగ్గర తీసుకున్న ప్రతి వస్తువుకూ బంగారం, లేదా వెండి నాణాలు ఇచ్చి తీసుకు వెళ్ళేవారు. దానితో మన దేశానికి భారీగా ఆదాయం వచ్చేది కానీ, రోమ్ కి మాత్రం పెద్దగా లాభాలు ఉండేవి కావు. దీనినే trade deficit గా నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని లెక్కల ప్రకారం, ఆ కాలంలో రోమ్ నుంచి భారత దేశానికి కేవలం బంగారం మాత్రమే, 13 నుంచి 14 టన్నుల వరకు వచ్చేదని చరిత్రకారులంటున్నారు. ఇలా ఎన్నో వందల ఏళ్లు, ఇంకా చెప్పాలంటే రెండు వేల ఏళ్ల పాటు ట్రేడ్ జరిగిందని, ఆధారాలు లభ్యమయ్యాయి. ఇలా రోమ్ లోని బాగారు నిల్వలు పెద్ద ఎత్తున కరిగిపోతూ వచ్చాయి.
మన దగ్గరకి వచ్చిన రోమన్ బంగారు, వెండి నాణాలను కరిగించి ఆభరణాలు చేయడం, వాటిపైనున్న రోమన్ అక్షరాలను చెరిపేసి, ఆయా రాజ్యాల నాణాలుగా చలామణీ చేయడం మొదలు పెట్టారు. ఇలాంటి నాణాలు మన దేశంలో ఎన్నో దొరికాయి. అయితే, ఈ trade deficit ని పసిగట్టిన రోమన్ పెద్దలు, అక్కడి అధికారులనూ, ధనవంతులనూ భారత్ నుంచి ట్రేడ్ చేయవద్దని ఎన్నో సార్లు ఆదేశించారు. ఒకానొక సమయంలో భారత్ తో వ్యాపారాన్ని బ్యాన్ చేసినట్లు కూడా చరిత్రకారులు గుర్తించారు. అప్పట్లో రోమ్ పాలన మొత్తం ధనవంతుల చేతుల్లోనే ఉండేది. వారి అండ లేకపోతే ఏ రాజూ ఎక్కువ కాలంపాటు పాలన కొనసాగించలేకపోయేవాడు. ఆ ధనవంతులకు భారతీయ వస్తువులపై విపరీతమైన మోజు ఉండటంతో, వారిని ఆపడం అక్కడి నాయకుల వల్ల కాలేదు. భారత దేశంతో జరుగుతున్న వ్యాపారాలను కట్టడి చేయడంలో, రోమన్ రాజులు విఫలమవ్వడానికి మరో కారణం, ఆ ట్రేడ్ ద్వారా వచ్చే పన్నులని చెప్పుకోవచ్చు. కొన్ని లెక్కల ప్రకారం, నాటి రోమ్ ఆదాయంలో దాదాపు మూడవ వంతు భారత దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై వేసే పన్నుల ద్వారానే వచ్చేదని, చరిత్రకారులు గుర్తించారు.
నాటి రోమన్ కమాండర్, రచయిత, Pliny The Elder అనే వ్యక్తి, భారత దేశం వల్ల రోమ్ నాశనం అవుతోందని ఆవేదన చెందేవాడు. ఈ విషయాన్ని అతను రాసిన Naturalis Historia అనే పుస్తకంలో పొందు పరిచాడు. అయినా అతని మాటను ఎవరూ పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే, రోమ్ లో బలహీన పడుతున్న నాయకత్వం, అంతర్గతంగా జరుగుతున్న గొడవలు, యుద్ధాలు, మరో పక్క భారీ ఎత్తున వర్తకం రూపంలో బంగారం భారత దేశానికి తరలిపోవడంతో, సామాన్యశకం మూడవ శతాబ్దికాలానికి బంగారం కొరత ఏర్పడింది. దానితో అక్కడి నాయకులు బంగారం, వెండికి బదులు.. ఇత్తడి, రాగి నాణాల ముద్రణ చేయడం మొదలు పెట్టారు. అయితే ఆ నాణాలకు భారత దేశంలో విలువ లేకపోవడంతో, క్రమక్రమంగా రోమ్ తో ఉన్న వ్యాపారం మందగిస్తూ వచ్చింది.
ఇదే క్రమంలో రోమ్ లో జరిగిన యుద్ధాలూ, ఇతర రాజ్యాలు బలం పుంజుకోవడంతో, వైభవోపేతమైన రోమ్ నాగరికత సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది. దానితో పశ్చిమ దేశాలకూ, మనకూ మధ్య జరుగుతున్న వ్యాపారాలు కూడా దాదాపుగా పడిపోయాయి. అదే సమయంలో మన దేశంపై జరిగిన ముస్లిం దండయాత్రలు, రోమ్ తో మనకున్న సంబంధాలను పూర్తిగా చెరిపేసినట్లు చరిత్రకారుల అభిప్రాయం.
అంటూ కల్మష బుద్ధితో క్రూరవిషయ మార్గాల్లో వెళుతుండే వాడికి ఈ మృత్యువు ప్రతి అడుగులోనూ దెబ్బకొడుతూంటుందని తెలుసుకో; హితులు, సుజనులు, గురువులు చెప్పిన దానివల్లా, సొంత యుక్తివల్లా వెళ్లేవాళ్లకు ఫలప్రాప్తి అవుతోంది. దీన్నే సత్యంగా తెలుసుకో అని 'మన జాతి గురువు' ఆదిశంకరచార్యులవారు తమ వివేకచూడామణి 83వ శ్లోకంలో ఒక అద్భుతమైన వ్యక్తీకరణను చేశారు. 'తత్త్వాన్నీ , సత్వాన్నీ , సత్యాన్నీ శంకురులు చెప్పిన స్థాయిలో మఱెవ్వరూ చెప్పలేదు. శంకరులు చెప్పినంత కవితాత్మకంగా మఱెవరూ చెప్పలేదు'.
గురువు
----------
'గురు' అన్నది రెండు పదాల కలయిక. "గు"అంటే చీకటి. "రు" అంటే కాంతి. అజ్ఞానపు చీకటిని నిర్మూలించగలిగేది గురువు. కాంతి ప్రతి ఒక్కరికీ తొలి గురువు. కాంతి లేకపోతే మనకు ఏదీ తెలియరాదు. "తమసోమా జ్యోతిర్గమయ" అని అన్నది అందుకే. గురువులు కాంతినిస్తారు. ఆదిశంకరాచార్య మహోన్నతమైన, అసదృమైన గురువు. ఆధ్యాత్మిక, సామాజిక జ్యోతి ఆదిశంకరాచార్య ఒక దశలో గురువై ఉండకపోయుంటే వైదిక లేదా సనాతన జాతి లేకుండానే పోయుండేది. భారతప్రదేశానికి ప్రకృతి ఉండేది కాదు.
బ్రతుకే ఒక పయనంగా
------------------------------
"శంకరుల వంటి మేధ కావాలి" అని అన్నారు స్వామి వివేకానంద. అత్యున్నతమైన మేధతో, అనన్యమైన నైజంతో స్వ'అర్థం అన్నదే లేకుండా బ్రతుకే ఒక పయనంగా, ఒక ప్రయత్నంగా, ఒక సత్ఫలితంగా తనను తాను మట్టికి అంకితం చేసుకుంటూ తత్త్వంతో, సత్వంతో సత్యం కోసం 'సత్యంగా' సాగారు శంకరులు.
తాత్త్వికత దృష్ట్యా
----------------------
"స్వచ్ఛమైన తాత్త్వికత దృష్ట్యా భారత భూమిపై భగవద్విషయక పరిగణనలకు అతీతంగా ఆదిశంకరాచార్యుల సిద్ధాంతం అతి ముఖ్యమైనది (లేదా అవసరమైనది), మనోహరమైనది. వారి సిద్ధాంతాలకు వ్యతిరేకమైన వేదాంత ధోరణులూ, సంప్రదాయాలూ వారి సిద్ధాంతంలోని సాహసోపేతమైన గాంభీర్యానికి, విచారణా సూక్ష్మతకు సాటిరావు” అని భారతీయ తత్త్వశాస్త్ర పరిశీలకుడైన జర్మనీ దేశపు జార్జ్ టిబో (George Thibaut) ఆదిశంకరాచార్య గుఱించి అన్నారు.
శంకరుల కాలం
-------------------
సామాన్య శకానికి పూర్వం (BCE) 509లో శంకరులు పుట్టారు అని ప్రధానమైన శంకరమఠాల గురు పరంపర ద్వారానూ, శంకరాచార్యులవారు స్థాపించిన పీఠాల చరిత్ర ద్వారానూ తెలియవస్తోంది. వారి కాలంలో సనాతన ధర్మానికీ, భారతప్రదేశానికీ 'హిందు' పదం ఆపాదించబడలేదు. అందుకే వారి రచనలలో ఎక్కడా హిందు అన్న పదం మనకు కనిపించదు. వారి జననం సామాన్య (CE) శకం 788 అయి ఉంటే అప్పటికి హిందు పదం చలామణిలోకి వచ్చింది కాబట్టి వారి రచనల్లో ఎక్కడైనా హిందు అన్న పదం కనిపించి ఉందేది. 6వ శతాబ్దికి చెందిన న్యాయ సిద్ధాంత తాత్త్వికుడు ఉద్యోతకారుడు. శంకరులు ఉద్యోతకారుడి ప్రసక్తి చెయ్యలేదు. 5వ శతాబ్దికి చెందిన ప్రముఖ బౌద్ధ పండితుడు దిన్నాగ. దిన్నాగ ప్రసక్తి కూడా శంకరులు చెయ్యలేదు. అంటే శంకరుల కాలం వీళ్లకు పూర్వంది అని తెలుసుకోవచ్చు. సామాన్య శకం 700 -750 కాలం నాటి సంస్కృత నాటక కర్త భవభూతి శంకరుల వివర్తవాద ప్రసక్తి చేశాడు. అంటే అప్పటికే శంకరులు చాల పూర్వం వారని తెలుస్తోంది. సామాన్య శకానికి పూర్వం 5వ శతాబ్దికి చెందిన గౌతమ బుద్ధుడి ప్రసక్తి కూడా ఎక్కడా శంకరులు చెయ్యలేదు. శంకరుల కాలానికి ఉన్న వివిధ స్వదేశీ మతాల్లో బౌద్ధమతం లేదు. అంటే శంకరులు బుద్ధుడి కన్నా పూర్వం వారు అన్నది కూడా స్పష్టమౌతున్నది. (బుద్ధుడి కాలం BCE 477-397 అని చరిత్రకారుడు K.T.S. Sarao తెలియజేస్తున్నారు)
16యేళ్లకే
-------------
ఆదిశంకరాచార్య భారతావనిపై పుట్టి జీవించింది 32 సంవత్సరాలే! శంకరులు వైశాఖ శుక్ల పంచమినాడు కాలడి (ప్రస్తుత కేరళ రాష్ట్రం) గ్రామంలో శివగురువు, ఆర్యాంబ దంపతులకు జన్మించారు. శంకరులు బాల్యం నుంచే అపూర్వ, అద్వితీయ వ్యక్తిత్వంతో, ధీ శక్తితో ఎదిగారు. అనితరసాధ్యమైన మేధతో 16యేళ్లకే తమ ఇతర రచనలతో పాటు ప్రస్థానత్రయమైన దశోపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు రాసేశారు. నిజానికి భగవద్గీతకు అంతకు ముందే భాష్యాలు ఉన్నా శంకరుల భాష్యం తరువాతే భగవద్గీత వ్యాప్తిలోకి వచ్చింది. ప్రస్థానత్రయాన్ని శంకరులు తమ భాష్యాలతో జనబాహుళ్యంలోకి తీసుకువచ్చారు.
తిరుగుబాటు
-----------------
వక్ర వ్యాఖ్యానాలతోనూ, వక్ర ధోరణులతోనూ, దోష సంప్రదాయాలతోనూ సనాతన ధర్మం అస్తవ్యస్తమైన కాలంలో ఆదిశంకరాచార్యులు వేద ప్రతిపాదిత సత్యాన్ని సంస్థాపించడానికి పూనుకుని ఉద్యమించారు; కృతకృత్యులూ అయ్యారు. తాత్త్విక, సామాజిక, ఆధ్యాత్మిక చింతనలతో విశేషంగా కృషిచేశారు వారు. ఆదిశంకరాచార్యులు తన అసమాన బహుముఖ ప్రజ్ఞతో, విప్లవాత్మక ధోరణితో ఆనాడు సమాజంలో పాతుకుపోయి ఉన్న సామాజిక, సైద్ధాంతిక, మత మౌఢ్యంపై తిరుగుబాటు చేసి విజయం సాధించారు. వేద ప్రతిపాదిత అద్వైత సిద్ధాంతాన్ని మళ్లీ ప్రసరింపజేశారు; ప్రవహింపజేశారు.
ఒరవడి
----------
ఒక విస్మయకరమైన మేధావి, ఒక జ్ఞాని, ఒక పూజనీయమైన ఆచార్యుడు, ఒక భక్తుడు, ఒక కర్మ యోగి, ఒక వివేకి, ఒక పండితుడు, ఒక దార్శనికుడు, ఒక సంస్కర్త, ఒక ఆధ్యాత్మిక యోగి, ఒక సిద్ధుడు, ఒక మహాకవి. ఒక ముముక్షువు, ఒక మార్మికుడు, ఒక తత్త్వవేత్త, ఒక తార్కికుడు, ఒక అద్వైతి, ఒక భాష్యకారుడు, ఒక ఉద్యమ కారుడు, ఒక విప్లవశీలి, ఒక సనాతన ధర్మ నిర్మాత ఆదిశంకరాచార్య. వారి నుడి తత్త్వానికి బడి, ఆపై సత్యానికి గుడి. మనందఱికీ వారే ఒరవడి.
శంకరత్వాన్ని సరిగ్గా స్మరించుకుందాం ఇదిగో ఇలా --
అత్యున్నతమైన విషయం
--------------------------------
"ఏవమాత్మా రణౌ ధ్యాన మథనే సతతం కృతే ఉదితాన గతిర్జ్వాలా సర్వాజ్ఞానేంధనం దహేత్" (ఆత్మబోధ 42వ శ్లోకం) అంటే ఆత్మే ఒక ఆరణి (నిప్పును రగిలించేందుకు ఉపయోగించే జమ్మి చెట్టు కఱ్ఱ)కాగా, నిరంతర ధ్యానమే మథనం కాగా ఆందులోంచి పుట్టిన జ్వాలలో మొత్తం అజ్ఞానం అనే ఇంధనం దహించుకుపోతుంది అని అర్థం. ఎంత అద్భుతంగా చెప్పారు శంకరులు! "సత్యాపి భేదాపగ్మే నాథ్ తవాహం న మామ్ కీనస్త్వమ్ సాముద్రో హి తరంగః క్వచన్ సముద్రో న తారంగః" (విష్ణుష్టపదీ శ్లోకం 3) అంటే నేను భిన్నత్వానికి లోబడినా నాథా, నేను నీవాణ్ణి కానీ నువ్వు నా వాడివి కాదు అన్నది నిజం. కెరటాలు సముద్రానికి చెందినవి కావచ్చు. కానీ సముద్రం కెరటాలకు సంబంధించినది కాదు అని అర్థం. ఇక్కడ శంకరులు ఒక మహోన్నతమైన విషయ వివరణ చేశారు. "స్వప్నో జాగరణేऽలీకః స్వప్నేऽపి నహి జాగరః ద్వయమేవ లయే నాస్తి లయోऽపి హ్యు భయోర్న చ"(అపరోక్షానుభూతి- శ్లోకం 57) అంటే మెలకువలో కల లేదు; కలలో మెలకువ లేదు; ఈ రెండూ మరణం(లయ)లో లేవు; ఈ మరణం మెలకువలోనూ, కలలోనూ లేదు అని అర్థం. అహా, అత్యున్నతమైన విషయాన్ని అసదృశంగా చెప్పారు శంకరులు!
మహోన్నతమైన మాటలు
---------------------------------
"జ్ఞానం లేకపోతే స్వేచ్ఛ లేదు; అగ్ని లేకపోతే వంట లేనట్లుగా" (ఆత్మబోధ- శ్లోకం 2). "విద్య అవిద్యను పోగొడుతుంది; తేజస్సు మాత్రమే అంధకారాన్ని పోగొట్టగలిగినట్టు". (ఆత్మబోధ- శ్లోకం 3) "నీళ్లలో బుడగలు పుడతాయి. కాసేపు నీళ్లపై ఆడతాయి. ఆ తరువాత నీళ్లలోనే కలిసిపోతాయి". (ఆత్మబోధ- శ్లోకం 8) ఈ విధమైన రచనం మనకు ఖలీల్ జిబ్రాన్, రూమీ వంటి అంతర్జాతీయ కవులలోనూ కనిపిస్తుంది. "పైన ఉన్న ఊకను తీసేస్తే బియ్యపు గింజ చక్కగా తెలుస్తుంది". (ఆత్మబోధ - శ్లోకం16) ఈ చెప్పడం ఎంత సహజంగా ఉందో! ఈ ఉపమానంలో జీవనం కనిపిస్తోంది కదూ? "దీపానికి ఇంకో దీపం అక్కర్లేదు తనే ప్రకాశిస్తుంది కాబట్టి".(ఆత్మబోధ . శ్లోకం 29) ఈ ధోరణి మనకు కవి రూమీలో కూడా కనిపిస్తుంది. "రోగాన్ని ఔషధం ఏ విధంగా పోగొడుతుందో ఆవిధంగా". (ఆత్మబోధ- శ్లోకం 37) సహజమైన ఉపమ ఇది! ఇలాంటివి కవి చైనీస్ కవి లావొచు రచనల్లోనూ కనిపిస్తాయి. "నీళ్లలో నీళ్లు లాగా, ఆకాశంలో ఆకాశం లాగా, తేజస్సులో తేజస్సులాగా" (ఆత్మబోధ- శ్లోకం 53) ఈ అనడం ఎంత గొప్పగా ఉందో కదా? రూమీ, ఖలీల్ జిబ్రాన్, లావొచు వంటి కవుల్లో ఈ ధోరణి ఉన్నది. "పాలలో వెన్న అంతటా వ్యాపించి ఉంటుంది" (ఆత్మబోధ- శ్లోకం 59) "పచ్చిపాలలోన వెన్న పరమాత్ముడు" అని అన్నమయ్య అన్నదానికి మూలం ఇదే. "అగ్నిలో కాలుతున్న ఇనుము అగ్నిలాగానే ప్రకాశించినట్లు" (ఆత్మబోధ-శ్లోకం 62) ఈ చెప్పడం ఎంతో అద్భుతంగా ఉంది! ఈ స్థాయి మహోన్నతమైన మాటలు శంకరులు ఎన్నో అన్నారు.
భజగోవిందం
-----------------
"ఎవరు నీ భార్య? ఎవరు నీ కొడుకు? ఈ సంసారం చాల విచిత్రమైనది. నువ్వెవరివి? ఎక్కణ్ణుంచి వచ్చావు? తమ్ముడూ, ఆ విషయం గుఱించి ఇప్పుడు ఆలోచించు. (8వ శ్లోకం మోహముద్గరం లేదా భజగోవిందం శ్లోకాలు) కవి ఖలీల్ జిబ్రాన్ "your children are not your chidren" అని అనడానికి వందలయేళ్ల క్రితమే శంకరులు ఈ మాటలు అన్నారు. "నీ ధనం, నీ పరివారం, నీ యవ్వనం వీటితో గర్వించకు. అవి నిమిషంలో నశిస్తాయి. అవి మాయ. అది తెలుసుకుని బ్రహ్మ పథంలోకి ప్రవేశించు. (11వ శ్లోకం భజగోవిందం శ్లోకాలు) ఇలా అంటూ శంకరులు మనల్ని కదిలిస్తారు.
గర్భంలోని శిశువు
----------------------
"ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృ కుక్షౌ స్థితం మాం
అంటే మొదట్లో కర్మ అవసరంవల్ల (లేదా కర్మ విస్తరణ కారణంగా) కలుషితమైన తల్లి కడుపులో ఉండేవాణ్ణి నేను. మల మూత్రాలు, కడుపులోని వేడి, ఇతరమైనవి ఏవైతే ఉన్నయో వాటివల్ల కలిగిన దుఃఖం, వ్యథల్ని ఇతరులు చెప్పడం ఎలా సాధ్యమౌతుంది? అని అర్థం. "గర్భంలోని శిశువు దుఃఖాన్ని, వ్యథను ఎవరు చెప్పగలరు?" ఈ భావన చేసిన తొలి కవి, తాత్త్వికులు ఆదిశంకరాచార్యులే. లావొచు, రూమీ, ఖలీల్ జిబ్రాన్, షేక్స్పిఅర్, హాఫిజ్ వంటి కవులెవ్వరూ ఇలాంటి లేదా ఈ స్థాయి చింతన, భావన చెయ్యలేదు. ఇలాంటి రచన, చింతన ఇది ఒక్కటే!
భవ్యమైన భావుకత
------------------------
"దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరలతరంగే" (గంగా స్తోత్రం - శ్లోకం 1) ఆదిశంకరులు తన గంగా స్తోత్రంలో గంగా నదిని "తరలతరంగే" అన్నారు. "తరలం" అంటే కదిలేది, ప్రకాశించేది, అనురాగం ఉన్నది, హారం మధ్యలో ఉండే ప్రధాన రత్నం, వజ్రం అని అర్థాలు. ఒక్క మాటతో గంగా నది గుఱించి చెప్పేశారు. ఇలా ఒక్క మాటతో వస్తువుపై సరైన అవగాహన కలిగించడం ఒక మహాకవి లక్షణం. ఆ గంగా నదిని 'వసుధాహారం' అంటే భూమికి హారం అన్నారు. ఇది శంకరుల భవ్యమైన భావుకత.
కాళిదాసు కన్నా ముందే
--------------------------------
కాళిదాసు రాసిన 'శ్యామలాదండకం' కన్నా ముందే శంకరులు స్తోత్రాలు రాశారు. (స్తోత్రాలు గేయ సాహిత్యానికి సంబంధించినవి) ఆదిశంకరాచార్య సామాన్య శకానికి పూర్వం 509-477 కాలం వారు అన్న వాస్తవం ఆధారంగా ఈ విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఆదిశంకారాచార్య వేర్వేఱు దేవతలపై 64 స్తోత్రాలూ, 37 ప్రకరణ గ్రంథాలూ రాసి మనకందించారు.
సౌందర్యలహరి
--------------------
సౌందర్యలహరి, శివానంద లహరి రచనలలో శంకరులు అద్భుతమైన కవనాన్ని అందించారు. సౌందర్యలహరి శిఖరిణి వృత్తాలలో ఉన్న 100 శ్లోకాల రచన. “భక్తీ, కవిత్వమూ పరాకాష్ఠకు చేరి సౌందర్యలహరి అయింది” అని కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి అన్నారు. సౌందర్యలహరిలో భావుకత, వర్ణన, భాష, పదచిత్రాలు, ఉత్ప్రేక్షలు చాల గొప్పవి. “నీ ముఖకాంతి” అనడమూ, చీకట్లను పగవాళ్లతో పోల్చడమూ, పార్వతి కంఠంపై పడిన ముడతలను “షడ్జమ, మధ్యమ, గాంధార గ్రామాల (‘గ్రామం’ అంటే సంగీత స్వరాల సమూహం) కోసం ఏర్పఱిచిన సరిహద్దుల్లా ఉన్నాయి” అనడమూ, పార్వతి స్తన్యాన్ని “ఆమె హృదయపు పాల సముద్రం” అనడమూ, మళ్లీ అదే “సారస్వతంలా ప్రవహిస్తోంది” అనడమూ శంకరులు మహాకవి అన్న సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. సౌందర్యలహరిలో శంకరులు ఇచ్చిన ఉత్ప్రేక్షలు ప్రపంచంలో ఏ కవికీ సాధ్యపడనివి.
శివానందలహరి
--------------------
శివానందలహరి 100 శ్లోకాల రచన. ‘పరమేశ్వరుడిని కౌగిలించుకుని ఆనందాన్ని పొందాలి’ అని అనుకోవడమూ, నా మనసు తప్ప నీకు ఏమీ ఇవ్వలేను’ అని అనడమూ, బుద్ధిని యంత్రంతో పోల్చడమూ మహాకవిగా శంకరులు శివానందలహరిలో చేశారు. “కారు మబ్బుపై తోచే మెరుపు తీగలా విష్ణువు గుండెపై లక్ష్మి ప్రకాశిస్తోంది” అని అనడంలోనూ, “పెద్ద కలువ పువ్వు పైన ఆడ తుమ్మెదలా విష్ణువు మోముపైన అటూ, ఇటూ ప్రసరిస్తున్న లక్ష్మి కృపా కటాక్షం” అని అనడంలోనూ, (ఈ శైలి అన్నమయ్య లో కనిపిస్తుంది) “లక్ష్మి అనే మేఘం చాతకపక్షి లాంటి పేదవాడినైన నాపై ధన వర్షం కురిపించాలి” అని అనడంలోనూ మహాకవి శంకరులు కనిపిస్తున్నారు. చాతకపక్షి ఆత్మాభిమానం కలది. వాన చినుకులను మాత్రమే తాగి బతుకుతుంది. మరే నీరూ తాగదు. వర్షాకాలం దాటితే దానికి ఆహారం ఉండదు. పేదవాడు కొన్ని రోజులు తిండి తినకుండా గడుపుతాడు కదా. ఇలా ఉపమిస్తూ పేదవాడిని తొలిసారి కావ్యస్థం చేశారు శంకరులు.
ద్రావిడ శిశు
----------------
ఆదిశంకరాచార్యులు తమ సౌందర్యలహరి 75వ శ్లోకంలో తనను తాను "ద్రావిడ శిశు" అని ప్రకటించుకున్నారు. ఆ శ్లోకం:
శంకరులు సామాజిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు అంటే వారు ఆర్యులు అయుండాలి కదా? పైగా సంస్కృతంలో రాశారు. సంస్కృతం ద్రావిడుల భాష కాదని కదా మనం చదువుకున్నది. ఇక్కడ ఆర్యులైన శంకరులు సంస్కృతంలో తనను తాను ద్రావిడశిశు అని ప్రకటించుకుంటున్నారు! అదేంటి? నిజమేమిటంటే, "శంకురుల కాలానికి మన దేశంలో ఆర్య ద్రావిడులు అన్నది లేదు". నిజానికి ఆర్య అన్న జాతి ఎప్పుడూ లేదు. ద్రావిడ అంటే దక్షిణభూభాగానికి సంబంధించిన అని అర్థం. ద్రావిడ అన్నది ప్రదేశాన్ని సూచించేది. ఆర్య అన్నది జాతిని సూచించేది కాదు. అర్య అన్నది గొప్పవాళ్లను సంబోధించే పదం అయ్యా , మహాశయా అన్నట్టుగా. శంకరుల ఈ శ్లోకం వల్ల ఆర్య ద్రావిడ జాతులు అన్నవి నిజం కాని అభూత కల్పనలు అని తెలియవస్తున్నది. ("Aryan invasion is an abandoned theory" అనీ, "the existence of any such (aryan) race had been generally rejected" అనీ అంతర్జాతీయ అధ్యయనంగా Oxford Reference Dictionary కొన్నేళ్ల క్రితం తేల్చి చెప్పింది) ఈ శ్లోకానికి అర్థం: హిమగిరి పుత్రికా (పార్వతీ), నీ స్తన్యం హృదయం నుంచి పుట్టినదైన పాల కడలి. సారస్వతం (సరస్వతికి సంబంధించినది) దాని నుంచే ప్రవహిస్తోందని తలుస్తున్నాను (అనుకుంటున్నాను).ఆ స్తన్యాన్ని ఈ ద్రవిడ శిశువు తాగి ప్రౌఢ కవులలో కమనీయమైన కవిగా పుట్టాడేమో? అద్భుతమైన భావుకతనూ, రచనా సంవిధానాన్నీ చూపారు ఇక్కడ శంకరులు. ఇవాళ ప్రపంచంలో గొప్ప కవిత్వాన్నిచ్చిన కవులుగా ఎక్కువగా చదవబడుతున్న లావొచు, రూమీ, ఖలీల్ జిబ్రాన్, షేక్స్పిఅర్ రచనా సంవిధానం శంకరుల రచనా సంవిధానం పరిధిలో ఉండడం తెలియవస్తోంది. వీళ్లే కాదు, రవీంద్రనాథ్ టాగోర్, శ్రీశ్రీ , అన్నమయ్య, వేమన వంటి కవులు కూడా శంకరుల కవితా రచనా పరిధిలోని వాళ్లే!
వివేకచూడామణి
----------------------
వివేక చూడామణి... ఆదిశంకరాచార్య కృతులలో ఈ వివేకచూడామణి అత్యున్నతమైనది. ఈ విషయకంగా దీనికి సరిపోలగల రచన విశ్వంలో మఱొకటి లేదు. ప్రస్థానత్రయం తరువాత మన భూమిలో పుట్టిన మహోన్నతమైన రచన ఇది. ఆ వివేక చూడామణి (శ్లోకం 63)లో "అజ్ఞాన సర్పదష్టుడైన (శ్రీశ్రీ బాధాసర్ప దష్టులారా, అనడానికి శంకరుల ఈ ప్రయోగమే మూలం) వాడికి బ్రహ్మజ్ఞాన ఔషధం తప్పితే వేదాల వల్ల ఏం ప్రయోజనం?, శాస్త్రాలవల్ల ఏం ప్రయోజనం?, మందుల వల్ల ఏం ప్రయోజనం? అనీ, (శ్లోకం 64లో) "మందుల పేర్లవల్ల కాదు వాటిని సేవిస్తే తప్ప వ్యాధి పోదు. స్వానుభవం (అపరోక్షానుభవం) తప్పితే బ్రహ్మం, పేరు (శబ్దం) వల్ల నివృత్తి కాదు" అనీ తెలియజెప్పప్పడం వారి ప్రత్యేకతనూ, ఔన్నత్యాన్నీ , దార్శనికతనూ తెలియజేస్తోంది. “శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం” అన్న తొలికవి, వైతాళికులూ ఆదిశంకరాచార్య. “మాటలు శ్మశానాల వంటి నిఘంటువుల దాటి” అని శ్రీశ్రీ అనడానికి వందలయేళ్లకు పూర్వమే శంకరాచార్య ఈ మాటలు అన్నారు. “వ్యాకరణం రక్షించదు, రక్షించదు” అని శంకరులు అన్నాకే శ్రీశ్రీ “వ్యాకరణాల సంకెళ్లు విడిచి” అని అన్నారు. “మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది” అని అనడానికి “భజగోవిందం భజ గోవిందం, గోవిందం భజ” అని శంకరులు అన్నదే తనకు స్ఫూర్తి అని శ్రీశ్రీ చెప్పారు. ఒక తత్త్వవేత్త, వేదవేత్త, భాష్యకారులు, సంస్కర్త, దార్శనికులు, మార్గదర్శి అయిన ఆదిశంకరాచార్య “ఒక మహోన్నతమైన కవి” అన్నది నిజం. పద(దు)ను, సూటితనం, సాహసం, చొచ్చుకునిపోయే గుణం ఉన్న కవి ఆదిశంకరాచార్య.
పద పురోగతి
-----------------
ఆదిశంకరాచార్య రాసిన స్తోత్రాలలోనూ, అష్టకాలలోనూ, ప్రకరణాలలోనూ, భాష్యాలలోనూ, మహోన్నతమైన కవిత్వం మెరుస్తూంటుంది. ఉపమ, ఉత్ప్రేక్ష, శబ్దాలంకారాలను వారు అద్భుతంగా ప్రయోగించారు. వారి వాక్య నిర్మాణంలోని లయ, ఛందస్సుల బిగి, వాక్యాంతాలలోని ధ్వని, అద్భుతమైనవి. శంకరుల రచనలలో ‘పద పురోగతి’ (word-progression) ప్రతేకంగానూ, ఉన్నతంగానూ ఉంటుంది. ‘సువక్షోజ కుంభాం, సుధాపూర్ణ కుంభాం, ప్రసాదావలంబాం, ప్రపుణ్యావలంబాం’. ఇది య’ గణాల భుజంగప్రయాత వృత్తం. ఇక్కడ 2 య’ గణాలను కలిపి శంకరులు “సువక్షోజ కుంభాం , సుధా పూర్ణకుంభాం” అంటూ పాదాన్ని నడిపారు. 3వ య’ గణానికి శబ్దమైత్రిని పాటించి సౌందర్యాన్ని సాధించారు. బాషపై, చందస్సుపై , శయ్యపై , భావంపై పట్టు ఉన్న ఓ మహాకవి వారు.
తొలి సామాజిక కవి
-------------------------
“ఏ మనిషీ తనకు తానే చెరసాలను నిర్మించుకోడు ఆపై అందులోకి వెళ్ళడు” అనీ, “ఇసుకలో బావి తవ్వడం లాగా” అనీ శంకరులు అనడం ఖలీల్ జిబ్రాన్ కవిని గుర్తుకు తెస్తోంది. జిబ్రాన్ కన్నా శంకరులు ఎంతో పూర్వం వారు. “ ఉనికిలో లేని కుండ సూర్యోదయమైనా కనిపించదు” అన్న శంకరుల మాటలు లావొచు కవిని తలపిస్తున్నాయి. గ్రామంలో ఉండే వ్యక్తి గ్రామంలోకి రావాలని తపించడు అడవిలో ఉన్న వ్యక్తి ఎప్పుడెప్పుడు గ్రామంలోకి వద్దామా అని తపించినట్టుగా” అనీ, “సముద్రపు కెరటం అంటాం కానీ కెరటపు సముద్రం అనం” అనీ శంకరుల అన్నప్పుడు రూమీ వంటి కొందరు సూఫీ కవులు తలపుకు వస్తారు. ఆ సూఫీ కవుల కన్నా శంకరులు చాల ముందటివారు. ఈ శంకరుల మాటలలోని ఇతివృత్తం మనిషే, చింతన సామాజికమే. భారతదేశపు తొలి సామాజిక కవి శంకరులే.
మూర్ఖుడా, సోదరా
-----------------------
“నీ కుశలం అడిగేది నీకు ఊపిరి ఉన్నంత వరకే ఆ తరువాత నీ శవాన్ని చూసి నీ భార్య కూడా భయపడుతుంది” అని శంకరులు చెప్పిన సత్యం వేమనతో పాటు భారతదేశపు ఇతర కవులను కూడా కదిలించింది. 'మూర్ఖుడా', 'సోదరా', వంటి సంబోధనలతో శంకరులు కవితను చెప్పారు. బహుశా ఇలా చెప్పడానికి శంకరులే ఆద్యులేమో?
“జ్ఞానం స్వేచ్ఛకు అధారం” అనీ, వెలిగిన దీపానికి తన వెలుగును చూపించడానికి మరో దీపం అవసరం లేనట్టుగా” అనీ, నీళ్లలో నీళ్లులాగా, కాంతిలో కాంతిలాగా” అనీ అన్న శంకరుల మాటలు ఖలీల్ జిబ్రాన్, లావొచు భావాలుగానూ వినిపిస్తాయి.
“అద్దంలో నగరం ప్రతిబింబించినట్లుగా” అనీ, “అద్దంలో అంతఃపురం లాగా” అనీ శంకరులు అన్నప్పుడు “కొండ అద్దమందు కొంచమై ఉండదా?” అన్న వేమన గుర్తుకొస్తారు. తగిన కారణాలు చూపిస్తూ “అందువల్ల గురువైన శ్ర్రీ దక్షిణామూర్తికి నా నమస్కారం” అన్న వాక్యం పునరావృతం అయ్యే దక్షిణామూర్తి స్తోత్రం లోని శంకరల శైలి ఈనాటి వఱకూ చాలా మంది కవుల కవితలకు మార్గదర్శకం అయింది.
సహజ కవి
--------------
“ఈ ప్రపంచపు ఎండమావిలోని నీటి కోసం నాకున్న దాహాన్ని నిరోధించు” అని శంకరులు అన్నది చదివాక రవీంద్రనాథ్ టాగోర్ మీద ఆ మాటల ప్రభావం ఉందని తెలిసిపోతుంది. ఒక తల్లి ఎంత గొప్పదో చెబుతూ ‘చెడ్దకొడుకు పుడతాడు కానీ తల్లి చెడ్డదవడం ఉండదు” అన్నారు శంకరులు. ప్రపంచపు సాహిత్యంలో మరెక్కడా ఈ మాటలకు సమానమైవి ఉండవేమో? “వందల రంధ్రాలున్న మట్టి కుండలో దీపాన్ని ఉంచితే ఆ దీపపు కాంతి లోపలా, బయటా ప్రసరిస్తూంటుంది” అని శంకరులన్నారు. ఈ మాటలన్నందుకు లావొచు, ఖలీల్ జిబ్రాన్, హాఫిజ్, ఉమర్ ఖయ్యామ్, షేక్స్పిఅర్, విలిఅమ్ బ్లేక్ వంటి కవులూ, సూఫీ కవులందఱూ “శంకరులు తమ ఆచార్యులు” అని అనకుండా ఉండలేరేమో? మనకు బాగా తెలిసిన సామెత లాంటి “పునరపి జననం, పునరపి మరణం” శంకరులదే. “నీడలా అనుసరించడం” అనడం, “మబ్బు తొలిగిన సూర్యుడిలా” అనడం, “పాలలో వెన్నలా” అనడం, “మహా స్వప్నం” అనడం శంకరులనుంచి వచ్చినవే. “ఆకలి దాహాలతో ఉన్నప్పుడు బిడ్డ తల్లినే తలుచుకుంటుంది” అనీ, “దుఃఖం చేత అనురాగం అనే తాడు ఖండించబడుతుంది” అనీ అన్న సహజ కవి శంకరులు.
తత్త్వకవి
------------
“నువ్వు ఎవరివి?”, “ఎవరు నీకు సొంతం?’, “నువ్వు ఏ ప్రదేశం నుంచి వచ్చావు?” వంటి శంకరుల ప్రశ్నలు చాల భారతీయ రచనలలో కనిపిస్తాయి. భారతదేశపు తొలి తత్త్వకవి శంకరులే. భారతదేశపు గొప్ప కవులపై శంకరుల ప్రభావం కనిపిస్తూనే ఉంది.
విప్లవకవి
------------
“వాక్చాతుర్యం, పద ప్రవాహం, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, పాండిత్యం, ఇవన్నీ భుక్తి కోసమే” అనీ, “శాస్త్రాన్ని వదిలెయ్” అనీ, కులం, గోత్రం, రూపం, వీటిపై అభిమానాన్ని వదిలెయ్” అనీ అన్న ప్రపంచపు తొలి విప్లవకవి శంకరులే.
విశ్వమహాకవి
-----------------
“రాళ్లు, చెట్లు, గడ్డి, ధాన్యం, పొట్టు ఇవన్నీ అగ్నివల్ల కాలిపోతే అవి వాటికి మూలమైన మట్టిగా అయిపోతాయి” అని అన్న మట్టిపై మక్కువ ఉన్న కవి శంకరులు. “చెట్టు నుంచి రాలిన ఆకు కాలువలోనో, నదిలోనో, శివక్షేత్రంలోనో, వాకిట్లోనో, పడితే ఆ చెట్టుకు శుభా శుభాలు వర్తిస్తాయా?” అని అడగడం శంకరులకే చెల్లింది. దేశ, కాలాలకు అతీతమైన భావాలతో, భావనలతో, రచనా సంవిధానంతో ఎప్పటికీ నిలిచి ఉండే విశ్వమహాకవి ఆదిశంకరాచార్య.
ప్రశ్నోత్తర రత్నమాలిక
-----------------------------
ప్రశ్నోత్తర రత్నమాలికలో అడగబడ్డ కొన్ని ప్రశ్నలకు శంకరులు ఇచ్చిన జవాబులు మనకు దిశా నిర్దేశం చేస్తాయి; ఆలకించండి ...
ఏది అన్నిటికన్నా ప్రయోజనకరమైనది?
జవాబు: ధర్మం
ఏది వాంఛింపదగినది?
జవాబు: స్వ , పర హితం
శత్రువు ఎవరు?
జవాబు: సోమరితనం
ఏది దుఃఖం?
జవాబు: ఉత్సాహం లేకపోవడం
ఏది జాడ్యం?
జవాబు: నేర్చుకున్నది ఆచరించకపోవడం
ఏది వెలలేనిది?
జవాబు: అవసరం వచ్చినప్పుడు ఇవ్వబడేది
ఎవరి చేత ప్రపంచం జయించబడుతుంది?
జవాబు: సత్యం, ఓర్పు ఉన్న వ్యక్తి చేత
ఏది దానం?
జవాబు: అకాంక్ష లేనిది
ఎవరు స్నేహితులు?
జవాబు: పాపాన్ని నివారించే వాళ్లు
ఏది పాతకం?
జవాబు: హింస
ఎవరు ఎదుగుతారు?
జవాబు: వినయం ఉన్నవాళ్లు
ఎవరు ప్రత్యక్ష దేవత?
జవాబు: అమ్మ
వేటిని మనుషులు సంపాదించాలి?
జవాబు: విద్య, ధనం, బలం, కీర్తి , పుణ్యం
వేటిని కాపాడుకోవాలి?
జవాబు: కీర్తి , పతివ్రత, బుద్ధి
ఎవరు శూరులు?
జవాబు: భయంతో ఉన్నవాళ్లను రక్షించేవాళ్లు
సర్వజ్ఞ
---------
ఆదిశంకరాచార్య ఒక సర్వజ్ఞ. "మీకు చెప్పులు కుట్టడం వచ్చా" అని అడిగినప్పుడు శంకరులు చెప్పును రెండు పాదాల మధ్యలో పెట్టకుని సూదిని ముక్కు పక్కభాగంలో రుద్దుకుని చెప్పు కుట్టారట. ఇలా సూదిని ముక్కు పక్కన రుద్దడం వృత్తిగా చెప్పులు కుట్టే వాళ్లు చేస్తారు. శంకరులు మడికట్టుకుని కూర్చోలేదు. వీధిలోకి వచ్చి ఉద్యమించారు. వారిని చంపాలని ప్రయత్నాలూ జరిగాయి. అయినా భయపడకుండా సత్యం కోసం పయనించారు; పని చేశారు; విజయం సాధించారు.
తప్పులు
-----------
శంకరుల విషయంలో కొన్ని విషయాలు తప్పిపోయాయి, కొన్ని తప్పులు నెలకొన్నాయి. ముఖ్యంగా వారి కాలం. వారి కాలం సామాన్య శకం 8వ శతాబ్ది అనడం సరికాదు. సామాన్య శకం 2000 తరువాతి పరిశీలనలు వారి జననం సామాన్య శకానికి పూర్వం 509వ సంవత్సరం అని తెలియజేస్తున్నాయి. 1920వ దశాబ్దిలోనే అంతర్జాతీయ పరిశీలనలు శంకరుల జననం సామాన్య శకానికి పూర్వం 509వ సంవత్సరం అని తెలియజెబుతున్నాయి. ఆదిశంకరులు ప్రచ్ఛన్న బౌద్ధులు అనీ, వారు బౌద్ధాన్ని తిరస్కరించారు అనీ మనం వింటూంటాం. ఈ రెండూ సరైనవి కావు. వారి రచనల్లో ఎక్కడా బౌద్ధం, బుద్ధుడి ప్రస్తావన లేదు.
చండాలుడి ఉదంతం
-----------------------------
శంకరులను తప్పు పట్టేవాళ్లు చండాలుడి ఉదంతాన్ని తీసుకుంటారు. ఆ ఉందంతాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆ చండాలుడుగా వచ్చింది పరమ శివుడు అని ఒప్పుకోవాల్సి ఉంటుంది. రెండవది, అతి ముఖ్యమైంది... శంకరులు ఆ సందర్భంలో చండాలుడితో ఓడిపోయి (శంకరులు ఓడిపోయిన సందర్భం ఇదొక్కటే) అతడి పాదాలు పట్టుకుని తన తప్పు తెలుసుకున్నారు. ఆదిశంకరుల ఔన్నత్యం అది. సనాతనత్వం నేర్పే సంస్కారం తప్పు తెలుసుకోవడం; దిద్దుకోవడం. ఇవాళ కుసంస్కారం, అసంస్కారం, కుజ్ఞానం, అజ్ఞానం వ్యక్తులు అలా శంకరులలా విద్య, విజ్ఞతలతో తమ తమ తప్పుల్ని ఒప్పుకుని దిద్దుకుంటారా? తప్పుల్ని దిద్దుకునే సంస్కారానికీ శంకరులే ఆదర్శం. ఆదిశంకరులను సరిగ్గా చదివి వారిని సమగ్రంగా అర్థం చేసుకోవాలి.
వెఱపు లేని వెల్లువ
-------------------------
ఆది శంకరులు అద్భుతాల్నీ చేశారు, ఆకలీ తీర్చారు, కవిత్వాన్నీ చెప్పారు, దైవాన్నీ స్తుతించారు, చెప్పులూ కుట్టారు. వైదికత్వం కోసం దుష్టుల దాడులకూ గురయ్యారు; ప్రాణాల మీదకూ తెచ్చుకున్నారు. శంకరులు వెఱపు లేని వెల్లువ అయి సాగారు. ఇవాళా దుష్టుల, ఉగ్రవాదుల, ఉన్మాదుల వల్ల సనాతనత్వంపై, సనాతనులపై భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. ఆదిశంకరులను ఆదర్శంగా చేసుకుని మనమూ ఆ దాడులకు వెఱవకుండా మునుముందుకు సాగుతూండాలి. 'ఆదిశంకరులు మన మట్టి శక్తి; ఆది శంకరులు మన దేశ యుక్తి'. శంకరత్వాన్ని, శంకర తత్త్వాన్ని మనం మనకు ప్రయుక్తం చేసుకోవాలి.
ప్రణామం
------------
'ఆదిశంకరాచార్యుల వారికి సాటిరాగల మానవ మూర్తమత్వం ఈ విశ్వంలో మఱొకటి లేనేలేదు'. ఆ మహాశక్తికి, ఆ మేధాభివ్యక్తికి; ఆ ఆధ్యాత్మిక సూర్యుడికి, ఆ తాత్త్విక కాంతికి; ఆ విశ్వమహాకవికి, ఆ భవ్య సాహిత్యానికి; ఆ విశేషనైజానికి, ఆ విశిష్ట వైప్లవ్యానికి; ఆ ధర్మజ్ఞతకు, ఆ దార్శనికతకు ఈ మట్టి మనుషులంగా మనసా, వాచా ప్రణామం చేద్దాం.
'సత్'లోకి
-------------
మన ఇళ్లల్లో, మన కార్యాలయాల్లో, మన ఉద్యానవనాల్లో, మన వ్యాపార స్థలాల్లో ఉండాల్సినవి బుద్ధుడు, సాయిబాబా ప్రతిమలు, చిత్రాలు, శిల్పాలు కాదు. మన ఇళ్లల్లో, మన కార్యాలయాల్లో, మన ఉద్యానవనాల్లో, మన వ్యాపార స్థలాల్లో తప్పకుండా ఉండాల్సినవి ఆదిశంకరాచార్యుల వారి ప్రతిమలు, చిత్రాలు, శిల్పాలు. మనం పంచుకోవాల్సింది బుద్ధుడు, సాయిబాబా ప్రతిమలు కాదు, ఆదిశంకరాచార్య ప్రతిమలు. మన చుట్టూనూ, మనలోనూ ఉండాల్సినవి అప్రయోజకత్వానికి, అపజయానికి, అమంగళానికి చిహ్నం అయిన బుద్ధుడి బొమ్మలు, చిత్రాలు కావు, తప్పుడుతనానికి, అనర్థానికి, అవైదికానికి చిహ్నమైన సాయిబాబా చిత్రాలు, శిల్పాలు కావు. మనకు కావాల్సినవి, మనలో నెలకొని ఉండాల్సినవి ఆదిశంకరాచార్య ప్రతిమలు, చిత్రాలు, శిల్పాలు. మనం మన చుట్టూనూ, మనలోనూ ఆదిశంకరాచార్య ప్రతిమల్ని, బోధల్ని, ఆచరణల్ని, నైజాన్ని ప్రతిష్ఠించుకుందాం. మనం 'అసత్' నుంచి విముక్తమౌదాం; ఆదిశంకరరాచార్య స్పూర్తి కాగా, ఆదిశంకరరాచార్య ప్రేరణ కాగా మనం 'సత్'లోకి వెళదాం.
ఆదర్శం
-----------
ఈ భారత(ప్ర)దేశంలో నడయాడిన న భూతో న భవిష్యతి మానవ అత్యద్భుతం ఆదిశంకరాచార్య. వారిని స్మరించుకుంటూండడం ఈ మట్టి మనుషులు మనుషులుగా బ్రతుకుతూండడం అవుతుంది. ఆదిశంకరుల పనితీరు, దూసుకుపోయే నైజం, క్రియాశీలకత్వం, ఫలితాల్ని సాధించగలిగే నేర్పు, ఉద్యమస్ఫూర్తి, నిర్మాణాత్మకత, తెలివిడి, ప్రజ్ఞ, మేధ, రచనా పటిమ, దార్శనికత మనకు ఆచరణాత్మక ఆదర్శం కావాలి.
శంకరుల గురుత్వం
------------------------
మన భారతదేశంలో ఆదిశంకరాచార్యుల అవతరణం ఒక చారిత్రిక, సామాజిక, సైద్ధాంతిక, వైదిక, తాత్త్విక, సాత్విక అవసరం. వారు అవతరించి సనాతనత్వానికి ప్రవాహాన్నిచ్చారు. ఆ ప్రవాహం మనందరికీ ఇప్పటికీ, ఎప్పటికీ ఎంతో ప్రయోజనకరం. మనదేశానికి సంబంధించినంత వఱకూ వారే గురువు. ఆది శంకరుల గురుత్వంలో మనదేశ గమనం మునుముందుకు సాగుతూండాలి.
2000 ఏళ్ల నాడు వ్యాపార నిమిత్తం చేసిన ప్రయాణం ఒక దేశ ఆవిర్భావానికి కారణం అయ్యిందా?
మన దేశం భారత దేశంగా పిలవబడడానికి కారణం, కొన్ని యుగాలకు పూర్వం ఈ దేశాన్ని ఏలిన భరత చక్రవర్తి అనే విషయం తెలిసిందే. పరిపాలనా దక్షత, వీరత్వం, మంచి మనస్సు, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ వంటి సూక్ష్మాలను పాటిస్తూ, ప్రజలు ఏ విధంగా ఉండాలి, రాజులు ఏ విధంగా పాలించాలనే విషయాలను భావితరాలకు అందించిన యుగ పురుషుడాయన. అందుకే మన దేశానికి భారత దేశం అనే పేరు స్థిరపడింది. ఆయన పాలనలో అఖండ భారతావని ఆవిష్కృతం అయ్యింది. దాదాపుగా అటు మధ్య ఆసియా దేశాలుగా పిలవబడే ఇరాక్, సిరియా నుంచి ఇటు ఫిలిప్పీన్స్ ద్వీప దేశం వరకు ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. అందుకే ఆయన పాలించిన రాజ్యాన్ని భారత దేశం అని కాకుండా, భరత ఖండం అని పిలిచేవారు. మరి ఈ ప్రపంచంలో మన హిందూ రాజు పేరుపై నిర్మితమైన మరో దేశం గురించి మీరెప్పుడయినా విన్నారా? ఎక్కడో ఉన్న మరో దేశానికి ఒక హిందువు రాజు ఎలా అయ్యాడు? ఆయన పేరుమీద ఆ దేశానికి ఆ పేరు ఎలా వచ్చింది? వంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
ఈ భూమండలంపై అత్యంత పురాతనమైన నాగరికత మన సనాతన ధర్మమే. ఒకప్పుడు మన దేశం అద్భుతమైన విజ్ఞానానికీ, అఖండమైన ఆవిష్కరణలకూ ఆలవాలంగా నిలిచింది. ఇక్కడి రాజులూ, ప్రజలూ, ప్రపంచపు నలుమూలలకూ వెళ్ళి, అక్కడ మన ధర్మాన్ని నెలకొల్పడమే కాకుండా, ఆయా ప్రదేశాలలో ఉన్న ఆదిమ జాతులవారికి నాగరికత నేర్పించారు. నేటి పాశ్చాత్య చరిత్రకారులు ఎంతో ఆశ్చర్యంగా చెప్పుకునే సుమేరియన్, ఈజిప్ట్, బాబిలోనియన్, ఆఖరికి భూగోళానికి అటువైపున ఉన్న Inca, మయాన్, Tiwanaku వంటి ఎన్నో పురాతన నాగరికతలన్నీ, కాలగమనంలో సనాతన ధర్మం అనే మహా వృక్షం నుంచి పుట్టుకొచ్చిన శాఖలే అని చరిత్రకారులు చెబుతున్నారు. అలా మన హిందూ రాజు ద్వారా ఏర్పడి, అభివృద్ధి చెంది, నేటికీ ఆయన పేరు మీదనే నిలబడిన దేశం కంబోడియా.
ఆది నుంచీ మన హిందూ రాజుల ప్రాభవం ప్రపంచం మొత్తం మీదా ఉండేదనే విషయం మనం చాలా వీడియోలలో చెప్పుకున్నాము. అయితే ఆధునిక చరిత్ర పుటలలో మాత్రం, కంబోడియా చరిత్ర మన దేశం నుంచి వెళ్ళిన ఒక వర్తకుడితో మొదలైంది. కౌండిన్యుడనే పేరుగల వర్తకుడు దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం వ్యాపార నిమిత్తం చేసిన ప్రయాణం, ఒక దేశ ఆవిర్భావానికి కారణం అయ్యింది. చరిత్రకారుల ప్రకారం కౌండిన్య అనేది అతని పేరు కాదనీ, అతని అసలైన పేరు నేటికీ తెలియని ఒక ప్రశ్న అనీ చెబుతున్నారు. సాధారణంగా మన దేశంలో కౌండిన్య అనే పేరు గోత్ర నామాలలో వింటూ ఉంటాము. మరీ ముఖ్యంగా పూర్వం నుంచి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళ నాడు ప్రాంతాలలో ఉండే బ్రహ్మణులలో, కౌండిన్య గోత్రం గలవారు ఉంటారు. కంబోడియాకి ప్రయణమైన వ్యక్తి కూడా అదే కౌండిన్య గోత్రానికి చెందిన వాడనీ, పూర్వం పేరు చెప్పినప్పుడు ముందుగా గోత్రం కూడా చెప్పే అలవాటు ఉండడంతో, చరిత్రలో ఆయన అసలు పేరు కంటే గోత్ర నామమైన కౌండిన్య లిఖించబడి ఉందనీ చరిత్రకారులు అంటున్నారు.
కొన్ని వేల సంవత్సరాల క్రితం భారత దేశం సముద్ర వర్తక వ్యాపార సామ్రాజ్యంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణిలో ఉండేది. ఆ కాలంలో చాలా మంది భారతీయ వర్తకులు, మనదగ్గర దొరికే వస్తువులను ఎన్నో దేశాలకు ఎగుమతి చేసేవారు. ఇలా భారీ ఓడలపై సముద్ర యానం చేయడానికి, అప్పట్లోనే మన దేశంలో ఎన్నో అద్భుతమైన ఓడ రేవులు ఉండేవి. అటువంటి వాటిలో ఒరిస్సా లోని Golabai ఓడ రేవు ఒకటి. ఆ కాలంలో Chilka అనే ఉప్పు నీటి సరస్సు దగ్గర ఈ భారీ ఓడ రేవు ఉండేది. ఈ సరస్సు లోతుగా, విశాలంగా ఉండటంతో పాటు, ఒక పక్క bay of Bengal సముద్రంలో కలుస్తూ ఉండేది. దానితో నాడు Chilka సరస్సు నుంచి ఓడలు Bay Of Bengal లోకి ప్రవేశించి, అక్కడి నుంచి తమిళనాడు లోని నాగపట్నం పోర్ట్ కీ, అటునుంచి శ్రీలంకలోని పోర్ట్ కీ వెళ్ళి, అక్కడి నుంచి అటు సౌత్ ఈస్ట్ దేశాల వైపుకూ, ఇటు పశ్చిమ దేశాల వైపుకూ ప్రయాణం చేసేవారు. ఇదే విధంగా నాడు మన వర్తకులు, రోమ్ వరకూ తమ వ్యరపారాలను విస్తరింప చేశారు. సౌత్ ఈస్ట్ వైపుకు ప్రయాణం చేసినప్పుడు, అండమాన్ దీవుల నుంచి మలక్కా జలసంధిని దాటి, అటువైపున్న జపాన్, చైనా, ఆస్ట్రేలియా వంటి ఎన్నో దేశాలలో వర్తక వ్యాపారాలు చేసేవారు.
ఆ కాలంలో అండమాన్ కి వెళ్ళేదారిలో బలమైన తుఫాన్లు, సముద్రపు దొంగల బెడద ఎక్కువగా ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. దానితో కొంతమంది వర్తకులు తమ దగ్గర ఉన్న సరుకును కాపాడుకోడానికి వేరే దారి వెతుక్కున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న థాయిలాండ్ దేశానికి మధ్యలో ఓ చిన్న కెనాల్ ఉండేది. అది నేరుగా bay of Bengal నుంచి, gulf of Thailand సముద్రంలో కలిసేది. ఆ కెనాల్ కాస్త ఇరుకుగా ఉన్నా, అప్పట్లో నేర్పున్న నౌక కెప్టెన్లు, దూరాన్ని తగ్గించుకోడానికీ, పైరేట్స్ నుంచీ, తుఫాన్ల నుంచీ రక్షించుకోవడానికీ, ఆ కెనాల్ ని వాడే వారు. దానినే Isthmus of Kra అని పిలిచేవారు.
కౌండిన్యుడు కూడా ఆ రెండు దారులలో ఏదో ఒక దారిలో సౌత్ ఈస్ట్ దేశాల వైపుకు వెళ్లాడానీ, అయితే అతను ఖచ్చితంగా ఏ దారి వాడాడనే విషయం నేటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయిందనీ చరిత్రకారులంటున్నారు. అలా వెళ్ళిన కౌండిన్యుడు gulf of Thailand దగ్గరకి చేరుకోగానే, కొంతమంది సముద్రపు దొంగలు అతని ఓడ పై దాడి చేశారు. అయితే ఎంతో వీరోచితంగా పోరాడిన కౌండిన్యుడూ, అతడి బృందమూ, ఆ సముద్రపు దొంగలను తరిమికొట్టారు. ఆ దాడిలో కౌండిన్యుడి ఓడ కాస్త దెబ్బతినడంతో, మరమత్తుల కోసం దగ్గరలోని ఒక తీరానికి చేరుకున్నాడతను. ఆ కాలంలో ఆ తీరం స్థానిక పల్లె రాజు ఆధీనంలో ఉండేది. అక్కడ కౌండిన్యుడికీ, అతని సిబ్బందికీ తెలిసిన విషయం ఏమిటంటే, వారిపై దాడి చేసిన పైరేట్స్, ఆ పల్లె రాజు ఆధీనంలోని మనుషులే అని. దానితో వారిపై మరో భారీ దాడి జరిగే అవకాశం ఉందని తెలుసుకున్నారు.
ఈ లోపు కౌండిన్యుడి అందం, బలం, బలగం చూసిన ఆ పల్లె రాజు కుమార్తె ‘Soma’ అతడిపై మనస్సు పడి, కౌండిన్యతో వివాహం జరిపించమని తండ్రిని కోరింది. దాంతో పల్లె రాజు అనుచరులు ఆ విషయాన్ని కౌండిన్యుడికి చెరవేయగా, అతను మొదట్లో కాస్త తటపటాయించినా, తర్వత ఆమెతో వివాహానికి అంగీకరించాడు. ఆ విధంగా సౌత్ ఈస్ట్ లోని ఒక చిన్న రాజ్యానికి అల్లుడు అయిన కౌండిన్యుడు, తన తెలివితో, బలంతో ఒక మహా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, కంబోడియాకి మొదటి చక్రవర్తి అయ్యాడని, చరిత్ర కారుల విశ్లేషణ. అందుకే అతని పేరుపైనే ఆ దేశానికి కంబోడియా అనే పేరు వచ్చిందని వారి వాదన.
ఇలా నేడు చూస్తున్న కంబోడియా ప్రాంతంలో మొదటి రాచరిక వ్యవస్థను స్థాపించిన కౌండిన్యుడు ఎన్నో ఏళ్ల పాటు పాలించినట్లూ, ఆ తర్వాత అతడి వారసులు ఆ ప్రాంతాన్ని ఏలినట్లూ చరిత్ర తెలియపరుస్తోంది. అంతేకాదు, కౌండిన్యుడి తర్వాత ఎంతో మంది భారతీయులు, కంబోడియాలోని మహిళలను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యారు. మరీ ముఖ్యంగా, బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు అధికంగా కాంబోడియాకు వెళ్ళినట్లు చరిత్ర విదితం. ఆది కాలం నుంచీ బ్రాహ్మణులు, భారత ఇతిహాసంలోని రాచరిక వ్యవస్థలలో administrative departments లో పనిచేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. వారి జ్ఞానంతో, ఒక రాజ్యపాలనకు అవసరమైన లెక్క, పత్రాలన్నీ చూసుకుని, రాజుకు సరైన సలహాలు ఇవ్వడంలో వారు మేటి. కొంతమంది బ్రాహ్మణులు మన దేశంలోని రాజ్యాలను ఏలిన చరిత్ర కూడా ఉంది. వారిలో ఉన్న ఈ అనుభవం, కంబోడియా నిర్మాణంలో తోడ్పడుతుందని కౌండిన్యుడు భావించి, మన దేశం నుంచి చాలా మంది బ్రాహ్మణులను అక్కడికి తీసుకు వెళ్ళాడు. అలా వెళ్ళిన వారు, ఆ దేశంలోని ఉన్నతాధికారులూ, ధనికుల కుమార్తెలను వివాహమాడి అక్కడే స్థిరపడపోయారు. ఈ తంతు 15, 16 వ శతాబ్దాలలో కంబోడియాను పాలించిన Khmer వంశ పతనం వరకు కొనసాగింది.
ఇదిలా ఉంటే, కంబోడియా అనే పదం, ఫ్రెంచ్ వారి ఆక్రమణ తర్వాత వచ్చిన పేరు. అంతకు ముందు ఆ దేశాన్ని Kampuchea లేదా Kambujadesa అని పిలిచేవారు. దీనికి ‘The Land Of Kambuja’ అనే అర్ధం వస్తుంది. సంస్కృత భాషలో దీని ఉచ్ఛారణ ‘కాంభోజ రాజ్యం’. ‘కంబు స్వాయంభువ’ అనే ఋషి పేరుమీద ఆ దేశానికి కాంభోజ దేశం అనే పేరు వచ్చినట్లు చరిత్రకారులంటున్నారు. దీనికి ఆధారంగా, మన దేశ ఖ్యాతినీ, మన చరిత్రనూ అభివర్ణిస్తూ రాయబడిన ‘ఏకాత్మతా స్తోత్రం’ లోని 21వ శ్లోకం, అగస్త్యః కంబుకౌండిన్యౌ.. అంటూ సాగే శ్లోకంలో, కంబు స్వాయంభువ ఋషి గురించిన ప్రస్తావన చూపుతున్నారు. దానితో పాటు మరికొన్ని చారిత్రక ఆధారాలను పరిశీలించి, కొన్ని వేల ఏళ్ల క్రితం ప్రస్తుతం ఉన్న కంబోడియా ప్రాంతానికి కంబు స్వాయంభువ ఋషి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న నాగ జాతి కన్య అయిన ‘మేరా’ అనే రాకుమార్తెను పెళ్లి చూసుకున్నాడనీ, అతని వంశమే కంబోడియాలో అతి పెద్ద రాజ వంశంగా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు. అంతేకాదు, Khmer వంశం కూడా ఈ కంబు స్వాయంభువాకీ, మేరా కీ కలిగిన సంతానం నుంచి ఉద్భవించిన వంశమే అని చెబుతున్నారు. కంబు లో సగం, మేరా లోని సాగాన్నీ కలుపుతూ, Khmer వంశం అనే పేరు వచ్చినట్లు చరిత్ర విదితం.
ఈ Khmer వంశం వారెవరని ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ప్రపంచంలోనే అతిపెద్ద వైష్ణవ దేవలయంగా పేరుగాంచిన Angkor Wat గురించి వినే ఉంటారు. ఆ ఆలయాన్ని నిర్మించింది ఈ Khmer వంశస్థులే. 10వ శతాబ్ద కాలంలో Khmer వంశాన్ని పాలించిన మొదటి సూర్యవర్మ Angkor Wat కి పునాది వెయ్యగా, 12వ శతాబ్దంలో అదే వంశానికి చెందిన రెండవ సూర్యవర్మ, నేడున్న Angkor Wat ని పూర్తి చేశాడన్నది చారిత్రక వాస్తవం. ఆ ఆలయం మొదట్లో పూర్తి వైష్ణవ ఆలయంగా ఉండేది. Khmer వంశపు రాజులు మన దేశంలోని ఒరిస్సా నుంచి తమిళనాడు వరకు పాలించిన రాజ వంశాలతో వివాహ సంబంధాలు కూడా ఏర్పరుచుకున్నారని చరిత్ర చెబుతుంది. అందుకే మొదట్లో Angkor Wat ఒక పూర్తి హిందూ ఆలయంగా మాత్రమే ఉండేది. రాను రాను కంబోడియాలో బౌద్ధ ధర్మ ప్రచారం పెరగడం, Khmer వంశపు రాజులకు బౌద్ధుల పట్ల సానుకుల దృక్పథం కలిగి ఉండటంతో, పూర్తి హిందూ దేశంగా ఉన్న కంబోడియా మెల్ల మెల్లగా బౌద్ధ ధర్మం వైపు కూడా అడుగులు వేసింది. Khmer వంశం పతన దశకు వచ్చేటప్పటికి, Angkor Wat లో బౌద్ధ విగ్రహాలూ, క్షేత్రాలూ ఎన్నో వెలిశాయి. ఆ కారణంగానే నేడు ఆ ఆలయంలో బౌద్ధ విగ్రహాలను కూడా చూడవచ్చు.
ఇదిలా ఉంటే, కంబోడియా చరిత్రపై మరింత క్షుణ్ణంగా పరిశీలించిన చరిత్రకారులు, కంబు స్వాయంభువ ఋషి, కౌండిన్యుడూ ఒక్కరే అనీ, స్థానిక రాజు పెద్ద కూతురు Soma మరో పేరు మేరా అనీ, కౌండిన్యుడు వృద్ధాప్యంలో ఋషిగా మారి ఎన్నో అద్వితీయమైన కార్యక్రమాలు చేశాడనీ అంటారు. అతని కారణంగానే వేర్వేరు ఆదిమ జాతి తెగలతో చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న కంబోడియా ఒక మహా సామ్రాజ్యంగా మారడంతో పాటు హిందూత్వం వ్యాప్తి చెందిందనీ, అతని తర్వాత వచ్చిన రాజులు కూడా హిందూత్వ వ్యాప్తిలో ఎంతో కృషి చేశారనీ, చరిత్రకారుల మాట. ప్రస్తుతానికి కంబోడియాలో థెరవాడ బౌద్ధమతం, లేదా దక్షిణ బౌద్ధమతాన్ని అనుసరించే వారు ఎక్కువగా ఉన్నా, నేటికీ ఆ దేశంలో ఎన్నో హిందూ ఆలయాలూ, అద్భుత శిల్పాలూ, శివ లింగాలూ వెలుగుచూస్తూనే ఉన్నాయి.
1000 ఏళ్ల క్రితం మొదటిసారి అమెరికాను కనుగొన్నది వైకింగ్సా? మరి ‘బలి చక్రవర్తి’?
అంతర్జాలం పుణ్యమా అని కొన్ని తరాలుగా మరుగున పడిపోయిన ఎన్నో అద్భుత విషయాలు శరవేగంతో మన ముందుకు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో, గత కొద్ది నెలలుగా అంతర్జాలంలో ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. అమెరికాను మొట్ట మొదటగా కనుగొన్నది కొలంబస్ కాదు, దాదాపు వెయ్యేళ్ళకు పూర్వం యూరోప్ లో నివసించిన వైకింగ్స్ అనే జాతి ప్రజలని ఆ పోస్ట్ యొక్క ముఖ్య సారాంశం. ఇక ఆ విషయాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇదే క్రమంలో ఇండోనేషియాలోని బాలీ దీవులు, పాతాళ లోకానికి దారి వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. దానితో ఆమెరికా ఖండానికీ, బాలీ దీవులకూ, పాతాళ లోకానికీ ఉన్న సంబంధం ఏమిటి..? వంటి సందేహాలు మొదలయ్యాయి. దానికి సమాధానంగా, ఒకప్పుడు భరత ఖండాన్ని ఏలిన గొప్ప చక్రవర్తులలో ఒకరైన బలి చక్రవర్తికి సంబంధించిన చరిత్రను త్రవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాలన్నీ కొంత అయోమయంగా అనిపించవచ్చు. అసలు బలి చక్రవర్తికీ, పాతాళానికీ, అమెరికాకూ సంబంధం ఏమిటి..? మధ్యలోకి బాలీ దీవులు ఎందుకు వచ్చాయి..? వంటి విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
అందమైన బీచ్ లకూ, ప్రకృతి సోయగాలకూ బాలీ దీవులు బాగా ఫేమస్ అనే విషయం తెలిసిందే. అందుకే ప్రతి సంవత్సరం కోట్లాది మంది టూరిస్ట్ లు బాలీ దీవులకు క్యూ కడుతూ ఉంటారు. అందులో మన దేశానికి చెందిన పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువే. 90 శాతం ముస్లిం జనాభాతో నిండి ఉన్న ఇండోనేషియాలోని బాలీ దీవులలో మాత్రం, ఈనాటికీ 90 శాతం మంది హిందూ ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తున్నారనే సందేహం ఖచ్చితంగా కలుగుతుంది. బాలీలో ఎక్కడ చూసినా హిందూ దేవుళ్ళకు చెందిన భారీ విగ్రహాలు కనువిందుజేస్తాయి. ఎక్కడపడితే అక్కడ వినాయక విగ్రహాలు దర్శనమిస్తాయి. అక్కడ అతి పురాతన హిందూ ఆలయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చూస్తే అసలు మనం ఒక ముస్లిం దేశంలో ఉన్నామా, లేక భారత దేశంలోని ఏదైనా టెంపుల్ సిటీలో ఉన్నామా అనే సందేహం కలగటం ఖాయం. దానికి సమాధానంగా, చాలా మంది చాలా రకాల నిర్వచనాలిస్తూ ఉంటారు. కానీ అసలైన సమాధానం, బలి చక్రవర్తికి సంబంధించిన చరిత్ర పుటలలో ఉందని, భారతీయ ఇతిహాసాలను అధ్యయనం చేసిన వారు చెబుతున్నారు.
అంతేకాదు, వెయ్యేళ్ళ క్రితం వైకింగ్స్ జాతి వారు మొదటి సారి అమెరికాను కనుగొన్నారని విదేశీ చరిత్రకారులు చెబుతున్న విషయం పూర్తిగా అవాస్తవం. మన దేశ రాజులు అక్కడ కొన్ని యుగాలకు పూర్వమే మహా సమారాజ్యాలను నెలకొల్పి, అక్కడి ఆటవిక జాతులవారికి నాగరికత నేర్పించారు. ప్రపంచంలో అత్యంత పురాతన నాగరికతలలో ఒకటిగా చెప్పుకునే మయ (Mayan) నాగరికత కూడా భారతీయుల వల్ల పుట్టిన నాగరికతే అని చరిత్రకారులు చెబుతున్నారు. ఇటువంటి విషయాలను విన్న తర్వాత మనలో ఎన్నెన్నో సందేహాలు కలుగుతాయి. వాటికి సమాధానాలను ఇప్పుడు వామనావతారం ద్వారా తెలుసుకుందాము.
విష్ణుమూర్తి అవతారాలలో అత్యంత సాత్విక అవతారంగానూ, తొలి మానవ అవతారంగానూ వామనావతారానికి పేరు ఉంది. యుగాలకు పూర్వం దానవరాజైన ప్రహ్లాదుడి మనుమడు, విరోచనుడి కొడుకు, అయిన బలి రాజై అఖండ భారతావనిని ఏలాడు. ఒకానొక సమయంలో దేవతలతో యుద్ధం చేయాల్సి వచ్చి, దేవతల బలం ముందు తన బలం చాలక, ఓటమి పాలయ్యాడు బలి చక్రవర్తి. అప్పటికే గొప్ప రాజుగా, దాయా శీలుడిగా, దానంలో తనను మించిన వాడు మరొకడు లేడని పేరు తెచ్చుకున్న బలి చక్రవర్తి, ఆ ఓటమిని భరించలేకపోయాడు. ఎలాగైనా దేవతలను ఓడించి స్వర్గాధిపతి ఇంద్ర పదవిని పొందాలని నిర్ణయించుకుని, బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి మెప్పించి, అనేక వరాలను పొందాడు బలి చక్రవర్తి. ఆ వర ప్రభావంతో బలి చక్రవర్తి దేవతలపై దాడి చేసి, ఇంద్రుడిని తరిమి, దేవలోకాన్ని ఆక్రమించుకున్నాడు.
ఇలా అటు స్వర్గాన్నీ, ఇటు భూ లోకాన్నీ ఏలుతూ, అత్యంత బలమైన చక్రవర్తిగా మారిన బలికి, ఎప్పుడూ ఒక సందేహం మదిలో మెదులుతూ ఉండేది. ఏనాటికైనా స్వర్గాన్ని మళ్ళీ దేవతలు ఆక్రమించే అవకాశం ఉంది. అలాకాకుండా, ఆ ఇంద్ర పదవి తనకు శాశ్వతంగా దక్కితే, ఎటువంటి ఇబ్బందీ ఉండదని భావించాడు. కొంతమంది చరిత్రకారుల ప్రకారం, బలికి స్వయంగా ఆ సందేహం ఉండేది కాదనీ, అతడి మనస్సులో ఆ ఆలోచనను నాటినది దానవవుల గురువైన శుక్రాచార్యుడనీ అంటారు. ఏది ఏమైనప్పటికీ, స్వర్గలోకానికి శాశ్వత నాయకుడిగా ఉండటానికి ఓ ఉపాయాన్ని ఆలోచించి, బలి చక్రవర్తికి చెప్పాడు శుక్రాచార్యుడు. ఆ ఆలోచనే సహస్ర అశ్వమేధ యాగాలు నిర్వహించడం. అశ్వమేధ యాగం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్క అశ్వమేధ యాగం చేయాలంటే, నేటి కాలంలో మన దేశంలోని కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదని చెప్పవచ్చు. అలాంటిది ఏకంగా వెయ్యి అశ్వమేధ యాగాలు నిర్వహించడం అంటే సాధారణ విషయం కాదు. అయినా ఇంద్ర పదవిని పొందటం కోసం బలి చక్రవర్తి ఆ యాగాలను మొదలు పెట్టి, దాదాపు విజయ వంతంగా పూర్తి చేయబోయాడు.
ఇదిలా ఉంటే, అదే సమయంలో మరో పక్క ఓ మహత్కార్యం జరిగింది. దేవతలు ఓడిపోయి వారికి దుర్భర గతి పట్టడంతో, కశ్యపుని భార్య, దేవతల తల్లి అయిన అదితి విష్ణుమూర్తిని ప్రార్ధించింది. నారాయణుడు కరుణించి, తాను స్వయంగా ఆమె గర్భాన జన్మించి ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పాడు. సాక్ష్యత్తు విష్ణుమూర్తే తన కడుపున జమించబోతున్నాడని తెగ సంబరపడిపోయింది ఆ తల్లి. ఆ స్వామి ఇచ్చిన మాట ప్రకారం అదితి కడుపున వామనావతారంగా జనించాడు. ఇదే, విష్ణుమూర్తి ఈ భూమిపై ఎత్తిన తొలి మానవ అవతారం.
అలా జన్మించిన స్వామి, కేవలం మూడడుగుల ఎత్తున్నప్పుడే బలి చక్రవర్తి చేస్తున్న యాగ శాల వద్దకు వెళ్లాడు. బలి చక్రవర్తి ఆ పిల్లవాడిని చూడగానే లేచి నుంచుని నమస్కరించాడు. శోభాయమానంగా వెలిగిపోతున్న ఆ బ్రాహ్మణ బాలకుడి ముఖంలోని తేజస్సును చూసి సమ్మోహితుడైన బలిచక్రవర్తి ఆ పిల్లవాడిని సమీపించి, ‘ఎవరు నీవు, ఎందుకోసం ఇక్కడికి వచ్చావ’ని ప్రశ్నించాడు. దానికి ఆ బాలుడు, ‘మహారాజా.. నేను వామనుడను. నీవు గొప్ప దానశీలివని విని నీ వద్దకు వచ్చాను. నాకు కూడా దానం కావాల’ని అన్నాడు. ముల్లోకాలలో దేనినైనా కోరుకోమన్నాడు బలి. తనకు మూడడుగుల స్థలం చాల’ని అన్నాడు, వామనుడు. ఆనందంగా తథాస్తు పలికాడు బలి చక్రవర్తి.
ఇదంతా చూస్తున్న శుక్రాచార్యుల వారు, బాలుని రూపంలో వచ్చినది రాక్షస సంహారి అయిన శ్రీహరి అని గ్రహించి, బలి చక్రవర్తిని హెచ్చరించాడు. శ్రీ మహా విష్ణువే స్వయంగా వచ్చి దానం అడిగినప్పుడు తాను ఇవ్వకుండా ఉండలేననీ, మాట ఇచ్చాక తప్పననీ చెప్పి, వామనుడి కోరిక మేరకు దానమివ్వడానికి సిద్ధమయ్యాడు. దానమివ్వడానికి నీటికై కమండలాన్ని వంచడం, అందులోంచి నీరు బయటకు రాకుండా పురుగు రూపంలో శుక్రాచార్యుడు అడ్డుపడటం, వామనుడు దర్భతో కమండల రంధ్రంలో పొడవడం, మారు రూపంలో ఉన్న శుక్రాచార్యుల వారి కంటికి గాయం అయ్యి ఆయన అడ్డు తొలగడం, బలి దానమివ్వడం వెనువెంటనే జరిగిపోయాయి.
నంతై, చంద్రుని కంతయై, ధ్రువుని పైనంతై, మహర్వాటి పై
నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై’
అన్నట్లు, మహా కాయుడైన వామనుడు, ఒక అడుగుతో సమస్త భూ మండలాన్నీ, మరో అడుగుతో సమస్త విశ్వాన్నీ కొలిచి, ‘నువ్వు మాట తప్పావు బలీ.. నాకు మూడడుగులిస్తానన్నావు. కానీ రెండు అడుగులు మాత్రమే ఇచ్చావు’ అని వామనుడడగగా.. ‘లోకనాథా.. ప్రాణంపోయినా నేను ఆడిన మాట తప్పను. మీ మూడవ అడుగు నా తలపై పెట్టండి’ అని విన్నవించాడు. అప్పుడు స్వామి బలి చక్రవర్తి తలపై పాదం మోపి, ఆయనను పాతాళానికి తొక్కేశాడన్న విషయం తెలిసిందే. వామనుడు ఇలా చేయడం వెనుక పరమార్థం, ఆయన బలి తలకెక్కిన ఆహాన్ని అణచి వేశాడు తప్ప, అతడిని పాతాళానికి తొక్కి అంతం చేసేయలేదని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.
ఆ సమయంలో బలికి, వామన మూర్తి ఎన్నో వరాలను ప్రసాదించాడు. పాతాళానికి వెళ్ళి అక్కడ తన సామ్రాజ్యాన్ని స్థాపించుకుని సుఖంగా ఉండమనీ, సావర్ణి మన్వంతరంలో స్వర్గానికి వచ్చి, ఇంద్ర పదవిని స్వీకరించమనీ అనుగ్రహించాడు. అప్పటివరకూ బలి కేరళ దేశాన్ని తన రాజధానిగా చేసుకుని పాలించేవాడు. అందువలన సంవత్సరానికి ఒకసారి భూమిపైకి వచ్చి, తన రాజ్యాన్ని చూసుకుంటానని కోరగా, అతడి కోరికను మన్నించాడు స్వామి. అందుకే ప్రతి సంవత్సరం కేరళ ప్రజలు ఓనమ్ పండగను జరుపుకుంటారు. దీని తర్వాత జరిగిన విషయాలే, ఇప్పుడు బాలీ దీవులకూ, పాతాళ లోకానికీ చెందిన అసలు చరిత్రను తెలియచేస్తాయని చరిత్రకారులంటున్నారు.
పురాణాల ప్రకారం, బలి చక్రవర్తిని పాతాళానికి పంపిన తర్వాత, ఆయన కొన్నేళ్ళ పాటు ద్వీప ప్రదేశంలో ఉన్నాడని తెలుస్తోంది. అక్కడ కూడా ఆయన తన సామ్రాజ్యాన్ని స్థాపించి, ప్రజారంజక పాలనను కొనసాగించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన తన పరివారంతో సహా నరకలోకానికి వెళ్ళినట్లు పురాణ విదితం. అలా ఆయన మధ్యలో పాలించిన ద్వీప ప్రాంతమే, ఇప్పుడు మనం చూస్తున్న బాలీ దీవులు. పూర్వం ఇండోనేషియాలో కూడా పూర్తిగా హిందూత్వమే ఉండేది. 12 - 13వ శతాబ్దం నుంచి ఇస్లాం పాలకుల వరుస దండయాత్రల కారణంగా, ఇండోనేషియా మెల్లగా ఇస్లామిక్ రాజ్యంగా మారిపోయింది. అయినప్పటికీ ఆనాటి బలి చక్రవర్తి పాలనా విధానం, ప్రధాన ఇండోనేషియా నుంచి ఈ దీవులు దూరంగా ఉండటం, అనే కారణాల వల్ల, నేటికీ బాలీ దీవులలో హిందూత్వమే కొనసాగుతోందనీ, బలి పేరు మీదనే ఆ ప్రాంతానికి బాలీ అనే పేరు స్థిరపడిందనీ నిపుణుల వాదన.
ఇక బలి చక్రవర్తి బాలీ దీవుల నుంచి వెళ్ళిన నరకలోకం, నేడు దక్షిణ అమెరికాలో ఉన్న చిలీ దేశం అని చరిత్రకారులు చెబుతున్నారు. అలాగని బలి చక్రవర్తి తొలిసారిగా అమెరికా ఖండంలో అడుగు పెట్టిన వ్యక్తి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే, బలి చక్రవర్తి తండ్రి అయిన విరోచన చక్రవర్తి అంతకంటే ముందే అక్కడికి వెళ్ళినట్లు ఆధారాలున్నాయి. ఆయన బలి కంటే ముందే అమెరికా ఖండంలో అడుగుపెట్టి, ఆ ఖండాన్ని మొత్తం తన పాలన కిందకు తెచ్చుకున్నాడని చరిత్ర చెబుతోంది. దక్షిణ అమెరికాలోని బొలీవియా దేశంలో నేటికీ తివానాకు (Tiwanaku) అనే అతి పురాతన నగరం ఒకటి ఉంది. దాదాపు నాశనం అయ్యి, పురావస్తు శాఖ చేతుల్లో ఉన్న ఆ ప్రాచీన నగరాన్ని స్థాపించినది బలి చక్రవర్తి తండ్రి విరోచనుడే అని చరిత్రకారులు గుర్తించారు. ఆయన అక్కడ కేవలం మహా సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజు మాత్రమే కాకుండా, అక్కడి ప్రజలు పూజించే, సమస్త శక్తులూ కలిగిన దైవం. Viracocha అనే పేరుతో ఆయనను వారు ప్రధాన దైవంగా పూజించేవారు. విరోచనుడు స్థాపించన తివానాకు (Tiwanaku) నగరం ద్వారా, కొన్ని యుగాల పూర్వం అదే పేరుమీద ఒక నాగరికత పరిఢవిల్లిందని చరిత్రకారులు చెబుతున్నారు. అంతేకాకుండా, దక్షిణ అమెరికా ఖండంలోని అత్యంత పురాతన నగారికతలలో ఒకటైన Inca నాగరిక ప్రజలు, విరోచన చక్రవర్తిని Viracocha దేవుడి పేరుతో పూజించే వారనీ, Inca నాగరికత అంతమైన తర్వాత కూడా, అక్కడున్న ఆదిమ జాతి ప్రజలు ఆయనను పూజించడం కొనసాగించారనీ చరిత్ర చెబుతోంది.
అలా తన తండ్రి ఏలిన ప్రాంతానికి వెళ్ళిన బలి చక్రవర్తి, దాదాపు కలియుగారంభం వరకూ, దక్షిణ అమెరికా ఖండాన్ని ఈ ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో పాలించాడు. కలియుగం ఆరంభంకాగానే ఆయన భూమిపై ఉన్న మరో డైమన్షన్ లోకి వెలిపోయాడనీ, ఈ యుగాంతం తరువాత మొదలయ్యే సావర్ణి మన్వంతరం మొదలవ్వగానే బయటకు వచ్చి, నేరుగా స్వర్గానికి వెళ్ళి ఇంద్ర పదవిని అధిరోహిస్తాడనీ చరిత్రకారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, బలి చక్రవర్తితో పాటు కొంతమంది నేటికీ దక్షిణ అమరికాలో ఉన్న అమెజాన్ అడవులలో అత్యంత రహస్యంగా జీవిస్తున్నారనీ, కలి ప్రభావంతో అస్తవ్యస్తంగా ఉన్న ఈ లోకంలోకి రావడానికి వారు ఇష్టపడటం లేదనీ మరి కొంతమంది చరిత్రకారులంటున్నారు. వారి వాదనకు ఆధారంగా, నేటికీ పూర్తిగా explore చేయలేని Amazon అడవుల లెక్కలు చూపిస్తున్నారు. కొంతమంది నిపుణులు చెబుతున్న లెక్కల ప్రకారం, ఇంత advanced ప్రపంచంలో కూడా, అమెజాన్ అడవిని పూర్తిగా explore చేసింది కేవలం 30 శాతం మాత్రమే అనీ, నేటికీ మనుష్యులు అడుగుపెట్టడానికి వీలుకాని 70 శాతం అడవి రహస్యంగానే మిగిలి ఉందనీ అంటున్నారు. అక్కడ ఎటువంటి జీవులున్నాయి? ఎలాంటి ఆదిమ జాతి ప్రజలున్నారు? ఏ విధమైన వృక్ష జాతులు పెరుగుతున్నాయి? వంటి విషయాలు నేటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయని శాస్త్రవేత్తలంటున్నారు. ఇవన్నీ తెలుసుకున్న తరువాత మీకు ఏమనిపించిందో కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన అపురూప ఏకశిలా విగ్రహాలున్న ఆలయం ఎక్కడుంది?
‘తర్జనం యమ దూతానాం రామ నామేతి గర్జనం’, అనుక్షణం రామ నామ జపం చేస్తున్న వారి దరిజేరటానికి యమదూతలు సైతం భయపడతారు. అటువంటి రామ నామాన్ని సనాతన ధర్మంలో ప్రతినిత్యం ప్రార్ధించని నోరుండదు, తలవని మనస్సుండదు. యుగాలు గడచినా, తరాలు మారినా, ఆ త్రేతాయుగ రాముడు పాలించినదే ఉత్తమ రాజ్యం, ఆయన జీవితమే మానవాళికి అత్యుత్తమ మార్గదర్శకం. ఓ యుగ పురుషుడిగా, ఒక ఆదర్శ పురుషుడిగా, నేటికీ భక్త కోటి మదిలో గుడుకట్టుకున్న దైవంగా నిలిచిపోయాడు ఆ రామచంద్ర ప్రభువు. రాఘవుడి జన్మ భూమి అయిన ఈ భరత భూమిలో, రామాలయం లేని ఊరుండదు, రామాయణం వినని మనిషి ఉండడనటంలో అతిశయోక్తి లేదు. ఈ కారణంగానే భారత దేశంలో సీతా, లక్ష్మణ, హనుమ సమేతంగా ఉన్న రాముడి ఆలయలు వాడవాడలా కనువిందుజేస్తూ మైమరపింపజేస్తుంటాయి. ఎక్కడ రామ నామ సంకీర్తనం జరుగుతుంటుందో, అక్కడ హనుమ తప్పనిసరిగా ఉంటాడన్నది ఆర్యోక్తి. మరి అటువంటిది, హనుమంతుడు లేని రాముడిని కనీసం ఊహించుకోగలమా! మన తెలుగు రాష్ట్రంలోనే, భద్రాచల క్షేత్రం కంటే పురాతనమైన ఓ రామయాలంలో, రాముడికి తోడుగా సీతా, లక్ష్మణ విగ్రహాలే ఉంటాయి. అక్కడి గర్భగుడిలో హనుమంతుడి విగ్రహం మాత్రం ఉండదు. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాలలో శ్రీ రామ నవమి నాడు వైభవోపేతంగా సీతారామ కళ్యాణం జరిపించడం, అనాదిగా వస్తున్న ఒక సంప్రదాయం. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయంలో మాత్రం, శ్రీ రామ నవమినాడు స్వామి వారి కళ్యాణం జరిపించరు! అసలు ఆంజనేయుడు లేని రామాలయం ఏమిటి? శ్రీ రామ నవమికి సీతా రాముల కళ్యాణం జరిపించకపోవడం ఏమిటి? వీటన్నింటికీ అసలు కారణాలేమిటి? ఎక్కడుంది ఈ ఆలయం? ఆలయ చరిత్ర ఏమిటి - వంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
మన దేశంలో ఊరూరా, వాడవాడలా ఎన్నో రామాలయాలున్నా, వాటన్నిటిలో శ్రీ రాముడు ఖచ్చితంగా సీతా లక్ష్మణ హనుమ సమేతంగా కొలువై ఉంటాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయంలో మాత్రం హనుమంతుడు లేకపోవడం, నిజంగా అందరనీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విభిన్న ఆలయం మన ఆంధ్ర ప్రదేశ్ లోని కడప జిల్లాలో గల ఒంటిమిట్టలో ఉంది. ఆంధ్రా అయోధ్యగా, మన తెలుగు రాష్ట్రాలలో అత్యంత పురాతనమైన ఆలయంగా ఒంటిమిట్ట రామయాలనికి పేరుంది. ఈ క్షేత్రంలో ఉన్న మూలవిరాట్ విగ్రహం ఏక శీలపై చెక్కబడింది. ఒకే శిలలో సీతారామలక్ష్మణులు ఉండటంతో పాటు, రాముడు ఇక్కడ యోగ ముద్రలో ఉండటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆలయ మూల విరాట్ దగ్గర హనుమంతుడి విగ్రహం లేకపోవడం ఏమిటో తెలియాలంటే, ముందుగా స్థల పురాణం తెలుసుకోవాలి.
ఒంటిమిట్ట రామాలయ నిర్మాణానికి సంబంధించి ఎన్నో గాధలు జనబాహుళ్యంలో ప్రచారంలో వున్నా, రెండు మాత్రం స్థల పురణానికి దగ్గరగా ఉంటాయని ఆధ్యాత్మిక వేత్తలంటున్నారు. ఒకప్పుడు ఒంటిమిట్ట ప్రాంతమంతా కీకారణ్యంలా ఉండేది. రామచంద్రుడి పద్నాలుగేళ్ల వనవాస సమయంలో, సీతా లక్ష్మణ సమేతుడై ఈ అరణ్యంలో కొంతకాలం గడిపినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. త్రేతాయుగంలో శృంగి, మృకండు మహర్షుల ఆశ్రమం ఇక్కడుండేది. వాళ్లు చేస్తున్న యజ్ఞయాగాదులకు రాక్షసులవలన విఘాతం ఏర్పడుతుండడంతో, మహర్షులు శ్రీ రాముడిని శరణు వేడారు. శిష్ట రక్షకుడైన స్వామి ఆ రాక్షసులను కడతేర్చి, యాగరక్షణ గావించాడు. త్రేతాయుగంలోని ఆ ఘట్టానికి గుర్తుగా మహర్షులు ఒక ఏకశిలపై సీతా రామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత రాముడి భక్తుడైన జాంబవంతుడు ఆ ఏకశిలా విగ్రహాలకు ఆలయం నిర్మించి వాటిని ప్రతిష్ఠించాడన్నది పురాణ విదితం. రాముడు శృంగి, మృకండు మహర్షులను కలిసే సమయానికి, హనుమంతుడు స్వామి వారికి పరిచయం కాకపోవడం వలననే, మహర్షులు కేవలం సీతారామలక్ష్మణుల విగ్రహాలను మాత్రమే చెక్కించారని ఆధ్యాత్మిక వేత్తలు అంటున్నారు.
ఈ ప్రాంతంలో బోయవారైన ఒంటడు, మిట్టడనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. నాడు ఆ అటవీ ప్రాంతం మొత్తం వారి సంరక్షణలోనే ఉండేది. ఓసారి ఆ ప్రాంతాలన్నీటిపై సర్వాధికారాలున్న కంప రాజనే ఉదయగిరి రాజు అక్కడకు రావడంతో, అన్నదమ్ములు తమ గూడెం ప్రజలతో కలసి రాజును స్వాగతించి, అతిథి సత్కారాలు చేసి, చుట్టుప్రక్కల ప్రాంతాలను చూపించి విశేషాలను తెలియజేశారు. కంపరాజు సంతోషించి ఏదయినా కోరుకోమన్నాడు. అప్పుడు వారు తమకు అడవిలో లభించిన ఏక శిలా సీతారామలక్ష్మణుల విగ్రహాలను గురించి తెలియజేసి, అక్కడ ఒక ఆలయం నిర్మింపజేయమని కోరారు. రాజు ఆనందించి, ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చి, ఆ బాధ్యతను వాళ్లకే అప్పగించి వెళ్లిపోయాడు. విగ్రహాలు లభించిననాటి నుండీ పరమ రామ భక్తులుగా మారిపోయిన ఒంటడు, మిట్టడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ ఆలయాన్ని నిర్మించారనీ, అందువల్లనే ఆ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు స్థిరపడిందనీ కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు.
ఒంటిమిట్ట రామాలయ ప్రాంగణంలో రామ తీర్ధం అనే కొలను ఉంది. సీత రాములు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో కొన్నాళ్ళున్నారు. ఆ సమయంలో వారి అవసరాల కోసమని స్వామి వారు తన బాణంతో ఈ కొలనును ఏర్పాటు చేశాడనీ, అందుకే ఈ కొలనుకు రామ తీర్ధం అనే పేరు స్థిరపడిందనీ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక్కడ మరో విశేషమేమిటంటే, 18 మహా పురాణాలలో ఒకటైన వ్యాస విరచిత శ్రీమద్ భాగవతాన్ని తెనుగీకరించిన సహాజకవి పోతన, దానిని ఇక్కడి రామయ్యకే అంకితమిచ్చాడని చెబుతారు.
ఇక ఆలయ పునరుద్ధరణ విషయానికి వస్తే, కాలానుగుణంగా చోళులు, అగ్నికుల క్షత్రియులు, విజయనగర రాజులు, ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. మూల విరాట్టు దగ్గర హనుమంతుల వారి విగ్రహం లేకపోవడం వల్ల, ఈ ఆలయ ప్రాంగణంలో ఒక ఆంజనేయుల వారి మందిరాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కాలగమనంలో ఒంటిమిట్ట రామాలయం కొంత దెబ్బతినగా, వావిలికొలను సుబ్బారావు అనే మహా రామభక్తుడు ఈ రామాలయాన్ని పునరుద్ధరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. భద్రాద్రి రామయ్యపై ఉన్న భక్తితో గుడి కట్టించి ఆభరణాలు చేయించడానికిగానూ, భక్త రామదాసు సర్కారు వారి ధనం వాడి జైలు పాలైన విషయం తెలిసిందే. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్న రామభక్తుడు సుబ్బారావు మాత్రం, ఆలయ నిర్మాణానికి గానూ, స్వామికి విలువైన ఆభరణాలను సమకూర్చేందుకు గానూ వాడిన ధనం, ఆయన కొబ్బరి చిప్పను పట్టుకుని ఊరూరా తిరిగి భిక్షాటన చేస్తూ, ఆ కాలంలోనే సుమారు పది లక్షల రూపాయలు సేకరించారు. ఆ విధంగా వచ్చిన డబ్బుతో నాడు ఒంటిమిట్ట రామయ్యకు కావలసినవన్నీ సమకూర్చినట్లు ఆలయ రికార్డులు పేర్కొంటున్నాయి. వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించినందుకుగానూ, ఈయనను 'ఆంధ్ర వాల్మీకి' గా భక్త కోటి పిలుచుకుంటారు.
ఆలయ నిర్మాణం జరిగిననాటి నుంచీ, శ్రీ రామ నవమి నాడు సీతారాముల కళ్యాణం జరపకుండా, చతుర్దశినాడు కల్యాణం, పౌర్ణమిరోజున రథోత్సవం నిర్వహించడం ఆచారంగా కొనసాగుతోంది. నవమినాడు పోతన జయంతి పేరుతో కవిపండితులను సత్కరించడాన్ని ఓ సంప్రదాయంగా నేటికీ పాటిస్తున్నారు. శ్రీ రామ నవమి సందర్భంగా ఒంటిమిట్టలో తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఒక విశేషంగా చెప్పవచ్చు.