Posts

ఆశ - Desire

Image
ఆశ - Desire   TELUGU VOICE శ్లోకం : ఆశాయాః యే దాసాః తే దాసాః సర్వలోకస్య । ఆశా యేషాం దాసీ తేషాం దాసాయతే లోకః ॥ యే ఆశాయాః దాసాః తే సర్వలోకస్య దాసాః (భవన్తి)। యేషాం ఆశా దాసీ, లోకః తేషాం దాసాయతే ॥ భావం: ఆశకి ఎవరైతే దాసులో, వారు సమస్త లోకానికీ దాసులు. ఆశ ఎవరికైతే దాసురాలో, అటువంటి వారికి సమస్త లోకమూ దాసత్వం చేస్తుంది. Those who are the slaves of ‘desire’ are slaves of the entire world. But world itself is the slave of those, to whom ‘desire’ is a slave. ఆశ మనిషికి సహజం. అదే ఆశ మితిమీరితే, అత్యాశ లేక దురాశ అవుతుంది. స్థూలంగా దీనినే ఆశ అంటూ ఉంటారు.  ఈ ఆశే, మనిషిని తన బానిసను చేసుకుంటుంది. ధన వ్యామోహము ఒక ఆశ. విపరీతమైన ధన వ్యామోహము, లేదా దానిమీద విపరీతమైన కోరిక లేక మమకారం, అనేకమైన విపరీతాలకు దారి తీస్తుంది. విపరీత ధనకాంక్షతో మనిషి ఉచ్ఛనీచాలు కూడా మరచిపోయి, ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడతాడు. మద్యపానమూ, జూదమూ, వ్యభిచారమూ, చౌర్యమూ, మాదక ద్రవ్య సేవనమూ, హత్యలూ, మాన భంగాలూ, ఇవన్నీ తీవ్రమైన కోరికల పర్యవసానములు. అవే వ్యసనాలుగా పరిణమిస్తాయి. ఇటువంటి కోరికలకు ఎవరైతే దాసులో, వారు ప్రపంచానికే దాసులు. ...

షడగోప్యము (శఠగోపనం) - Shada-Gopyam

Image
  షడగోప్యము (శఠగోపనం)  TELUGU VOICE అసలు దేవాలయంలో ఈ షడగోప్యమును తల మీద ఎందుకు పెట్టించుకోవాలి? దాని వలన కలిగే ఫలితం ఏంటి? దేవాలయంలో దర్శనం అయ్యాక తప్పక షడగోప్యము పెట్టించుకుని, తీర్థము తీసుకోవాలి. ఈ రొజుల్లో చాలామంది ఆలయాలకు వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక, వచ్చిన పనైపొయిందని గబగబా వెళ్ళి ఏదో ఒక ప్రదేశం చూసుకుని కూర్చుంటారు. బహుకొద్ధి మంది మాత్రమే ఆగి షడగోప్యం పెట్టించుకుంటారు. అసలు షడగోప్యము అంటే అత్యంత గోప్యము, గోప్యము అంటే, రహస్యము అని అర్థం.. అంటే, దానిని తల మీద పెట్టే పూజారికీ, లేదా అర్చకుడికి కూడా వినిపించని విధంగా కోరికను మనస్సులోనే తలచుకోవాలి. అంటే, మీ కోరికే షడగోప్యము. మానవునికి శత్రువులైన కామమూ,  క్రోధమూ,  లోభమూ, మోహమూ, మద - మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటానని అనుకుంటూ, తలవంచి తీసుకొవటము మరో అర్ధము. పూజారి చేత షడగోప్యము పెట్టించుకోండి. చక్కగా మీ మనస్సులోని కోరికను స్మరించుకోండి. షడగోప్యమును రాగి, కంచు, లేదా వెండితో తయారు చేస్తారు. షడగోప్యము పైన దేవతా పాదములు ఉంటాయి. షడగోప్యమును తల మీద ఉంచినపుడు, మన శరీరంలో ఉన్న విద్యుత్తు, దాని యొక్క సహజత్వం ...

The purpose of human life | మనిషి జన్మ?

Image
మానవ జన్మ?  TELUGU VOICE కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం.. మధ్యన ఉన్న రెప్పపాటు కాలమే ఈ జీవితం! పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం । ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే ।। మరల మరల జన్మిస్తూ, మరల మరల మరణిస్తూ, తిరిగి తల్లి గర్భంలో శయనిస్తూ, ఈ సంసారజంఝాటం దాటలేక, నానా బాధలకూ గురౌతున్న నన్ను ఓ మురారీ! కృపతో తరింపజేయి తండ్రీ.. ఒక జీవితం ముగిసిన తరువాత, మళ్ళీ పుట్టడమే ‘జన్మ’. అలా పుట్టే జీవికి మళ్ళీ మానవ జన్మే లభిస్తుందనేది మాత్రం, ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేని విషయం. ఎందుకంటే, మళ్ళీ మనం పొందే జన్మ, గడిచిన జన్మలో మనం సంపాదించుకున్న జ్ఞానం, కర్మల మీద ఆధారపడి వుంటుంది. అన్ని జన్మలలోనూ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది, అత్యంత దుర్లభమైనది. మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తూవుంటాడు. చేసిన కర్మలకు ఫలితాలను తప్పనిసరిగా అనుభవించి తీరాలి. వాటినే కర్మ ఫలాలంటారు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు, జీవుడితో పాటుగా ప్రయాణిస్తూ ఉంటాయి. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/dNWbKKQMSjo ] అన్ని పుణ్య కర్మల ఫలాలూ పక్వానికి వచ్చినపుడు, ఆ జీవుడు దేవలోకాలలో, దేవతా జన్మనెత్తు...

Humbling of Thondaman's pride | తొండమాన్ గర్వభంగం!

Image
తొండమాన్ గర్వభంగం! భవిష్యోత్తర పురాణంలోని గాధ!  TELUGU VOICE అహంకారం గర్వం ఎంత కొంచమైనా నిలువునా దహించివేస్తుంది! కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేఙ్కటేశ్వరునికి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి పద్మావతీ దేవిని, కన్యాదానమిచ్చిన మహానుభావుడు, తొండమండలాధీశుడైన ఆకాశరాజు. ఆ ఆకాశరాజు సోదరుడే, తొండమానుడు. అతడు అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై, తిరుమల భవ్య మందిరమైన ‘ఆనందనిలయ’ నిర్మాణము చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వేఙ్కటపతిని సేవించుకునేది, తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే, నిత్యం స్వామితో నేరుగా సంభషణ చేసేవాడు! మరి అంతటి వాడికి గర్వభంగమా!? అసలేం జరిగిందో, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను comment చేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/hAPcbmTx3F4 ] అలా తొండమానుడు స్వామి వారితో అత్యంత సన్నిహితంగా మెలగుతూ, సేవలు చేసుకుంటుండగా, ఒకరోజు ఆకాశవాణి, “ఆహా! ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా! శ్రీనివాసుని ప్రతి కైంకర్యుమూ నీ చేతుల మీదుగా, శ్రద్ధా భక్తులతో, అంగ రంగ వైభవంగా చేయిస్త...

The Journey to Hell - Story of Kathopanishad (Nachiketa) | కఠోపనిషత్ కథ - నచికేతుడి పితృభక్తి!

Image
కఠోపనిషత్ కథ - నచికేతుడి పితృభక్తి!  TELUGU VOICE యమధర్మ రాజు నుండి అతి రహస్యమైన విద్యను ఎలా పొందాడు? పూర్వం వాజస్రవసుడనే సత్పురుషుడుండేవాడు. గౌతమవంశసంజాతుడైన అతడు, గౌతముడు, ఔద్దాలకుడు, ఆరుణి అనే పేర్లతోకూడా ప్రసిద్ధుడు. అతడొకసారి విశ్వజిత్ యజ్ఞం చేశాడు. ఆ బృహత్ యజ్ఞం చేసినవారు, యాగం చివరలో, తమ సర్వస్వాన్నీ దానం చేసేయాలి! వాజస్రవసుడు కూడా అలాగే తనకున్నదంతా దానం చేయసాగాడు. అనాదినుంచీ భారతీయులకు పశువృక్షాదులే ముఖ్యమైన సంపదలు. అందులోనూ, గో సంపద అతి ముఖ్యమైనది. మరకత మాణిక్యాలూ, హిరణ్య రజితాలకంటే గొప్పది గో సంపద. కాబట్టి, వాజస్రవసుడు ఋత్వికులకు గోదానాలు చేయసాగాడు. వాజస్రవసుడికి, మహాబుద్ధిశాలి, గుణసంపన్నుడు, పితృభక్తి పరాయణుడైన పుత్రుడున్నాడు. అతడి పేరు నచికేతుడు. చిన్న వయస్సులోనే సకల ధర్మ శాస్త్రాలనూ అభ్యసించాడు. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/D9Uk9VwwZTs ] ఆ సమయంలో నచికేతుడి దృష్టి, తన తండ్రి దానమిస్తున్న గోవుల మీద పడింది. ఆ గోవులు చాలావరకూ ముసలివి, పళ్ళు లేనివి, పాలివ్వడానికీ, ప్రసవించడానికీ శక్తిలేనివని గమనించిన నచికేతుడు, ఇలా అనుకున్నాడు.. “ఎవరైతే నిస్సారమైన గోవుల...

హిందూత్వం - 2 | Hinduism - History

Image
హిందూత్వం - 2 (Hinduism - History)  TELUGU VOICE ఆంగ్లేయులూ, వామ‌ప‌క్షీయులూ క‌లిసి, మ‌న దేశ‌పు చ‌రిత్రను క‌ల‌గాపుల‌గం చేసి, ఏలా విప్పాలో తెలియ‌ని విధంగా పీట‌ ముడులు వేసి మ‌న‌పై వ‌దిలారు. ప్రాచీన కాలంలో మ‌న భార‌తీయ మేధావులు త‌మ గ్రంథాల‌లో, కాల నిర్ణయానికి శాలివాహ‌న శ‌కాన్ని ఒక ప్రమాణంగా తీసుకున్నారు. ఈ శ‌కం సా. శ‌. 79 మార్చి 22 న, చైత్ర మాసారంభ‌మున ప్రారంభించారు. ఈ చైత్ర మాస‌పు తొలి దిన‌మే, దైవ అహోరాత్ర యుగ‌మున‌కు ఆది క‌నుక, యుగాది అనే పేరును ఆపాదించి, దానికి చాలా విశిష్టత‌ను చేకూర్చారు. కానీ ఈ కాలంలో యువ‌త, జ‌న‌వ‌రి 1 న చూపే ఉత్సాహంలో స‌గం కూడా ఉగాది నాడు క‌నిపించ‌దు. ఇప్పుడు ఎటు చూసినా ప‌రాధీనంలో ఉన్న దౌర్భాగ్యమే క‌నిపిస్తుంది. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/PUzEWDiAhOw ] గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణితో ప్రారంభించ‌బ‌డిన నాటినుండి, 1879 సంవ‌త్సర‌ములు గ‌డిచిన త‌రువాత, 1957 మార్చి 22 నుండి భార‌త ప్రభుత్వం, ఈ శాలివాహన శ‌కాన్ని అధికారికంగా కాల‌మానంగా స్వీక‌రించింది. అంటే, ఇప్పుడున్న గ్రిగేరియ‌న్ క్యాలెండ‌ర్ లోని సంవ‌త్సర‌ము నుండి, 79 తీసివేస్తే, శ‌క సంవ‌త్సరం వ‌స్తుంది. ఒక...

హిందూత్వం - 1 - Science and Hinduism

Image
హిందూత్వం - 1  TELUGU VOICE మ‌నం కాలాన్ని ఏ విధంగా కొలుస్తాము?.. భూమి మీద ఒక ప్రామాణిక దూర‌ములోగల బిందువుల‌ను తీసుకుని, ఆ రెండు బిందువుల‌నూ, నిర్దేశిత వేగంతో చేరే స‌మ‌యాన్నీ, కాలాన్నీ, ఒక ప్రమాణంగా తీసుకోవ‌డం జ‌రుగుతుంది. అంతేక‌దా.. మ‌రి మీరు దూరాన్ని ఏ విధంగా కొలుస్తారు? అని అడిగితే దానికి  స‌మాధానం, ఇంత‌కు ముందు చెప్పిన విధానాన్నే చెప్పవ‌ల‌సి వ‌స్తుంది. ఏ విధంగా అంటే, ఒక రెండు బిందువుల‌ను తీసుకుంటే, మీరు ఒకే స‌మ‌యంలో, రెండు బిందువుల వ‌ద్దా ఉండ‌లేరు గ‌నుక, మొద‌టి బిందువు నుండి ఒక ప్రామాణిక వేగంతో, ప్రామాణిక కాలంలో, రెండ‌వ బిందువు చేర‌గ‌లిగితే, దానిని దూర‌ము అంటాం.. ఇలా ఈ రెండూ ఒక దానితో ఒక‌టి ముడిప‌డి, ఈ కాల‌ము, విశ్వముతో ఉన్న సంబంధాన్ని మ‌నకు తెల‌య‌జేస్తుంది. ఈ విష‌యాన్ని ఐన్స్టీన్ మ‌హ‌శ‌యుడు సాపేక్షతా సిద్ధాంత రూపంలో తెలియ‌ప‌రిచారు. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/HAU_0e-RybQ ] నిన్న మొన్నటి వ‌ర‌కూ వీదేశీయుల కాల‌గ‌మ‌నం ప్రకారం, సెక‌ను, నిమిష‌ము, గంట‌, దిన‌ము, వార‌ము, మాస‌ము, ఋతువు, సంవ‌త్సరం మాత్రమే ఉండేవి. సంవ‌త్సర‌ములు, అంటే, కేవ‌లం అంకెలు మాత్రమే .. ర‌శ...