Posts

Showing posts from November, 2025

The Lost Hindu Empire in China: The Untold Story of Khotan ఖోటాన్ సామ్రాజ్యం!

Image
  ఖోటాన్ సామ్రాజ్యం! చైనాలో బయటపడిన అతిపెద్ద హైందవ సామ్రాజ్యం! నాటి అఖండ భారతావనిలో చైనా కూడా భాగమా? తాము ఎదగడానికి పక్క వాడిని తొక్కేయడం, వాడిపై దౌర్జన్యం చేసి వాడికి సంబంధించినవన్నీ బలవంతంగా లాక్కుని తాము గొప్పవారిగా చలామణీ అవ్వాలనేది యురోపియన్ దేశాలు పాటించే ప్రధమ సూత్రం. ఈ సూత్రాన్ని అందిపుచ్చుకునే అమెరికా ప్రపంచ పెద్దన్నగా నిలిచింది. చాలాకాలంగా అదే సూత్రాన్ని పాటిస్తూ చైనా ఆ స్థానంలో కూర్చోవాలని చూస్తోంది. ఈ నేపధ్యంలో చైనా ప్రయత్నాలకు అడ్డుగా నిలుస్తోందని భావించి మన భారత దేశాన్ని దెబ్బ కొట్టడానికి వేసిన ఓ ఎత్తుగడ, మన దేశ భూభాగంలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ ని తమకు చెందినదిగా చైనా ప్రచారం చేయడం. అంతటితో ఆగకుండా కొద్ది రోజుల క్రితం ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు చైనాకు సంబంధించిన పేర్లు కూడా పెట్టడం జరిగింది. ఈ క్రమంలో మన దేశ చరిత్రకారులతో పాటు, అంతర్జాతీయ చరిత్రకారులూ చైనా అసలు చరిత్రను గురించి కూపీ లాగడం మొదలు పెట్టారు. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకూ ఎవరూ బయటపెట్టని చరిత్ర, చైనా వెన్నులో వణుకు పుట్టించే చరిత్ర, అలనాటి మన అఖండ భారతావని వాస్తవ చరిత్ర, చైనాకు సంస్కృతి అంటే ...

The Real Tipu Sultan | Debunking Myths & Revealing Hidden History | టిప్పు సుల్తాన్!

Image
టిప్పు సుల్తాన్! ఈ మైసూర్ మహారాజు మహానియుడా, లేక నీచుడా? ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.. ఒకొక్కడు మహాహంతకుడు.. అని మహాప్రస్థానంలో మహాకవి శ్రీశ్రీ అన్న మాటలు గుర్తు చేసుకోక తప్పదు.. అయినా, హిందూ ఆలయాల పునరుద్ధరణ చేసిన మహామనీషి, శృంగేరీ పీఠానికి ఆర్ధిక తోడ్పాటు అందించిన సహృదయుడు, హిందువులను తన కొలువులో పోషించిన గొప్ప లౌకికవాది, బ్రిటిషర్లతో వీరోచితంగా పోరాడిన భారతీయ యోధుడు, మైసూర్ మహా రాజు టిప్పు సుల్తాన్ అని వామపక్ష చరిత్రకారులూ, సెక్యులర్ నేతలూ ముక్త కంఠంతో అబద్ధాలను చాటుతుంటారు. కొందరు వాస్తవ చరిత్రకారులు మాత్రం, దాదాపు ఎనిమిది వేల ఆలయాలను కూల్చివేసి, లక్షలాది హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చి, శాస్త్రం తెలిసిన వేలాది మంది పండితుల ప్రాణాలను దుర్మార్గంగా హరించిన కర్కోటకుడు టిప్పు సుల్తాన్ అని చెబుతారు. మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ వర్ధంతీ, జయంతి రోజులను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా జరిగే చర్చ ఇది. ఇవన్నీ వింటూ ఉంటే మనలో చాలా మందికి అతను అసలు నిఖార్సైన నాయకుడేనా? లేక కరుడుగట్టిన రాక్షసుడా? అసలైన టిప్పు సుల్తాన్ వాస్తవ...

Science vs Faith: Can the Miracles of Sabarimala Be Explained? శబరిమల అయ్యప్ప స్వామి గురించి నమ్మలేని నిజాలు!

Image
  శబరిమల అయ్యప్ప స్వామి గురించి నమ్మలేని నిజాలు! ‘స్వామియే శరణమయప్ప’ అంటూ మండలం రోజులపాటు నిష్టగా స్వామి మాల ధరించి, హరిహరసుతుడికై ఆర్తిగా భజనలు చేస్తారు అయ్యప్ప భక్తులు. ఆ మణికంఠుడిపై ఉన్న అపారమైన భక్తికి నిదర్శనంగా, ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఎంతో నిష్టతో కూడుకున్న అయ్యప్ప మాలను ధరించి, మండలం రోజుల పాటు తూచా తప్పకుండా నియమ నిబంధనలు పాటించడం, మండలం పూర్తయ్యాక శబరిమలకు వెళ్లి దీక్ష విరమించడం వంటివి చూస్తూ ఉంటాము. మరీ ముఖ్యంగా కార్తిక మాసం వచ్చిందంటే ఎక్కడ చూసినా అయ్యప్ప మాల ధరించిన స్వాములు మన చుట్టూ ఎంతో మంది మనకు కనిపిస్తుంటారు. స్వాములు చేసే భజనలలోనూ, ప్రవచించే గాధలను వింటుంటే, అసలు అయ్యప్ప స్వామి ఎవరు? ఆయన ఎప్పుడు? ఎలా జన్మించారు? ఎక్కడ వెలిశారు - వంటి సందేహాలు కొంతమందికి కలుగుతుంటాయి. ఇప్పుడున్న ఆలయం ఎవరు? ఎప్పుడు కట్టారు? ఆ క్షేత్ర విశేషాలేమిటి? అసలు అయ్యప్ప స్వాములు శనికి ప్రీతిపాత్రమైన నలుపు రంగు వస్త్రాలు ధరించడానికి కారణం ఏమిటి వంటి విషయాలు మనలో చాలా మందికి తెలియదు. ఈ ఆలయంలోని మూలవిరాట్టుకు సంబంధించి మనం గతంలో చేసిన వీడియో లింక్ ను చూడని వారి కోసం పొందు పరుస్తున్నాను. ఇ...

KALKI AVATAR: The Final Chapter of Kaliyuga | Hindu Prophecy Revealed | కల్కి జన్మరహస్యం

Image
  ‘కల్కి జన్మరహస్యం’ ప్రతి కలియుగంలోనూ ‘కల్కి భగవానుడు’ అవతరిస్తాడా? సంస్కృతంలో ‘కల్కి’ అంటే దోషాలను హరించేదని అర్థం. దోషాల నుంచి విముక్తి కలిగించే అవతారం కాబట్టే ఆయనకు కల్కి అని నామకరణం జరిగిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. కల్కి అవతారాన్ని పూజించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుందని శాస్త్ర విదితం..  ధర్మపరులనూ, భగవద్బంధువులనూ హింసిస్తూ, ఈ భూమిపై అధర్మం పెచ్చుమీరిన వేళ తాను స్వయంగా అవతరించి అధర్మాన్ని నాశనంగావించి, ధర్మ సంస్థాపన చేస్తానని భగవత్ గీతలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేశాడు. ఈ క్రమంలో మన పురాణాలలో ప్రస్థావించబడిన దశావతారాల గురించీ, వాటిలో మొదటి మూడు యుగాలలో ఆ నారాయణుడు పూనుకున్న తొమ్మిది అవతారాల గురించీ మనం గతంలో చేసిన ‘దశావతారాల’ వీడియోలో చెప్పుకున్నాము. ఇక ప్రస్తుతం నడుస్తున్న కలియుగంలో పాపం పెచ్చుమీరి పోయినప్పుడు, చెడును నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం ఆయన పదవ అవతారమైన కల్కి భగవానుడిగా అవతరించి, కలి ప్రభావం చేత భారంగా తయారైన భూమిని ఉద్ధరిస్తాడన్న విషయం కూడా తెలిసిందే. అలా ఆయన కలియుగాన్ని ముగించి, భూమిపై సత్యయుగాన్ని తిరిగి స్థాపిస్తాడని వివ...